మూ॥ రాధికోవాచ :
జ్ఞానాత్మకశ్చపరమో బ్రహ్మేశశేషపూజితః ।
జ్ఞానంచ నదదౌతుభ్యం మన్మూలం ప్రేక్షితాసతి ॥
తేనైవఛద్మనానేతుం భావార్థం బోధయామికిం ।
వేదాః సంతశ్చభావార్థంనైవ జానంతి తస్యచ ॥
స్త్రీజాతిరబలామూఢ వస్తుతో జ్ఞానతత్పరా ।
తతస్తద్విర హేథైవ సంతతంహతచేతనా ॥
కింవాహంకథయిష్యామి జ్ఞానం పంచవిధేషు చ ।
భక్త్యాత్మకం సర్వపరంనిబోధ కథయామితే ॥
శ్రీకృష్ణస్య వరేణా పిత్వం సాధోనిర్భయోభవ ।
గోలోకేచాపి పతనం సంభవేచ్చకుయోగినః I
తస్మాత్సర్వం పరిత్యజ్య భజస్వ పరమేశ్వరం !
పుత్రబుద్ధిం పరిత్యజ్య బ్రహ్మరూపంనిశామయ ॥
సర్వం యశోదే భవతీ పరిత్యజ్యచ నశ్వరం ।
గత్వా బృందావనం రమ్యం పుణ్య క్షేత్రంచ భారతం ॥
కృత్వాత్రికాల స్నానంచ నిర్మలే యమునాజలే ।
కృత్వాష్టదల పద్మంచ స్నిగ్ధన చందనేవచ ॥
ధ్యానేన గర్గదత్తైన శుద్ధీన మనసాసతి ।
సంపూజ్య పరమానందం సానందం వ్రజ తత్పదం ॥
కృత్వా నికృంతనం కర్మ పితృభిః శతకైః సహ ।
వైష్ణవేన సహాలాపం కురుష్వ సతతం సతి ॥
వరం హుతవహ జ్వాలాం భక్త వాంఛతి పంజరం ।
వరంచకంటకే వాసం వరంచ విషభక్షణం ॥
హరిభక్తి విహీనానాం న సంగం నాశకారణం।
స్వయం నష్ణో భక్తిహీనో బుద్ధి భేదం కరోతిచ ॥
అంకురో భక్తి వృక్షస్య భక్తసంగేన, వర్ధతే ।
పరంహరి కథాలాపపీయూషాచనేనచ ॥
అభక్తాలాపదీపాగ్ని జ్వాలాయాః కలయా పిచ ।
అంకురః శుష్కతాంయాతిపునః సేకేనవర్ధతే ॥
తస్మాదభక్త సంగంచ సావధానః పరిత్యజ ।
యథా దృష్ట్వా కాలసర్పం నరోభీత్వా పలాయతే ॥
రాధికవచనమిట్లా –
పరమైనవాడు జ్ఞానాత్మకుడు, బ్రహ్మ, శివుడు, శేషుడు వీరితో పూజింపబడేవాడు. ఆతడు నీకు జ్ఞానాన్ని ఇవ్వలేదు, నా దగ్గరకు పంపాడు, ఓ సతి (1)ఆ నెపంతోనే తీసుకుపోవుటకు ఏమి భావార్థాన్ని బోధిస్తాను. వేదములు సజ్జనులు ఆతని భావార్థాన్ని ఎరుగరు. (2) స్త్రీజాతి అబల (బలహీనురాలు) మూఢమైనది. యధార్ధానికి అజ్ఞానమందే ఆసక్తి కలది. అందువలన ఆతని విరహంతోనే ఎల్లప్పుడు చేతనను పోగొట్టుకుంటున్నాను. (3) నేనేం చెబుతాను జ్ఞానాన్ని. ఐదు రకాల జ్ఞానములలో భక్త్యాత్మకమైనది అన్నిటికన్న పరమైనది. నీకు చెబుతున్నాను తెలుసుకో. (4) శ్రీకృష్ణుని వరముతో ఓసాధు! నీవు నిర్భయుడవుకా. కుయోగికి కూడా గోలోకమందు పడటము జరుగవచ్చు. (5) అందువల్ల అన్ని వదలి పరమేశ్వరుని భజించు. కొడుకు అనే బుద్దిని వదిలి బ్రహ్మరూపుడని తెలుసుకో. ఓ యశోద! నీవు నశ్వరమైన దీనినంతా వదలి, బృందావనమునకు వెళ్ళు. అది భారతమందు రమ్యమైన పుణ్యక్షేత్రము. (7) నిర్మలమైన యమునా నది జలమందు మూడు పూటల స్నానం చేసి, మృదువైన చందనముతో అష్టదళపద్మాన్ని చేసి, ఓ సతి!