బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

99 - అధ్యాయము

మూ శ్రీనారాయణ ఉవాచ :

ఏతస్మిన్నంతరేగర్గో వాసుదేవాశ్రమంతుయయౌ

దండీఛత్రీచజటిలో దీప్తశ్చ బ్రహ్మతేజసా

శుక్లయజ్ఞోపవీతీచ తపస్వీ సంయతః సదా

శుక్లదంతః శుక్లవాసాః యదోః కులపురోహితః

తం దృష్ట్వా సహసోత్థాయ దేవకీ ప్రణనామచ

వాసుదేవశ్చభక్త్యాచ రత్నసింహాసనం దదౌ

మధుపర్కం కామధేనుం వహ్ని శుద్ధాంశుకం తథా

దత్వాగంధం పుష్పమాల్యం పూజయామాస భక్తితః

మిష్టాన్నం పరమాన్నంచ పిష్టకం మధురం మధు

భోజయామాసయత్నేన తాంబూలం వాసితందదౌ

ప్రణమ్య కృష్ణం మనసా సబలంతం విలోక్యచ

ఉవాచ వసుదేవంచ దేవకీంచ పతివ్రతాం

గర్గ ఉవాచ :

వసుదేవ నిబోధేదం సబలం పశ్యపుత్రకం

ఉపనీతో చితం శుద్ధం వయసా సాంప్రతం వరం

వసుదేవ ఉవాచ :

శుభక్షణం కురుగురోయదూనాం పూజ్య దైవత

ఉపనీతోచితం శుద్ధం ప్రశస్యంచ సతామపి II

గర్గ ఉవాచ :

సర్వేభ్యోబాంధవేభ్యో పిదేహ్యా మంత్రణపత్రీకాం

సంభారం కురుయత్నేన వసుదేవ వసూపమ

పరశ్వః శుభమేవాస్తి చోపనేతు మహార సి

దినం సతామహిమతం విశుద్ధం చంద్రతారయో:

గర్గస్యవచనం శ్రుత్వా వసుదేవో వసూపమః

ప్రస్థాపయామాస సర్వాన్ బంధూన్ మంగళపత్రికాం

ఘృతకుల్యం దుగ్దకుల్యాందధికుల్యాం మనోహరాం

మధుకుల్యాం గుడకుల్యాం ప్రచకార సమన్వితః

రాశిం నానోపహారాణాం మణిరత్నం సువర్ణకం

నానాలంకార వస్త్రంచ ముక్తామాణిక్యహారకం

శ్రీకృష్ణో దేవవర్గాంశ్చ మునీంద్ర సిద్ధ పుంగవాన్

సస్మార మనసాభక్త్యా భక్తశ్చ భక్తవత్సలః

శుభేదినేచ సంప్రాప్తి తేచసర్వే సమాయయుః !

మునీంద్రాబాంధవా దేవా రాజానో బహుశస్తథా

అను!! శ్రీనారాయణుడిట్లన్నాడు :

