మూ॥ శ్రీనారాయణ ఉవాచ :
కృష్ణః సాందిపినేర్దేహం గత్వాచ సబలో ముదా ।
నమశ్చకార స్వగురుం గురుపత్నీం పతివ్రతాం ॥
శుభాశిషం గృహీత్వాచ దత్వారత్న మణిం హరిః ।
గురువే తస్యభార్యాయైత మువాచ యథోచితం ।
శ్రీకృష్ణ ఉవాచ :
త్వతో విద్యాం లభిష్యామి వాంఛితాం వాంఛితం మమ ।
కృత్వాశుభక్షణం విప్ర మాం పాఠయ యథోచితం ॥
ఓమిత్యుక్త్యామునిశ్రేష్ఠః పూజయామాస తం ముదా ।
మధుపర్కప్రాశనేన గవావస్తేణ చందనైః ॥
మిష్టాన్నం భోజయామాస తాంబూలంచ సువాసితం !
సుప్రియం కథయామాస తుష్టావ పరమేశ్వరం ॥
సాందీపిని రువాచ :
పరం బ్రహ్మ పరంధామ పరమీశ పరాత్పర ।
స్వేచ్ఛామయం స్వయం జ్యోతిః నిర్లి ప్తై కో నిరంకుశః ॥
భక్తైకనాథ భకేష్ట భక్తానుగ్రహ విగ్రహ ।
భక్త వాంఛకల్పతరో భక్తానాం ప్రాణవల్లభ ॥
మాయయా బాలరూపోసి బ్రహ్మేశ శేష వందితః ।
మాయయా భువిభూపాల భువో భారక్షయాయచ ।
యోగినో యం విదంత్యేవం బ్రహ్మ జ్యోతిః సనాతనం ।
ధ్యాయంతే భక్త నివహాజ్యోతి రభ్యంతరే ముదా ॥
ద్విభుజం మురలీహస్తం సుందరం శ్యామరూపకం ।
చందనోక్షిత సర్వాంగం సస్మితం భక్తవత్సలం ॥
పీతాంబరధరం దేవం వనమాలా విభూషితం ।
లీలాపాంగతరంగైశ్చ నిందితానంగ మూర్ఛితం ॥
అలక భవనం తద్వత్ పాదపద్మం సుశోభనం ।
కౌస్తుభోద్భాసితాంగంచ దివ్యమూర్తిం మనోహరం ॥
శ్రీనారాయణుడిట్లన్నాడు –
కృష్ణుడు, సాందీపిని గృహానికి బలరామునితో కలిసి ఆనందంగా వెళ్ళాడు. తన గురువుకు, పతివ్రతయైన గురుపత్నికి నమస్కరించాడు. (1) శుభాశీస్సులను పొంది, హరి, రత్నమణులను గురువునకు గురుభార్యకు ఇచ్చి, ఆతనితో తగినట్లుగా ఇట్లన్నాడు. (2) శ్రీకృష్ణుడిట్లా- నీ నుండి, నాకు కావలసిన విద్యను పొందుతాను, ఇది నా కోరిక. ఓ విప్ర! శుభమైన కాలాన్ని నిర్ణయించి, తగినట్లుగా నన్ను చదివించు. (3) మునిశ్రేష్ఠుడు, సరే, అట్లాగే అని ఆతడు, ఆనందంతో కృష్ణుని పూజించాడు. మదుపర్కము తాగించాడు. గోవు, వస్త్రము, చందనము (4) ఇచ్చి తీపి పదార్థములను తినిపించి, వాసనగల తాంబూలము ఇచ్చాడు. చాలా ప్రేమగా చెప్పసాగాడు. పరమేశ్వరుని సంతోషపరిచాడు. (5) సాందీపిని ఇట్లా - పరబ్రహ్మవు పరమమైన స్థానమునీది. గొప్ప ఈశుడవు, పరాత్పరుడవు. స్వేచ్ఛామయుడవు, స్వయంజ్యోతివి, నిర్లిప్తుడవు. ఒక్కడివి. నిరంకుశుడవు. (6) భక్తులకు నాథుడవు నీవొక్కడివే, భక్తులకు ఇష్టమైన వాడివి. భక్తులను అనుగ్రహించే కొరకు రూపం ధరించినవాడవు. భక్తుల కోరికలకు కల్పతరువువు. భక్తులకు ప్రాణవల్లభుడవు. (7) మాయతో బాలుడి రూపమైనావు. బ్రహ్మ, ఈశ, శేషులు