మూII శ్రీనారాయణ ఉవాచ :
సశిష్యశ్చాపి దుర్వాసాస్త్యక్త్వాచ ద్వారకాం పురీం ।
కైలాసం ప్రయణాభక్త్యా శంకరంద్రష్టు మీశ్వరం ॥
గత్వమునిశ్చ కైలాసం ప్రణనామశివం శివాం ।
తుష్టావ పరయా భక్త్యా స శిష్యః ప్రణతః శుచిః ॥
తత్సర్వం కథయామాస వృత్తాంతం శ్రీహరేరపి !
ఆత్మన స్తపనస్తత్వం స్వవైరాగ్యంత చేతసః ॥
మునేశ్చవచనం శ్రుత్వా ప్రహస్య పార్వతీ సతీ ।
తమువాచ హితం సత్యం సాక్షాచ్చంకర సన్నిధౌ ॥
పార్వత్యువాచ :
ధర్మతత్వంనజానాసి ధర్మిష్ఠం మన్య సేస్వకం ।
అనపత్యం పరిత్యజ్య క్వయాసి తపసేమునే ॥
అనపత్యంచ యువతీం కులజాంచ పతివ్రతాం ।
త్యక్త్యా భవేయుః సంన్యాసీ బ్రహ్మచారీయతీతివా ॥
వాణిజ్యేవా ప్రవాసేవా చిరం దూరం ప్రయాతియః ।
తీర్థ వా తప సేవాపి మోక్షార్థం జన్మఖండితుం ॥
నమోక్షస్తస్య భవతి ధర్మస్య స్ఖలనం ధ్రువం ।
అభిశా పేన భార్యాయాః నరకంచ పరత్రచ
ఇ హైవచ యశోనాశ ఇత్యాహ కమలోద్భవః ॥
ద్వారకాంగచ్ఛ హేవిప్ర స్వధర్మం రక్ష సాంప్రతం ।
ఏకా వంశాం మదంశాంచ ధర్మత: పరిపాలయ ॥
పాదపద్మార్జితం పాదపద్మం సర్వసుదుర్లభం ।
సంతతంశంభునా గీతం మునీంద్రైః సనకాదిభిః ॥
పరిత్యజ్య సురతరో కృష్ణస్య పరమాత్మనః ।
క్వయాసి తప సేవత్స సుధాంత్యక్త్వా మనోహరాం ॥
శ్రీకృష్ణ పాదపద్మంచ స్వప్నే జపతి యో మునే ।
శతజన్మకృతాత్పాపాత్ ముచ్యతేనాత్ర సంశయః ॥
యద్భాల్యేయచ్చకౌమారే వార్ధకేయచ్చయావనే ।
కామతో కామతోవాభస్మీభూతంచపాతకం ॥
సాక్షాద్యోభారతే వడ్డే శ్రీకృష్ణ చరణాంబుజం ।
దృష్ట్వా సద్యోభవేత్ పూజ్యో జీవన్ముక్తో భవేధ్రువం ॥
కోటి జన్మార్జితాత్సద్యః కృతపాపాద్విముచ్యతే ।
సర్వాణ్యేవహితీర్థాని యతః పూతాని నిత్యశః ॥
నారాయణుడిట్లన్నాడు :
శిష్యులతో కూడా దుర్వాసుడు ద్వారకపురినివదిలి భక్తితో ఈశ్వరుని శంకరుని చూడటానికి కైలాసానికి వెళ్ళాడు. (1) ముని కైలాసానికి వెళ్ళి శివునకు పార్వతికి నమస్కరించాడు. చాలా భక్తితో శుచిగా శిష్యులతో కూడి నమస్కరించి ఆనందింపచేశాడు. (2) శ్రీహరియొక్క ఆ వృత్తాంతాన్నంతా చెప్పాడు. తన తపస్సు యొక్క తత్వాన్ని తన మనస్సుయొక్క వైరాగ్యాన్ని చెప్పాడు. (3) ముని మాటను విని ఆసతి పార్వతి నవ్వి సాక్షాత్తుగా శంకరుని ఎదుట ఆతనికి హితమైన సత్యమైన మాటను చెప్పింది. (4) పార్వతి ఇట్లా - నిన్ను నీవు