43 - శంకరశోకాపనోదనము

నారాయణ ఉవాచ - నారాయణ ముని పలికెను:

అథ దుర్గాం మహాదేవన్నతీమూర్తిం మనోహరాం ।

ఆమ్లాన వక్రపద్మం తాం శయానాం జాహ్నవీ తటే ॥

దధతీమక్షమాలాం చ ప్రతప్త కాంచన ప్రభాం ।

తేజసా ప్రజ్వలంతీం చ దధానాం శుక్ల వాససం ॥

దృష్ట్వా సతీ శరీరం చ ప్రదర్గో వీరహాగ్నినా ।

తత్త్యరాశిర్మూర్తిమాంశ్చ మూర్ఛాం ప్రాప తథాపి చ ॥

కలత్ర శోకో బలవాన్ స్వాత్మారామం పరాత్పరం ।

బాధతే వేదబీజం తం యోగీంద్రాణాం గురోర్గురుం॥

 క్షణేన చేతనాం ప్రావ్య తామువాత త్రిలోచనః ।

 నీరీక్ష్య వదనాంభోజం స్థాణుః స్థాణురివావరః ॥

సామ్రనేత్రోలితి దీనశ్చ దీవానాం శరణ ప్రదః ।

దీనదైన్యాపహారీ చ విలాప పరం వచః ॥

తరువాత మహాదేవుడు వాడని ముఖ పద్మము గలదియు గంగాతీరమున శయనించి ఉన్నదియు మనోహరముగా నున్నదియు అగు దుర్గాదేవి యొక్క శరీరమును చూచెను. చేతిలో జపమాలతో కాల్చిన బంగారము వంటి శరీరకాంతిలో తెల్లని వస్త్రముతో తేజస్సుతో ప్రకాశించుచున్న ఆ సతీ శరీరమును చూచి విరహాగ్నితో కాల్చబడినవాడై - తత్త్వములే రూపము ధరించినవాడైనను క్షణములో మూర్చిల్లెను. తాను ఆత్మారాముడు పరాత్పరుడు వేదములకు మూలమైనవాడు యోగీశ్వరులకు పరమగురువు ఐనను భార్యాదుఃఖము మిక్కిలి బలమైనది కనుక దానికి వశుడై కొంత సేపటికి మూర్ఛనుండి తేరుకొని ఆ త్రిలోచనుడు శిలాస్తంభము వలె స్థిరుడును ఐన స్థాణువు భార్య ముఖ పద్మమును చూచి కన్నుల నీరు నిండగా - దీనులకు రక్షణనిచ్చువాడైనను తాను దీనుడై - దీనుల దుఃఖము తొలగించువాడై కూడ చెప్పరానంతగా దుఃఖించెను.

శంకర ఉవాచ – శంకరుడనెను:

ఉత్తిష్ణోత్తిష్ఠ సుభగే సతి ప్రాణేశ్వరి ప్రియే ।

శంకరోమి హం తవ స్వామీ వశ్య మాం నికటాగతం ॥

శివం శివప్రదం సర్వసంపద్రూపం చ సిద్ధిదం ।

సర్వాత్మానం చ సర్వేశం శవతుల్యం త్వయా వినా ॥

శక్తోహం చ త్వయా సార్థః సర్వశక్తి స్వరూపియా ।

శక్తిహీనః శవసమః నిశ్చేష్ఠః సర్వకర్మసు ॥

యశ్చ శక్తిం న జానాతి జ్ఞాన హీనశ్చ నిందతి।

తం త్యక్తముచితం విజ్ఞే కథం మాం త్యజసి ప్రియే॥

స్వయం బ్రహ్మా స్వయం విష్ణుః సాధ్యభూతా వయం తవ।

సస్మితం సకటాక్షం చ ద కించిత్సుధోపమం ॥

మధురాభాస దృష్యా చ మాం దగ్ధం సేచనం కురు ।

మాం దృష్వా దూరతః శీఘ్రం స్నిగ్ధం వదసి సస్మితం॥

 కథమద్యాపి రు షేవ షెలపంతం న భాష సే ।

ప్రాణాధికే సముత్తిష్ఠ రుదంతం మాం న పశ్యసి ॥

పరిత్యజ్య చ నః ప్రాణాన్ గంతుం నార్హసి సుందరి ।

జగదంభే సముత్తీష్ఠ ప్రాణాధారే పరాత్పరే ॥

వతివ్రతే సముత్తిష్ఠ కథం మాం నాద్య సేవసే ।

కథం కరోషి విజ్ఞాయ ప్రతభంగం శ్రుతిప్రసూః ॥

ఓ సుందరీ! లే లెమ్ము. ఓ నా ప్రాణేశ్వరీ! సతీ! ప్రియురాలా! నేను నీ భర్తను శంకరుడను. నీ సమీపమునకు వచ్చిన నన్ను చూడుము. నేను శివుడను, జీవులకు మంగళప్రదుడను. సర్వసంపదల రూపుడను. సిద్ధులకు సర్వసిద్ధులనిచ్చువాడను. సర్వమునకు ఆత్మవంటివాడను. సర్వమునకు ఈశుడను ఐనను నీవు లేనిచో శవముతో సమానమైన వాడను సుమా! సర్వశక్తి స్వరూపిణివైన నీతో కూడియున్నప్పుడు, నేను సర్వకార్యములందు శక్తుడను. శక్తిలేనివాడు సర్వకర్మలయందు చేష్టలేమీ లేనివాడు కనుక శవముతో సమానుడు. ఎవడు శక్తిని తెలిసికొనలేడో శక్తిహీనుడై నిందించునో వానిని వదిలి పెట్టుట ఉచితము కానీ ఓ విజ్ఞురాలా! ప్రియురాలా! నన్నెట్లు వదిలి పెట్టుచున్నావు? బ్రహ్మయు విష్ణువును నేనును నీకు సాధింపబడువారము కదా! చిరునవ్వుతో కడకంటి చూపుతో బాటు అమృతము పంటి మాటనోకటి పలుకుము. నీ వియోగ దుఃఖముతో కాల్చబడిన నన్ను మధురమైన నీ చూపుతో తడుపుము. ఇంతవరకు దూరమున నన్ను చూడగనే వెంటనే చిరునవ్వుతో బాటు స్నేహముగా పలుకుచుంటివి. నేడు నీ కోసము దుఃఖించుచున్న నన్ను కోపించిన దాని వలె ఉండి ఎందుకు మాట్లాడుచు లేవు. నా ప్రాణముల కంటే అధికమైన దానా! లెమ్ము. ఏడ్చుచున్న నన్నేల చూడవు? ఓ సుందరీ! జగదంబా! నా ప్రాణముల కాధారమైన పరమేశ్వరీ! నా ప్రాణముల నిక్కడ వదిలివేసి పోవుట నీకు తగదు లెమ్ము. ఓ పతివ్రతా! నేడు నన్నెట్లు సేవించుట లేదు. వేదములను కన్నదానా! తెలిసికూడ వ్రతభంగమేట్లు చేయుచున్నావు? లెమ్ము.

ఇత్యుక్త్వా మృతదేహం చ ప్రియాయా విరహాతురః ।

నీయోరసి సంశ్లేష్య చుచుంబ చ పునఃపునః ॥

ఆధరే చాధరం దత్వా వక్షో వక్షసి శంకరః ।

వునః పునః సమాశ్రిష్య పునర్మూరామవావ నః ॥

 పునః సచేతనోం ప్రాప్య వేగాదుత్థాయ శోకతః ।

దుర్రోవ చ యన్మతో జ్ఞానినాం చ గురోర్గురుః ॥

సప్తద్వీపం సప్తసింధుం లోకాలోకం చ కాంచనం ।

బభ్రామ భ్రాంతవద్ జ్ఞానీ సతీం కృత్వా న్వవక్షసి ॥

 శత శృంగగిరేః పార్వే జంబుద్వీపే చ భారతే ।

సుసర్జనేభి క్షయవటే గంగాతీరే నరిత్తటే ॥

 రురోదోచ్చైః స్వయంకృత్వా సతీ సాధ్వీత్యుదీర్య చ ।

 త్రినేత్రనేత్ర నీదేణ సంబభూవ సరోవరం ॥

భార్యావియోగముచే జ్వరపీడితుడై ఇట్లు పలుకుచు ఆమె శవమును వక్షఃస్థలమున చేర్చి ఆలింగనము చేసికొని మాటి మాటికీ ముద్దులు పెట్టుకొనెను. ఆమె పెదవుల మీద తన పెదవులానించి వక్షః స్థలముపై వక్షః స్థలముంచి ఆ శంకరుడు మరల మరల కౌగిలించుకొని మూర్ఛ పొందెను. మరల స్మృతికీ వచ్చి ఆమెను తన వక్షఃస్థలమున చేర్చుకొని దుఃఖములో వేగముగా లేచి జ్ఞానులకు పరమ గురువైన శివుడు పిచ్చివాని వలె పరుగెత్తాను. సప్తద్వీపములను సప్త సముద్రములను లోకాలోక పర్వతమును మేరు పర్వతమును భ్రాంతుని వలే చుట్టి తిరుగుచుండెను. శతశృంగ పర్వత పార్శ్వమున జంబూద్వీపమున భారతవర్షమున నిర్జన ప్రదేశములలోను, అక్షయవటము గల గయా క్షేత్రమున గంగాతీరమున ఇతర నదీ తీరములందు ఆమెను పట్టుకొని సతీ! సాధ్వీ! అని పలుకుచూ గొంతెత్తి ఏడ్చెను. ఆ త్రినేత్రుని నేత్రముల నుండి స్రవించిన జలముతో ఒక సరస్సు ఏర్పడెను.

