బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

128 - అధ్యాయము

మూ శ్రీనారాయణ ఉవాచ :

శ్రీకృష్ణశ్చ సమాహ్వానం గోపాంశ్చాపిచకారసః

భాండీరే వటమూలేచ తత్రస్వయ మువాస హ

పురాన్నంచ దదౌత స్మై యత్రైవ బ్రాహ్మణీ గణః

ఉవాసరాధికాదేవీ వామపార్శ్వే హరేరపి

 దక్షిణే నందగోపశ్చ యశోదా సహితస్తథా

తద్దక్షిణీవృషభానుఃతద్వామేసా కలావతీ

అన్యేగోపాశ్చ గోప్యశ్చ బాంధవాః సుహృదస్తథా

 తానువాచ స గోవిందో యాథార్థ్యం సమయోచితం

శ్రీభగవానువాచ :

శృణునంద ప్రవక్ష్యామిసాంప్రతం సమయోచితం

సత్యంచ పరమార్థంచ పరలోక సుఖావహం

ఆబ్రహ్మస్తంబ పర్యంతం భ్రమం సర్వం నిశామయ

విద్యుద్దీప్తిర్జలేఏషా యథాతోయస్యబుద్బుదం

మథురాయాం సర్వముక్తం నావశేషంచ కించన

యశోదాం బోధయామాస రాధికా కదలీవనే

తదేవసత్యం పరమంభ్రమధ్వాంత ప్రదీకం

విహాయమిథ్యా మాయాంచ స్మరతత్పరమం పదం

 జన్మమృత్యుజరా వ్యాధిహరం హర్షకరం పరం

శోకసంతాపహరణం కర్మమూల నికృంతనం

మామేవ పరమం బ్రహ్మ భగవంతం సనాతనం

ధ్యాయంధ్యాయం పుత్రబుద్ధిం త్యక్త్వాలభ పరంపదం

 గోలోకం గచ్ఛశీఘ్రంత్వం సార్థం గోకులవాసిభిః

ఆరాత్కలే రాగమనం కర్మమూల నికృంతనం

స్త్రీపుంసోర్నియయో నాస్తి జాతీనాంచతథైవచ

 విప్రే సంధ్యాదికం నాస్తి చిహ్నం యజ్ఞోపవీతకం

యజ్ఞసూత్రంచతిలకం శేషం లుప్తం సునిశ్చితం

దివావ్యవాయనిరతం విరతం ధర్మకర్మణి

యజ్ఞానాంచ వ్రతానాంచ తపసాంలుప్తమేవచ

కేదారకన్యా శా పేన ధర్మోనాస్త్యేవకేవలం

స్వచ్ఛందగామినీ స్త్రీణాం పతిశ్చ సతతంవతే

తాడయేత్సతతంతంచ భర్త్స యేచ్చదివానిశం

ప్రాధాన్యం స్త్రీ కుటుంబానాం క్షీణాంచ సతతం వ్రజ

స్వామీచ భక్తస్రాసాంచ పరాభూతో నిరంతరం

కలౌచయోషితస్సర్వా జార సేవాసు తత్పరాః

శతపుత్ర సమన్నేహ స్తాసాంజారేభవిష్యతి

దదాతితస్మై భక్ష్యంచ యథాభృత్యాయ కోపతః

సస్మితా సకటాక్షా సామృత దృష్ట్యా నిరంతరం

జారంపశ్యతి కామేన విషదృష్ట్యా పతింసదా

సతతం గౌరవంతాసాం స్నేహంచ జారబాంధవే

పత్యౌకర ప్రహారంచ నిత్యం నిత్యం కరోతిచ

మిష్ఠాన్నం శ్రద్ధయా భక్త్యా జారాయ ప్రదదాతిచ

