బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

117 - అధ్యాయము

మూ!! శ్రీనారాయణ ఉవాచ :

గణేశస్తు శివస్థానం గత్వానత్వామహేశ్వరం

సర్వం విజ్ఞాపయామాసక్రమేణచ పృథక్ పృథక్

బాణానిరుద్ధయోర్యుద్ధం సుభద్ర నిధనంతథా

స్కందానిరుదుయోర్యుద్ధం అనిరుద్ధస్య విక్రమం

గణేశవచనం శ్రుత్వా ప్రహస్య భగవాన్భవః

ఉవాచశ్లక్ణయావాచా సుగుప్తం వేదసంమతం

శ్రీమహాదేవ ఉవాచ :

గణేశ్వర మహాభాగ శ్రూయతాంవచనం మమ

హితంతథ్యం నీతిసారం పరిణామసుఖావహం II

అసంఖ్య విశ్వసంఘంచ సర్వం కృష్ణాత్మజం సుతం

కృష్ణం జానీహియత్కార్యం కారణానాంచ కారణం

బ్రహ్మాదితృణ పర్యంతం జగత్సర్వం గణేశ్వర

నిబోధసత్యం కృష్ణంచ భగవంతం సనాతనం II

గోలోద్విభుజం శాంతం రాధాకాంతం మనోహరం

శిశురూపం గోపవేషం పరిపూర్ణతమం ప్రభుం II

గోపీభిః గోపనికరైః సహితం కామధేనుభిః

పుణ్యేబృందావనే రమ్యేసుందరే రాసమండలే

చరంతంమురలీ హస్తం బ్రహ్మేశశేషవందితం

శతశృంగేచశైలేశే వటమూలే నిరాకులే

గోష్ఠేఖాండీరనికటే నిర్మలే విరజాతటే

నవీన నీరదశ్యామం శోభితం పీతవాససా

యథానవంఘనౌఘంచ సౌదామిన్యా విరాజితం

ఆవిర్భావశ్చతేషాంవైగోలోకే రాసమండలే

తావంతో గోకులేరమేపుణ్యే బృందావనేవనే

సర్వేచాంశకలాః పుంసఃకృష్ణస్తు భగవాన్ స్వయం II

పరిపూర్ణతమః కామోబ్రహ్మశాపాత్ స్వవిస్మృతః

తస్యపుత్రో అనిరుద్ధశ్చ మహాబలపరాక్రమః I

మహాప్రస్థాపితః స్కందోమహాయుద్ధే సుదారుణే !

మృతోబాణశ్చ సంగ్రామేతేన స్కందేన రక్షితః

స్కందానిరుద్ధయోగ్యుద్దేసమత్వంతు గణేశ్వర

అష్టాచభైరవాః సర్వేరుద్రాశ్చైకాదశైవతే

అష్టాచ వసవశ్చైతే దేవాః శక్రాదయస్తథా

తథైవ ద్వాదశాదిత్యాః సర్వేదైత్యేశ్వరా స్తథా

 దేవానాం అగ్రణీః స్కందోబాణశ్చసగణస్తథా

సర్వేతే చారుద్ధంచ సంగ్రామేజేతుమక్షమాః

అనిరుద్ధః స్వయంబ్రహ్మాప్రద్యుమ్నః కామ ఏవచ

బలదేవః స్వయంశేషః కృష్ణశ్చ ప్రకృతేః పరః

ఏతత్తే కథితం సర్వం బాణంరక్ష గణేశ్వర

భవాన్ శుభస్వరూపశ్చ విఘ్నఖండన కారకః

ఆరాదాయాస్యతి హరిః గృహీత్వాచ సుదర్శనం

అవ్యర్థ మస్త్ర ప్రవరం సూర్యకోటిసమప్రభం

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే బాణయుద్ధే శివలంబోదర సంవాదే సప్త దశాధిక శతతమోధ్యా యః

