మూ॥ శ్రీనారాయణ ఉవాచ :
వాసుదేవో ద్వారకాయాం వసుదేవాజ్ఞయామునే ।
ప్రయయౌరత్నరుచిరంరుక్మిణీ మందిరం వరం ॥
శుద్ధస్ఫటిక సంకాశమమూల్య రత్ననిర్మితం ।
పురతః పరితో రమ్యం నానా చిత్రేణ చిత్రితం ॥
అమూల్యరత్న కలశం శ్వేత చామర దర్పణైః ।
వహ్ని శుద్ధాంశుకైః శుద్దైః పరితః పరిశోభితం ॥
దదర్శ రుక్మిణీం దేవీం అతీవ నవయౌవనాం ।
రత్నపర్యంక మారుహ్య శయానః సస్మితాంముదా ॥
అప్రౌఢంచ నవోఢంచ నవసంగమలజ్జితాం ।
అమూల్యరత్ననిర్మాణ భూషణేన విభూషితాం ॥
సుచారుకబరీ భారాం మాలతీమాల్యభూషితాం ।
దృష్ట్వా కృష్ణం భీష్మ కన్యా సహసాప్రణనామసా ॥
తాం సంప్రాప్య జగన్నాథ్ రత్నతల్పే ఉవాస సః ।
శుభక్షణేచ శుభయా సరేమే రమయా సహ ॥
సుఖసంభోగమాత్రేణ మూర్చామాప ముదాసతీ ।
తస్యాం జజ్జీ కామదేవో భస్మీభూతాశ్చ శంభునా ॥
సశంబరం నిహత్యైవ తత్రప్రాపరతిం సతీం ।
రతీమాయావతీ నామ్నా సంకేతేన సురస్యచ
ఛాయాందత్వాచశయనే గృహిణిశంబరాలయే ॥
నారద ఉవాచ :
జహార శంబరం కామోదైత్యం కేన ప్రకారతః ।
కథయ స్వమహాభాగ విస్తరేణ శుభాంకథాం ॥
నారాయణ ఉవాచ :
సమతీతేచ సప్తా హే రుక్మిణీ సూతికాగృహాత్ ।
గృహీత్వా బాలకందైత్యో జగామ స్వాలయంజవాత్ ॥
అపుత్రకశ్చ దైత్యేశః పుత్రంప్రాప్య ప్రహర్షితః !
మాయావత్యై దదౌహృష్టాదృష్ట్వా మాయావతీసతీ ॥
అతీవపాలనేనైవ వర్ధయామాసబాలకం ।
సరస్వతీ తాంరహసి కథయామాసనిర్జనే ॥
సరస్వత్యువాచ :
శివకోపానలే పూర్వం భస్మీభూతః పతిస్తవ ।
సచాయం రుక్మిణీ పుత్రో దైత్యేనైవసమాహృతః ॥
మాయయాపిచ మాయేనో రుక్మిణీసూతికా గృహాత్ ।
సమానీయదదౌతుభ్యం పతిస్తేయంనచాత్మజః ॥
శ్రీనారాయణుడిట్లా –
వాసుదేవుడు ద్వారకయందు ఓముని! వసుదేవుని ఆజ్ఞతో రత్నములతో రుచిరమైన, కోరతగినరుక్మిణీ మందిరమునకు వెళ్ళాడు. (1) శుద్ధమైన స్పటికముతో సమానకాంతి గలది, అమూల్యమైన రత్నములతో నిర్మింపబడినది ఎదురుగా అంతట రకరకాల చిత్రములతో చిత్రింపబడినది, (2) అమూల్యరత్నముల కలశము, శ్వేతచామరము, దర్పణము కలది. వహ్నిశుద్ధమైన వస్త్రములతో అంతటా బాగా శోభిస్తున్నది ఆమందిరం. (3) మిక్కలి నవయౌవనవతియైన రుక్మిణీ దేవిని చూచాడు కృష్ణుడు. రత్నములతో చేసిన పడక పైన నిద్రపోతున్నది. ఆనందంతో చిరునవ్వు నవ్వుతున్నది. (4) ఆమె బ్రౌడురాలుకాదు. కొత్తగా వివాహమైనట్టిది. నవసంగమంవల్ల సిగ్గుపడుతున్నది. అమూల్యమైన రత్నములతో నిర్మించిన భూషణములతో అలంకరింపబడినది. (5) చక్కని కేశభారమలు కలది. అందులో