శ్రీ నారాయణుడిట్లా - ఆ శ్రీకృష్ణుడు గోపాలురను కూడా ఆహ్వానించాడు. భాండీర మహావటవృక్షమూలమందు అక్కడ స్వయంగా ఉన్నాడు. (1) బ్రాహ్మణ స్త్రీ సమూహమున్నచోట వారందరికి అన్నము పెట్టాడు. హరివామపార్శ్వమందు రాధికాదేవి ఉన్నది. (2) కుడి భాగంలో నంద గోపుడు, యశోదకూడా ఉన్నారు. వారికి కుడిభాగంలో వృషభానుడున్నాడు. ఆతనికి ఎడమ భాగంలో కళావతి ఉంది. (3) ఇతరులు గోపాలురు, గోపికలు, స్నేహితులు, బాంధవులున్నారు. వారిని గూర్చి గోవిందుడు యధార్థాన్ని ఆసమయానికి తగిన దాన్ని చెప్పాడు. (4) శ్రీభగవానుడిట్లా – ఓనందుడ! ఇప్పుడు సమయానికి తగ్గదాన్నిచెప్తా విను అది సత్యము. యధార్థము పరలోకంలో సుఖాన్నిచ్చేది. (5) బ్రహ్మ మొదలుకొని స్తంబము వరకు అంతా భ్రమమైన దానిని విను. జలములతో ఈవిద్యుద్దీప్తి. నీటిలో బుడగలాంటిది. (6) మథురలో అంతా చెప్పాను. ఏమీమీగుల లేదు. యశోదకు రాధికకదళీ వనంలో బోధించింది. (7) అదే సత్యము పరమమైనది. భ్రమ అనే చీకట్లను వెలిగించేది. మిధ్య మాయనువదలి ఆపరమస్థానమును స్మరించు. (8) జన్మమృత్యు జర, వ్యాధులను హరించేది. మిక్కిలి ఆనందాన్నిచ్చేది. శోకసంతాపములను హరించేది. కర్మల మూలమును కోసివేసేది. (9) పరబ్రహ్మ, భగవంతుడు, సనాతనుడు ఐన నన్నే ధ్యానిస్తూ, ధ్యానిస్తూ, నాపుత్రుడు అనే బుద్ధిని వదలి పరమ పదమును పొందు. (10) గోకుల వాసులతో కూడి నీవు శీఘ్రంగా గోలోకానికి వెళ్ళు. త్వరలో కలివస్తుంది, కర్మమూలములను తెంచేస్తుంది. (11) స్త్రీ పురుషులకు నియమం లేదు. జాతులకు అట్లాగే. బ్రాహ్మణుడు సంధ్యాదులు చేయడు. యవీతమే ఆతని గుర్తు. (12) యజ్ఞోపవీతము, తిలకము తప్ప మిగిలిన వన్నిలోపిస్తాయి. నిశ్చయము. పగలు గ్రామ్యధర్మమందు మునిగితేలుతాడు. ధర్మకర్మలు మానేస్తాడు. (13) యజ్ఞములు, వ్రతములు, తపస్సు ఇవి లోపిస్తాయి. కేదారకన్య శాపంవల్ల ధర్మం ఉండనే ఉండదు. (14) స్త్రీలు స్వేచ్ఛగా విహరించేవారౌతారు. పతి ఎప్పుడూ వారి వంశంలో ఉంటాడు. ఎప్పుడు అతనిని కోడుంది. రాత్రింబగళ్ళు భయ పెడుంది. (15) స్త్రీ కుటుంబములకు స్త్రీలకు ఎప్పుడూ ప్రాధాన్యముంటుంది. ఓ ప్రజ! స్వామి (యజమాని) హరికి ఎల్లప్పుడు భక్తుడు. ఆతడు ఎప్పుడు అవమానింపబడుతాడు.(16) కలిలో స్త్రీలు అందరు జారుని సేవలో తత్పరులౌతారు. వారికి తమ జారుని యందు (ఉపపతి) నూరుగురు కొడుకుల మీదున్నంత ప్రేమ ఉంటుంది. (17) మగనికి ఆహారాన్ని భృత్యునకిచ్చినట్లు కోపంతో ఇస్తుంది. జారునకు నవ్వుతూ, ఓరచూపులు చూస్తూ, అమృతపు దృష్టితో ఎప్పుడూ ఆహారమిస్తుంది. (18) జారునికోరికతో చూస్తుంది. పతిని ఎప్పుడూ విషదృష్టితో చూస్తుంది. జారుని బంధువుల పై ఎల్లప్పుడు గౌరవము. వారిపై స్నేహము గూడా. (19) ప్రతిరోజు భర్తను చేతితో కొడ్తుంది. మధురమైన ఆహారాన్ని శ్రద్దతో భక్తితో జారునకిస్తుంది.

