బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

35 - రాధాకృష్ణ సంవాదము

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లనెను :

నారాయణశ్చ బ్రహ్మాణమువాచ కృపయా పునః

దృష్ట్యా గంగాం చ సర్వే తొం మమ మాయాం చ మేనిరే

నారాయణ ఉవాచ - శ్రీమన్నారాయణుడిట్లనెను :

ఉత్తిష్ఠ! గచ్ఛ భద్రం తే భవిష్యతి చతుర్ముఖ

ఆత్ర స్నాత్వాఽభిశప్తస్త్వం పూతో భవ మమాజ్ఞయా

 త్వం చేత్సత్యం స్వయం పూతః స్పర్శం వాంఛంతి తాని తే

వైష్ణవేశస్య తీర్థాని సర్వాణి సంతతం మునే

 తథాఽపి  శాపముక్తస్త్వమత్ర ప్రకృతి హేలనాత్

అహంకారశ్చ సర్వేషాం పోపబీజమమంగలం

శీఘ్రం త్వం గచ్ఛ గోలోకం మమాలయం పరాత్పరం

 ప్రకృత్యంశాం మంగలదాం తత్ర ప్రాప్యసి భారతీం

 ప్రకృతిం భజ కల్యాణ నృష్టి బీజ స్వరూపిణీం

అహో కల్పాంత పర్యంతం తపస్తప్తం త్వయాఽధునా

 తవ మంత్రం న గృహ్ణాంతి కేఽపి వేశ్యా భిశాపతః

యదన్యదేవ పూజాయాం తవ పూజ భవిష్యతి

త్వమేవ జగతాం ధాతా స్వాత్మా రామశ్చ యోషితః

 సర్వరూపీ చ పూజ్యశ్చ సర్వదేహేషు సర్వతః

ఓ రాధా! ఆ గంగనందరు చూచీ నామాయగా భావించిరి. నారాయణుడు కృపతో బ్రహ్మను గూర్చి ఇట్లు పలికెను. “ఓ చతుర్ముఖా! లెమ్ము, పొమ్ము! నీకు క్షేమమగును. మిక్కిలి శపింపబడిన నీవు నా ఆజ్ఞచేత ఈ నదిలో స్నానము చేసి పవిత్రుడవు కమ్ము. నీవు స్వయముగా పవిత్రుడవైనను ఆ జలములు నీ స్పర్శను కోరుచున్నవి. సర్వతీర్థములు విష్ణు భక్తులకు ప్రభువైనవానివే, ఎవ్వరికైనను అహంకారమన్నది అమంగళమైన పాపమునకు విత్తనము కనుక ప్రకృతిని అవమానించుట వలన నీవు ఇందులో స్నానమాడి శాపముక్తుడవగుము. పిదప శీఘ్రముగా ముక్తి స్థానములలో శ్రేష్ఠమైన నా నివాసమగు గోలోకమునకేగుము. అక్కడ నీవు మంగళముల నిచ్చునట్టి ప్రకృత్యంశయైన భారతిని పొందగలవు.. కల్పాంతము వరకు నీవు తపస్సు చేసితివి కనుక సృష్టికి బీజ స్వరూపిణియైన ఆ ప్రకృతిని {భారతిని భజింపుము. వేశ్యయొక్క శాపము వలన ఇక ఎవరు గూడ నీ మంత్రమును గ్రహింపరు. నీవే జగత్కర్తవు కనుక ఆత్మారాముడవు కనుక అన్నిచోట్ల అన్ని దేహముల యందును సర్వరూపములు గలవాడవై స్త్రీలకు పూజ్యుడవగుదువు. నీకు ప్రత్యక్షముగా కాక అన్యదేవతల పూజయందే నీ పూజ ఇకముందు జరుగును.

తదా మమాజ్ఞయా బ్రహ్మా స్నాత్వా చ జాహ్నవీ జలే

శీఘ్రం జగామ గోలోకం మాం ప్రణమ్య జగద్గురుః

 తే దేవా మునయః సర్వే ప్రజగ్ముః స్వాలయం ముదా

సునిర్మలం మమ యశో గాయంతశ్చ పునః పునః

వీధిరాగత్య గోలోకం సంప్రాప్య భారతీం సతీం

సర్వ విద్యాధి దేవీం తాం మద్వక్త్రాబ్జ వినిర్మితాం

 వాగీశ్వరీం చ సంప్రాప్య బ్రహ్మా ప్రముదితః స్వయం

కామాస్త్రాణాం చ వ్యాపారమునుమేనే స్వయం విభుః

తత ఆగత్య మాం నత్వా ప్రాప్య త్రైలోక్య మోహినీం

క్రీడాం చకార భగవాన్ స్థానే స్థానేతినిర్జనే

రతిం చిరతరం కృత్వా వీరరామ స్వయం వీధీ:

వాగీశ్వరీమువాచేదం త్వం వై బ్రహ్మా చ కర్మణా

అప్పుడు నా ఆజ్ఞచేత బ్రహ్మ గంగా జలములో స్నానమాడి నాకు నమస్కరించి శీఘ్రముగా గోలోకమున కేగెను. అక్కడి దేవతలు మునులందరు పవిత్రమైన నా కీర్తిని మాటి మాటికి పాడుకొనుచు తమ తమ స్థానముల కెగిరి. బ్రహ్మ గోలోకమును జేరి నా ముఖ పద్మము నుండి సృష్టింపబడినదియు సర్వవిద్యలకు అధిదేవతయు వాగీశ్వరీయు ఐసీ భారతీ సతిని {సరస్వతిని} పొంది మిక్కిలి మోదము పొందిన వాడై మన్మథుని అస్త్రముల యొక్క వ్యాపారమును స్వయముగా అంగీకరించెను. అక్కడి నుండి వచ్చి నాకు నమస్కరించి ఏకాంత ప్రదేశములందక్కడక్కడ ఆ త్రైలోక్య మోహినితో ఆ భగవానుడు (బ్రహ్మ) క్రీడించెను. చాలకాలమామెతో రమించి తృప్తి చెందిన బ్రహ్మ వాగీశ్వరితో ఇట్లు పలికెను.

