బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

72 - అధ్యాయము

మూII శ్రీనారాయణ ఉవాచ –

అథ కృష్ణో గురుం నత్వా నిర్గమ్య శిబిరాన్మునే

ఆరుహ్య స్వర్గయానంచ శుభాం మధుపురీం యయౌ

వివేశ మధురాం రమ్యాం సహాక్రూరగణైః సమం

నిర్జిత్య శక్రనగరీం శోభాయుక్తాం మనోహరాం

రత్నశ్రేష్టేన ఖచితం రచితాం విశ్వకర్మణా

అమూల్య రత్నకలశై: రాజితైశ్చ విరాజితాం

రాజమార్గశతైరిష్టై ర్వేష్టితాం రుచిరైర్వరైః

చంద్రాకారైశ్చంద్ర సారై: మణిభిఃపరిసంస్కృతైః

విచిత్రైః మణిసారైశ్చ వీధీశత వినిర్మితైః

శోభితైః వణిజై:శ్రేష్టై: పుణ్యవస్తు సమన్వితైః

సరోవర సహస్రైశ్చ పరితః పరిశోభితాం

శుద్ధస్ఫటిక సంకాశైః పద్మరాగవిరాజితైః

రత్నాలంకార భూషాఢ్యైః: శోభితాం పద్మినీగణైః

స్థిరమౌవన సంయుకై: నిమేషరహితైః పరైః

సాక్షతైరూర్ధ్వ వదనైః కృష్ణదర్శనలాల సైః

భ్రూభంగలీలాలోలైశ్చ శశ్వచ్చంచలలోచనైః

శశ్వత్కామసమాయుక్తైః పీనశ్రోణిపయోధరైః

కోమలాంగైః మధ్యకూ పైః రతిరాసవిశారదైః

రత్ననిర్మాణ యానానాం కోటిభిః పరిశోభితాం

భూషణైః భూషితాభిశ్చ చిత్రితాభిశ్చచిత్రకైః

నానా ప్రకారశ్రీయుక్తాం పుష్పోద్యానత్రికోటిభిః

నానా పుష్పైః పుష్పితాభిః యుక్తాభిర్మధుసూదనైః

మాధుర్యమధుసంయుక్తైః మధులుబ్ధైః ముదాన్వితైః

మాధ్వీక మదుమతైశ్చ యుక్తైర్మధుకరీచయైః

నానా ప్రకారదుర్గైశ్చ దుర్గమ్యాంవైరిణాం గణైః

రక్షితాంరక్షకైః శశ్వత్ రక్షాశాస్త్ర విశారదైః

త్రికోట్యాట్టాలికాభిశ్చ సంయుక్తాం సుమనోహరాం

రచితాం కిల సద్రత్నైః విచిత్రైః విశ్వకర్మణా

ఏవం భూతాంచ మధురాం దృష్ట్వా కమలలోచనః

దదర్శ పథి కుబ్జాం తాం వృద్ధామతి జరాతురాం

యాంతీం దండసహాయేన చాతినమ్రాం నమద్వలీం

రుషితాం వికృతాకారాంబిభ్రతీం చందనద్రవం

కస్తూరీ కుంకుమాక్తంచ స్పృష్టమాత్రేణ నారద

సుగంధి మకరందేన గంధాఢ్యం సుమనోహరం

సాదృష్ట్వా సస్మితా వృధా శ్రీకాంతం శాంతమీశ్వరం

శ్రీయుక్తం శ్రీనివాసంతం శ్రీబీజం శ్రీనికేతనం

ప్రణమ్య సహసా మూర్ద్నా భక్తినమ్రా పుటాంజలిః

ప్రదదౌచందనంతస్య గాత్రేశ్యామల సుందరే

గాత్రేషు తద్గణానాంచ, స్వర్ణ పాత్రకరా వరా

కృత్వా ప్రదక్షిణం కృష్ణం ప్రణనామ పునః పునః

శ్రీ నారాయణుడిట్లన్నాడు:

