నారద ఉవాచ - నారదుడు పలికెను :
నమతితే పూర్ణర సే కిం చకార జగత్పతిః ।
రహస్యం కిం బభూవాథ తద్భవాన్వక్తుమర్హతి ॥
అట్లు రాధామాధవుల పూర్ణమైన ఆనంద రసము (శృంగారము) గడచి పోగా ఆ జగత్పతి ఏమి చేసెను? అక్కడ ఏ రహస్యము జరిగెను. దానిని తమరు చెప్పవలసినది.
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి అనెను :
రాసం నివర్త్య రాసే చ రాసేశ్వర్యా సమన్వితః ।
స్వయం రాసేశ్వరస్తప్మొద్యమువా పులినం యయౌ॥
తత్ర స్నాత్వా జలం ప్రీత్వా నిర్మలం నిర్మలే జలే।
పార్థం గోపాంగనాభిశ్చ జలక్రీడాం చకార సః ॥
తతో జగామ భగవాన్ భాండీరం రాధయా సహ ।
గోపాంగవాళ్ళ స్వగృహాన్ ప్రయయుర్విరహతురాః ॥
రాసమండల మందు రాసేశ్వరి (రాధ)తో కూడినవాడైన రాసేశ్వరుడు (శ్రీకృష్ణుడు) రాసకేళి ముగించి అటునుండి యమునా తీరమందలి ఇసుక తిన్నెలు గల స్థానమునకేగెను. ఆ నదియొక్క నిర్మలమైన జలములో గోపాంగనలతో పాటు జలక్రీడలొనర్చి స్నానమాడి ఆ జలమును పానమొనర్చెను. అక్కడి నుండి రాధతో కలిసి శ్రీహరి భాండీరవనమున కేగెను. అతని ఎడబాటుకు బాధపడుచున్న గోపికలు తమ స్వగృహములకేగిరి.
క్రీడాం చకోర రహసి భాండీరే షూలతీవవే ।
మాలతీ పుష్ప శయ్యాయాం రమ్యాయాం రమజోత్సుకః ॥
కృత్వా క్రీడాం చ తత్రోవ వాసంతీకాననం యయా ।
రేమే తత్రైవ రాసేశ్ పనం సుమనోహరే ॥
తత్రైవ రమణం కృత్వా యయా చందన కాననం ।
చందనోక్షిత పర్వాంగో గృహీత్వా చందనోక్షితం ॥
రమ్య చందన తల్సే చ స్నిగ్ధ చందన వల్లవే ।
పూర్ణచంద్రే సముదితే ఏజహార తయా నహ ॥
కృత్వా వీహారం తతైన యయా చంపక కానవం ।
రమ్యే చంపక తలే చ చకార రతీమీశ్వరీం ॥
రతి నిర్వర్య తత్రోవ యయా పద్మవనం ప్రభుః ।
వద్మపత్ర నమాకీరే తల్సేతి సుమనోహరే ॥
సార్ధం తత్ర వద్మ ముఖ్యా శీతేన పద్మవియునా ।
చకార సుఖసంభోగం యయా విద్రోం తయా నహ ॥
శృంగారముందాసక్తి గల కృష్ణుడు భాండీరవనమందలి మాలతీవనములో ఏకాంత ప్రదేశమున మాలతీ పుష్పములతో నిండిన రమ్యమైన శయ్యయందు ప్రియురాలైన రాధతో క్రీడించెను. అక్కడి నుండి వాసంతీకాననమునకు పోయిన రాసేశ్వరుడు అక్కడ వసంత. ఋతువు చేత మిక్కిలి మనోహరముగా ఉన్న ఆ వనములో రాధతో క్రీడించెను. అక్కడి నుండి చందన కాననమునకు పోయి చందన ద్రవము (నూరిన గంధము) తీసికొని సర్వాంగములందు పూకోని నిగనిగమను చందనపు చీగుళ్లతో సిద్ధపరచిన సుందరమైన శయ్యమీద నిండు చంద్రుడుదయించుచుండగా రాధతో క్రీడించెను. ఇట్లు విహరించీ చంపకవనమున కేగి అందు సంపెంగపూలు పరచిన శయ్యయందు ఈశ్వరియైన రాధననుభవించెను. అక్కడ అటు క్రీడించి ప్రభువు పద్మవనమున కేగెను. ఆ వనములో పద్మముల మీది నుండి వీచుచున్న చల్లని వాయువుల గల ప్రదేశమున పద్మముల రేకులు పరచిన శయ్యమీద పద్మముఖ్యైన రాధతో సుఖమనుభవించి . ఆమెతో పాటు నిద్రించెను.