కాచిత్స్వకర్మణా సాధ్వీ పూజ్యా చ స్థిర యౌవనా

తవైవ కర్మయోగేన యువానం వశ్య నుందరి

విదగ్ధాయా విదగ్ధేన సంగమో గుణవాన్భవేత్

జరాఽతురోఽహం వృద్ధశ్చ తపస్వీ వైష్ణవో ద్వీజః

అస్వతంత్రః పరాధీన: కా రతిః పుంశ్చలీషు మే

 ఆ జగామ బ్రహ్మలోకం పునరేవ నిజాలయం

ఒక సాధ్వి తన నుకృత బలము చేత స్థిరమైన యావసము గలదియు పూజ్యురాలును అగును. నీ కర్మ విశేషము చేత ఓ సుందరీ! యువకుని {సన్ను) చూడుము. కామక్రీడయందు నైపుణ్యము గల స్త్రీకి అదే నేర్పు గల పురుషునితో సంగమించుట గుణవంతముగా నుండును. ముసలితనము చేత బాధపడు వృద్దుడను తపస్విని విష్ణుభక్తుడను విప్రుడను. వ్యవహారములో అస్వతంత్రుడను. ధర్మమునకు భగవంతునకు అధీనుడను. అట్టి నాకు జారీణులయందు ఆసక్తి ఎక్కడిది?” అని పలికి బ్రహ్మ ఆమెతో కూడి తిరిగి తన లోకమును చేరవచ్చెను.

దదృశుర్భ్రహ్మ లోకస్థాస్తాం దేవీం కౌతుకాన్వితా:

ఆతీవ సుందరీం రమ్యాం శుభ్రవర్ణాం చ సస్మితాం

శరచ్చితాంశు వదనాం శరత్పంకజ లోచనాం

 పక్వ బింబ ప్రభాముష్ట దీప్తౌష్టాధర పల్లవాం

ముక్తాపంక్తి వినింద్యైక దంతపంక్తి మనోహరాం

రత్నకేయూర వలయ రత్ననూపుర శోభితాం

రత్నకుండల యుగ్మేన కర్ణమూల విరాజితాం

రత్నేంద్ర సార హారేణ వక్షస్థల సముజ్జ్వలాం

వహ్ని శుద్ధాంశుకం సూక్ష్మం బిభ్రతీం నవయౌవనాం

ఆతీవ కమనీయాం చ పీన శ్రోణి పయోధరాం

 వీణా పుస్తకహస్తాం చ వ్యాభ్యా ముద్రాకరాం వరాం

తే చ నిర్మంభనం కృత్వా చక్రుః పరమ మంగలం

బ్రహ్మలోక వాసులు తెల్లని వస్త్రముతో చిరునవ్వుతో రమణీయముగా నున్న మిక్కిలి సౌందర్యవతియగు ఆ దేవిని మిక్కిలి ఆసక్తితో దర్శించిరి. ఆ దేవి శరదృతువునందలి చంద్రుని వంటి ముఖమండలము శరత్కాల పద్మముల వంటి నేత్రములు పండిన దొండపండు యొక్క కాంతినపహరించు చిగురు వంటి పెదవి కలిగి ముత్యములను తిరస్కరించు మనోహరమైన పలువరుసతోను రత్నాల దండకడియములు కంకణములు రత్ననూపురముల (కాలిఅందెలు తోసు ప్రకాశించుచుండెను. చెవులకు రత్నకుండలము వక్షస్నలమున శ్రేష్ఠమైన రత్నాల హారము ప్రకాశించుచుండెను. అగ్ని వర్ణము గల సన్నని వస్త్రము ధరించి పుష్టిగా నున్న పీరుదులు స్తనమండలము గల సవ యావనవతి భక్తమనోహారిణియై వీణను పుస్తకమును వ్యాఖ్యానముద్రను ధరించిన హస్తములతో నున్న సరస్వతీ దేవిని దర్శించి ఆ బ్రహ్మలోకవాసులు మిక్కిలి మంగళకరముగా స్వాగత మిచ్చిరి.

పురీం ప్రవేశయామాసుర్ర్బహ్మాణం భారతీం ముదా

బ్రహ్మా తయా సహక్రీడాం చకార స దీవానిశం

 అతీవ సుఖ సంభోగే నిమగ్నః సతతం ముదా

గూడం సర్వపురాణేషు కిం పునః శ్రోతు మిచ్ఛసి

బ్రహ్మను భారతీదేవిని వారు పట్టణమున ప్రవేశ పెట్టిరి, బ్రహ్మ ఆమెతో మిక్కిలి సుఖసంభోగమున మునిగి రేయిపగలు ముదముగా క్రీడించెను. ఈ విషయము పురాణములలో రహస్యమైనది. రాధా! ఇంక ఏమి వినగోరుదువు? అని కృష్ణుడు పలికెను

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :

ప్రాణేశ వచనం శ్రుత్వా ప్రహస్య పరమేశ్వరీ

 భూయోఽపి  పరిపప్రచ్ఛ కౌతుకాన్మానసం పురా

ప్రాణనాథుని మాట విని పరమేశ్వరి ఐన రాధాదేవి ఆ సరస వృత్తాంతమునకు నవ్వి మనస్సున ఇంకను తెలిసికొనవలెనన్న ఆసక్తి గలదై తిరిగి ప్రశ్నించెను.

