మూII శ్రీనారాయణ ఉవాచ:
ఇతితే కథితంకించిత్ ఇంద్రస్య దర్పభంజనం ।
అపరం శ్రూయతాం బ్రహ్మన్ సావధానం నిగూఢకం ॥
సముద్ర మధనం కృత్వా పీత్వా మృతరసం పురా ।
నిర్జిత్యదైత్య సంఘాంశ్చ బహుదర్పో బభూవ హ ॥
తదా కృష్ణో బలిద్వారా శక్రదర్పం బభంజహ ।
భ్రష్టిశ్రీయో బభూవుస్తే దేవా ఇంద్రపురోగమాః ॥
తదా బృహస్పతేః స్తోత్రాదదితేశ్చ ప్రతేన తే ।
జాతశ్చ స్వాంశకలయాఽప్యదిత్యాం వామనో విభుః ॥
యాచ్ఞాం కృత్వా బలిం రాజ్యం కృపయా చ కృపానిధిః ।
తస్మై దదౌ మహేంద్రాయ దేవేభ్యశ్చాపి సంపదం ॥
బభూవ శక్రదర్పశ్చ పునః కల్పాంతరే పురా ।
విభుః దుర్వాససో ద్వారా జహార తచ్చ్రియం మునే ॥
పునర్దదౌ చ కృపయా కృపాలుర్భక్తవత్సలః ।
పునః శ్రీదుర్మదః సోఽపి జహార గౌతమ ప్రియాం ॥
తదా గౌతమశాపేన భంగాంగశ్చ బభూవసః ।
సంప్రాప యాతనా మింద్రః స్వాంగవేదనయాపురా ॥
ఉచ్చైస్తం జహసుర్ దృష్ట్వా ఋషయో మనవస్తథా ।
దేవాశ్చ లజ్జితా స్సర్వే మృతతుల్యో బృహస్పతిః ॥
తదా సహస్రవర్షం చతపస్తప్త్వారవేః పురా ।
రవేర్వరేణ శక్రః స సహస్రాక్షో బభూవహ ॥
కలంకరూపమింద్రస్య తచ్చక్షుర్నికరం పరం ।
యథాచంద్రౌ కలంకశ్చ తారకాహరణాదభూత్ ॥
నారద ఉవాచ :
బ్రహ్మన్ కేన ప్రకారేణ జహార గౌతమ ప్రియాం ।
మహాసతీమహల్యాంచ పూజ్యాం భువనపావనీం ॥
శ్రీనారాయణుడిట్లన్నాడు:
అని నీకు ఇంద్రదర్పభంజనమును గూర్చి కొంచెం చెప్పాను. ఓ బ్రహ్మన్! చాలా రహస్యమైన మరో దానిని చెబుతాను. విను,సావధానంగా. (1) ఇది వరలో సముద్ర మథనాన్ని చేసి అమృతరసాన్ని తాగి రాక్షసులను జయించి చాలా దర్పితుడైనాడు ఇంద్రుడు. (2) అప్పుడు కృష్ణుడు బలి ద్వారా ఇంద్రుని దర్పాన్ని భంజించాడు. ఇంద్రుడు మొదలుగా దేవతలంతా (సంపద) శ్రీలేనివారైనారు. (3) అప్పుడు బృహస్పతి స్తోత్రం వల్ల, అదితి వ్రతం వల్లనూ తన అంశకలతో ప్రభువు అదితి యందు వామనుడుగా జన్మించాడు. (4) బలిని రాజ్యము యాచించి, కృపతో, కృపానిధి, ఆ ఇంద్రునకిచ్చాడు, దేవతలకు సంపదనిచ్చాడు. (5) తిరిగి మరో కల్పమందు ఇదివరలో ఇంద్రునకు దర్పమేర్పడింది. విభువు దుర్వాసుని ద్వారా ఆతని సంపదనుహరించాడు, ఓ ముని! (6) కృపాళువు, భక్త వత్సలుడు కృపతో తిరిగి ఇచ్చాడు. తిరిగి సంపదతో మత్తేక్కిన ఆతడు గౌతముని ప్రియనుహరించాడు. (7) అప్పుడు గౌతమ శాపంతో ఆతడు అవయవ భంగము కలవాడైనాడు. తన అంగవేదనతో ఇంద్రుడు తనను పొందాడు. (8) అతనిని చూచి ఋషులు, మనువులు గట్టిగా నవ్వారు. దేవతలంతా సిగ్గుపడ్డారు. బృహస్పతి మృతతుల్యుడైనాడు.(9) అప్పుడే వేయి సంవత్సరాలు సూర్యుని ఎదుట తపమాచరించి, సూర్యుని వరంతో ఆ ఇంద్రుడు సహస్రాక్షుడైనాడు. (10) ఇంద్రునకు ఆకళ్ళ సమూహము తప్పకుండా కళంకరూపమే, చంద్రునకెట్లా కళంకము తారకాహరణం వల్ల ఐందో, అట్లా. (11) అప్పుడు నారదుడిట్లన్నాడు - ఓబ్రహ్మ గౌతముని ప్రియను, మహాసతిని, అహల్యను, పూజ్యను, భువనములను పవిత్రం చేసే దానిని ఇంద్రుడు ఏవిధంగా హరించాడు. (12)
