మూ॥ శ్రీ భగవానువాచ:
ద్విజదేవార్చనం చైవ కరోతి సతతం గృహీ ।
స్వధర్మాచరణం చైవ చాతుర్వర్ణ్యంచ నిత్యశః ॥
కుర్వంతి గృహిణామాశాం సర్వేదేవాదయస్తథా ।
అకృత్వాఽతిథిపూజాంచ గృహస్థశ్చ సదాఽశుచిః ॥
పితరః కర్మకాలేచాతిథి కాలేచదేవతాః ।
సర్వే గృహస్థమాయాంతి నిపానమివ ధేనవః ॥
సమాయాతి ప్రయత్నేన సాయాహ్నే క్షుధితోఽతిధిః ।
పూజాః కృత్వాఽశిషం లబ్ధ ప్రయాతి గృహిణోగృహాత్॥
అకృత్వాఽతిథిపూజాంచ గృహీ భవతి పాతకీ ।
త్రైలోక్యజనితం పాపం లభతే నాత్ర సంశయః ॥
అతిధిర్యస్య భగ్నాశో గృహాత్ప్రతినివర్తతే ।
పితరస్తస్య దేవాశ్చ వహ్నయశ్చ తథైవచ ॥
నిరాశాః ప్రతిగచ్ఛంతి గృహిణోఽతిథయో గృహాత్ ।
స్త్రీ ఘ్నైః గోఘ్నైః కృతఘ్నైశ్చ బ్రాహ్మణైః గురుతల్పగైః ॥
తుల్యదోషో భవత్యేవ యేనాతిథిరనర్చితః ।
స్వాత్మనః పాతకం దత్వా పుణ్యమాదాయ గచ్ఛతి ॥
తస్మాత్కృత్వా సర్వే సేవాం దేవాదీంశ్చ శుభాశయః ।
పోష్యాణాం భరణం కృత్వా పశ్చాద్భుంక్తేన ధర్మవిత్ ॥
యస్య మాతా గృహే నాస్తి భార్యాచ పుంశ్చలీ తథా ।
అరణ్యం తేన గంతవ్యం అరణ్యా ద్దుఃఖదం గృహం ॥
పతిం ద్వేష్టి సదా దుష్టా విషతుల్యంచ పశ్యతి ।
దదాతి తస్మై నాహారం భర్త్సనం కురుతే సదా ॥
పూజితం మునితుల్యంచ సాచ పాపీయసీ పరం ।
సం తతం తృణవన్మత్వా న్యక్కారం కురుతే సదా ॥
దుర్వాక్యవహ్నినాదగ్ధోమృతతుల్యశ్చ జీవతి ।
యావజ్జీవన పర్యంతం సంప్రాప్య దుష్ట సంశజాం ॥
గృహ్ణీనాం సదాచారం శ్రూయతాం తచ్చ్రుతౌశ్రుతం ।
గృహ్ణీ పతిభక్తాచ దేవ బ్రాహ్మణ పూజితా॥
సాశుద్దా ప్రాతరుత్థాయ నమస్కృత్య పతిం సురం ।
ప్రాంగణే మంగళం దద్యాత్ గోమయేన జలేనచ ॥
గృహకృత్యంచ కృత్వాచ స్నాత్వాఽగత్య గృహం సతీ ।
సురం విప్రం పతింనత్వా పూజయేధ్గృహదేవతాం ॥
గృహకృత్యం సునిర్వర్త్య భోజయిత్వా పతిం సతీ ।
అతిథిం పూజయిత్వాచ స్వయం భుంక్తే సుఖం సతీ ॥
పుత్రైశ్చ పూజితస్తాత: శిష్యైశ్చపూజితో గురుః ।
ఆజ్ఞయా కురుతే కర్మ పుత్రః శిష్యశ్చ భృత్యవత్ ॥
నప్రేరయేత్ గురుం తాతం పుత్రం శిష్యశ్చకర్మను ।
పిత్రేచ గురవే నిత్యం సర్వస్వంచ సమర్పయేత్ ॥
నకుర్యాన్నర బుద్ధించ గురౌ పితరి సంతతం ।
కృత్వాచ నరబుద్ధించ బ్రహ్మహత్యాం లభేద్ధ్భవం ॥
మాతరం పూజయేద్భక్త్యా పితుశ్చా ప్యధికాం తథా ।
మాతుః పరం గురుంచైవ పూజయేద్భక్తి యోగతః ॥
పితా మాతా గురుర్భార్యా శిష్యః పుత్రః సదాఽక్షమః ।
అనాథా భగినీ కన్యా నిత్యం సోష్యా గురుప్రియా ॥
అను!! గృహస్థుడు ఎల్లప్పుడు బ్రాహ్మణుల దేవతల అర్చన చేస్తాడు. ఎల్లప్పుడూ నాలుగు వర్గాల వారు తమ ధర్మాచారణ చేయాలి. (1) దేవతలు మొదలగు వారంతా గృహస్థులవైపు ఆశగా చూస్తారు. అతిథిపూజ చేయని గృహస్థు ఎల్లప్పుడు అశుచియే (2) కర్మకాల మందు పితరులు, అతిథికాలమందుదేవతలు, అందరూ గృహస్థుని దగ్గరకు వస్తారు. నీటితోట్టి దగ్గరకు(నిపానం) ఆవులు వచ్చినట్లు (3) సాయంకాలమందు, ఆకలి గొన్నఅతిథి ప్రయత్నంగా వస్తాడు. ఆతనిని పూజించి, ఆశీస్సుపొందాలి. అప్పుడు గృహస్టు ఇంటినుండి ఆతడు పోతాడు (4)అతిథిపూజ చేయకపోతే గృహస్టుపాతకిఔతాడు ముల్లోకములోని పాపమంతా అతనికే వస్తుంది, అనుమానం లేదు (5) ఎవని ఇంటినుండి అతిథి ఆశలు అడుగంటి నశించి), పోతాడో, వాని పితరులు దేవతలు, అగ్నులు (6) నిరాశులైపోతారు, అతిథులు గృహస్థు ఇంటినుండి నిరాశులై వెళ్ళినట్టుగా. ఆడదానిని చంపినవాడు, ఆవును చంపినవాడు, కృతఘ్నడు, గురుతల్పం చేరిన బ్రాహ్మణుడు (7) వీరితో సమానమైన దోషం కలుగుతుంది, అతిధిని పూజించని వానికి. తనపాపాన్ని ఇచ్చి అతిథి యజమాని పుణ్యాన్ని తీసుకొని వెళ్తాడు. (8) అందువల్ల అందరి సేవను చేసి మంచి ఆశయంతో దేవాదులను పూజించి, పోషించతగినవారిని పోషించి ఆ పైన తాను భుజించే గృహస్థు ధర్మమెరిగినవాడు. (9) తల్లి ఇంట్లో లేదు, భార్యకులట అలాంటి గృహస్థు అడవికి పోవటం మంచిది. ఇల్లు, అరణ్యం కన్న దుఃఖకరమైంది. (10) దుష్టురాలు ఎప్పుడూ పతిని ద్వేషిస్తుంది. పతిని విషంతో సమానంగా చూస్తుంది. వాడికి తిండి పెట్టదు. ఎప్పుడూ బెదిరిస్తుంటుంది. (11) పూజించతగిన, మునితో సమానమైన వాణ్ణి, ఆపాపురాలు మాత్రం ఎప్పుడూ గడ్డిపోచలాగా తలుస్తూ, ఎప్పుడూ తిరస్కరిస్తుంటుంది. (12) ఆమె చెడుమాటలనే అగ్నితో దగ్గుడై చచ్చినవానిలా జీవిస్తాడు. దుష్టవంశంనుండి వచ్చిన దానిని పొంది బ్రతికినంత కాలం అట్లా జీవిస్తాడు. (13) వేదములలో చెప్పినట్టి, గృహణుల సదాచారాన్ని వినండి. గృహిణి పతిభక్తురాలు, దేవ, బ్రాహ్మణుల పూజించేది (14) ఆమె శుద్ధురాలు ప్రొద్దునే లేచి, పతిని, దైవాన్ని నమస్కరిస్తుంది. ఇంటి ముందు ఆవు పేడతో నీటితో శుభ్రం చేస్తుంది. (శుచి) (15) ఇంటి పనులు చేసి, స్నానం చేసి, సతి ఇంటికి వచ్చి, దేవుని బ్రాహ్మణుని, పతిని నమస్కరించి, గృహదేవతను పూజిస్తుంది. (16) ఇంటిపనిచేసి, సతిపతికి భోజనం పెట్టి, అతిథిని పూజించి, సతి సుఖంగా తాను తింటుంది. (17) పుత్రులతో పూజింపబడే తండ్రి శిష్యులతో పూజించబడే గురువు ఉత్తములు. పుత్రుడు, శిష్యుడు సేవకునిలా, ఆజ్ఞాపించగానే పనిచేయాలి. (18) శిష్యుడు గురువును తండ్రిని, పుత్రుడు పనులలో పురమాయించరాదు. తండ్రికి గురువుకు ఎల్లప్పుడూ తన సర్వస్వాన్ని ఇవ్వాలి (19) గురువును , తండ్రిని ఎప్పుడూ మనుష్యమాత్రునిగా (దేవతగా చూడాలి) తలచరాదు. మనుష్యునిగా తలిస్తే బ్రహ్మహత్యా పాపాన్ని పొందుతాడు, నిశ్చయము. (20) అట్లాగే తల్లిని తండ్రి కన్న ఎక్కువగా భక్తితో పూజించాలి. తల్లి పిదప గురువును భక్తితో పూజించాలి. (21) తండ్రి, తల్లి గురువు, భార్య, శిష్యుడు, పుత్రుడు వీరు ఎప్పుడూ భరించరానివారు. అనాథ, చెల్లెలు, కన్య, గురుపత్ని వీరు నిత్యము పోషించతగినవారు.