పిదప కృష్ణుడు గురువునకు నమస్కరించి, శిబిరమునుండి బయలువెడలి, ఓముని ! స్వర్గమానమును అధిరోహించి, శుభకరమైన మధు(రా)పురికి వెళ్ళాడు (1) అక్రూరుడు ఇతర గణములతో పాటు రమ్యమైన మధురను ప్రవేశించాడు. శోభగలది, మనోహరమైనది, ఇంద్రనగరాన్ని జయించినట్లుగా ఉందిది. (2) శ్రేష్ఠమైన రత్నములతో పొదగబడింది (అమర్చారు). విశ్వకర్మతో రచించబడింది. వెండితో చేసిన అమూల్య రత్నకలశములతో వెలిగిపోతోంది. (3) అందమైన, శ్రేష్ఠమైన, ఇష్టమైన, నూర్లకొలది రాజమార్గములతో ఆవరింపబడింది. చంద్రుని ఆకారముగల, చంద్రుని సారము (చల్లదనము) గలబాగా సంస్కరింపబడిన మణులతో నిర్మించబడ్డది. (4) విచిత్రములైన మణిసారములతో నూర్లకొలది వీధులతో నిర్మింపబడ్డది. పుణ్యమైన వస్తువులుగల, శ్రేష్ఠులైన వణిజులతో శోభిస్తుంది. (5) చుట్టూ వేలకొలది సరోవరములతో శోభిస్తోంది. అవి శుద్ధమైన స్ఫటికములతో సమానమైన వానితో, పద్మరాగమణులతో వెలిగిపోతున్నాయి. (6) రత్నాలంకార భూషణములతో కూడిన, శోభిస్తున్న, పద్మినీ గణములుగలది, స్థిరమైన యౌవ్వనములతో కూడిన, రెప్పపాటులేని, శ్రేష్ఠులైన వారితో కూడినది (నగరి) (7) చేత అక్షతలు ధరించి, ముఖములు పైకెత్తి కృష్ణుని చూడటంలో ఆసక్తి కలిగి, కనుబొమల కదలికలో (ఆటలో) చంచలమైన, ఎప్పుడూ కదులుతూన్న కళ్ళుగల (8) ఎప్పుడూ కామంతో కూడిన, బలిసిన పిరుదులు, రొమ్ములుగల, కోమలమైన అవయవములుగల మధ్యమందు కూపము (నాభి)గల, రతి, రాసక్రీడలో విశారదులైన ఆడవారు కలదది (9) రత్నములతో నిర్మింపబడిన కోట్లకొలది యానములతో ప్రకాశిస్తుందది. భూషణములతో అలంకరింపబడిన చిత్రములతో (బొమ్మలు) చిత్రింపబడినవవి (10) పుష్పములుగల మూడు కోట్ల ఉద్యానవనములతో కూడి అనేకరకాలైన శ్రీకలదది. తుమ్మెదలతో కూడిన, వికసించిన రకరకాల పూలుగలది (11) మాధుర్యముగల మధువుతో (తేనె) కూడిన, మధువుయందు ఆశగల, ఆనందముతో కూడిన ఇప్ప తేనెతో మత్తెక్కిన తుమ్మెదల గుంపుతో కూడిన పూలవి. (12) నానా ప్రకారములైన దుర్గములతో శత్రువర్గములకు ప్రవేశింపరానిది. రక్షణశాస్త్రమందు విశారదులైన రక్షక భటులతో ఎల్లప్పుడూ రక్షింపబడేది. (13) మనోహరమైన మూడుకోట్ల అంతస్తులుగల భవనములతో కూడింది. విశ్వకర్మవిచిత్రములైన మంచిరత్నములతో దానిని నిర్మించాడు. (14) ఇటువంటి మధురను చూచి కమలలోచనుడు, దారిలో వృద్దురాలు, చాలా ముసలితనంతో వ్యాకులపడుతున్న ఆకుజ్ఞను చూచాడు. (15) కట్టెసహాయంతో వెళొంది, చాలా వంగిది. వంగిన వళులు (ముడుతలు) గలది. కోపంగలది, వికారరూపం గలది. చందనద్రవ్యమును ధరించింది. (16) కస్తూరి కుంకుమలతో పూయబడింది. ఓ నారద! ముట్టుకుంటే అంటేవవి. వాసనగల మకరందంతో మిక్కిలి మనోహరమైనది, గంధము గలది. (17) ఆమె వృద్ధురాలు చిరునవ్వు నవ్వుతూ శాంతుడు, ఈశ్వరుడుఐన శ్రీకాంతుని చూచింది. ఆతడు శ్రీయుక్తుడు, శ్రీనివాసుడు, శ్రీబీజుడు, శ్రీనికేతనుడు, ఆతనిని చూచి (18) భక్తితోనమ్రురాలై చేతులు జోడించి, తలవంచి, త్వరగా నమస్కరించి, శ్యామలమైన సుందరమైన ఆతని శరీరం పై చందనం పూసింది. (19) చేత బంగారుపాత్ర ధరించిన శ్రేష్టురాలైన ఆమె, ఆతని (కృష్ణుని) గణముల శరీరమందును చందనం పూసి, కృష్ణునకు ప్రదక్షిణం చేసి, మాటిమాటికి నమస్కరించింది.