శుద్ధమైన మనస్సుతో గర్గుడిచ్చిన ధ్యానముతో, పరమానందుని పూజించి, ఆనందంగా ఆతని పదసన్నిధికి చేరు.(9) నూర్లకొలది పితరులతో కూడా కర్మలను తెంచుకొని, వైష్ణవునితో కూడా ఎల్లప్పుడూ మాట్లాడు, ఓసతి! (10) హుతవహజ్వాల (అగ్ని) శ్రేష్ఠము. దాన్ని భక్తుడు పంజరంగా కోరుకుంటాడు (ఇల్లు) ముళ్లలో, నివాసము శ్రేష్ఠము, విషభక్షణము శ్రేష్ఠము. కాని (11) హరిభక్తిలేనివారి సహవాసము వద్దు. అది నాశకారణము. భక్తిహీనుడు తాను స్వయంగా నశించాడు. అంతేకాక బుద్ధి భేదాన్ని కల్గిస్తాడు. (12) భక్తి వృక్షమనే చెట్టు మొలక భక్తుల సహవాసంతో పెరుగుతుంది. హరి యొక్క కథల భాషణమను అమృతంతో తడిపితే, మిక్కిలి వృద్ధినందుతుంది. (13) భక్తుడు కాని వాని మాటలనే దీపఅగ్ని జ్వాలమొక్క ఏఒక్క భాగంతోనైనా ఆ మొలక ఎండిపోతుంది. మళ్ళా అమృతం పోస్తే పెరుగుతుంది. (14) అందువలన భక్తులు కానివారి సహవాసాన్ని జాగ్రత్తగా విడిచి పెట్టు, నరుడు కాలసర్పాన్ని చూచి భయపడి పరుగెత్తినట్టు అభక్తుని చూచి పరుగెత్తాలి.(15)
మూ॥ యశోదేచ ప్రయత్నేన స్వాత్మనః పుత్రమీశ్వరం ।
రామనారాయణానంత ముకుంద మధుసూదన ॥
కృష్ణకేశవ కంసారే హరే వైకుంఠ వామన ।
ఇత్యే కాదశనామాని పడేద్వాపాఠయేదితి
జన్మకోటి సహస్రాణాం పాతకాదేవముచ్యతే ॥
రాశఙ్ఞా విశ్వవచనో మశ్చాపీశ్వర వాచకః ।
విశ్వానామీశ్వరో యోహి తేనరామః ప్రకీర్తితః ॥
రమతేరమయా సార్థంతేన రామం విదుర్బుధాః I
రమాయా రమణ స్థానం రామం రామ విదోవిదుః ॥
రాచేతి లక్ష్మీవచనో మశ్చాపీశ్వర వాచకః ।
లక్ష్మీపతింగతిం రామం ప్రవదంతి మనీషిణః ॥
నామ్నాం సహస్రం దివ్యానాం స్మరణే యత్ఫలం లభేత్ ।
తత్ఫలం లభతే నూనంరామోచ్చారణ మాత్రతః ॥
సారూప్యముక్తి వచనో నారేతిచ విదుర్బుధాః ।
యోదేవోఆప్య యనం తస్యసచ నారాయణః స్మృతః ॥
నారాశ్చకృతపాపాశ్చాప్యయనం గమనం స్మృతం ।
యతోహిగమనం తేషాం సోయంనారాయణః స్మృతః ॥
సకృన్నారాయణే త్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం ।
గంగాది సర్వతీర్ధేషు స్నాతోభవతి నిశ్చితం ॥
నారంచ మోక్షణం పుణ్యమయనం జ్ఞానమీప్సితం !