ధర్మిష్ణుడిననకుంటావు. ధర్మతత్వము నీకు తెలియదు. ఓ ముని! సంతానములేని భార్యను వదిలి తపస్సుకు వెళ్తున్నావా? (5) సంతానములేని, వయస్సులో ఉన్న, కులమునందు పుట్టిన, పతివ్రతయైన దానిని, వదలి సన్యాసికాని, బ్రహ్మచారికాని, యతికాని ఐతే (6) వాణిజ్యానికో, ప్రవాసమునకై చాలా దూరానికిపోతే, తీర్థములకో, తపస్సుకో, మోక్షము కొరకు జన్మనాశము కొరకు పోతే (7) వాడిక ఇమోక్షము రాదు. ధర్మమునుండి పతుతుడౌతాడు నిశ్చయము. భార్యశాపం వల్ల ఇక్కడ పైన నరకమే, నిశ్చయము. ఇక్కడైతే కీర్తినశిస్తుంది అని బ్రహ్మ అన్నాడు. (8) ఓ విప్రుడ! ద్వారకకు వెళ్ళు. ఇప్పుడు నీ ధర్మాన్ని దక్షించు. ఒక అంశను, నా అంశను కలిగిన ఆమెను ధర్మంగా రక్షించుకో (9) పాదపద్మములచే ఆర్జించబడిన పాదపద్మము అందరికి సుఖంగా లభించేదికాదు. ఎప్పుడు శివునిచే పొగడబడేది సనకాది మునీంద్రులు మెచ్చేది. (10) పరమాత్మయైన కృష్ణుడొక సురతరువు వంటివాడు. ఆతనిని వదిలి ఓ వత్స! తపస్సునకు వెళ్తున్నావా, మనోహరమైన సుధను, వదలివెళ్తున్నావా (11) ఓముని! శ్రీకృష్ణుని పాదపద్మములను స్వప్నంలో జపించినవాడు, నూరు జన్మలలో చేసిన పాపం నుండి ముక్తుడౌతాడు ఇందులో అనుమానం లేదు. (12) బాల్యకౌమార, వృద్ధాప్య, యౌవనములందు ఇష్ట పూర్తిగాని, తెలియక కాని చేసిన పాపాలు భస్మమౌతాయి (13) భారతదేశంలో సాక్షాత్తుగా శ్రీకృష్ణ చరణాంబుజములను చూసినవాడు, వెంటనే పూజ్యుడౌతాడు. జీవన్ముక్తుడౌతాడు, నిశ్చయము. (14) కోటి జన్మల నుండి చేసిన సంపాదించిన పాపము నుండి వెంటనే ముక్తుడౌతాడు అన్ని తీర్థములు నిత్యము అతని వల్లనే పవిత్రమైనాయి. (15)
మూ॥ తద్ర్వతం తత్తపః సత్యంతత్పుణ్యం తచ్చపూజనం ।
సఫలం కృష్ణసంబంధి స్వజన్మఖండనం యతః ॥
కృష్ణ భక్తి విహీనశ్చ బ్రాహ్మణో వేదపారగః।
తత్సంగాచ్చ తదాలాపాద్భక్త భక్తి ప్రణశ్యతి ॥
కృష్ణస్యోచ్ఛిష్టభోజీ యః కృష్ణశ్చ బ్రాహ్మణః స్వయం ।
ఆవహ్ని పవనాత్సూతః పూతం కర్తుంజగత్ క్షమః ॥
శ్రీకృష్ణంచ పరిత్యజ్య క్వయాసి తప సేద్విజ ।
తపసాంఫలమాప్నోతి శ్రీకృష్ణ స్మరణేనచ ॥
యతో భక్తిర్నచభవేత్ శ్రీకృష్ణ పరమాత్మని ।
సగురుః పరమోవైరీ కరోతిజన్మ నిష్ఫలం ॥
పార్వతీవచనం శ్రుత్వాశంకరః ప్రేమవిహ్వలః ।
పులకాంచిత సర్వాంగః తుష్టావ పరమేశ్వరీం ॥