మూ వేషయుక్తాచ సతతం జార సేవనతత్పరా

ప్రాణాబంధుర్గతిశ్చాత్మకలౌ జారశ్చయోషితాం

లుప్తాచాతిథి సేవాచ ప్రలుప్తం విష్ణు సేవనం

పితృణామర్చనంచైవ దేవానాంచ తథైవచ

విష్ణువైష్ణ యోర్ద్వేషీ సతతంచ నరోభవేత్

వామమంత్రోపాసకాశ్చ చతుర్వర్ణాశ్చ తత్పరాః

సాలగ్రామంచ తులసీం కుశం గంగోదకం తథా

నస్పృశేన్మానవోధూర్తో మ్లేచ్ఛాచార రతస్సదా

కారణం కారణానాంచ సర్వేషాం సర్వబీజకం

సుఖదం మోక్షదం శశ్వద్దాతారం సర్వ సంపదాం

త్వక్ష్యామాం పరయాభక్త్యా క్షుద్ర సంపత్ర్పదాయినీం

వేదవిఘ్నం వామమంత్రం జపేద్విప్రశ్చ మాయయా

సనాతనీ విష్ణుమాయా వంచితంతం కరిష్యతి

మమాజ్ఞయా భగవతీ జగతాంచ దురత్యయా

కలేర్దశ సహస్రాణి మదర్భాభువితిష్ఠతి

తదర్థానిచ వర్షాణాం గంగా భువన పావనీ

తులసీ విష్ణు భక్తాశ్చ యావద్గంగాచ కీర్తనం

పురాణానిచ స్వల్పాని తావదేవ మహీతలే

మమచోత్కీర్తనం నాస్తి ఏతదంతేకలౌవ్రజ

ఏకవర్ణాభవిష్యంతి కిరాతాబలినః శఠాః

పిత్రోః సేవాగురోః సేవా సేవాచ దేవవిప్రయోః

వివర్జితానరాః సర్వేచాతిథీనాంతథైవచ

సస్యహీనాభవేత్సృధ్వీసాచా వృష్ట్యా నిరంతరం

ఫలహీనోఽపి వృక్షశ్చ జలహీనాసరత్తథా

వేదహీనో బ్రాహ్మణశ్చ బలహీనశ్చ భూపతిః

జాతిహీనాజనాస్సర్వే మ్లేచ్ఛో భూపో భవిష్యతి

భృత్యవత్తాడయేత్తాతం పుత్రః శిష్యస్తథా గురుం కాంతంచ తాడయేత్కాంతాలుబ్ధకుక్కటవద్గృహే