తయోర్ జ్ఞానం భవేద్యస్మాత్ సోయం నారాయణః ప్రభుః ॥
నాస్త్యంతో యస్యవేదేషు పురాణేషు చతురుచ ।
శాస్రష్వన్యేషు యోగేషు తేనానంతం విదుర్బుధాఃII
ముకుమధ్యయమానంచ నిర్మాణం మోక్షవాచకం ।
తద్దదాతి చయోదేవో ముకుంద స్తేన కీర్తితః ॥
ముకుంభక్తి రసప్రేమ వచనం వేదసంమతం ।
యస్తం దదాతి భక్తేభ్యో ముకుంద సేన కీర్తితః ॥
సూదనం మధుదైత్యస్య యస్మాత్స మధుసూదనః ।
ఇతి సంతో వదంతీశం వేదేభిన్నార్థమీప్సితం ॥
మధు క్లీబంచ మాధ్వీ కృతకర్మ శుభాశుభే ।
భక్తానాం కర్మణాంచైవ సదనం మధుసూదనః ॥
పరిణామ, శుభం కర్మభ్రాంతానాం మధురం మధు ।
కరోతి సూదనం యోహి సఏవ మధుసూదనః ॥
అను ॥ యశోద! ప్రయత్నపూర్వకముగా నీ కొడుకును, ఈశ్వరుని, రామ, నారాయణ, అనంత, ముకుంద, మధుసూదన (16) కృష్ణ, కేశవ, కంసారి, హరి, వైకుంఠ, వామన, అనే ఈ పదకొండు నామములను చదువుటో లేదా చదవించుటో చేయాలి అని. అట్లా చేస్తే సహస్ర కోట్ల జన్మల పాపం నుండి కూడా ముక్తుడౌతాడు. (17) రా అనగా విశ్వము మఅనగా ఈశ్వరుడు. విశ్వములకు ఈశ్వరుడెవడో వాడు ఆ కారణంగా రాముడనబడ్డాడు. (18) రమతో కలిసి రమిస్తాడు కనుక రాముడు అని బుధులన్నారు రమకు, రమణ స్థానము. అందుకే రాముని ఎరిగినవారు రాముడని అన్నారు. (19) రా అనగా లక్ష్మి మఅనగా ఈశ్వరుడు. కనుక లక్ష్మీపతియైన రాముని విద్వాంసులు, గతిగా చెప్పారు. (గమ్యస్థానం) (20) వేయి దివ్య నామముల స్మరణతో వచ్చే ఫలమును రామ శబ్దాన్ని ఉచ్చరించినంత మాత్రమున పొందుతారు (21) నిశ్చయము. నారమనగా సారూప్య ముక్తి అని అర్థం. అని బుధులన్నారు. ఏ దేవుడు దానికి స్థానమో ఆతడు నారాయణుడన్నారు. (22) నారములనగా పాపం చేసినవారు. అయన మనగా పోవుట అని అర్థము. ఎవని స్మరణ వలన అవి పోతాయో వాడు నారాయణుడని అన్నారు. (23) ఒక్కసారి నారాయణ అను శబ్దాన్ని పలికితే నరుడు మూడు వందల కల్పముల వరకు, గంగాది సర్వతీర్ధములందు స్నాతుడౌతాడు. నిశ్చయము (24) నారమనగా మోక్షము, పుణ్యప్రదము. అయన మనగా జ్ఞానము కోరతగినది. ఆరెంటి జ్ఞానము (మోక్ష జ్ఞానము) దేని వలన కలుతుదో ఆతడు నారాయణుడు, ప్రభువు (25) నాల్గు వేదములందు, పురాణములందు, శాస్త్రములందు, ఇతర యోగములందు ఎవనికి అంతము లేదో ఆతడు అనంతుడు అని బుధులన్నారు. (26) ముకుం అనగా చదువుట సృష్టి, మోక్షము అని అర్థాలు. దానినిచ్చే దేవుడు ముకుందుడనబడ్డాడు. (27) ముకుం అనగా వేదసమ్మతమైన భక్తిరస ప్రేమ వచనమని అర్థము దానిని భక్తులకిచ్చేవాడు మకుందుడనబడ్డాడు (28) మధు అను రాక్షసుణ్ణి చంపిన వాడు కనుక ఆతడు మధుసూదనుడు, అని సజ్జనులు ఈశుని గూర్చి చెబుతారు. వేదంలో భిన్నమైన అర్థము చెప్పబడింది. (29) మధు అనగా నపుంసకము. ఇప్పపువ్వు సారం, చేసిన శుభాశుభకర్మలు. భక్తుల కర్మలకు స్థానము, మధుసూదనుడు అని అన్నారు. (30) పరిణామంలో శుభమునిచ్చే కర్మ భ్రాంతులకు మధురము. అదే మధు. దానిని ఎవడు నశింపచేస్తాడో వాడు మధుసూదనుడు. (31)
మూII కృషి రుత్కృష్ట వచనో ణశ్చ సద్భక్తి వాచకః ।
అశ్చాపి దాతృవచనః కృష్ణంతేన విదుర్బుధాః ॥
కృషిశ్చ పరమానందే ణశ్చతద్దాస్య కర్మణి !