తన్నేత్రం చ సరో నామ మునీనాం తపసః స్థలం ।

యోజనద్వయ విస్తీర్ణం పుణ్యతీర్థం మనోహరం ॥

 యత్ర స్నాత్వా పునర్జన్మ నరాణాం న భవేద్గిరే ।

శతజన్మకృతం పాపం స్నానమాత్రేణ నశ్యతి ॥

 త్యక్త్వా తాం మానవీం మూర్తిం నరా యాంతి హరేః పదం ।

స తత్ర రోదనం కృత్వా పునర్భభామ మేదినీం॥

ఆ నేత్ర సరస్సు మునులకు తపస్సు చేయు స్థానము. ఆ మనోహరమైన పుణ్యతీర్థము రెండు యోజనముల విస్తీర్ణము కలది. ఓ హిమవంతుడా! అందులో స్నానమాడిన నరులకు నూరు జన్మలలో చేసిన పాపము కేవల స్నానముతోనే నశించి పునర్జన్మ లేకుండనగును. మానవ దేహము త్యజించి హరిస్తానమును చేరబోదురు. అట్టి సరస్సు వద్ద శంకరుడు దుఃఖించి మరల భూమండలమున భ్రమించెను.

పూర్ణమబ్దం మహాయోగీ విరహాతుర మానసః ।

సతీగలిత ప్రత్యంగైరంగైశ్చ పర్వతేశ్వర॥

బభూవ సిద్ధపీఠానాం సమూహో వాంఛిత ప్రదః ।

శేషాంగానాం మహాదేవః సంస్కారం వై విధాయ చ ॥

 ఆస్థిమాలాం వినిర్మాయ చకార కంఠభూషణం ।

నిత్యం తద్భస్మ భక్త్యా చ చకార గాత్రలేపనం ॥

 సతి ప్రాణేశ్వరీత్యుక్త్వా పునర్మూచ్ఛామవాప సః ।

 విపస్మార బ్రహ్మ పరమాల్మోనమాత్మసంభవః ॥

 స్వాత్మారామః పూర్ణకామో నిశ్చేష్టో విరహజ్వరాత్ ।

తం శయానం గిరివరస్యాభ్యాశే వటమూలకే ॥

దృష్ట్వా దేవాః సమాజగ్ముర్వినీతాః శివసన్నిధిం ।

మహాయోగియైన పరమేశ్వరుడిట్లు నిండుగా ఒక సంవత్సర కాలము వీరహాతురమైన మనస్సుతో తిరుగుచుండగా - ఓ పర్వతరాజా! అతడు మోసుకొని పోవుచున్న సతీ శరీరము యొక్క అంగములు ప్రత్యంగములు ఊడిపోయి ఎక్కడెక్కడ పడెనో ఆ ప్రదేశములు సిద్ధ పీఠములయ్యెను. ఆ స్థానములు నరులకు పాంఛలను తీర్చునవి. ఇక మిగిలిన అంగములకు మహాదేవుడు అగ్ని సంస్కారము చేసి ఎముకలను ఒక మాలగా నిర్మింపజేసి కంఠమున అలంకారముగా ధరించెను. భక్తితో ఎల్లప్పుడు ఆ భస్మమును శరీరమున పులుముకొనెను. సతీ ప్రాణేశ్వరీ అని పలుకుచు మరల మూర్ఛిల్లెను. కృష్ణపరమాత్మ నుండి ఆవిర్భవించిన అతడు పరబ్రహ్మను తనను కూడ మరచెను. ఆత్మారాముడు పూర్ణకాముడు వీరహజ్వరము వలన ఏ చేష్టలు లేని వాడయ్యెను. ఇట్లు తిరిగి కైలాస పర్వత సమీపమున వటవృక్షమూలమున పండుకొని ఉండగా ఆశ్చర్యపడి దేవతలందరు చేరవచ్చిరి.

నారాయణశ్చ భగవానీశ్వర సహపార్పదైః ॥

రత్నయానేనాజగామ పద్మార్చిత పదాంబుజః ।

రత్నాలంకార శోభాడ్యః పీత వాసాశ్చతుర్భుజః ॥

 ఈషద్ధాస్య ప్రసన్నాస్యో వనమాలా విభూషితః ।

 బ్రహ్మా శేషశ్చ ధర్మశ్చ సుధాః సర్వే మహర్షయః ॥

సమూపురీశసదసీ లక్ష్మీకాంతం ప్రణమ్య తే ।

భగవంతుడైన నారాయణుడు లక్ష్మీదేవిచేత పూజింపబడిన పాదపద్మములు గలవాడు రత్నాభరణముల ప్రకాశముతో వెలుగుచున్న శ్రేష్ఠుడు పీతాంబరధారి చతుర్భుజములు గలవాడు చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖమండలము గలవాడు “వనమాల” యన్న పుష్పహారముతో అలంకరింపబడినవాడు తన పారదులతో కూడి రత్నాలంకృతమైన రథము పై నెక్కి చేరవచ్చేను. అట్లే బ్రహ్మయు ఆదిశేషుడును ధర్మదేవతయు దేవతలు మహరులందరు చేరవచ్చి ఆ శివ సభలో లక్ష్మీసాధునికి నమస్కరించిరి.