విహాయ నిద్రాం విద్రేశో దదర్శ నీద్రీశాం ప్రియాం ।
శయావాం పద్మల్సే చ సుఖ సంభోగ మాత్రత ॥
దృష్వా ముఖం చ ఘరాక్రం శరచ్చంద్ర ఏవిందితం ।
అతి సంక్ష సిందూరం లుప్తం కల ముల్బణం ॥
సంలుస్తాధర రాగం చ సంలుప్త గండపత్రకం ।
ఏప్రష్ణ కబరీ ఖాఠం నేత్రోత్పల విముద్రితం ॥
రత్నకుండల యుగ్మేవామూల్యేవ వంశోభితం ।
రాజితం మౌక్తికేవైవ గజరాజోద్భపన చ ॥
ప్రేష స్వసూక్ష్మ వస్రణ తప్నా దేవ మాధవః ।
చకార మధనం భక్త్యా తద్వక్షం భక్తవత్సలః ॥
నిద్రనాజ్ఞాపించునట్టి ఆ ప్రభువు తాను నిద్రను వీడి (మేల్కొని) నిద్రించి యున్న ప్రియురాలైన రాధను. చూచెను. సుఖకరమైన సంభోగము మూలమున పద్మపత్రముల శయ్యపై పండుకొని నిద్రించుచున్న ఆమె ముఖము చెమట బిందువులతో తడిసి శరత్కాల చంద్రుని నిందించునట్లుండెను. నుదుట సిందూర తిలకము కన్నుల కాటుక మీక్కిలి చెదిరిపోయి లోపించియుండెను. క్రింది పెదవి యందలి ఎర్రని పూత లోపించియుండెను. చెక్కిళ (చెంపలు) యందలి మకరికా పత్రరేఖలు చెదిరిపోయెను. కొప్పుముడి చెదరి వీడిపోయెను. కలువల వంటి కన్నులు మిక్కిలి మూతపడి యుండెను. ఆమె ముఖము అమూల్యమైన రెండు మణికుండలముతో ఏనుగు కుంభస్థలమందు పుట్టిన ముత్యపు ముక్కుపుడకతో శోభిల్లుచుండెను. భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడామెయందలి భక్తి ప్రేమలతో అగ్నిచేత పూతమైన సన్నని వస్త్రము. గ్రహించి ఆమె ముఖమును తుడిచెను.
కేశ సమ్మాధనం కృత్వా నిర్మాయ కబరీం హరిః ।
మాధవీమాలతీ మాలా జాలేన పరిశోభితాం ॥
రత్నపట్ట సూత్ర బదాం వామపక్షాం మనోహరాం ।
ఆశీన వర్తులాకారాం కుందపుష్ప సుశోభితాం ॥
దదౌ సిందూర తిలకమధశ్చందనముజ్జ్వలం ।
కస్తూరీ బిందునా సార్ధం వరితః పరిశోభితాం ॥
చకార పత్రకం గండ యుగ్మే చిత్ర విచిత్రితం ।
ప్రదదే కలం భక్త్యా నేత్రోత్సల సముజ్జ్వలం॥
చకారాధర రాగం చ రాధాయాశ్పానురాగతః ।
ఆ హరి ఆమె తలవెండ్రులకను. దువ్వి కొప్పుగా చేసి మాధవీపుష్పములు, మాలతీ పుష్పముల మాలలతో శోభించునట్లు అలంకరించెను, ఎడమవైపు కొద్దిగా త్రిప్పిన ముఖము గల ఆ మనోహరిని రత్నములు కుట్టిన పట్టు పట్టీతో నడుమును బంధించెను. మిక్కిలి గుండ్రముగా నున్న కుందపుష్పములతో శోభించుచున్న ముఖమండలమందు సిందూర వర్ణతిలకము (ఎర్రని గుండ్రని బొట్టు) పెట్టి దానిక్రింది. ప్రకాశించెడి చందన తిలకము నుంచి ఆ రెంటినీ చుట్టునట్లు, కస్తూరి చుక్కలు శోభించునట్లు చేసెను. ఆమె చెక్కిళ్లయందు చిత్రవిచిత్రముగా మకరపత్రరేఖలు సమర్పించెను. కలువ కన్నులు ప్రకాశించునట్లు భక్తితో కాటుక దిద్దెను. అత్యంతానురాగముతో రాధయొక్క పెదవులకు ఎర్రని ద్రవమును పూసేను.