మూ॥ ఏవంచకథితంతాత సర్వేషాం ధర్మముత్తమం।
స్త్రీజాతిర్వాస్తవీ శుద్ధాతాశ్చ సర్వాః పతివ్రతౌః ॥
సర్వాజాతిరేకవిధా చాదౌ సృష్టాచ బ్రహ్మణా ।
తాఃసర్వాః ప్రకృతేరంశాః పవిత్రాః పండితాధికాః ॥
కేదారకన్యాశా పేన సహి ధర్మః క్షయం గతః ।
తదా కోపేన ధాత్రాచ కృత్యాస్త్రీచ వినిర్మితా ॥
కృత్యా స్త్రీ త్రివిధాజాతి: బ్రహ్మణా నిర్మితాపురా ।
ఉత్తమ ప్రథమా సాచ మధ్యమాచాధమా వ్రజ ॥
ఉత్తమ పతిభక్తా సా కించిద్ధర్మ సమన్వితా ।
ప్రాణాంతేఽపి న కురుతే తం జారమయశస్కరం ॥
పూజయేత్సా యథా కాంతం తథాదేవద్విజాతిథీన్ ।
వ్రతాని చోపవాసాంశ్చ కురుతే సర్వపూజనం ॥
గురుణా రక్షితాయత్నా జ్ఞారంచ న భజేద్భయాత్ ।
సా కృత్రిమ మధ్యమాచ యథా కించిత్ పతిం భజేత్ ॥
స్థానం నాస్తి క్షణం నాస్తి నాస్తి ప్రార్థయితా నరః ।
తేన హేనందతాసాంచ సతీత్వముపజాయతే ॥
అధమాపరమాదుష్టాఽత్యంతాఽ సద్వంశజాతి తథా ।
అధర్మశీలా దుఃశీలా దుర్ముఖా కలహాన్వితా ॥
పతిం భర్త్స యతే నిత్యం జారంచ సేవతే సదా ।
దుఃఖం దదాతి కాంతాయ విషతుల్యంచ పశ్యతి ॥
జారద్వారముపాయేన హంతి కాంతం మనోహరం ।
ధర్మిష్ఠంచ వరిష్ఠంచ గరిష్ఠంచ మహీతలే ॥
కామదేవ సమంచాపి జారం పశ్యతి కామతః ।
శుభదృష్ట్యా కటాక్షేణ శశ్వత్పాపీయసీ ముదా ॥
సువేషం పురుషం దృష్ట్వా యువానం రతి శూరకం ।
యోనిః క్లిద్యతి నారీణాం కామినీనాం నిరంతరం ॥
దదాతి భర్త్రే నాహారం విషోక్తిం వక్తి సంతతం ।
అధర్మం చింతయేచ్ఛశ్వజ్ఞారంచ పరమం ముదా ॥
గురుభిర్భర్త్సితా సాచ రక్షితాచ శతేనచ ।
తథాఽపి జారం కురుతే నాపిసాధ్యా నృపైరపి ॥
నాస్తి తస్యాః ప్రియం కించిత్ సర్వం కార్యవశేనచ ।
గావస్తృణ మివారణ్యే ప్రార్థయంతిన వనవం ॥
విద్యుదాఘా జలేరేఖా తస్యాః ప్రీతిస్త థైవచ ।
అధర్మయుక్తా సతతం కపటం వక్తి నిశ్చితం ॥
ప్రతే తపసి ధర్మేచ నమనో గృహకర్మణి ।
నగురౌన చ దేవేషు జారే స్నిగ్ధంచ చంచలం ॥
స్త్రీజాతి త్రివిధానాంచ కథా చ కథితామయా ।
భక్తానాం త్రివిధానాంచ లక్షణం శ్రూయతామితి ॥
తృణశయ్యారతో భక్తో మన్నామగుణకీర్తిషు ।
మనో నివేశయేత్ త్యక్త్వా సంసారసుఖకారణం ॥
ధ్యాయతే మత్సదాబ్జంచ పూజయేద్భక్తి భావతః ।
అహైతుకీం తస్య దేవాః సంకల్పరహితస్యచ ॥
ఓ తండ్రీ! ఈ విధంగా అందరి ధర్మాన్ని ఉత్తమమైనదాన్ని చెప్పాను. స్త్రీ జాతి సహజంగా శుద్ధురాలు. వారంతా పతివ్రతలు. (23) తొలుత స్త్రీజాతి తిని అంతా ఒకే విధంగా బ్రహ్మసృష్టించాడు . వారంతా ప్రకృతికి అంశలు,పవిత్రురాండ్రు.గొప్ప పండితులు. (24) కేదారకన్య శాపంవల్ల ఆధర్మం నశించిపోయింది. అప్పుడు కోపంతో బ్రహ్మకృత్య అనే స్త్రీని నిర్మించాడు. (25) కృత్యస్త్రీ జాతి. మూడు విధములు, ఇదివరలో బ్రహ్మ అట్లా నిర్మించాడు. ఓ ప్రజ! మొదటిది ఉత్తమ , ఆ పై మధ్యమ అధమ అని (26) ఉత్తమమైనది పతిభక్తురాలు. కొంచం ధర్మం కలది. ప్రాణాంతమందు కూడా వానినిజారునిగా అపకీర్తికరునిగా చేయదు. ఆమె భర్తను పూజించినట్లే అట్లా దేవతలను, ద్విజులను, అతిథులను పూజిస్తుంది. వ్రతములు, ఉపవాసములు చేస్తుంది. అన్ని పూజలు చేస్తుంది. (28) పెద్దలచే రక్షింపబడ్డా ప్రయత్నించి కూడా జారుని పొందదు, భయంవల్ల. రెండవది కృత్రిమమైనది మధ్యమ. కొద్దిగా భర్తను సేవిస్తుంది. (29) స్థానంలేదు. పండగలేదు, ప్రార్థించేనరుడు లేడు. ఓ నంద! అందువల్ల వారికి సతీత్వము కల్గుతుంది. (30) అధమురాలు, చాలా దుష్టురాలు. మిక్కిలి అసద్వంశజురాలు. అధర్మశీల దుఃశీల, దుర్ముఖ, కలహించేది. (31) రోజు భర్తను బెదిరించేది. ఎప్పుడు జారుణ్ణి సేవించేది. భర్తకు దుఃఖం కల్గించేది. భర్తను విషంగా చూచేది. (32) జారునిద్వారా ఉపాయంగా మనోహరుడైన భర్తను