శ్రీరాధికోవాచ - శ్రీరాధాదేవి పలికెను :

బ్రహ్మా కథం న జగ్రాహ వేశ్యాం స్వయముపస్థితాం

 న కర్మక్షేత్రే రహసి ఫలదాతా చ కర్మణాం

ఉపస్థితాయాస్త్యాగి చ మహాస్ దోషో హీ యోషితః

జ్ఞాత్వా దేవో విధాతా స కథం తత్యాజ మోహినీం

కర్మ క్షేత్రమైన భూమండలమున జీవులొనర్చిన కర్మలకు ఫలము నీచ్చువాడైన బ్రహ్మ కర్మ క్షేత్రముగాని దేవలోకమున రహస్య ప్రదేశమున స్వయముగా తనను జేరవచ్చిన వేశ్యనెందుకు స్వీరించలేదు. చేరవచ్చిన స్త్రీని (కోరి వచ్చిన దానిని) త్యజించుట మహాదోషమన్న ప్రసిద్ధ విషయము నెరిగి కూడ ఆ సృష్టికర్త మోహినిని ఎందుకు త్యజించెను ?

శ్రీ నారాయణ ఉవాచ - నారాయణ ముని పలికెను:

రాధికా వచనం శ్రుత్వా ప్రహస్య మధుసూదనః

పాద్మకల్సస్య వృత్తాంతమువాచ పరమేశ్వరీం

ఆ శ్రీహరి రాధాదేవి మాటకు నవ్వి ఆ ప్రశ్నకు మూలకారణమైన వృత్తాంతమును పాద్మకల్పమునకు సంబంధించిన కథను రాధాదేవికి చెప్పెను.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లు పలికెను :

శ్రుణు కాంతే ప్రవక్ష్యామి పురా వృత్తాంతమీప్సితం

అకథ్యం గోపనీయం చ మహతామభినిందితం

ఏకదా చ ప్రజాః స్రష్టుం విధాతా ప్రేరితో మయా

స్ససర్జ మనసా పుత్రాన్ జ్వలతో బ్రహ్మతేజసా

సనకం చ సనందం చ సనాతనమనుత్తమం

 సనత్కుమారం వోడుం చ కవిం పంచశిఖం విభుం

అసీతం కపీలం సిద్ధం సిద్ధాన్మము కులోద్భవాన్

తాన్నగ్నాన్ పంచవర్షియాన్ పితా స్రష్టుం జగాద హ

ప్రజాః స్రష్టుం ప్రేరకం చ జనకం తేఽవమన్య చ

ప్రజగ్ముస్తవసే తూర్ణం మమార్చన పరాయణాః

ఓ ప్రియురాలా! నీచేత కోరబడిన ఆ వృత్తాంతమును పూర్వము జరిగిన దానిని చెప్పగూడని రహస్యమును గొప్పవారు మిక్కిలి నిందించిన దానిని చెప్పుచున్నాను వినుము. బ్రహ్మ ఒకసారి ప్రజాసృష్టికి ప్రేరణను పొంది - బ్రహ్మతేజస్సుతో ప్రకాశించెడి పుత్రులను మనస్సంకల్పముతోనే సృష్టించెను. సనకుడు సనందుడు సనాతనుడు సనత్కుమారుడు వోడుడు కవి పంచశిఖుడు అసితుడు కపిలుడు అను సిద్ధులు వారు. వారినట్లు సృష్టించిన బ్రహ్మ ఐదు సంవత్సరముల వయస్సులో నగ్నరూపములతో నున్న వారిని చూచి మీరు ప్రజలను సృష్టించుడని పలికెను. అట్లు ప్రజా సృష్టిచేయుమని ప్రేరేపించిన తండ్రిని నాయొక్క ధ్యానార్చనల యందే ఆసక్తి గలవారు తండ్రిమాట కాదని అగౌరవపరచి వెంటనే తపస్సు చేయుట కొరకు వెడలిపోయిరి.

తదా రుష్టో జగద్ధాతా పునః పుత్రోన్ వినిర్మమే

రుద్రానేకాదశ వరాన్ రుదతో భీమ విగ్రహాన్

తస్మిన్ ప్రయుజ్య తరసా పునః పుత్రాన్ వినిర్మమే

 యోగీ యోగేన మాం ధ్యాత్వా స్వాత్మారామః న్వవిగ్రహే

వసిష్ఠం పులహం చైవ క్రతుమంగిరసం తథా

భృగుమత్రిం పులస్త్యం చ దక్షం కర్దమ మేవ చ

మరీచిం చ వినిర్మాయ ప్రజాం స్రష్టుం నియుజ్య చ

 ప్రహృష్ట మాననః పుత్రం కన్యామేకాం ససర్జ హ

అప్పుడాస్థితికి కోపము పొందిన బ్రహ్మ మరల ఏకాదశ రుద్రులను సృష్టించేను. వారు భయంకరాకారములతో రోదించుచు జన్మించిరి. వారిని సృష్టి కార్యమందు నియమించి వెంటనే మరల ధ్యాసయోగముతో ధ్యానించి తన ఆత్మయందే ఆనందించునతడు తన శరీరము నుండి పుత్రులను సృష్టించెను. వారు వసిష్టుడు పులపోడు క్రతువు అంగిరసుడు భృగువు అత్రి పులస్త్యుడు దక్షుడు కర్దముడు మరీచి అనువారు. వారిని గూడ ప్రజా సృష్టికి ఆజ్ఞాపించి సంతుష్ట మనస్సుతో ఒక పుత్రుని ఒక కన్యను సృష్టించెను.