మూII శ్రీకృష్ణదృష్టిమాత్రేణ శ్రీయుక్తా సా బభూవ హా

సహసా శ్రీసమా రమ్యారూపేణ యౌవ్వనేనచ

వహ్నిశుద్ధా సువసనా రత్నభూషణ భూషితా

యథాద్వాదశ వర్షీయా, కన్యా ధన్యా మనోహరా

బింబోష్ఠీ సస్మితా శ్యామా తప్తకాంచన సన్నిభా

సుశ్రోణీ సుదతీ బిల్వఫలత్యులపయోధరా

అమూల్యరత్ననిర్మాణ హారసార విరాజితా

గజేంద్ర రాజగమనా రత్నమంజీర రంజితా

బిభ్రతీ కబరీభారం మాలతీ మాల్యవేష్టితం

రక్షితం వామభాగేన రుచిరం వర్తులాకృతిం

సిందూరబిందుం దధతీ దాడిమీకుసుమాకృతిం

కస్తూరీ బిందుముపరి సార్థం చందనబిందుభిః

రత్నదర్పణహస్తాచ ప్రశస్తా రతికర్మసు

శ్రీకృష్ణం వరయామాస లోలలోచనకోణతః

శ్రీవాసస్తాం సమాశ్వాస్య యయౌ స్థానాంతరం పరం

కృతార్థ రూపా సాప్రీత్యా యయౌ పద్మా యథాఽలయం

సా దదర్శ స్వభవనం యథా పద్మాలయాలయం

రత్నశయ్యా విరచితం సద్రత్నసార నిర్మితం

రత్నప్రదీపరాజీబీ రాజితాభిశ్చ రాజితం

రత్నదర్పణరాజైశ్చ రాజితం పరితస్తతః

సిందూరవస్త్రతాంబూలం శ్వేతచామరమాల్యకం

బిభ్రతీభిశ్చదాసీభిర్వేష్టితం దాససంఘకైః

తత్ర గత్వాచ భుక్త్వాచ మిష్టాన్నం పరమం ముదా

సుష్వాప రత్నపర్యంకే సాదాసీభిశ్చ సేవితా

సకర్పూరంచ తాంబూలం కస్తూరీ కుంకుమాన్వితం

చందనం స్థాపయామాస స్వతల్పే హరయేసతీ

మాలతీ మాల్యయుగలం కర్పూరాది సువాసితం

శీతలం సలిలం స్వాదు మిష్టాన్నం స్వసమీపతః

కర్మణా మనసావా చా చింతయంతీ హరేః పదం

హరేరాగమనం చాపి ముఖచంద్రం మనోహరం

జగత్కృష్ణమయం శశ్వత్ పశ్యంతీ కాముకీ మునే

కోటికం దర్పలీలాభం కామసక్తం చకాముకం

తతో దదర్శ శ్రీకృష్ణో మాలాకారం మనోహరం

మాలాసమూహం బిభ్రంతం గచ్ఛంతం రాజమందిరం

సోఽపీ దృష్టాచ శ్రీకాంతం ప్రణమ్యశిరసాభువి

దదౌ మాల్యసమూహంచ కృష్ణాయ పరమాత్మనే

కృష్ణస్త స్మై వరం దత్వా స్వదాస్యమతిదుర్లభం

మాల్యం గృహీత్వా ప్రయయౌ రాజమార్గం వరం వరః

శ్రీకృష్ణుని దృష్టిపడటంతోనే ఆమెశ్రీ (శోభ) యుక్తురాలైంది. రూపంలో, యౌవ్వనంలోనూ, అందకత్తెయై త్వరగా శ్రీసమురాలైంది. (21) అగ్నిశుద్దినందిన దానివలెనై, మంచివస్త్రములు గలదై, రత్నభూషణములతో అలంకరింపబడినదై పన్నెండు సంవత్సరాల కన్యవలె ఐంది. ధన్యురాలు మనోహరమైనది ఆమె. (22) బింబము వంటి పెదవి,చిరునవ్వుగలది, శ్యామల వర్ణము, కాల్చిన బంగారములా వెలుగుతోంది. చక్కని శ్రోణిభాగం, చక్కని పలువరుస, మారేడు పండ్లతో సమానమైన ఉరములు, (23) గలదైంది. అమూల్యమైన రత్నములతో చేయబడిన, హారములతో శ్రేష్టమైన వానితో వెలిగిపోతోంది. గజశ్రేష్ఠము వంటి నడకగలది. రత్నములతో చేసిన కాలి అందెలతో వెలిగిపోతోంది. (24) మాలతీ మాలలతో చుట్టబడిన కేశముల భారము కలది. ఎడమ భాగంలో (కేశభారం) ఉంచబడింది. అందంగా గుండ్రంగా ఉంది. (25) దాడిమపూవు ఆకారంలో సిందూర బిందువునొసట ధరించింది. ఆ పైన చందన బిందువులతో పాటు కస్తూరి బిందువును ఉంచింది. (26) చేతిలో రత్నములతో చేసిన అద్దంకలిగి ఉంది. రతికర్మయందు ప్రశస్తమైంది. చంచలమైన కళ్ల కొసల నుండి శ్రీకృష్ణుని వరించింది. (27) శ్రీవాసుడు ఆమెనోదార్చి, శ్రేష్ఠమైన మరో స్థానానికి వెళ్ళాడు. కృతార్థురాలైనట్లుగా ఆమె పద్మావతి తన ఆలయంలోకి వెళ్ళినట్లుగా ప్రీతితో వెళ్ళింది. (28) ఆమె తనభవనమును పద్మాలయ ఆలయంవలె ఉన్నట్లుగా చూసింది. రత్నముల శయ్యచేయబడింది, మంచి రత్నముల సారంతో నిర్మించబడింది. (29) రత్నదీపముల సమూహంతో, వెలిగిపోతున్న వాటితో ప్రకాశిస్తోంది. ఇటునటు రత్నదర్పణముల సమూహంతో వెలిగిపోతోంది. (30) సిందూరము, వస్త్రము, తాంబూలము తెల్లని చామరములు, మాలలు, వీటిని ధరించిన దాసిజనంతో, దాస సంఘములతో చుట్టబడింది. (31) అక్కడికి వెళ్ళి మిక్కిలి ఆనందంతో తీపి పదార్థములను తిని, ఆమె దాసిజనంతో సేవించబడుతూ, రత్నముల పడకయందు నిద్రపోయింది. (32) కస్తూరి, కుంకుమ పువ్వుతో, కర్పూరంతో కూడిన తాంబూలము, చందనము తన పడకయందు హరికై ఆమె ఉంచింది. (33) కర్పూరాదుల వాసనగల మాలతీ మాలలు రెండు, చల్లని తాగేనీరు, రుచికరమైన మంచి భోజనము తన సమీపంలో ఉంచుకుంది. (34) చేష్టల ద్వారా, మనస్సులో, మాటలలోను, హరిపద యుగళమును చింతిస్తోంది.మనోహరమైన చంద్రుని వంటి ముఖముగల, హరిరాకను గూర్చి చింతిస్తోంది. (35) ఓ ముని! ఆకాముకి, ఎప్పుడూ జగత్తంతా కృష్ణునితో నిండినట్లుగా చూస్తోంది. ఆతడు, కోటి కందర్పుల విలాసంగలవాడు, కామసక్తుడు, కాముకుడు (36) ఆ పిదప .మనోహరుడైన మాలాకారుని శ్రీకృష్ణుడు చూచాడు. మాలాసమూహమును చేత ధరించి, రాజమందిరమునకు వెళ్తున్నాడు. (37) ఆతడు కూడాశ్రీకాంతుని చూచి భూమి పై తలవంచి నమస్కరించాడు. మాలసమూహమును పరమాత్మమైన కృష్ణునకు ఇచ్చాడు. (38) అతి దుర్లభమైన తన దాస్యమును ఆతనికి వరముగా కృష్ణుడిచ్చాడు వరుడైన కృష్ణుడు, శ్రేష్ఠమైన రాజమార్గము గుండా మాలలను గ్రహించి వెళ్ళాడు.

