శ్రీ నారాయణ ఉవాచ :
మాధవో బాలకైః సార్థమేకదా హలినా సహ ।
భుక్త్యా పీత్వా చ క్రీడార్థం జగామ శ్రీపనం మునే॥
తత్ర నానావిధం క్రీడాం చకార మధుసూదనః ।
కృత్వా తాం శిశుభిః సార్థం చాలయామాన గోధనం ॥
యయౌ మధువనం తస్మాచ్ఛ్రీకృష్ణో గోధనైః సహ ।
తత్ర స్వాదు జలం పీత్వా వనే చ న మహాబలః॥
నారాయణ మహర్షి పలికెను :
ఒకసారి శ్రీకృష్ణుడు బలరాముడు బాలకులతో బోటు ఇంటివద్ద ఆహార పానీయములు స్వీకరించి క్రీడించుటకు శ్రీ వనమున కేగిరి. గోవులను మేపుచు అక్కడ వారందరు నానావిధమైన ఆటలాడిరి. ఆయడవిలో తీయని నీరు త్రాగి మహాబలవంతుడైన శ్రీకృష్ణుడు గోవులను తోలుకొని గోపాలబాలురతో బాటు అక్కడి నుండి మధువనమున కేగెను.
తత్రేకదైత్యో బలవాన్ శ్వేత వర్ణో భయంకరః।
వికృతాకారవదనో బకాకారశ్చ శైలవత్ ॥
దృష్ట్వా చ గోకులం గోష్ఠే శిశుభిర్బలకేశవౌ ।
యథాహ్యగస్త్యో వాతాపిం సర్వం జగ్రాన లీలయా॥
ఆ మధువనములో నొక బలవంతుడైన రాక్షసుడు వికారమైన ఆకారము ముఖముతో భయము కల్గించు కొండంత తెల్లని కొంగ రూపము ధరించి వచ్చి గోకులము చూచి (ఆ వనములో) పూర్వ మగస్త్యుడు వాతాపిని మొత్తముగా ఒక లీలగా మ్రింగినట్లు గోపాల బాలురతో బోటు బలరామకృష్ణులను ప్రింగెను.
బకగ్రస్తం హరిం దృష్ట్వా సర్వే దేవా భయాన్వితాః।
చక్రుర్హా హేతి సంత్రస్తా ధావంతః శస్త్రపాణయః ॥
బకము చేత మ్రిoగబడిన శ్రీకృష్ణుని చూచి దేవతలందరు భయపడి హాహా అనీ అరచుచు తమ తమ శస్త్రములు చేతులలో పట్టుకొని పరిగెత్తిరి.
శక్రశ్చిక్షేవ వజ్రం చ మునేరస్థివినిర్మితం ।
న మమార బకస్తస్మాత్పక్షమేకం దదాహ చ॥
దధీచి ముని వెన్నెముకతో నిర్మించబడిన వజ్రాయుధమును ఇంద్రుడు విసిరివేయగా ఆ కొంగ చావలేదు. ఒక రెక్క మాత్రము కాలిపోయినది.
నీహారాస్త్రం శశధరః శీతార్త స్తేన దానవః ।
యమదండం సూర్యపుత్రో తేన కుంఠో బభూవ హ॥
చంద్రుడు నీహారాస్త్రమును ప్రయోగించగా దానపుడు చలితో బాధపడెను. . సూర్యపుత్రుడైన యముడు తన దండాయుధము విసరగా దానితో వాడు గాయపడెను.
వాయవ్యాస్త్రం చ వాయుశ్చ తేన స్థానాంతరం యయౌ ।
వరుణశ్చ శిలావృష్టిం చకార తేన పీడితః ॥
వాయువు వాయవ్యాస్త్రము ప్రయోగించగా కొంట అటనుండి వేరొక చోటబడెను. వరుణుడు శిలావర్షము కురిపించగా దానితో దానవుడు పీడనొందెను.
హుతాశనశ్చ వాహ్నేన పక్షాంశ్చైవ దదాహ సః ।
కుబేరస్యార్థచంద్రేణ భిన్న పాదో బభూవ హ॥
ఈశానస్య చ శూలేన బభూవ మూర్ఛితోఽ సురః ।
ఋషయో మునయశ్చైవ కృష్ణం చక్రుద్భియాఽఽ శీషం ॥
అగ్నిదేవుడాగ్నేయాస్త్రముతో వాని మొత్తము రెక్కలను కాల్చి వేసెను. కుబేరుడర్ధచంద్రబాణముతో వానీ పాదములను నరికివేసెను. శంకరుడు శూలము ప్రయోగించగా రాక్షసుడు మూర్ఛిల్లెను. ఋషులు మునులు భయముతో శ్రీకృష్ణునకాశీస్సులు పలికిరి.
ఏతస్మిన్నంతరే కృష్ణః ప్రజ్వలన్ బ్రహ్మతేజసా ।
దదాహ దైత్య సర్వాంగం బాహ్యాభ్యంతరమీశ్వరః ॥
తత్సర్వం వమనం కృత్వా ప్రాణాంస్తత్యాజ దానవః ।
ఇంతలో పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మ తేజస్సుతో వెలుగుచు బక దైత్యుని సర్వాంగమును లోపల బయట మంట పెట్టెను. అప్పుడా రాక్షసుడు మ్రింగిన వారినందరిని క్రక్కివేసి ప్రాణములు వదిలెను.
బకం నిహత్య బలవాన్చ్ఛిశుభిర్గోధనైస్సపా ॥
యయౌ కేలికదంబానాం కాననం సుమనోహరం ।
బలవంతుడైన శ్రీకృష్ణుడిట్లు బకుని సంహరించి బాలురను గోవులను వెంటబెట్టుకొని మిక్కిలిగా మనస్సును హరించెడి కదంబవసమునకు.
ఏతస్మిన్నంతరే తత్ర వృషరూపధరోఽ సురః ।
నామ్నా ప్రలంబో బలవాన్ మహాధూర్తశ్చ శైలవత్ ॥
శృంగాభ్యాం హరిం ధృత్వా భ్రామయామాస తత్ర వై ।
దుద్రువుర్బాలకాన్సర్వే రురుదుశ్చ భయాతురాః ॥
బలో జహాన బలవాన్ జ్ఞాత్వా భ్రాతరమీశ్వరం ।
బాలకాన్ బోధయామాస భయం కిమిత్యువాచ హ ॥
ఆ కదంబవనములో ప్రలంబుడన్న రాక్షసుడు పర్వతమంత వృషభ (ఎద్దు) రూపము ధరించి బలవంతుడు గొప్ప దుష్కార్యములు చేయువాడు కనుక హఠాత్తుగా వచ్చి శ్రీకృష్ణుని తన కొమ్ములతో నెత్తీ పట్టి త్రిప్పుచుండెను. అది చూచి బాలకులందరు భయపడి ఏడ్చుచు పరిగెత్తిరి, బలవంతుడైన బలరాముడు తన తమ్ముడు పరమేశ్వరుడని ఎరిగినందున నవ్వి ఎందుకు భయము అని బాలురకు ధైర్యము చెప్పెను.
తద్విషాణం గృహీత్వా చ స్వయం శ్రీమధుసూదనః ॥
భ్రమయిత్వా చ గగనే పాతయామాస భూతలే ।
ప్రాణాన్ తత్యాజ దైత్యేంద్రో నిపత్య చ మహీతలే ॥
జహసుర్బాలకాస్సర్వే ననృతుశ్చ జగుర్ముదా ।
మధువను రాక్షసుని సంహరించినవాడగు శ్రీహరి వృషభాసురుని (ప్రలంబుడు) కొమ్ములు పట్టుకొని ఆకాశమున గిరగిర త్రిప్పి భూమీ మీద పడవేసెను. ఆ రాక్షసుడు నేలమీద పడి ప్రాణములు విడిచెను. బాలురందరది చూచి సంతసముతో నవ్విరి. నాట్యమాడిరి. పాటలు పాడిరి.
హత్వా ప్రలంబం శ్రీకృష్ణో బలేన సహసత్వరం॥
గోధనం చారయామాస యయౌ భాండీరమీశ్వరః ।
గచ్ఛంతం మాధవం దృష్ట్వా కేశీ దైత్యేశ్వరో బలీ ॥
వేష్టయామాస తం శీఘ్రం ఖురేణ విలిఖన్మహీం।
మూర్ధ్నికృత్వా హరిం తుష్టో గగనం శతయోజనం॥
ఉత్పాత్య భ్రామయామాన పపాత చ మహీతలే।
జగ్రాహ స హరిం పాపీ చర్వయామాస కోపతః ॥
న భగ్నదంతో దైత్యశ్చ వజ్రాంగచర్వణాదహో।
శ్రీకృష్ణ తేజసా దగ్ధః ప్రాణాంస్తత్యాజ భూతలే ॥
స్వర్గే దుందుభయో నేదుః పుష్పవృష్టిర్బభూవ హ ।
శ్రీకృష్ణుడు ప్రలంబునీట్లు సంహరించి బలరామునితో బాటు (గోపాల బౌలురను) వెంటగోని త్వరగా తమ ధనమైన గోబృందము మేపుచు భాండీర వనమున కేగుచుండెను. అట్లు పోవుచున్న మాధవుని జూచి బలవంతుడగు కేశియను దైత్యేశ్వరుడు భూమిని డెక్కలతో దున్నుచు (అశ్వరూపముననున్నందున) చుట్టు తిరిగి తలమీద శ్రీకృష్ణునెత్తుకొని సంతోషముతో నూరు యోజనముల యెత్తు ఆకాశమునకెగురవేసి గిరగిర త్రిప్పి నేలమీద పడవేసెను. తాను కూడ దిగి వచ్చి ఆ పాపాత్ముడు శ్రీహరిని పట్టుకొని కోపముతో స్వామిని నమీలివేయుచుండెను. వజ్రకాయుడైన శ్రీకృష్ణుని నములుట వలన ఆదైత్యునీ దంతములు భగ్నమయ్యెను. వాడు కృష్ణ తేజస్సులో దగ్గమై ప్రాణములు విడిచెను. స్వర్గమున దేవ దుందుభులు మ్రోగెను. పుష్పవర్షము కురిసెను.