కృష్ణస్య కామినః పుత్రః కామదేవో బభూవ హ

 కన్యా షోడశ వర్షియా రత్నభూషణ భూషితా

ఉవాచ పుత్రం స విధిః సుదీప్తం పురతః స్థితం

 దుర్నివార్యం మత్కలాంశం స్వాత్మారామం మనోహరం

ఆ పుత్రుడే కామదేవుడు. అతడు పుత్రవాంఛగల కృష్ణునకు (అవతార కాలములో} పుత్రుడై జన్మించెను. ఆ కన్య రత్నాభరణములతో అలంకరింపబడినదై పదహారు సంవత్సరముల వయస్సు కలదై యుండెను. ఇతరుల మనస్సును హరించగలవాడు తనయందే తానానందించువాడు నా కళ యొక్క అంశతో జన్మించినవాడు వారింప శక్యము గానీ శక్తి గలవాడై తనముందు మిక్కిలి ప్రకాశించుచున్న ఆ కుమారుని చూచి బ్రహ్మ ఇట్లు పలికెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మ నలికెను :

స్త్రీపుంసో: క్రీడనార్థాయ ముదా త్వం చ వినిర్మితః

హృష్టి యోగేన సర్వేషామధిష్టానం కరిష్యసి

సమ్మోహనం సముద్వేగం బీజస్తంభిత కారణం

ఉన్మత్త బీజం జ్వలదం శశ్వచ్చేతన హారకం

ప్రగృహ్యైతాన్మయా దత్తాన్ సర్వాన్ సమ్మోహనం కురు

 దుర్నివార్యో మమ వరాద్భవ వత్స భవేషు చ

బాణాన్ దత్వైవముక్త్వా చ ప్రహృష్టశ్చ జగద్విధి:

 దృష్వోవాచ దుహితరం వరం దాతుం సముద్యతః

నీవు నా చేత స్త్రీపురుషుల యొక్క సుఖక్రీడ కొరకు ముదముతో సృష్టింపబడితివి. హర్షము కూర్చుట చేత అందరియందు అధివసించి ఉందువు. సమ్మోహనము మిక్కిలి ఉద్వేగకరము బీజస్తంభ కారణము ఉన్మత్త బీజము జ్వలదము మాటి మాటికీ చైతన్యమును హరించునది అనెడి నాచేత ఈయబడు ఈ శరములను స్వీకరించి సర్వ జీవులను సమ్మోహము పొందునట్లు చేయుము. నా వరము వలన లోకముల యందు నీవు నివారింప శక్యము కాని వాడవగుదువవు. ఇట్లు పలికి మిక్కిలి హర్షించి జగత్కర్త అతనికి బాణము లిచ్చి తన ముందున్న బిడ్డను చూచి వరమీయ బూని ఇట్లు పలికెను.

ఏతస్మిన్నంతరే కామో మనసాఽలోచ్య మంత్రణం

కర్తుం శస్త్ర పరీక్షాం చ బాణాంశ్చిక్షేప బ్రహ్మణి

 మంత్రపూతైశ్చ బాణైశ్చ దుర్వార్యైః స్మరణేన చ

అతివిద్ధో మహాయోగీ మూర్చితో హత చేతనః

 క్షణేన చేతనాం ప్రాప్య దదర్శాగ్రే చ కన్యకాం

తాం సంభోక్తుం దనశ్శక్రే సా దుద్రావ భియా సతీ

ఇంతలో మన్మథుడు మనస్సులో ఒక ఆలోచన చేసి తన (బ్రహ్మ ఇచ్చిన) శస్త్రములను (వాటి శక్తిని) పరీక్షించుటకుగాను బ్రహ్మపై మంత్రపూతములైన - సహింపరాని వీర్యము (శక్తి) గల బాణములను స్మరించి ప్రయోగించెను. మహాయోగియైన బ్రహ్మ వాటిచేత మిక్కిలి కొట్టబడి చైతన్యము నశించి మూర్ఛిల్లెను, ఒక క్షణము తరువాత తిరిగి చైతన్యము పొంది (స్మృతికి వచ్చి) తన ముందున్న కన్యను చూచి ఆమెను సంభోగించుటకు మనస్సు పడెను తలచెను) ఆ సాధ్వీ భయముతో పరిగెత్తెను.

దృష్ట్వా పశ్చాచ్చ పితరం ధావంతం హతచేతనం

జగామ శరణం శీఘ్రం భ్రాతౄణాం చ తపస్వినాం

తే తాం సమీపే సంస్థాప్య తమూచు: పీతరం కృధా

హితం తథ్యం చ వేదోక్తం నీతిసారం వరం వచః

వివేకము నశించి తన వెనుక పరిగెత్తుచు వచ్చుచున్న తండ్రిని చూచి ఆమె శీఘ్రముగా తపస్వులైన అన్నలను శరణు పొందెను. వారామెను తమ దగ్గర ఉంచుకొని కోపముతో హితము సత్యము వేదోక్తము నీతిసారము శ్రేష్ఠమునైన వాక్యమును తండ్రితో ఇట్లు పలికిరి.

ఋషయ ఊచుః - అమలు పలికిరి :

అహో కిమేతజ్ఞనక కర్మ తేఽతి విగర్హితం

నీచానాం చరితం యత్తత్కరోషి త్వం జగద్విధే

పశ్యంతి సతతం సంతః ప్రసూమివ పరస్త్రియం

యే తే నర్వత్ర పూజ్యశ్చ పరత్రేహ జితేంద్రియాః

త్వం స్వయం వేదకర్తా చ కన్యాం సంభోక్తుమిచ్ఛసి

కన్యా చ మాతృ వర్గేషు ప్రవిష్ఠా చ శ్రుతో శ్రుతా

 తండ్రీ! ఏమి ఈ ఆశ్చర్యము. నీవు చేసెడి పని మీక్కిలీ నిందింపదగినదిగా నున్నది. ఓ జగత్కర్తా! నీవు చేయు పని నీచులొనర్చునది. ఎవరు పరస్త్రీని కన్నబిడ్డవలె చూతురో ఆ సత్పురుషులు జితేంద్రియులు కనుక ఇహ పరలోకములందు అంతట పూజ్యులగుదురు. నీవు వేదశాస్త్రకర్తవు. స్వయముగా కన్నకూతురును సంభోగింపగోరుచున్నావు! కన్నకూతురు మాతృ వర్గములో ప్రవేశించినట్లు (చేర్చినట్లు! వేదమునందు చెప్పబడినది.