మూ తతో దదర్శ రజకం బిభ్రంతం వస్త్ర పుంజకం

అహంకృతిబలిష్ఠంచ సతతం యౌవ్వనోద్దతం

వస్త్రం యయాచే తం కృష్ణో వినయేన మహామునే

స తస్మై న దదౌ వస్త్రం తమువాచచ నిష్ఠురం

రజక ఉవాచ

గోరకక్షానాం త్వయోగ్యం వస్త్రమేతత్సుదుర్లభం

రాజయోగ్యంచ హేమూఢ హేగోపజనవల్లభ

గృహీత్వా గోపకన్యాశ్చ కన్యాలోలుప లంపట

యద్విహారః కృతస్తత్ర వృందారణ్యేప్యరాజకే

నచాత్ర తాదృశం కర్మ రాజ్ఞః కంసస్య వర్త్మని

విద్యమానోఽత్రరాజేంద్రః శాస్తా దుష్టస్య తత్క్షణం

రజకస్య వచః శ్రుత్వా జహాసమధుసూదనః

జహాస బలదేవశ్చ సాక్రూరో గోపవర్గకః

తం నిహత్యచ పేటేన జగ్రాహ వస్త్ర పుంజకం

వస్త్రం సంధారయామాస శ్రీకృష్ణః సగణస్తథా

రత్నయానేన గోలోకం పారదై ర్వేష్టితేనచ

యయౌ రజకరాజశ్చ ధృత్వా దివ్యకలేవరం

శశ్వద్యౌవనయుక్తంచ జరామృత్యుహరం వరం

పీతవస్త్ర సమాయుక్తం సస్మితం శ్యామసుందరం

బభూవ సోఽపి గోలోకే పార్షదేషుచ పార్షదః

కృష్ణస్యాగమనం తత్ర సస్మార సతతం వశీ

అస్తంగతో దినకరోఽప్యక్రూరః స్వగృహం యయౌ

కృష్ణస్యానుమతిం ప్రాప్య కృష్ణోఽపి కస్యచిద్ గృహం

వైష్ణవస్య కువిందస్య తస్మిన్నస్తధనస్యచ

సానందో నందసహితో బలదేవాదిభిర్యుతః

సభక్తః పూజయామాస ప్రణమ్య శ్రీనికేతనం

తస్మై దదౌ స్వదాస్యంచ వరం బ్రహ్మాది దుర్లభం

పర్యంకే సుషుపుః సర్వే భుక్త్వామిష్టాన్నముత్తమం

నిద్రాంచ లేభే నా కుబ్జ నిద్రేశోఽపి యయౌముదా

గత్వా దదర్శకుబ్జాం తాం రత్నతల్పేచ నిద్రితాం

దాసీగణైః పరివృతాం సుందరీం కమలామివ

బోధయామాస తాం కృష్ణో నదాసీశ్చాపి నిద్రితాః

తామువాచ జగన్నాథో జగన్నాథప్రియాం సతీం

శ్రీభగవానువాచ:

త్యజ నిద్రాం మహాభాగే శృంగారాం దేహి సుందరి

పురా శూర్పణఖత్వంచ భగినీ రావణస్యచ

రామజన్మని మద్ధేతో: త్వయా కాంతే తపః కృతా

తపః ప్రభావాన్మాం కాంతం భజ శ్రీకృష్ణజన్మని

అధునా సుఖసంభోగం కృత్వా గచ్ఛమమాలయం

సుదుర్లభం చ గోలోకం జరామృత్యుహరం పరం

ఇత్యుక్త్వా శ్రీనివాసశ్చ కృత్వా తామేవ, వక్షసి

నగ్నం చకార శృంగారం చుంబనం చాపికాముకీం

అను!! వస్త్రముల సమూహమును ధరించిన చాకలివానిని ఆ తరువాత చూచాడు కృష్ణుడు. ఎల్లప్పుడు యౌవ్వన గర్వం కలవాడు, అహంకారముతో బలిష్ఠుడైనవాడు, వాడు (40) ఓ మహాముని! వినయంతో కృష్ణుడు వానిని వస్త్రములడిగాడు. వాడు ఆతనికి వస్త్ర మివ్వలేదు. పైగా ఆతనితో నిష్టురంగా పలికాడు (41) రజకుడిట్లన్నాడు - ఈ వస్త్రము చాలా దుర్లభమైనది, గోవులను రక్షించే వారికి తగినది కాదు. ఓ మూడుడ! ఓ గోపజనవల్లభుడ! ఇవి రాజయోగ్యమైనవి. (42) ఓ కన్యాలోలుపుడ! లంపట! గోపకన్యలను గ్రహించి, అరాజకమైన వృందారణ్యంలో తిరిగావు కదా (43) రాజైన కంసుని మార్గంలో, ఇక్కడ అలాంటి పనికుదరదు. ఇక్కడున్న రాజేంద్రుడు దుష్టులను ఆక్షణంలోనే శిక్షించేవాడు (44) రజకుని మాటలను విని మధుసూదనుడు నవ్వాడు. బలదేవుడు, అక్రూరుడ గోపవర్గము నవ్వారు. (45) వానిని చెంపదెబ్బతో చంపి వస్త్ర సమూహమును తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు, వారిగణము వస్త్రములు ధరించారు. (46) రజకరాజు రత్నముల పల్లకిలో పార్షదులు చుట్టూ ఉండగా, దివ్యశరీరమును ధరించి గోలోకమునకు వెళ్ళాడు. (47) జరమృత్యువు లేకుండా ఎప్పుడూ యౌవ్వనంలో ఉండేవరాన్ని, పీతవస్త్రము ధరించిన చిరునవ్వుతో నున్న శ్యామసుందరుని యాచించాడు. (48) పార్షదులలో పారదుడుగా అతడు గోలోకంలో అయ్యాడు. ఎల్లప్పుడు ఇంద్రియ నిగ్రహం కలవాడై కృష్ణునిరాకను స్మరించసాగాడు (49) సూర్యుడు అస్తమించాడు. అక్రూరుడు తన ఇంటికి వెళ్లాడు. కృష్ణుని అనుమతి పొందాడు. కృష్ణుడు కూడా ఏదో ఒకని ఇంటికి వెళ్ళాడు. (50) ధనము నశించిన, వైష్ణవుడైన కువిందుని గృహమునకు ఆనందంతో నందసహితుడై బలదేవాదులతో కూడి వెళ్ళాడు. (51) ఆభక్తుడు శ్రీనికేతనునకు నమస్కరించి పూజించాడు. బ్రహ్మాదులకు దుర్లభమైన తన దాస్యమును ఆతనికి వరముగా ఇచ్చాడు. (52) అందరు రుచికరమైన ఉత్తమమైన ఆహారమును భుజించి, పడకలందు నిద్రించారు. ఆకుఱ్ఱనిద్రపోయింది. నిద్రేశుడు కూడా ఆనందంగా వెళ్ళాడు (53) రత్నతల్పమందు పడుకున్న ఆకుబ్జను చూచాడు. ఆమె దాసీగణముతో కూడి ఉంది, కమలాసుందరివలె ఉంది. (54) కృష్ణుడు ఆమెను లేపాడు. దాసీలు కూడా నిద్రపోలేదు. జగన్నాథునకు ప్రియమైన ఆసతిని గూర్చి జగన్నాథుడు ఇట్లన్నాడు. (55) భగవానుడిట్లన్నాడు - ఓ మహాభాగ్యవంతురాల! నిద్రనుండి లే. ఓ సుందరి! నాకు శృంగారాన్నివ్వు. నీవు ఇదివరలో శూర్పణఖవు. రావణుని చెల్లెలువు. (56) రామజన్మలో నాకొరకు ఓ కాంతనీవు తపస్సు చేశావు. ఆతపః ప్రభావం వల్ల శ్రీకృష్ణ జన్మలో నన్ను పొందావు (దు). (57) మిక్కిలి ఇప్పుడు సుఖసంభోగాన్ని అనుభవించి నా ఆలయానికివెళ్ళు, గోలోకము మిక్కిలి దుర్లభమైనది, జరామృత్యువులను హరించేది. పరమైనది (58) అని పలికి శ్రీనివాసుడు ఆమెను వక్షమందుంచుకొని, నగ్నంగా ఉన్నదానితో శృంగారము చేశాడు. ముద్దాడాడు ఆకాముకిని. (59)