శ్రీహరి శంకరమహో కృత్వా వక్షసి మూర్చితం ।

రుదంతం బోధయామాస జ్ఞానీశో జ్ఞానినాం గురుం ॥

జ్ఞానులకు ప్రభువైన శ్రీహరి జ్ఞానులకు గురువై ఏడ్చుచు మూర్ఛిల్లియున్న శంకరుని తన వక్షఃస్థలమున చేర్చుకొని ఇట్లు బోధించెను.

శ్రీ భగవానువాచ - భగవంతుడిట్లనెను :

స్వాత్మారామ నిబోధోదం మదీయం వచనం శ్రుణు ॥

 హితమధ్యాత్మ సారం చ దుఃఖ శోక నికృంతనం ।

సర్వాధ్యాత్మ విద్యమాన బీజం జ్ఞాన నిధిం విధిం ॥

తథాపి బోధయామి త్వాం సర్వజ్ఞం వేధసాం విధిం ।

బుధం బోధయితుం శక్తోలి బుధోని ఏ ప్రాణసంకటే ॥

వ్యవహారోస్తి లోకేషు సర్వః సర్వ పరస్పరం ।

మాయాశ్రితా గుణాః సర్వే హేతవః సుఖదుఃఖయాః ॥

 విష్ణుమాయా బలవతీ గుణయుక్తం ప్రబాధతే ।

 దుఃఖం శోకడ భయం శంభో దుర్దినే భవతీశ్వర ॥

 తత్రాతీతే కుతస్తానీ సుదినే చ సమాగతే ।

హర్ష ఐశ్వర్య దర్పశ్చ సంతతం తత్ర వర్థతే ॥

సర్వాణ్యేతాని గణ్యంతే స్వప్నానీవ విపశ్చిత: ।

జ్ఞానం లభ మహాదేవ జ్ఞాన బీజ సనాతన॥

చేతనాం కురు భద్రం తే సతీం ప్రాప్స్యసి నిశ్పితం।

 తత్త్యం శీతతా నిత్యం సాగ్నిం ముంచతి దాహికా ॥

 తేజః సూర్యం మహీం గంధో తథా త్వాం చ సతీ శివ।

 శైలేత్యేవం సమాకర్ణ్య హరీం కించిదువాచ హ ॥

నేత్రాణ్యున్మీలనం కృత్వా త్రినేత్రః శ్రూయతామితి ।

ఓ స్వాత్మారాముడా! (ఆత్మయందే రమించువాడా!) మేల్కొనుము., నా మాటను వినుము. దుఃఖమును శోకమును ఖండించి వేయునట్టి హితమైన అధ్యాత్మ సారమును వినుము. సర్వజ్ఞుడవు. బ్రహ్మలకు శాసకుడవు జ్ఞాననిధివి. అన్ని ఆధ్యాత్మవిద్యలకు బీజమైనవాడవు నీవు. ఐనను నీకు బోధ చేయుచున్నాను. ప్రాణ సంకట పరిస్థితిలో పామరుడు కూడ పండితునకు బోధించుటకు సమర్ధుడే. ప్రతివ్యక్తికి వేరొక వ్యక్తి ఒకరికొకరు బోధించుకొను వ్యవహారము జనులలో నున్నది. సమస్త సుఖదుఃఖములకు మయనాశ్రయించి యున్న గుణములే కారణము (మూలము అగుచున్నవి. విష్ణుమాయ మిక్కిలి బలము కలది. అది గుణములతో (సత్త్వరజస్తమస్సులతో) కలిసి మిక్కిలి బాధించుచున్నది. ఓ ఈశ్వరా! దుర్దినము సంభవించినప్పుడు (వ్యతిరేక కాలములో} దుఃఖము శోకము భయము ఏర్పడుచున్నవి. అది గడిచిపోయి సుదినము రాగానే అప్పుడు హరము ఐశ్వర్యము దర్పము వృద్ధి పొందుచున్నవి. విద్వాంసులు వీటినన్నిటిని స్వప్నములుగా లెక్కించుచున్నారు. ఓ సనాతనుడా! జ్ఞానమునకు బీజమైనవాడా! మహాదేవా! జ్ఞానము పొందుము. నీలో మెలకువను (చేతనాశక్తిని పొందుము. నీకు శుభమగుగాక. నీవు సతీదేవిని ముందు పొందగలవు. అది నిశ్చయము. జలమేప్పుడును చల్లనిదే. అగ్నిని, దహించి వేయుశక్తి విడువదు. తేజస్సు సూర్యుని భూమి గంధమును విడువనట్లే నిన్ను సతీదేవి విడువదు అని ఈ మాటలను విని కన్నులు తెరచి హరీని వినుమనుచు త్రినేత్రుడు పలికెను.