కర్ణ భూషణ యుగ్మం చ చకారాతీన నిర్మలం ॥
అమూల్యరత్నహారం చ స్తనభార యుగోజ్వలం ।
దదౌ కంతే చ వైకుంఠో మణిరాజి విరాజితం ॥
వహ్ని శుద్ధాంశుకం దివ్యమమూల్యం విశ్వరత్నతః ।
వాసయామాస వనసం కస్తూరీ కుంకుమార్తకం ॥
ప్రదదౌ పాదయుగలే రత్నమంజీర రంజీతం ।
చకారాలకం భక్త్యా పాదాంగులి నఖేవ చ ॥
చకార సేవా సేవ్యాయాః సేవ్యప్రిజగతాం సతాం ।
అహో సేవక. సంభక్త్యా శ్వేతేన చామరేణ చ ॥
సర్వభావ విదాం శ్రేషా బోధజ్ఞః కామశాస్త్రవిత్ ।
కామినీం బోధయామాస వాసమాన వక్షసి ॥
మిక్కిలి ప్రకాశించెడి కర్ణభూషణములను పుష్టిగా నున్న స్తనములయందు ఉజ్జ్వలము. అమూల్యము ఐన రత్నహారమును కంఠమందు మణులతో ప్రకాశించు భూషణమును వైకుంఠుడు రాధకలంకరించేను. అగ్నిచేత పరిశుద్ధము చేయబడినదియు కస్తూరీ కుంకుమ పువ్వుల గంధమద్దినదియు ఐన అమూల్య దిష్యవస్త్రమును అలంకరించెను.. పాదములకు రత్నాల అందెలు తొడిగి ప్రేమాదరములతో పాదములకును పాదాంగుళుల గోళ్లకును లత్తుకనద్దేను. బళీ! ముల్లోకములందలి సత్పురుషులకు సేవింపదగినవాడైన స్వామి తనకు సేవ్యురాలైన (సేవింపదగినదైన) రాధకు సేవకునకుండదగిన భక్తితో తెల్లచామరము గ్రహించి మెల్లగా విరుచు సేవచేసెను. సర్వవిధ భావములను (అందరి భావములను) తెలిసికొనువారిలో శ్రేష్ఠుడును జ్ఞానవేత్తయు కామశాస్త్ర పండితుడును ఐన శ్రీకృష్ణుడు ఆ కామీనిని మేల్కొల్పి (ఇట్లు అలంకరించి తన వక్షస్థలమున చేర్చుకొనెను.