నీకు నమస్కరిస్తారు. మాయతో భూమి పై భూపాలుడివైనావు. భూభారాన్ని నశింపచేయవచ్చావు. (8) నీవు బ్రహ్మ జ్యోతివని, సనాతనుడవని యోగులు ఇట్లా తెలుసుకుంటారు. భక్తుల సమూహాలు అభ్యంతరమందు (మనస్సులో) ఆనందంతో జ్యోతి స్వరూపునిగా ధ్యానిస్తారు. (9) రెండు చేతులు, చేతిలో మురళి, సుందరమైన శ్యామల వర్ణరూపము. అవయవములన్నింటా చందనం చల్లబడ్డావు. చిరునవ్వుతో ఉన్నావు, భక్తవత్సలుడవు. (10) పీతాంబరమును ధరించిన దేవుడ! వనమాలతో అలంకరింపబడ్డవాడ. విలాసము కొరకైన ఓరచూపుల వరుసతో అనంగుని వెక్కిరిస్తూ, మూర్చింపచేస్తున్నవాడ, (11) భవనమంతా నీ పాదపద్మకాంతితో లత్తుకపూసినటై చాలా అందంగా ఉంచినవాడ కౌస్తుభమణితో ప్రకాశిస్తున్న శరీరం గలిగిన దివ్య రూపము గలిగి మనోహరంగా ఉన్నవాడ.(12)
మూ॥ ఈషద్ధాస్య ప్రసన్నంచ సువేషం ప్రస్తుతం సురైః ।
దేవదేవం జగన్నాథం త్రైలోక్య మోహనం పరం ॥
కోటికందర్ప లీలాభం కమనీయ మనీశ్వరం ।
అమూల్యరత్న నిర్మాణ భూషణా ఘన భూషితం ॥
వరం వరేణ్యం వరదం వరదానా మభీప్సితం ।
చతుర్ణామపి వేదానాం కారణానాంచ కారణం ॥
పాఠార్థం మత్ర్పియస్థాన మాగతో ఒసిచ మాయయా ।
పాఠం తే లోక శిక్షార్థం రమణం గమనం రణం
స్వాత్మారామస్యచ విభోః పరిపూర్ణతమస్యచ ॥
గరుపత్న్యువాచ :
అద్యమే సఫలం జన్మ సఫలం జీవనం మమ ।
పాతివ్రత్యంచ సఫలం సఫలంచ తపోవనం ॥
మద్దక్షహస్తః సఫలో దత్తం యేనాన్నమీప్సితం ।
తదాశ్రమం తీర్థపరం తీర్థపాదపదాంకితం ॥
తత్పాదరజసా పూతాగృహాః ప్రాంగణముత్తమం ।
యస్య త్వత్పాదపద్మం చైవావయోర్జన్మ ఖండనం ॥
తావద్దుఃఖంచ శోకశ్చ తావద్భోగశ్చ రోగకః ।
తావజ్జన్మాని కర్మాణి క్షుత్పిపాసాదికానిచ ।
యావత్ త్వత్పాదపద్మస్య భజనంనాస్తి దర్శనం ॥
హేకాలకాల! భగవన్! స్రష్టు సంహర్తురీశ్వర ।
కృపాంకురు కృపానాథ మాయామోహ నికృంతన ॥
ఇత్యుక్త్వా సామ్రనేత్రాసాక్రోడే కృత్వాహరింపునః ।
స్వస్తనం పాయయా మాసప్రేమ్ణాచ దేవకీ యథా ॥
అను!! కొద్దిగా నవ్వుతున్న ప్రసన్నమైన ముఖము, మంచి వేషము, దేవతలతో పొగడబడ్డట్టి రూపము గల దేవదేవుడ, జగన్నాథుడ! త్రైలోక్య మోహనుడ, పరుడ, (13) కోటి మన్మథుల లీలవంటి లీలగలవాడ (కాంతి), కమనీయమైన వాడ, ఈశ్వరుడ, అమూల్యమైన రత్నములతో నిర్మించిన భూషణ సమూహములతో అలంకరింపబడినవాడ (14) వరుడ, వరేణ్యుడ, వరదుడ, కోరేవారికి ఇష్టమైన వాడ, నాలుగు వేదములకు కారణమైన వానికి కారణమ (15) మాయతో చదువు కొరకై నా ప్రియమైన స్థానానికి వచ్చావా. నీకు చదువు లోకులకు తెలియజేసే కొరకే, నీ రమణము (క్రీడలు) నీ క్రీడలు, నీ యుద్ధము అన్ని లోకులు నేర్చుకోవాలనే. నీవు స్వాత్మారాముడవు. విభుడవు, పరిపూర్ణతముడవు నీకెందుకీశిక్షణ (16) గురుపత్ని ఇట్లా అంటి - ఇవ్వాళ నా జన్మసఫలమైంది. నా బ్రతుకు సఫలమైంది. పాతివ్రత్యము సఫలమైంది. ఈ తపోవనము సఫలమైంది. (17) నా సమర్థమైన చేయి సఫలమైంది. ఇది కోరతగిన అన్నాన్ని పెట్టింది. ఈ ఆశ్రమము తీర్థపరమైనది. తీర్థపాదులపదములతో చిహ్నితమైంది కనుక. (18) నీపాదధూళితో గృహములు పవిత్రమైనాయి. ప్రాంగణము ఉత్తమమైంది. నీ పాదపద్మములు మా జన్మములను నశింపచే సేవి (19) ఈ దుః ఖము, శోకము, భోగము, రోగము, జన్మలు, కర్మలు, ఆకలిదప్పులు ఇవన్నీ నీ పాదపద్మముల సేవనము లేనంత వరకే, నీ దర్శనం కలుగనంత వరకే (20) ఓ కాలమునకే కాలమైనవాడ! భగవంతుడ! సృష్టించడానికి చంపటానికి సమర్థమైనవాడ! మాయా అనే మోహాన్ని నశింపచేసేవాడ! కృపానాథ! మా పై దయచూపు! (21) అని పలికి కన్నీరు నిండిన కళ్ళుగల ఆమె హరిని తిరిగి రొమ్ముయందుంచుకొని ప్రేమతో తన చనుపాలను, దేవకి తాగించినట్లుగా తాగించసాగింది. (22)
శ్రీకృష్ణ ఉవాచ :
మాతస్త్వంమాం కథంస్తౌషి బాలం దుగ్గముఖం సుతం ।
గచ్చ గోలోక మిష్టంచ స్వామినా సహ సాంప్రతం ॥
త్యక్త్యాప్రాకృతికం మిథ్యా నశ్వరంచ కలేవరం ।
విధాయనిర్మలం దేహం జన్మమృత్యు జరాహరం ॥
ఇత్యుక్త్వా చతురోవేదాన్ పఠిత్వా మునిపుంగవాత్ ।
మా సేన పరయాభక్త్యా యతాపుత్రం మృతం పురా॥
రత్నానాంచ త్రిలక్షంచ మణినాంపంచ లక్షకం ।
హీరకాణాం చతుర్లక్షం ముక్తానాం పంచలక్షకం ॥
మాణిక్యానాం ద్విలక్షంచ వస్త్రం త్రైలోక్య దుర్లభం ।
హారంచ దుర్గయాదత్తం హస్తరత్నాంగులీయకం ॥
దశకోటిం సువర్ణానాం గురవే దక్షిణాందదౌ ।
అమూల్యరత్న నిర్మాణం నారీసర్వాంగ భూషణం ॥
గురుప్రియాయై ప్రదదౌ వహ్నిశుద్ధాంశుకం వరం ।
మునిర్దత్వాచ పుత్రాయ తత్సర్వం ప్రియయసహ ॥
సద్రత్న రథమారుహ్య యయాగోలోక ముత్తమం ।
తమద్భుతం హరిందృష్ట్వాప్రయమౌ స్వాలయం ముదా ॥
ఏవం బ్రాహ్మణ్య దేవస్య చరిత్రం శృణు నారద ।
ఇదం స్తోత్రం మహాపుణ్యంయః పఠేద్భక్తి పూర్వకం ॥
శ్రీకృష్ణ నిశ్చలాంభక్తిం లభతే నాత్ర సంశయః
అస్పష్టకీర్తి సుయశాః మూర్భో భవతి పండితః ॥
ఇహలోకే సుఖం ప్రాప్య యాత్యంతే శ్రీహరేః పదం ।
తత్రనిత్యం హరేర్దాస్యం లభతే నాత్ర సంశయః ॥
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణ శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధే నారాయణ నారాద సంవాదే మునిపత్నీస్తోత్రం నామ ద్వ్యధిక శతతమోధ్యా యః ॥
అను ॥ శ్రీకృష్ణుడిట్లన్నాడు –