మాలతి మాలలతో అలంకరించుకున్నది. ఆమె భీష్మకన్య కృష్ణుని చూచి త్వరగా నమస్కరించింది. (6) ఆమెను చేరి ఆ జగన్నాథుడు రత్న తల్పమందు తాను కూర్చున్నాడు. శుభక్షణమందు శుభురాలైన రమతో కూడి ఆతడు రమించాడు. (7) ఆసతి సుఖసంభోగమాత్రముననే ఆనందంతో మూర్ఛపోయింది. ఆమె యందు, శివునితో భస్మమైన కామదేవుడు జన్మించాడు. (8) ఆతడు శంబరుని చంపే అక్కడ సతియైన రతిని చేరాడు. రతి, మాయావతి అనే పేరుతో రహస్యంగా సురునకు ఛాయను ఇచ్చి శంబరుని ఇంటిలో శయనమందు గృహిణిగా ఉన్నది. (9) నారదుడు అడిగాడిట్లా - ఏ ప్రకారముగా దైత్యుడైన శంబరుని కాముడు చంపాడు. ఓమహాభాగ! విస్తారంగా ఆశుభమైన కథను చెప్పండి. (10) నారాయణుడి - ఏడు రోజులు గడిచాక రుక్మిణి సూతికా గృహమునుండి పిల్లవాడిని తీసుకొని దైత్యుడు వేగంగా తన ఇంటికి వెళ్ళాడు. (11) పుత్రులు లేని ఆదైత్యేశుడు పుత్రుని పొంది ఆనందపడ్డాడు. ఆనందంతో మాయావతికిచ్చాడు ఆ పిల్లవాడిని. ఆసతి మాయావతి చాలా ఆనందపడినది. (12) చాలా జాగ్రత్తగా రక్షిస్తూ ఆ పిల్లవాడిని పెంచింది. ఒంటరిగా సరస్వతి ఆమెతో రహస్యమైన చోట ఇట్లా చెప్పింది. (13) సరస్వతి వచనమిట్లా - నీ భర్త ఇదివరలో శివకోపాగ్నితో దగ్ధమైనాడు. ఆతడే, వీడు, రుక్మిణీ పుత్రుడు. ఈదైత్యుడు తీసుకొని వచ్చాడు. (14) రుక్మిణి యొక్క సూతికా గృహము నుండి (ప్రసూతి గృహం) ఈ మాయగలాడు మాయతో తెచ్చాడు. తెచ్చి నీకిచ్చాడు. ఈతడు నీపతి నీ కొడుకు కాదు. (15)
మూ॥ కామంచ కథయామాస జగన్మాతాచ సాసతీ ।
తవపత్నీ రతిశ్చేయం రమస్వ రమయా సహ ॥
త్వమేవరుక్మిణీ పుత్రో నాన్యదైత్యస్య మన్మథః ।
కురరీ వసతీ నిత్యం రోదితిస్మ త్వయా వినా ॥
ఇత్యుక్త్యాచ యయౌ వాణీ బ్రహ్మాజీ బ్రహ్మణః పదం ।
సరేమే నిర్జనే నిత్యం రామయా సహ సుందరః ॥
ఏ కదా మన్మథం దైత్యో దదర్శరహసిస్థితం ।
శృంగారం రామయా సార్థం కుర్వంతం కౌతుకేనచ ॥
సస్మితం సస్మితా యాశ్చ మధ్యవక్షః స్థలస్థితం ।
రతిం దదర్శకామేన మూర్ఛితాం సురతోత్సుకాం ॥
దృష్ట్వా చుకోపదైత్యశ్చ జగ్రాహ ఖడ్గముత్తమం ।
ఉవాచ ఖడ్గహస్తశ్చ కామదేవం రతింసతీం ॥
శంబర ఉవాచ :
ధిక్ త్వాం మహాకాముకంచ మూర్ఖం పండితమానినం ।
మహాపాతకినాం శ్రేష్ఠం ప్రమత్తం మాతృగామినం ॥
ధిక్ త్వాంచపుంశ్చలీం మత్తాం కాముకీం హతచేతనాం ।
పుత్రంగృహీత్వారహసి కరోషి సురతింసతి ॥
ఇత్యేవ ముక్త్వాఖడ్గంచ తామేవహంతుముద్యతః ।
జిఘాంసంతం రతిందైత్యం ప్రేరయామాస మన్మథః ॥