ప్రేమ్ణా చ ప్రదదౌ తస్యై సద్రత్న దర్పణం శుభం ।
నువేష దర్శనార్థం చ ముఖచంద్రం చ మార్గాతుం ॥
నానా వుప్ఫైర్విరచితామమ్లానాం చందనోక్షితాం ।
గండే సౌభాగ్య యుక్తాయాః సౌభార్యే న దదౌ హరిః ॥
కస్తూరీ కుంకుమార్హం చ సుగంధి చందనం తతః ।
దదౌ ప్రియాయాః సర్వాంగే ప్రియ: ప్రేమ భరేణ చ ॥
పారిజాతస్య కుసుమం దత్తం రహసి బ్రహ్మణా ।
ప్రదదౌ తత్కబర్యాం చ లలితాయాం చ నారద ॥
కమలం నిర్మలం దివ్యం సహస్రదల ముజ్వలం ।
శివేన దత్తం రహసి దదౌ తద్దక్షిణే కరే ॥
అతిసారం మణీంద్రాణాం మణిరత్నం చ కౌస్తుభం ।
దత్తం రహసి ధర్మేణ తస్యై సుప్రీతయే దదౌ ॥
తన యొక్క అలంకారమును (వేషమును) చూచుకొనుటకును చంద్రుని వంటి ముఖమును సరిదిద్దుకొనుటకును ప్రేమతో శుభమైన రత్నదర్పణమును (అద్దము) స్వామి రాధకిచ్చెను. నానావిధ పుష్పముల చేత నిర్మింపబడినదియు, వాడనిదియు, గంధముతో తడుపబడినదియు అగు పూలబంతినీ ఆ సౌభాగ్యవతికి హరి సమర్పించెను. బ్రహ్మ తనకు రహస్యముగా నర్పించిన పారిజాత పుష్పమును ఆమె యొక్క సుందరమైన కొప్పున చెక్కెను. నిండైన ప్రేమతో ఆ ప్రియుడాప్రియురాలి యొక్క సర్వాంగములయందు కస్తూరి కుంకుమ పువ్వుల సుపోసన గల (మిశ్రమము గల) శ్రీగంధమును పులిమెను. శివుడు. రహస్యముగా తనకర్పించిన, వేయి రేకులతో ప్రకాశించుచున్న, నిర్మలమైన దివ్యకమలమును హరి అమె దక్షిణహస్తమున (ధరించుటకై) నుంచెను. మణులతో మిక్కిలి సారవంతమైన ధర్మదేవుడు రహస్యముగా తన కిచ్చిన కౌస్తుభమును మణిని - ఆమె యొక్క పూర్ణ తృప్తి కొరకు స్వామి రాధకర్పించెను.
ఆసవం రత్నపాత్రస్థం దస్రదత్తం చ నిర్ణనే।
పానార్థం ప్రదదే తస్యై కామోన్మాదకరం పరం॥
మాలతీమాధవీ కుంద మందార చంపకాదికం ।
పుష్పం సద్రత్న పాత్రస్థం తస్యై సుప్రీతయే దదే॥
సుదుర్లభం చ తాంబూలం కర్పూరాది సుసంస్కృతం ।
భక్షణం కారయామాస సమయజ్ఞశ్చ తాం ప్రియాం ॥
సుదుర్లభం చ విశ్వేషు వాకృతేః పరినిర్మితం।
అనుత్తమమమూల్యం చ వరుణేన రహఃస్థలే ॥
అతి సూక్ష్మమగువమం దత్తం భక్త్యా విరాజితం ।
వాసయామాస వసనం కృత్వా నగ్నాం చ కౌతుకాత్ ॥
దేవరాజేన దత్తం చ గజరాజేంద్ర మౌక్తికం।
నాసికాభూషణం చారు తస్యై సుప్రీతయే దదౌ॥
దస్రుడన్న పోడు ఏకాంతమున తనకర్పించినదియు, రత్నపాత్రయందున్నదియు, కామోన్మాదమును కూర్చునదియు ఐన ఆసవమును (పుష్పములతో గానీ - ఫలములతో గాని సిద్ధము చేసిన మద్యము) ఆమెకందించెను. ఒక రత్నపాత్రలో ఉన్న మాలతి, మాధవి, కుంద మందార చంపకాది పుష్పరాని ఆమె ప్రీతికొరకిచ్చెను. తగిన సమయమెరిగిన ఆ రసికుడు కర్పూరము మొదలగు సుగంధద్రవ్యములు చేర్చిన సుదుర్లభమైన తాంబూలము నిచ్చి ప్రియురాలితో తినిపించెను. విశ్వములయందు సుదుర్లభమును వరుణుడు బృహస్పతి చేత ఏకాంత ప్రదేశమున నిర్మింపజేసినదియు, అమూల్యము అతి సూక్ష్మము సాటిలేనిదియు శ్రేష్ఠమునైన వస్త్రమును భక్తితో వరుణుడు తన . కరించిన దానిని - వేడుకతో నూడదీసి రాధ ధరింపజేసెను. దేవరాజు (ఇంద్రుడు) తన కర్పించిన ఏనుగుముత్యపు నాసికాభూషణమును (ముక్కున వ్రేలాడు బులాకీ) అందమైన దానిని రాధ ప్రీతి కొరకు స్వామి అర్పించెను.
