మూII శ్రీనారాయణ ఉవాచ:
శచీస్తోత్రం సమాకర్ణ్య పరితుష్టో బృహస్పతిః ।
ఉవాచ మధురం శాంతః కాంతామింద్రస్య నారద ॥
ధురం శాంతః కాంతామింద్రస్య నారద ॥
బృహస్పతి రువాచ:
త్యజ వత్సే భయం సర్వం భయం కిం తే మయిస్థితే ।
యథా కచస్య పత్నీ మే తథా త్వమపి శోభనే!!
యథా పుత్రస్తథాశిష్యో న భేదః పుత్రశిష్యయోః ।
తర్పణే పిండదానే చ పాలనే పరితోషణే ॥
యథాఽగ్నిదాతా పుత్రశ్చ తథాశిష్యశ్చ నిశ్చితం ।
ఇతీదం కణ్వశాఖాహమువాచ కమలోద్భవః ॥
పితా మాతా గురుర్భార్యా శిశుశ్చానాథ బాంధవాః ।
ఏతే పుంసాం నిత్యపోష్యా ఇత్యాహ కమలోద్భవః ॥
యశ్చైతాంశ్చ న పుష్ణాతి భస్మాస్త్రం తస్య సూతకం ।
దైవే పిత్ర్యే న కర్మార్హః సోఽపీత్యాహ మహేశ్వరః ॥
కురుతే నరబుద్ధించ మాతరం పితరం గురుం ।
అయశస్తస్య సర్వత్ర విఘ్న ఏవ పదే పదే ॥
సంపన్మత్తో యః కరోతి స్వగురోశ్చ పరాభవం ।
అచిరాత్సర్వనాశశ్చ భవేత్తస్య సునిశ్చితం ॥
మాంచ దృష్ట్వా సభామధ్యే నోత్తస్థౌ పాకశాసనః ।
తత్ఫలం భుజ్యతే సాక్షాత్ సద్యః పశ్యచ సాంప్రతం॥
అహం కరోమి మోక్షంచ తవ రక్షాం సునిశ్చితం ।
శాసితుం రక్షితుం శక్తః స ఏవ గురురుచ్యతే ॥
న పశ్యతి సతీత్వంచ హృచ్ఛుయాశ్చయోషితః ।
యన్మాన సే వికల్పశ్చతస్య ధర్మశ్చ నశ్యతి ॥
భవిష్యతి ప్రభావస్తే దుర్గాయాశ్చ సమః ప్రతి ।
లక్ష్మీ సమా ప్రతిష్టాచ యశస్తద్యశసా సమం॥
సౌభాగ్యం రాధికాతుల్యం తత్సమం ప్రేమ భర్తరి ।
తత్తుల్యం గౌరవం మాన్యం ప్రీతిః ప్రాధాన్యమీశ్వరీ ॥
రోహిణ్యాశ్చ సమాపేక్షా పూజ్యాచ భారతీ సమా ।
శుద్ధ నిరుపమా శశ్వత్ సావిత్రీ సదృశీసదా ॥
శ్రీమన్నారాయణుడిట్లన్నాడు: శచీస్తోత్రమును విని బృహస్పతి ఆనందించి, మధురంగా, శాంతుడై ఇంద్రుని భార్యతో ఇట్లా అన్నాడు, ఓ నారద! (1) బృహస్పతి వచనమిట్లా - ఓవత్స! భయాన్ని అంతా వదిలి పెట్టు. నేనుండగా నీకు భయమెందుకు. కచుని భార్యనాకు ఎట్లాగో నీవు కూడా అట్లాగే ఓ శోభన! (2) పుత్రుడెట్లాగో శిష్యుడట్లాగే, పుత్రశిష్యులకు భేదం లేదు, తర్పణ మందు, పిండదానమందు,పాలనమందు, సంతోష పెట్టుట యందును. (3) పుత్రుడు ఎట్లా అగ్నిదాతనో అట్లాగే శిష్యుడు కూడా నిశ్చయము, అని దీనిని కణ్వశాఖ యందు బ్రహ్మచెప్పాడు. (4) తండ్రి తల్లి, గురువు, భార్య, శిశువు, అనాథ, బాంధవులు, వీరిని పురుషుడు ఎల్లప్పుడు పోషించాలి, అని