ఏతస్మిన్నంతరే తత్ర పార్షదా దివ్యరూపిణః ॥
తత్రాఽ జగ్ముః స్యందనస్థా ద్విభుజాః పీతవాససః ।
కిరీటినః కుండలినో వనమాలావిభూషితాః ॥
వినోదమురళీ హస్తాః క్వణన్మంజీర రంజితాః ।
చందనోక్షితసర్వాంగా గోపవేషధరా వరాః॥
ఈషద్ధాస్య ప్రసన్నాస్యా భక్తానుగ్రహకాతరాః ।
ప్రదీప్తం రథమాస్థాయ రత్నసారవినిర్మితం ॥
భాండీర వనమాజగ్ముర్యత్ర సన్నిహితో హరిః ।
దివ్యవస్త్ర పరీధానా రత్నాలంకార భూషితాః ॥
ప్రణమ్య చ హరింస్తుత్వా జగ్ముర్గోలోకముత్తమం ।
ఇంతలో నాభాండీర వనమునకు దివ్యరూపధారులైన గోలోకపాదులు (శ్రీహరితో కలిసియుండు గోలోక సభ్యులు) రత్నస్తారము చేత నిర్మింపబడి వెలుగుచున్న రథమెక్కి వచ్చిరి. వారు పీతాంబరములు ధరించి కిరీటములు కుండలములు వనమాలలచే నలంకృతులై వినోదముగా రెండు హస్తములతో మురళులు చేత బట్టి పాదములందు కుణుకుణుమనుచున్న మంజీరములతో - {అందెలు) శ్రీగంధము పూయబడిన సర్వాంగములు గలవారై గోపవేషధారులై చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖములు గలవారై - భక్తులననుగ్రహించు చూపులతో విరాజిల్లుచుండిరి. వారు దివ్య వస్త్రములను ధరించి రత్నాలంకార భూషితులై యుండిరి. శ్రీకృష్ణుడు సన్నిధి చేసియున్న ప్రదేశమునకు వచ్చి, వారు శ్రీకృష్ణునకు నమస్కరించీ స్తోత్రము చేసి ఉత్తమమైన గోలోకమునకు వెళ్లిరి.
ముక్త్వా దేహం పరిత్యజ్య వైష్ణవాః పురుషాoత్రయః ।
సంప్రాప్య దానవీం యోనిం బభూవుః కృష్ణపార్షదాః ॥
ముగ్గురు విష్ణు భక్తులు దొనవ జన్మలెత్తి శరీరములు వదిలి సంసార బంధము నుండి విముక్తులై గోలోకమున శ్రీకృష్ణ సభలో సభ్యులైరి.
నారద ఉవాచ :
కే తే చ దివ్యపురుషా వైష్ణవా దైత్యరూపిణః।
కథయస్వ మహాభాగ కృతం కిం పరమాద్భుతం ॥
నారదుడు పల్కెను :
వైష్ణవులై దైత్యరూపములు ధరించి దివ్యరూపులైన వారెవరు ? ఓ మహానుభావుడా ! వారేమి పరమాశ్చర్యమైన కర్మలు నాకు చెప్పుము.
నారాయణ ఉవాచ :
శ్రణు బ్రహ్మన్ ప్రవక్ష్యేఽ హమితిహాసం పురాతనం॥
శ్రుతం మహేశ వదనాత్సూర్య పర్వణి పుష్కరే ।
హరేర్గుణ ప్రసంగేన కథయామాస శంకరః ॥
సంపృష్టో ముని సంఘైశ్చ మయా ధర్మేణ బ్రహ్మణా।
బ్రహ్మపుత్ర మహాభాగ కథాం భువన పావనీం ॥
కథయామాస విస్తార్య సావధానం నిశామయ ।
నారాయణమహర్షి పల్కెను :
ఓ జ్ఞానీ ! నీకొక పురాతనమైన ఇతిహాసమును చేప్పెదను. వినుము. ఓ బ్రహ్మపుత్రుడా ! లోకములను పానము చేయు నీ కథను శంకరుని ద్వారా వినియుంటిని. ఒకసారి పుష్కర క్షేత్రమునందు సూర్యగ్రహణ సందర్భమున మునిగణములు ధర్మదేవత బ్రహ్మ నేను అడుగగా శ్రీహరి గుణములను ప్రసంగించుచు శంకరుడీకథను వివరించి చెప్పెను.
గంధర్వేశో గంధవాహః పర్వతే గంధమాదనే ॥
మహాoస్తపస్వి ప్రవరో హరి సేవన తత్పరః ।
పుత్రా బభూవుశ్చత్వారో గంధర్వ ప్రవరా మునే ॥
సన్మరుః కృష్ణపాదాబ్జం స్వప్నే జ్ఞానే దివానీశం ।
తే చ దుర్వాసనః శిష్యాః శ్రీకృష్ణార్చన తత్పరాః ॥
నిత్యం దత్త్వా చ కమలం సంపూజ్య తం పపుర్జలం ।
వసుదేవః సుహోత్రశ్చ సుదర్శన సుపార్శ్వకౌ ॥
చత్వారో వైష్ణవ శ్రేష్ఠాస్తేపుస్తే పుష్కరే తపః ।
చిరకాలం తవస్తప్త్వా బభూవుస్సిద్ధమంత్రిణః ॥
గంధమాదన పర్వతమున గంధవాహుడన్న గంధర్వరాజు గొప్ప తపస్విశ్రేష్ఠుడు హరి పాద సేవాసక్తుడు. ఓ నారదా ! అతనికి వసుదేవుడు, సుహోత్రుడు, సుదర్శనుడు, సుపార్శ్వకుడని నలుగురు కుమారులు కలరు. వారు కూడ శ్రీకృష్ణపాద పద్మములను నిద్రలో, మెలకువలో రాత్రింబగళ్లు స్మరించుచుండిరి. వారు దుర్వాస మహర్షి శిష్యులు. ఆ నలురు వైష్ణవ శ్రేషులు (గొప్ప విష్ణు భక్తులు). శ్రీకృష్ణ పూజాతత్పరులై పుష్కర క్షేత్రమున చిరకాలము తపస్సు జేసిరి. ప్రతీదినము శ్రీకృష్ణపాదములను ఒక్కొక్క కమలముతో అర్చించి జలపానము మాత్రమే చేయుచు మంత్రసిద్ధి పొందిరి.
జ్వేష్ఠో దుర్వాససో యోగం సంప్రాప్య యోగినాం వరః।
సిద్ధశ్చాకృత దారశ్చ ప్రజ్వలన్ బ్రహ్మతేజసా॥
సద్యో దేహం పరిత్యజ్య బభూవ కృష్ణపార్హదః ।
వారిలో పెద్దవాడగు వసుదేవుడు దుర్వాసమహర్షి వలన యోగవిద్యను పొంది దానిలో సిద్ధిని పొంది యోగివరుడయ్యెను. అతడు వివాహము చేసికొనక బ్రహ్మతేజస్సుతో వెలుగుచు యోగశక్తితో వెంటనే శరీరము త్యజించి గోలోకమున శ్రీకృష్ణపారదుడయ్యెను.
ఏకదా భ్రాతర స్తే చ జగ్ముశ్చిత్ర సరోవరం॥
పద్మాని కృష్ణపూజార్థమాహర్తుముదయే రవేః।
పద్మానాం చయనం కృత్వా గచ్ఛతో వైష్ణవాన్మునే॥
దృష్ట్వా నిబధ్య సంజగ్ముః సర్వే శంకరకింకరాః।
బలిష్ఠా దుర్బలాన్ ధృత్వా జగ్ముః శంకర సన్నిధిం॥
తే సర్వే శంకరం దృష్ట్వా ప్రణేముః శిరసా భువి ।
తానువాచ శివః శీఘ్రం ప్రయుజ్యాశీషముత్తమాం ॥
ఈషద్ధాస్య ప్రసన్నాస్యో భక్తానుగ్రహకాతరః॥
ఒకసారి తపస్సుతో మంత్ర సిద్ధులైన తక్కిన ముగ్గురు సోదరులు సూర్యోదయ కాలమున శ్రీకృష్ణ పూజ కొరకు కమలములు సంపాదించుటకై చిత్ర సరోవరమునకు వెళ్లారి, పద్మముల కోసుకొని పోరు మరలి పోవుచుండగా చూచిన శివకింకరులు ఈ బలహీనులను పట్టి బంధించి శివుని వద్దకు తీసుకొని పోయిరి. గంధర్వులు శంకరుని చూడగనే నేలమీద శిరములానించి నమస్కరించిరి. శివుడు వారికి ఉత్తమమైన ఆశీస్సులిచ్చి కొద్దిపాటి చిరునవ్వుతో గూడి ప్రసన్నముగా నున్నముఖ మండలముతో భక్తులననుగ్రహించువాడై ఇట్లు పలికెను.
శివ ఉవాచ :
కే యూయం పద్మహర్తారః పార్వత్యాశ్చ సరోవరే ॥
లక్షయక్షైరక్షణీయం పార్వతీవ్రత హేతవే ।
నిత్యం సహస్ర కమలం దదాతి హరయే సతీ ॥
వ్రతే త్రైమాసికే భక్త్యా పతిసౌభాగ్యవర్ధనే ।
శివన్య వచనం శ్రుత్వా తమూచుర్వైష్ణవా భియా ॥
పుటాంజలి యుతాః సర్వే భక్తినమ్రాత్మ కంధరాః ॥
శివుడు పలికెను :
“మీరెవరు? పార్వతి తన ప్రతము కొరకు లక్ష యక్షుల చేత రక్షింపబడు పార్వతీ సరోవరములో పద్మముల దొంగిలించితిరి. భర్త సౌభాగ్యమును వృద్ధి పొందించు త్రైమాసిక ప్రతము (మూడు నెలలపరిమితి గల వ్రతము) పట్టీ పార్వతి దినదినము వేయి కమలములు శ్రీహరికి సమర్పించుచున్నదిగదా !” శివుని వాక్కు విని ఆ వైష్ణవులు భక్తితో తమ శిరస్పులు వంచి చేతులు జోడించి భయముతో నీటు పలికిరి.