చంపుతుంది. వాడు ధర్మిష్ఠుడైనా, వరిష్టుడైనా, గొప్పవాడైనా ఈ భూమి పై (33) కామదేవునితో సమానుడైనా, జారునిగా కామంతో చూస్తుంది. మంచిచూపుతో, ఓరచూపుతో, ఆనందంతో ఆపాపురాలు ఎప్పుడూ చూస్తుంది. (34) మంచి వేషం గల పురుషుని, యువకుని, రతిలో శూరుని చూచి కామినులైన స్త్రీల యోని ఎల్లప్పుడూ తడిఔతుంది. (35) భర్తకు తిండి పెట్టదు. ఎప్పుడూ విషపు మాటలు మాట్లాడుతుంది. ఎప్పుడూ అధర్మాన్ని ఆలోచిస్తుంది. ఆనందంతో జారుని మిక్కిలిగా తలుస్తుంది. (36) పెద్దలు భయ పెట్టినా, నూరు విధాలుగా రక్షించినా ఆమె అటైనా జారుని పొందుతుంది. రాజులైనా ఆమెను సాధించలేరు (సవరించలేరు) (37) ఆమెకు ప్రియమైనది ఏది లేదు. అన్ని కార్యాధీనములు (అవసరాన్ని బట్టే). గోవులు అడవిలో రకరకాల గడ్డి కోసం వెతికినట్లే కొత్తకొత్తవాణ్ణి ప్రార్థిస్తుంది ఈ స్త్రీ. (38) మెరుపు తీగకాంతి, జలంలో రేఖ ఎట్లాగో (క్షణికమో) ఆమే ప్రేమకూడా అట్లాంటిదే. ఎప్పుడు అధర్మం కలిగి, కపటం (అబద్ధం) చెప్తుంది,నిశ్చయము. (39) వ్రతమందో, ధర్మమందో, తపమందో, మనస్సు ఉండదు. గృహకర్మయందు కూడా. గురువులందు, దేవతలందు, మనసుండదు జారుని యందు, నిగనిగలాడుతూ (నిత్యనవంగా) చంచలంగా మనస్సు ఉంటుంది. (40) మూడు రకములైన స్త్రీ జాతి కథను నేను నీకు చెప్పాను. మూడు రకములైన భక్తుల లక్షణము విను, అని (41) గడ్డి పై పరుంటాడు నా గుణనామ కీర్తనలందు ఆసక్తుడు భక్తుడు. సంసారసుఖమునకు కారణమైన మనస్సును అక్కడి నుండి మరల్చి, నాయందుంచాలి భక్తుడు. (42)నా పాదాబ్జములను ధ్యానిస్తాడు. భక్తి భావంతో పూజిస్తాడు. ఆతని భక్తి కారణ రహితమైనది. సంకల్ప(కోరిక) రహితుడైన, వానికి దేవతలు ఆనందిస్తారు. (43)
మూ॥ సర్వసిద్ధింనవాంఛంతితేఽణిమాదికమీప్సితం ।
బ్రహ్మత్వ మమరత్వంవాసురత్వం సుఖకారణం ॥
దాస్యం వినా నహీచ్ఛంతి సాలోక్యాదిచతుష్టయం ।
నైవ నిర్వాణ ముక్తించ సుధాపానమభీప్సితం ॥
వాంఛంతి నిశ్చలాం భక్తిం మదీయా మతులామపి ।
స్త్రీపుంవిభేదో నా స్యేవ సర్వజీవేషు భిన్నతా ॥
తేషాం సిద్దేశ్వరాణాంచ ప్రవరాణాం వ్రజేశ్వర ।
క్షుత్పిపాసాదికం నిద్రలోభమోహాదికం రిపుం ॥
త్యక్త్వాదివానీశం మాంచ ధ్యాయంతేచ దిగంబరాః ।
సమద్భక్తతమోనంద శ్రూయతాం మధ్యమాదికం ॥
నాసక్తః కర్మసు గృహీ పూర్వప్రాక్తనతః శుచిః ।
కరోతి సతతం కర్మ పూర్వకర్మ నికృంతనం ॥
నకర్త్యపరం యత్నాత్ సంకల్పరహితః సచ ।
సర్వం కృష్ణస్య యత్కించిత్ నాహం కర్తాచ కర్మణః ॥
కర్మణా మనసా వాచా సతతం చింతయేదితి ।
న్యూన భక్తశ్చ తన్న్యూనః సచ ప్రాకృతికః శ్రుతౌ ॥
యమంవా యమదూతంవా స్వప్నేఽపి నచ పశ్యతి ।
పురుషాణాం సహస్రంచ పూర్వ భక్తః సముద్ధరేత్ ॥
పుంసాం శతం మధ్యమశ్చ తచ్చతుర్థంచ ప్రాకృతః ।
భక్తశ్చ త్రివిధస్తాత కథితశ్చ తవాజ్ఞయా ॥
బ్రహ్మాండ రచనాఖ్యానం శ్రూయతాం సావధానతః ।
బ్రహ్మాండ రచనార్థంచ భక్తా జానంతి యత్నతః ॥
మునయశ్చ సురాః సంతః కించి జ్ఞానంతి దుఃఖితః ।
జానామి విశ్వం సర్వార్థం బ్రహ్మాఽనంతో మహేశ్వరః ॥
ధర్మః సనత్కుమారశ్చ నరనారాయణా వృషీ ।
కపిలశ్చ గణేశశ్చ దుర్గా లక్ష్మీః సరస్వతీ ॥
వేదశ్చ వేదమాతాచ సర్వజ్ఞా రాధికా స్వయం ।
ఏతే జానంతి విశ్వార్థం నాన్యోజానాతి కశ్చన ॥
వైషమ్యాథచ సుధియః సర్వే విజ్ఞాతు మక్షమాః ।
నిత్యాకాశో యథాఽత్మాచ తథానిత్యాదిశోదశ ॥
యధా నిత్యాచ ప్రకృతిః తథైవ విశ్వగోలకః !
గోలోకశ్చ యథా నిత్యః తథా వైకుంఠ ఏవచ ॥
ఏకదామయిగోలోకే రాసే నృత్యం ప్రకుర్వతి ।
ఆవిర్భూతాచ వామాంగాద్బాలా షోడశ వార్షికీ॥
శ్వేత చంపక వర్ణాభా శరచ్చంద్ర సమప్రభా ।
అతీవసుందరీ రామా రమణీనాం పరావరా ॥
ఈషద్ధాస్య ప్రసన్నాస్యా కోమలాంగీ మనోహరా !