దుర్వాసాః ప్రణతింకృత్వా శివదుర్గా పదాంబుజే ।
స్మారం స్మారం కృష్ణపదం పునశ్చద్వారకాం యణా ॥
తత్రగత్వాహరిం దృష్ట్వాతుష్టావ పరమేశ్వరీం ।
ఏకానం శాలయంగత్వా సచరేమే తయాసహ ॥
కృష్ణో యుధిష్ఠిర ధ్యానాత్ ప్రయ హస్తినాపురం ।
కుంతీం సంభాష్య భూపంచ భ్రాతాంశ్చ ప్రముదాన్వితః ॥
ఉపాయేన జరాసంధం నిహత్య సాల్వమేవచ ।
కారయామాస యజ్ఞంచ విధిబోధిత దక్షిణం ॥
మునీంద్రైశ్చ నృపేందైశ్చ రాజసూయమభీప్సితం ।
శిశుపాలం దంతవక్రం తత్రయజే జఘాన సః ॥
అతీవ నిందాం కుర్వంతం సభాయంసురభూపయోః ।
పపాత తచ్చరీరంచ జీవోగత్వాహరేః పదం
తం దృష్ట్వాతత్ర సర్వేశం తుష్టావాగత్య మాధవం ॥
శిశుపాల ఉవాచ :
వేదానాంజనకోసిత్వం వేదాంగానాంచ మాధవ ॥
సురాణాం అసురాణాంచ ప్రాకృతానాంచ దేహినాం ।
సూక్ష్మాం విధాయ సృష్టించ కల్పభేదం కరోషిచ ॥
మాయయాచ స్వయం బ్రహ్మా శంకరః శేష ఏవచ ।
మనవోమునయశ్చైవ వేదాశ్చ సృష్టిపాలకాః ॥
కృష్ణ సంబంధముగల వ్రతము, వ్రతము, తపము తపము. అదే సత్యము, అదే పుణ్యము అదే పూజనము. అది సఫలమైంది. అతి తన జన్మను నశింపచేస్తుంది కదా (16) బ్రాహ్మణుడు వేదపారగుడు ఐయ్యుండీ కృష్ణభక్తి లేకపోతే, అట్టివాని సహవాసం చేస్తే అతనితో మాట్లాడితే ఈ భక్తుని భక్తి నశిస్తుంది. (17) కృష్ణుడి ఎంగిలి తినేవాడు కృష్ణునంతవాడు. కృష్ణుడు స్వయంగా బ్రాహ్మణుడు. అగ్ని వాయువులున్నంత కాలము ఆతడు పవిత్రుడు. జగత్తును పవిత్రముగా చేయుటకు సమర్థుడు. (18) ఓద్విజ! శ్రీకృష్ణుని వదలి తపస్సుకు వెళ్తున్నావా. శ్రీకృష్ణుని స్మరిస్తే చాలు తపస్సుల ఫలమంతా వస్తుంది. (19) పరమాత్మయైన శ్రీకృష్ణుని యందు భక్తి లేకపోతే, అలాంటి గురువు పరమ శత్రువు. వాడు తన జన్మను (మనది) నిష్ఫలంగా చేస్తాడు. (20) పార్వతి మాట - విని శంకరుడు ప్రేమతో చలించి, ఒంటినిండా పులకాంకురములురాగా పరమేశ్వరిని మెచ్చుకున్నాడు. (21) శివుడు పార్వతి వీరి పాదములకు దుర్వాసుడు నమస్కరించి,కృష్ణుని పాదములను స్మరిస్తు తిరిగి ద్వారకకు వచ్చాడు. (22) అక్కడికి వెళ్ళి హరిని చూచి పరమేశ్వరుని (కృష్ణుని) స్తుతించాడు. ఏకానం శాలయమునకు వెళ్ళి ఆమెతో రమించాడు. (23) యుధిష్ఠిరుడు ధ్యానించగా కృష్ణుడు హస్తినా పురికి వెళ్ళాడు. కుంతితో, రాజుతో, భ్రాతలతో మాట్లాడి, చాలా ఆనందించి (24) ఉపాయముగా జరాసంధుని