ఇంతలో వసుదేవుని ఆశ్రమానికి గరుడొచ్చాడు. చేతిలో దండం, ఛత్రము, జడలు కలిగి ఉన్నాడు. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. (1) తెల్లని యజ్ఞోపవీతం ఉంది. తపస్వి. ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటాడు. తెల్లని పలువరుస, తెల్లని వస్త్రము ఉన్నాయి. యాదవులకు కులపురోహితుడు. (2) ఆతనిని చూచి త్వరగా లేచి దేవకి నమస్కరించింది. వసుదేవుడు భక్తితో రత్న సింహాసనాన్ని ఇచ్చాడు. (3) మధుపర్కమును కామధేనువును, వహ్నిశుద్దమైన వస్త్రాన్ని ఇచ్చాడు. గంధం, పూలమాలలు ఇచ్చి భక్తితో పూజించాడు. (4) మిష్టాన్నమును (తీపి) పరమాన్నమును, పిండి వంటలు, మధురము, తేనె ఇచ్చాడు. వీటితో ప్రయత్నపూర్వకంగా భుజింపచేశాడు. తాంబూలము, సుగంధములు ఇచ్చాడు. (5) మనస్సులో కృష్ణునికి నమస్కరించి, తన వారితో కూడిన అతనిని చూచి వసుదేవునితో, పతివ్రతయైన దేవకీతో ఇట్లన్నాడు. (6) గర్గుడిట్లా - వసుదేవ! ఇది తెలుసుకో. బలరామునితో కూడా పుత్రుని చూడు. ఉపనయనానికి తగినాడు శుదుడు. ఇప్పుడు ఈ వయస్సుతో (ఉపనయనానికి) ఉత్తముడు (7) వసుదేవుడిట్లన్నాడు - యదువంశము వారికి పూజ్యమైన దైవమా! ఓగురు! మంచికాలాన్ని చూచి చెప్పు. ఉపనయనానికి తగినాడు శుద్ధుడు సజ్జనులకు ప్రశంసించతగినవాడు.(8) గర్గుడిట్లన్నాడు -బాంధవులందరికి ఆహ్వానపత్రికలను పంపు. ఓ వసుదేవ! వసువు వంటివాడ! ప్రయత్నించి సామగ్రిని కూర్చుకో. (9) ఎల్లుండి మంచిరోజే ఉంది. ఆ రోజు ఉపనయనం చేయొచ్చు. ఆరోజు సజ్జనులకు (పెద్దలకు) ఇష్టమైందే శుద్ధమైనది. చంద్రబలం / తారాబలం బాగుంది. (10) గుర్గుని మాటను విని వసువు వంటివాడైన వసుదేవుడు బంధువులందరికి శుభపత్రికను పంపించాడు. (11) నేతి కాలువలు, పాల కాలువలు, పెరుగు కాలువలు అందంగా కూర్చారు (అతిగా అని). మధు, బెల్లము కాలువలు కూడా ప్రయత్నపూర్వకంగా ఏర్పరిచాడు. (12) అనేక ఉపహారముల రాశిని, మణులు రత్నములు బంగారము, రకరకాల అలంకార సామగ్రి వస్త్రములు, ముత్యములు మాణిక్యములు వజ్రములు ఏర్పరచారు. (13) శ్రీకృష్ణుడు దేవతల వర్గాన్ని మునీంద్రులను సిద్ధశ్రేష్టులను భక్తితో మనస్సులో స్మరించాడు. భక్తుడు భక్తవత్సలుడాయన. (14) మంచిరోజురాగా వారంతా వచ్చారు. మునీంద్రులు, బాంధవులు, దేవతలు, రాజులు చాలా మంది వచ్చారు అట్లాగే.(15)