గురోః పత్నీ రాజపత్నీ విప్రపత్నీ చ యా సతీ

పత్నీ చ భ్రాతృ సుతయోర్మిత్ర పత్నీ చ మాతరః

ప్రసూః పిత్రోస్తథా భ్రాతుః పత్నీ శ్వశ్స్రూః స్వకన్యకాః

జననీ తత్సపత్నీ చ భగినీ సురభీ తథా

 స్వాభీష్ట సురపత్నీ చ ధాత్రికాఽన్న ప్రదాయికా

 గర్భధాత్రీ స్వనామ్నా చ భయ త్రాతుశ్చ కామినీ

 ఏతా వేదప్రణీతాశ్చ సర్వేషాం మాతరః స్మృతాః

ఏతాన్వపి చ నర్వాసు న్యూనతా నాస్తి కాసు చ

గురువు భార్య, రాజుభార్య, బ్రాహ్మణుని భార్య, అన్న భార్య, పుత్రుని భార్య, మిత్రుని భార్య, తల్లిదండ్రులను గన్న స్త్రీ, మేనత్త, అన్నకూతురు, భార్యను గన్న తల్లి, తన పుత్రికలు, కన్నతల్లి, సవతి తల్లీ, ఆడ తోబుట్టువు {అక్క, చెల్లెలు), కామధేనువు {దేవతాధేనువు), తనకు నచ్చిన దైవము యొక్క భార్య, చిననాడు పెంచిన దాది, అన్నము పెట్టి ఆదుకొన్న స్త్రీ గర్భము ధరించిన స్త్రీ, తన పేరు గల స్త్రీ, ప్రాణ భయము నుండి రక్షించిన వాని భార్య, వీరందరు కూడ జనులందరికి తల్లులనీ వేదమందు చెప్పబడిరి. వీరందరిలో ఎవరును తక్కువవారు కారు.

కన్యాదాతాఽన్న దాతా చ జ్ఞానదాతాఽభయ ప్రదః

జన్మదో మంత్రదో జ్యేష్ఠ భ్రాతా చ పితరః స్మృతాః

ఏతా వహంతి యే మూఢ య ఏతాన్ జనకానపి

 పచ్యంతే నరకే తే చ యావద్వై బ్రహ్మణో వయః

తానంధకూపే సంస్థావ్య దూరతో యమకింకరాః

కుర్వంతి తాడనం శశ్వత్పురీషం పాయయంతి చ

తనకు కన్యాదానము చేసినవాడు, అన్నము పెట్టినవాడు, జ్ఞానదానము చేసినవాడు, ఆపత్కాలమున అభయమిచ్చి రక్షించినవాడు, కన్నతండ్రి, మంత్రోపదేశము చేసినవాడు, పెద్ద అన్న వీరు తండ్రులని చెప్పబడిరి. ఏ మూఢులు ఫైన చెప్పబడిన మాతృ వంశములోని వారిని వివాహమాడుదురో {కామింతురో, ఎవరు ఈ తండ్రులను అవమానింతురో వారు ఒక బ్రహ్మ జీవితకాల పర్యంతము నరకబాధలనుభవింతురు. వారిని యమదూతలు అంధకూప నరకములో నిలిపి దూరము నుండియే తాడింతురు (కర్రలతో కొట్టుదురు) మల మూత్రములను త్రాగింతురు.

త్వమేవ విశ్వకర్తా చ శాస్తా వై శమనన్య చ

న్వయం విధాతా జగతాం తేన గృహ్ణాసి కన్యకాం

అస్మాకం పురతో దూరం గచ్చ కామార్తమానస

న కుర్మో భస్మసాత్కర్తుం శక్తాశ్చ జనకం వయం

 గురోర్దోష సహస్రాణి క్షంతుమర్హంతి పండితాః

సర్వఘ్నం తం వినిఘ్నంతి నీతిజ్ఞా: స్వగురుం వినా

గృహ్ణాంతి యది సర్వస్వం శపంతం నిష్ఠురం గురుం

 సాధపస్తం న నిందంతీ ప్రణమంతి స్వ భక్తిత:

యే ద్విషంతి చ నిందంతీ గురుమిష్టం సురాత్పరం

పచ్యంతే తేంఽధకూపే చ యావచ్చంద్ర దీవాకరౌ

పురీషం భుంజతే నిత్యం క్షుభితా యమ తాడనైః

సర్ప ప్రమాణ కీటైశ్చ దంశితాశ్చ దీవానీశం

ఇత్యేవముక్త్వా మునయః ప్రణేముస్తత్పదాంబుజం

సర్వం భవతి దైవేన ప్రశాంత మనసా ధ్రువం

 ఉన్ముఖా మునయః సర్వే బభూవుశ్చ స్వకర్మణి

నీవు విశ్వకర్తవు. మయుని గూడ శాసించువాడు. జగత్తుల యొక్క విధాతవు. ఆ కారణము చేతనే స్వయముగా నీ కన్న కూతురును పట్టుకొనుచుంటివి. ఓ కామరోగపీడితుడా! మా ముందునుండి దూరముగా బొమ్ము. నిన్ను భస్మమొనర్చు శక్తి గలవారమై కూడ మేము తండ్రివైన నిన్నట్లు చేయుము. పండితులు గురువు యొక్క వేయి దోషములను క్షమింతురు (ఓర్చుకొందురు). నీతిజ్ఞులు తమ గురువు తప్ప ఇతరుడివడైన సర్వధర్మములను నాశమొనర్చునేని వానిని నౌశము చేయుదురు. తమ సర్వస్వము స్వీకరించినను, నిష్ఠురముగా శపించినను (నిందించిసను) సాధువులు తమ గురువును భక్తితో నమస్కరింతురు గాని నిందింపరు. దేవతల కంటే శ్రేష్ఠుడైన గురువును ఎవరు ద్వేషింతురో ఎవరు నిందింతురో వారు సూర్య చంద్రులున్నంత వరకు అంధకూపీ నరకములో పాపమనుభవింతురు. యముని దెబ్బలతో మనస్సులో క్షోభ పొంది రాత్రింబగళ్లు సర్పము లంత పెద్దగా నున్న క్రిమి కీటముల చేత కరువబడుదురు. మలమును భుజింతురు. ఇట్లు పలికీ మునులు అతని పాద పద్మములకు నమస్కరించిరి. అందరును దైవము వలన ప్రశాంతమైన మనస్సు గలవారగుదురు. ఇట్లు పలికి మునులు తమ కర్మయందు (తపస్సులో) ఉన్ముఖులైరి (తపస్సునకేగిరి).

బ్రహ్మా శరీరం సంత్యక్తుం వ్రీడయా చ సముద్యతః

యోగేన భిత్వా షట్చక్రం సర్వాస్ ప్రాణాన్నిరుధ్య చ

బ్రహ్మరంధ్రం సమానీయ తత్యాజ సేన వర్త్మనా

మనసా శ్రీహరి స్మృత్వా నమస్కారం చకార హ

న మే మనః పరద్రవ్యే భవితా స్తోకమీశ్వర

ప్రాణత్యాగాత్పరం దుఃఖమయశశ్చ యశస్వినాం

బభూవ హృది కృత్వైకం బ్రహ్మా లీనశ్చ బ్రహ్మాణి

కన్యా తాతం మృతం దృష్ట్యా విలప్య చ భృశం ముహః

యోగేన దేహం తత్యాజ సా ప్రలీనా చ బ్రహ్మణి

మృతం తాతం చ భగినీం దృష్ట్వా చ మునిపుంగవా:

సన్మరుః శ్రీహరిo కోపాత్స్వాత్వారామం విలప్య చ

బ్రహ్మ తన ప్రవర్తనకు సిగ్గుపడి శరీరమును త్యజించుటకు పూనుకొనెను. సర్వప్రాణ వాయువులను నిరోధించి యోగశక్తితో షట్చక్రములను భేదించి బ్రహ్మరంధ్రమునకు జీవుని జేర్చి బ్రహ్మ రంధ్రమార్గముగా శరీరమును త్యజించెను. అంతకు ముందు మనస్సులో శ్రీహరిని తలచి నమస్కరించి "స్వామీ! అల్పముగా గూడ పరద్రవ్యమందు నామనస్సు పడకుండుగాక, కీర్తిమంతులకు ప్రాణ త్యాగము కంటే అపకీర్తి మిక్కిలి దుఃఖమైనది” అని హృదయమును స్థిరపరచుకొని ఆ బ్రహ్మ పరమాత్మ యందు లీనమయ్యేను. తండ్రి అట్లు మరణించుటను చూచి ఆ కన్య మాటి మాటికి మిక్కిలి విలపించి యోగశక్తితో దేహమును త్యజించి ఆమె కూడ పరబ్రహ్మమందు లీనమయ్యేను. తమ కోపము వలన తండ్రియు సోదరియు మరణించుట చూచి ఆ మునులు దు:ఖించి శ్రీహరిని స్మరించిరి.

నారాయణో మదంశశ్చ కృపయాఽగత్య సత్వరం

బ్రహ్మాణం జీవయామాన బ్రహ్మజ్ఞానాత్సుతాం చ తాం

బ్రహ్మా పురో హరిం దృష్ట్వా వరం వవ్రే న్మ వాంఛితం

భక్తిం తచ్చరణే శశ్వన్నిశ్చలామనపాయినీం

బ్రహ్మాణం విరసం దృష్ట్వా తమువాచ కృపానిధి:

ప్రబోధ వచనం సత్యం నీతిసారం మనోహరం

సో అంశ గల శ్రీమన్నారాయణుడు (వైకుంఠవాసుడు) త్వరగా కృపతో వచ్చి బ్రహ్మను అతని పుత్రికను బ్రదికించెను. బ్రహ్మ తనముందున్న శ్రీహరిని చూచి అతని పాదములయందు విడదీయరానీ నిశ్చల భక్తిని తన కోరికగా వరము కోరుకొనెను. సంతోష హీనుడై యున్న బ్రహ్మను చూచి దయానిధియైన స్వామి సత్యమును నీతిసారమునైన ఉపదేశ వాక్యమును మనోహరముగా ఇట్లు పలికెను.

శ్రీనారాయణ ఉవాచ - శ్రీమన్నారాయణుడు వల్కెను :