చంపి, శాల్వుని చంపి, శాస్త్రంలో చెప్పిన విధంగా దక్షిణలిచ్చి యజ్ఞం చేయించాడు. (25) మునీంద్రులు, రాజేంద్రులు వీరితో రాజసూయాన్ని కోరినదాన్ని చేయించి ఆతడు, యజ్ఞంలో శిశుపాలుని దంతవక్రుని చంపాడు. (26) సభలో సురలను రాజులను చాలా నిందించటం వల్ల చంపాడు. వాడి శరీరం పడిపోయింది. జీవుడు హరిస్థానానికి దగ్గరకు) చేరాడు. దానిని చూచి అక్కడ సర్వేశుని మాధవుని, సమీపించి పొగిడాడు. (27) శిశుపాలుడిట్లా - వేదములకు వేదాంగములకు నీవు తండ్రివి, ఓ మాధవ! (28) సురలు, అసురులు, ప్రాకృతులైన ప్రాణుల సూక్ష్మముగా జేసి సృష్టిని కల్పభేదమును చేస్తావు. (29) మాయవల్ల స్వయంగా బ్రహ్మ శంకరుడు, శేషుడు, మనులు, మునులు, వేదములు, సృష్టిపాలకులు మోహితులైనారు.(30)
మూ॥ కలాంశేనాపి కలయాదిక్పాలాశ్చ గ్రహాదయః ।
స్వయం పుమాన్ స్వయంస్త్రీచ స్వయమేవ నపుంసకః ॥
కారణంచ స్వయం కార్యం జన్యశ్చ జనకస్స్వయం ।
యంత్రస్యచగుణోదోషో యంత్రిణశ్చ శ్రుతో శ్రుతం ॥
సర్వేయంత్రాభవాన్ యంత్రీత్వయి సర్వం ప్రతిష్టితం ।
మమ క్షమస్వాపరాధం మూఢస్యద్వారిణస్తవ ॥
బ్రహ్మశాపా త్కుబుద్ధేశ్చ రక్షరక్ష జగద్గురో ।
ఇత్యేవముక్త్వా క్రమతో జయో విజయ ఏవచ ॥
ముదాతౌయయతుః శీఘ్రం వైకుంఠ ద్వారమీప్సితం ।
శిశుపాలస్య స్తోత్రేణ సర్వేతే విస్మయం యయుః ॥
పరిపూర్ణతమం కృత్వా మేనిరే కృష్ణమీశ్వరం ।
కారయిత్వారాజసూయం భోజయామాస బ్రాహ్మణాన్ ॥
కురుపాండవ యుద్ధంచ కారయామాస భేదతః ।
భువోభారావతరణం చకారచ కృపానిధిః ॥
పునర్యమౌ ద్వారకాంచ చిరం స్థిత్వా నృపాజ్ఞయా ।
విప్రాయామృతవత్సాయా జీవయామాస పుత్రకం II
మృతస్థానాత్సమానీయ తన్మాత్రే ప్రదదౌసుతాన్ ।
తద్దృష్ట్వా దేవకీ తుష్టాయయాచే మృత పుత్రకామ్ ॥
మృతస్థానాత్సమానీయ దదౌ మాత్రే సహోదరాన్ ।
సద్యోజహార దారిద్ర్యం సుదామ్నో బ్రాహ్మణస్యచ II
సమాగతస్య స్వగృహాత్ ద్వారకాం శరణార్థినః ।
తస్మైదదౌ రాజలక్ష్మీం నిశ్చలాం సాప్త పౌరుషీం ॥
పృథుకానాం కణం భుక్త్వా భక్తస్య భక్తవత్సలః ।
బభూవ తస్య రాజ్యంచ యథేంద్ర స్యామరావతీ ॥
యథాధనేశ్వరోదేవః ధనాఢ్యః సబభూవహ ।
నిశ్చలాంహరిభక్తించ దదౌదాస్యం సుదుర్లభం II
అవినాశిని గోలోకే యధేష్టం పదముత్తమం ।
జహార పారిజాతంచ శక్రోహంకారమేవచ ॥
సత్యాంచ కారయామాస పుణ్యకం వ్రతమీప్సితం ।