నశ్యంతి సకలలోకాః కలౌశే షేచ పాపినః

సూర్యాణామాత పాత్కేచిత్ జలౌఘేనాపికేచన

హేవైశ్యేంద్ర సతికలౌ ననశ్యతి వసుంధరా

పునః సృష్టిర్భవేత్సత్యం సత్యబీజం నిరంతరం

ఏతస్మిన్నంతరేవిప్ర రథమేవ మనోహరం

చతుర్యోజనవిస్తీర్ణ మూర్థ్వేచ పంచయోజనం

శుద్ధ స్పటిక సంకాశ రత్నసార వినిర్మితం

అcన పారిజాతానాం మాలాజాల విరాజితం

మణీనాం కౌస్తుభానాంచ భూషణేన విభూషితం

అమూల్య రత్నకలశం హీరహార విలంబితం

మనోహరైః పరిష్వక్తం సహస్ర కోటిమందిరైః

సహస్రద్వయ చక్రంచ సహస్రద్వయ ఘోటకం

సూక్ష్మవస్త్రాచ్ఛాదితంచ గోపీకోటిభిరావృతం

గోలోకా దాగతం తూర్ణం దదృశుః సహసావ్రజే

కృష్ణాజ్ఞయా తమారుహ్యయయుర్గోలోక ముత్తమం

రాధాకలావతీ దేవీధన్యాచాయోని సంభవా

గోలోకాదాగతా గోప్యశ్చాయోని సంభవాశ్చతాః

శ్రుతిపత్న్యశ్చతాః సర్వాః స్వశరీరేణ నారద

స్త్రీ, వేషం వేసుకొని ఉంటుంది (అలంకరించుకొని) జారుని సేవకు తత్పరురాలై ఉంటుంది. ప్రాణములు, బంధువు, గతి, ఆత్మ ఇవన్నీ స్త్రీకి కలిలో జారుడే (21) అతిథి సేవలోపిస్తుంది. విష్ణు సేవలోపిస్తుంది. పితరుల అర్చన,దేవతల అర్చనకూడా లోపిస్తుంది. (22) నరుడు విష్ణు ద్వేషి, వైష్ణవ ద్వేషి ఔతాడు, ఎప్పుడూ. వామమంత్రాల నుపాసిస్తారు,నాలుగు వర్ణముల వారు దానియందే ఆసక్తులై తారు. (23) సాలగ్రామము, తులసి, కుశలు, గంగాజలము వీటిని మేచ్ఛాచారపరుడై ధూర్తమానవుడు ఎప్పుడూ ముట్టడు. (24) కారణములకు కారణాన్ని, అందరికి అన్నిటికి బీజాన్ని నేను, సుఖమిచ్చేవాడిని, మోక్షమిచ్చేవాడిని, ఎప్పుడూ అన్ని సంపదలనిచ్చే వాడిని (25) నన్ను వదలి మిక్కిలి భక్తితో క్షుద్ర సంపదలనిచ్చే వేదములను చంపే వామమంత్రాన్ని విప్రుడు మాయవల్ల జపిస్తాడు. (26) సనాతనియైన విష్ణుమాయ వానిని వంచిస్తుంది. నా ఆజ్ఞతో భగవతిలోకులకు దాటరానిది (27) కలిలో పదివేలసంవత్సరాలు నా పూజభూమి పై ఉంటుంది. అందులో సగము సంవత్సరాలు గంగ, భూమిని పవిత్రం చేసేదిగా ఉంటుంది. (28) తులసి, విష్ణు భక్తులు, గంగ ఉన్నంత వరకు, కీర్తన ఉన్నంతవరకు, స్వల్పపురాణములు అంతవరకే ఉంటాయి. (29) ఓవజ! దీని అంతంలో కలిలో నన్ను గూర్చిగొంతెత్తి కీర్తన చేయుటము ఉండదు. కిరాతులు, బలవంతులు, శఠులు ఒకే వర్ణము వారౌతారు. (30) పితృసేవ గురు సేవ దేవతల, విప్రుల సేవ వీనిని, నరులంతా వదలి పెడతారు, అట్లాగే అతిథి సేవకూడా చేయరు. (31) భూమిపంటలు లేకుండా ఔతుంది. అది ఎల్లప్పుడూ వర్షాలు లేకుండా ఔతుంది. చెట్లు పండ్లు లేకుండా ఔతాయి, నదులు నీళ్ళు లేకుండా ఔతాయి. (32) బ్రాహ్మణుడు వేదం లేకుండా ఔతాడు. రాజు బలం లేకుండా ఔతాడు. జనులంతా జాతిహీనులౌతారు. మ్లేచ్ఛుడు రాజౌతాడు. (33) కొడుకు, తండ్రిని సేవకుని కొట్టినట్టు కొడాడు. శిష్యుడు గురువును అట్లాగే చేస్తాడు. భార్య, భర్తను కొడుతుంది. గృహస్థు లుబ్ధురాలైన కోడివలె (లుబునివద్ద కోడివలె) ఉంటాడు. (34) కలిమిగులుదలలో పాపులు, లోకములన్ని నశిస్తాయి. కొందరు, సూర్యుల వేడిమి వలన కొందరు నీటి సమూహంతో చస్తారు. (35) ఓవైశ్య శ్రేష్ఠ! కలి ఉండగా భూమి నశించదు. తిరిగి సృష్టి ఔతుంది, నిజము. సృష్టికి సత్యమే బీజము. (36) ఇంతలో ఓవిప్ర! మనోహరమైన రథము వైశాల్యంలో నాలుగు యోజనములు పైన ఐదు యోజనములు కలది (37) శుద్దమైన స్పటికము వలె ప్రకాశిస్తూ, వజ్రములతో నిర్మింపబడి, వాడిపోని పారిజాతపు పూలమాలల సమూహంతో వెలిగిపోతూ (38) కౌస్తుభమణుల అలంకారములతో అలంకరింపబడి, అమూల్యమైన రత్నముల కలశములు కలిగి వజ్రాల హారములు వేలాడుతుండగా (39) మనోహరమైనవేలకోట్ల మందిరములతో కూడుకొని, రెండు వేల చక్రములు, రెండువేల గుర్రాలు కలిగి (40) సూక్ష్మమైన వస్త్రముతో కప్పబడి కోటిగోపికలతో చుట్టబడి ఉన్న గోలోకం నుండి వచ్చిన రథాన్ని, వేగంగలదానిని, ప్రజమందు త్వరగా చూచారు. (41) కృష్ణుని ఆజ్ఞతో దానినెక్కి ఉత్తమమైన గోలోకానికి వెళ్ళారు. కళావతి దేవి, అయోని సంభవ రాధ ఇద్దరు ధన్యలు (42) గోలోకం నుండి వచ్చిన గోపికలు వారంతా అయోనిసంభవలే. వారంతా శ్రుతులకు భార్యలు, తమ శరీరంతో, ఓ నారద!