మూ॥ శుద్దాశయం మహాభాగం నిర్మలాం కమలాకలాం ।
ఏతద్వేదితుమిచ్ఛామి వదవేదవిదాంవర ॥
శ్రీనారాయణఉవాచ:
పుష్కరే తీర్థయాత్రాయాం సూర్యపర్వణి నారద ।
తత్రాగతామహల్యాంచ దదర్శ పాకశాసనః ॥
సుస్మితాం సుదతీం శాంతాంపీ నశ్రోణిపయోధరాం ।
మూర్చామవాపచేంద్రశ్చ దృష్టిమాత్రేణ తత్క్షణాత్ ॥
అధాపరదినే తాంచ దృష్ట్వా మందాకినీతటే ।
ఏకాకినీం సుస్మితాంచ సాంతీం నగ్నాం సలజ్జితాం ॥
దృష్ట్వా శ్రేణిం స్తనయుగమతీవ విపులం హరిః ।
మూర్ఛామవాప కామార్తో జహార చేతనాం పునః ॥
క్షణేన చేతనాం ప్రాప్య గత్వా కామీ తదంతికం ।
ఉవాచ శ్లక్ణయావాచా వినయేన పతివ్రతాం ॥
మహేంద్రఉవాచ:
అహో గుణమహోరూప మహో కింవా నవం వయః ।
అహో కింవా ముఖ శ్రీ స్తే శరచ్చంద్రం వినిందతి ॥
అహో కటాక్షం కుటిలం పుంసాం చిత్తవికర్షణం ।
కిమహో లోచనం పద్మప్రభామోచనమీప్సితం ॥
గమనం రమణీయంచ గజ ఖంజనభంజనం ।
అహో వాక్యంతు మధురం పీయూషాదపి దుర్లభం ॥
కిమహో విపుల శ్రోణీ కామాధారా మనోహరా ।
కామదా కాముకాయైవ మునిమానస మోహినీ ॥
అతీవ కఠినా పీనా రంభాస్తంబవిడంబితా ।
అహో నితంబయుగలం వర్తులం చంద్రబింబవత్ ॥
శ్రీయుక్తం శ్రీఫలయుగతుల్యం తే స్తనయుగ్మకం ।
అత్యున్నతం సుకఠినం త్రైలోక్యచిత్తమోహనం ॥
అహో కింవాతపస్తే పే గౌతమశ్చ తపోధనః ।
సంప్రాప యత్ఫలేనైవ సుదతీం సుందరీం వరాం ॥
నిషేవ్య ప్రకృతిం దుర్గాం విష్ణుమాయాం సనాతనీం ।
లక్ష్మీంచ లక్ష్మీసదృశీం తపసా ప్రాప్యపద్మినీం ॥
సుకోమలాం సువదనాం లలనాం నలినాననాం ।
శుద్ధాంచ సుదతీం శ్యామాం న్యగ్రోధదలమధ్యమాం ॥
త్వత్పాలనంచజానామి కామశాస్త్ర విచక్షణః ।
కామోవాకాముకశ్చంద్రః కింత్వాంజానాతి గౌతమః ॥
మాంప్రశంసంతి నిత్యంతే కామశాస్త్ర విచక్షణాః ।
ఉర్వశ్యాద్యాశ్చాప్సరసో మాం ప్రశంసంతి సంతతం ॥
దాసీం కృత్వాచ దాస్యామి శచీం తుభ్యం వరాననే ।
త్రైలోక్య లక్ష్మీం విపులాం గృహాణ త్యజ గౌతమం ॥
అనభిజ్ఞం కామశాస్త్రే దుర్బలంచ తపస్వినం ।
అవ్యవహార్యం నిష్కామం నారాయణ పరాయణం ॥
అవిదగ్ధో విధాతాచ యోజయామాస యోఽక్షమం ।
ఈదృశీం కాముకీం రమ్యాంద దాతిచ తపస్వినే ॥
ఇత్యుక్త్వా కాముకః శక్రః పపాత చరణే ముదా ।
తమువాచ మహాసాధ్వీం వేదోక్తంచ యథోచితం ॥
