శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు రాధతో ఇట్లనెను :
తదా దేవాః సమాలోచ్య జగ్ము స్తే బ్రహ్మాజోతీకం ।
సర్వే నివేదనం చక్రుర్బహ్మాణం జగతాం పతిం॥
దేవా ఊచుః - దేవతలు పలికిరి :
తవ సృష్టి జగత్ర్సష్ణా రత్నాధారో హిమాలయః ।
న చేత్ర్పాప్స్యతి మోక్షం చ రత్నగ ర్భా కుతో మహీ ॥
సు తాం శూలభృతే దత్త్వా భక్త్యా శూలేశ్వరః స్వయం।
నారాయణస్య సారూప్యం సంప్రాప్స్యతి న సంశయః॥
త్వం తస్య సౌందనం కృత్వో విమతీం ప్రతిపాదయ ।
త్వయా వినా క్షమో నాన్యో గచ్చ శైలగృహం ప్రభో ॥
దేవానాం వచనం శ్రుత్వా తానువాద విధిః స్వయం ।
వచనం నీతిసారం చ కర్ణపీయూషముత్తమం॥
అప్పుడు దేవతలాలోచించి బ్రహ్మ వద్దకేగి జగత్పతియైన బ్రహ్మకు అందరిట్లు నివేదించిరి. “ఓ జగత్తును సృష్టించు దేవా! నీ సృష్టిలో హిమవంతుడు రత్నములకు మూలము. అతడొక వేళ ముక్తినందినచో భూదేవి ఇక రత్నగర్భ ఎట్లగును? పర్వతరాజు భక్తితో స్వయముగా కూతురును శివునికి దానము చేసెనేని నారాయణ సారూప్య మోక్షము పొందును. అందులో సందేహము లేదు. నీవు హిమవంతుని ముందు శివుని నిందించి ఆ పర్వతునికి శివుని మీద వ్యతిరేక బుద్ధి కలుగునట్లు చేయుము. నీవు తప్ప ఈ పనికి సమర్దుడింకొకడు లేడు. ప్రభూ! త్వరగా శైల రోజు గృహమునకు పొమ్ము. దేవతల ఈ మాటలు విని బ్రహ్మ నీతిసారమును కర్ణముల కమృతము వంటిదియు ఐన ఉత్తమ వాక్యమునిట్లు పలికెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మ పలికెను :
నాహం కర్తుం క్షమో వత్సాః శివనిందాం సుదుష్కరాం ।
సంపద్వినాశ రూపాం చ విషదో బీజరూపిణీం ॥
భూతేశం ప్రస్థాపయత స్వాత్మ నిందాం కరోతి నః ।
పరనిందా వినాశాయ స్వలిందా యశసే పరం ॥
బ్రహ్మజో వచనం శ్రుత్వా తం ప్రణమ్య సురా ప్రియే ।
శీఘ్రం యయుస్తే కైలాసం గత్వా చ తుష్టుపు శివం ॥
సర్వే నివేదసం చక్రు శంకరం కరుణాలయం ।
స యయౌ శైల మూలం చ తానాశ్వాస్య ప్రహస్య చ ॥
“ఓ బిడ్డలారా! సంపదలకు వినాశ రూపమును ఆపదలకు విత్తనము వంటిదియు మిక్కిలి దుష్కరమునైన శివనింద చేయుటకు నేను శక్తిగలవాడను కాను. ఈ పనికి ఆ భూతనాథునినే (శివుడు) మీరు పంపుడు. అతడు ఆత్మనింద చేసికోగలడు. పరులను నిందించుట తన వినాశము కొరకే అగును. స్వనింద గొప్ప కీర్తికి కారణమగును” అన్న బ్రహ్మ వాక్కు విని - ఓ ప్రియరాధా! దేవతలతనికి నమస్కరించి శీఘ్రముగా కైలాసమునకేగి శివుని స్తుతించిరి, కరుణకు స్థానమైన శివునికి తమ అభిప్రాయమును విన్నవించిరి. అప్పుడా శంకరుడు నవ్వి వారినోదార్చి హిమవంతుని వద్దకేగెను.
దేవా ముముదిరే సర్వే శీఘ్రం గత్వా స్వమందిరం ।
ఇష్టసిద్ధిర్ముదే శశ్వదసిద్ధిర్దుఖ దాయినీ ॥
దేవతలందరు మందిరమునకు శీఘ్రముగా వెళ్లి సంతసించిరి. కోరిక సిద్ధించిన సంతసము, సిద్ధించకున్న దుఃఖము కలుగును కదా!
అథ శైలం సభామధ్యే సముపాస ముదా న్వితః ।
బంధువర్గైః పరివృతః పార్వతీ సహితః స్వయం ॥
ఏతస్మిన్నంతరే తత్ర విప్రరూపీ శివః స్వయం ।
సమాజగామ సహసా ప్రసన్న వదనేక్షణః ॥
దండీ ఛత్రీ దీర్ఘవాసా బిభ్రత్తిలకముత్తమం ।
కరే స్ఫటిక మాలాం చ శాలగ్రామం గలే దధత్ ॥
తరువాత హిమవంతుడు బంధు వర్గములో పార్వతితో కూడి తన సభామధ్యములో సంతోషముతో కొలువు దీరీయుండెను. ఇంతలో అక్కడికి శివుడు బ్రాహ్మణ రూపము ధరించి హఠాత్తుగా చేరవచ్చెను. చేతిలో నొకదండమును గొడుగును కంఠమున సాలగ్రామమును ధరించి నుదుట మంచి తిలకము, చేత జపమాల ప్రకాశించుచుండగా ప్రశాంతమైన ముఖము కన్నులు గల్గియుండెను.
తం చ దృష్ట్వా నముత్తస్థౌ సగణశ్చ హిమాలయః ।
ననామ దండవద్భూవ భక్త్యా తిథమపూర్వకం॥
ననామ పార్వతీ భక్త్యా ప్రాణేశం విప్రరూపిణం ।
ఆశిషం యుయుజే విప్ర సర్వేషాం ప్రీతిపూర్వకం ॥
శైలదత్తాసనే శీఘ్రమువాన బ్రాహ్మణః స్వయం ।
మధుపర్కాదికం సర్వం జగ్రాహ ప్రీతిపూర్వకం ॥
పప్రచ్ఛ కుశలం శైలో బ్రాహ్మణం కో భవానితీ।
ఉవాచ సర్వం విప్రేంద్రో గిరీంద్రం సాదరేణ చ ॥
అతనిని చూచి తన వారితో బాటు హిమవంతుడు లేచి ఆ అపూర్వాతిథికీ భక్తితో సాష్టాంగ నమస్కారము చేసెను. పార్వతీదేవి కూడ బ్రాహ్మణరూపమున వచ్చిన తన ప్రాణనాథునకు భక్తితో నమస్కరించెను. ఆ విప్రుడందరికి ప్రీతితో ఆశీస్సులిచ్చెను. శైలరాజిచ్చిన ఆసనము మీద కూర్చుండి మధుపర్కము మొదలగు సత్కారములను ప్రీతి పూర్వకముగా స్వీకరించెను. తరువాత తామెవరని కుశల ప్రశ్నను హిమవంతుడు అడుగగా బ్రాహ్మణుడాదరముగా గిరిరాజుకిట్లు చెప్పెను.
బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడనెను :
ఘటికాం వృత్తి మాశ్రీత్య భ్రమామి ధరణీతలే।
మనోయాయీ నర్వగామీ సర్వఙ్ఞాహం గురోర్వరాత్ ॥
ఓయీ! నేనీ భూతలము మీద గడియారపు ములు తిరిగినట్లు మనోవేగముతో అంతట తిరుగుచుందును, నేనన్ని చోట్లకు పోగల్గుదును. గురువు వరము వలన నేను సర్వ విషయముల నెరుగుదును సుమా.
మహా జ్ఞాతం శంకరాయ నుతాం దాతుం త్వమిచ్ఛసి ।
ఇమాం పద్మానమాం దీవ్యామజ్ఞాత కులశాలినే ॥
నిరాశ్రయాయాసంగాయారూపాయ నిర్గుణాయ చ ।
శ్మశాన గామినే సర్వభూతనాథాయ యోగినే ॥
దిగ్వాస సేహి గాత్రాయ విభూతి భూషణాయ చ ।
వ్యాలగ్రాహి స్వరూపాయ కాలవ్యాపాదనాయ చ ॥
అజ్ఞాతమృత్యవే జ్ఞాయానాథాయాబంధవే భవే ।
తప్తస్వర్ణ జటాభారధారిణే నిర్ధనాయ చ ॥
ఆజ్ఞాతవయ సే తీవ వృద్ధాయ చెవికారిణే ।
సర్వాశ్రయాయ భ్రమిణే నాగహారాయ భిక్షవే ॥
ఓ పర్వతరాజా! లక్ష్మితో సమానురాలై ప్రకాశించుచున్న ఈ నీ కూతురును శంకరునికీయగోరుచున్నావని తెలిసికొంటిని. అతని కులమేదో తెలియదు. అతనికొక ఆశ్రయము (ఇల్లు) లేదు. ఎవరితో సంగము లేదు. ఒక రూపము లేదు. గుణములు లేవు, భూతనాథుడు, శ్మశానముల వెంట తిరుగును. యోగివలె నుండును. దిగంబరుడు. అతని శరీరమున అన్ని సర్పములే, భస్మమే అతనికలంకారము. కిరాతవేషముతో నుండును. సృష్ఠి సంహారకుడు. మృత్యువెప్పుడో తెలియని ఆయుస్సు కలవాడు. అజుడు. అనాధుడు. ఈ సంసారములో అతనికొక బంధుపు లేడు, అతని శిరస్సున కరిగిన బంగారు వన్నె గల జడలుండును. వట్టి నిర్థనుడు. వయస్సెంత ఉన్నదో తెలియని కడు వృదుడు. మార్పు లేనివాడు. అందరి నాశ్రయించి తిరుగుచుండును. నాగములే అతనికి హారములు. అతడు భిక్షుకుడు సుమా.
నిబోధ జ్ఞానినాం శ్రేష్టం నారాయణం కులోద్భవం ।
సరే పాత్రాసురూపశ్చ పార్వతీ దాతృ కర్మణి ॥
మహాజనః స్మేరముఖః శ్రుతిమాత్రాద్భవిష్యతి ।
లక్షశైలాధివనంచ న తస్మైకోబస్తి బాంధవః ॥
బాంధవాన్మేనకాం ప్రశ్నం కురు శీఘ్రం ప్రయత్నతః ।
సర్వాన్ వృచ్ఛ చ యత్నేన హే బంధో పార్వతీం వినా ॥
రోగిణే నౌషధం శశ్వత్కుపథ్యం రోచతే సదా ।
ఇత్యుక్త్వా బ్రాహ్మణః శీఘ్రం స్నాత్వా భుక్త్వా ముదాన్వితః ॥
జగామ స్వాలయం శాంతో బృందావన వినోదినీ ।
బ్రాహణస్య వచ శ్రీత్వా మేనోవాచ హిమాలయం ॥
శోకేన సాశ్రునయనా హృదయేన విదూయతా ।
. “ఓయీ వినుము. జ్ఞానులలో శ్రేష్ఠుడు సత్కులమున పుట్టినవాడునైన, సారాయణుడు పార్వతిని దానమిచ్చుటకు నీకు తగిన పాత్రుడు. పెద్ద బలగము గలవాడు. చిరునవ్వు ముఖమున వెలుగువాడు. పిలుపు విన్నంతలోనే చేరవచ్చును. నీవు లక్ష పర్వతములకు రాజువు. ఆ శివునికైతే ఒక చుట్టము లేడు. . ఈ సంబంధ విషయమై బంధువుల నడుగుము. మేనకను (భార్య) ప్రశ్నింపుము. ప్రయత్నించి అందరి నడుగుము. ఓ బంధూ! పార్వతిని మాత్రము అడుగకుము. రోగికి ఔషధము రుచించదు. మాటి మాటికి తినగూడని (రోగము పెంచు) పదార్థమే ఇష్టమగును. పార్వతి స్థితి అటున్నది”, అని పలికి ఆ బ్రాహ్మణుడు సంతోషముగా స్నాన భోజనములు చేసి తన కైలాసమునకు శాంతముగా. చేరబోయెను. బృందావన విహారమే వినోదమైన ఓ రాధా! బ్రాహ్మణుని మాటలు వినగనే మేనాదేవి మనస్సు మిక్కిలి తాపపడుచుండగా దుఃఖము వలన కన్నులలో నీరు గ్రమ్మగా భర్తతో నిట్లు పలికెను.
మేనకోవాచ - మేనక ఇట్లనెను :
శ్రుణు శైలేంద్ర మద్వాక్యం పరిణామ నుఖావహం ॥
పృచ్ఛ శైలవర యా స్మై న దాస్యామి సుతామహం।
త్యక్ష్యామి సర్వాన్ విషయాన్ భక్ష్యామి విషమేవ చ ॥
గలే బద్ధ్వాఽబికాం వశ్య యాస్యామి మౌరకాననం ।
గృహీత్వా పార్వతీం మేనా గత్వా కోపాలయం రుషా॥
త్యక్త్వా హారం రుదంతీ చ చకార శయనం భువి ।
“ఓ పర్వతరాజా! పరిణామము (మార్పు, చివరలో సుఖము కల్గించు నా మాటను వినుము. అదేమన్నచో నా కూతురును అట్టి వరునకు ఈయను. ఒకవేళ నిర్బంధించి ఇత్తునందువా? ఆ పరిస్థితిలో సమస్త భోగములను వదిలివేసి విషము భక్షింతును. బిడ్డను మెడకు కట్టుకొని ఘోరమైన అరణ్యములకు పోదును” అని పలికి ఆమె పార్వతిని చేత బట్టుకొని కోపముతో కోప గృహమునకేగెను. ఆహారము వదలి దుఃఖించుచు నేలమీద పండుకొనెను.
ఏతస్మిన్నంతరే తత్ర వసిష్ణో భ్రాతృభిః సహ॥
అజగామ పునస్తైశ్చ యుక్తి పశ్చాదరుంధతీ ।
ప్రణమ్య శైలపాన్ సర్వాన్ స్వర్ణ సింహాసనం దదౌ ॥
దత్త్యా షోడశోపచారావ్ పూజయామాన భక్తితః ।
ఋషయశ్చ నఖామధ్యే ముఖమూమః సుఖాననే ॥
జగామారుంధతీ తూర్ణం యత్ర మేనా చ పార్వతీ।
గత్వా దదర్శ మేనాం చ శయానాం శోకమూర్ఛితాం॥
ఉవాచ మధురం సాధ్వీ సావధానం హితం వచః ।
ఇంతలో అక్కడికి వసిష్ఠ మహర్షి తన తోబుట్టువులైన భృగు పులస్త్యాది ప్రజాపతులతో గూడి వచ్చెను. వారితో బాటు అరుంధతీ దేవియు వచ్చెను. పర్వతరాజు వారందరికి నమస్కరించి స్వర్ణపీఠముల పై కూర్చుండ బెట్టి భక్తితో షోడశోపచార పూజ చేసెను. ఆ ఋషులందరు ఆ సభలో సుఖాసనముల మీద సుఖముగా విశ్రమించిరి, అరుంధతీ దేవి వెంటనే మేనా పార్వతులున్న ప్రదేశమునకు పోయి శోకములో మునిగి శయనించి యున్న మేనాదేవిని చూచెను. అప్పుడా సాధ్వి నెమ్మదిగా మధురము హితము అగు వచనములు పలికెను.
అరుంధత్యువాచ - అరుంధతి పలికెను :
ఉత్తిష్ఠ మేనకే సాధ్వి త్వద్గృ హే హమరుంధతీ ॥
పితృణాం మానసీకన్యా మాం జానీహి విధేర్వధూం ।
అరుంధత్యాః స్వరం ప్రత్వా శీఘ్రముత్థాయ మేనకా
ఉవాచ శిరసా నత్వా తాం పద్మామివ తేజసా ॥
“సాధ్వీ! మేనకా! లెమ్ము. నేనరుంధతిని నీ యింటికి వచ్చితిని. పితృదేవతలు మనఃసంకల్పముతో సృష్టించిన కన్యనుగా బ్రహ్మ కోడలిగా నన్ను తెలిసికొనుము", అరుంధతి యొక్క కంఠస్వరము విన్న వెంటనే మేనక లేచి తేజస్సుతో లక్ష్మీవలె వెలుగుచున్న ఆమెకు శిరస్సు వంచి నమస్కరించి. ఇట్లు పలికెను.