అను శ్రీనారాయణుడిట్లా - గణేశుడు శివుని స్థానమునకు వెళ్ళి శివునకు నమస్కరించి,క్రమంగా విడివిడిగా అంతా చెప్పాడు. (1) బాణ అనిరుద్ధుల యుద్ధము, సుభద్రునివధ, స్కంద అనిరుదుల యుద్ధము, అనిరుద్ధుని పరాక్రమము చెప్పాడు. (2) గణేశుని మాటను విని భగవంతుడైన శివుడు నవ్వి, చాలా రహస్యమైన వేదసమ్మతమైన మాటను మృదువుగా చెప్పాడు. (3) శ్రీమహాదేవుడిట్లో - ఓగణేశ్వర! మహాభాగ! నామాట విను. హితమైనది, యథార్థమైనది, నీతిసారమైనది. పరిణామంలో సుఖాన్నిచ్చేది. (4) అసంఖ్యాకమైన విశ్వముల సమూహము అంతా కృష్ణుని ఆత్మనుండి పుట్టినవే, వచ్చినవే. కార్యము కారణములకు కారణము కృష్ణుడే అని తెలుసుకో. (5) బ్రహ్మ మొదలు గడ్డిపోచవరకు ఈ జగత్తంతా కృష్ణునిదే, ఓ గణేశ! గణేశ సత్యం తెలుసుకో, కృష్ణుడు సనాతనుడైన భగవంతుడు (6) గోలోకమందు, రెండు భుజములు కలిగి శాంతుడై మనోహరంగా రాధాకాంతుడుగా ఉంటాడు. శిశురూపుడు, గోపవేషుడు, ప్రభువు పరిపూర్ణతముడు. (7) గోపస్త్రీలు, గోపాలురు వారి సమూహముతో కలిసి ఉంటాడు కామధేనువులతో కలిసి ఉంటాడు. పుణ్యమైన, రమ్యమైన బృందావనమందు, సుందరమైన రాసమండలమందు ఉంటాడు. (8) తిరుగుతూ, చేత మురళి ధరించి ఉంటాడు. బ్రహ్మ ఈశ, శేషులతో నమస్కరింపబడేవాడు.శైలములలో శ్రేష్ఠమైన శతశృంగమందు ఆకులతలేని వటమూలమందు (9) గోష్ఠమందు, భాండీరము దగ్గర .నిర్మలమైన విరజతటమందు, ఉంటాడు. కొత్త వరామేఘమువలె శ్యామలవరుడు, పచ్చని వస్త్రముతో శోభించేవాడు. (10) కొత్త మేఘముల సమూహము, మెరుపుతీగలతో ప్రకాశించినట్లు ప్రకాశించేవాడు. వారి ఆవిర్భావము గోలోకంలో రాసమండలమందు (11) రమ్యమైన పుణ్యమైన గోకులమందలి బృందావన వనమందున్నవారు, అంతాపురుషుని అంశకలలు. కృష్ణుడైతే స్వయంభగవంతుడే. (12) కాముడు పరిపూర్ణతముడు బ్రహ్మ శాపముతో తనను మరచినవాడు. ఆతని కొడుకు అనిరుద్ధుడు గొప్ప బలపరాక్రమములు కలవాడు. (13) చాలా దారుణమైన మహాయుద్ధానికై స్కందుని నేను పంపించాను. బాణుడు యుద్ధంలో ఆతనితో మరణించాడు. స్కందుడు రక్షించాడు. (14) స్కందానిరుదుల యుద్ధంలో ఇద్దరు సమానమే, ఓ గణేశ్వర! ఎనిమిది మంది భైరవులు అందరు, పదకొండు మంది రుద్రులు (15) ఎనిమిది మంది వస్తువులు, దేవతలు, ఇంద్రాదులు, అట్లాగే పన్నెండుమంది సూర్యులు అంతా దైత్యేశ్వరులు కూడా . (16) దేవతలనాయకుడైన స్కందుడు, గణములతో కూడా బాణుడు, వీరంతా యుద్ధంలో అనిరుద్ధుని జయించలేరు. (17) అనిరుద్ధుడు స్వయంగా బ్రహ్మ ప్రద్యుమ్నుడు కాముడు. బలదేవుడు శేషుడు కృష్ణుడు ప్రకృతికి పరుడు. (18) ఇదంతా నీకు చెప్పాను. గణేశ్వర! బాణుని రక్షించు. నీవు శుభస్వరూపుడవు. విఘ్నములను ఖండించటానికి కారకుడవు. (19) దూరం నుండి హరి సుదర్శనాన్ని తీసుకొని వస్తాడు. అదికోటి సూర్యుల సమానమైన కాంతిగలది. వ్యర్థముకాని అస్త్రములలో శ్రేష్ఠమైనది. (20)

అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు బాణయుద్ధమందు శివలంబోదరుల సంవాదమందు నూటపదిహేడవ అధ్యాయము.