పపాతదూరతో బ్రహ్మన్ మూర్ఛితః స్వాంగపీడితః ।
పునశ్చచేతనాం ప్రాప్యకోపేన ప్రజ్వలన్నివ ॥
శివదత్తంచ శూలంచ జగ్రాహ నిర్భరేణచ ।
శతసూర్యప్రభం శూలం ప్రలయాగ్నిసమం మునే ॥
దృష్ట్వాజగ్ముశ్చదేవాశ్చ బ్రహ్మేశ శేషసంజ్ఞకాః ।
పవనః కథయామాస కన్డేకామస్య యత్నతః ॥
స్మర స్మర మహామాయాం దుర్గాం దుర్గతినాశినీం ।
పవనస్య వచః శ్రుత్వా దుర్గాం సస్మారమన్మథః ॥
శూలం బభూవతస్యాంగే రమ్యం మాల్యం మనోహరం ।
బ్రహ్మాస్తేణ తం దైత్యం జఘాన మన్మథోముదా ॥
రతింగృహీత్వాయానేన జగామ ద్వారకాంపురీం ।
ప్రయయుః దేవతాః సర్వాః స్తుత్వాచ పార్వతీం స్వయం II
కామునితో, జగన్మాత, ఆసతి ఇట్లా చెప్పింది. ఇదినీభార్య, రతి, ఈమెతో నీవు రమించు. (16) నీవే, రుక్మిణీ పుత్రుడవు, మన్మథుడవు. ఇతర దైత్యులకు చెందవు. నీవు లేకుండటం వల్ల ఈ సతి, ప్రతిరోజు క్రౌంచపక్షి వలె ఏడ్చేది. (17) అని చెప్పి సరస్వతి, వాణి, బ్రహ్మాణి, బ్రహ్మ పదమునకు వెళ్ళింది. ఆతడు జనులులేని చోట ఆసుందరుడు ఆమెతో కూడి నిత్యం రమించాడు. (18) ఒకసారి రహస్యంగా ఉన్న మన్మథుని రాక్షసుడు చూచాడు. కుతూహలంగా ఆ స్త్రీతో శృంగారం చేస్తున్నవాణ్ణి చూచాడు. నవ్వుతూ, నవ్వుతున్న ఆమె వక్షఃస్థలమధ్యంలో మన్మథుడున్నాడు. సురతమందు ఉత్సుకతగల మూర్చపోయిన రతిని కామునితో కూడా చూచాడు. (20) చూచి దైత్యుడు కోపగించాడు. మంచి ఖడ్గాన్ని తీసుకున్నాడు. చేత కత్తి తీసుకొని కామదేవునితో సతియైన రతితో ఇట్లన్నాడు. (21) శంబరుని వచనమిట్లా - నీకు తిరస్కారము. మహాకాముకుడవు, మూర్భుడవు. నీకు నీవే పండితుణని అనుకునేవాడివి. మహాపాతకులలో శ్రేష్టుడవు, మదించినవాడివి. తల్లిని చేరేవాడివి (రతికై) (22) ఓసి! నీకు తిరస్కారము. నీవు కులటవు, మదించిన దానివి, కాముకివి, చేతనలేకున్నావు. కొడుకును తీసుకొని ఏకాంతంలో ఓసతి! మంచిగారతి చేస్తున్నావు. (23) అని పలికి ఖడ్గంతో ఆమెను చంప ప్రయత్నించాడు. రతిని చంపదలచుకున్న ఆ దైత్యుని మన్మథుడు ఒక్కతోపుతోశాడు. (24) ఓ బ్రహ్మాన్! మూర్ఛితుడై దూరంగా పడ్డాడువాడు. వాడి అంగములకు పీడ కలిగింది. తిరిగి చైతన్యాన్ని పొంది కోపంతో మండిపోతున్నట్టు (25) నిబ్బరంగా శివుడిచ్చిన శూలాన్ని తీసుకున్నాడు. ఓముని! ఆ శూలము నూరుగురు సూర్యులకాంతి గలది, ప్రళయకాలాగ్నితో సమానమైనది. (26) దీనిని చూచి బ్రహ్మ, శివుడు, శేషుడు అనువారు దేవతలు వచ్చారు. వాయువు, కాముని చెవిలో ప్రయత్నంగా