వర్ధయామాస సర్వత్ర నిత్యం నైమిత్తకం మునే ॥
కళలోని భాగమైన నీ కళతో దిక్పాలురు, గ్రహాదులున్నారు. నీవు స్వయంగా పురుషరూపుడవు. స్వయంగా స్త్రీవి. స్వయంగా నపుంసకుడవు. (31) స్వయంగా కారణము నీవు. కార్యముగూడా. నీవు జనకుడవు, స్వయంగా జన్యమైన వస్తువువు. యంత్రము యొక్క గుణదోషములు మంత్రికి అని శ్రుతిలో విన్నాము. (32) అందరు యంత్రాలు, నీవు యంత్రివి. నీలో అన్ని ఉన్నాయి. నా అపరాధాన్ని క్షమించు, నేను మూడుణ్ణి నీ ద్వారపాలకుడిని (33) బ్రహ్మ శాపం వల్ల, చెడు బుద్ధివల్ల అపరాధం నుండి ఓ జగద్గురు నన్ను రక్షించు, రక్షించు. అని పలికి క్రమంగా జయ విజయములు (34) ఆనందంతో వారు శీఘ్రంగా ఇష్టమైన వైకుంఠ ద్వారము దగ్గరకు వెళ్ళారు. శిశుపాలుని స్తోత్రంతో వారంతా ఆశ్చర్యపడ్డారు. (35) ఈశ్వరుడైన కృష్ణుని పరిపూర్ణతముడని భావించారు. రాజసూయము చేయించి బ్రాహ్మణులను భుజింపచేశాడు. (36) వారికి విభేదం కల్పించి కురుపాండవ యుద్ధము చేయించాడు. ఆ కృపానిధి భూభారాన్ని తగ్గించాడు. (37) రాజు ఆజ్ఞతో చాలా కాలము ఉండి, పిదప మళ్ళీ ద్వారకకు వెళ్ళాడు. బ్రాహ్మణుని పిల్లవాళ్ళు చనిపోతే, ఆపుత్రులను బ్రతికించాడు. (38) చనిపోయిన స్థానము నుండి తెచ్చి పిల్లవాళ్ళను, వాళ్ళ తల్లికిచ్చాడు. అది చూచి దేవకి ఆనందపడి తన చనిపోయిన పుత్రులను తెచ్చి ఇవ్వమని అడిగింది. (39) మృతస్థానము నుండి తెచ్చి, తన తల్లికి తన సోదరులను ఇచ్చాడు (బ్రతికించి). సుదాముడను బ్రాహ్మణుని దారిద్ర్యమును వెంటనే తొలగించాడు. (40) తన ఇంటి నుండి ద్వారకకు శరణార్థిగా వచ్చిన ఆసుదామునకు నిశ్చలమైన రాజలక్ష్మిని ఏడు తరముల వరకు నిలిచి ఉండేట్టుగా ఇచ్చాడు. (41). భక్తవత్సలుడు, భక్తుని అటుకులలో ఒక కణాన్ని (కొద్దిగా) తిని అంత ఐశ్వర్యమిచ్చాడు. అతని రాజ్యము ఇంద్రుని అమరావతిలా ఐంది. (42) కుబేరుడెట్లా ధనవంతుడో, ఆతడు అట్లా ఐనాడు. నిశ్చలమైన హరి భక్తిని, చాలా దుర్లభమైన దాస్యమును ఇచ్చాడు. (43) నాశంలేని గోలోకమందు యథేష్టమైన (కోరిన) ఉత్తమ స్థానమిచ్చాడు. పారిజాతమును, ఇంద్రుని అహంకారమును హరించాడు. (44) సత్యభామతో కోరిన పుణ్యక వ్రతాన్ని చేయించాడు. ఓముని! అంతట నిత్యమైన నైమిత్తికమైన కార్యాలు పెంపొందించాడు.(45)
మూII తత్రవ్రతే కుమారాయ స్వాత్మానం దక్షిణాందదౌ ।