మూ సా సస్మితాచ శ్రీకృష్ణం నవసంగమలజ్జితా

చుచుంటే గండే క్రోడే తాం చకార కమలాం యథా

సురతేర్విరతిర్నాస్తి దంపతీ రతి పండితౌ

నానా ప్రకార సురతం బభూవ తత్ర నారద

స్తనశ్రోణియుగం తస్యా వీక్షితం చ చకార హ

భగవాన్నఖరైస్తీక్షణైః దశనైరధరం వరం

నిశావసాన సమయే వీర్యాధానం చకార సః

సుఖసంభోగభోగేన మూర్చామాపచ సుందరీ

తత్రాజగామ తాం తంద్రా కృష్ణవక్షఃస్థలస్థితాం

బుబుధేన దివారాత్రం స్వర్గం మర్త్యం జలం స్థలం

సుప్రభాతాచ రజనీ బభూవ రజనీపతిః

పత్యుఃవ్యతిక్రమేణైవ లజ్జయేవ మలీమసః

అథాజగామ గోలోకాద్రథో రత్న వినిర్మితః

జగామ తేన తం లోకం ధృత్వా దివ్యకలేవరః

వహ్నిశుద్ధాంశుకాధానం రత్నభూషణభూషితం

ప్రతప్తకాంచనాభాసం నిత్యం జన్మాదివర్జితం  

సా బభూవచ తత్రైవ గోపీ చంద్రముఖీ మునే

గోప్యః కతివిధాస్త స్యాబభూవుః పరిచారికాః  

భగవానపి తత్రైవ క్షణం స్థిత్వా స్వమందిరం

జగామయత్రనందశ్చసానం దోనందనందనః

అథ కంసో నిశాయాంచ నిద్రాణాం భయవిహ్వల:

దదర్శ దుఃఖదుఃస్వప్నమాత్మనో మృత్యుసూచకం

దదర్శ సూర్యం భూమిష్ఠం చతుఃఖండం నభశ్చ్యతం

దశఖండం చంద్రబింబం భూమిస్థం ఖాచ్చ్యుతంమునే

పురుషాన్వికృతాకారాన్ రజ్జుహస్తాన్ధిగంబరాన్

విధవాం శూద్రపత్నీంచ నగ్నాంచ ఛిన్ననాసికాం

హసంతీం చూర్ణతిలకాం శ్వేతకృష్ణోచ్చమూర్ధజాం

ఖడ్గకర్పరహస్తాంచ లోలజిహ్వాంచ భిభ్రతీం  

రుండమాలాసమాయుక్తం గర్దభం మహిషంవృషం

సూకరం భల్లుకం కాకం గృధ్రం కంకంచ వానరం  

విరజం కుక్కురం నక్రం శృగాలం భస్మపుంజకం

అస్థిరాశిం తాలఫలం కేశం కార్పాసముల్బణం

నిర్వాణాంగారముల్కాంచ శవం మర్త్యం చితాశ్రితం

కులాలతైలకారాణాం చక్రం వక్రం కపర్ధకం  

శ్మశానం దగ్ధకాష్ఠంచ శుష్కకాష్ఠం కుశం తృణం

గచ్చంతం చ కబంధం చ నదంతంమృతమస్తకం

దగ్ధస్థానం భస్మయుతం తడాగం జలవర్జితం

దగ్ధమత్స్యంచ లోహంచ నిర్వాణ దగ్ధకాననం

గలత్కుష్ఠంచ వృషలం నగ్నంచ ముక్త మూర్ధజం

అతీవరుష్టంవిప్రంచ జపంతం గురుమీదృశం

అతీవరుష్టం భిక్షుంచ యోగినం వైష్ణవం నరం

ఏవం దృష్ట్వా సముత్థాయ కథయామాస మాతరం

అను తొలిసమాగమము వల్ల సిగ్గుపడుతూ ఆమె చిరునవ్వు నవ్వుతూ శ్రీకృష్ణుని చెక్కలి పైన, వక్షఃస్థలము పై ముద్దాడింది. కమలనువలె ఆమెను చేశాడు కృష్ణుడు. (60) సురతమునకు విశ్రాంతి లేదు.దపంతులిద్దరు రతి కార్యమందు పండితులు.ఓ నారద! అక్కడ రకరకాలైన సురతకార్యము జరిగింది. (61) ఆతడు ఆమె స్తనయుగమును శ్రోణియుగమును బాగా చూశాడు. తీక్షణమైనగోళ్ళతో వాటిని భగవంతుడు చూచాడు. పండ్లతో వరమైన అధరమును ఆస్వాదించాడు. (62) నిశయొక్క అవసానకాలమందు ఆతడు ఆమెలో వీర్యమునుంచాడు. ఆసుందరి సుఖమైన భోగభోగముతో మూర్చనొందింది. (63) కృష్ణుని వక్షఃస్థలమందున్న ఆమెకు అప్పుడు అలసట కలిగింది. పగలు రాత్రి, స్వర్గము, భూలోకము, నీరు, భూమి ఏమీ తెలియదు. (64) రాత్రి సుప్రభాతముగా ఐంది. భర్తచేసిన విపరీత కార్యమువల్ల రజనీపతి సిగ్గుతో వలె మలినమైనాడు. (65) ఇక గోలోకమునుండి రత్ననిర్మితమైన రథము వచ్చింది. దివ్యశరీరమును ధరించి ఆరథం పై ఆలోకానికి వెళ్ళింది. (66) వహ్నిశుద్దమైన వస్త్రము ధరించి రత్నభూషణములు అలంకరించుకొని, ఎప్పుడూ కాల్చిన బంగారములా వెలుగుతూ జన్మాదులు లేకుండా (67) ఆచంద్రముఖి గోపి అక్కడే ఉండిపోయింది. ఓ ముని! అన్నిరకాలైన గోపికలు ఆమెకు పరిచారికలైనారు. (68) భగవంతుడు కూడా అక్కడ క్షణకాలముండి తన మందిరానికి వెళ్ళాడు. అక్కడే నందుడున్నాడు. నందనందనుడు ఆనందపడ్డాడు. (69) ఇక్కడ కంసుడు రాత్రి నిద్రలో భయంతో చలించిపోయాడు. తనకు మృత్యుసూచకమైన దుఃఖకరమైన దుఃస్వప్నాన్ని చూచాడు (70) ఆ కలలో సూర్యుడు భూమి పై ఉన్నాడు నాలుగు తునకలైనాడు, ఆకాశం నుండి జారిపడ్డాడు. ఓముని! చంద్రుడు పదితునకలైనాడు, భూమి పై ఉన్నాడు. ఆకాశం నుండి జారినాడు. (71) వికృతాకారులు, చేతిలో తాడుకలిగినవాళ్ళు, దిగంబరులు ఐన పురుషులను, విధవను, శూద్రుని భార్యను, నగ్నంగా ఉన్నదానిని, ముక్కుకోయబడిన దానిని కలలో చూచాడు. (72) నవ్వుతున్న దానిని, దుమ్మును తిలకంగా గల దానిని, తెల్లని నల్లని ఎత్తైన వెంట్రుకలుగల దానిని, కత్తిపుర్రె చేతిలో గలదానిని, చంచలమైన నాలుకగల దానిని చూచాడు. (73) పుర్రెల మాలకలదానిని, గాడిదను, దున్నపోతును, ఎద్దును, పందిని, ఎలుగు బంటును, కాకిని, గద్దను, కంకపక్షిని, కోతిని చూచాడు. (74) దుమ్ములేకపోవటం, కుక్కను, మొసలిని, నక్కను, భస్మరాశిని ఎముకలరాశిని,తాటిపండును, వెంట్రుకలను, బాగా పత్తిని చూచాడు. (75) చల్లారిన నిప్పులు పిడుగులు, శవమును, చితిని చేరిన మనిషిని కుమ్మరివాని, గాండ్లవాని (నూనెతీ సేవాడు) చక్రమును, వంకర తిరిగిన గవ్వను (జటాజూటమును) చూచాడు. (76) శ్మశానమును, కాలినకట్టెను, ఎండిన కట్టెను, కుశమును, గడ్డిని, నడుస్తున్న మొండెమును, ఆనందిస్తున్న చచ్చిన తలను చూచాడు (77) కాలిన స్థలాన్ని బూడిదగలదానినిగా, నీళ్ళులేని తటాకమును, చచ్చిన చేపను, లోహమును, కాలి చల్లారిన అడవిని చూచాడు. (78) (రసి) కారుతున్న కుష్టువ్యాధి వానిని, శూద్రుని, దిగంబరుని, వెంట్రుకలు విరియబోసుకున్నవానిని, మిక్కిలి కోపిష్టియైన విప్రుని, ఇట్టి గురువును జపిస్తున్న వానిని, (79) మిక్కిలి కోపగించిన భిక్షువును, యోగిని, వైష్ణవుడైన మనిషిని, ఇవన్నీ చూచి లేచి కంసుడు తల్లితో ఇట్లా చెప్పాడు.

మూII పితరం భ్రాతరం పత్నీం రుదంతీం ప్రేమవిహ్వలాం

మంచకాన్ కారయామాస స్థాపయామాసహస్తినం

మల్లం సైన్యంచ యోద్ధారం కారయామాసమంగలం

సభాం చ కారయామాస పుణ్యం స్వస్త్యయనం శివం యత్నేన యోజయామాస యోగే యుక్తం పురోహితం  

ఉవాస మంచకే రమ్యే ధృత్వా ఖడ్గం విలక్షణం

రణే నియోజయామాస యోద్ధారం యుద్ధకోవిదం

వాసయామాస రాజేంద్రాన్ బ్రాహ్మణాంశ్చ మునీశ్వరాన్  

బ్రాహ్మణాంశ్చ సుహృద్వర్గాన్ ధర్మిష్ఠాన్ రణకోవిదాన్

అథాజగామ గోవిందో రామేణ సహ నారద

మహేశస్య ధనుర్మధ్యం బభంజ తత్ర లీలయా

శబ్ధేనతస్య మధురా బధిరాచ బభూవహ

విషాదం ప్రాప కంసశ్చ ముదంచ దేవకీ సుతః

ఉపస్థితః సభామధ్యే గజమల్లం నిహత్యచ  

యోగీ దదర్శ తం దేవం పరమాత్మాన మీశ్వరం

యథా హృత్పద్మమధ్యస్థం తాదృశం బహిరేవచ

రాజేంద్ర రూపం రాజానః శాస్తారం దండధారిణం  

పితా మాతా దుగ్ధముఖం స్తనాంధం బాలకం యథా

కామిన్యః కోటికందర్పలీలా లావణ్య ధారిణం

కంసశ్చ కాలపురుషం వైరిణం తస్య బాంధవాః

మల్లామృత్యుప్రదం చైవ ప్రాణతుల్యంచ యాదవాః నమస్కృత్య మునీన్విప్రాన్ పితరం మాతరం గురుం