ఇట్లా చెప్పాడు. (27) ఓ మన్మథ! స్మరించు. మహామాయను,దుర్గను, దుర్గతిని నశింపచేసే దాన్ని స్మరించు. వాయువు మాటవిని మన్మథుడు దుర్గను స్మరించాడు. (28) అప్పుడు శూలము ఆతని అంగమందు రమ్యమైన మనోహరమైన, మాలగా మారింది. బ్రహ్మస్త్రముతో ఆరాక్షసుని మన్మథుడు ఆనందంతో చంపాడు. (29) రతిని తీసుకుని యానమందు (పల్లకి) ద్వారకానగరానికి వెళ్ళాడు. దేవతలంతా స్వయంగా పార్వతిని స్తుతించి వెళ్ళారు. (30)
మూ॥ రుక్మిణీ మంగలంకృత్వా ప్రజగ్రాహ రతింస్తుతం ।
ఉత్సవం కారయామాస పరం స్వస్త్యయనం హరిః ॥
బ్రాహ్మణాన్ భోజయామాస పూజయామాస పార్వతీం ।
అథకృష్ణః క్రమేణేవ వేదోక్తే మంగలేదినే ॥
సప్తానాం రమణీనాంచ పాణిగ్రాహంచకరహ ।
కాలిందం సత్యభామాంచ సత్యాం నాగ్నజితీం సతీం ॥
జాంబవతీం లక్ష్మణాంచ సముద్వాహం చకారసః ।
తాభిః సార్థంక్రమేథైవ పుత్రోత్పత్తిం చకారహ ॥
ఏకస్యాందశపుత్రాశ్చ కన్యకైకాక్రమేణచ ।
నిహత్య నరకందైత్యం సపుత్రంచ నృపేశ్వరం ॥
బలవంతం మురం దైత్యం జఘాన రణమూర్ధని ।
దదర్శకన్యాః తత్రస్థాః సహస్రాణాంచ షోడశ II
శతాధికా వయస్యాశ్చ శశ్వత్ సుస్థిర వనాః ।
ప్రపుల్ల వదనాః సర్వాః రత్నభూషణ భూషితాః ॥
శుభక్షణేచ తాసాంచ పాణిం జగ్రాహ మన్మథః ।
తాభిః సార్థం సరేమేచ క్రమేణచ శుభక్షణే ॥
ఏకస్యాం దశపుత్రాశ్చ కన్యకైకాక్రమేణచ !
హరే రేతాన్య పత్యానిబభూవుశ్చ పృథక్ పృథక్ ॥
ఏకదా ద్వారకాం రమ్యాం దుర్వాసాముని పుంగవః ।
శిష్యైత్రికోటిభిస్సార్థం ఆ జగామావలీలయా ॥
రాజామహోగ్ర సేనశ్చ సపుత్రం సపురోహితః ।
వసుదేవో వాసుదేవోప్యక్రూరశ్చోద్ధవస్తథా ॥
నీత్వాషోడశోపచారం ప్రణీముర్మునిపుంగవం ।
శుభాశిషంచ ప్రదదౌతేభ్యో బ్రహ్మన్ పృథక్ పృథక్ ॥
ఏకానంశాంచ కన్యాంతాందదౌ తస్మైశుభాశ్రమం ।
ముక్తామాణిక్య హీరాంశ్చ రత్నంచ బోతుకందదౌ ।
సరేమే రామయా సార్థం మ హేంధ్ర రత్నమందిరే ।
రత్నేంద్ర సారనిర్మాణం దదౌ తస్మైశుభాశ్రమం II
ఏకదా సముని శ్రేష్ఠః సమాలోచ్య స్వచేతసా ।
శయనం కుత్రచిద్రమల పర్యంకే రత్ననిర్మితే ॥
శ్రుతవంతం పురాణంచ శ్రద్ధయా కుత్రచిత్ విభుం ।
మహోత్సవే నియుక్తంచ కుత్రచిత్ ప్రాంగణేశుభే ॥
తాంబూలం భుక్తవంతంచ భక్త్యాదత్తంచ సత్యయా ।
కుత్రచి త్సేవితం తల్పే రుక్మిణ్య శ్వేతచామరైః ।