శ్రుణు బ్రహ్మన్ ప్రవక్షేఽహం ముఖముత్తోల్య సాంప్రతం

త్యజ లజ్ఞాం జగన్నాథ హృదయ జ్వరరూపిణీం

సత్కీర్తిరపకీర్తిరాజ సుప్రతిష్టాప్యుపద్రవః

క్షుద్రాణాం చైవ మహతాం భవత్యేవ న్వకర్మణా

సర్వేషామపి సర్వేభ్యః స్వకర్మ బలవత్తరం

తస్మా త్సంతః ప్రకుర్వంతి నిత్యం సత్కర్మ సంతతం

కేచిత్కుర్వంతి నిర్మూలం సర్వేషా మపికర్మణాం

కృతం కర్మపరం భుక్త్యా హరి పాదాబ్జ చేతసః

 కుకర్మణశ్చావకీర్తిస్తతో లజ్జా భవేద్రువం

 సుకర్మణః సుప్రతిష్ఠా సర్వత్ర నిర్మలం యశః

ఓ సృష్టికర్తా! బ్రహ్మా! నేను చెప్పుచున్న మాటను ముఖమెత్తి వినుము. హృదయమునకు తాపకారణమైన సిగ్గును త్యజింపుము. క్షుద్రులకు గొప్పవారికి అందరికిని సత్కీర్తిగాని అపకీర్తి గాని మంచి ప్రతిష్ఠగాని ఆపద గాని తమతమ కర్మచేతనే సంభవించుచున్నది. అందరికిని అన్ని కారణముల కంటే తాము చేసిన పుణ్యపాపకర్మయే మిక్కిలి బలమైనది. అందువలననే ఎల్లప్పుడు సత్పురుషులు శాశ్వతమైన సత్కర్మనే చేయుచున్నారు. కొంతమంది హరి పాద పద్మములందే మనస్సు గలవారు, తముచేత చేయబడిన బలవంతమైన కర్మఫలమును అనుభవించి సర్వకర్మలను నిర్మూలము (మిగులకుండ) చేయుచున్నారు. దుష్కర్మ వలన అపకీర్తియు సిగ్గును సంభవించుట నిశ్చయము. సత్కర్మ వలన మంచి ప్రతిష్ఠయు (గౌరవ మర్యాదలు} స్వచ్ఛమైన కీర్తియు అంతట ఏర్పడును.

కాలేన రజసా దేహో బలం రూపం శుభాశుభం

కీర్తిర్యా త్రిగుణా చైవ మోహశ్చాపయశో విధే

 ఋణ వ్రణాపవాదాశ్చ జంతూనాయాంతి కాలతః

మహతాం తౌ చ పూర్వోక్తౌ నేతరశ్చ కదాచన

సదాఽపకీర్తిర్వసతి పరస్త్రీషు చ వస్తుషు

తస్మాత్తే నైవ గృష్ణాంతి సంతః స్వక్లేశకారణే

స్మర మామంతరే బ్రాహ్మే మదీయం విషయం కురు

 ఆతస్తే న మనో లోలం భవతో పరవస్తుషు

ఓ విధీ! కాలమును బట్టి రజోగుణమును బట్టి బలము రూపము శుభాశుభకర్మలు సత్వరజస్తమోగుణ సంబంధమైన కీర్తియు అపకీర్తియు మోహమును సంభవించును. ఋణము ప్రణములు (గాయము} దోషము చేయకుండ ఆపవాదు కాలమును బట్టి ఏర్పడుచున్నవి. పైన చెప్పబడిన ఆ రెండు కారణములు తప్ప వేరొకటి ఏదియు లేదు. పరస్త్రీల యందును పరద్రవ్యములందును అపకీర్తి ఎల్లప్పుడు నివసించి యుండును. అందువలననే తమ దుఃఖములకు మూలములైన ఆ రెంటీని {పర స్త్రీ, పరద్రవ్యము) సత్పురుషులు స్వీకరించరు. ఓయీ! ప్రతిదినము బ్రాహ్మీముహూర్తములో నీ మనస్సులో నన్ను ధ్యానించుము. సాకు సంబంధించిన దానినే చేయుము. వినుము. దాని వలన నీ మనస్సు పరుల వస్తువుల మీదికి చలించదు.

యోషిద్రూపా చ మే మాయా సర్వేషాం మోహకారిణీ

లీలయా కురుతే మోహం స్వాత్మారామస్య సంతతం

నానా ముద్రాశ్రయే దేశే రాగిణాం సంతతం రతిః

స్తనాభిదే మాంసపిండేఽధరే లాలాలయే శచే

 శ్రోణీ వక్త్రస్తనం తాసాం కామదేవాలయం సదా

తస్మాత్తే నహీ పశ్యంతి సంతో హి ధర్మభీరవః

కో ధర్మః కిం యశస్తేషాం కా ప్రతిష్ఠా చ కిం తపః

కిం బుద్ధిర్విద్యా దానం చ పరస్త్రీషు చ యన్మనః

స్త్రీ రూపము ధరించిన నా మాయ సర్వజనులకు మోహము కల్గించునది. స్వాత్మారామునకు (యోగికి) కూడ ఎప్పుడు విలాసముగా మోహము పుట్టించును. స్త్రీలయొక్క అనేకములైన అవయవములయందు కామి జనమునకు ఎప్పుడును ఆసక్తి ఏర్పడుచుండును. స్తనములన్న పేర నున్న మాంసపు ముద్దల యందు అశుచియైన చోల్లుకు నిలయమైన క్రింది పెదవి యందును భోగాసక్తి పుట్టును. స్త్రీలయొక్క పిరుదులు ముఖము (నోరు) స్తనములు కామదేవునికి నివాస ప్రదేశములు. అందువలన ధర్మమునకు భయపడు సత్పురుషులు పరస్త్రీలను కన్నెత్తి చూడరు. ఎవని మనస్సు పరస్త్రీల యందు చిక్కుకొనునో వానికీక ధర్మమెక్కడిది? గౌరవ స్థానమెక్కడ? తపసెక్కడ? బుద్ధి గాని విద్యగాని దానమహిమ గాని ఎక్కడ నిలుచును?