మేనకోవాచ - మేనక పలికెను :
అహోఽద్య కమిదం పుణ్యమస్మాకం పుణ్యజన్మనాం॥
వధూర్జగద్విధీః పత్నీ వసిష్ఠస్య మమాలయే ।
నంభ్రమేణీద మేవోకే గృహం తేహం చ కింకరీ ॥
ఈశ్వరీ జగతాం స్రష్టురాగతా బహపుణ్యతః ।
పాద్యం దత్తా స్వర్ణపీలే వానయామాన తాం సతీం॥
భోజయామాన మిషాన్నం బుభుజే కన్యయా నహా ।
శివన్య హేతోర్నీతిం చ బోధయామాన మేనకాం ॥
అరుంధతీ ప్రసంగేన సంబంధ యోజనానీ చ।
“అబ్బా! నేడేంత పుణ్యదినము?! పుణ్యజన్మనెత్తిన మాకెంతటి పుణ్యము! సృష్టికర్త కోడలు వసిష్ఠ మహర్షి భార్య మా యింటికి వచ్చుట!” అని త్వరతో గూడిన ఆదరముతో పలుకుచు - నేను నీ సేవకురాలను. బహుపుణ్యముల వలన జగత్సష్ట యొక్క సంబంధీని యగు ఈశ్వరి నౌ యింటికి వచ్చినదన్న భావముతో మేనక సాధ్వియగు అరుంధతికి పాదజలమిచ్చి స్వర్ణ పీఠముపై కూర్చుండ బెట్టెను. రుచికరమైన భోజనమును పెట్టెను. అరుంధతియు కన్యతో గూడి భుజించి సంభాషణ మొదలు పెట్టి శివునితో సంబంధము కలుపు వాక్యములను పలుకుచు మేనకకు నీతిబోధ చేసెను.
అథ శైలమృషీంద్రాశ్చ నీతిసారం పరం వచః ।
బోధయామాను సంబంధ యోజనాని ప్రసంగతః॥
సభలో ఋషీశ్వరులు హిమవంతునితో మాట్లాడుచు శివునితో సంబంధము కూర్చునట్టి నీతిసారమైన శ్రేష్ఠ వాక్యమును పలికి బోధచేసిరి.
ఋషయ ఊచుః – ఋషలు పలికిరి :
శైలేంద్ర ప్రాయం వాక్యమస్మాకం శుభకారకం ॥
శివయ పార్వతీం దేహి సంహర్తు శ్వశురో భవ ।
అయాచితారం దేవేశం బోధయాశు ప్రయత్నతః ॥
తవ శంకా వినాశాయ బ్రహ్మ సంబంధ కర్మణి।
నేచ్ఛకో దారనంయోగే శంకరో యోగినాం వరః ॥
విధేః ప్రార్ధనయా దేవ తవ కన్యాం గ్రహీష్యతి ।
దుహితుస్తే తపస్యాంతే ప్రతిజ్ఞానం చకార సః ॥
హేతుద్వయేన యోగీంద్రో వివాహం చ కరిష్యతి ।
ఋషీణాం వచనం శ్రుత్వా ప్రహస్య చ హిమాలయః ॥
ఉవాచ కించిద్భీతశ్చ పరం వినయ పూర్వకం ॥
“ఓ పర్వతరాజా! శుభము కలిగించునట్టి మా వాక్యము వినుము. శివునికి పార్వతినిమ్ము. ఆ పని వలన లయకారకుడైన ఆ దేవునికి మామవుకమ్ము. నీవు ప్రయత్నించి ఆయాచకుడగు (ఇంతవరెవ్వనిని కూడ ఇది ఇమ్మని అడుగనివాడు) ఆ దేవేశునికి నీవే విన్నవించుము. యోగీశ్వరుడైన శంకరుడు ఈ వివాహ విషయములో నీకున్న శంకలను (సందేహములను) తీర్చుటి కోసము కన్యనిమ్మని అడుగుట కీష్టపడుచులేడు. బ్రహ్మదేవుని ప్రార్థన ననుసరించి అతడు నీ కన్యను స్వీకరించగలడు. నీ బిడ్డ తపస్సు చేసిన తరువాత శివుడట్టి అంగీకారమును తెలిపెను. ఈ రెండు కారణముల చేత ఆ యోగీంద్రుడు వివోహము చేసికొనును. ఇట్లు పలికిన ఋషుల మాట విని హిమవంతుడు నవ్వి కొంచెము భయపడుచు మిక్కిలి వినయముతో ఇట్లు పలికెను.
హిమాలయ ఉవాచ - హిమాలయుడు పలికెను :
శివస్య రాజసామగ్రీం న హి పశ్యామీ కంచన ।
కించిదాశ్రమమైశ్వర్యం కిం వా స్వజన బాంధవం ॥
న కన్యామతి నిర్లిప్త యోగినే దాతుమర్హతి ।
యూయం విధాతుః పుత్రాశ్చ సత్యం వదత నిశ్చితం॥
నానురూపాయ పుత్రాయ పితా కన్యాం దదాతి చేత్ ।
కాలాల్లో భాద్భయాన్మోహాచ్ఛతాబ్దం నరకం వ్రజేత్ ॥
న హి దాస్యామ్యహం కన్యామిచ్ఛయా శూలపాణినే ।
యద్విధానం భవేద్యోగ్య మృషయస్తద్విధీయతాం ॥
రాజసంబంధమైన వస్తు సామగ్రి దేనిని కూడ శివునీదీదియని నేనెక్కడ చూడలేదు. చిన్న నిహాస గృహము కాని, ఐశ్వర్యము కాని తనపోరు బంధుజనులు అన్నవతనికేవి? దేనితోను సంబంధము లేని యోగికి బిడ్డనీయదగదు. మీరు బ్రహ్మపుత్రులు కదా! ఇంతవరకే నిశ్చయింపబడియున్న సత్యమును చెప్పుడు. కాలమునకు కట్టుబడి కానీ - ద్రవ్యలోభము వలన గాని - భయము వలన గాని - అజ్ఞానము వలన గాని - అయోగ్యుడు (తగినవాడు కాని) ఐన పురుషునికి బిడ్డనిచ్చినచో ఆ తండ్రి సూరేండ్లు నరకము పొందును. నేను కోరి శూలపాణికి నాకూతురునియ్యను. ఈ విషయములో యోగ్యమైన విధానమేదో దానిని ఆజ్ఞాపించుడు.
హిమాలయ వచః శ్రుత్వా వసిష్ఠో విధినందనః ।
వేదవేదాంగ విజ్ఞాన వేదోక్తం వక్తుముద్యతః ॥
హిమవంతుని మాటవిని బ్రహ్మపుత్రుడైన వసిష్ఠ మహర్షి వేదవేదాంగము లెరిగిన విద్వాంసుడు కనుక వేదములో చెప్పబడిన దానినీ చెప్పబూనెను.
వసిష్ఠ ఉవాచ - వసిష్ఠమహర్షి పలికెను:
వచనం వీవీధం శైల లౌకికే వైదికే తథా ।
సర్వం జానాతీ సర్వజ్ఞో నిర్మల జ్ఞాన చక్షుషా ॥
అనత్య మహితం పశ్చా త్సాంప్రతం శ్రుతి సుందరం ।
సుబద్ధం శత్రుర్వదతి న హితంచ కదాచన॥
ఆపాత ప్రీతిజనకం పరిణామ సుఖావహం ।
దయాలుధర్మ శీలశ్చ బోధయత్యేవ బాంధవం ॥
శ్రుతిమాత్రాత్సుధాతుల్యం సర్వకాలే సుఖావహం ।
నత్యసారం హితకరం వచసాం శ్రేష్టమీప్సితం ॥
ఏవంచ విధం శైల నీతిశాస్త్ర నిరూపితం ।
కథ్యతాం త్రిపు మధ్యే కిం వదామి వాక్యమీపితం ॥
“ఓ పర్వతుడా! లౌకిక విషయము గాని వైదిక విషయము గాని సర్వజ్ఞుడైన వ్యక్తి నిర్మలమైన తన జ్ఞాన నేత్రములో, అన్ని తెలిసికోగలుగును. శత్రువైనపోడు అసత్యమును హితము కల్గించనిదియు ఐన బోధను అప్పటికి ఏనువాని చెవికి ఇంపుగా దృఢముగా చెప్పును కాని హితమెప్పుడును చెప్పడు. ఇతరుల యందు దయగల వాడును ధర్మజుడునైన వ్యక్తి బంధువుకు చెవిలో పడుచున్నప్పటి నుండి ప్రీతిని కల్గించుచు తరువాత కూడ సుఖము కల్గించునట్టి ధర్మహితమును బోధించును. ఇంకొకడు బోధ వినుచున్నప్పుడే అమృతము వలె నుండి సర్వకాలములలో సుఖము కల్గించునదియు, సత్యసారమైనదీయు హితకరమును కోరబడినదియునైన శ్రేష్ఠ వాక్యముగా నుండును. ఈ విధముగా నీతిశాస్త్రమందు నిర్ధారణ చేయబడిన బోధ మూడు రకములుగా నుండును. ఈ మూడు. విధములలో నీకిష్టమైన దేదో చెప్పుము. నీకేది చెప్పుమందువు.