బ్రహ్మ అన్నాడు. (5) ఎవడైతే వీరిని పోషించడో, వాడికి బూడిదయ్యేదాక (తాను) సూతకము. దైవ, పితృకర్మలందు కర్మారుడుకాడు, వాడు కూడా అని మహేశ్వరుడన్నాడు. (6) తల్లి దండ్రులను గురువును మనుష్యమాత్రులుగా తలచేవానికి అంతటా అపకీర్తి, అడుగడుగునా విఘ్నమే. (7) సంపదవల్ల మత్తుడై ఎవడు తన గురువును అవమానిస్తాడో, వానికి త్వరలోనే సర్వనాశమౌతుంది, నిశ్చయము. (8) సభామధ్యలో నన్నుచూచి ఇంద్రుడులేవలేదు. ఆ ఫలితాన్ని సాక్షాత్తుగా అనుభవిస్తున్నాడు, అప్పుడే. ఇప్పుడు చూడు. (9) ఆతనికి విముక్తిని కల్గిస్తాను నేను. నీకు రక్షణను కూడా. నిశ్చయమిది. శాసించటానికి, రక్షించడానికి ఎవడు సమర్థుడో వాడే గురువు అనబడుతాడు. (10) హృదయంలో శుద్ధమైన స్త్రీ యొక్క సతీత్వమును చూడని వానికి, ఎవని మనస్సులో వికల్పముంటుందో వాని ధర్మము నశిస్తుంది. (11) ఓ సతి! నీ ప్రభావము, దుర్గప్రభావంతో సమమౌతుంది. లక్ష్మితో సమానమైన ప్రతిష్ఠ, కీర్తి కూడా ఆమె కీర్తితో సమంగా కల్గుతుంది. (12) సౌభాగ్యం రాధికకువలె సమానంగా, భర్తయందు ప్రేమ ఆమె సమంగా, కల్గుతుంది. ఈశ్వరుని యందు ఆమెకు వలె సమానంగా గౌరవం, మాన్యత, ప్రీతి, ప్రాధాన్యము కల్గుతాయి. (13) రోహిణితో సమానమైన అపేక్ష భారతికి గల పూజ్యతతో సమమైన పూజ్యత, ఎల్లప్పుడు సావిత్రికి సదృశ్యమైన శుద్ధత, నిరుపమానత్వము శాశ్వతంగా కలుగాయి (14)
మూII ఏతస్మిన్నంతరే తత్ర ఆగతోనహుషాచ్చరః ।
ఉవాచ వచనం భీతో నాక్సతేర్థోచరేతతః ॥
దూత ఉవాచ :
ఉత్తిష్ఠ దేవి శ్రీఘ్రం త్వం గచ్ఛస్వ నహుషం ప్రతి ।
క్రీడా కర్తుంచ రహసి రమ్యే నందనకాననే ॥
దూతస్య వచనం శ్రుత్వా తమువాచ బృహస్పతిః ।
కంపితావయవః కోపాద్రక్తపంకజలోచనః ॥
గురురువాచ :
నహుషం వద గత్వా త్వం శచీం చేద్భోక్తు మిచ్చసి ।
అపూర్వం యానమారుహ్య నిశాయామాగమిష్యసి ॥
సప్తర్షిణాంచ స్కంధేచ దత్వా స్వశిబికాం శుభాం ।
తామారుహ్య సువేషశ్చ గమనం కర్తు మర్హసి ॥
వాక్పతేర్వచనం శ్రుత్వా గత్వోవాచ నృపంతదా ।
దూతస్య వచనం శ్రుత్వా ప్రహస్యోవాచ కింకరం ॥
గచ్చ గచ్చ త్వరన్ గచ్చ సప్తరీన్ శీఘ్రమానయ ।
ఉపాయంచ కరిష్యామి తైః సార్థం సాంప్రతం చర ॥
నృపస్యవచనం శ్రుత్వాగత్వా దూతస్తదంతికం ।
ఉవాచ సర్వాంస్తత్రైవ యథోక్తం నహు పేణ చ ॥
దూతస్య వచనం శ్రుత్వా యయుః సప్తర్షయో ముదా ।