బ్రాహ్మణాన్ భోజయామాస తేభ్యోరత్నం దదౌముదా ॥
సత్యభామాతిమానంచ వర్ధయామాస సర్వతః ।
రుక్మిణ్యా అతిసౌభాగ్య మన్యాసాంచ నవం నవం ॥
వైష్ణవానాం సురాణాంచ విప్రాణామపిపూజనం ।
వర్ధయా మాససర్వత్ర నిత్యం నైమిత్తికంమునే ॥
పరమాధ్యాత్మికం జ్ఞానం ఉద్ధవాయ దదౌ ప్రభుః ।
అర్జునం కథయామాస గీతాంచ రణమూర్ధని ॥
కృత్వానిష్కంటకం చైవ కృపయాచ కృపానిధిః ।
యుధిష్ఠిరాయ పృధివీరాజ్యలక్ష్మీందదౌ ప్రభుః ॥
దుర్గాంచ కారయామాస వైష్ణవీం గ్రామదేవతాం ।
యజ్ఞంచ కారయామాస కోటిహోమాన్వితం శుభం ॥
నానాప్రకారనైవేద్యైః ధూపదీ పైః మనోహరైః ।
బ్రాహ్మణాన్ భోజయామాస పార్వతీ ప్రీతయే తథా ॥
రైవతే పర్వతేరమ్యే చామూల్యరత్నమందిరే ।
గణేశం పూజయామాస దేవానామీశ్వరం పరం ॥
లడ్డుకానాంతి లానాంచ సుస్వాదు సుమనోహరాం ।
పరితుష్టిం పంచలక్షంనైవేద్యంచదౌముదా
లడ్డూకం స్వస్తికానాంచ సప్తలక్షం సుధోపమం ॥
గణేశ్వరాయ ప్రదదౌ శర్కరాశతరాశికాం ।
పక్వరంభాఫలానాంచ దశ లక్షమపూపకం ॥
మిషాన్నం పాయసం రమ్యం స్వాదుస్వస్తికపిష్టకం ।
ఘృతంచ నవనీతంచ దధిదుగ్గం సుధోపమం ॥
ధూపం దీపం పారిజాత పుష్పమాల్యమభీప్సితం ।
సుగంధి చందనం గంధం వహ్నిశుద్ధాంశుకం దదౌ ॥
యజ్ఞంచ కారయామాస కోటిహోమాన్వితం శుభం ।
బ్రాహ్మణాన్ భోజయామాస తుష్టావ సగణేశ్వరం ॥
వాద్యం దశవిధంచైవ వాదయామాస తత్రవై ।
సూర్యంచ పూజయా మాస సాంబ కుష్ఠక్షయాయచ ॥
హవిష్యం కారయామాస తాంచ సాంబంధమాతరం ।
పరిపూర్ణం వత్సరం చా ప్యుపహారైరనుత్తమైః ॥
వరందదౌచ సాంబాయస్తోత్రంచ భాస్కరః స్వయం ॥
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే గణేశ పూజానామ త్రయోదశాధిక శతతమోధ్యా యః ॥
ఆవ్రతంలో కుమారునకు తనను దక్షిగా ఇచ్చుకున్నాడు. బ్రాహ్మణులకు భోజనం పెట్టాడు. వారికి ఆనందంగా రత్నమిచ్చాడు. (46) అన్నివిధాల సత్యభామా అతిమానమును పెంచాడు. రుక్మిణి యొక్క అతిసౌభాగ్యము ఇతర స్త్రీలకు చాలానూతనమైనది. (47) వైష్ణవులను, దేవతలను, బ్రాహ్మణులను పూజించాడు. ఓముని! అంతట నిత్యనైమిత్తిక కర్మల పెంచాడు. (48) ప్రభువు! మిక్కిలి శ్రేష్ఠమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉద్ధవునికిచ్చాడు. యుద్ధక్షేత్రంలో అర్జునునకు గీతను బోధించాడు. (49) కృపానిధి, కృపతో శత్రువులు