గంధర్వా ఊచుః :
వయం గంధర్వప్రవరా గంధవాహనుతా విభో॥
హరయే కమలం దత్త్వా పిబామో జలమీశ్వర ।
వయం న విద్మహే నాథ పార్వత్యా రక్షితం సరః ॥
గృహాణ కమలం సర్వం యుష్మాకం చ ఫలం కురు ।
న దాస్యామోఽద్య కమలం పాస్యామోఽ ద్య జలం హర ॥
కిం వా కథం న పాస్యామస్తుభ్యం దత్తాని తాని చ।
నిత్యం ధ్యాత్వా యత్సదాబ్జం పద్మేన పూజయామహే ॥
సాక్షాత్త స్మై ప్రదత్త్వాచ పద్మం పూతా వయం ప్రభో।
ఏకం బ్రహ్మ హ్యద్వితీయం క్వ దేహః క్వ చ రూపవాన్ ॥
భక్తానుగ్రహతో దేహో రూపభేదశ్చ మాయయా।
కిం తు గృహాణ పద్మాని త్వమేవ మత్ర్పభుః ప్రభో ॥
యలో నో మానసం పూర్ణం తద్రూపం దర్శయాచ్యుత ।
గంధర్వులనిరి :
ఓ విభూ ! మేము గంధవాహుని పుత్రులము. గంధర్వులము. అనుదినము శ్రీహరికి కనులము సమర్పించి జలపానము చేయుదుము. ప్రభూ ! ఇది పార్వతీ దేవికి చెందిన సరస్పని ఎరుగము. ఈ కమలములన్నింటిని స్వీకరించి మీ వ్రతము నిర్వహించుడు. ఈనాడు కమలములను శ్రీహరికి సమర్పింపము. జలము స్వీకరించము, ఏమి ? కమలములు మీకు సమర్పించితిమి కదా ! ఎందుకు జలపానము. చేయము ? నిత్యమేవని పాదపద్మములను ధ్యానించి పద్మముతో పూజించుచుంటిమో అతనికి సాక్షాత్తుగా పద్మములీనాడు సమర్పించి మేము పూతాత్ములమైతిమి. ప్రభూ ! అద్వితీయమైన (సాటి లేని - రెండు వేరు కాని) పరబ్రహ్మ మొక్కటియే. దేహమెక్కడ? దేహము గలవాడు ( ఆత్మ) ఎక్కడ ? భక్తుల ననుగ్రహించుటకే ఆకారము మాయ వలన రూపభేదము ఏర్పడుచున్నవి. ఇక పద్మములను స్వీకరించువయ్యా ! స్వామీ ! నీవే మా ప్రభువువు. దేనితో మా మనస్సు నిండియున్నదో అట్టి రూపమును చూపించవయ్యా!
ద్విభుజం కమనీయం చ కిశోరం శ్యామసుందరం॥
వినోద మురళీహస్తం పీతాంబరధరం వరం ।
ఏకవక్త్రం ద్వీనయనం చందనాగురు చర్చితం ॥
ఈషద్ధాస్య ప్రసన్నాస్యo రత్నాలంకార భూషితం ।
కౌస్తుభేన మణీంద్రేణ వక్షఃస్థల సముజ్జ్వలం ॥
మయూర పిచ్చచూడం చ మాల్యతీమాల్యభూషితం ।
పారిజాత ప్రసూనానాం మారారాజీ విభూషితం ॥
కోటి కందర్ప లావణ్య లీలాధామ మనోహరం ।
గోపీ సం ఘైర్దృశ్యమానం సస్మితైర్వక్రలోచనైః॥
నవ యౌవన సంపన్నం రాధావక్షః స్థలస్థితం ।
బ్రహ్మాదిభిః స్తూయమానం వంద్యం ధ్యేయముభీప్సితం ॥
స్వాత్మారామం పూర్ణకామం భక్తానుగ్రహకాతరం ।
ఇత్యుక్త్వా పురతః శంభోస్తస్థుర్గంధర్వ పుంగవాః॥
ఒకముఖము రెండు నేత్రములు రెండు హస్తములు శ్యామసుందరమైన కోరదగిన కిశోరరూపము వినోదార్ణము హస్తమందు మురళి పీతాంబరము ధరించిన చందనము అగురుల ద్రవము పులుముకొన్న రత్నాభరణములు పారిజాత ప్రసూనమాలలు ధరించిన - కొద్దిపాటి చిరునవ్వు గల ప్రసన్న ముఖము కౌస్తుభమణితో వెలిగిపోవుచున్న వక్షః స్థలము మాలతీపూలదండలు చుట్టి నెమిలి పింఛములలంకరించిన కొండి కొప్పు గల కోటి మన్మధుల సౌందర్య విలాసములకు స్థానమై మనోహరముగా నున్న చిరునవ్వులు ప్రక్క చూపులు గల గోపికాగణములతో చూడబడుచున్న నవ వన సంపదతో రాధాదేవి వక్షస్థలమున విలసిల్లియున్న బ్రహ్మాది దేవతలకు కోరదగి నమస్కరింపదగీ ధ్యానము చేయదగి పొగడబడుచున్న భక్తులననుగ్రహించుటయందు తొందర గల తనయందు తానానందమయమై పూర్ణకామమైన (కోరికలన్నీ నిండుగా తీరిన) దివ్యరూపమును దర్శింపజేయుమ"ని పల్కి ఆ గంధర్వపుంగవులు శివుని ముందు నిలిచియుండిరి.
శ్రీకృష్ణ రూపశ్రవణాత్పులకాంకిత విగ్రహః ।
గంధర్వాణాం వచః శ్రుత్వా శివస్తానిత్యువాచ హ ॥
శ్రీకృష్ణరూవశ్రవణాత్ సాశ్రుపూర్ణవిలోచనః ।
శ్రీకృష్ణుని దివ్యమంగళ విగ్రహవర్ణనను వినుట వలన పులకించిన శరీరము గలవాడై ఆనంద బాష్పములు నిండిన కన్నులతో శివుడు వారి మాటలు వీసి ఇట్లు పలికెను.
మయైవ యూయం విజ్ఞాతా వైష్ణ ప్రవరా మహీం ॥
పూతాం కర్తుం చ భ్రమథ చరణాంభోజరేణునా ।
అహం వాంఛాం కరోమ్యేవ శ్రీకృష్ణభక్తదర్శనే ॥
సమాగమో హి సాధూనాం త్రిషు లోకేషు దుర్లభః ।
పార్వత్యాశ్చ సురాణాం చ సదా యూయం మమ ప్రియాః ॥
ఆత్మనశ్శాత్మభక్తేభ్యో వైష్ణవాశ్చ ప్రియాశ్చనః ।
వైష్ణవ శ్రేష్ఠులైన మీరు మీ పాదపద్మముల ధూళితో భూమిని పవిత్రమొనర్చుటకై తిరుగుచున్నౌరని నాకు తెలియును. శ్రీకృష్ణుని భక్తులను దర్శించవలెనని నేను కోరుచుందును. సాధువుల యొక్క సమాగమము {కలియుట) ముల్లోకములలో దుర్లభమైనది. పార్వతీ దేవికిని, దేవతలకును నాకును మీరెల్లప్పుడు ప్రియమైనవారు. నాకు నా భక్తులకంటే విష్ణుభక్తులు మిక్కిలి ప్రియులు.
కింతు మోఘం చ న భవేన్మయా యత్స్వీకృతం పురా॥
తచ్ఛ్రూయతాం మహాభాగాః పార్వతీవ్రతకర్మణి ।
సరసశ్చైవ పద్మాని యైర్హృతా ని ప్రతాంతరే ॥
తే తూర్ణమాసురీం యోనిం గమిష్యంతి న వంశయః।
న హి శ్రీకృష్ణ భక్తానామశుభం విద్యతే క్వచిత్ ॥
సంప్రాప్య మానవీం యోనిం గోలోకం యాస్యథ ధ్రువం ।
యూయం శ్రీకృష్ణరూపం చ ప్రత్యక్షం ద్రష్టుముత్సుకాః ॥
ధ్రువం ద్రక్ష్యథ భో వత్సా బృందారణ్యే చ భారతే ।
దృష్ట్వా కృష్ణం తతో మృత్యుం సంప్రాప్య వైష్ణవోత్తమాః ॥
దివ్యం స్యందనమారుహ్య గమిష్యథ హరేర్గృహం ।
అధునా వాంఛనీయం చ రూపం ద్రష్టు మహాత్సుకాః ॥
తత్సర్వం పశ్యతేత్యుక్త్వా దర్శయామాస తచ్ఛివ: ।
రూపం దృష్ట్వా సాశ్రునేత్రాః ప్రణమ్య సర్వరూపిణం॥
ఆజగ్ముర్దానవీం యోనిమితి తే దానవేశ్వరాః ।
ఐసను ఓ మహానుభావులారా ! ఒక మాట వినుడు. ఇంతకు ముందు పార్వతీదేవి ప్రతకర్మ ఆరంభించినప్పుడు ప్రతకాలములో ఈ సరస్సులోని పద్మములితరులెవరు కోసికొన్నను త్వరగా వారు రాక్షస జన్మనెత్తుదురు. ఈ మాట నిశ్చయమనీ పలికియుంటిని. నా వాక్కు వ్యర్థము కాదు. మరి శ్రీకృష్ణ భక్తులైన వారికి అశుభమన్నదెప్పుడుండదు. దానవ జన్మనెత్తి నిశ్చయముగా గోలోకమునకు వెళ్లుదురు. మీరు శ్రీకృష్ణ రూపమును ప్రత్యక్షముగా చూడవలెనను ఉత్సుకత (తీవ్రమైన కోరిక) కలిగియున్నందున భారతఖండమున బృందారణ్యములో తప్పక దర్శించగలరు. ఓ బిడ్డలారా ! శ్రీకృష్ణదర్శనము చేసికొని అతని వలననే మరణము పొంది వైష్ణవోత్తములైన మీరు (దివ్యరూపములతో) దివ్యరథమెక్కి శ్రీహరి గృహమునకు (గోలోకమునకు పోవుదురు. ఇప్పుడు కోరదగిన ఆ స్వామిని దర్శించుటకు ఉత్సుకత కలియున్నారు కదా, ఆ దివ్యమంగళ రూపమును చూడండి” అని శివుడు వారికి స్వామి రూపము చూపించెను. వారానందబాష్పములతో ఆ రూపము దర్శించి ఆ సర్వరూపునకు నమస్కరించి దానవజన్మను పొందిరి.