బాహ్య సంపద్విహీనశ్చ శంకర స్త్రీదశేశ్వరః ।
తత్త్వజ్ఞాన సముద్రపు నన్నిమన్నైక మానసః ॥
ఆపాత భ్రమసంపత్తిర్విద్యుచ్ఛీరిక నాశినీ।
సదానంద స్యేశ్వరన్య స్వాత్మారామస్య కా స్పృహా॥
గృహి దదాతి స్వనుతాం రాజ్య సంపత్తి శాలినే ।
కన్యాం విద్వేషిణీ దత్తా కన్యాఘాతీ భవేత్సతా ॥
కో వదేచ్ఛంకరో దుఃఖీ కుబేరో యస్య కింకరః ।
భ్రూభంగలీలయా సృష్టిం స్రష్టుం నష్టుం క్షమో హి యః॥
శంకరుడు బయటికి కనిపించు సంపదలు లేనివాడు. ఆ దేవేశ్వరుడు తత్త్వజ్ఞానమనెడి సముద్రములలో మునిగియున్న మనస్సు కలవాడు. సంపదలన్నవి మనుష్యుని దృష్టిలో పడుచునే భ్రమను కల్గించునవి, మెరుపుల కాంతివలె వెంటనే నశించునవి. అట్టి సంపదల మీద తన ఆత్మ యందే రమించు సదానందుడై యున్న ఆ యీశ్వరునికి కోరిక ఎక్కడిది? ఒక గృహస్తుడు తన కన్యను రాజ్య సంపద గళిలోకమును ద్వేషించు వానికిచ్చినచో కన్యాఘాతుకుడైన తండ్రియై తీరును. శంకరుడు దరిద్ర దుఃఖమనుభవించువాడని ఎవడు పల్కును. ధనపతియైన కుబేరుడతని సేవకుడు కదా కనుబొమల కదలికలో సృష్టి సంహారములను చేయు సమర్థుడా శివుడు.
నిర్గుణః పరమాత్మా చ య ఈశః ప్రకృతేః పరః ।
సర్వేశః స చ నిర్లిప్తో లిప్తశ్చ సర్వజంతుషు ॥
స ఏకః సృష్ఠి సంహారే స నర్వ సృష్టికర్మణి ।
నిరాకారశ్చ సాకారో విభుః స్వేచ్ఛామయ స్వయం॥
య ఈశస్తివిధాం మూర్తిం విధత్తే సృష్టికర్మణి ।
సృష్టి స్థిత్యంత జననీం బ్రహ్మవిష్ణు శివాభిధాం॥
ఎవడు నిర్గుణ పరమాత్మయో ప్రకృతి కతీతుడైన సర్వేశ్వరుడో, మరియు సర్వమునకీశ్వరుడో, సర్వజీవుల లోపల ఉండి కూడ ఏ దోషమంటని వాడో (నిర్లిప్తుడు) ఆ ఈశ్వరుడే సృష్టికర్మయందును సృష్టి సంహారమందును సమర్థుడు. ఆ విభుడు స్వయం స్వేచ్ఛామయుడు (తన ఇచ్ఛననుసరించి ప్రవర్తించువాడు) కనుక నీరాకారుడను సాకారుడును అగును. అతడు సృష్టి వ్యవహారములో సృష్టించుట రక్షించుట ఆంతమొనర్చుటలను కల్గించునట్టి బ్రహ్మ విష్ణువు శివుడు అన్న నామములు గల మూడు విధముల మూర్తులను (ఆకారములను) ధరించుచున్న ఈశ్వరుడు.
బ్రహ్మా చ బ్రహ్మలోకస్తో విష్ణుః క్షీరోదవానకృత్ ।
శివః కైలాస వాసీ చ సర్వా కృష్ణ విభూతయః॥
శ్రీకృష్ణశ్చ ద్విధాభూతో ద్విభుజశ్చ చతుర్భుజః ।
చతుర్భుజశ్చ వైకుంఠే గోలోకే ద్విభుజ స్వయం ॥
తస్య దేవస్య తేంశాశ్చ బ్రహ్మ విష్ణు మహేశ్వరా ।
కేచిద్దేవాః కలాస్తస్య కలాంశాశ్చైవ కేచన॥
బ్రహ్మలోకమందలి బ్రహ్మ పాలసముద్రమందలి విషువు కైల సవాసి యైన శివుడు అందరును పరమాత్మయైన కృష్ణుని యొక్క విభూతులే (అతని నుండి విడదీయరాని మ ఖైశ్వర్య మూర్తులే). అట్టి శ్రీకృష్ణుడు ద్విభుజుడు (రెండు హస్తములు గలవాడు) చతుర్భుజుడు (నాలు హస్తములు గలవాడు) అని రెండు విధములై ఉన్నాడు. వైకుంఠమునందేమో చతుర్భుజుడు, గోలోకమందు ద్విభుజుడు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ స్వామి యొక్క అంశలే. కొందరు దేవతలా శ్రీకృష్ణదేవుని కళారూపులు (పదహారవ భాగము) మరికొందరు కళలోని భాగములు.
కృష్ణః సృష్యున్ముఖశ్చాపి ప్రకృతిం తత్ర నిర్మమే।
నిర్మాయతాం చ తద్యోనా వీర్యాధానం చకార హా ॥
తతో డింభః నముద్భూతః తన్మధ్యే చ మహావిరాట్।
శ్రీ మహావిష్ణుస విజ్ఞేయో శ్రీకృష్ణ షోడశాంశకః ॥
నాభిపద్మోద్భవో బ్రహ్మా తస్యైవ జలశాయినః ।
భాలోద్భవస్తస్య స్రష్టు శంకరశ్చంద్రశేఖరః ॥
మహావిష్ణోః వామ పార్శ్వాత్సంభూతో విష్ణుదేవ చ ।
సర్వే ప్రాకృతీకా శైల బ్రహ్మ విష్ణు శివోదయ॥
కృష్ణ పరమాత్మ సృష్టి చేయ సంకల్పించి ప్రకృతిని - (వ్యక్తరూపములో) నిర్మించను. నిర్మించిన ప్రకృతి గర్భమందు తన వీర్యమునుంచేను. దాని వలన నొక అందమేర్పడెను. ఆయండము లోపల మహావీరాట్పురుషుడేర్పడెను. అతడే శ్రీకృష్ణుని యొక్క షోడశాంశమైన మహావిష్ణువని తెలిసికొనుము. ఆ జల శాయియైన మహావిష్ణువు యొక్క నాభికమలమందు బ్రహ్మయు ఫాలము నుండి చంద్రశేఖరుడైన శంకరుడును ఎడమ ప్రక్క నుండి విష్ణువును నుద్భవించిరి. కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రాకృతికులు (ప్రకృతి పుత్రులు). ఇతర దేవాదులును ప్రాకృతికులే.