రాజా దృష్ట్వాచ తాన్సర్వాన్ననామోవాచ సాదరం ॥
నహుష ఉవాచ :
యూయంచ బ్రహ్మణః పుత్రాః జ్వలంతో బ్రహ్మతేజసా ।
బ్రహ్మణః సదృశాః సర్వేసతతం భక్తవత్సలాః ॥
నారాయణపరాః శశ్వచ్ఛుద్ధ సత్వస్వరూపిణః ।
మోహమాత్సర్య హీనాశ్చ దర్పాహంకారవర్జితాః ॥
నారాయణసమాః సర్వై తేజసా యశసా సదా ।
గుణేన కృపయా ప్రేమ్ణా వరదానేన నిశ్చితం ॥
ఇత్యుక్త్వా ప్రణతో రాజా తుష్టావచ రురోదచ ।
దృష్ట్వా తే కాతరం భూపమూచుః పరహితైషిణః ॥
ఋషయ ఊచుః
వరం వృణీష్వ హేవత్స యత్తే మనసి వాంఛితం ।
సర్వం దాతుం వయం శక్తా నాసాధ్యం నశ్చ కించన ॥
ఇంద్రత్వం వా మనుత్వం వా చిరాయుర్వా తతః పరం ।
సప్తద్వీపేశ్వరత్వం చాప్యతీవ సుచిరం సుఖం ॥
అథాపి సర్వసిద్ధిత్వం సర్వైశ్వర్యం సుదుర్లభం ।
ముక్తింవా హరిభక్తింవా తపసాయా సుదుర్లభా ॥
కిమీప్సితం తేహేవత్స బ్రూహి నః సాంప్రతం ముదా ।
సర్వం తుభ్యం ప్రదాయైవ యాస్యామస్తపసే ముదా॥
యుగ లక్షసమం యచ్చ క్షణం కృష్ణార్చనం వినా ।
దుర్దినం దుర్దినం యత్తద్ ధ్యాన సేవన వర్జితం ॥
వినా తత్సేవనం యోహి విషయాన్యంచ వాంఛతి ।
విషమత్తి ప్రణాశాయ విహాయామృతమీప్సితం ॥
బ్రహ్మా శివశ్చ ధర్మశ్చ విష్ణుశ్చాపి మహాన్విరాట్ ।
గణేశశ్చదినేశశ్చ శేషశ్చసన కాదయః ।
ఏతేమచ్చరణాంభోజం ధ్యాయంతోఽహర్నిశం ముదా ।
జన్మమృత్యుజరావ్యాధిహరం తన్నిరతావయం ॥
తేషాంచ వచనం శ్రుత్వా తానువాచ నృపేశ్వరః ।
సలజ్జితో నమ్రవక్త్రో మాయామోహితమానసః ॥
ఇంతలో అక్కడికి నహుషుని దగ్గర నుండి దూతవచ్చాడు. ఆ పిదప భయపడుతూవాడు, బృహస్పతికి ఎదురుగా నిలబడి ఈ మాట చెప్పాడు. (15) దూత వచన మిట్లా: ఓదేవి ! త్వరగాలే నీవు నహుషుని దగ్గరకు వెళ్ళు. రమ్యమైన నందన కాననమందు రహస్యంగా క్రీడించడానికి వెళ్ళు. (16) దూతమాటను విని బృహస్పతి వానితో ఇట్లన్నాడు. ఆతని అవయవాలన్ని కంపిస్తున్నాయి, కోపంతో కళ్ళు ఎర్రతామరల వలె అయినాయి. (17) గురువచనమిట్లా- నహుషుని దగ్గరకు వెళ్ళి నీవు ఇట్లా చెప్పు. శచిని అనుభవించుటకు కోరిక కలవాడవైతే, అపూర్వమైన పల్లకిని ఎక్కి రాత్రికి రా (18) నీ శుభమైన పల్లకిని సప్తర్పులు మోస్తుండగా దానిని ఎక్కి, మంచి వేషం ధరించి వెళ్ళవచ్చును. (19) అనిన బృహస్పతి మాటలను విని, వాడు అప్పుడు వెళ్ళి రాజుతో చెప్పాడు. దూతమాటలను విని, నవ్వికింకరునితో రాజిట్లన్నాడు. (20) వెళ్ళువెళ్ళు