వసుదేవః పురా ముక్త: నుహోత్రశ్చ బకానురః॥
నుదర్శనః ప్రలంబోఽయం న్వయం కేశీ సుపార్శ్వకః ।
హరన్య వరదానేన దృష్ట్వా రూపమనుత్తమం ॥
మృత్యుం సంప్రాప్య శ్రీకృష్ణాజ్జగ్ముస్తే కృష్ణమందిరం ।
ఇత్యేవం కథితం విప్ర హరేశ్చరితమద్భుతం॥
బక కేశి ప్రలంబానాం క్షణం మోక్షకారకం ।
వసుదేవుడు యోగవిద్యవలన మొదటనే ముక్తి పొందెను. నుహోత్రుడన్నవాడు బకాసురుడు, సుదర్శనుడన్నవాడు ప్రలంబుడు, సుపార్శ్వరుడు కేశీ, వారు హరుని వరము వలన అత్యుత్తమమైన కృష్ణరూపము దర్శించి శ్రీకృష్ణుని వలన మరణము పొంది గోలోకమును పొందిరి. ఓ నారదా ! ఈ విధముగా అద్భుతమును దానవరూప బక కేశి ప్రలంబులకు విముక్తిని కల్గించినదియు శ్రోతలకు మోక్షమును కల్గించునదియునగు శ్రీహరి చరిత్రము నీకు చెప్పితీనీ, అని నారాయణ మహర్షి పల్కెను.
నారద ఉవాచ :
శ్రుతం నర్వం మహాభాగ త్వత్ప్రసాదాద్యదద్భుతం ॥
అధునా శ్రోతుమిచ్ఛామి పార్వత్యా కిం కృతం వ్రతం ।
కోవాఽఽరాధ్యో వ్రతస్యాన్య కిం ఫలం నియమశ్చ కః ॥
కానీ ద్రవ్యాణి భగవన్ వ్రతోపయోగికాని చ।
కతి కాలం వ్రతం కిం వా ప్రతిష్టాయాం నిరూపణం॥
సువిచార్య వద విభో శ్రోతుం కౌతూహలం మమ ।
నారదుడు పలికెను :
ఓ మహానుభావా ! నీయనుగ్రహము వలన అద్భుతమైన ఇతిహాసము సర్వము వింటిని. పార్వతీదేవి ఏమి వ్రతము చేసేనో? అందు ఆరాధింపబడిన దైవమెవరు ? దాని వలన వచ్చు ఫలమేమి ? ఆ వ్రతము యొక్క నియమము లెట్టివి? ఆ వ్రతమందుపయోగింప వలసిన పదార్థములేవి ? ఆ వ్రతమెంతకాలమాచరించవలయును . దాని నాచరించు విధానమెటువంటిది. ఓ ప్రభూ ! ఈ విషయములను బాగుగా విచారించి చెప్పుము. వినవలెనని నాకు ఆసక్తిగానున్నది.
శ్రీ నారాయణ ఉవాచ :
వ్రతం త్రైమాసికం నామ పతీసౌభాగ్యవర్ధనం॥
ఆరాధ్యో భగవాన్ కృష్ణో రాధికోసహితో మునే ।
విష్ణువే చ సమారంభః సమాప్తిర్ధక్షిణాయనే॥
సంయమ్య పూర్వ దివసే కృత్వాఽవశ్యం హవిష్యకం।
స్నాత్వా వైశాఖ సంక్రాంత్యాం సంకల్ప్య జాహ్నవీతటే॥
ఘటే మణౌ శాలగ్రామే జలే వా పూజయేద్ర్వతీ ।
ధ్యాయేద్భక్త్యా చ రాధేశం సంపూజ్య పంచదేవతాః॥
నారాయణ మహర్షి పలికెను :
ఓ సారదమునీ ! ఇది మూడు మాసములు చేయవలసిన వ్రతము. స్త్రీలకు పతి సౌభాగ్యమును (ముతైదువతనము తోడిదొంపత్యము} వృద్ధి పొందించునదీ, ఇందు పూజింపబడు దైవము రాధాదేవితో గూడిన శ్రీకృష్ణ భగవానుడు. ఈ వ్రతమును విషపత్కాలమునందారంభించి దక్షిణాయనములో ముగించవలెను. ప్రతారంభమునకంటే ముందు రోజు తప్పని సరిగా హవిష్యము (బియ్యము కడుగకుండు ఉప్పు పప్పుతో కలిపి గంజిపార్చకుండ వండిన అన్నము - పొంగలి (పులగము)} భుజించి (ఒక్కపూట) నీయమనిష్ఠలతో ఆ రాత్రి గడపవలెను. మరునాడు వైశాఖ మాస సంక్రాంతి రోజున (వైశాఖ సంక్రాంతియనగా వైశాఖ మాసమున వచ్చు సూర్యసంక్రమణము. ఇదీ మేష సంక్రాంతి గానీ వృషభ సంక్రాంతి గానీ కావచ్చును. విషువత్తు సంబంధము చెప్పినందున ఆది మేష సంక్రమణమే అగును. అప్పటి నుండి కర్కాటక సంక్రమణారంభము వరకు మూడు మాసములగును. కర్కాటక సంక్రమణము దక్షిణాయనారంభము గనుక ఈ వ్రత సమాప్తి దక్షీణాయనమన్నందున మేషసంక్రాంతియే ఈ వ్రతారంభకాలమని తేలుచున్నది) గంగానదీ తీరమున స్నానమాడీ ఈ వ్రతమారంభించవలెను. పూర్ణకుంభము నందు గానీ ఒక రత్నమునందు గాని సాలగ్రామ శిలయందు గాని పుణ్యతీర్థజలమందు గాని రాధావిభుని ధ్యానించి ఆవాహనము చేసి భక్తితో పూజించవలెను. అంతకన్న ముందు పంచలోకపాలక దేవతాపూజ చేసి శ్రీకృష్ణ పూజ చేయవలయును.
ధ్యానం చ సామవేదోక్తం నీబోధ కథయామి తే ।
శ్రీ కృష్ణుని ధ్యానించు విధము సామవేదమున చెప్పబడినది. దీనిని చెప్పెదను వినుము.
నవీన నీరదశ్యామం పీతకౌశేయ వాససం ॥
శరత్పార్వణ చంద్రాస్యమీషద్ధాస్యసమన్వితం ।
శరత్ప్రపుల్ల పద్మాక్షం మంజులాంఛన రంజితం॥
మాననం గోపికానాం చ మోహయంతం ముహుర్ముహః ।
రాధయా దృశ్యమానం చ రాధా వక్షః స్థల స్థితం ॥
బ్రహ్మానంత శేష ధర్మాద్యైః స్తూయమానమహం భజే ।
ధ్యాత్వా కృష్ణం చ ధ్యానేన తమావాహ్య వ్రతీ ముదా॥
“కొత్త మేఘము వలె సల్లనివాడును పసుపువన్నె పట్టు వస్త్రము ధరించిన వాడును శరదృతువులోని పున్నమి నాటి చంద్రుని వంటి ముఖము గలవాడును చిరునవ్వుతో గూడినవాడును శరత్కాలమున వికసించిన పద్మములవంటి కన్నులు గలవాడును సుందరమైన అలంకారములతో గూడిన వాడును మాటిమాటికి గోపికల మనస్సులను వ్యామోహపరచుచున్నవాడును రాధాదేవి చేత చూడబడుచు ఆమె వక్షఃస్థలమున నున్నవాడును బ్రహ్మ అనంతుడు ధర్ముడు మొదలగు దేవగణములచేత స్తుతింపబడు వాడును అగు శ్రీకృష్ణుని నేను భజించుచున్నాను” ఈ విధముగా ధ్యానము చేసి ప్రీతితో స్వామీనీ. ఆవాహన చేయవలయును.