ధత్తే చతుర్విధాం మూర్తిం ప్రకృతిః కృష్ణసంభవా।
అంతేన లీలయా సృష్యై కలయా బహుధా తయా॥
కృష్ణవామాంగ సంభూతా రాధా రాసేశ్వరీ స్వయం।
ముఖోభోద్భవా స్వయం వాజీ రాగాధిష్ఠాతృ దేవతా॥
పక్షః స్థలోద్భవా లక్ష్మీః సర్వ సంవత్స్వరూపిణీ ।
శివా తేజస్సు దేవావామావిర్భావం చకార పా॥
విహత్య దానవాన్ సర్వాన్ దేవేభ్యశ్చ శ్రియం దదౌ ।
ప్రాప్య కల్పాంతరే జన్మ జఠరే దక్షయోషితః ॥
నామ్నా నతీ శివం ప్రావ దక్షస్త స్మై దదౌ చ తాం ।
యోగేన దేహం తత్యోజ శ్రుత్వా సా భర్తృసిందనం॥
కృష్ణ పరమాత్మ నుండి సంభవించిన ప్రకృతి నాల్గువిధములైన రూపములను (ఆకారములను) ధరించెను. అతని అంశతో లీలతోను, సృష్టికొరకు, కళతోను ఇట్లు అనేక విధముల ఆమె (ప్రకృతి) క్రింది రూపములను ధరించెను. కృష్ణుని యొక్క వోంగము నుండి (శరీరము యొక్క ఎడమ భాగము నుండి) సంభవించిన రాధాదేవి రాసలోకనాయిక. అతని ముఖము నుండి ఉద్భవించిన వాణి (సరస్వతి) సంగీతమునకు అధిష్టాన దేవత, స్వామి వక్షస్థలము నుండి సంభవించిన లక్ష్మీదేవి సర్వసంపదల స్వరూపమైనట్టిది. దేవతల యొక్క తేజస్సు నుండి ఆవిర్భవించిన (స్వయముగా) శివ (పార్వతీదేవి) సర్వదానవులను సంహరించి దేవతలకు స్వర్గ సంపదనిచ్చెను. ఆమెయే పూర్వకల్పములో దక్షుని భార్య యొక్క గర్భమందు జన్మించి సతీదేవియన్న నామముతో వెలసెను. దక్షుడామెను శివునీకీయగా అతనిని పొంది -తన తండ్రి శివుని నీంద చేయగా విని సహించక యోగశక్తితో దేహత్యాగము చేసెను.
పితృణాం మాననీ కన్యా మేనకా తవ గేహివీ ।
లాభ తప్యా జఠరే జన్మ పా జగదంబికా ॥
శివా శివస్య పత్నీయం శైలజన్మని జన్మనీ।
కల్పే కల్సే బుద్ధిరూపా జావీవాం జననీ వరా॥
జూతిస్మరా చ సర్వజ్ఞ సిద్ధిదా ఎధిరూపిణీ ।
అప్యా అస్థి చితాభస్మ భక్త్యా ధత్తే శివః స్వయం॥
పితృదేవతల యొక్క మానస కన్యయైన మేనకాదేవి నీభార్య. ఆమె గర్భమందు ఆ జగదంబిక (సతీదేవి) జన్మించినది. ఓ హిమవంతుడా! ఈ శివాదేవి జన్మజన్మలకు శివుని పత్నియే. ప్రతికల్పమందు జ్ఞానులకు తల్లియైన ఈ శ్రేష్ఠురాలు బుధీరూపిణియై వెలుగుచున్నది. సర్వజ్ఞురాలగునీమె పూర్వజన్మల స్మృతి గలది. సిద్ధిరూపిణియై తనను సేవించినవారికి సర్వవిధ సిద్ధులనిచ్చును. ఈమె యొక్క {పూర్వజన్మకు సంబంధించిన) ఎముకలను చితాభస్మమును శివుడు స్వయముగా ఆదరముతో ధరించుచున్నాడు.
దేహి త్వం స్వేచ్ఛయా కన్యాం దేహి భద్ర శీవాయ చ ।
అథవా సా స్వయం కాంతష్టానం యాస్యతి ద్రక్ష్యపి॥
ప్రాక్తనాద్యస్య యా కాంతా పా తం ప్రాప్నోతి వల్లభం ।
ప్రజాపతేర్నిబంధం చ న కలిపి ఖండితుం క్షమ॥
వివాహే నోట్సుకః శంభుః స్వాత్మారామశ్చ తత్త్వవిత్ ।
తుషవుప్తం సురా సర్వే తారకాల్యేప పీడితాః ॥
దేవానాం పీడనం దృష్ట్యా బ్రహ్మణా ప్రార్థితో విభుః ।
కృపయా స్విచకారాతు కృపాలుర్దేపనంనది॥
ఓ భద్రుడా! నీవే ఇష్టపూర్తిగా శివునికి నీకన్యనిమ్ము, అట్లుకాకున్నను స్వయముగా నామెయే తన కాంతుని వద్దకు పోగలదు. అది నీవు చూతువు, పూర్వజన్మయందెవనికి ఏ స్త్రీ ప్రియురాలో ఆమె ఆ వల్లభునే పొందుచున్నది. ఇది బ్రహ్మ నిర్ణయము, దోని నోటంకపరచుటకెవడు శక్తుడు కాడు. తత్త్వవేత్తయు ఆత్మారాముడునైన శంభుడు వివాహ విషయమై ఆసక్తి కలిగి లేడు. తారకుడను రాక్షసుని చేత పీడింబడిన సర్వదేవతలతనిని వివాహమాడుమని స్తుతించిరి. దేవతల బాధలను చూచి బ్రహ్మచేత ప్రార్థింపబడినవాడై కృపగల శంకరుడు దేవసభలో దయతో అగీకరించెను.
కృత్వా ప్రతిజ్ఞాం యోగీంద్రో దృష్వా క్లేశమసంఖ్యకం ।
దుహితుస్తే తపః స్థానమాజగామ ద్వీజత్మకః ॥
తామాశ్వాస్య వరం దత్త్వా జగామ నిజమందిరం।
తచ్ఛ్రుత్వేవాయయుః సర్వే పరాః శక్రాదయో ముదా॥
నారాయణశ్చ భగవాన్ బ్రహ్మా ధర్మశ్చ సాంప్రతం ।
ఋషయో మునయః సర్వే గంధర్వా యక్ష రాక్షసాః॥
తత్ర సర్వే ముదాయుక్తైః సమాలోచన కర్తృభిః।
ప్రస్థాపితా వయం శీఘ్రమనృణా సా అరుంధతీ ॥
తవ ప్రబోధవే ప్రీతిర్వర్ధతే మహతీ పదా ।
సంప్రాప్తం శుభకార్యం చ సర్వకాల సుఖావహం॥
ఆ యోగీంద్రుడు దేవతల యొక్క అసంఖ్యాకమగు దుఃఖములను చూచి ప్రతిజ్ఞచేసి బ్రాహ్మణ వేషముతో నీ కూతురు (పార్వతి) తపస్సు చేసెడి స్థానమునకు వచ్చెను. ఆమెనోదార్చి వరమొసగి స్వగృహమున కేగెను. ఆ వార్త వినియే. ఇంద్రాది సర్వదేవతలు సంతోషముతో నొక్క చోటికి చేరవచ్చిరి. ప్రస్తుతము భగవంతుడైన నారాయణుడు బ్రహ్మ, ధర్ముడు, ఋషులు, మునులు, గంధర్వ యక్ష -రాక్షసులందరును సంతోషముతో నొక చోటచేరి ఈ కార్యమును గురించీ సమాలోచనము చేసిరి. మేమిక్కడికి వారిచేతనే పంపబడితిమి. మేము కూడ ఋణ విముక్తి కొరకు త్వరగా వచ్చితిమి. అరుంధతియు నీకు వివాహ విషయమై ప్రబోధించుటకు గొప్ప ఆసక్తి కలిగి - యున్నది. సర్వకాలము సుఖము కూర్చునట్టి ఈ శుభకార్యము (పార్వతీపరమేశ్వరుల వివాహము) ఇప్పుడు సంప్రాప్తించినది.