అను!! రుక్మిణి మంగళకార్యము చేసి రతిని కొడుకును స్వీకరించింది. హరి, ఉత్సవమును మిక్కిలి స్వస్త్యయనమును (మంగళ ఆ కార్యం) చేయించాడు. (31) బ్రాహ్మణులను భుజింపచేశాడు. పార్వతిని పూజించాడు. పిదపకృష్ణుడు క్రమంగా వేదమందు చెప్పిన శుభదినమందు (32) ఏడుగురు స్త్రీల పాణిగ్రహణము చేశాడు కాళింది, సత్యభామ, సత్యసతి, నాగ్నజితి (33) జాంబవతి, లక్ష్మణ వీరిని ఆతడు వివాహమాడాడు. వారితో కలిసి క్రమంగా పుత్రులను ఉత్పత్తి చేశాడు. (34) ఒకామె యందు పదిమంది కొడుకులు ఒక కన్యక క్రమంగా కలిగారు. నరకుడను రాక్షసుని, పుత్రులతో సహా ఆరాజును చంపాడు. (35) యుద్ధరంగమందు, బలవంతుడైన ముర అను రాక్షసుణ్ణి చంపాడు. అక్కడున్న పదహారు వేల కన్యలను చూచాడు.(36) వారలకు నూర్లకొలది చెలికత్తెలు,ఎప్పుడు స్థిరమైన యవ్వనవతులు ఉన్నారు. వారంతా వికసించిన ముఖాలతో, రత్నాభరణములతో అలంకరింపబడి ఉన్నారు. (37) మాధవుడు ఒక శుభక్షణమందు వారిని పాణిగ్రహణం చేసుకున్నాడు. వాళ్ళతో కూడి శుభక్షణమందు క్రమంగా రమించాడు. (38) ఒకామె యందు పదిమంది కొడుకులు ఒక కన్యక క్రమంగా కలిగారు. హరికి ఈ సంతానము విడివిడిగా కలిగారు. (ఒక్కొక్కరికి) (39) ఒకసారి రమ్యమైన ద్వారకకు దుర్వాసుడను మునిశ్రేష్ఠుడు మూడు కోట్లమంది శిష్యులతో కూడా అవలీలగా వచ్చాడు. (40) ఉగ్రసేన మహారాజు, పుత్రులు, పురోహితుడు, వసుదేవుడు, వాసుదేవుడు, అక్రూరుడు, ఉద్ధవుడు వీరందరితో కలిసి (41) వారిని తీసుకొని పోయి షోడశోపచారములతో పూజించి, ఆమునిపుంగవునికి నమస్కరించారు. ఆ బ్రహ్మ వారందరికి విడివిడిగా శుభాశీస్సులనిచ్చాడు. (42) ఒకఅంశమైన కన్యను, ఒక శుభక్షణమందు ఆతనికిచ్చాడు ముత్యములు, మాణిక్యములు, వజ్రములు, రత్నములు వీనిని అరణంగా ఇచ్చాడు. (43) ఆతడు ఆరామతో, మ హేంద్రమందలి రత్నమందిరమందు రమించాడు. శ్రేష్టమైన రత్నసారములతో నిర్మింపబడిన శుభమైన ఆశ్రమాన్ని ఆతనికిచ్చాడు. (44) ఒకనాడు ఆ మునిశ్రేష్ఠుడు తన మనసులో ఆలోచించి కృష్ణుని చూడబయలుదేరాడు. కృష్ణుడు ఒకచోట రత్నములతో నిర్మించిన రమ్యమైన పడకయందు నిద్రిస్తున్నట్లుగా చూచాడు. (45) ఒకచోట శ్రద్ధగా పురాణం వింటున్నట్లుగా ఉన్న విభుని చూచాడు. ఒకచోట మంచి ప్రాంగణమందు మహోత్సవమందు పాల్గొన్నట్లుగా చూచాడు. (46) భక్తితో సత్య ఇస్తున్న తాంబూలాన్ని తింటున్నట్లుగా చూచాడు. ఒకచోట కృష్ణుడు పడకయందుండగా తెల్లని చామరములతో రుక్మిణి సేవిస్తున్నట్లుగా చూచాడు. (47)
మూII కాళిందీ సేవిత పదం శయానంకుత్రచిన్ముదా ।
సర్వత్ర సమసంభాషాం చకార భగవాన్ మునిః ॥