ధ్యాయేత్రదా రాధికాం చ ధ్యానం మధ్యందినేరితం ।
రాధాం రాసేశ్వరీం రమ్యాం రాసోల్లాస రసోత్సుకాం॥
రానమండల మధ్యస్థాం రాసాధిష్ఠాతృదేవతాం।
రాసేశ్వరోరః స్థలస్థాం రసికాం రసిక ప్రియాం॥
రసిక ప్రవరాం రమ్యాం రమాం చ రమణోత్సుకాం ।
శరద్రాజీవరాజీనాం ప్రభామోచనలోచనాం ॥
వక్ర భ్రూభంగ సంయుక్తాం మంజీరేణైవ శోభితాం । శరత్పార్వణచంద్రస్యామీషద్ధాన్యమనోహరాం ॥
చారుచంపక వర్ణాభాం చందనేన విభూషితాం ।
కస్తూరీ బిందునా సార్థం సిందూర బిందునా యుతాం ॥
చారుపత్రావలీ యుక్తాం వహ్ని శుద్ధాంశుక్రోజ్జ్వలాం ।
సద్రత్న కుండలాభ్యాం చ సుకపోల స్థలోజ్జ్వలాం ॥
రత్నేంద్ర సారహారేణ వక్షః స్థలవిరాజితాం ।
రత్న కంకణ కేయూర కింకిణిరత్న రంజీతాం ॥
సద్రత్న సారరచిత క్వణన్మంజీర రంజీతాం ।
బ్రహ్మాదిభిశ్చ సేవ్యేన శ్రీకృష్ణేనైవ సేవితాం॥
సర్వేశేన స్తూయమానాం నర్వబీజాం భజామ్యహం ।
ఇతి ధ్యాత్వా చ కృష్ణేన సహితాం తాం చ పూజయేత్॥
మధ్యందిన సామశాఖ యందు చెప్పబడిన ధ్యానపద్దతితో రాధాదేవిని ధ్యానించవలెను. “రాధానామము గలదియు రాసేశ్వరియు రమ్యమూర్తియు {సుందరాకృతి గలది) రాసముండలమందలి ఆనందరసమనుభవించుట కాసక్తి కలదియు రాసమండల మధ్యమున నుండునదియు, రాసమండలమునకు అధిష్టాన దేవతయు . {ప్రధాన దేవత) రాసేశ్వరుని (శ్రీకృష్ణుడు) ప్రియురాలును రసికులలో ఉత్తమురాలును అందమైన స్వభావము గలదియు రమాదేవియు ఆనందానుభవమందాసక్తి గలదియు శరత్కాల పద్మముల సౌందర్యము నపహరించినట్లున్న కన్నులు గలదియు వంకరయైన బోమముడి గలదియు కాలి అందెలతో శోభిల్లుచున్నదీయు శరత్పూర్ణిమనాటి చంద్రుని వంటి ముఖము గలదియు చిరునవ్వుతో అందముగానున్నదియు అందమైన సంపెంగ పూలవంటి పచ్చని దేహకాంతి గలదియు ఆ పై చందనమలంకరించుకొన్నదియు, కస్తూరి చుక్కతో పాటు సిందూరపుచుక్క తిలకముగా ధరించినదియు సుందరమైన మకరికా పత్రరేఖలు (చెంపల పై సనమండలము) గలదియు, అగ్నివర్ణము గల వస్త్రములతో మెరసిపోవుచున్నదియు రత్నాల చెవికమ్మల కాంతి చెక్కిళ్లపై తళతళమని ప్రకాశించుచున్నదియు మేలి ఇంద్రనీల మణుల హారము వక్షఃస్థలమున ప్రకాశించునదియు రత్నాల మొలనూలు ధరించినదియు బ్రహ్మాదుల చేత సేవింపబడుచు శ్రీకృష్ణుని చేత ప్రశంసింపబడుచు సేవింపబడుచున్నదియు సర్వమునకు బీజము (విత్తనము) వంటిదగు దేవిని భజించుచున్నాను” ఇట్లు ధ్యానించి కృష్ణునితో గూడియున్న రాధాదేవిని పూజించవలెను.
భక్త్యా దత్వా ప్రతిదినముపచారాంశ్చ షోడశ।
ప్రత్యేకం చ పృథక్ కృత్వా సర్వం దద్యాద్ర్వతీ ముదా ॥
వ్రతము చేయు వ్యక్తి సంతోషముగా భక్తితో ప్రతిదినము షోడశోపచారపూజను చేయవలెను. పూజాద్రవ్యమును వేరువేరుగా నుంచి శ్రీకృష్ణుని రాధాదేవిని విడివిడిగా పూజించవలెను.
సహస్రకమలం దివ్యం శతమష్టోత్తరం మునే ।
హోమం కుర్యాద్ర్వతీ నిత్యమష్టోత్తర శతాహుతీః ॥
ఓ నారదా! వేయిరేకులు గల దీవ్యకమలములను నూట యెనిమిది గ్రహించి అర్చించి ప్రతిదినము నూట యెనిమీది ఆహాతులను అగ్నిలో హోమము చేయవలెను.
దద్యాద్భక్త్యా చ కృష్ణాయ స్వాహేత్యుచ్చార్య యత్నతః।
భక్తి శ్రద్ధలతో “కృష్ణాయ స్వాహా” అని పల్కుచు హోమము చేయవలెను.
రసాలస్య కదల్యాశ్చ హ్యామం వా పక్వమేవ చ ।
నిత్యమష్టోత్తరశతం దద్యాద్భక్త్యాఽక్షతైః ఫలం ॥
ప్రతిదినము నూటయెనిమిది అరటి పండ్లు నూటయెనిమిది మామిడిపండ్లు చొప్పున అక్షతలతో బాటు అర్చించి నివేదన చేయవలెను. పక్వాన్నమును నివేదించవలెను.
నిత్యం చ భోజయేద్భక్త్యా బ్రాహ్మణానాం శతం మునే॥
హోమం కుర్యాద్ర్వతీ నిత్యమష్టోత్తర శతాహతీః ।
దద్యాద్భక్త్యా చ కృష్ణాయ రాధికా సహితాయ చ ॥
తిలేన హవనం కుర్యాదాజ్యమిశ్రేణ నారద ।
ఓ నారదమునీ ! ప్రతిదినము వందమంది సబ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. నెయ్యి కలిపిన నువ్వులతో రాధాసహితుడైన శ్రీకృష్ణునకు భక్తి పూర్వక సమర్పణగా అగ్నిలో ప్రతిదినము 108 ఆహుతులు హోమము చేయవలెను.
వాద్యం చ వాదయేన్నిత్యం కారయేద్ధరికీర్తనం II
నిత్యము మంగళవాద్యములను మ్రోగించవలెను. హరినామ సంకీర్తనము చేయించవలెను.
ఏవం మాసత్రయం కృత్వా ప్రతిష్టాo తదనంతరం।
ప్రతిష్టాదివ సే తత్ర విధానం శ్రుణు నారద॥
ఇట్లు మూడు మాసములు వ్రతము చేసి తరువాత “ప్రతిష్టి చేయవలెను. ఆ రోజున చేయవలసిన విధానము చెప్పెదను మినుము.
కమలానాం చ నవతి సహస్రాణ్యక్షతాని చ।
బ్రాహ్మణానాం సహస్రాణి నవ విప్రేంద్ర యత్నతః॥
భోజయేత్పరమాన్నాని స్వాదూని మిష్టకాని చ ।
ఫలం వింశాధికం సప్తశతం నవసహస్రకం ॥
దద్యాన్నానావీధం ద్రవ్యం నైవేద్యం సుమనోహరం।
సంస్కృతాగ్నిం చ సంస్థాప్య హోమం కుర్యాద్విచక్షణః ॥
నవతీం చ సహస్రాణి హుత్వాఽజ్యేన తిలేన చ ।
సవస్త్రం చ సభోజ్యం చ యజ్ఞసూత్ర ఫలాన్వితం ॥
గంధపుష్పార్చితాన్ భక్త్యా దద్యాన్నవతి లడ్డుకాన్ ।
దద్యాన్నవతి కుంభాంశ్చ శీత తోయ ప్రపూరితాన్ ॥
ఏవం విధం వ్రతం కృత్వా దద్యాద్విప్రాయ దక్షిణాం ।
దక్షిణాయాః పరిమితం వేదేషు యన్నిరూపితం ॥
వృషేంద్రాణాం సహస్రం చ స్వర్ణశృంగ సమన్వితం ।
రేకులు విరగని తొంబది వేల కనులములతో ఆనాటీ అర్చన జరుపవలెను. తొమ్మిదివేల బ్రాహ్మణులకు రువీకరమైన పక్వాన్నములు పిండివంటలతో భోజనము పెట్టవలెను. నానావిధములైన నైవేద్యములు రుచిగా కంటికి ఇంపుగా సిద్ధము చేసి తొమ్మిది వేల ఏడువందల ఇరువై ఫలములతో బాటు స్వామికి నివేదన చేయవలెను. అగ్ని ప్రతిష్టచేసి నువ్వులతో నెయ్యితో తొంభై వేల ఆహుతులు హోమము చేయవలెను. వస్త్రములు భోజన పదార్థములు యజ్ఞోపవీతములు ఫలములను లడ్డూలు చల్లని నీరు నింపిన కుంభములు తొంబది (90} సమకూర్చి గంధపుష్పములతో అర్చించబడిన బ్రాహ్మణులు తొంబది మందికి దానమీయవలెను. ఈ వ్రతసమాప్తి చేసి ఈ కార్యమును నిర్వహించిన పురోహితుడు} బ్రాహ్మణునకు శాస్త్రములందు చెప్పిన ప్రకారము బంగారపు కొమ్ములు పొదిగిన కోడెలను (ఎదు) దానమీయవలెను. (ఇది ప్రత సమాప్తి (ఉద్యాపన) కార్యక్రమము. ఈ గ్రంథమున ప్రతిష్టాకార్యమని చెప్పబడినది).
ఇత్యేవం కథితం వివ్రకృతం త్రైమాసికం వ్రతం ॥
విశిష్టనంతతి కరం పతి సౌభాగ్య వర్ధసం ।
వ్రతస్యాస్య ప్రభావేణ సౌభాగ్యం శతజన్మని ॥
నత్ప్రుత జననీ సా చ భవే జన్మశతం ధ్రువం ।
కదాఽపి న భవేత్తస్యా భేదశ్చ పతీపుత్రయో:॥
దాసతుల్యో భవేత్పుత్రో భర్తా చ స్వవచస్కరః ।
అనుక్షణం భవేద్రాధాకృష్ణ భక్తియుతా సతీ ॥
భవేద్ర్వత్ర ప్రభావేణా ప్రాప్తజ్ఞాన హరిస్మృతిః ।
వ్రతం చ సామవేదోక్తం కృతపూర్వమథావయోః॥
ఈ విధముగా సామవేదమున చెప్పబడి పూర్వులాచరించిన త్రైమాసిక వ్రతము దాని విధానము నీకు చెప్పితిని. ఈ వ్రతము ప్రభావము వలన స్త్రీకి ఉత్తమ సంతానము పతి సౌభాగ్యవృద్ధి (ముత్తైదువతనము పెరుగుట)నూరు జన్మలలోను కలుగును, నూరు జన్మలలో సత్పుత్రులను కని భర్తతో కుమారులలో ఎన్నటికినీ భేద భావము కలుగకుండా జీవించును. కుమారులు దాసులవలె నుందురు. భర్త ఆమె మాట నెరవేర్చును. ఆ సాధ్వి ప్రతిక్షణము రాధాకృష్ణుల భక్తిగలదై ప్రత ప్రభావము వలన జ్ఞానమును హరి స్మృతిరూపమైన భక్తిని పొందును.