శివాం శివాయ శైలేంద్ర స్వేచ్ఛయా చేన్న దాస్యతీ ।
భవితా వా వివాహశ్చ భవితవ్యే బలేవ చ ॥
ఆగమిష్యతి దేవో యో నారాయణసహాయవాన్ ।
రత్నసార రథే కృత్వా దేవానాం ప్రవరం వరం॥
యోగీంద్రాణాం వరేణ్యం తం జ్ఞానినాం చ గురోర్గురుం ।
ఆది మధ్యాంత రహితమవికారమజం పరం॥
వరం దదౌ శివాయై స శివశ్చ తపనః స్థలే ।
నహీశ్వర ప్రతిష్ఠాతం దుర్లభం విఫలం భవేత్ ॥
బ్రహ్మాదిస్తంబ పర్యంతం సర్వం నశ్వరమస్థిరం ।
అహో ప్రతిజ్ఞా దుర్లంఘ్య సాధూనామవినాశనీ॥
ఓ పర్వతరాజా! నీవు నీ ఇష్టపూర్తిగా పార్వతికి శివునకియ్యకున్నను వివాహము అట్లే జరుగవలెనన్న దైవసంకల్ప బలము చేత ఆది జరిగి తీరును. శ్రేష్టమైన రత్నములచేత నిర్మించబడిన రథమందు నారాయణునితో కూడి ఆ దేవుడు వచ్చును, ఆ వరుడు (పెండ్లి కుమారుడు) దేవతలలో శ్రేష్ఠుడు. యోగీంద్రులలో ఉన్నతుడు, జ్ఞానులకు పరమగురువు. అతనికి ఆదిమధ్యాంతములు లేవు. అతడు జన్మ జరామరణాది వికారములు లేనివాడు. ఆ శివుడు పార్వతి తపస్సు చేసెడి ప్రదేశమునకు పోయి వివాహమాడుదుని వరమిచ్చినాడు. ఈశ్వరుని వాసము దుర్లభము కాదు విఫలము (వ్యర్థము) కాదు. బ్రహ్మ మొదలు గడ్డి వేరు వరకు అంతయు నశించునదే. అస్థిరమే. కాని నశించిపోనట్టి సత్పురుషుల ప్రతిజ్ఞ దాట శక్యముకానిది సుమా!
ఏకీ మ హేంద్రః లోనాం పక్షాంశ్చిచ్చేద లీలయా ।
పవనో లీలయా మేరోః శృంగభంగం చకార హ ॥
కే వా శైలేషు యోద్ధార సురైః సహ హిమాలయ।
పతిష్యంతి సముద్రేషు పవవై ప్రేరితాః క్షణాత్ ॥
ఏకాళే యది శైలేంద్ర సర్వసంపద్వినశ్యతి ।
సర్వాన్ రక్షతి తద్దత్వా వినా చ శరణాగతం ॥
శరణాగత రక్షార్ధం ప్రాణాంశ్చ దాతుమర్హతి ।
వుత్ర దారధనం నర్వానితి నీతి విదో విదుః ॥
దేవేంద్రుడొక్కడు పూసుకొని లీలగా పర్వతముల రెక్కలను ఖండించెను. పవనుడు (గాలి) ఒక ఆటగా మేరువు యొక్క శృంగమును (శీఖరమును) భంగము చేసెను. ఓ హిమాలయా! దేవతలతో యుద్ధము చేయగల వీరులు పర్వతములలో ఎవరున్నారు? వాయువులచేత విసిరి వేయబడి పర్వతములు సముద్రములలో పడిపోగలవు. ఓ శైలేంద్రుడా! ఒక్కదాని గురించి సర్వసంపదలు నశించు స్థితి ఏర్పడునేని దొని నిచ్చివేసి మిగిలిన అన్నింటిని రక్షించుకొనవలెను. ఒక్క శరణాగతుని మాత్రము ఇచ్చివేయరాదు (వదిలిపెట్టరాదు) శరణాగతుని రక్షించుటకొరకు పుత్రులను భార్యను ధనమును ప్రాణములను కూడ ఇచ్చివేయదగునని నీతివేత్త లెరుగుదురు.
దత్త్యా విప్రాయ న్వసుతామనరజ్యో నృపేశ్వరః ।
బ్రహ్మ శాపాద్విముక్తశ్చ రరక్ష సర్వసంపదం ॥
తమాశు బోధయామానుర్నీతిశాస్త్ర విదో జనా ।
బ్రహ్మశావనిమగ్నం చ బ్రహ్మణ్యమతికాతరం ॥
త్వమేవ శైల రాజేంద్ర సుతాం దత్త్యా శివాయ చ ।
రక్ష సర్వాన్ బంధువర్గాన్ పశే కురు సురానపి॥
వసిష్ఠస్య వచః శ్రుత్వా ప్రహస్య పర్వతేశ్వరః ।
పప్రచ్ఛ నృపవృత్తాంతం హృదయేన విదూయతా॥
అనరణ్యుడన్న రాజు మంచి జ్ఞాని. ఒకసారి బ్రహ్మ శాపమగ్నుడై భయముతో దీనదశను పొందగా నీతిశాస్త్ర పండితులనికి తగిన బోధ చేసిరి. ఆ బోధ ననుసరించి ఆ రాజు తన కూతురును. బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ బ్రహ్మ శాపమునుండి విముక్తుడాయెను. తన సంపదలను రక్షించుకొనెను. నీవును అట్లే నీ సుతను శివునకిచ్చి సర్వ బంధు వర్గమును కాపాడుకొనుము. దేవతలను నీకు వశులనుగా చేసికొనుము. ఇట్లు పలికిన వసిష్ఠుని వచనములను విని పర్వతరాజు నవ్వి బాధపడుచున్న మనస్సుతో ఆ రాజవృత్తాంతమడిగెను.
హిమాలయ ఉవాచ - హిమవంతుడను :
కస్య వంశోద్భవో బ్రహ్మన్న నరజ్యో నృపేశ్వరః ।
సుతాం దత్వా చ న కథమరక్షత్సర్వ సంపదం ॥
ఓ బ్రహ్మర్షి! అనరణ్యుడన్న రాజేంద్రుడెవరి వంశమున పుట్టెను? తన బిడ్డనిచ్చి సర్వసంపదల నెట్లు రక్షించుకొనెను?
వసిష్ఠ ఉవాచ - వసిష్ఠుడనెను :
మను వంశోద్భవో రాజా సో నరజ్యో నృపేశ్వరః ।
చిరంజీవీ ధర్మశీలో వైష్ణవో విజితేంద్రియః ॥
స్వాయంభువో మనుః పూర్వం బ్రహ్మపుత్రోమి తిధార్మికః ।
రాజ్యం చకార ధర్మేణ యుగానామేక సప్తతిం ॥
తతో జగాను వైకుంఠం సహితః శతరూపయా ।
సంప్రాప్య దాస్యం సాన్నిధ్యం హరేరాసో బభూవ హ॥
మసుర్బభూవ తత్సశ్చాత్ స్వయం స్వారోచిషో మహాన్ ।
స్వారోచిషే గతే శైల బభూవ మనురుత్తమః ॥
ఉత్తమే నిర్ధతే ధర్మీ తాముసో మనురేవ చ ।
తతో మునుర్భభూవాత్ర రైవతో జ్ఞానినాం వరః ॥
చాక్షుషశ్చ తతో జ్ఞేయః శ్రాద్ధదేవశ్చ సప్తమః ।
సావర్థిరస్థమా జ్ఞేయః శ్రీసూర్యతనయో మహాన్॥
చైత్ర వంశోద్భవో రాజా పురాశి ఽసీత్సురథో భువి ।
సవ మోదక్షసావర్ణిర్ర్బహ్మ సావర్ణికోదశ ॥
ఏకాదశో మునిశ్రేష్ఠో ధర్మసావర్ణిరుచ్యతే ।
తతశ్చ రుద్రసావర్ణిర్విష్ణుభక్తీ జితేంద్రీయ ॥
తత్పరో దేవసావర్ణిరింద్ర సావర్ణికస్తతః ।
ఇత్యేవం కథితా బంధో మనవశ్చ చతుర్దశ ॥
అనరణ్య మహారాజు మనువంశమున జన్మించినాడు. అతడు మంచి ధర్మాత్ముడు. ఇంద్రియములను జయించిన విష్ణుభక్తుడు. చిరకాలజీవి. మనువులలో మొదటివాడు అతిధర్మాత్ముడు బ్రహ్మ పుత్రుడైన స్వాయంభువ మనువు. అతడు డెబ్బైయొక్క యుగములు ధర్మముగా రాజ్యపాలనము చేసెను. తరువాత భార్యయైన శతరూపతో కలిసి వైకుంఠ లోకము పొంది సామీప్యము దాస్యము అన్న మోక్షదశలు పొంది శ్రీహరి దాసుడయ్యెను. ఆ తరువాత మహానుభావుడైన స్వారోచిషుడు మనువయ్యెను. అతని కాలము గతింపగా ఉత్తముడు మనువయ్యెను, ఉత్తముడు గతించగా ధర్మాత్ముడైన తామసుడు మనువయ్యెను. ఆ తరువాత జ్ఞానులలో శ్రేష్టుడైన రైవతుడు మనువయ్యెను. ఆ తరువాత చాక్షుషుడు అతని తరువాత శ్రాద్ధదేవుడు ఏడవ మనువు. సావర్ణి అన్నవాడష్టమ మనువు. ఇతడు చైత్ర వంశోద్భవుడైన రాజు. పేరు సురథుడు. దక్షసావర్ణి తొమ్మిదవ మనువు, బ్రహ్మసావర్ణి పదియవ మనువు, పదకొండవ వాడు ధర్మసావర్ణి, ఇతడొక మహాముని. ఆ పిదప విష్ణు భక్తుడు జితేంద్రియుడైన రుద్రసావర్ణియు ఆ తరువాత దేవసావర్ణియు పిదప ఇంద్ర సావర్ణియు మనువులైరి. ఓయీ! ఇట్లు పదునాలురు మనువులు చెప్పబడిరి.