త్రినేత్ర ఉవాచ - మూడుకన్నుల దేవుడు పలికెను :

కస్త్వం తేజఃస్వరూపో నీ కు ఇమే తవ సన్నిధౌ ॥

కిం నామ భవతశ్చైషాం కాని సామాని కా సతీ ।

కోఽహం కో మే భవాన్ బ్రూతే కింకరాః కుత ఆగతాః ॥

క్వ యాన్యసి క్వ యాస్యామి క్వ గచ్ఛంత ఇమే వద ।

హరిరిత్యేవమాకర్ణ్య దురోద సగణో గిరే ॥

నేత్రనిరైస్త్రినేత్రం తం రుదంతం ప్రసీ షేచ సః ।

హరి త్రినేత్రయోర్నేత్ర నీరపాతేన తత్ర వై ॥

బభూవ సరసాం శ్రేష్టం తీర్థం భువనపావనం ।

 భారతే స్తగిరేః పశ్చాత్తత్రోక్షయ పటాంతికే ॥

స్థలం బభూవ తపసాం ముక్తిబీజం తపస్వినాం।

అథోవాచ పునః శీఘమాధ్యాత్మం చ హరం హరిః ॥

శృణ్వతాం సర్వదేవానాం మునీనామూర్ధ్వరేతసాం ।

తేజస్వరూపుడవగు నీవెవరు? నీ సమీపమున నున్న వీరెవరు? నీ నామమేమి? వీరీ నామములేవి? సతి ఎవలె? నేనెవడను? ఈ మాటలు పల్కుచున్న నీవెవడవు? ఈ కింకరులెక్కడి నుండి వచ్చిరీ? నీవెక్కడికి పోవుచున్నావు ? నేనెక్కడికి పోవుచున్నాను? వీరెక్కడికీ పోదురు? చెప్పుము” అని శివుడనుచుండగా వీని శ్రీహరి తన గణములతో పోటు రోదించెను. ఓ పర్వతుడా! తన కన్నీటితో తనవలె దుఃఖించుచున్న త్రినేత్రునిని శ్రీహరి తడిపెను. హరిహరుల నేత్ర జలము పడుట వలన అక్కడి లోకములను పావనము చేయునట్టి తీర్థము గల పుణ్యసరసొకటి - భారత ఖండములో అస్తగిరికి పడమట అక్షయవట. సమీపమున ఏర్పడెను. ఆ స్థలము తపస్సు చేయువారి తపస్సులకు ముక్తి బీజము (ముక్తి చేకూర్చు స్థానము) ఆయెను. . మరల శ్రీహరి హారునికి అధ్యాత్మ విద్యను - వినునట్టి సర్వదేవతలకును, నిష్ణాబ్రహ్మచారులైన మునులకును (జ్ఞాన ప్రదముగా) చెప్పనారంభించెను.

శ్రీభగవానువాచ - భగవంతుడిట్లనెను :