సర్వేషాం చ వ్రతానాం చ శ్రేష్ఠం శ్రణు వదామి తే ।
స్వాయంభువస్య చ మనోః శతరూపాభిధా సతీ॥
తయా కృతం ప్రథమతః కృత్వాఽగస్త్యం పురోహితం
తదా కృతం దేవహూత్యా చాకూత్యా చ కృతం తదా ॥
పురోహితం పులస్త్యం చ కృత్వా శ్రుత్యుక్తయా మునే ।
చకార రోహిణీ తత్తు క్రతుం కృత్వా పురోహితం ॥
రతిశ్చకార తద్భక్త్యా గౌతమస్తత్పురోహితః ।
అకారి తద్ర్వతం భక్త్యా తారయా గురుకాంతయా॥
మహానంభృత సంభాగా వసిష్ఠస్తత్పురోపోతః ।
తర్దృష్ట్వా గురుపత్యాశ శక్రశచ్యాకృతం వ్రతం ॥
మహానంభృత సంభారస్తత్పురోధా బృహస్పతిః ।
వ్రతం చకార స్వాహా చ సర్వతోఽపి విలక్షణం ॥
అతి సంభృత సంభారో మరీచిస్తత్పురోహితః ।
అన్నింటిలో ఈ వ్రతము శ్రేష్ఠమన్నదానికి క్రింది వార్తలను చెప్పెదను వినుము. మొట్టమొదట ఈ వ్రతమును స్వాయంభువ మనువు భార్యయైన శతరూపాదేవి అగస్త్యుని పురోహితుని జేసికొని ఆచరించెను. పులస్త్యుని పురోహితునిగా జేసికొని దేవహూతి ఆకూతి యన్న (కర్దమ ప్రజాపతి భార్యలు) వారు వేదోక్తముగా ఈ వ్రతము చేసిరి. క్రతువును పురోహితుని జేసికొని రోహిణియు (చంద్రునీ ' భార్య) గౌతముని పురోహితుని జేసికొని రతీదేవియు అనేకముగా పదార్థములు కూర్చుకొని భక్తితో బృహస్పతి భార్యయగు తారాదేవి వసిష్టుని పురోహితుని చేసికొనీయు ఈ వ్రతమాచరించిరి. గురువు భార్య చేసిన వ్రతమును చూచి ఇంద్రుని భార్య శచీదేవి బృహస్పతిని పురోహితుని జేసికొని ఎక్కువ పదార్థములతో దీనిని చేసెను. అగ్నిభార్యయగు స్వాహాదేవి అందరికంటే మిన్నగా వస్తువులు సమకూర్చుకొని మరీచిని పురోహితునిగా జేసికొని ఈ వ్రతమాచరించెను.
తద్ధృష్ట్వా పార్వతీ బ్రహ్మన్నువాచ శంకరం ముదా।
పుటాంజలి యుతా దేవీ భక్తినమ్రాత్మ కంధరా ॥
ఓ సారదా ! స్వాహాదేవి చేసిన వ్రతమును చూచి పార్వతీదేవి భక్తితో భర్తముందు తలవంచి చేతులు జోడించీ శంకరునితో నిట్లు వేడుకతో పలికెను.
పార్వత్యువాచ :
ఆజ్ఞాం కురు జగన్నాథ కరోమి వ్రతముత్తమం ॥
ఆవయో రిష్ఠదేవస్య వ్రతానాం చ పరం వ్రతం ।
హరేరారాధనం నాథ సర్వమంగళకారణం ॥
ఇష్టం దత్తం శ్రుతేః పాఠం తీర్థం పృథ్వ్యాః ప్రదక్షిణం।
హరేరారాధనస్యాపి కలాం సార్హతీ షోడశీం॥
పార్వతి ఇట్లనెను :
ఓ జగత్రభూ ! వ్రతములలో శ్రేష్టమైనదియగు మన ఇష్ట దైవము యొక్క త్రైమాసిక వ్రతమును చేయుటకు నౌకాజ్ఞ ఇమ్ము, శ్రీహరి ఆరాధన (పూజ) సర్వమంగళములకు మూలము కదా. యజ్ఞయాగాది కర్మలు బావులు చెరువులు తోటలు గుడులు నిర్మించుట అన్నదానము అనెడి దానకర్మలు వేదపఠనము తీర్థయాత్రలు చేయుట భూప్రదక్షిణము అన్నవి శ్రీహరి ఆరాధనో మహిమ యొక్క పదహారవ భాగముతోను సరిపోవు.
బహిరభ్యంతరే యస్య హరిన్మృతిరనుక్షణం ।
జీవన్ముక్తస్య తస్యైవ ముక్తిర్భవతి దర్శనాత్ ॥
తస్య పాదాబ్జ రజసా సద్యః పూతా వసుంధరా ।
తస్య దర్శనమాత్రేణ పునాతి భువనత్రయం ॥
ఏ వ్యక్తికి బయట లోపల ప్రతిక్షణము హరిస్మృతి (స్మరణము) కలదో వాడు పంచభౌతిక శరీరముతో నుండికూడ జీవన్ముక్తుడు. అతనిని దర్శించుట వలననే ఇతరులకును ముక్తి లభించును. అతని పాదధూళీ చేత భూమి వెంటనే పవిత్రమగును. అతనిని దర్శించినందు వలన ముల్లోకములు పావనమగును.
బ్రహ్మా విష్ణుశ్చ ధర్మశ్చ శేషస్త్వం చ గణేశ్వరః ।
ధ్యాయంధ్యాయం యత్పదాబ్జo తేజసా తత్సమో మహాన్ ॥
యశ్చ యం సంతతం ధ్యాయేత్స తమాప్నోతి నిశ్చితం ।
గుణేన తేజసా బుధ్యా జ్ఞానేన తత్సమో భవేత్॥
బ్రహ్మయు విష్ణువును ధర్ముడును శేషుడును నీవును గణపతియు ఎవని పాదాబ్దములు స్మరించి తేజస్సులో గొప్పవారు అతనికి సములు ఇతిరో అట్టి కృష్ణుని ఎడతెగక ధ్యానించువాడు అతనినే పొందునన్నది నిశ్చయమైన విషయము. గుణములో తేజస్సులో బుద్దిలో జ్ఞానములో ఆ స్వామికి సమానుడగును.
కృష్ణస్య స్మరణాద్ధ్యానాత్తపసా తస్య సేవయా ।
మయా ప్రాప్తో హి భగవాన్ స్వామీ వా పుత్ర ఏవ చ ॥
ప్రలబ్ధం లీలయా సర్వం పూర్ణం మన్మానసం తదా ।
స్వామీ మే త్వాదృశః పుత్రౌ కార్తికేయ గజేశ్వరౌ ॥
పితా హిమాద్రి: కృష్ణాంశో మమ కిం దుర్లభం ప్రభో ।
ఓ ప్రభూ ! శ్రీకృష్ణుని యొక్క స్మరణ వలన ధ్యానము వలన తపస్సు వలన అతని సేవ వలన నేను భగవంతుడైన భర్తను పొందితిని. పుత్రుని గంటిని. లీలగా నాకు సర్వము లభించినది. నామనసు పరిపూర్ణముగా నున్నది. నీవంటి భర్త కొడుకులు ఐన కుమారస్వామి గణపతులు కృష్ణాంశ గల హిమవంతుడు తండ్రి. ఇక నాకేమి దుర్లభము.
పార్వతీ వచనం శ్రుత్వా నుప్రీతః శంకరః స్వయం ।
ప్రహస్యోవాచ మధురం పులకాంకిత విగ్రహః ॥
పార్వతి మాటలు విని శంకరుడు మిక్కిలి ప్రీతిపొంది ఆనంద పులకాంకురములేర్పడగా నవ్వి మధురముగా ఇట్లు పలికెను.