మా దేవకన్యానాగకన్యారాజకన్యాశ్చ సర్వశః

విద్యాధర్యశ్చ గంధర్వాశ్చాయయుః వాద్యభాండకాః

బ్రాహ్మణా భిక్షుకా భట్టా యతయో బ్రహ్మచారిణః

సంన్యాసినశ్చావధూతాః యోగినశ్చ సమాయయుః

స్త్రీ బాంధవాః స్వబంధూనాం వర్గా మాతామహస్యచ

బంధూనాం బాంధవాస్సర్వే స్వాయయుః శుభకర్మణి

భీష్మోద్రోణశ్చ కర్ణశ్చాష్యశ్వత్థామా కృపోద్విజః

సపుత్రో ధృతరాష్ట్రశ్చ సభార్యశ్చ సమాయణా

కుంతీసపుత్రా విధవా హర్షశోకసమాపుతా

నానాదేశోద్భవా యోగ్యా రాజానో రాజపుత్రకాః

అత్రిర్వసిద్ధశ్చ్యవనో భరద్వాజో మహాతపాః

యాజ్ఞవల్క్యశ్చ భీమశ్చ గాధ్యోగర్లో మహాతపాః

వత్సః సపుత్రశ్చ ధర్మోజైగీషవ్యః పరాశరః

పులహశ్చపులస్త్యశ్చా వ్యగస్త్యశ్యాపిసౌభరిః

సనకశ్చ సనందశ్చతృతీయశ్చ సనాతనః

సనత్కుమారోభగవాన్వోడు పంచశిఖస్తథా

దుర్వాసాశ్చాంగిరా వ్యాసో వ్యాసపుత్రః శుకస్తథా

కుశికః కౌశికోరామ ఋష్యశృంగో విభాండకః

శృంగీచ వామదేవశ్చ గౌతమశ్చ గుణార్ణవః

క్రతుర్యతి శ్చారుణిశ్చ శుక్రాచార్యో బృహస్పతిః

అష్టావక్రోవామనశ్చ వాల్మీకి పారిభద్రకః

పైలో వైశంపాయనశ్చ ప్రచేతాః పురుజిత్తథా

భృగుర్మరీచి ర్మధుజీత్కశ్యపశ్చ ప్రజాపతిః

అదితిర్దేవమాతాచ దితిరైత్య ప్రసూస్తథా

సుమంతుశ్చ సుభానుశ్చ ఏకః కాత్యాయన స్తథా

మార్కండేయోలో మశశ్చ కపిలశ్చ పరాశరః

పాణిని: పారియాత్రశ్చ పారిభద్రశ్చ పుంగవః

సంవర్తశ్చా ప్యుతథ్యశ్చ నరోహంచాపి నారద

విశ్వామిత్రః శతానందో జాబాలి సైతిలస్తథా

సాందీపినిశ్చ బ్రహ్మాంశో యోగినాం జ్ఞానినాం గురుః

ఉపమన్యుః గౌరముఖో మైత్రేయశ్చ శ్రుతశ్రవాః

కఠః కచశ్చ కరఖోభరద్వాజశ్చ ధర్మవిత్

దేవకన్యలు, నాగకన్యలు, అందరు రాజకన్యలు, విద్యాధరులు,(స్త్రీలు) గంధర్వులు, వాద్య భాండకులు వచ్చారు.(సంగీత సాధనం తబలవలె) (16) బ్రాహ్మణులు భిక్షుకులు, భట్టులు, యతులు, బ్రహ్మచారులు, సంన్యాసులు, అవధూతలు యోగులు వచ్చారు. (17) బంధువులైన స్త్రీలు, తమ బంధువర్గము, మాతామహుని వర్గం వారు, బంధువుల బంధువులు అందరు ఆ శుభకర్మకై వచ్చారు. (18) భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, ద్విజుడైన కృపుడు, పుత్రులతో కూడా ధృతరాష్ట్రుడు భార్యతో కూడా వచ్చాడు. (19) విధవయైన కుంతి కొడుకులతో ఆనందము దుఃఖము కలగలిసిన మనస్సుతో వచ్చింది. అనేక దేశములందు పుట్టిన యోగ్యులైన రాజులు, రాజపుత్రులు వచ్చారు. (20) అత్రి, వశిష్టుడు, చ్యవనుడు, మహాతపస్సంపన్నుడు భరద్వాజుడు, యాజ్ఞవల్క్యుడు, భీముడు, గార్యుడు, మహాతపస్సంపన్నుడు గర్గుడు వచ్చారు. (21) వత్సుడు, పుత్రులతో కూడా ధర్ముడు (జయించే స్వభావం గల) సమర్థుడైన పరాశరుడు, పులహుడు, పులస్త్యుడు,ఆగస్త్యుడు, సౌభరి (22) సనక, సనందసనాతనులు, సనత్కుమారుడు, భగవంతుడైన వోడుడు, పంచ శిఖుడు (23) దుర్వాసుడు, ఆంగిరసులు, వ్యాసుడు, వ్యాసపుత్రుడైన శుకుడు, కుశికుడు, కౌశికరాముడు, ఋష్య శృంగుడు, విభాండకుడు (24) శృంగి, వామదేవుడు, గౌతముడు, గుణసముద్రుడు, క్రతువు, యతి, ఆరుణి, శుక్రాచార్యుడు, బృహస్పతి (25) అష్టావక్రుడు, వామనుడు, వాల్మీకి, పారిభద్రకుడు, పైలుడు, వైశంపాయనుడు, ప్రచేతుడు, పురుజిత్తు (26) భృగువు, మరీచి, మధుజిత్తు, కశ్యపుడు (ఐన) ప్రజాపతి, దేవమాత అదితి, దైత్యుల తల్లి దితి (27) సుమంతు, సుభానువు, ఒక కాత్యాయనుడు, మార్కండేయుడు, లోమశుడు, కపిలుడు, పరాశరుడు, (28) పాణిని, పారియాత్రుడు, పురుషశ్రేష్ఠుడు పారిభద్రుడు, సంవర్తుడు, ఉతథ్యుడు నరుడనైన నేను, ఓ నారద! అక్కడికి వచ్చాము. (29) విశ్వామిత్రుడు, శతానందుడు, జాబాలి, తైతిలుడు, బ్రహ్మాంశ యోగులకు జ్ఞానులకు గురువైన సాందీపిని, (30) ఉపమన్యువు, గౌరముఖుడు, మైత్రేయుడు, శ్రుతశ్రవుడు, కఠుడు, కచుడు, కరఖుడు, ధర్మవేత్త భరద్వాజుడు వచ్చారు.(31)

మూII సశిష్యా మునయః సర్వే వసుదేవాశ్రమంయయుః

వసుదేవశ్చ తాన్ దృష్ట్వా వవందే దండవద్భువి అథాస్మిన్నంతరే బ్రహ్మా సస్మితో హంసవాహనః

రత్ననిర్మాణ యానేన పార్వత్యాసహ శంకరః

నందీస్వయం మహాకాలో వీరభద్రః సుభద్రకః

మణిభద్రః పారిభద్రః కార్తికేయోగణేశ్వరః

గజేంద్రేణమ హేంద్రశ్చ ధర్మశ్చంద్రో రవిస్తథా

కుబేరో వరుణశ్చైవ పవనోవహ్నిరేవచ

యమః సంయమినీనాథ్ జయంతో నలకూబరః

సర్వేగ్రహాశ్చ వసవోరుద్రాశ్చసగణాస్తథా

ఆదిత్యాశ్చ తథాశేషో నానాదేవాః సమాయయుః

వసుదేవశ్చ భక్త్యాచ వవందే శిరసాభువి

తుష్టావ పరయాభక్త్యాదేవేంద్రాంశ్చ తథాసురాన్

భక్తినమ్రాత్మమూర్ధాచ పులకాంచిత విగ్రహః

వసుదేవ ఉవాచ :