అని॥ శుద్ధమైన ఆశయము గలది, అదృష్టశాలిని, నిర్మలమైనది, లక్ష్మీకళ గలది, అట్టి ఆమెను ఎట్లా హరించాడు దాన్ని తెలుసుకోదలచాను, ఓ వేదవిదులలో శ్రేష్ఠుడ! (13) శ్రీనారాయణుడిట్లన్నాడు - సూర్య పర్వమందు, పుష్కర తీర్థయాత్రయందు, ఓ నారద! అక్కడికి వచ్చిన అహల్యను ఇంద్రుడు చూచాడు. (14) చక్కని చిరునవ్వుగలది, మంచి పలుపరుసగలది, శాంతురాలు, బలసిన పిరుదులు, రొమ్ములుగల దానిని చూడటంతోనే ఇంద్రుడు ఆక్షణంలోనే మూర్చనందాడు. (15) అటుతరువాత మరుసటి రోజు మందాకిని ఒడ్డుయందు ఆమెను చూచాడు. ఒంటరిగా ఉంది. చక్కని నవ్వుగలది. స్నానం చేస్తోంది. నగ్నంగా ఉంది. సిగ్గుతో ఉంది. (16) మిక్కిలి విశాలమైన ఆమె పిరుదులను స్తనయుగమును చూచి ఇంద్రుడు కామారుడై మూర్చనందాడు. తిరిగి మేల్కొన్నాడు. (17) క్షణంలో చైతన్యాన్ని పొంది కాముకుడు ఆతడు, ఆమె దగ్గరకు వెళ్ళి ఆ పతివ్రతతో, వినయంగా, మృదువైన మాటలతో ఇట్లన్నాడు. (18) మ హేంద్రుడిట్లన్నాడు - ఏం గుణము, ఏం రూపము, ఓహో ఏం కొత్త వయస్సు, ఓహో ఏమి ముఖకాంతి నీది. శరత్కాల చంద్రుణ్ణి తిరస్కరిస్తోంది. (19) ఏం ఓరచూపులు, మగవాళ్ళ మనస్సును హరించేవి. ఓహో, ఏం కళ్ళు, పద్మముల కాంతిని దొంగిలించేవి, కోరతగినవి. (20) నడక ఎంత అందంగా ఉంది, ఏనుగుకుంటి నడకను భంజించేది. ఓహో మాట ఎంత మధురము, అమృతం కూడా అంతతీయగా ఉండదు. (21) ఓహో! విపులమైన పిరుదు ప్రదేశం, కామునకు ఆధారము, మనోహరమైంది. కాముకునకే (మన్మథునకే) కామాన్ని కల్గించేది, మునుల మనస్సును మోహింపచేసేది (22) మిక్కిలి. కఠినమైనవి, బలసినవి, అరటిస్తంభములను మోసగించేవి (మిన్న అని) ఏమి ఆ పిరుదుల జంట, గుండ్రంగా చంద్ర బింబంలాగున్నాయి. (23) సంపద (శోభ) గలిగినవి, మారేడు పండ్ల జంటలాగున్నాయి నీ రొమ్ముల జంట. మిక్కిలి ఎత్తుగా, మిక్కిలికఠినంగా, ముల్లోకముల వారి చిత్రాన్ని మోహింపచేస్తున్నాయి. (24) తపోధనుడైన గౌతముడు ఏం తపంచేశాడో కాని, ఆఫలితంతోనే సుదతి, సుందరి, వరురాలవైన నిన్ను పొందాడు. (25) దుర్గను ప్రకృతిని, సనాతనియైన విష్ణుమాయను సేవించి, సంపద కలిగిన, లక్ష్మి సదృశమైన, పద్మినిని (లక్ష్మి) తపస్సుతో పొంది, (26) మిక్కిలి కోమలమైన, మంచి ముఖముగల, నళిన (తామరలే) ములే ఆననముగాగల, ఆమెను సేవించి, శుద్ధురాలు, మంచి పలువరుస గలది, శ్యామల (రంగు)మైనది, మర్రిదళము యొక్క మధ్యభాగము వంటి మధ్యముగల, పద్మినిని సేవించి గౌతముడు నిన్ను పొంది ఉండవచ్చు. (27) నేను కామశాస్త్ర విచక్షణుడను, నిన్ను పాలించటం నాకు తెలుసు. కాముడు కాని, కాముకుడైన చంద్రుడు కాని, గౌతముడు కాని నిన్ను పాలించటం ఎరుగరు. (28)కామశాస్త్ర విచక్షుణులైన వారు నన్ను ఎప్పుడూ ప్రశంసిస్తారు. ఊర్వశి మొదలుగా అప్సరసలు