మహాదేవ ఉవాచ :
మహాలక్ష్మీ స్వరూపాసి కిమసాధ్యం తవేశ్వరి ॥
సర్వ సంపత్సరూపా త్వమనంత శక్తిరూపిణీ ।
త్వం చ యస్య గృహే దేవి స చైశ్వర్యస్య భాజనం ॥
న లక్ష్మీర్యద్గృహే తస్య జీవనాన్మరణం వరం ।
అహం బ్రహ్మా చ విష్ణుశ్చ త్వయి భక్త్యా శుభప్రదే ॥
సంహారే సృష్టికాలే చ త్వత్ప్రlసాదాద్వయం క్షమా: ।
కో వా హిమాలయ: కోఽహం కౌ కార్తిక గజేశ్వరౌ ॥
త్వద్విహీనా అశక్తాశ్చ త్వయా చ వయమీశ్వరాః।
యుక్తా: ప్రతిప్రతా యాశ్చ పురాజ్ఞః శ్రుతౌ శ్రుతాః ॥
గృహీత్వాఽజ్ఞామీశ్వరస్య వ్రతం కురు పతివ్రతే।
వ్రతమేతత్కృతం యాభిస్తాభ్యః కురు విలక్షణం॥
సనత్కుమారో భగవాన్ వ్రతే తేఽస్తు పురోహితః ।
కమలానాం బ్రాహ్మణానాం ద్రవ్యానాం దాయకోఽప్యహం॥
కుబేరం ద్రవ్య కోశే చ రక్షకం కురు సుందరి ।
వ్రతే చ దానాధ్యక్షోఽహం ధనదాత్రీ చ శ్రీ: స్వయం ॥
పాఠకో వహ్నిదేవశ్చ వరుణో జలదాయకః।
వస్తూనాం వాహకా యక్షాస్తదధ్యక్షః షడాననః ॥
స్థానసంస్కారకర్తా చ వ్రతేఽత్ర పవనః స్వయం।
పరివేష్టా స్వయం శక్రః చంద్రోఽధిష్టాపకో స్వయం ॥
సూర్యశ్చ దాన నిర్వక్తా యోగ్యా యోగ్యం యధోచితం।
వ్రతోపయుక్తం యద్ద్రవ్యం దత్త్వా నియమితం ప్రియే ॥
తతోఽధికం ఫలం పుష్పం హరయే దేహి సుందరి ।
వ్రతే నియమితాన్ విప్రాన్ భోజయిత్వా తతోధికం ॥
అసంఖ్యాస్ బ్రాహ్మణాన్ దేవి భక్త్వా కురు నిమంత్రణం ।
నమాప్తిదివ సే స్వర్ణం రత్నం ముక్తాన్ ప్రవాలకం ॥
వ్రతోక్తాం దక్షిణాం దత్త్వా సర్వం దేహి ద్విజాతయే ।
ఇత్యుక్త్యా శంకరస్తాం చ కారయామాస తద్ర్వతం ॥
మహాదేవుడిట్లనెను :
ఈశ్వరీ ! నీవు మహాలక్ష్మీ స్వరూపిణివి. నీకసాధ్యమేదియుండును ? నీవు అన్ని విధముల సంపదల స్వరూపము గలదానవు. అనంత శక్తిరూపిణివి నీవు. నీవెవని యింట నుందువో అతడు సంపదలనుభవించును. ఎవని యింట లక్ష్మి ఉండదో వాడు జీవించుట కంటె మరణించుట మేలు. ఓ శుభము లిచ్చుదానా ! నేను బ్రహ్మ విష్ణువు నీయందు భక్తితో నీ అనుగ్రహము వలన సృష్టి సంహార కార్యములు చేయ సమర్శలమగుచున్నాము. హిమవంతుడెవరు ? నేనెవరు ? కుమారస్వామి గణపతి ఎవరు ? నీవు లేకుండ మేమశక్తులము. నీవలన మేము ప్రభువులము. ఈ వ్రతాచరణ మొనర్చిన లేక పూర్వమీ వ్రత విధాన మెరిగిన వేదములందు చెప్పబడిన పతివ్రతలెవరెవరో వారందరి ఆజ్ఞ తీసుకొని నీవు ఆ పరమేశ్వరుని ప్రతము (శ్రీకృష్ణుని) చేయుము. నీకు సనత్కుమార భగవానుడు పురోహితుడగు గాక. కమలములను బ్రాహ్మణులను కావలసిన పదార్థములను నేనిత్తును. ఓ సుందరీ ! నీ ధనాగారమునకు రక్షకునిగా కుబేరుని నియమించుము. ఈ వ్రతమున దానమునకధ్యక్షుడను గా నేనుందును. లక్ష్మీదేవి స్వయముగా ధనమిచ్చును. వంటలవాడు అగ్నిదేవుడు. వరుణుడు నీరు సమకూర్చును. వస్తువులను యక్షులు మోసితెత్తురు. వారిపై పెత్తనదారుగా కుమారస్వామి ఉండును. ఈ ప్రతకాలములో స్వయముగా వాయుదేవుడు స్థలమును శుభ్రపరచును. స్థలమును చుట్టుముట్టి రక్షించు క్షేత్రపాలకుడుగా ఇంద్రుడుండును. చంద్రుడందరీని అన్ని వస్తువులను తగినచోట నుంచును. శాస్త్రానుగుణముగా దాసమున యోగ్యత అయోగ్యతలను చెప్పుకోడుగా సూర్యుడుండును, ఈ విధముగా వ్రతమునకు ఉపయోగించు ద్రవ్యమంతయు ఇచ్చి నియమించితిని. ప్రియురాలా ! శాస్త్రమున చెప్పిన దాని కన్న అధికముగా ఫలములు పుష్పములు శ్రీహరికి సమర్పించుము. సుందరీ ! అట్లే అధిక సంఖ్యలో బ్రాహ్మణులను నియమించి సంతర్పణ చేయుము. భక్తితో అసంఖ్యాకముగా (ఇంతయని లెక్క పెట్టరాకుండ) బ్రాహ్మణులను భోజనముల కాహ్వానించుము. వ్రత సమాప్తినాడు బంగారము రత్నములు ముత్యాలు పగడములు వ్రతములో చెప్పిన దక్షిణను - సర్వము బ్రాహ్మణులకు సమర్పించుము. ఇట్లు చెప్పి శంకరుడాపార్వతితో త్రైమాసిక రాధాకృష్ణ వ్రతమును చేయించెను.
ప్రతం చకార సా దుర్గా సర్వాభ్యశ్చ విలక్షణం ।
ఇత్యేవం కథితం విప్ర పార్వత్యా యద్ర్వతం కృతం ॥
రత్నం వోడుమశక్తాశ్చ బ్రాహ్మణా పార్వతీ వ్రతే ।
ఇతిహాస: శ్రుతః సర్వః ప్రకృతం శ్రుణు నారద ॥
ఆ పార్వతి దేవి అందరికంటే విలక్షణముగా వ్రతము చేసెను. ఆమె వ్రతములో ఇచ్చిన రత్నములను బ్రాహ్మణులు మోసికొని పోలేక పోయిరి. ఇట్లు పార్వతీవ్రతమును మొత్తము ఇతిహాసమును చెప్పగా వింటివి. ప్రకృత కథను వినుము.
శ్రీకృష్ణ బాలచరితం నూత్నం నూత్నం పదే పదే।
హత్వా తాన్ దానవేంద్రాంశ్చ శిశుభిః సహ గోకులే ॥
జగామ స్వగృహం కృష్ణ కుబేర భవనోపమం ।
సర్వేభ్యో వనవార్తా చ ప్రోక్తా చ శిశుభిర్ముదా ॥
శ్రుత్వైవం విస్మితాః సర్వే నందో భయమవాప హ ।
ఆనీయ వృద్ధాన్ గోపాంశ్చ గోపికాః స్థవిరాస్తథా ॥
యుక్తిం చకార తైస్సార్థమాలోచ్య సమయోచితాం ।
శ్రీకృష్ణుని బాల్య చరిత్ర అడుగడుగున క్రొత్త క్రొత్తగా నుండును. శ్రీకృష్ణుడా రాక్షసులను సంహరించి గోపాల బాలురతో కలిసి గోకులములో కుబేరుని భవనమును పోలియున్న తన గృహమునకు పోయెను. ఆపద తొలగిన సంతోషముతో పెద్దలందరికి అడవిలో జరిగిన సంఘటనలను శిశువులు చెప్పిరి. అది విని అందరాశ్చర్య పడిరి. నందుడు మాత్రము భయపడెను. వృద్ధులైన గోపాలురను ముసలివారైన గోపికలను పిలిచి నందుడు వారిలో నాలోచించి సమయమునకు తగిన ఒక యుక్తిని చేసెను.
కృత్వా యుక్తిం చ గోపేశః తత్స్థానం త్యక్తుముద్యతః ॥
గంతుం బృందావనం సర్వానువాచ తత్క్షణం మునే ।
నందాజ్ఞాం చ సహకర్ణ్య తే సర్వే గంతుముద్యతాః ॥
గోపాశ్చ గోపికాశ్చైవ బాలకా బాలికాస్తథా ।
కృష్ణేన హలినా సార్థం ప్రయయుర్భాలకా ముదా॥
గోపాలరాజగు నందుడట్లు యుక్తీనాలోచించి ఆ గోకులస్థానము విడువబూని ఆ క్షణముననే బృందావనమునకు పోవుటకు అందరికి చెప్పెను. అతని ఆజ్ఞను విని వారందరు పోవుటకు సిద్ధమైరి. గోపాలకులు గోపికలు బాలురు బాలికలు అందరు సిద్ధపడిరి. బాలకులు కృష్ణ బలరాములతో బాటు సంతోషముగా ప్రయాణము చేసిరి.
సంగీతం చ ప్రగాయంతో నానావేష సమన్వితా: ।
వేణు ప్రవాద: కేచిత్ కేచిత్ శృంగ ప్రవాదకాః ॥
కరతాల కరాః కేచిద్వీణాహస్తాశ్చ కేచన।
శరయంత్ర కరాః కేచిచ్ఛృంగ హస్తాశ్చ రేచన॥
నవపల్లవ కర్ణాశ్చ కేచిద్ గోపాలబాలకాః ।
కేచిన్ముకుల కర్ణాశ్చ పుష్ప కర్ణాశ్చ కేచన ॥
నవ పూల్యకరాః కేచిత్కేచిదాజసుమాలినః ।
కేచిత్పల్లవ చూడాశ్చ పుష్ప చూడాశ్చ కేచన ॥
గోపాల బాలకా: సర్వే విప్రేంద్ర నవకోటయ: ।
జగ్ముర్గోప్యో వయస్యాశ్చ కోటిశః కోటిశో ముదా॥
తీరు తీరు వేషములు ధరించి సంగీతము పాడుచు వెళ్లుచున్నవారిలో పిల్లన గ్రోవులూదు వారు కొందరు, కొమ్ములూదుపోరు కొందరు, చేతులలో చీరుతాళములు (వాద్యములు కలవారు కొందరు, వీణలు పట్టుకొన్నవారు కొందరు, శరయంత్రములు పట్టుకొని కొందరు, కొమ్ముబూరలు పట్టుకొని కొందరు పోవుచుండిరి. కొందరు గోపాల బాలకులు కొత్త చిగుళ్లను మరికొందరు మొగ్గలను ఇంక కొందరు విచ్చిన పుష్పములను చెవి సందులలో చిక్కుకొనిరి. కొందరు కొత్త పూలదండలు చేతబట్టుకొని కొందరు మోకాళ్ల వరకు వ్రేలాడు పూలమాలలు ధరించి, కొందరు కొండెకొప్పులపై చిగుళ్లు ధరించి, కొందరు పుష్పములు ధరించి యుండిరి. గోపాల బాలురందరు తొమ్మిది కోట్లు ఉండిరి. యువతులైన గోపికలు కోట్లకొలది (గుంపులు గుంపులుగా) వేడుకతో పోవుచుండిరి.
వృద్ధాశ్చ కోటిశస్తత్ర బృపచ్చ్రోణ్యశ్చలత్కుచా: ।
రాధికా సహచారిణ్యో బాలా గోపాలికా మునే ॥
తాస్సుశీలాదయో భవ్యా: నానాలంకార భూషితాః ।
దివ్యవస్త్ర పరీధానాః సస్మితాస్తా యయుర్ముదా ॥
పెద్ద నితంబములు కలశముల వంటి కుచములు గల వృధ స్త్రీలు కోట్ల కొలది వెడలిరి. నారదమునీ ! రాధాదేవి సఖురాండ్రు గోపాల బాలికలు సుశీల మొదలగు నుత్తమ స్త్రీలు దీవ్యవస్త్రములు ధరించి నానావిధములైన ఆభరణములు అలంకరించుకొని చిరునవ్వుతో వేడుకతో ప్రయాణము చేసిరి.