ఏతేమ నమతీతేషు బభూవ బ్రహ్మణో దీనం।
ఇంద్రసావర్ణి వృత్తాంతం సర్వం మత్తో నిశామయ॥
మసూనాం ప్రవరో ధర్మీ శుద్ధభక్తి గదాభృతః ।
చకార రాజ్యం ధర్మేణ యుగానామేకసప్తతిం ॥
రాజ్యం దత్త్వా నురేంద్రాయ జగామ తపసే వనం ।
సురేంద్రస్య సుతః శ్రీమాన్ శ్రీనికేతుర్మహాబలః ॥
తన్య పుత్రో మహాయోగీ పురీష తరురేవ చ ।
తస్య పుత్రోతీ తేజస్వీ గోకాముఖ ఇతివృతః॥
వృద్ధశ్రవాః సుతస్తన్య తత్పుత్ర భానురేవ చ।
పుండరీకః సుతస్తన్య తత్పుత్ర జిహ్వలన్తథా ॥
జిహ్వలస్య నుతః శృంగీ తత్పుతో చీమ ఏవ చ ।
తత్పుత్రోవి పి యశశ్చంద్రో యశసా చ శశీ జితః ॥
తత్కీర్తిం నిర్మలాం సంతో గాయంతి సతతం సురాః ।
తస్య పుత్రో వరేణ్యశ్చ పురారణ్యళ్ళ తత్సుతః ॥
తత్పుతో ధార్మికః శ్రీమాన్ ధరారణ్యశ్చ ఏవ చ ।
తత్సుతో మంగలారణ్యస్తపస్వీ జ్ఞానినాం వరః ॥
అపుత్రకో నరశ్రేష్ఠస్తపసే పుష్కరం గతః ।
సుచిరం చ తపస్తస్త్వా వరం లబ్దా మహేశ్వరాత్ ॥
సంప్రావ్య వైష్ణవం పుత్రమనరణ్యం జితేంద్రీయం ।
దత్త్యా తస్మై చ రాజ్యం చ జగామ తపసే వనం॥
ఈ పదునాల్గురు మనువులు గడిచిపోగా సృష్టికర్తయగు బ్రహ్మకొక దినమాయెను. ఇక వారిలో ఇంద్రసావర్ణి వృత్తాంతము మొత్తము నా వల్ల వినుము. ధర్మాత్ముడును విష్ణువునందు శుద్ధభక్తిగల ఆ మనుశ్రేష్ఠుడు (ఇంద్ర సావర్ణి) డెబ్బది యొక్క యుగములు ధర్మముగా రాజ్యము పాలించెను. తరువాత అతడు సురేంద్రునికి రాజ్యమిచ్చి తపస్సు చేయుటకు వసమునకు పోయెను. సురేంద్రుని పుత్రుడు బుద్ధి బలము భుజబలము గల శ్రీనికేతుడు. అతని పుత్రుడు మహాయోగియైన పురీష తరువు. అతని పుత్రుడు మిక్కిలి తేజస్వియైన గోకాముఖుడు. అతని పుత్రుడు వృద్ధశ్రవసుడు వాని కొడుకు భానువు, అతనికి పుండరీకుడు, వాని కొడుకు జిహ్వలుడు. జిహ్వాలుని సుతుడు శృంగి, శృంగిపుత్రుడు భీముడు. అతని పుత్రుడు యశశ్చంద్రుడు. ఇతని కీర్తికి చంద్రుడోడిపోయెను. యశశ్చంద్రుని కీర్తిని సాధుపురుషులు దేవతలు ఇప్పటికీని గానము చేయుచున్నారు. అతని పుత్రుడు వరేణ్యుడు. వాని సుతుడు పురారణ్యుడు. పురారణ్యుని పుత్రుడు ధర్మాత్ముడైన ధరోరణ్యుడు. ఇతని పుత్రుడు జ్ఞానులలో శ్రేష్ఠుడును తపస్వి ఐన మంగళారణ్యుడు. ఇతడు పుత్రులు లేక తపము చేయుటకై పుష్కరమునకు పోయి అక్కడ సుదీర్ఘకాలము తపస్సు చేసి మహేశ్వరుని వరము పొందెను. ఆ వర ఫలముగా జితేంద్రియుడును విష్ణుభక్తుడుసైన అనరణ్యుడను కుమారుని పొంది వానీకి రాజ్యమర్పించి మరల తపస్సు చేయగోరి అరణ్యమున కేగెను.
అనరణ్యో నృపశ్రేష్టః సప్తద్వీప మహీపతిః ।
చకార యజ శతకం భృగుణా చ పురోధసా॥
తుచ్ఛం మత్వా తు శబ్రీత్వం న లేఖే నశ్వరం సుధీః ।
లీలయా చ జితః శక్రో లీలయా చ జితో బలిః ॥
జీతాశ్చ దానవేంద్రో వై జ్వలతా స్వేన తేజసా ।
బభూవుః శఠపుత్రాశ్చ రాస్తస్య హిమాలయ॥
కన్యైకా నుందరీ రమ్యా పద్మా పద్మాలయా నమా ।
సా కన్యా యౌవనస్థా చ బభూవ పితృమందిరే॥
చారం ప్రస్థాపయామాస వరాయ నృపతీశ్వరః ।
ఏకదా పిప్పలాదశ గంతుం స్వాశ్రమముత్సుకః ॥
తపః స్థానే నిర్లనే చ గంధర్వం స దదర్శ హ।
స్త్రీపు నిర్మగ్న చిత్రం చ శృంగార రస సాగరే॥
కామాదతీక మత్తం చ న జానంతం దివానీశం ।
దృష్ట్వా తం మునిశార్దూలః సకామశ్చ బభూవ హ॥
రాజశ్రేష్టుడైన అనరణ్యుడు సప్తద్వీపములు గల భూమండలమంతటికీ ప్రభువై భృగువను పురోహితుని సహాయముతో నూరు యజ్ఞములను చేసెను. ఆ జ్ఞాని నూరు యజ్ఞముల వలన లభించనున్న ఇంద్రపదవిని నశించెడి తుచ్ఛపదవియని భావించి స్వీకరించలేదు, దీనితో అతడు ఇంద్రపదవీకై తహతహలాడు ఇంద్రుని - బలిచక్రవర్తిని లీలగా గెలిచెను. జ్వలించెడి అతని తేజస్సుతో దానవేంద్రులందరోడింపబడిరి. అట్టి అనరణ్యునికి నూరుగురు పుత్రులు కలిగిరి. లక్ష్మీదేవితో సమానురాలైన ఒక కన్య.అందరి మనస్సుల నానందపరచు సుందరి, పద్మ అను నామము కలది రోజుకు జన్మించెను. ఆమె క్రమముగా యౌవనవతి కాగా ఆ రాజేంద్రుడు కన్యనీయదగిన వరుని కొరకు ఒక చారుని పంపెను. ఇంతలో పిప్పలాదుడన్న మహర్షి ఒకసారి తన ఆశ్రమమునకు పోవుచు నిర్జనముగా నున్న తపోవనములో ఒక దృశ్యమును చూచెను. ఒక గంధర్వుడు మిక్కిలి కామముచేత మత్తుడై రాత్రీ పగలు తెలిసికొన లేక స్త్రీలయందు మగ్నమైన మనస్సుతో శృంగార రస సముద్రములో మునుగుచుండెను. ఈ ముని రాజది చూచి తాను కూడ మన్మథునికి వశుడాయెను.