పరం బ్రహ్మ పరంధామ పరమేశః పరాత్పరః

స్వయం విధాతా మద్గేహే జగతాం పరిపాలకః

వేదానాంజనః స్రష్టా సృష్టి హేతుః సనాతనః

సురాణాంచ మునీంద్రాణాం సిద్దేంద్రాణాం గురోర్దురుః

స్వప్నేయత్పాదపద్మంచ క్షణంద్రష్టుం సుదుర్లభం

శివస్మరణమాత్రేణ సర్వానిష్టాః పలాయితాః

సర్వసంకటముత్తీర్య కల్యాణం లభతేనరః

సర్వాగ్రపూజనం యస్యదేవానామగ్రణీః పరః

ఘటేషు మంగలం మంత్రైః భక్త్యాచావాహనేనచ

స్వయం గణేశో భగవాన్ సాక్షాద్విఘ్నవినాశకః

కార్తికేయశ్చ భగవాన్ దేవాదీనాంచ పూజితః

దేవానాం ప్రవరా పూజ్యా మహాలక్ష్మీః పరాత్పరా

మథే హే పార్వతీ మాతా జగతామాదిరూపిణీ

సర్వశక్తి స్వరూపాచ మూలప్రకృతిరీశ్వరీ

శిష్యులతో కూడినమునులందరు వసుదేవుని ఆశ్రమానికి వచ్చారు. వసుదేవుడు వారిని చూచి భూమి పై దండము వలె పరుండి నమస్కరించాడు. (32) ఇంతలో బ్రహ్మ నవ్వుతూ హంసవాహనము పైన, రత్నములతో నిర్మించిన పల్లకి పై పార్వతితో కూడి శంకరుడు, వచ్చారు. (33) నంది, మహాకాలుడు, వీరభద్రుడు, సుభద్రకుడు, మణిభద్రుడు,పారిభద్రుడు, కార్తికేయుడు, గణేశ్వరుడు, (34) గజేంద్రుము పై మ హేంద్రుడు, ధర్ముడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, వరుణుడు, వాయువు, ఆగ్ని, (35) యముడు, సంయమినీనాథుడు, జయంతుడు, నలకూబరుడు, అన్ని గ్రహములు, వస్తువులు, రుద్రులు, వారి గణములు (36) ఆదిత్యులు, శేషుడు, రకరకాల దేవతలు అంతా వచ్చారు. వసుదేవుడు భక్తితో భూమి పై తలవంచి నమస్కరించాడు. (37) అధికమైనభక్తితో దేవేంద్రులను సురలను ఆనందపరిచాడు. భక్తితో తన తలను వంచి, శరీరమంతా పులకించగా ఆనందపరిచాడు. (38) వసుదేవుడు ఇట్లన్నాడు - పరమైనబ్రహ్మ పరమైనస్థానము, పరాత్పరుడైన పరమేశుడు, జగత్పరిపాలకుడు బ్రహ్మ నా ఇంటికి స్వయంగా వచ్చాడు. (39) ఆతడు వేదములకుస్రష్ట, జనకుడు, సృష్టి హేతువు, సనాతనుడు, సురలకు,మునీంద్రులకు సిద్దేంద్రులకు గురువులకు గురువు. (40) కలలో కూడా ఆతని పాదపద్మములను క్షణకాలము చూడగల్గుట చాలా దుర్లభము. శివుని స్మరించినంతనే అన్ని అనిష్టములు తొలగిపోతాయి. (41) అన్ని సంకటములను దాటి నరుడు శుభాన్ని పొందుతాడు. అందరికన్న ముందుగా ఆతనికి పూజజరుగుతుంది. ఆతడు దేవతలకు ముందుండేవాడు, పరుడు (42) ఘటములందు భక్తితో మంత్రములతో ఆవాహనతో శుభానిచ్చేగణేశుడు, స్వయంగా సాక్షాత్తూ విఘ్న వినాశకుడు భగవానుడు వచ్చాడు. (43) భగవానుడైన, దేవతలు మొదలగువారితో పూజింపబడే కార్తికేయుడు, దేవతలకు శ్రేష్ఠమైనది,పూజ్యురాలు, పరాత్పరమైన మహాలక్ష్మి వచ్చింది. (44) జగత్తులకు తొలి రూపిణియైన పార్వతీమాత నా ఇంట్లో ఉంది. ఆమె సర్వశక్తి స్వరూపురాలు, మూలప్రకృతి, ఈశ్వరి . (45)

మూII పరాపరాణాం పరమాపరబ్రహ్మ స్వరూపిణీ

యస్యాః పాదౌ సమారాధ్య వాంఛితం లభతే నరః

శరత్కాలేచ భక్త్యాచ సా సాక్షాన్మయ మందిరే !

సర్వదేవైశ్చ సహితా సగణా భక్తవత్సలా

కృపామయీచ కృపయాచావిర్భూతాచ భారతే

ధన్యోహం కృతకృత్యోహం సఫలం జీవితం మమ

ఆగతాసి యశోదుర్గే పరమాదాలచ మధృహం

ఏవం సర్వాశ్చ తుష్టావ క్రమేణచ పరస్పరం

సర్వాన్మునీంద్రాన్విప్రాంశ్చ గలే బద్దాంబి శుకంముదా

ప్రత్యేకం వాసయామాస రత్నసింహాసనే వరే

పూజయామాస విధి వత్రమేణచ పృథక్ పృథక్

ప్రత్యేకం వరయామాస బ్రహ్మాదీంశ్చ సురానపి

మునివర్గాన్ బ్రాహ్మణాంశ్చ భక్త్యా గర్గం పురోహితం

రత్నైః ప్రవాఖైః మణిభిః ముక్తామాణిక్య హీరకైః

భూషణైః వసనైశ్చైవ మాల్యైశ్చ గంధచందనైః

రత్నసింహాసనేరమ్యే సర్వేషాం మధ్యదేశత: .