ఏతస్మిన్నంతరే తత్ర సుశీలాద్యాశ్చ గోపికాః ।
షష్ఠిః సత్సహచర్యశ్చ రాధాయాః సుప్రతిష్ఠితా॥
షష్టి సత్కోటి గోపీభిః సార్ధం సంహృష్టమానసాః ।
ఆయయుః పాదచి హ్నేన ప్రియస్య వహత ప్రియాం ॥
ఇంతలో నక్కడికి రాధాదేవి సహచరిణులుగా ప్రసిద్ధికెక్కిన సుశీల మొదలగు ప్రధాన గోపికలు అరువదిమంది - అరువది కోట్ల గోపికలతో కూడి - ప్రియురాలైన రాధను ఎత్తుకొని వచ్చిన శ్రీకృష్ణుని యొక్క పాదముద్రల గుర్తుబట్టి వారున్న స్థలమును గుర్తించి – చేరవచ్చిరి.
కాశ్చిచ్చందన హస్తాశ్చ కాశ్చిమరవాహికాః ।
కాశ్చిత్కస్తూరి హస్తాశ్చ మాలాహస్తాశ్చ కాశ్చన॥
కాశ్చితందూరహస్తాశ్చ కాశ్చిత్కంకతికా కరా: ।
కాశ్చిరలక్షక కరా వగ్రహస్తాశ్వ కాశ్చన ॥
కాశ్చిద్దర్పణ హస్తాశ్చ పుష్పపాత్రధరా వరాః ।
కాశ్చిత్రీడాపద్మహస్తా మాలాహస్తాశ్చ కాశ్చన॥
కాశ్చిదానవ హస్తాశ్చ కాశ్పిద్భూషణ వాహికాః ।
కరతాలకరా: కాశ్చిమృదంగ వాహికాః పరాః ॥
స్వరయంత్రకరాః కశ్చిద్వీణాహస్తాశ్చ కాశ్చన ।
షట్త్రింశద్రాగ రాగిణ్యో గోపికా రూప ధారికాః ॥
గోలోకాదాగతా యాశ్చ భారతం రాధయా సహ।
వచ్చిన గోపికలలో కొందరు చందన పాత్రలను, కొందరు చావురములను, కొందరు కస్తూరి పాత్రలను, కొందరు ధరించదగిన వస్త్రములను, కొందరు సిందూర తిలకమును, కొందరు దువ్వెనలను, కొందరు కాళ్లపారాణినీ, కొందరు ధరించదగిన వస్త్రములను, $ందరు ఆసవములను, కొందరు భూషణములను, కొందరు కరతాళములను, కొందరు మృదంగములను, మరికొందరు స్వరయంత్రములను, కొందరు వీణలను, తమ యజమానురాలి ఉపయోగార్థము చేతులలో ధరించి యుండిరి. కొందరు సంగీత శాస్త్రమందలి ప్రధాన రాగముల సంఖ్యయగు ముప్పది యారు రాగములే గోపికా రూపములు ధరించిన వారుండిరి. ఇట్లు ఈ గోపికలందరు గోలోకము నుండి రాధాదేవి వెంట భారత వర్షమునకు వచ్చినవారే - ఇక్కడకు వచ్చిరి.
కాశ్చిజ్ఞగుశ్చ నవృతుస్తత్రాగత్య చ కాశ్చన ॥
కాశ్చిచ్చక్రుశ్చ సేవాం చ రాధాయాః శ్వేత చామరైః ।
కాశ్చిచ్చక్రుశ్చ దేవ్యాశ్చ పాదసంవాహనం ముడా॥
కాచిద్దదౌ చ తాంబూలం భక్షణాఢ మహామునే ।
ఓ మహాముని నారదా! వచ్చిన గోపికలలో కొందరు పాడిరి. కొందరు నృత్యము చేసిరి. కొందరు తెల్లచామరములతో రాధాదేవి యొక్క సేవచేసిరి (చామరములతో వీచిరి).