త్వరగా వెళ్ళు. సప్తరుషులను శీఘ్రంగా తీసుకురా. వాళ్ళతో కూడి ఇప్పుడు ఉపాయం ఆలోచిస్తాను, ఓ కింకర (21) అని రాజన్న మాటను విని, దూత వారిదగ్గరకు వెళ్ళి నహుషుడు చెప్పినట్లుగా, అందరితో, అక్కడచెప్పాడు. (22) దూతమాటను విని సప్తర్షులు ఆనందంతో రాజుదగ్గరకు వెళ్ళారు. రాజు వారందరినిచూసి నమస్కరించి, సాదరంగా ఇట్లన్నాడు. (23) నహుషుడిట్లా - మీరు బ్రహ్మపుత్రులు, బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నారు. అంతా బ్రహ్మసదృశులు, ఎప్పుడూ భక్తులయందు వాత్సల్యం కలవారు. (24) ఎల్లప్పుడు నారాయణ (ధ్యాన) పరులు. శుద్ధ సత్వస్వరూపులు. మోహమాత్సర్యములు లేనివారు. దర్పాహంకారములు లేనివారు. (25) తేజస్సులో, కీర్తిలోనూ ఎల్లప్పుడు అంతా మీరు నారాయణసములు. గుణంలో ప్రేమలో, దయచూపటంలో, వరము ఇవ్వటంలో, నిశ్చయంగా నారాయణసములు (26) అని పలికి నమస్కరించి రాజు ఆనందించాడు, ఏడ్చాడు. భయపడుతున్న రాజును చూచివారు పరహితైషులు కనుక ఇట్లన్నారు. (27) ఋషులిట్లా - ఓ వత్సా! నీ మనస్సులో ఏ కోరిక ఉందో వరం కోరుకో. అన్ని ఇవ్వటానికి మేము సమర్థులము. మాకు అసాధ్యమైనది లేదు. ఇవ్వరానిదిలేదు. (28) ఇంద్రత్వమా, మనుష్యత్వమా, చిరాయువా, ఆ పిదప సప్తద్వీపేశ్వరత్వమా, మిక్కిలి దీర్ఘకాలికమైన సుఖమా. (29) అటైనా అన్ని సిద్ధించడం, అంతా ఐశ్యర్యం లభించటం చాలా దుర్లభము. ముక్తి కావాలా హరిభక్తియా, తపస్సుతో దుర్లభమైన దేదైనా కావాలా (30) ఓవత్స! నీ కోరిక ఏమిటి. మాకు ఇప్పుడు ఆనందంగా చెప్పు. అంతా నీకిచ్చాకే తపస్సునకు సంతోషంగా వెళ్తాము. (31) కృష్ణార్చనలేని క్షణము లక్ష యుగములతో సమానము. ధ్యాన సేవనములు లేని దినము దుర్దినము. (32) హరి సేవ కాకుండా ఎవడైనా వేరే విషయాన్ని కోరితే 'వాడు' కోరతగిన అమృతాన్ని వదలి తననాశనం కొరకు విషం తింటున్నట్లే. (33) బ్రహ్మ శివుడు, ధర్ముడు, విష్ణువు, మహావిరాట్టు, గణేశుడు, దినేశుడు(సూర్యుడు) శేషుడు, సనకాదులు. (34) వీరంతా రాత్రింబగళ్ళు ఆనందంతో ఎవని పాద పద్మములను ధ్యానిస్తున్నారో, ఏది జన్మమృత్యు జరా వ్యాధులను హరిస్తుందో, దాని యందాసక్తి కల వారము మేము. (35) వారి మాటలు విని నృపేశ్వరుడు వారితో ఇట్లన్నాడు. రాజుసిగ్గుపడుతూ, తలవంచుకొని, మాయతో మోహింపబడిన మనస్సుగల వాడై అన్నాడు. (36)