గణేశం వరమాయాస పూజార్థం శుభకర్మణి

సప్త తీర్ధోదకేనైవ సువర్ణ కలశెనచ

పుష్పచందనయుక్తేన శీతేన వాసితేనచ

స్వర్గగంగా జలేనైవ పుష్కరోదకపుణ్యతః

పంచామృతేన శుద్ధీన పంచగవ్యన భక్తితః

హేరంబం స్నాపయామాస సముద్రోదేన మంత్రతః

వరయామాస మాల్యేన పారిజాతస్య నారద

రత్నేంద్ర భూషణేనైవ వహ్నిశుద్ధీన వాససా

గంధ చందన పుష్పైశ్చ రత్నమాల్యాంగులీయకం

తుష్టావ పార్వతీ పుత్రం సర్వ దేవాధిపం శుభం

విఘ్ననిఘ్నకరం శాంతం భగవంతం సనాతనం

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే భగదుపనయనే గణేశాభిషేకే నవనవతితమోధ్యాయః

అను పరాపరులకు, పరమమైనది, పరబ్రహ్మ స్వరూపిణి, ఆమె పాదములను ఆరాధించి నరుడు తన కోరికను పొందుతాడు. (46) శరత్కాలమందు భక్తితో పూజింపబడే ఆమె సాక్షాత్తుగా నా ఇంట్లో ఉంది. అందరు దేవతలతో కూడి గణములతో కూడి, భక్త వత్సలురాలైన ఆమె (47) దయగలది. కృపతో భారతదేశంలో అవతరించింది. నేను ధన్యుణ్ణి , కృతకృత్యు. నా బ్రతుకు సఫలము. (48) ఓదుర్గ! పరమాద్యవైన నీవు నా ఇంటి కొచ్చావుకనుక ధన్యుణ్ణి. క్రమంగా ఒకరొకరిని అందరినిసంతోషపరిచాడు వసుదేవుడు (49) మునీంద్రులందరిని వారి కంఠమందు తెల్లని వస్త్రాన్ని ఉంచి ఆనందంతో ఆనందింపచేశాడు. ఒక్కొక్కరిని శ్రేష్ఠమైన రత్న సింహాసనమందు కూర్చోబెట్టాడు. (50) క్రమంగా విడివిడిగా శాస్త్ర ప్రకారము పూజింపజేశాడు. ప్రత్యేకంగా బ్రహ్మాది సురలను వరించాడు (ఎన్నిక చేశాడు). (51) మునివర్గమును బ్రాహ్మణులను భక్తితో పురోహితుడైన గరునిరత్నములతో, పగడములు, మణులు, ముత్యములు, మాణిక్యములు, వజ్రములు, (52) భూషణములు, వస్త్రములు, మాలలు, గంధ చందనములతో పూజించాడు. అందరిమధ్య ప్రదేశంలో రమ్యమైన రత్నసింహాసనమందు (53) శుభకర్మలో పూజకొరకు గణేశుని కూర్చో పెట్టాడు (ఎన్నుకున్నాడు) . బంగారు పాత్రలలో సప్త (సముద్రముల) తీర్థముతో (54) చల్లని, వాసనగల పుష్ప చందనములుగల ఆకాశగంగ జలములతో, పుణ్యప్రదమైన పుష్కర క్షేత్ర ఉదకముతో (55) శుద్ధమైన పంచామృతము, పంచగవ్యముతో, భక్తిగా హేరంబునకు స్నానం చేయించాడు. మంత్రపూర్వకముగా సముద్రపు నీటితో స్నానం చేయించాడు. (56) ఓ నారద! పారిజాత పూలమాలతో అలంకరించాడు. శ్రేష్ఠమైన రత్నభూషణములతో, వహ్ని శుద్ధమైన వస్త్రముతో (57) గంధము,చందనము పుష్పములతో, రత్నముల హారముతో, ఉంగరముతో శుభుడైన సర్వదేవతల కధిపతియైనగణపతిని ఆనందపరిచాడు. ఆతడు విఘ్ననాశకారి, శాంతుడు, భగవంతుడు సనాతనుడు (గణపతి). (58) అని

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ మందు ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాద మందు భగవంతుని ఉపయన మనేదానియందు గణేశ అభి షేకమనునది తొంబది తొమ్మిదవ అధ్యాయము.