వహ్నిశుద్ధాంశుకాధానా రత్నాభరణ భూషితా ॥
యథా జలదపంక్తిశ్చ బలాకాభిర్విభూషితా ।
సిందూరబిందునా చారుచంద్ర చందన బిందుభిః ॥
కస్తూరీ బిందుభిః సార్ధం సీమంతాధఃస్థలోజ్జ్వలా ।
అమూల్యరత్న నిర్మాణ సుస్నిగ్ధకిరణోజ్జ్వలా ॥
రత్నకుండల యుగ్మేన గండస్థల సముజ్జ్వలా ।
కుంకుమలక్త కస్తూరీ చారుచందన పత్రకైః ॥
విచిత్రైశ్చ సుచిత్రైశ్చ సుకపోలస్థలోజ్జ్వలా ।
ఖగేంద్ర చంచువిజిత నాసామౌక్తి కశోభితా ॥
అణిమాదికమైన, కోరతగిన, సర్వసిద్ధులను కోరరు. బ్రహ్మత్వము, అమరత్వము లేదా సురత్వము, ఇవి సుఖకారణములు. (44) ఇవి కోరరు. దాస్యము తప్ప సాలోక్యాదుల నాలిటిని కోరరు. నిర్వాణముక్తిని కాని ఇష్టమైన సుధాపానముకాని కోరరు (45) నాకు చెందిన (యందు) అతులమైన నిశ్చలమైన భక్తిని కోరుతారు. స్త్రీ పుంసభేదము లేదు. అన్ని జీవులలో భిన్నత్వముంది. (46) ఓవ్రజేశ్వర! శ్రేష్ఠులైన ఆ సిద్దులకు ఈశ్వరులైన వారికి ఆకలి దప్పికలు మొదలగునవి నిద్రమోహలోభాదులు లేవు. ఆ శత్రువులను (47) జయించి, దిగంబరులై రాత్రింబగళ్ళు నన్ను ధ్యానిస్తారు. ఓనంద! ఆతడు నాభక్తులలో శ్రేష్ఠతముడు. మధ్యమాది భక్తుల గూర్చి విను. (48) ఆ గృహస్థుడు కర్మలలో ఆసక్తుడుకాడు. పూర్వముచేసిన పురాతనమైన దానినుండి శుచిగా ఉంటాడు. ఎప్పుడూ పూర్వకర్మను నశింప చేసే కర్మను చేస్తాడు. (49) అపరమైన కర్మను ప్రయత్నపూర్వకముగా చేయడు, ఆతడు సంకల్పరహితుడు కనున ఉన్నది అంతా కృష్ణునిదే. ఈ కర్మకు నేను కర్తనుకాను. (50) అని కర్మతో, వాక్కుతో, మనస్సుతో ఎప్పుడూ చింతిస్తాడు. ఇంకా తక్కువ భక్తుడు అంతకన్నా న్యూనమైనవాడు. వాడు ప్రాకృతికుడని వేదాల్లో చెప్పబడ్డాడు. (51) యమునికాని, యముని దూతనుకాని కలలోకూడా చూడడు. వేయి మంది పురుషులను తొలి భక్తుడు ఉద్దరిస్తాడు (52) మధ్యముడు నూరుగురు పురుషులను ఉద్దరిస్తాడు. ప్రాకృతుడు వారిలో నాల్గవ భాగాన్ని ఉద్దరిస్తాడు. ఇట్లా, ఓ తండ్రి భక్తులు మూడు విధాలు, నీ ఆజ్ఞ ప్రకారం చెప్పాను. (53) సావధానంగా బ్రహ్మాండ రచనకు చెందిన కథను విను. యత్నిస్తే బ్రహ్మాండ రచనార్థమును భక్తులు తెలుసుకుంటారు. (54) మునులు,సురలు, సజ్జనులు, దుఃఖంతో ఈ విషయం కొద్దిగా తెలుసుకుంటారు. విశ్వము యొక్క అర్థాన్నంతా నేను తెలుసుకుంటాను. బ్రహ్మ అనంతుడు మహేశ్వరుడు (55) ధర్ముడు, సనత్కుమారుడు, నరనారాయణ ఋషులు, కపిలుడు, గణేశుడు, దుర్గ, లక్ష్మి, సరస్వతి (56) వేదము, వేదమాత, స్వయంగా సర్వజ్ఞురాలైన రాధిక వీరు విశ్వము అన్ని తెలుసుకుంటారు. ఇతరుడెవ్వడూ తెలుసుకోలేడు. (57) బుద్దిమంతులంతా విషమత్వం వల్ల తెలుసుకోనే సమర్ధులుకారు. ఆత్మలాగ, ఆకాశము నిత్యము. అట్లాగే దిక్కులు పది నిత్యము (58) ప్రకృతి నిత్యమైనట్లే విశ్వగోళము నిత్యము. గోలోకం నిత్యమైనట్లే వైకుంఠము నిత్యము (59) ఒకసారి నేను గోలోకంలో రోజులాగా రాసక్రీడచేస్తుండగా నా వామభాగం నుండి పదహారు సంవత్సరాల బాలిక పుట్టింది. (60) తెల్లని చంపకం పూలవంటి రంగు గలది, శరత్కాల చంద్రుని వంటి కాంతి గలది, చాలా సుందరమైనది, స్త్రీలలో (అందకత్తెలలో) ఉత్తమోత్తమమైనది, అందమైనది (61) కొద్దిపాటి చిరునవ్వుతో ప్రసన్నమైన ముఖం గలది, కోమలమైన అవయవాలు గలది, మనస్సును హరించేది. వహ్నితో శుద్ధి చేయబడ్డ వస్త్రం ధరించింది, రత్న ఆభరణములతో అలంకరింపబడ్డది (62) మేఘపంక్తి (నల్లనిది) బలాకములతో అలంకరింపబడ్డట్టు, సిందూర బిందువుతో పాటు అందమైన చంద్రుని వంటి చందన బిందువులతో అలంకరించుకుంది. (63) పాపట క్రింది భాగము కస్తూరి బిందువులతో పాటు ఉజ్జ్వలంగా ఉంది. వెలకట్టలేని రత్నములతో చేయబడ్డ, నిగనిగలాడే ఆభరణ కాంతులతో ఉజ్జ్వలంగా ఉంది. (64) రత్న కుండములు గల చెవులతో చెక్కిలి భాగం వెలిగిపోతోంది. కుంకుమ, లత్తుకకస్తూరి, అందమైన చందన పత్రములు వీనితో (65) - విచిత్రమైన, మంచి చిత్రములుగల వాటితో కూడిన మంచికపోల స్థలములు కలిగి వెలిగిపోతోంది. గరుడుని ముక్కును జయించిన ముక్కు గలిగి ముత్యపు ముక్కెరతోను శోభిస్తోంది.