మూ॥ నహుషఉవాచ:
సర్వం దాతుం సమర్థాశ్చ యూయంచ భక్తవత్సలాః ।
అధునా దత్త మే తూర్ణం శచీదాన మభీప్సితం ॥
సపర్షివాహనం కాంతం శచీచ్ఛతి మహాసతీ ।
ఏతదేవ మమ వరం నిష్పన్నం కురుతాచిరం ॥
నహుషస్య వచఃశ్రుత్వా మునయశ్చ పరస్పరం ।
అత్యుచ్చైః జహసుః సర్వే కౌతుకేనచ నారద ॥
రాజానం మోహితం మత్వా వేష్టితం విష్ణుమాయమా ।
చక్రుః ప్రతిజ్ఞాం వోడుంచ కృపయా దీనవత్సలాః ॥
చుక్రుః స్కంధే తచ్ఛిబికాం ముక్తి మాణిక్యభూషితాం ।
రాజా యయౌ సువేషశ్చ రత్న భూషణ భూషితః ॥
దృష్ట్వాచాతివిలంబంచభరయామాస తాన్నృపః ।
కృథాశశాపదుర్వాసాశ్చాగ్రగామీచ వర్త్మని ॥
మహా నజగరో భూత్వా పత వై మూఢమానస ।
దర్శనాద్ధర్మ పుత్రస్య తవ మోక్షో భవిష్యతి ॥
రత్నయానేన వైకుంఠం గత్వా వైకుంఠ సేవనం ।
కరిష్యసి మహారాజ నకర్మ నిష్ఫలంభవేత్ ॥
ఇత్యుక్త్యా ప్రయముః సర్వే ప్రహస్య ముని సత్తమాః ।
రాజా పపాత తచ్చాపాత్ సర్చోభూత్వా మహామునే ॥
శచీ జగామ తచ్భుత్వా గురుం నత్వాఽమరావతీం ।
యయా బృహస్పతిః శీఘ్రం యత్రేంద్రః పద్మ తంతుషు॥
గత్వా సరోవరాభ్యాశమాజుహావ సురేశ్వరం ।
అతిప్రసన్న వదనః కృపయాచ కృపానిధిః ॥
నహుషుడిట్లా: మీరు భక్తుల పై వాత్సల్యం కలవారు, అన్ని ఇవ్వటానికి సమర్థులు. ఇప్పుడు నాకిష్టమైన శచీదానాన్ని నాకు త్వరగా ఇవ్వండి (37) ఆ మహాసతి శచి మనోహరమైన సప్తర్పులు (మోషే) వాహనాన్ని కోరుతోంది. ఇదే నా వరము. త్వరగా త్వరగా జరిగేట్టు చూడండి. (38) నహుషుని మాటవిని మునులు పరస్పరము చూచుకొని అందరు కుతూహలంగా చాలా పెద్దగా నవ్వారు, ఓ నారద! (39) రాజు విష్ణుమాయతో ఆవహింపబడి, మోహితుడైనాడని తలచి, కృపతో, దీనవత్సలులైన వారు మోయుటకు ప్రతిజ్ఞ చేశారు. (40) ముత్యములు మాణిక్యములు వీనితో అలంకరింపబడిన ఆ పల్లకిని భుజమందుంచుకున్నారు. రత్నభూషణములతో అలంకరించుకొని మంచి వేషంతో రాజువెళ్ళాడు. (41) చాలా ఆలస్యమవటం చూసి రాజువారిని భయ పెట్టాడు. దారిలో, ముందు వెళ్ళే దుర్వాసుడు కోపంతో శపించాడు. (42) ఓ మూఢమనస్కుడ! గొప్ప అజగరమనే సర్పానిపై పడిపో, ధర్మపుత్రుని దర్శనంతో నీకు మోక్షం కలుగుతుంది. (43) రత్నములతో చేసిన వాహనంలో వైకుంఠమునకు వెళ్ళి వైకుంఠుని సేవ చేస్తావు. ఓ మహారాజ! కర్మ నిష్ఫలంకాదు. (44) అని పలికి మునులంతా,నవ్వుతూ వెళ్ళారు. ఓ మహాముని! ఆశాపంతో మహారాజుగారు సర్పమై పడిపోయాడు. (45) దానిని విని శచి గురువునకు నమస్కరించి అమరావతికి వెళ్ళింది. బృహస్పతి కూడా, ఇంద్రుడెక్కడైతే పద్మతంతువులలో (దారాలు) ఉన్నాడో అక్కడికి శీఘ్రంగా వెళ్ళాడు. (46) సరోవర సమీపమునకు వెళ్ళి సురేశ్వరుని పిలిచాడు. కృపానిధి, కృపతో, అతిప్రసన్న వదనుడై పిలిచాడు. (47)
మూII బృహస్పతి రువాచ :
అయి వత్స త్వమాగచ్ఛ భయం కిం తే మయి స్థితే ।
త్యజ భీతిమిహాగచ్ఛ గురుస్తేఽహం బృహస్పతిః ॥
స్వగురోశ్చ స్వరం శ్రుత్వా మహేంద్రో హృష్టమానసః ।
రూపం విహాయ సూక్ష్మంచ స్వరూపేణ సమాయయౌ ।
పపాత దండవన్మూర్ద్నా భక్త్యా చరణయో ర్గురోః ।
తం రుదంతం మహాభీతం ముదోరసి చకారసః ॥
కారయిత్వా సోమయాగం ప్రాయశ్చితార్థమేవచ ।
రత్న సింహాసనే రమ్యే వాసయామాస తం గురుః ॥
ప్రదదౌ పరమైశ్వర్యం పూర్వస్మాచ్చ చతుర్గుణం ।
ఆగత్య సర్వదేవాశ్చ చక్రుః సేవాం ముదాన్వితాః ॥
శచీ సంప్రాప భర్తారం మహేంద్రం త్రిదశేశ్వరం ।
మందిరే పుష్ప తల్పేచ ముముధే సా ముదాన్వితా ॥
ఇత్యేవం కధితం వత్సమహేంద్రదర్ప భంజనం ।
శచీ సతీత్వరక్షాచ కిం భూయః శ్రోతు మిచ్ఛసి ॥
నారద ఉవాచ:
సోమయాగ విధానంచ బ్రూహి మాం మునిసత్తమ ।
కథంతంకారయామాస గురుశ్చ కిం ఫలం పరం ॥
నారాయణఉవాచ:
బ్రహ్మహత్యా ప్రశమనం సోమయాగ ఫలం మునే ।
వర్షం సోమలతా పానం యజమానః కరోతిచ ॥
వర్షమేకం ఫలంభుంక్తే వర్షమేకం జలంముదా ।
త్రైవార్షికం వ్రతమిదం సర్వపాప ప్రణాశనం ॥
యత్ర త్రైవార్షికం ధాన్యం నిహితం భూతవృద్ధయే ।
అధికంవాఽపి విద్యేత ససోమం పాతుమర్హతి ॥
మహారాజశ్చ దేవోవయాగం కర్తుమలం మునే ।
న సర్వసాధ్యో యజ్ఞోఽయం బహ్వన్నో బహుదక్షిణః ॥
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే ఉత్తరార్థ నారాయణ నారద సంవాదే శక్ర దర్పభంగ ప్రకరణే శక్రమోక్ష కథనం నామ షష్టితమోఽధ్యాయః ॥
బృహస్పతి వచనమిట్లా:
ఓ వత్స! నీవు రా. నేనుండగా నీకు భయమెందుకు. భయం వదిలి ఇక్కడికి రా. నేను నీ గురువును బృహస్పతిని. (48) తన గురువు స్వరాన్ని విని మ హేంద్రుడు ఆనందించిన మనస్సుగలవాడై సూక్ష్మ రూపాన్ని వదిలి, తన స్వరూపంతో వచ్చాడు. (49) దండములాగా తలతో, గురుపాదముల పై భక్తితో పడ్డాడు. బాగా భయపడుతున్న ఏడుస్తున్న వానిని ఆతడు ఆనందంతో ఎద పై ఉంచుకున్నాడు. (50) ప్రాయశ్చిత్తం కొరకు