శ్రుణు శంకర వక్ష్యామి జ్ఞానానంద సనాతన॥

 జ్ఞానం జ్ఞాననిధే శోకాద్వీస్మృతోసి వరాత్పర।

సుదినం దుర్దినం శశ్వద్భవత్యేవ భవే భవే॥

సర్వేషాం ప్రాకృతానాం చ తే బీజే సుఖదుఃఖయోః ।

సుఖోద్భవతి హర్షశ్చ దర్సః శౌర్యం ప్రమత్తతా ॥

రాగ ఐశ్వర్యకామశ్చ విద్వేషశ్చ నిరంతరం ।

దుఃఖాచ్ఛోకాత్సముద్వేగాద్భయం నిత్యం ప్రవర్తతే ॥

హతాన్యేతాని సర్వాణి హతే బీజే మహేశ్వర ।

నుదినం దుర్దినం చైవ సర్వకర్మోద్భవం భవ ॥

తత్కర్మ తపసా సాధ్యం కర్మణా చ శుభాశుభం ।

తపః స్వభావ సాధ్యం చ స్వభావోమి భ్యాసతో భవేత్॥

 సంసర్గసాధ్యో ధ్యానశ్చ నంసర్గః పుణ్యతో భవేత్ ।

పుణ్యబీజం మనశైవ పావబీజం చ చంచలం ॥

 మనః శంభో మమాంశశ్చ సర్వేంద్రియ పురస్పరం।

సర్వేషాం జనకోహం చ చత్తం బ్రహ్మా పతిస్త్వయం ॥

ఓ శంకరా! జ్ఞానానందములు గల సనాతనుడా! జ్ఞాననిధీ! పరాత్పరా! నీవు దుఃఖము వలన జ్ఞానమును మరచిపోతివి. ప్రకృతిలోని సర్వజీవులకు ప్రతిజన్మయందు మాటి మాటికి సుదినము దుర్దినము అన్నవి ఏర్పడుచునే ఉన్నవి. ఆ సుదిన దుర్దినములే సుఖ దుఃఖములకు బీజములు (కారణములు) అగుచున్నవి. సుఖము వలన హర్షము దర్పము శౌర్యము మిక్కిలి మదము రాగము (ప్రేమ) ఐశ్వర్యము కామము విద్వేషము నిరంతరము ఏర్పడుచున్నవి. ఇక దుఃఖము వలన శోకము భావతీవ్రత భయము అన్నవి నిత్యము ఏర్పడుచున్నవి. ఓ మహేశ్వరా! వీటికి బీజమైనది నశింపజేయబడినప్పుడు ఆ భావములన్నీయు చంపబడుచున్నవి. అట్టి బీజభూతములైన సుదిన దుర్దినములు సర్వవిధ కర్మల నుండి ఉద్భవించును. ఆ కర్మవలననే శుభాశుభములు కలుగుచున్నవి కనుక కర్మ తపస్సు చేత సాధింపదగినది. ఆ తపస్సు స్వభావముచేత సాధ్యము. స్వభావము అస్తము వలన ఏర్పడును. ఈ అభ్యాసము సంసర్గము (సహవాసాదులు! చేత సాధింపదగినది. సంసర్గము పుణ్యము మూలమున ఏర్పడును. అట్టి పుణ్యమునకు మూలము మనస్సు. ఆ మనస్సే చంచలమైనప్పుడు పాపమునకు మూలము. ఓ శంభూ! సర్వేంద్రియములు ముందు నడుచుచుండగా మనస్సు వ్యవహరించును. ఆ మనస్సు నా అంశమే. అన్నిటికి జనకుడను నేను. చిత్తమునకు ఈ బ్రహ్మఅధిపతి.

బ్రహ్మైకం మూర్తిభేదస్తు గుణభేదేన సంతతం ।

 తద్బ్రహ్మ ఏవిధం వస్తు సగుణం నిర్గుణం శివం ॥

మాయాశ్రితో యః సగుణో మాయాతీతశ్చ నిర్గుణః ।

స్వేచ్ఛామయశ్చ భగవానిచ్ఛయా ఏకరోతి చ॥

 ఇచ్ఛాశక్తిశ్చ ప్రకృతిర్నీత్యా సర్వప్రసః సదా ।

కేదేకం వదంత్యేవ బ్రహ్మజ్యోతి సనాతనం॥

కేచిద్వదంతి ద్వివిధం బ్రహ్మ ప్రకృతి పూర్వకం ।

శ్రుణు యే చ వదంత్యేకం మాయావురుషయోం పరం ॥

 తస్మాద్భవతి తౌ ద్వౌ చ తద్బ్రహ్మ నర్వకారణం ।

ఆథ చైకం పరం బ్రహ్మ ద్వివిధం భవతిచ్ఛయా ॥

ఇచ్చాశక్తిశ్చ ప్రకృతిః సర్వశక్తి ప్రసూః సదా ।

శత్రాశక్తశ్చ సగుణః సర్వాధార సనాతనః ॥

సర్వేశ్వరః సర్వసాక్షీ సర్వత్రాస్తి ఫలప్రదః ।

శరీరం ద్వివిధం శంభో నిత్యం ప్రాకృతమేవ చ ॥

నిత్యం వినాశ రహితం నశ్వరం ప్రాకృతం సదా ।

 అహం త్వం చాపి భగవాన్నావయోర్నిత్య విగ్రహః॥

ఆవయోరంశభూతా యే ప్రాకృతా నష్టవిగ్రహాః ।

రుద్రాదయస్త్వదంశాశ్చ మదంశో విష్ణురూపిణ ॥

ఓ శంభూ! పరబ్రహ్మ మొక్కటియే. సత్త్వరజస్తమో గుణ భేదములను బట్టి ఎల్లప్పుడు మూర్తిభేదములేర్పడుచుండును. ఆ బ్రహ్మమే శివమై సగుణ నిర్గుణములైన వివిధ వస్తువులగును. మోయ నాశ్రయించి యున్న బ్రహ్మ సగుణము మాయ కతీతముగా నున్నబ్రహ్మ నిర్గుణము. నిర్గుణమైన బ్రహ్మమే ఇచ్ఛా శక్తితో కూడి స్వేచ్ఛామయుడు కనుక మార్పు పొందుచున్నాడు. ఇచ్ఛాశక్తి యన్నది - ప్రకృతియే. అది నిత్య, సర్వమును జన్మింపజేయునది (తల్లి). కొందరు సనాతనమై జ్యోతిరూపమైన బ్రహ్మము ప్రకృతి ఒక్కటే