లేకుండా చేశాడు. ప్రభువు! యుధిష్ఠిరునకు పృథివి రాజ్యలక్ష్మిని ఇచ్చాడు. (50) దుర్గను వైష్ణవి అనే గ్రామదేవతగా చేశాడు. కోటి హోమములతో కూడిన శుభమైన యజ్ఞాన్ని చేయించాడు. (51) రకరకాల నైవేద్యాలతో, మనోహరమైన ధూపదీపములతో పార్వతి ప్రీతికొరకు బ్రాహ్మణులను భుజింపచేశాడు. (52) రమ్యమైన రైవతపర్వతమందు అమూల్యరత్నమందిరమందు, దేవతలకు ఈశ్వరుడైన పరుడైన గణేశుని పూజింపచేశాడు. (53) రుచికరమైన, చాలా మనోహరమైన లడ్డులను నువ్వులతో చేసిన వానిని ఐదు లక్షలు నైవేద్యమిచ్చి ఆనందంతో ఆతనిని సంతోషపరిచాడు. బియ్యపు పిండితో చేసిన మూడు మూలలుగల లడ్డులను అమృతము వంటి వాటిని ఏడు లక్షలు నైవేద్యమిచ్చాడు. (54) శర్కర యొక్క నూరు రాసులను గణేశ్వరునికిచ్చాడు. పండిన అరటిపండ్లు, పదిలక్షల అప్పాలు నైవేద్యమిచ్చాడు. (55) మధురాన్నము, రమ్యమైన పాయసము మంచిరుచి గల స్వస్తిక ఆకారము గలిగిన పిండిని పెట్టాడు. నేయి, వెన్న, పెరుగు, పాలు అమృతంలాంటివి ఇచ్చాడు. (56) ధూపము, దీపము, పారిజాత పూలమాలను కోరతగినదానిని ఇచ్చాడు. వాసనగల చందనము, గంధము, అగ్నితో శుద్దమైన వస్త్రము ఇచ్చాడు. (57) శుభమైన కోటిహోమ (గుండ) ములుగల యజ్ఞము చేయించాడు. బ్రాహ్మణులను భుజింపచేశాడు. గణేశ్వరుని సంతోషపరిచాడు. (58) పదిరకాల వాద్యములను వాయింపజేశాడు. కుష్టువ్యాధి పోయే కొరకు సాంబుడు సూర్యుని పూజించాడు. (59) తల్లితో కూడా ఆ సాంబునితో హవిష్యము చేయించాడు. ఉత్తమమైన ఉపహారములతో ఒక సంవత్సర కాలము చేయించాడు. (60) భాస్కరుడు స్వయంగా సాంబునకు స్తోత్రమును వరమును ఇచ్చాడు. (61)
అని బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు గణేశపూజ అనునది నూట పదమూడవ అధ్యాయము.
Summary of chapter 113 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Presenting the hymn composed by Dharmadeva, the personified deity of moral righteousness, this chapter glorifies Śrī Kṛshṇa as the ultimate protector and foundation of all moral laws, truth, and virtue. Dharmadeva asserts that true Dharma consists not merely of external rituals but of unalloyed devotion, truthfulness, compassion, and surrender to the Supreme Lord.