సోమయాగం చేయించి అందమైన రత్న సింహాసనమందు ఆతనిని గురువు కూర్చోబెట్టాడు. (51) ముందుకన్న నాల్గింత లెక్కువగా గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఆనందంతో దేవతలంతా వచ్చి సేవ చేశారు. (52) త్రిదశేశ్వరుడైన మహేంద్రుని భర్తను శచిపొందింది, (53) అని ఈ విధంగా మహేంద్ర దర్పభంజనమును చెప్పాను. ఓ వత్స! శచీదేవి, సతీత్వ రక్షను కూడా చెప్పాను. ఇంకా ఏమి వినదలచావు. (54) నారదుడన్నాడిట్లా - ఓ మునిసత్తమ! నాకు సోమయాగ విధానాన్ని చెప్పు. గురువు దాన్ని ఎట్లా చేయించాడు, ఆతనితో, పరమమైన ఫలమేమి (55) నారాయణుడిట్లా - ఓ ముని! సోమయాగ ఫలము, బ్రహ్మహత్యను శమింపచేయటము. యజమానుడు ఒక సంవత్సరము సోమలత రసమును తాగుతాడు. ఒక సంవత్సరము పండు తింటాడు. ఒక సంవత్సరము ఆనందంతో జలం తాగుతాడు.ఇది మూడు సంవత్సరాల వ్రతము. అన్ని పాపములను శమింప చేసేది. (57) ప్రాణికోటి వృద్ధి కోరకు మూడు సంవత్సరాలకు సరిపడ ధాన్యం ఎక్కడుందో లేదా ఎక్కువగా కూడా ఉన్నా ఆతడు సోమముతాగుటకు అరుడు . (58) మహారాజు కాని దేవుడు కాని యాగం చేయటానికి సమర్థులు, ఓ ముని! ఈ యజ్ఞము అందరి వల్ల సాధ్యమయ్యేది కాదు. బాగా అన్నదానము, అధిక దక్షిణలు ఇవ్వాలి. (59) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాద మందు ఇంద్రదర్ప భంగప్రకరణ మందు శక్రునకు మోక్షము అని చెప్పే ఇది అరవైయవ అధ్యాయం సమాప్తం II
Summary of chapter 60 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
As tensions mounted between the Pāṇḍavas and the Kauravas over the kingdom of Hastinapura, leading inexorably toward the epic Mahābhārata war, Lord Kṛshṇa acted as the supreme peace envoy on behalf of the Pāṇḍavas, traveling to the court of Dhritarāshtra. Despite Kṛshṇa's eloquent exposition on righteousness, duty, and the disastrous consequences of war, the arrogant Duryodhana rejected the peace proposal and attempted to arrest Kṛshṇa in open court, whereupon the Lord revealed His dazzling universal form, blinding the assembly with blinding cosmic light before departing to prepare the Pāṇḍavas for righteous victory.