జగామ మంచకాభ్యాశం హస్తే కృత్వా సుదర్శనం

దృష్ట్వా భక్తం భక్తబంధుః కృపయాచ కృపానిధిః

ఆకృష్య మంచకాత్కంసం, జఘాన లీలయా మునే

రాజా దదర్శ విశ్వంచ సర్వం కృష్ణమయం పరం

పురతో రత్నయానంచ హీరకాహారభూషితం

యయౌవిష్ణు పదం స్ఫీతో దివ్యరూపం విధాయచ

తేజో వివేశ పరమం కృష్ణ పాదాంబుజే మునే

నివృత్య తస్య సత్కారం బ్రాహ్మణేభ్యో ధనందదౌ

దదౌరాజ్యం రాజఛత్రముగ్ర సేనాయ ధీమతే

సబ భూవ నృపేంద్రశ్చ చంద్రవంశసముద్భవః

విలలాప కంసమాతా పత్నీవర్గశ్చ తత్సితా

బాంధవా మాతృవర్గశ్చ భగినీ భ్రాతృకామినీ

దర్శనం దేహి రాజేంద్ర సముత్తిష్ఠ నృపాసతే

రాజ్యం రక్ష ధనం రక్ష బాంధవం బలమేవచ

క్వయాసి బాంధవాన్హి త్వా త్వమనాథాన్మహాబల

బ్రహ్మాదిస్తంబ పర్యంతమసంఖ్యం విశ్వమేవచ

సర్వం చరాచరాధారం యః సృజత్యేవ లీలయా

బ్రహ్మే శశేష ధర్మాశ్చ దినేశశ్చ గణేశ్వరః  

మునీంద్రవర్గో దేవేంద్రో ధ్యాయతే, యమహర్నిశం

అను ప్రేమతో విచలితయై ఏడుస్తున్న భార్యను, తల్లిని తండ్రిని చూచాడు. మంచలను ఏర్పాటు చేశాడు. ఏనుగును అక్కడ ఉంచాడు. (81) యోద్ధమైన మల్లుని ఏర్పరచినాడు సైన్యాన్నుంచాడు. మంగళం చేయించాడు. సభను ఏర్పరచాడు. పుణ్యకరమైన, శివకరమైన స్వస్తివాచనము చెప్పించాడు యోగమందు యుక్తుడైన పురోహితుని ప్రయత్నపూర్వకముగా ఏర్పరచాడు. (82) విలక్షణమైన ఖడ్గమును ధరించి,అందమైన మంచె యందు కూర్చోన్నాడు. యుద్ధమందు ఆరితేరిన యోధుని యుద్దమందు ఏర్పరచాడు. (83) రాజేంద్రులను, బ్రాహ్మణులను, మునీశ్వరులను కూర్చోబెట్టాడు. బ్రాహ్మణులను, స్నేహితులను, ధర్మిష్ఠులైన వారిని, రణమందు నేర్పరులైన (తెలిసిన) వారిని ఏర్పరచాడు (84) ఓ నారద ఇంతలో గోవిందుడు, రామునితో కూడి వచ్చాడు. అక్కడ అవలీలగా శివుని ధనుస్సును నడిమికి విరిచాడు. (85) ఆ శబ్దంతో మధురానగరి చెవిటిదైంది. కంసుడు విషాదాన్ని పొందాడు. దేవకీసుతుడు ఆనందం పొందాడు. (86) సభామధ్యమందున్నవాడై గజమల్లుని చంపాడు. యోగులు ఆతనిని దేవునిగా పరమాత్మగా, ఈశ్వరునిగా చూచారు. (87) హృత్పద్మ మధ్యమందు ఉన్నవిధంగానే బయట చూచారు. రాజులు, రాజేంద్ర రూపునిగా, దండ దారులను శాసించే వానిగా చూచారు. (88) తలిదండ్రులు పాలుముఖంలో కలిగి స్తనముల చప్పరిస్తున్న బాలకునిగా చూచాడు. కామినులు కోటి మన్మథుల లీలా లావణ్యముల ధరించినవానిగా చూచారు. (89) కంసుడు కాలపురుషునిగా చూచాడు. ఆతని బంధువులు శత్రువుగా చూచారు. మల్లులు మృత్యువును ఇచ్చేవానిగా చూచారు. యాదవులు ప్రాణతుల్యునిగా చూచారు. (90) మునులకు, విప్రులకు తండ్రికి, తల్లికి, గురువునకు నమస్కరించి, చేత సుదర్శనం ధరించి మంచి సమీపమునకు వెళ్ళాడు. (91) భక్తులకు బంధువు, కృపానిధి, భక్తుని కృపతో చూచి, మంచె పై నుండి కంసుని లాగి, అవలీలగా చంపాడు, ఓముని! (92) రాజు, విశ్వమంతా పరమైన కృష్ణ మయముగా చూచాడు. ఎదురుగా వజ్రములతో కూర్చిన హారములతో అలంకరింపబడిన రత్నయానము కన్పించింది  (93) దివ్యరూపమును ధరించి అధికమైన విష్ణు పదమునకు వెళ్ళాడు. ఓముని! కృష్ణుని పాదాంబుజ మందు గొప్పతేజస్సు ప్రవేశించింది. (94) ఆతనికి సత్కారము చేసి బ్రాహ్మణులకు ధనమిచ్చాడు. ధీమంతుడైన ఉగ్రసేనునకు, రాజఛత్రమును రాజ్యమును ఇచ్చాడు. (95) ఆరాజు చంద్రవంశమందు పుట్టినవాడు. కంసుని తల్లి, తండ్రి, భార్యలు ఏడ్చారు. (96) బంధువులు, తల్లుల సమూహము, చెల్లెలు, భ్రాతల స్త్రీలు, ఏడ్చారు. ఓరాజేంద్ర దర్శనమివ్వు, లే, నృపాసనమందు కూర్చో (97) రాజ్యమును, ధనమును, బాంధవులను, బలమును రక్షించు ఓ మహాబల! అనాథలైన బాంధవులను వదిలి నీవు ఎక్కడికి వెళ్తున్నావు. (98) ఈ విశ్వము బ్రహ్మమొదలు స్తంబపర్యంతము అసంఖ్యమైనది. (లెక్కింపరానిది) చరాచరముల కాధారమైన దానినంతా, అవలీలగా ఎవడు సృజిస్తున్నాడో (99) బ్రహ్మ, ఈశ, శేష, ధర్ములు, దినేశుడు, గణేశ్వరుడు, మునీంద్ర వర్గము, దేవేంద్రుడు ఎవనిని నిరంతరం ధ్యానిస్తున్నారో