ఇహాప్యపయశో దుఃఖం నరకేషు పరత్ర చ

వాసః ప్రహార స్తేషాం చ తాడనైః కృమిభక్షణైః

దు:ఖ బీజం సుఖం మత్వా మూడాశ్చ దైవదోషతః

 పరస్త్రీ సేవనం ప్రీత్యా కుర్వంతి నంతతం ముదా

 విపత్తిః సతతం తస్య పరవస్తుషు యన్మనః

విశేషతః పరస్త్రీషు నువర్ధేషు చ భూమిషు

దైవాత్పరస్త్రీయం దృష్ట్వా విరమేద్యో హరిం స్మరన్

దృష్ట్వా పరసువర్ణం చ హస్త ప్రక్షాళనాచ్ఛుచిః

సతతం నైవ సంసక్తాః సంత: స్వస్త్రీషు కామతః

యక్ష్మ వ్యాధి జ్ఞాన హాని లోక నిందా భయేన చ

ఈ లోకమున అపకీర్తి దుఃఖము పరలోకమున నరక వాసము యమకింకరుల దండనము క్రిములు కొరికి తినుట అను దుఃఖము పరస్త్రీ వ్యామోహ ఫలితములు. దైవము చెడ్డచూపు చూచుట వలన లేదా కర్మ దోషము వలన దుఃఖములకు కారణమునైన పరస్త్రీ సేవనమును మూడులు సుఖమని తలచి బుద్ధిపూర్వకముగా సంతోషముగా చేయుదురు. పరవస్తువుల యందు ఎపని మనస్సు తగులుకోనునో - అందులోను పరస్త్రీలయందు పరుల బంగారము నందు వరుల భూమి యందు వ్యామోహమెవనికి కలుగునో వాని కెల్లప్పుడు ఆపదలే సంభవించును. హఠాత్తుగా పరస్త్రీని చూచినవాడు శ్రీహరిని స్మరించి మనస్సును చూపును మరల్చుకొన్న యెడల పవిత్రుడగును. పర సువర్ణమును చూచి హస్త ప్రక్షాళనము (చేతులు కడుగుకొనుట) చేసికొన్నచో శుచి యగును. సత్పురుషులు వివాహమాడిన తమ స్త్రీయందు గూడ ఎల్లప్పుడు కామాసక్తులై ఉండరు. ఎడతెగని కామాసక్తి క్షయవ్యాధి జ్ఞానహానీ లోకనింద అను భయములకు కారణమగునని వారి అభిప్రాయము.

తపస్విన స్తపస్యాయాం శాస్త్ర చింతాసు పండితాః

యోగినో యోగ చింతాను వేదార్ధేషు చ వైదీకా:

 సాద్య్వశ్చ పతి సేవాసు గృహస్థా గృహకర్మసు

 విషయేషాం విషయణో మద్భక్తి మమ సేవనే

 ఏతే నియుక్తా ఏతేషు సభాను చ ప్రశంసితాః

 వేదోక్తాచరణేనైవ తద్విరుద్ధేన నిందితాః

సర్వే నిత్యం ప్రశంసంతి శశ్వత్సన్మార్గ గామినం

 హాలికా ఆపి నిందంతీ కువర్త్మ గామినం విధే

తపస్వులు తపస్సునందు, పండితులు శాస్త్ర విచారము నందు, యోగులు యోగ సంబంధమైన ఆలోచన యందు, వైదికులు వేదార్థమునందు, సాధ్వులు (ఉత్తమ శీలము గల స్త్రీలు) పతిసేవయందు, గృహస్థులు గృహకర్మల యందు, కాముకులు కామ సుఖము నందు, నా భక్తులు నన్ను సేవించుట యందు మనస్సు లగ్నము చేసి నలుగురు కూడి మాట్లాడుకొను సభలయందు ప్రశంసింపబడుదురు. వేదశాస్త్రములలో చెప్పబడిన ప్రకారము ఆచరించుట వలన ప్రశంసను, తద్విరుద్దముగా ప్రవర్తించిన యెడల నిందను పొందుదురు. ఎప్పుడును సన్మార్గమున ప్రవర్తించువారిని లోకజనులందరు ఎల్లప్పుడు ప్రశంసింతురు. దుష్టమైన మార్గములో నడచు వానిని నాగలి దున్నుకోను అజ్ఞానులు కూడ నిందింతురు.

భవితా న పరస్త్రీషు పర వస్తుషు తే మమః

అద్య ప్రభృతి జీవంతం నివిష్టం మద్వరేణ చ

మదీయ విషయే బాహ్యే మయా దత్తం కురు ప్రియం

అంతరా మత్పదాంభోజ చింతాం విఘ్న వినాశినీం

కన్యా భవతు మే బ్రహ్మన్ కామదేవస్య కామినీ

రతిర్నామ పరిత్యాజ్యా రత్యధిష్ఠాతృదేవతా

ఇత్యేవముక్త్వా బ్రహ్మాణమాశ్వాస్య కమలాపతిః

జగామ నిత్యం వైకుంఠం బృందావన వినోదనః

ఓ బ్రహ్మా! నా వరము వలన మరల శరీరమున ప్రవేశించి జీవించుచున్న నీకు పరస్త్రీల యందుగాని పరద్రవ్యము నందుగాని ఈనాటి నుండి మనస్సు తగుల్కొనదు. నేనిచ్చిన ఈ వరము వలన నా విషయమును ధ్యానించి నాకు ప్రియము చేయుము. బాహ్యమైన ఇతర విషయము సంభవించినప్పుడు సమస్త విఘ్నములను నశింపజేయు నా పాద పద్మములను స్మరించి ధ్యానించుము. ఈ కన్య నాపుత్రుడగు కామదేవునికి రతీయను పేరుతో భార్యయే స్త్రీపురుషుల సంయోగసుఖములకు అధి దేవతయగును అని బృందావన వినోదియగు కమలాపతి {శ్రీమన్నారాయణుడు బ్రహ్మతో పలికి ఓదార్చి తన నిత్యనివాసమైన వైకుంఠమున కేగెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే రాధాకృష్ణ నంవాదో నామ పంచత్రింశోఽధ్యాయః.

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన రాధాకృష్ణ సంవాదమను కథా భాగము గల ముప్పది యైదవ అధ్యాయము సమాప్తము.