నన్ను ఎల్లప్పుడూ ప్రశంసిస్తున్నారు. (29) ఓ వరానన! శచిని నీకు దాసిగా చేసి ఇస్తాను. విస్తారమైన త్రైలోక్య లక్ష్మిని గ్రహించి గౌతముని విడిచి పెట్టు (30) ఆతడు ఏమి తెలియనివాడు, కామశాస్త్రమందు దుర్బలుడు, తపస్వి. వ్యవహారము తెలియనివాడు (పని), నిష్కాముడు, నారాయణ (ధ్యాన) పరుడు. (31) నేర్పులేనివాడు (చొరవలేదు), అసమర్థుని బ్రహ్మ నీకు తోడు చేశాడు. ఇటువంటి, కోరికగల రమ్యమైన దానిని తపస్వికి ఇచ్చాడు (32) అని పలికి కాముకుడు (ఇచ్చ) శక్రుడు ఆనందంతో ఆమె పాదముల పై పడినాడు. మహాసాధ్వియైన ఆమె వేదంలో చెప్పినట్లుగా, తగిన విధంగా ఆతనితో ఇట్లా అంది.
మూ!! అహల్యోవాచ:
అభాగ్యాద్భ్రహ్మణశ్చాపి మరీచేశ్చ తపస్వినః ।
అభాగ్యాత్కశ్యపస్యాపి త్వం పుత్రః పాపమానసః ॥
కిం తజ్జపేన తపసా మౌనేన చ వ్రతేనచ ।
సురార్చనేన తీర్థన సీభిర్యస్య మనోహృతం ॥
స్త్రీరూపం నిర్మితం సృష్టౌ మోహాయ కామినాం మనః ।
అన్యథా న భవేత్సృష్టిః స్రష్ట్రా తేన పురాజ్ఞయా ॥
సర్వం మాయాకరండశ్చ ధర్మమార్గార్గలం నృణాం ।
వ్యవధానంచ తపసాం దోషాణా మాశ్రమం పరం ॥
కర్మబంధనిబంధానాం నిగడం కఠినం స్మృతం ।
ప్రదీపరూపం కీటానాం మీనానాం బడిశం యథా ॥
విషకుంభం దుగ్ధముఖం ఆరంభే మధురోపమం ।
పరిణామే దుఃఖ బీజం సోపానం నరకస్యచ ॥
ఋషయః సనకాద్యాశ్చ వోద్వాహం చక్రురీప్సితం ।
పరస్త్రీపు మనోయేషాం తేషాం సర్వంచ నిష్ఫలం ॥
పరస్త్రీ సేవనం శక్ర ఇహైవాత్యయశస్కరం ।
పరత్ర నరకం ఘోరం దదాతి కాముకాయ చ ॥
ఇత్యుక్త్వాచ మహాసాధ్వీ విహాయ తంచ కాముకం ।
ప్రయయౌ స్వగృహం మార్గం గృహిణీ గౌతమస్యచ ॥
తత్సర్వం కథయామాస గౌతమాయ తపస్వినే ।
తస్థౌ ప్రహస్య సమునిర్మహేంద్రంచ వినింద్యచ ॥
ఏకదా గౌతమః శీఘ్రం జగామ శంకరాలయం ।
శక్రో గౌతమరూపేణతాం సంభోగం చకార సః ॥
సర్వం జ్ఞాత్వాచసర్వజ్ఞః స్వయం మందిరమాయయా ।
నిర్గచ్ఛంతం మ హేంద్రంచ దదర్శ మునిపుంగవః ॥
నగ్నామహల్యాం రహసి పీన శ్రోణి పయోధరాం ।
మునిఃశశాప శక్రంచ భగాంగశ్చ భవేతిచ ॥
కోపాచ్చచాప పత్నీం చ రుదంతీం భయవిహ్వలాం ।
త్వంచ పాషాణ రూపాచ మహారణ్యే భవేతిచ॥
యయౌచ స్వగృహం శక్రో లజ్జైకతానమానసః ।
ఉవాచ మధురం భీతా స్వామినం శోకకర్షితం ॥
అహల్యోవాచ:
మాంచ దాసీంచ నిర్దోషాం కథం త్యజసి ధార్మిక ।
త్వంచవేద విదాంశ్రేష్టో విచారం కురు ధర్మతః ॥