మూli వేదాః స్తువంతి యం కృష్ణం స్తౌతి భీతా సరస్వతీ

స్తౌతి యం ప్రకృతిర్హృష్టా ప్రాకృతం ప్రకృతేః పరం

స్వేచ్ఛామయం నిరీహంచ నిర్గుణంచ నిరంజనం

పరాత్పరతరం బ్రహ్మ పరమాత్మాన మీశ్వరం

నిత్యం జ్యోతిఃస్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం

నిత్యానందంచ నిత్యంచ నిత్యమక్షర విగ్రహం

సోఽవతీర్ణోహి భగవాన్ భారావతరణాయచ

గోపాలబాలవేషశ్చ మాయేశో మాయయాప్రభుః

సయం హంతిచ సర్వేశో రక్షితా తస్య కః పుమాన్

స యం రక్షతిసర్వాత్మా తస్యహంత నకోఽపిచ

ఇత్యేవ ముక్త్వా సర్వాంశ్చ విరరామ మహామునే

బ్రాహ్మణాన్ భోజయామాస తేభ్యః సర్వం ధనం దదౌ

భగవానపి సర్వాత్మా జగామ పితురంతికం

ఛిత్వాచ లోహానిగడం తయోర్మోక్షం చకార సః

ననామ దండవద్భూమౌ మాతరం పితరం తథా

తుష్టావ భక్త్యా దేవేశో భక్తినమ్రాత్మ కంధరః

శ్రీభగవానువాచ:

పితరం మాతరం విద్యామంత్రదం గురుమేవచ

యో న పుష్ణాతి పురుషో యావజ్జీవంచ యోఽశుచిః

సర్వేషామపిపూజ్యానాం పితా వంద్యో మహాన్ గురుః

పితుః శతగుణైర్మాతా గర్భధారణ పోషణాత్

మాతాచ పృధివీరూపా సర్వేభ్యశ్చ హితైషిణీ

నాస్తి మాతుః పరోబంధుః సర్వేషాం జగతీతలే

విద్యామంత్రప్రదః సత్యం మాతుః పరతరో గురుః

నహితస్మాత్పరంకోఽపి వంద్యః పూజ్యశ్చ వేదతః

ఇత్యేవముక్త్వా శ్రీకృష్ణో బలభద్రా ననామచ

మాతా చకార తౌ క్రోడే పితాచ సాదరం మునే

మిష్టాన్నం పరమం తౌ చ భోజయామాస సాదరం

నందంచ భోజయామాస గోపాలాన్ పరమాదరం

మంగళం కారయామాస భోజనయామాస బ్రాహ్మణాన్

వసుర్వసుసమూహంచ బ్రాహ్మణేభ్యో దదౌ ముదా

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే కంసవధ వసుదేవ దేవకీ మోక్షణం నామ ద్విసప్తతితమోఽధ్యాయః.

అను వేదములు ఏకృష్ణుని స్తుతిస్తున్నాయో, భయంతో ఏసరస్వతీస్తుతిస్తోందో, ప్రాకృతుడు, ప్రకృతికి పరమైనవాడు, అట్టివానిని, ఆనందంతో, ప్రకృతి ఎవనిని స్తుతిస్తున్నదో (101) ఆతడు స్వేచ్ఛామయుడు, నిరీహుడు, నిర్గుణుడు, నిరంజనుడు, పరముకన్న పరతరమైన బ్రహ్మ పరమాత్మ, ఈశ్వరుడు (102) నిత్యుడు, జ్యోతిః స్వరూపుడు, భక్తులనను గ్రహించుటకై విగ్రహరూపమైనవాడు (అవతారం), నిత్యానందుడు, నిత్యుడు, ఎల్లప్పుడు నాశములేని విగ్రహము కలవాడు (103) అట్టివాడు. భగవంతుడు, భూభారం తగ్గించేకొరకు అవతరించాడు. మాయకు ఈశుడు, ప్రభువు మాయతో గోపాల బాలవేషం ధరించి వచ్చాడు (104) ఆ సర్వేశుడు ఎవడిని సంహరింపదలిస్తే వానిని రక్షించే పురుషుడెవడుంటాడు. ఆ సర్వాత్మ ఎవడిని రక్షించదలిస్తే వానిని చంపేవాడు ఎవడూ ఉండడు (105) అని పలికి, ఓ మహాముని! అందరిని విరమింపజేశాడు. బ్రాహ్మణులను భుజింపజేసివారికి ధనమంతా ఇచ్చాడు. సర్వాత్మకుడైన భగవంతుడు తండ్రి దగ్గరకు వెళ్ళాడు. లోహపుబేడీలను ఛేదించి వారికి ఆతడు మోక్షం కల్పించాడు 107) తల్లికి తండ్రికి, దండమువలె భూమి పై బడినమస్కరించాడు. భక్తితో వంచిన తలగలవాడై దేవేశుడు భక్తితో ఆనందింపజేశాడు (108) శ్రీభగవానుడు పలికాడిట్లా - తల్లిని, తండ్రిని, విద్య, మంత్రములనిచ్చే వారిని గురువును, పోషించని పురుషుడు జీవితకాలమంతా వాడు అశుచియే (109) పూజించతగిన వారిలో తండ్రి నమస్కరింప తగినవాడు, గొప్పవాడు, గురువు తండ్రికన్నా తల్లి నూరు రెట్లు ఎక్కువ, పూజ్యురాలు, గర్భమున ధరించి పోషిస్తోంది కనుక (110) తల్లి పృథ్వీ రూపురాలు అందరికన్నను మేలు కోరేది. తల్లి కన్న పరమైన బంధువు లేడు, ప్రపంచంలో అందరికీను (111) తల్లి కన్న విద్యామంత్రప్రదుడైన వాడు నిజముగా పరతరుడైన గురువు. ఆతనికన్న పరుడు, నమస్కరించతగినవాడు, పూజించతగినవాడు. వేదం తప్ప ఎవడు లేడు (112) అని పలికి శ్రీకృష్ణుడు, బలభద్రుడు నమస్కరించారు. ఓ ముని! వారిని తల్లి వక్షం పై ఉంచుకుంది. తండ్రికూడా సాదరంగా తీసుకున్నాడు (113) రుచికరమైన ఆహారమును సాదరముగా వారు (రామకృష్ణులు) మిక్కిలిగా భుజింప చేశారు. నందుని, గోపాలురను, పరమాదరంతో భుజింపజేశారు (114) మంగళము చేసారు. బ్రాహ్మణులను భుజింపజేశారు. ఆనందంతో బ్రాహ్మణులకు వసువు (ధనము) ధనసమూహమును (బంగారు వగైరా) ఇచ్చాడు. (115) అని బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు కంస వధ వసుదేవ దేవకీ మోక్షణ మనునది డెబ్బది రెండవ అధ్యాయము