తయోర్దాతాచ యో దేవః తేనకృష్ణః ప్రకీర్తితః ॥
కోటి జన్మార్జితే పాపే కృషిః క్లేశేచవర్తతే ।
భక్తానాంణశ్చ నిర్వాణే తేన కృష్ణః ప్రకీర్తితః ॥
నామ్నాం సహస్రం దివ్యానాం త్రిరావృత్య చ యత్ఫలం ।
ఏకావృత్యాతు కృష్ణస్య తత్ఫలంలభతేనరః ॥
కృష్ణనామ్నః పరం నామ న భూతం న భవిష్యతి ।
సర్వేభ్యశ్చపరం నామ కృషైతివైదికా విదుః ॥
కృష్ణకృషైతి హేగోపి యస్తం స్మరతి నిత్యశః ।
జలం భిత్వా యథా పద్మం నరకాదుద్ధరేచ్చసః ॥
కృషైతి మంగలం నామ యస్యవాచిప్రవర్తతే ।
భస్మీ భవంతి సద్యస్తు మహాపాతక కోటయః ॥
అశ్వమేధ సహసేభ్యః ఫలం కృష్ణజపస్యచ ।
వరంతేభ్యః పునర్జన్మ నాతో భక్తపునర్భవః ॥
సర్వేషామపియజ్ఞానాం లక్షాణిచ వ్రతానిచ ।
తీర్థ స్నానాని సర్వాణి తపాం స్యనశనానిచ ॥
వేదపాఠ సహస్రాణి ప్రాదక్షిణ్యం భువః శతం ।
కృష్ణనామ జపస్యాస్య కలాం గార్హతి షోడశీం II
తేషాంలోభాద్భవేత్స్వర్గ ఫలం చ సుచిరం నృణాం ।
స్వర్గాదవశ్యం పుంసశ్చ జపకుర్ఘ రేః పదం II
కేజలే సర్వదే హేపి శయనం యస్యచాత్మనః ।
వదంతి వైదికాః సర్వే తందేవం కేశవం పరంII
కంసశ్చ పాతకే విఘ్నో రోగేశోకేచ దానవే ।
తేషామరిరిహంతాచ సకంసారిః ప్రకీర్తితః ॥
రుద్రరూ పేణ సంహర్తా విశ్వానామపినిత్యశః ।
భక్తానాం పాతకానాంచ హరి స్తేన ప్రకీర్తితః ॥
యాచబ్రహ్మస్వరూపాయా మూలప్రకృతిరీశ్వరీ ।
నారాయణీతి విఖ్యాతా విష్ణుమాయాసనాతనీ ॥
మహాలక్ష్మీ స్వరూపాచ వేదమాతా సరస్వతీ ।
రాధా వసుంధరా గంగా తాసాం స్వామీచమాధవః ॥
కృషి అనగా ఉత్కృష్టమైనది. ణ అనగా సద్భక్తి అ అనగా ఇచ్చేవాడు (ఉత్కృష్ట భక్తినిచ్చేవాడు) కావున కృష్ణుడు అని అన్నారు బుధులు. (32) కృషి అనగా పరమానందము. ణ అనగా అతనికి దాస్యము చేయుట. వాటినిచ్చే దేవుడు కృష్ణుడనబడ్డాడు. (పరమానందునకు దాస్య చేయుట నిస్తాడు. (33) కోటి జన్మలలో సంపాదించిన పాపము నందు కృషి అనగా క్లేశము ఉన్నది. భక్తులకు ఇ అనగా నిర్వాణము. అందువలన కృష్ణుడన్నారు. (లేకుండా చేయటం) (34) దివ్య సహస్రనామములను మూడు సార్లు అవృత్తి చేస్తే వచ్చే ఫలము ఒకసారి కృష్ణ శబ్దాన్ని పలికితే ఆఫలితం వస్తుంది. (35) కృష్ణ అనే పేరున్న ఉత్తమమైన నామము గతంలో లేదు, భవిష్యత్తులో రాదు. అన్నిటికన్న ఉత్తమమైన నామము కృష్ణ అనేది అని వైదికులు తెలిపారు. (36) ఓగోపి! ప్రతిరోజు కృష్ణ, కృష్ణ అని ఆతనిని స్మరిస్తే ఆతడు నరకాన్నుండి ఉద్ధరిస్తాడు, నీటిని చీల్చుకొని పద్మం వచ్చినట్టు ఉద్ధరిస్తాడు. (37) కృష్ణ అనే మంగళకర నామము ఎవని నోట ఉంటే ఆతని మహా పాతకములు కోట్లకొలది వెంటనే భస్మమౌతాయి. (38) వేయి అశ్వమేధముల ఫలము కృష్ణ నామజపం వల్ల వస్తుంది. వాటికన్న ఇది శ్రేష్ఠము. పునర్జన్మ లేదు. అందువలన భక్తుడు తిరిగి పుట్టడు. (39) అన్ని యజ్ఞములు, లక్షల కొలది వ్రతాలు, అన్ని తీర్థముల స్నానము, అన్ని రకాల తపస్సులు, భుజింపకుండుట (ఉపవాసము) (40) వేలసార్లు వేదపఠనము, భూమికి నూరుసార్లు ప్రదక్షిణలు చేయటము ఇవన్నీ కృష్ణ అను నామాన్ని జపిస్తే వచ్చే ఫలంలో పదహారవ భాగానికి సరిపోవు. (41) వాటి పై లోభం వలన నరులకు త్వరలో స్వర్గఫలము వస్తుంది. స్వర్గమునుండి తప్పక జపం చేసే పురుషునకు హరిస్థానం లభిస్తుంది. (42) కే అనగా నీరు, సర్వ శరీరము. ఇందులో ఎవడు తనను నిద్రింపచేసుకుంటాడో ఆ దేవుని అందరు కేశవుడని పరుడని అంటారు. వైదికులు ఇదే అన్నారు. (43) కంసమనగా పాతకము, విఘ్నము, రోగము, శోకము, దానవుడు అని అర్ధము. వాటికి అరి అన వాటిని నశింపచేసేవాడు వాడుకంసారి అని అన్నారు. (44) రుద్రుని రూపంతో ఎల్లప్పుడు విశ్వములను నశింపచేసేవాడు, భక్తుల పాతకాలను హరించేవాడు అందువలన హరి అని పిలువబడ్డాడు. (45) మా అనగా బ్రహ్మ స్వరూపము, మూలప్రకృతి, ఈశ్వరి. నారాయణి అని ప్రసిద్ది చెందింది. విష్ణుమాయ, సనాతనమైంది. (46) మహాలక్ష్మీ స్వరూపురాలు, వేదమాత సరస్వతి, రాధ, వసుంధర, గంగ వారందరికి స్వామి, మాధవుడు అని. (47)
మూ॥ బ్రహ్మేశ శేషాది భవైశ్చ వంద్యం ।
ధ్యానైః నకించిత్ సనకాదిభిశ్చ
వేదైఃపురాణైఃన నిరూపింతచ ।
భజస్వభక్త్యా నవనీత చోరం ॥
క్వచాపిదుగ్ధం క్వదధిఘృతంవా ।
నవోద్ధృతంవా కంచ తక్రమీప్సితం
తేషాంక్వ చౌరో భవతి క్వచాపి ।
క్వ బంధనం తే భవమూల మధ్యే ॥
నయోగిభిః సిద్ధగ ణైః మునీంద్రైః ।
న భక్తసం ఘః భవపద్మశే షైః
యోగైర్మబద్దీ నరహి రక్షితుంక్షమైః ।
కథం సబద్ధస్తవ మూలమధ్యతః ॥
ప్రేమ్లానుభక్యాస్తవనేన పూజయా ।
భజస్వపుత్రం తరసాచ భారతే
హృత్పద్మ మధ్యే స్థితమీశ్వరం పరం ।
ధ్యానేన యత్నేనచ సంతతం సతి ॥
వరం వృణుష్వభద్రంతే యత్తే మనసివాంఛితం ।
సర్వందా స్యామిజగతి దేవానామపి దుర్లభం ॥
యశోదోవాచ :