అహల్య ఇట్లా అంది - బ్రహ్మయొక్క అభాగ్యం వల్ల, తపస్వియైన మరీచి యొక్క అభాగ్యం వల్ల కశ్యపుని యొక్క దురదృష్టం వల్ల నీలాంటి పుత్రుడు, పాపబుద్దిగలవాడు (మానసుడు) పుట్టాడు. (34) స్త్రీలతో హరింపబడిన మనస్సుగలవాని జపము, తపము, మౌనము, వ్రతము, దేవపూజ, తీర్థగమనము అన్నీ వ్యర్థము. (35) కాములమనస్సును మోహింపచేసే కొరకు సృష్టిలో స్త్రీ రూపమునిర్మింపబడింది. లేకపోతే సృష్టి జరిగేదికాదు. ఇదివరలో ఆజ్ఞతో ఆస్రష్ట సృజించాడు. (36) ఇది అంతామాయ అనే తేనె తుట్టె, నరులకు ధర్మమార్గమునకు గడియ. తపస్సుకు వ్యవధానము మిక్కిలిగా దోషములకు ఆశ్రయము. (37) కర్మ బంధమనే బందనమునకు కఠినమైన సంకెలఅని చెప్పారు. కీటములకు (ఉశిళ్ళు) దీపం వంటిది, చేపలకు వల వంటిది. ఇది నరులకు (38) పైకి పాలులోన విషం కుండ ఇది. తొలుత తేనెవలె తీయగా ఉంటుంది. పోను పోను దుఃఖమునకు బీజము, నరకమునకు సోపానము కూడా. (39) సనకాది ఋషులు ఇష్టమైన వివాహమును చేసుకోలేదు. పరస్త్రీలయందు మనసున్న వానికి అంతా నిష్పలము. (40) ఓ ఇంద్ర ! పరస్త్రీ సేవ ఇక్కడే మిక్కలి అపకీర్తికరమైనది.అక్కడ కాముకునకు ఘోరమైన నరకమును ఇస్తుంది (41) అని పలికి మహాసాధ్వి గౌతముని భార్య కాముకుని వదిలి త్వరగా తన ఇంటికి వెళ్ళింది. (42) తపస్వియైన గౌతమునకు అదంతాచెప్పింది. ఆముని నవ్వి, మహేంద్రుని నిందించి ఊరుకున్నాడు. (43) ఒకసారి, గౌతముడు శంకరుని ఇంటికి త్వరగా వెళ్ళాడు. ఆ ఇంద్రుడు గౌతమ రూపంతో ఆమెను సంభోగించాడు. (44) సర్వజ్ఞుడైన ఋషి, అంతా తెలుసుకుని స్వయంగా ఇంటికొచ్చాడు. ఆమునిపుంగవుడు బయటికి వెళ్తున్న ఇంద్రుని చూచాడు. (45) ఏకాంతంలో బలసిన పిరుదలు రొమ్ములుగల అహల్యను నగ్నంగా ఉండటం చూచాడు. ముని ఇంద్రుని, భగము అంగములందు కలవాడవుకా అని శపించాడు. (46) ఏడుస్తున్న భయంతో చలించుచున్న భార్యను కూడా కోపంతో శపించాడు మహారణ్యంలో నీవు పాషాణ రూపంతో ఉండు అని (47) శక్రుడు సిగ్గుతో ఏకమైన మనస్సుగలవాడై తన ఇంటికెళ్ళాడు. ఆమె భయంతో దుఃఖితుడైన స్వామితో మధురంగా యిట్లా అంది. (48) అహల్య వచనమిట్లా- నేను దాసిని, దోషం లేనిదాన్ని. ఓధార్మిక ! నన్నెట్లో విడిచి పెర్డావు. నీవు వేద విదులలో శ్రేష్ఠుడవు. ధర్మంగా ఆలోచించు. అని నీ లా
మూ॥ గౌతమఉవాచ:
త్వాంజానామి మనః శుద్ధాం సువ్రతాంచ పతివ్రతాం ।
త్యక్ష్యామిచ తథాపి త్వాం పరవీర్యంచ బిభ్రతీం॥
పరభోగ్యాచ యా కాంతా సాఽశుద్ధా సర్వకర్మసు ।
తాం యోగచ్ఛేన్మహామూడో నరకంతస్య కల్పకం ॥
అన్నం విష్టా జలం మూత్రం పరభోగ్యాశ్చ నిశ్చితం ।
ఉపస్పృశేన్నతస్యాశ్చ హంతి పుణ్యం పురాకృతం ॥
అనిచ్ఛయా చ శృంగారే స్త్రీ జారేణ నదుష్యతి ।
దుష్టా స్త్రీ నిశ్చితం సాధ్వీ స్వేచ్ఛా శృంగార కర్మణి ।
త్వం శక్రం స్వామినం మత్వా సుఖం భుక్త్వారతిం గృహే ।
పశ్చాద్బభూవ తే జ్ఞానం మాం దృష్ట్వాచ నిశామయ ॥
గచ్ఛ గచ్ఛ మహారణ్యం భవ పాషాణరూపిణీ ।