విస్మయం ప్రయణా విప్రోదృష్ట్వా తత్పరమాద్భుతం ।
తుష్టావ జగతీనాథం రుక్మిణీ మందిరే పునః
వసంతంచ సుధర్మాణాం సతాం సంసది సుందరం ॥
దుర్వాసా ఉవాచ :
జయజయ జగతాంనాథ జితసర్వ జనార్ధన సర్వాత్మక ।
సర్వేశ సర్వబీజ పురాతన నిర్గుణ నిరీహ నిర్లిప్త
నిరంజన నిరాకార భక్తానుగ్రహ విగ్రహ ।
సత్యస్వరూప సనాతన నిఃస్వరూప నిత్య నూతన
బ్రహ్మేశ శేషధనేశ వందిత పద్మయా సేవితపాదపద్మ ।
బ్రహ్మజ్యోతి రనిర్వచనీయ వేదావిదితగుణరూప
మహాకాశ సమ్మాననీయ పరమాత్మన్నమోస్తుతే ॥
ఇత్యే వముక్త్వా మనసా హరేరనుమతేనచ ।
ప్రణమ్య తస్థౌవిప్రేంద్రః తత్రైవ పురతోహరేః ॥
తమువాచ జగన్నాథ్ హితం సత్యంపురాతనం ।
జ్ఞానంచ వేద విహితం సర్వేషాం సతాం మతం ॥
శ్రీభగవానువాచ :
మాభైః విప్ర శివాంశస్త్వం కింనజానాసి జ్ఞానతః ।
అహంసర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ॥
అహమాత్మాచ సర్వేషాం శవాః సర్వేమయావినా ।
ప్రాణిదేహాన్మయిగతే యాంత్యేవ సర్వశక్తయః ॥
జాతావ ప్యేక ఏవాహం వ్యక్త ఏవపృథక్ పృథక్ ।
యోభుంక్తే తస్యతృప్తిః స్యాన్నాన్యేషాంచ కదాచన ॥
పృథర్జీవాది సర్వేషాం ప్రతిమానంచ ప్రాణినాం ।
పరిపూర్ణతమోహంచ గోలోకే రాసమండలే ॥
శ్రీరామశాపాద్రాధాసా మాంద్రష్టుమక్షమాజధునా ।
సర్వేచైవాంశ రూపేణ కలయాచతదంశతః ॥
రుక్మిణీ మందిరే చాంశోప్యన్యాసాం మందిరే కలాః ।
మమాపికుత్ర చిచ్చాంశం కుత్రచిచ్చకలాకలాః ॥
కలాకలాంశాః కుత్రాపి ప్రతిమాసుచ దేహిషు ।
ఇత్యుక్త్వా జగతాం నాథో గృహస్యాభ్యంతరం యథా ।
దుర్వాసాశ్చప్రియాంత్యక్త్వా శ్రీహరేస్తపసే గతః ॥
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధే నారాయణ నారద సంవాదే ముని కృష్ణసంవాదే ద్వాదశాధిక శతతమోధ్యాయః ॥
ఒకచోట కాళింది పాదములొత్తు చూడగా ఆనందంగా నిద్రపోతున్నట్లు చూచాడు. భగవానుడు, ముని అంతటా సమానంగా సంభాషణ చేశాడు.(48) ఆపరమాద్భుతాన్ని చూచి ఆవిప్రుడు ఆశ్చర్యపడ్డాడు. తిరిగి రుక్మిణి మందిరంలో జగన్నాథుని స్తుతించాడు. సుందరమైన సజ్జనుల సభయందు సుధర్మయందు ఉన్న కృష్ణుని చూచాడు. (49) దూర్వాసుడిట్లన్నాడు - జయము జయము, ఓ జగన్నాథ! అన్నిటిని జయించినవాడ దుష్ట జనమును శిక్షించేవాడ! (జనులచే పొగడబడేవాడ) అందరికి ఆత్మయైన వాడ! అందరికి ఈశుడ! అందరికి బీజమైనవాడ! పురాతనుడ! నిర్గుణుడ! ఈహ(కోరిక) లేనివాడ! నిర్లిపుడ! నిరంజనుడ! నిరాకారుడ! భక్తులను అనుగ్రహించే కొరకు రూపం