హరౌచనిశ్చలాభ క్తిః తద్దాస్యం వాంఛితం మమ ।
తవనామ్నశ్చ వ్యుత్పత్తి కావాతద్వత్తు మర్హసి ॥
శ్రీరాధికోవాచ :
భవేద్భక్తిర్నిశలాతే హరేర్దాస్యంచ దుర్లభం ।
లభస్వమద్వరేణాపి కథయామి సునిర్ణయం ॥
పురా నందేన దృష్టాహంభాండీరే వటమూలకే ।
మయాచ కథతోనందో నిషిద్ధశ్చ ప్రజేశ్వరః ॥
అహమేవ స్వయం రాధాఛాయా రాపాణకామినీ
రాపాణః శ్రీహరేరంశః పారద ప్రవరోమహాన్ ॥
రాశబ్దశ్చ మహావిష్ణుః విశ్వాని యస్యలోమసు ।
విశ్వప్రాణిషు విశ్వేషు ధధాత్రీమాతృవాచకః ।
ధాత్రీమాతాజహమేతేషాం మూలప్రకృతిరీశ్వరీ ।
తేనరాధా సమాఖ్యాత హరిణాచ పురాబుధైః ॥
అహం సుదామశా పేన వృషభానసుతా అధునా !
శతవర్షంచ విచ్ఛేదో హరిణా సహ సాంప్రతం ॥
వృషభానశ్చ కృష్ణస్య పార్శదప్రవరోమహాన్ ।
పితృణాం మానసీకన్యా మమమాతా కలావతీ ॥
అయోనిసంభవాహంచ మమమాతాచ భారతీ ।
పునఃసార్థంచ యుష్మాభిః యాస్యామి శ్రీహరేః పదం ॥
ఇతితే కథితం సర్వం ప్రజం ప్రజ ప్రజేశ్వరి ।
వ్రజేశ్వరేణ సహితా స్వామినా జ్ఞానినాసతి ॥
మమా ధునాచ భవతీ ధ్యానస్య వ్యవధానికా ।
ధ్యాన భంగే మహాదోషోనరాణా మపిసుందరి ॥
ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్థే నారాయణ నారద సంవాదే రాధా యశోదా సంవాదే ఏకదశాధిక శతతమోధ్యా యః ॥
బ్రహ్మ, ఈశుడు, శేషుడు మొదలగు భవులతో (దేవతలు) నమస్కరించతగినవాడు, ధ్యానముతో ప్రయోజనం లేదు. సనకాదులు వేదములు, పురాణములు ఆతడు (శక్తి) నిరూపించబడలేదు. భక్తితో నవనీత చోరుని భజించు. (48) ఒకచోపాలు, ఒకచో పెరుగు, నేయో కొత్తగా తీసినదేదైనా ఇష్టమైనమజ్జిగతో తీస్తాడు. వారికి ఈ చోరుడు ఎక్కడో తెలియదు, ఎక్కడో, పుట్టుకకు కారణమైన దాని మధ్యలో నున్న నీకు ఆతడు కట్టుబడటమేమిటి. (49) యోగులు, సిద్ధగణాలు, మునీంద్రులు, భవమనే పద్మంలో మిగిలిన భక్త సంఘాలు కట్టేయలేదు. యోగులు, రక్షణకు సమర్థులైనా వారికి కట్టుబడలేదు. అట్టివాడు, కారణమైన దాని మధ్యనున్న నీకు ఆతడెట్లా కట్టుబడ్డాడు. (50) ప్రేమతో, భక్తితో, పూజతో, స్తుతితో భారతమందు త్వరగా పుత్రుని భజించు, హృదయ పద్మమందున్న ఈశ్వరుని, పరుని ధ్యానముతో ప్రయత్నపూర్వకంగా ఎల్లప్పుడు భజించు, ఓసతి! (51) నీ మనసులో ఏ కోరిక ఉందో దానిని వరంగా కోరుకో, నీకు భద్రమగుగాక, దేవతలకు దుర్లభమైన దానినైనా జగత్తులో ఉన్నదంతా ఇస్తాను. (52) యశోద ఇట్లా - హరియందు