రామపాదాంగులిస్పర్శాత్ సద్యః పూతా భవిష్యసి ॥
మాం సంప్రాప్స్యసి తత్పుణ్యాత్ పునరేవాగమిష్యసి ।
గచ్ఛ కాంతే మహారణ్యమిత్యుక్త్వా తపసే యయౌ॥
ఇత్యేవం కథితం సర్వం మహేంద్రదర్పభంజనం ।
పునః సంప్రాప్య లక్ష్మీంచ విభోశ్చ కృపయా మునే ॥
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే ఉత్తరార్ధే నారాయణ నారద సంవాదే ఏక షష్టితమోఽధ్యాయః ॥
అను!! గౌతముడిట్లన్నాడు - నీవు మనః శుద్ధురాలవని తెలుసు, సువ్రతవు (పుణ్యకర్మి), పతివ్రతవు. ఐనా పరుల వీర్యమును భరిస్తున్న నిన్ను విడిచి పెడ్తున్నాను. (50) పరులకు భోగ్యమైన కాంత అన్ని కర్మలందును అశుద్ధురాలు. ఆమెను పొందేవాడు మహామూఢుడు. అతనికి కల్పము కాలము నరకము. (51) పరభోగ్యమైన స్త్రీ అన్నము మలముగా, జలము మూత్రముగా భావించబడుతుంది, నిశ్చయము. ఆమె ఇచ్చే దానిని ముట్టుకుంటే ఇదివరలో వచ్చిన పుణ్యము కూడా నశిస్తుంది. (52) శృంగారమందు (రతి) ఇష్టములేనిచో స్త్రీ, జారునితోనైనా దూషితురాలుకాదు. శృంగారకర్మయందు తన ఇచ్చతో వెళ్ళిన స్త్రీ నిశ్చయంగా దుష్టురాలు. (53) నీవు ఇంద్రుని భర్తగా అనుకొని గృహమందు రతిని సుఖంగా అనుభవించావు. తరువాత నీకు జ్ఞానం కలిగింది, నన్ను చూచాక, విను. (54) మహా అరణ్యమునకు వెళ్ళు, వెళ్ళు. పాషాణ రూపిణివి కా. రామ పాదముల అంగుళి స్పర్శ వల్ల వెంటనే పవిత్రురాలవే తావు. (55) ఆ పుణ్యంతో నన్ను పొందుతావు. తిరిగి వస్తావు. ఓ కాంతా ! మహారణ్యానికి వెళ్ళు అనిపలికి తపస్సు వెళ్ళాడు. (56) అని ఈ విధంగా మహేంద్ర దర్పభంజనమును అంతా చెప్పాను. ఓ ముని! విభువు యొక్క కృపవల్ల తిరిగి లక్ష్మిని పొందాడు. (57) అని శ్రీ బ్రహ్మవైవర్తమందు మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు అరువది ఒకటవ అధ్యాయము సమాప్తము.(61)
Summary of chapter 61 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
When the devastating Kurukshetra war commenced on the sacred plains, Lord Kṛshṇa chose not to bear weapons, instead accepting the humble role of chariot driver for Arjuna, becoming renowned eternally as Pārthasārathi. Standing on the battlefield facing the vast Kaurava armies, Arjuna was overcome by deep moral paralysis at the prospect of fighting his own relatives and teachers, prompting Lord Kṛshṇa to impart the immortal spiritual wisdom of the Bhagavad Gītā, awakening Arjuna's spiritual consciousness and establishing the eternal triumph of Dharma over adharma.