కాశ్చిదారూహ్య శిబికాం రథమారుహ్య కాశ్చన ।
రాధాస్యందనమారుహ్య శాతకౌంభ పరిచ్ఛదం ॥
తాభిర్యుక్తా యయౌ దేవీ రత్నాలంకార భూషితా ।
వారిలో కొందరు పల్లకీలెక్కి మరికొందరు రథములెక్కి పోయిరి, రాధాదేవి బంగారు కలశములతో అలంకరించిన రథము నెక్కి రత్నాభరణములలంకరించుకొని ఆ సఖురాండ్రతో పాటు పోయెను.
యశోదా రోహిణీ చైవ ర్నలంకార భూషితా ॥
యయౌ స్యందనమారుహ్య శాతకుంభపరిచ్ఛదం ।
యశోదాదేవియు రోహిణీదేవీయు రత్నాలంకారములలంకరించుకొని బంగారముతో అలంకరింపబడిన రథమెక్కి పోయిరి.
నందః సునందః శ్రీదామాగిరిభానుర్విభాకరః॥
వీరభానుశ్చంద్రభానుర్గజస్థాః ప్రయయుర్ముదా ।
శ్రీకృష్ణ బలదేవౌ తౌ రత్నాలంకార భూషితౌ ॥
స్వర్ణ స్యందనమాస్థాయ జగ్మతు: పరయా ముదా ।
నందుడు సునందుడు శ్రీరాముడు గీరిభానుడు వీభాకరుడు వీరభానుడు చంద్రభానుడు సంతోషముతో గజములనెక్కి వెళ్లిరి. శ్రీకృష్ణ బలదేవులిద్దరు రత్నాభరణ భూషితులై బంగారు రథమెక్కి గొప్ప సంతోషముతో వెళ్లిరి.
కోటిశ: కోటీశో గోపా వృద్ధాశ్చ యావనాన్వితాః ॥
అశ్వస్థాశ్చ గజస్థాశ్చ రథస్థాశ్చైవ కేచన ।
గోపా యయుర్ముదాయుక్తా శ్చోద్దతా నందకింకరాః ॥
కోటానుకోట్లు గోపాలురు వృద్ధులు యువకులు గర్వితులైన నందుని సేవకులు సంతోషముతో గుఱ్ఱము లెక్కి ఏనుగు లెక్కి పోయిరీ.
వృషస్థా గర్ధభస్థాశ్చ సంగీత తాన తత్పరాః ।
అపరా రాధికాదాస్య స్త్రీసప్త శతకోటయః॥
ముదాన్వితా సస్మితాశ్చ స్వర్ణాలంకార భూషితాః ।
కాశ్చిత్పిందూకహస్తాశ్చ కాశ్చిత్కజ్జల వాహికాః ॥
కాశ్చిత్కందుకహస్తాశ్చ కాశ్చిత్పుత్తలీకా కరా: ।
భోగద్రవ్యకరాః కాశ్చిత్రీడాద్రవ్యకరావరాః ॥
వేషద్రవ్యకరా: కాశ్చిత్కాశ్చిన్మాలాకరా వరాః ।
కాశ్చిద్వాద్యక హస్తాశ్చ ప్రయయుర్గోపికా ముదా॥
వహ్ని శుద్ధాంశుకానాం చ వాహికాశ్చైవ కాశ్చన ।
చందనాగురు కస్తూరీ కుంకుమ ద్రవ వాహికాః ॥
ఎద్దులెక్కి గాడిదలనెక్కి సంగీతరాగాలాపనలు చేయుచు గోపాలకులు పోయిరి. రాధాదేవి దాసీగణము నూట డెబ్బదిమూడు కోట్లు సంతోషముతో చిరునవ్వుతో బంగారు నగలు ధరించి పోవుచుండిరి. వారిలో కొందరు సిందూర ద్రవ్యమును కొందరు కాటుకను కొందరు క్రీడాకందుకములను (బంతులను కొందరు ఆటబొమ్మలను కొందరు భోగద్రవ్యములను మరికొందరు క్రీడా వస్తువులను కొందరు వేషధారణకనుకూలమైన ద్రవ్యములను కొందరు పుష్పహారములను కొందరు వాద్యములను కొందరు అగ్ని వర్ణము గల మేలి వస్త్రములను కొందరు కుంకుమ పువ్వు అగురు కస్తూరి చందనము వంటి ద్రవ్యములను చేతులలో పట్టుకొని ముదముతో గోపికలందరు పోవుచుండిరి.
కాశ్చిత్సంగీత నిరతాః కాశ్చిచ్చిత్రకథారతాః ।
కోటీశః కోటిశో రమ్యా: ప్రయయుః శిబికాన్వితాః ॥
కొందరు సంగీతమునందాసక్తులై మరికొందరు చిత్రకథల యందాసకులై పాడుచు చెప్పుకొనుచు కోటానుకోట్ల సుందరీమణులు . పల్లకీలలో వెళ్లిరి.
కోటిశః కోటీశ శ్చాశ్వః కోటిశః కోటి రధాః ।
కోటిశః కోటిశశ్చైవ శకటా ద్రవ్యపూరితాః ॥
కోటిశః కోటిశశ్చైవ వృషేంద్రా ద్రవ్యవాహకాః।
కోటిశః కోటిశశ్చైవ దశలక్షాణి హస్తినాం॥
హస్తిపాంశుక యుక్తాని యయుర్భృందావనం వనం।
గుంపులు గుంపులు గుట్టములు గుంపులు గుంపులుగా రథములు గుంపులు గుంపులుగా ద్రవ్యములు {పదార్ధములు} నింపిన బండ్లు గుంపులు గుంపులుగా మావటీ వాళ్లతో అంబారీలతో కూడిన పదిలక్షల ఏనుగులతో బృందావనమునకు పోయిరి.
నర్వే బృందావనం గత్వా దృష్ట్వా శూన్య గృహం మునే ॥
వృక్షమూలే యథాస్థానం తస్థుః సర్వే యధోచితం ।
ఉవాచ గోపాన్ శ్రీకృష్ణో గృహాంశ్చేష్టతమాన్ వ్రజాః ॥
ఆద్య నంతిష్ఠతేత్యేవం శ్రుత్వా శ్రీకృష్ణ భాషితం ।
కుత్ర సంతి గృహాః కృష్ణేత్యేవ మూచుస్తు గోవకాః ॥
ఇతి తేషాం వచః శ్రుత్వా శ్రీకృష్ణో వాక్యమబ్రవీత్ ।
ఓ మునీ ! ఇట్లందరు గృహశూన్యమైన బృందావనమునకు పోయి అందరు తమకు తగిన విధముగా ఆయా స్థానములలో చెట్ల క్రింద కూర్చుండిరి. అప్పుడు గోపాలకులతో శ్రీకృష్ణుడు “నేడు మీరు మిక్కిలి సుందర గృహములలో నివసింతురు” అనగా ఆ గృహము లెక్కడ నున్నవి ? అని గోపాలకులడుగగా శ్రీకృష్ణుడిట్లు పలికెను.
శ్రీకృష్ణ ఉవాచ :
ఆత్ర స్థానే గృహా: సంతీ ప్రసన్నా దేవ నిర్మితాః॥
దేవప్రీతిం వినా శక్తి న హి ద్రష్టుం చ కేదన ।
అద్య తిష్ఠత గోపాలా సంపూజ్య వనదేవతాః ॥
ప్రాతర్యూయం గృహాన్ రమ్యాన్ ద్రక్ష్యథాద్య ధ్రువం ముదా।
ధూపదీపాది నైవేద్యైర్బలిభిః పుష్పచందనైః॥
దేవీం చ వటమూలస్థాం పూజాం కురుత చండికాం ।
కృష్ణస్య వచనం శ్రుత్వా గోపాః సంపూజ్య దేవతాః ॥
భుక్త్యా భోగాన్ దినే రాత్రౌ తత్రైవ సుషుపుర్ముదా ॥
శ్రీకృష్ణుడు పలికెను :
ఈ ప్రదేశమున దేవనిర్మితములై సుందరములైన గృహములున్నవి. కాని దేవతలకు ప్రీతి చేయకుండ ఎవ్వరును వాటిని చూడజాలరు. ఓ గోపాలులారా ! ఈనాడు వనదేవతలను చక్కగా పూజించి నిలువుడు. రేపు ఉదయమున రమ్యములైన గృహములను చూచి సంతసింపగలరు. ఈ వటవృక్షము మొదట నున్న చండికాదేవినీ గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము బలితో పూజింపుడు." అన్న కృష్ణ వాక్యములను ఏనీ గోపాలురు ఆ దేవతను పూజించి భోజన తాంబూలాది భోగములాపగలు అనుభవించి ఆ రాత్రి అక్కడనే నిద్రించిరి.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే నారాయణ నారదసంవాదే ఒక ప్రలంబకేశివధ పూర్వక బృందావన గమనం నామ షోడశోఽధ్యాయః.
ఇది బ్రహ్మవైవర్తపురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన బక ప్రలంబకేశి వధలును బృందావన గమనము ఆసు పదునారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 16 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Seeking to destroy the child, Kaṃsa sent the powerful demon Tṛṇāvarta, who assumed the form of a terrifying, blinding whirlwind that swept across Gokula, enveloping the entire settlement in dust and darkness. Tṛṇāvarta snatched baby Kṛshṇa into the sky, intending to dash Him to death upon the mountain rocks. However, Kṛshṇa increased His weight millions of times over, becoming as heavy as the entire cosmos, which choked the demon and forced him to plummet downward. The demon crashed heavily upon the stone ground of Gokula and perished instantly, while little Kṛshṇa sat safely upon his chest, laughing and playing innocently.