అందురు. కొందరు ప్రకృతి పూర్వకమైన బ్రహ్మమును ద్వివిధముగా చెప్పుదురు. . వినుము. మాయా, పురుషులకంటే శ్రేష్ఠముగా ఒకే బ్రహ్మమని ఎవరు చెప్పుచున్నారో - ఆ అవికారి బ్రహ్మము. నుండీ ఆ యిద్దరు (ప్రకృతి పురుషులు) ఏర్పడుచున్నందున ఆ బ్రహ్మమే సర్వమునకు మూలము. ఆ ఒక్కటియైన పరబ్రహ్మ తన ఇచ్చచేత రెండు విధములగుచున్నది. ఇచ్ఛాశక్తియైతే ప్రకృతియే. ఆమె సర్వశక్తులను కనునది (పుట్టించునది) సగుణ బ్రహ్మము కొంత అశక్తుడైనను సర్వమున కాధారము సనాతనము సర్వసాక్షియై ఆ సర్వేశ్వరుడు ఫలదాతయై ఆంతట ఉన్నాడు. వికారము పొందిన బ్రహ్మ శరీరము నిత్యము ప్రాకృతము అని రెండు విధములు. నిత్యము నాశము లేనిది. ప్రాకృతము నశించు స్వభావము కలది. ఓయీ! నీవును నేనును ఉన్నామే మన ఇద్దరికి నిత్య విగ్రహములు మన అంశభూతులెవరున్నారో వారు ప్రాకృతులు కనుక నష్టవిగ్రహాలు. వారు నా అంశగల విష్ణురూపులు నీ అంశ గల ఏకాదశ రుద్రాదులు (వీరి ఆకారములు ప్రాకృతములు కనుక నశించును).