నిశ్చలమైన భక్తి ఆతని దాస్యము ఇవి నా కోరిక. నీ పేరునకు వ్యుత్పత్తి ఏమిటో దానినినాకు చెప్పండి. (53) రాధిక ఇట్లా - నీ భక్తి నిశ్చలముగా ఉండనీ. హరిదాస్యము దుర్లభమైనది. నా వరంతో దానిని కూడా పొందు. మంచి నిర్ణయాన్ని చెబుతాను. (54) భాండీర మందు (అత్తిచెట్టు) వటమూలమందు ఇదివరలో నన్నునందుడు చూచాడు. నేను నందునితో ఇట్లన్నాను. ప్రజేశ్వరుడు ని షేధింపబడ్డాడు. (55) నేనే రాధను స్వయంగా ఛాయను రాపాణుని కామినిని. రాపాణుడు శ్రీహరి యొక్క అంశ. హరికి ప్రక్కనుండే వారిలో ముఖ్యుడు గొప్పవాడు. (56) రా అనగా విష్ణువు ఆతని రోమములందు విశ్వమున్నది. విశ్వమందలి ప్రాణులయందు, విశ్వములయందు అర్థము ధా అనగా ధాత్రి మాతృవాచకము. (57) ధాత్రి అనగా నేను వీరందరికి తల్లిని మూలప్రకృతిని, ఈశ్వరిని. అందువల్ల రాధా అని హరి, ఇదివరలో బుధులు నన్ను పిలిచారు. (ప్రాణులకు తల్లి రాధ) (58) నేను ఇప్పుడు సుదాముని శాపంతో వృషభానుని కూతురుగా ఉన్నాను. ఇప్పుడు హరితో నాకు నూరు సంవత్సరాలు విచ్చేదము. (59) వృషభానుడు కూడా కృష్ణుని యొక్క పారదులలో శ్రేష్ఠుడు గొప్పవాడు. నా తల్లి కలావతి పితరులకు మానసికమైనకన్య (60) నేను అయోని సంభవను. నా తల్లికూడా ఈ భారతమందు అయోని సంభవ. తిరిగి మీతోపాటు శ్రీహరి స్థానానికి వెళ్లాను. (61) ఇట్లా నీకు అంతా చెప్పాను. ఓ ప్రజేశ్వరి! ప్రజమునకు వెళ్ళు. ఓ సతి! జ్ఞానియైన, స్వామియైన వ్రజేశ్వరునితో కలిసి ఉండు. (62) నాకు ఇప్పుడు మీరు నాధ్యానానికి అడ్డంకి. ధ్యానాన్ని భంగపరచటం మహా దోషము నరులు కూడా చేయరాదు, ఓసుందరి! (63)
అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు రాధ యశోద సంవాదమందు నూట పదకొండవ అధ్యాయము.
Summary of chapter 111 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Following Brahmā's prayer, this chapter presents the soul-stirring hymn composed by Lord Śiva in praise of Lord Śrī Kṛshṇa. Lord Śiva glorifies Kṛshṇa as the supreme destroyer of all material bondage, the ocean of divine sweetness, and the eternal soul of Goddess Śrī Rādhā, declaring that meditation upon Kṛshṇa's lotus feet is the ultimate goal of all yoga and renunciation.