మూ॥ గజేంద్ర గంగనిర్ముక్త ముక్తా భూషణ భూషితా ।
శుక్త్యావిముక్తముక్తాభ దంత పంక్తి మనోహరా ॥
వలిచాకలితాఽతీవ పక్వబింబాధరా వరా ।
శశ్వత్పూర్ణేందునిందాస్యా పద్మనిందితలోచనా ॥
కృష్ణ సారనిభోద్భిన్న సుచారుకజ్జలోజ్జ్వలా ।
అమూల్యరత్న నిర్మాణ కేయూరకంకణోజ్జ్వలా ॥
మణీంద్రరాజిరాజీభిః శంఖయుగ్మకరోజ్జ్వలా ।
రత్నాంగుళీయకై రేభిః అమృతాంగులి భూషితా ॥
రత్నేంద్రరాజ రాజేన క్వణన్మంజీర రంజితా ।
రత్నపాశక రాజీభిః పాదాంగుళి విరాజితా ॥
సుందరాలక్త రాగేణ చరణాధః స్థలోజ్జ్వలా ।
గజేంద్ర గామినీరామా కామినీ కామలోచనా ॥
మాందదర్శ కటాక్షేణ రమణీ రమణోత్సుకా ।
రాసే సంభూయ రామాసాదధార పురతోమమ ॥
తేన రాధా సమాఖ్యాతా పురావిద్భిః ప్రపూజితా ।
ప్రహృష్టా ప్రకృతిశ్చాస్యా స్తేన ప్రకృతిరీశ్వరీ ॥
శక్తా స్యాత్సర్వ కార్యేషు తేన శక్తిః ప్రకీర్తితా ।
సర్వాధారా సర్వరూపా మంగలార్హచ సర్వతః ॥
సర్వమంగలదక్షా సా తేనస్యాత్సర్వమంగలా ।
వైకుంఠేసా మహాలక్ష్మీః మూర్తి భేదే సరస్వతీ ॥
ప్రసూయవే దాన్విదితా వేదమాతాచ సా సదా ।
సావిత్రీ సాచ గాయత్రీ ధాత్రీ త్రిజగతామపి॥
పురా సంహృత్య దుర్గంచ సాదుర్గాచ ప్రకీర్తితా ।
తేజసః సర్వదేవానాం ఆవిర్భూతా పురాసతీ ॥
తేనాద్యా ప్రకృతిర్ జ్ఞేయా సర్వాసుర విమర్దినీ ।
సర్వానందాచ సానందా దుఃఖ దారిద్ర్యనాశినీ॥
శత్రూణాం భయదాత్రీచ భక్తానాం భయహారిణీ ।
దక్ష కన్యా సతీ సాచ శైలజాతేతి పార్వతీ ॥
సర్వాధార స్వరూపా సా కలయాచ వసుంధరా ।
కలయా తులసీ గంగా కలయా సర్వయోషితః ॥
సృష్టింకరోమి చయ యాతాత శక్త్యాపునః పునః ।
దృష్ట్వాతాం రామ మధ్యస్థాం మమ క్రీడా తయాసహ ॥
బభూవ సుచిరం తాత యావద్వై బ్రహ్మణః శతం ।
అత్యద్భుతం కౌతుకంచ మహాశృంగారమీక్షితం ॥
తయోర్ద్వయోర్ఘర్మ రాశి: సుస్రావ రాసమండలే ।
తస్మాత్మనోహరం జజ్ఞే నామ్నాఽకార సరోవరం ॥
పపాత ఘర్మధారాఽధో వేగేన విశ్వగోలకే ।
బభూవ, జలపూర్ణం చ బ్రహ్మాండానాం చ గోలకం ॥
జలపూర్ణం పురా సర్వం సృష్టిశూన్యం వ్రజేశ్వర ।
శృంగారాంతేచ తస్యాంచ వీర్యాధానం మయాకృతం ॥
దధార గర్భం సా రాధా యావద్వై బ్రహ్మణః శతం ।
సుషువే సాతదంతేచ డింభంచ పరమాద్భుతం ॥
చుకోప దేవీ తం దృష్ట్వా రురోద విషసాద సా ।
పాదేన ప్రేరయామాస తమదో విశ్వగోలకే ॥
అను!! గజేంద్రముల గండ స్థలము నుండి, వచ్చిన ముత్యాలతో చేసిన భూషణములతో అలంకరించబడింది. ముత్యపు చిప్పనుండి విడివడిన ముత్యముల వంటి పలువరుసతో మనోహరమైనది. (67) వలితముతో (అశ్వంనడక) కూడినది. మిక్కిలి పండిన దొండపండు వంటి పెదవి కలది, శ్రేష్టమైనది. ఎప్పుడూ పూర్ణచంద్రుని నిందించే (అపహసించే) ముఖం గలది, పద్మముల వెక్కిరించే కళ్ళు గలది (68) కృష్ణసారం (జింక) వంటి పైకి వచ్చిన చాలా అందమైన కాటుకతో వెలిగేది. అమూల్యమైన రత్నములతో నిర్మింపబడిన కేయూరములతో, కంకణములతో వెలిగేది. (69) మణీంద్ర సమూహముల కాంతులతో వెలిగే రెండు శంఖములను చేతులలో కలిగి వెలిగేది. ఈ రత్నాంగుళులతో, అమృతాంగుళులతో అలంకరింపబడింది. (70) రత్న శ్రేష్ఠముల సమూహముల కాంతితో శబ్దించే కాలి అందెలతో వెలిగేది. రత్నపాశముల (పాచికల) సమూహముతో పాదాంగుళులతో వెలిగేది. (71) సుందరమైన లత్తుక ఎరుపుతో పాదముల అడుగు భాగంతో వెలిగేది. గజేంద్రము వంటి నడకగలది, అందమైనది, కామిని, సుందరమైన కనులు గలది. (72) ఆరమణి ఓర చూపుతో రమించుటకు ఉత్సుకత గలదైనన్ను చూచింది. రాసమునకు సిద్ధమై ఆమె నా ముందు ధరించింది (వచ్చింది). (73) అందువలన పూర్వులు తెలిసిన వారు రాధ అని అన్నారు. పూజింపబడిందామె. ఆమె ప్రకృతి ఆనందకరమైనది. అందువల్ల ఆమె ప్రకృతి, ఈశ్వరి(74) అన్ని పనులలో ఆమె శక్తురాలు కనుక శక్తి అని పిలవబడింది. అన్నిటికి ఆధారము. అన్ని రూపములుగలది, అన్ని విధముల మంగళమునకు ఆధారము. (75) అన్ని మంగళము లిచ్చుటలో సమర్ధురాలామె కనుక ఆమె సర్వ మంగళ. వైకుంఠంలో ఆమె మహాలక్ష్మి. మూర్తి భేదంలో ఆమె సరస్వతి. (76) వేదముల ప్రసవించి ఆమె అప్పుడు వేదమాత అని చెప్పబడింది. ఆమె, సావిత్రి, గాయత్రి, ధాత్రి ముల్లోకములకు కూడా. (77) ఇదివరలో దుర్గమును (వానిని) సంహరించి, ఆమె దుర్గగా చెప్పబడింది. సర్వదేవతల తేజస్సుతో పుట్టిన (ది . ఇదివరలో) సతి ఆమె. (78) అందువల్ల ఆద్య (తొలిది) ప్రకృతి అని ఆమెను తెలుసుకోవాలి. రాక్షసులందరిని సంహరించేది. అందరికి ఆనందాన్నిచ్చేది. ఆనందమూర్తి, ఆమె. దుఃఖ దారిద్ర్యముల నశింపచే సేది. (79) శత్రువులకు, భయం కల్గించేది, భక్తుల భయాన్నిహరించేది. దక్షుని కన్య, ఆమె సతి. శైలజాత పార్వతి అని పిలువబడింది. (80) అన్నిటికి ఆధారస్వరూపురాలామె. ఆమె భూమి కళ గలది. కళతో తులసి, గంగ ఆమె. కళతో సర్వస్త్రీరూపిణి ఆమె. (81) ఓ తండ్రి! ఆమె) శక్తితో, మళ్లీ మళ్ళీ సృష్టిని చేస్తున్నాను. రాసమధ్యమందున్న ఆమెను చూచాను. నా క్రీడ ఆమెతో (82) బ్రహ్మయొక్క నూరు సంవత్సరములకాలము, చాలాకాలము జరిగింది. అత్యద్భుతమైన, కుతూహం కల్గించే మహాశృంగారాన్ని చూచాను. (83) వారిద్దరి చెమటరాశి రాసమండలమందు స్రవించింది. అందువల్ల మనోహరంగా కల్గింది. ఆకార సరోవరమనే పేరుగలది. (84) చెమటధార విశ్వగోలమందు, కిందికి వేగంగా పడింది. బ్రహ్మాండ గోళము నీటితో నిండిపోయింది. (85) ఓ ప్రజేశ్వర! జలపూర్ణం కావటం కన్న ముందు సృష్టి అంతా శూన్యము. శృంగారం చివర, ఆమె యందు నేను వీర్యము నాధానం చేశాను (ఉంచాను) (86) బ్రహ్మయొక్క నూరు సంవత్సరముల కాలము ఆ రాధ గర్భం ధరించింది. దాని చివర ఆమె పరమ అద్బుతమైన పిల్ల వానిని కన్నది (87) వానిని చూచి దేవి కోపగించింది, ఏడ్చింది, ఆమె విషాదము నందింది. కాలితో వానిని కిందికి విశ్వగోలకంలోకి తోయసాగింది.