ఓ తల్లి! నీవు నన్నెట్లా స్తుతిస్తునావు, నేను బాలుణ్ణి, పాలుగారుతున్న ముఖం నాది. నీ కొడుకును (లాంటి). ఇప్పుడు నీ స్వామితో కూడి నీ కిష్టమైన గోలోకానికిపో. (23) ప్రాకృతికమైన మిథ్యయైన, నశించే ఈ శరీరాన్ని వదిలి, జన్మ, మృత్యు, ముసలితనములను నశింపచేసే నిర్మలదేహాన్ని ధరించి వెళ్ళు (24) అని పలికి మునిపుంగవునివద్ద మిక్కిలిభక్తితో నెలరోజులలో నాలుగు వేదములను పఠించి, ఇదివరలో చనిపోయిన గురుపుత్రుని తిరిగి బ్రతికించి ఇచ్చాడు. (25) మూడు లక్షల రత్నాలు, ఐదు లక్షల మణులు, నాలుగు లక్షల వజ్రాలు, ఐదు లక్షల ముత్యాలు (26) రెండు లక్షల మాణిక్యాలు, ముల్లోకములందు లభించనట్టి వస్త్రాలు, దుర్గ ఇచ్చిన హారము, చేతికి ఉన్న రత్నపుటుంగరము (27) పదికోట్ల బంగారము ఇవన్నీ గురువునకు దక్షిణగా ఇచ్చాడు. అమూల్య రత్నములతో నిర్మింపబడ్డ, స్త్రీలు అన్ని అవయవములందు ధరించే ఆభరణాలు (28) శ్రేష్ఠమైన, వహ్నిశుద్ధమైన వస్త్రము ఇవన్నీ గురువుగారి పత్నికి ఇచ్చాడు. ముని ఇవన్ని తన పుత్రునకు ఇచ్చి, భార్యతో కూడి (29) మంచి రత్నములతో చేసిన రథమెక్కి, ఉత్తమమైన గోలోకానికి వెళ్ళాడు. ఆ అద్భుతాన్ని హరిచూచి ఆనందంతో తన ఇంటికెళ్లాడు. (30) ఓ నారద! ఇట్లా బ్రాహ్మణ్య దేవుని చరిత్ర విన్నావు. ఈ మహాపుణ్యకరమైన స్తోత్రాన్ని భక్తితో చదివినవారికి (31) శ్రీకృష్ణుడియందు నిశ్చలమైన భక్తి కలుగుతుంది. ఇందులో అనుమానం లేదు. అంతంత మాత్రం పేరు గలవాడు మంచికీర్తిమంతుడౌతాడు. మూర్ఖుడు పండితుడౌతాడు. (32) ఈలోకంలో, సుఖాన్ని పొంది, చివర శ్రీహరి పాదసన్నిధికి చేరుతాడు. అక్కడ ఎప్పుడు హరిదాస్యములభిస్తుంది, అనుమానం లేదు. (33)
అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు మునిపత్నియొక్క (చేసిన) స్తోత్రమనునది నూట రెండవ అధ్యాయము.
Summary of chapter 102 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Analyzing the ultimate destinations of spiritual seekers, this chapter clarifies the four traditional types of liberation—Sālokya, Sāmīpya, Sārūpya, and Sārshṭi—along with impersonal Sayujya mukti. The text asserts that pure Vaishṇava devotees reject even these grand forms of liberation if they interfere with loving devotional service, choosing instead the unalloyed sweetness of Bhakti, which allows them to serve the lotus feet of Śrī Kṛshṇa eternally.