ఏవం కౌతుక యుక్తశ్చ పుణ్యే బృందావనే వనే॥
ప్రతస్థా గోపికా సార్థం రాధావక్షఃస్థలస్థితః ।
క్షణం వబి చ మాధ్వీకం ప్రియ సహ మాధవః ॥
క్షణం చఖాద తాంబూలం క్షణం నిద్రాం యయా ముదా ।
క్షణం చకార శృంగారం రత్న నిర్మితమందిరే ॥
క్షణం జలవిహారం చ చకార యమునాజలే।
ఇటు వేడుకలు వినోదములతో కూడినవాడై పుణ్యవంతమైన జృందావనమనెడి వనమందు గోపికలతో పాటు రాధాదేవి వక్షస్థలమునాశ్రయించి శ్రీకృష్ణుడుండెను. కొంత సేపు ప్రియురాలగు. రాధతో కూడి మాధవుడు తేనెలు త్రాగెను. కొంత సేపు తాంబూలము భక్షించెను. రత్ననిర్మితమైన మందిరములో కొంత సేపు రాధతో శృంగార క్రీడ సల్పెను. తరువాత సంతోషతృప్తులతో కొంత సేపోమెను గూడి నిద్రించెను. తరువాత కొంత సేపు యమునానదీ జలములలో జలవిహారమొనర్చెను.
ఇత్యేవం కథితా వత్స రాషక్రీడా హరేరహో॥
స్వేచ్ఛామయస్యాత్మనశ్చ పరిపూర్ణతమన్య చ ।
నిర్గుణస్య స్వతంత్రస్య పరన్య ప్రకృతేః ప్రభో ॥
బ్రహ్మవిష్ణుశివాచీనామీశ్వరస్య వరస్య చ ।
కృష్ణ జన్మరహస్యం చ బాలక్రీడనమీప్పితం॥
ఉక్తం కిశోర చరితం ఓం భూయః శ్రోతుమిచ్ఛసి॥
నాయనా! నారదా! ఈ తీరుగా హరియొక్క రాసక్రీడ నీకు చెప్పబడినది. ఇది ఆశ్చర్యకరమైనది. పరమాత్మయు, తన ఇచ్ఛననుసరించి రూపములు దాల్చువాడును, పరబ్రహ్మయొక్క పరిపూర్ణతమమైన అవతారమైనవాడును, గుణరహితుడుసు, స్వతంత్రుడును తన వ్యవహారమునీంకోకడు శాసించు స్థితిలేనివాడు) ప్రకృతి కంటే వరుడును, ప్రభువును, బ్రహ్మవిష్ణు శివాదిదేవగణములకీశ్వరుడును అన్నిటికతీతుడు శ్రేష్ఠుడును ఐన పరమాత్మ యొక్క గోలోక వాసియగు శ్రీకృష్ణుని యొక్క జన్మరహస్యము తనకును భక్తులకును కోరినదైన బాలక్రీడలును గల కిశోర చరితము {బాల్యదశలో జరిగిన చరిత్రము) నాచేత నీకు చెప్పబడినది. ఇంకేమి వినగోరుచున్నావు.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే నారాయణ నారదసంవాదే శ్రీకృష్ణ రాసక్రీడా వర్ణనం నామ త్రిపంచాశత్తమో ధ్యాయః॥
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదనంవాదరూపమైన శ్రీకృష్ణ రాసక్రీడా వర్ణనమనెడి ఏబది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 53 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
When Pradyumna, the valiant son of Lord Kṛshṇa and Rukmiṇī, fell in love withUshā, the daughter of the thousand-armed demon emperor Bāṇāsura of Shonitapura, a fierce war erupted when Bāṇāsura imprisoned the young prince. Lord Kṛshṇa, accompanied by Balarāma and Pradyumna, marched upon Shonitapura and dismantled Bāṇāsura's massive fortifications. Even Lord Śiva, who fought to protect His devotee Bāṇāsura, was gently pacified by Kṛshṇa's divine sleep missile. Kṛshṇa severed most of Bāṇāsura's thousand arms until the humbled demon surrendered, whereupon the grand marriage of Pradyumna and Ushā was celebrated with celestial jubilation.