మూII స పపాత జవే తాత సర్వాధారో మహాన్ విరాట్ ।
దృష్ట్వాఽపత్యం జలస్థంచ మయా శప్తా చ సాపురా ॥
అనపత్యాచ సారాధా మచ్ఛా పేన, పురా విభో ।
తేన ప్రభూతాః క్రమతో దుర్గా లక్ష్మీః సరస్వతీ ॥
చతస్రః పరిపూర్ణాస్తా: ప్రసూతాశ్చ సునిశ్చితం ।
దేవ్యోఽన్యాశ్చాపి కామిన్యస్తా: ప్రసూతా ప్రజేశ్వర ॥
కలయా ప్రభవో యాసాం కలాంశాంశేన వా వ్రజ ।
జజ్ఞే మహాన్విరాడ్యేన డింభేన కలయాఽశ్రయః ॥
అమృతాంగుష్ఠపీయూషం మయాదత్తం పపౌచసః ।
జలేస్థావర రూపశ్చ శేతేచ నిజకర్మణః ॥
ఉపధానం జలం తల్పం తస్య యోగ బలేనచ ।
తస్యలోమ్నాంచ కూపాని జలపూర్ణాని సంతతం ॥
ప్రత్యేకం క్రమతస్తేషుశేతే క్షుద్ర విరాట్ పునః ।
సహస్త్ర పత్రం కమలం జజ్ఞే క్షుద్రస్య నాభితః ॥
తత్ర జజ్ఞే వరో బ్రహ్మా తేనాయం కమలోద్భవః ।
తత్రా విర్భూయ సవిధి శ్చింతాగ్రస్తో బభూవ సః ॥
కస్మాద్దేహః క్వమాతా మే పితావా క్వచ బాంధవః ।
వ్యంత్రిలక్ష వర్షంచ బభ్రామ కమలాంతరే ॥
తతో దివ్యం పంచలక్షం సస్మార తపసాచ మాం ।
తదా మయా దత్త మంత్రం జజాపకమలాంతరే ॥
దివ్యసప్త వర్ష లక్షం నియతం సంయతః శుచిః ।
తదా మత్తో వరంలబ్ధ్వా స్రష్టా సృష్టిం చ కారసః ॥
మాయయా ప్రతి బ్రహ్మాండే బ్రహ్మ విష్ణు శివాత్మకాః ।
దిక్పాలా ద్వాదశాదిత్యా రుద్రాశ్చైకాదశాపిచ ॥
నవగ్రహాష్టౌ వసవో దేవాః కోటీత్రయం తథా ।
బ్రాహ్మణ క్షత్రవిట్ శూద్రాయక్ష గంధర్వకిన్నరాః ॥
భూతాదయో రాక్షసాశ్చా ప్యేవం సర్వం చరాచరం ।
విశ్వే విశ్వే వినిర్మాణాః స్వర్గాః సప్తక్రమేణచ ॥
సప్తసాగర సంయుక్తా సప్త ద్వీపా వసుంధరా ।
కాంచనీ భూమి సంయుక్తా తమోయుక్తం స్థలం తదా ॥
పాతాళాశ్చ తథాసప్త బ్రహ్మాండ మేభిరేవచ ।
విశ్వవిశ్వే చంద్రసూర్యౌ పుణ్యక్షేత్రంచ భారతం ॥
తీర్థాన్యేతాని సర్వత్ర గంగాదీని వ్రజేశ్వర ।
యావంతి రోమకూపాని మహావిష్ణోః క్రమేణచ ॥
విశ్వాన్యేవహి తివంతి హ్యసంఖ్యాతానిచ ధ్రువం ।
విశ్వేషా మూర్ధ్వభాగేచ వైకుంఠశ్చ నిరాశ్రయః ॥
మదిచ్ఛయా వినిర్మాణాః వేదాః కథితుమక్షమాః ।
కుయోగినామదృష్టశ్చా భక్తానాంచ వినిశ్చితం ॥
తస్మాదుపరి గోలోకః పంచాశత్కోటియోజనః ।
వాయునా ధార్యమాణశ్చ విచిత్రః పరమాశ్రయః ॥
అతీవ రమ్యనిర్మాణే నిత్యరూపో మదిచ్ఛయా ।
శతశృంగేణ శైలెన పుణ్యవృందా వనచ ॥
సురాసమండలేనాపి నద్యా విరజయా యుతః ।
కోటియోజన విస్తీర్ణా ప్రస్థేన విరజా ప్రజ ॥
ఓ తండ్రి! సర్వులకు ఆధారభూతుడు, మహా విరాట్టు, ఆతడు నీటిలో పడిపోయాడు. నీటిలో పడ్డ సంతానాన్ని చూచి, నేను, ఇదిరలో ఆమెను శపించాను. (89) ఓ విభు! ఇదివరలో నా శాపంతో ఆరాధ సంతాన హీనురాలైంది. అందువల్ల క్రమంగా దుర్గ, లక్ష్మి, సరస్వతి కలిగారు. (90) ఆ నలుగురు పరిపూర్ణులు, పుట్టింపబడ్డారు. నిశ్చయము. ఓవ్రజేశ్వర! ఇతర దేవతలు, ఆస్త్రీలు పుట్టించబడ్డారు. (91) ఓ ప్రజ! ఎవరి (స్త్రీలు) కళతో లేదా కలాంశ అంశతోకాని పుట్టాడో. ఏడింభుని వలన మహావిరాట్టు జన్మించాడో ఆతడు కళతో ఆశ్రయింపబడ్డాడు. (92) నేను ఆతనికి అమృతమయమైన అంగుషామృతమును ఇచ్చాను. ఆతడు తాగాడు. జలమందు స్థావర రూపంగా నిద్రిస్తున్నాడు. తన కర్మకు నిలయము. (93) జలము తలగడ, ఆతనికి యోగబలంతో జలమేతల్పము. అతని రోమకూపములు ఎల్లప్పుడు నీటితో నిండి ఉంటాయి. (94) క్రమంగా క్షుద్ర విరాట్టు తిరిగి ప్రత్యేకంగా నీటి యందు నిద్రపోతాడు. క్షుద్రుని నాభినుండి వేయిరేకుల కమలం ఉద్భవించింది. (95) ఈ వరుడైన బ్రహ్మ అక్కడ పుట్టాడు. కనుక ఇతడు కమలోద్భవుడు. ఆ విధి అక్కడ పుట్టి ఆతడు చింతాగ్రస్తుడైనాడు. (96) ఈదేహమెక్కడిది తల్లెక్కడ, నాతండ్రిక్కడ, బంధువులెక్కడ. ఆ కమలంలోనే దేవతల మూడు లక్షల సంవత్సరాల కాలం తిరిగాడు. (97) ఆపిదప, దేవతల ఐదు లక్షల సంవత్సరాల కాలం తపస్సు చేస్తూ నన్ను స్మరించాడు. అప్పుడు కమలంలోనే ఉండి నేనిచ్చిన మంత్రాన్ని జపించాడు. (98) దేవతల ఏడు లక్షల సంవత్సరాల కాలం నియమంగా నిగ్రహంగా, శుచిగా జపించాడు. ఆపిదపనాతో వరాన్ని పొంది ఆ బ్రహ్మ సృష్టి చేశాడు. (99) మాయతో ప్రతిబ్రహ్మాండ మందు బ్రహ్మవిష్ణువు, శివుడు, దికాల్పలురు, పన్నెండు మంది సూర్యులు, పదకొండు మంది రుద్రులు (100) నవగ్రహాలు, ఎనిమిది మంది వసువులు, అట్లాగే మూడుకోట్ల దేవతలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, యక్ష గంధర్వ కిన్నరులు (101) భూతాదులు, రాక్షసులు, ఈ విధంగా చరాచర సృష్టి సర్వమూ కలిగింది. ప్రతివిశ్వంలో క్రమంగా ఏడు స్వర్గములు నిర్మింపబడ్డాయి (102) ఏడు సాగరములు, ఏడు దీవులతో భూమి, బంగారు భూమి, అట్లాగే చీకటి స్థలము, (103) ఏడు పాతాళాలు, వీటితోనే బ్రహ్మాండము నిర్మింపబడ్డాయి. ప్రతి విశ్వంలో చంద్రసూర్యులు, పుణ్యక్షేత్రమైన భారతము వచ్చాయి. (104) ఓ వ్రజేశ్వర! ఈ గంగాది తీర్థములు. అంతటా వచ్చాయి. మహావిష్ణువునకు రోమకూపములెన్నో క్రమంగా అన్నీ వచ్చాయి (105) అవన్నీ అసంఖ్యాకములైన విశ్వములే, నిశ్చయము. వీటన్నిటి పైభాగంలో (విశ్వమునకు ఈశులు) వైకుంఠము, నిరాశ్రయంగా ఉంది (106) నాఇచ్చతో నిర్మించబడ్డ వేదములు, చెప్పటానికి అసాధ్యములు. కుత్సితయోగులకు కన్పించదు. భక్తులు కాని వారికి కూడా, నిశ్చయము (107) ఆ పైన గోలోకము ఏబది కోట్ల యోజనముల విస్తీర్ణముది. గాలితో ధరించబడుతోంది. విచిత్రమైనది. గొప్ప ఆశ్రయము కలది (108) మిక్కిలి అందమైన నిర్మాణము నిత్యరూపమైనది, నా ఇచ్ఛతో నిర్మించాను. నూరు శిఖరములు గల పర్వతముతో, పుణ్యమైన వృందావనముతో (109) మంచిరాస మండలముతో, విరజానదితోను కూడింది. కోటి యోజనములు విస్తీర్ణముకల కొండమీది విశాల ప్రదేశము కలది విరజ, ఓ ప్రజ!
మూ॥ దైర్ఘ్యంతస్యాః శతగుణం పరితః పరమా శుభా ।
అమూల్యరత్ననికరై: హీరమాణిక్యయోస్తథా ॥
మణీనాంకాస్తుభాదీనా మసంఖ్యానాం మనోహరా ।
అమూల్యరత్న నిర్మాణం తత్రాపి ప్రతి మందిరం ॥
మనోహరంచ ప్రాకారమదృష్టం విశ్వకర్మణా ।
గోపీభిర్గోపనికరై: వేష్టితం కామధేనుభిః ॥
కల్పవృక్షైః పారిజాతైః అసంఖ్యైశ్చ సరోవరైః ।
పుష్పోద్యానైః కోటిభిశ్చ సంవృతం రాసమండలం ॥
వేష్టితం వేష్టితైర్గోపై: మందిరైః శతకోటిభిః ।
రత్నప్రదీపయుక్తైశ్చ పుషతల్ప సమన్వితైః ॥
సుగంధి చందనామోదైః కస్తూరీ కుంకుమాన్వితైః ।
క్రీడోపయుక్తైర్భోగైశ్చ తాంబూలైర్వాసితైర్జలైః ॥
ధూ పైః సురభిరమ్యైశ్చ మాల్యైశ్చ రత్నదర్పణైః ।
రక్షకైరక్షితం శశ్వత్ రాధా దాసీత్రికోటిభిః ॥
అమూల్యరత్నాభరణైః వహ్ని శుద్ధాంశుకైరపి ।
లక్షమత్త గజేంద్రాణాం వేష్టితంచ బలైః క్రమాత్ ॥
నవయౌవ్వన సంపన్నై రూ పైర్నిరుపమైరపి ।
రమ్యంచ వర్తులాకారం చంద్రబింబం యథాప్రజ ॥
అమూల్య రత్నరచితం దశయోజన విస్తృతం ।
కస్తూరీ కుంకుమై రత్యైః సుగంధి చందనార్చితం ॥
ఆవృతం మంగలఘటం ఫలపల్లవ సంయుతైః ।
రథిలాజైశ్చ పర్ణైశ్చ స్నిగ్ధ దూర్వాంకురైః ఫలైః ॥
శ్రీరామ కదలీస్తంభై రసంఖ్యైశ్చ మనోహరైః ।
పట్ట సూత్ర నిబద్ధైశ్చ స్నిగ్ధేశ్చందన పల్లవైః ॥
చందనాసక్త మాల్యైశ్చ భూషణైశ్చ విభూషితం ।
అమూల్యరత్నరచితం శతశృంగ మనోహరం ॥
కోటియోజన మూర్ధ్వంచ దైర్ఘ్యం దశ గుణోత్తరం ।
శైలప్రస్థపరిమితం పంచాశత్కోటి యోజనం ॥
అతీవ కమనీయంచ వేదానిర్వచనీయకం ।
ప్రాకారమివ తస్యాపి గోలోకస్య మనోహరం ॥
పరితోవేష్టితం రమ్యం హీరహార సమన్వితం ।
తత్ర వృందావనం రమ్యం యుక్తం చందన పాదపైః ॥
కల్పవృక్షైశ్చ రమ్యైశ్చ మందారైః కామధేనుభిః ।
శోభితం శోభనాడ్యైశ్చ పుష్పోద్యానైర్మనోహరైః ॥
క్రీడాసరోవరైరమ్యైః సురమ్యై రతిమందిరైః ।
అతీవ రమ్యం రహసి రాసయోగ్యస్థలాన్వితం ॥
రక్షితం రక్షకై రమ్యై రసంఖ్యైర్గోపికాగణైః ।
పరితోవర్తులాకారం త్రిలక్షయోజనం వరం ॥
షట్పద ధ్వనిసంయుక్తం పుంస్కోకిలరుతాన్వితం ।
తత్రాక్షయోవటోరమ్యో రహస్యే బహువిస్తృతః ॥
సహస్రయోజనోర్ద్వశ్చ పరితశ్చ చతుర్గుణః ।
గోపీనాం కల్పవృక్షశ్చ సర్వవాంఛాఫలప్రదః ॥
క్రీడాన్వితైరావృతశ్చరాధాదాసీత్రిలక్షకైః ।
విరజా తీరనీరాణాం వాయునా శీతలేనచ ॥
పుష్పాన్వితేన మందేన పవిత్రశ్చ సుగంధినా ।
దాసీగణైర సంఖైశ్చ వృందావన వినోదినీ ॥
తత్రక్రీడతి రాధా సా మమ ప్రాణాధి దేవతా ।
సేయం శ్రీరామశాపేన వృషభానసుతాఽధునా ॥
బ్రహ్మాది దేవైః సిద్ధేంద్ర మునీంద్రైః పూజితా వ్రజ ।
సిద్ధైర్గుణైర్బలైర్బుద్ధ్యా జ్ఞానయోగైశ్చ విద్యయా ॥
తాతసర్వప్రకారేణ వంద్యా మత్సదృశీప్రియా ।
ఇత్యేవం కథితం నంద బ్రహ్మాండానాంచ వర్ణనం యధోచితం పరిమితం కింభూయః శ్రోతుమిచ్ఛసి ॥
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ నారాయణ నారద సంవాదే భగవన్నంద సంవాదే చతురశీతితమోఽధ్యాయః॥