మూ సర్వేత్యక్త్వా శరీరాణి నశ్వరాణి సునిశ్చితం

గోలోకంచ యయౌరాధా సార్థం గోకులవాసిభిః

దదర్శ విరజాతీరం నానారత్న విభూషితం

తదుత్తీర్య యయౌవిప్రశత శృంగంచ పర్వతం

నానామణి గణాకీర్ణం రాసమండల మండితం

తతోయయౌకియద్దూరం పుణ్యం బృందావనం వనం

సాదదర్శాక్షయవటమూర్థ్వే త్రిశతయోజనం

శతయోజన విస్తీర్ణం శాఖా కోటిసమావృతం

రక్తవర్ణైః ఫలౌఘైశ్చ స్థూలైరపి విభూషితం

గోపికోటిసహస్రైశ్చ సార్థం వృందా మనోహరా

అనువ్రజం సాదరంచ సస్మితా సాసమాయయౌ

అవరుహ్య రథాత్తూర్ణం రాధాం సాప్రణనామచ

రాసేశ్వరీతాం సంభాష్య ప్రవివేశ స్వమాలయం

రత్న సింహాసనే రమ్యేహీరహార సమన్వితాం

వృందాతాం వాసయామాస పాద సేవన తత్పరా

సప్తభిశ్చ సఖీభిశ్చ సేవితాం శ్వేతచామరైః

ఆయయుః గోపికాస్సర్వాః ద్రష్టుంతాం పరమేశ్వరీం

నందాదికం ప్రకల్ప్యైతద్రా ధావాసం పృథక్ పృథక్

పరమానంద రూపాసా పరమానంద పూర్వకం

స్వవేశ్మనిమహారమ్యే ప్రతస్థే గోపికా సహ

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే అష్టావింశత్యధిక శతతమోఽధ్యాయః

చాలా నిశ్చితమైన తమ నశ్వర శరీరములను అంతా వదిలి, గోకుల వాసులతో కూడా రాధాగోలోకానికి వెళ్లింది. (44) నానా రత్నములతో ప్రకాశిస్తున్న విరజా తీరాన్ని చూచింది. ఓవిప్ర! దాన్ని దాటి శతశృంగపర్వతానికి వెళ్ళింది. (45) నానా మణుల సమూహంతో నిండిన, రాసమండలంతో అలంకరింపబడ్డదది. పిదపకొద్ది దూరంలోని బృందావన వనానికి వెళ్ళింది. (46) అక్కడ ఆమె అక్షయవటాన్ని చూచింది. పైకి మూడు వందల యోజనముల వరకుంది, నూరుయోజనముల విస్తీర్ణము గలది. నూరుకోట్ల శాఖలతో చుట్టబడింది. (47) ఎర్రరంగు గల ఫలసమూహములు, చాలా పెద్దవి అలంకరించి ఉన్నాయి. వేయికోట్ల గోపికలతో వృందమనోహరంగా ఉంది. (48) వ్రజముననుసరించి ఆదరంగా నవ్వుతూ ఆమె వెళ్ళింది. రథమునుండి వేగంగా దిగిన రాధను ఆమె నమస్కరించింది. (49) ఆరాసేశ్వరితో మాట్లాడి తన ఇంటికి వచ్చింది. రమ్యమైన రత్న సింహాసనమందు, వజ్రాలహారముతో కూడిన (50) ఆమెను వృంద పాద సేవ చేసే కొరకు కూర్చోబెట్టింది. ఏడుగురు సఖురాళ్ళతో తెల్లని చామరములతో సేవింపబడేది. (51) దానిని చూడటానికి ఆపరమేశ్వరిని చూసేందుకు గోపికలంతా వచ్చారు. ఈ రాధ విడివిడిగా నందాదులకు వాసం కల్పించింది. (52) ఆమె పరమానంద రూపురాలు, పరమానంద పూర్వకముగా వాసంకల్పించింది. గోపికలతో కూడా మహారమ్యమైన తన గృహమందు ఉండుటకు బయలుదేరింది. (53) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు నూట ఇరువది ఎనిమిదవ అధ్యాయము.