తతః సుభగ్న చిత్తస్సన్ చింతయన్ దారసంగ్రహం ।
ఏకదా పుష్ప భద్రాయం స్నాతుం గచ్ఛన్ మునీశ్వరః ॥
దదర్శ పద్మాం యువతీం పద్మామివ మనోరమాం ।
కేయం క స్వేతీ పప్రచ్ఛ సమీపస్థాన్ జనాన్మునిః ॥
జనా నివేదనం చక్రు పద్మానరణ్య కన్యకా ।
మునిః స్నాత్వోబీభీష్టదేవం సంపూజ్య రాధికేశ్వరం ॥
జగామ కామీ భిక్షార్థమనరణ్య సభాజీరే।
రాజా శీఘ్రం మువిం దృష్ట్యా ప్రణనామ భయాకులః ॥
మధుపర్కాదికం దత్తా పూజయామాస భక్తితః ।
కామాత్పర్వం గృహీత్వా చ యయాచే కన్యకా మునిః ॥
తరువాత మిక్కిలి భగ్న మనస్సుతో భార్యాగ్రహాణము (వివాహాము)ను గూర్చియే విచారించుచుండెను. ఒకసారి పుష్పభద్రానదికి స్నానమునకు పోవుచు పిప్పలాదముని లక్ష్మీదేవి వలె మనస్సు నానందపరచు యువతీయగు పద్మ (రాజకన్య)ను చూచి ఆ సమీపమున నున్న జనులను ఈమె ఎవడో? ఎవని కన్య? అని ప్రశ్నించెను. వారు ఈమె పేరు పద్మ, అనరణ్యుని పుత్రిక అని నివేదించిరి. ముని స్నానము చేసి తన ఇష్టదైవమగు రాధానాథుని పూజించి - వివాహేచ్ఛతో కన్యాభిక్షనడుకుటకు అనరణ్యుని సభాంగణమునకు పోయెను. రాజు మునిని చూచి భయభక్తులతో త్వరగా నమస్కరించి మధుపర్కము మొదలగు వాటిని సమర్పించి పూజించెను. ముని ఆ సత్కారమును స్వీకరించి కోరికతో నీ కన్యనిమ్మని అడిగెను.
మౌనీ బభూవ నృపతీ కిచిన్నిర్వకుమక్షమః ।
ముని పునర్యయాచే తం కన్యాం దేహీతి మే నృప ॥
అథవా భస్మసాత్పర్వం కరిష్యామి క్షణేన చ ।
సర్వే బభూవురాచ్ఛన్నా గణాశ్చ తేజసా మునేః॥
రురోద రాజా నగణో దృష్ట్వా వృద్ధం జరాతురం ।
మహిష్యో రురుదుస్సర్వా ఇతి కర్తవ్యమక్షమాః॥
మూర్ఫాం ప్రాప మహారాజ్ఞీ కన్యామాతా శుచాకులా ।
పండితో నీతిశాస్త్రజ్ఞో బోధయామాన భూమిపం ॥
మహిషీం చ నృవసుతాన్ కన్యకా వీతిముత్తమాం।
ఏమి చెప్పుటకు శక్తి లేక రాజు మౌనముగా నుండిను, ముని మరల “రాజా! నీ కన్యను నాకిమ్ము” అని మరల యాచించెను. “లేనిచో క్షణములో నీ సర్వస్వమును భస్మముగా జేయుదును!” అనునంతలోనే ఆ ముని తేజస్సుతో అక్కడి వారందరు ఆచ్ఛాదింపబడిరి (తేజస్సు అందరిని కప్పివేసెను) రాజు ముసలితనమాక్రమించిన మునిని చూచి హాయని రోదించెను. అతని పట్టపురాణులందరు చేయదగినదిదియనీ సిశ్చయించుకొనలేక దుఃఖించిరి. మహారాణి మూర్చిల్లెను. కన్య తల్లి కనుక దుఃఖముతో వ్యాకులము పొంది అట్లయ్యెను. అప్పుడు పురోహితుడు పండితుడు నీతిశాస్త్రవేత్త కనుక రాజుకు రాజభార్యకు రాజపుత్రులకు ఉత్తమమైన కన్యకా నీతిని గూర్చి బోధ చేసెను.
అద్యవాపి దీనాంతే వాదాతవ్యా కన్యకా నృప ॥
పరాయ విప్రాదన్య స్మై కస్మై వా దాతుమర్హసి ।
సత్పాత్రం బ్రాహ్మణాదన్యం న పశ్యామి జగత్రయే ॥
నుతాం దత్వా చ మునయే రక్షస్వ సర్వసంపదం ।
రాజకన్యా విమిత్తేన సర్వసంపత్ర్పణశ్యతి ॥
సర్వం రక్షతి తత్త్యక్వా వినా తం శరణాగతం ।
రాజా ప్రాజ్ఞ వచః శ్రుత్వా వీలవ్య చ ముహుర్ముహః ॥
కన్యాం సాలంకృతాం కృత్వా మునీంద్రాయ దదౌ కిల ।
కాంతాం గృహీత్వా స ముని ముదిత స్వాలయం యయా ॥
రాజా నర్వాన్ పరిత్యజ్య జగామ తపసే శుచా ।
భర్తుశ్చ దుహితుః శోజాతి ప్రాణాంస్తత్యాజ సుందరీ॥
వుత్రా పౌత్రాశ్చా భృత్యాశ్చ మూర్ఫాం ప్రాపురృవం వినా ।
అనరణ్య స్తపస్త్వచింతయన్ రాధికేశ్వరం॥
గోలోక నాథం నం సేవ్య గోలోకంచ జగామహా ।
బభూవ కీర్తిమాన్ రాజా జ్యేష్టపుత్రో నృపస్యచ॥
పుత్ర వత్సాలయామాస ప్రజాః సర్వా మహీతలే ॥
“రాజా! ఈనాడు గాని ఇంకొక దినమందు గాని బిడ్డ పరునికీ ఈయదగినదే కదా! ఈ బ్రాహ్మణునికి కాక ఎవనికో ఒక వరునికితవు కదా! ముల్లోకములలో ఈ బ్రాహ్మణుని కన్న కన్యనీయదగిన సత్పాత్రుడు నాకు కన్పించుట లేదు. ఈ రాజకన్య మూలమున నీ సర్వసంపదలు నశించిపోగలవు. కనుక ఈ మునికి నీ పుత్రికనిచ్చి సర్వసంపదలను కాపాడుకొనుము. ఒక్క శరణు పొందిన వారిని తప్ప ఇతరము దేనినైనను త్యజించి మిగిలిన సర్వమును లోకమున కాపాడుకోవలెను”, ఇట్టి పండిత వాక్యమును రాజు విని మాటి మాటికి దుఃఖించి చివరికి కన్యనలంకరించి ఆ మునీంద్రునికి దానమొనర్చెను. ముని తన భర్యను గ్రహించి సంతోషముతో తన ఆశ్రమమునకు పోయెను. రాజు దుఃఖముతో అందరిని వదిలి తపస్సు కేగిను. భర్తయొక్కయు కూతురు యొక్క వియోగముతో రాజు భార్య ప్రాణములు విడిచెను. రాజు లేనందున దు:ఖములతో పుత్రులు పౌత్రులు భృత్యులు అందరు మూర్ఛిల్లిరి. అనరణ్యుడు రాధినాధుని ధ్యానించుచు తపస్సు చేసి గోలోకమునకు పోయెను. (ముక్తుడయ్యెను). రాజు యొక్క జ్యేష్ఠపుత్రుడు మంచి కీర్తి శాలియై భూమండలమందలి ప్రజలను పుత్రులవలె పరిపాలించెను.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే నారాయణ నారదసంవాదే రాధాకృష్ణ సంవాదే ఏకచత్వారింశో ధ్యాయః॥
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన ప్రస్తుతము రాధాకృష్ణ సంవాదరూపమున నున్న నలుబది ఒకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 41 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Proceeding to the royal arena where Kaṃsa's grand sacrificial bow was guarded by heavily armed soldiers, Kṛshṇa casually approached the bow, lifted it effortlessly with a single hand like a toy, strung it with ease, and snapped it in half with a thunderous crack that shook the entire city of Mathura. Alarmed by the tremendous sound, royal guards rushed forward to attack, but Kṛshṇa and Balarāma struck them down with pieces of the broken bow before calmly returning to their quarters to prepare for the final showdown with the tyrant king.