పొడవు దానికి నూరురెట్లెక్కువ, చుట్టూ శుభమై, ఉత్తమమైనది. అమూల్యమైన రత్న సమూహములతో వజ్రమాణిక్యములతో (111) అసంఖ్యాకములైన కౌస్తుభాదిమణులతో కూడి మనోహరమైనది. అక్కడ కూడా ప్రతిమందిరము, అమూల్యరత్నములతో నిర్మించబడినది (112) ప్రాకారము మనోహరమైనది. విశ్వకర్మ ఎప్పుడూ చూడనట్టిది గోపికలు, గోపకులు కామధేనువులు వీటితో ఆవరించబడింది (113) కల్ప వృక్షములు, పారిజాత వృక్షములు, అసంఖ్యాకమైన సరోవరములు, కలది. కోట్ల కొలది పుష్పోద్యానములతో ఆవరించబడింది, రాసమండలము (114) నూరుకోట్ల కొలది గోపకులతో చుట్టబడిన మందిరములతో చుట్టబడింది. రత్న దీపములు కలది. పుషతల్పములు కలది (115) వాసనగల చందనపు వాసనలతో, కస్తూరి కుంకుమలు గలవానితో కూడింది. క్రీడకు ఉపకరించే భోగవస్తువులు, తాంబూలములు, వాసనగల జలముగలది (116) వాసనగల రమ్యమైన ధూపములు కలది, మాలలు గలది, రత్నముల అద్దములు గలది. ఎప్పుడు రక్షకులతో రక్షింపబడేది. మూడుకోట్ల రాధదాసీలతో కూడినది (117) అమూల్యరత్నాభరణములతో, వహ్నిశుద్ధమైన వస్త్రములతో కూడినది. లక్షమందించిన ఏనుగులతో చుట్టబడింది. సైన్యముతో క్రమంగా చుట్టబడింది (118) నవయౌవ్వనముగలిగిన, రూపంలో సాటిలేని వారుకలది. ఓప్రజ! చంద్రబింబమువలె గుండ్రముగా ఉన్నది, రమ్యమైనది (119) అమూల్య రత్నములతో చేయబడింది. పదియోజనముల విశాలమైనది. రమ్యమైన కస్తూరి కుంకుమలు కలది, వాసనగల చందనముతో అర్చింపబడింది (120) పండ్లు చిగురుటాకులు గలది మంగళఘటములు కలది. పెరుగు , పేలాలు, ఆకులు నిగనిగలాడే గడ్డిమొలకలతో పండ్లతో కూడింది (121) శుభకరమైన, అందమైన అరటి స్తంబములతో, అసంఖ్యాకమైనవానితో మనోహరమైనది. పట్టుదారముతో కట్టబడిన, నిగనిగలాడే చందనపు చిగురుటాకులు గలది (122) చందనముతో కూడిన మాలలతో భూషణములతో అలంకరింపబడింది. అమూల్యమైన రత్నములతో చేయబడింది. నూరు శృంగములతో మనోహరమైనది (123) పైకి కోటియోజనములు (ఎత్తు) పొడవు, దానికన్న పదింతలు ఎక్కువ, ఏబదికోట్ల యోజనములు, పర్వతములతో కూడిన కొండమీది విశాల ప్రదేశముకలది (124) మిక్కిలి అందమైనది, వేదములతో నిర్వచింపరానిది. దానికి కూడా ప్రాకారమువలె, గోలోకమునకు మనోహరమైనది (125) చుట్టూ చుట్టబడినది, రమ్యమైనది, వజ్రహారములతో కూడినది, అక్కడ రమ్యమైన వృందావనమున్నది. అది చందనపు చెట్లతో కూడినది (126) రమ్యమైన కల్పవృక్షములతో, మందారములతో, కామధేనువులతో కూడినది. శోభనమైన మనోహరమైన పుష్పోద్యానములతో అలంకరించబడింది (127) రమ్యమైన క్రీడా సరోవరములతో, ఇంకా రమ్యమైన రతిమందిరములతో కూడింది. రహస్యంగా, రాసయోగ్యమైన స్థలముగలది, మిక్కిలి రమ్యమైనది (128) అసంఖ్యులైన రమ్యమైన గోపికా గణములతో, రక్షకులతో రక్షింపబడింది. చుట్టూ గుండ్రని ఆకారము గలది. మూడు లక్షల యోజన వైశాల్యముగలది, శ్రేష్ఠమైనది (129) తుమ్మెదల ధ్వని గలది, పుంస్కోకిలల ధ్వనితో కూడినది. అక్కడ రమ్యమైన అక్షయ వటము రహస్యమందు ఉంది. చాలా విశాలమైనది (130) వేయి యోజనముల ఎత్తు, దానికి నాల్గింతలు వ్యాప్తి కలది. గోపికలకు కల్పవృక్షమది. అన్ని కోరిన ఫలితములనిచ్చేది (131) క్రీడకు కావలసిన వానితో ఆవరించబడింది. మూడు లక్షల రాధ దాసీలు గలది. విరజాతీరమందలి నీటియొక్క చల్లని గాలితో (132) మెల్లని దానితో పుష్పములతో కూడిన మంచి వాసన కలవానితో పవిత్రమైంది. అసంఖ్యాకమైన దాసీగణముతో వృందావనమందు ఆనందించేది (133) నా ప్రాణాధిదేవతమైన రాధ ఆమె అక్కడ క్రీడిస్తోంది. ఆ ఈమె శ్రీరాముని శాపంతో ఇప్పుడు వృషభానుని సుతగా ఉంది. (134) ఓప్రజ! బ్రహ్మాది దేవతలతో, సిద్దేంద్రులైన మునీంద్రులతో (సిద్ద, ఇంద్ర, మునీంద్ర) పూజింపబడింది. సిద్దులతో, గుణములతో, బలములతో, బుద్దితో, జ్ఞానయోగములతో, విద్యతో (135) ఓతండ్రి! అన్ని విధముల నాతో సమానమైనది, ప్రియమైనది, నమస్కరింప తగినది అని ఓ నంద! బ్రహ్మాండముల వర్ణనను ఇట్లా చెప్పాను, తగినట్లుగా పరిమితంగా చెప్పాను, ఇంకా ఏమి వినదలిచావు (136) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాద మందు భగవంతుని నందుని సంవాదమందు ఎనుబది నాల్గవ అధ్యాయము.
Summary of chapter 84 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Celebrating sacred botanical manifestations of divine energy, this chapter details the spiritual merits of planting, watering, worshipping, and circumambulating the holy Tulasī plant, the Dhātrī tree, and the Bilva tree. The text declares that Lord Śrī Kṛshṇa resides eternally near a Tulasī garden, and offering a single Tulasī leaf with love satisfies the Lord more than mountains of gold. Similarly, honoring the Dhātrī and Bilva trees bestows health, long life, and spiritual purity upon the household.