ధరించేవాడ! సత్యస్వరూపుడ! సనాతనుడ! నిఃస్వరూపుడ! నిత్యనూతనుడ! బ్రహ్మ, ఈశ, శేష, ధనేశులచే నమస్కరింప బడేవాడ! పద్మతో సేవింపబడే పాదపద్మములు కలవాడ! బ్రహ్మజ్యోతి! అనిర్వచనీయుడ! వేదములతో కూడా తెలియబడని గుణములు, రూపము కలవాడ! మహాకాశము వలె గౌరవించతగినవాడ! ఓ పరమాత్మ! నీకు నమస్కారము అని (50) మనస్సుతో ఇట్లా పలికి, హరి అనుమతితో నమస్కరించి, అక్కడే హరికి ఎదురుగా విప్రేంద్రుడు కూర్చున్నాడు. (51) ఆతనితో జగన్నాథుడు, హితమైన సత్యమైన, పురాతనమైన,వేదవిహితమైన జ్ఞానమును, సజ్జనులందరికి నచ్చిన మాట అన్నాడు. (52) భగవంతుడిట్లా - ఓ విప్ర! భయపడవద్దు. నీవు శివుని అంశమువు, జ్ఞానంతో తెలుసుకోలేవా. నేను అన్నిటికి పుట్టుక స్థానము. నానుండే అన్ని ప్రవర్తిస్తాయి. (53) నేనందరికి ఆత్మను. నేను లేకపోతే అంతా శవాలు. ప్రాణుల దేహం నుండి నేనుపోతే అన్ని శక్తులు పోతాయి. (54) జాతిలో కూడా నేనొక్కణ్ణి, విడివిడిగా వ్యక్తమౌతుంటాను అంతే. ఎవడైనా తింటే వాడికే తృప్తి ఔతుంది. ఇతరులకెప్పుడూ కాదు. (55) విడివిడిగా ఉన్న జీవాదులందరికి ప్రాణులకు నేనొక్కడనే ప్రతిమను. గోలోకంలో రాసమండలమందు నేను పరిపూర్ణతముడను. (56) శ్రీరాముని శాపం వల్ల ఆరాధ, నన్ను ఇప్పుడు చూడటానికి అసమర్ధురాలు. అందరూ నా అంశరూపులే; కలతోనో, దాని అంశతోనో, (57) రుక్మిణీ మందిరంలో నా అంశము. ఇతరుల మందిరాలలో కలలు మాత్రమే (తునకలు) నాకు కూడా ఒకచోట అంశము మరోచోట కలలు, కలలు (58) కల, కలాంశలు ఎక్కడైనా ప్రతిమలలో, ప్రాణులలోను అని పలికి జగత్తునకు నాథుడైన కృష్ణుడు ఇంటిలోపలికి వెళ్ళాడు. (59) దుర్వాసుడు కూడా ప్రియను వదలి శ్రీహరిని గూర్చి తపస్సు చేయటానికి వెళ్ళాడు. (60)
అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు ముని కృష్ణుల సంవాదమందు నూట పన్నెండవ అధ్యాయము.
Summary of chapter 112 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
This chapter features the magnificent hymn of praise composed by Lord Anantadeva, glorifying Lord Śrī Kṛshṇa as the uncaused cause of all causes, the foundation of all planetary spheres, and the ultimate source of all divine incarnations. Anantadeva expresses profound gratitude for being blessed with the opportunity to serve as the Lord's bed, umbrella, and eternal companion across all ages.