మమా ప్యేవం ద్విధారూపం ద్విభుజం చ చతుర్భుజం ।

చతుర్భుజోహం వైకురే పద్మయా పారదైస్సహ ॥

 గోలోకే ద్విభుజోహం చ గోపీభిః సహరాధయా ।

 ద్వివిధం యే వదంత్యేవం ద్వౌ ప్రధానౌ తు తన్మతే ॥

పురుషశ్చ సదా నిత్యో నిత్యా ప్రకృతిరీశ్వరీ ।

సహ తౌ ద్వౌ చ సంశ్లేష నర్వేషాం పితరౌ శివ ॥

స శరీరౌ నీళ్ళరీరౌ స్వేచ్ఛయా సర్వరూపిణి ।

 ప్రాధాన్యం చ యథా పునః ప్రకృతేశ్చ సదా తధా॥

 సతీమిచ్ఛసి చేచ్ఛంభో ప్రకృతేః స్తవనం కురు ।

 యత్ స్తోత్రం చ త్వయా దత్తం పురా దుర్వాస సే ముదా॥

తర్దీవ్యం కణ్వశాఖోక్షం భజ తేన జగత్రసూం ।

శోకనాశో భవతు తే శివం శివ మమాశీషా ॥

దూరం విప్లవ హేతుశ్చ యాతు స్త్రీ విరహజ్వరః ।

 ఇత్యేపముక్యో లక్ష్మీశో విరరామ గిరీశ్వరం ॥

స్తవనం కర్తుమారేభే ప్రకృతేశ్చ మహేశ్వరః ।

స్నాత్వా నతాః చ శ్రీకృష్ణం బ్రహ్మాణం భక్తిసంయుతః ॥

 పుటాంజలీయుతో భూత్వా పులకాంచిత విగ్రహః ।

ఓ శంభూ! నాకు కూడని ద్విభుజము (రెండు హస్తములు కలది) చతుర్భుజము (నాలుగు హస్తములు కలది) అని రూపము రెండు విధములుగా నున్నది. వైకుంఠలోకములో లక్ష్మీదేవితో పార్షదులతో కూడి చతుర్భుజుడనుగా - గోలోకములో గోపీ గణములతో రాధాదేవితో కూడి ద్విభుజుడనుగా - ఆ మతములోనిట్లు రెండు ప్రధానమైనవిగా నా రూపము ద్వీషధమని చెప్పుదురు. పరమ పురుషుడు సదానిత్యుడు. సృష్టికి ఈశ్వరియైన ప్రకృతియు నిత్యురాలే. ఎల్లప్పుడా యిద్దరు గాఢముగా సంశ్లేషించి యుండి (ఆలింగనముతో ఒకరితోనొకరు కలిసి) సమస్త ప్రాణికోటికి తల్లిదండ్రులైరి. శరీరములు ధరించియు శరీరములు లేక కూడ తమ ఇచ్ఛానుసారము సర్వరూపములు గలవారై ఉన్నందున ఆ పురుషునకు. అట్లే ప్రకృతికి ఎల్లప్పుడు ప్రాధాన్యము కలదు. ఓ శంభూ! నీవు సతీదేవిని కోరుచుంటివేని ప్రకృతియొక్క స్తోత్రము చేయుము. ఆ స్తోత్రమింతకు ముందే దుర్వాసమునికి నీవిచ్చియుంటివి. అది కణ్వశాఖ యందు చెప్పబడిన దివ్యస్తవము. దానితో జగత్ర్పసువును (జగత్తును కన్న ప్రకృతిని భజించుము. శివా! నా ఆశీస్సుతో నీకు శోకము నశించి శుభమగుగాక, నీ మూర్ఛకు (ప్రాణముల ఆపదకు మూలమైన స్త్రీ విరహజ్వరము నీనుండీ దూరముగా పోవుగాక. ఇట్లు శివునితో పలికి లక్ష్మీనాథుడు సంభాషణము ముగించెను. అప్పుడు మహేశ్వరుడు స్నానమొనర్చి భక్తితో శ్రీకృష్ణునకు బ్రహ్మకు నమస్కరించి భక్తితో పులకరించిన శరీరము గలవాడై హస్తములను నమస్కార ముద్రగా చేసి ప్రకృతి స్తవనము చేయుటకారంభించెను.

మహేశ్వర ఉవాచ - మహేశ్వరుడనెను:

“ఓం నమః ప్రకృత్యై” మంత్రః

బ్రాహ్మీ బ్రహ్మస్వరూపే త్వం మాం ప్రసీద సనాతని ।

పరమాత్మ స్వరూ పే చ పరమానంద రూపిణీ ॥

భద్రే భద్రప్రదే దుర్గే దుర్గ ఘ్నే దుర్గనాశినీ ।

పోతస్వరూ పే జీర్ణే త్వం మాం ప్రసీద భవార్ణవే॥

సర్వ స్వరూ పే సర్వేశీ సర్వ బీజ స్వరూపిణీ ।

సర్వాధారా సర్వవిద్యే మాం ప్రసీద జయప్రదే ॥

 నర్వమంగల రూపే చ సర్వమంగలదోయిని ।

నమస్త మంగలాధారే ప్రసీద సర్వమంగలే ॥

 నిద్రే తండ్రీ క్షమే శ్రధ్ధ తుష్టివుష్టి స్వరూపిణి ।

లజే మేధో బుద్ధిరూపే ప్రసీద భక్తవత్సలే ॥

 వేద స్వరూపే వేదానాం కారణే వేదదాయిని

సర్వవేదాంగ రూపే చ వేదమాతః ప్రసీద మే ॥

దయే జయే మహామాయే ప్రసీద జగదంబికే।

క్షాంతే శాంతే చ సర్వాం తే క్షుత్పిపాసా స్వరూపిణి॥

అంతట వ్యాపించు స్వరూపము గలదానా! బ్రహ్మపత్నివగు సరస్వతీ! సనాతనీ! నన్ననుగ్రహించుము. పరమాత్మ స్వరూపిణీ! పరమానందము రూపమైనదానా! ఓ భద్రా! భద్రములిచ్చుదానా! దుర్గా! ఆటంకములను నశింపజేయుదానా! శత్రుదుర్గములను భగ్నము చేయుదానా! సంసార సముద్రమును తరింపజేయుటకు నావ రూపము పొందిన ప్రాచీనురాలా! సన్ననుగ్రహించుము. సర్వేశీ! సృష్టి సర్వస్వము నీ రూపమైనదానా! సర్వమునకు బీజభూతురాలా! సర్వులకు ఆధారమైనదానా! సర్వవిద్యామూర్తీ! జయమిచ్చుదానా) నన్ననుగ్రహించుము. సర్వమంగళద్రవ్యములు నీ రూపమైనదానా! సర్వమంగళములిచ్చుదానా! సర్వమంగళా! సమస్త మంగళములకాధారభూమీ! అనుగ్రహించుము. నిద్రాదేవీ! జాడ్యమూర్తీ! క్షమాదేవీ! శ్రద్దాదేవీ! తుష్టి పుష్టి రూపిణీ! లజ్ఞాదేవీ! మేధాదేవీ! బుద్ధిరూపా! భక్తులయందు వాత్సల్యము {బిడ్డలమీదీ మాతృప్రేమ} గలదానా! అనుగ్రహించుము. వేదరూపా! వేదదాత్రీ! వేదమూలమ! వేదాంగములు రూపమైనదానా! వేదమాతా! నన్ననుగ్రహించుము. దయాదేవీ! జయమూర్తీ మహామాయా। జగదంబా! క్షాంతి శాంతిరూపా! సర్వజీవులయందు ఆకలిదప్పులే స్వరూపమైన తల్లీ నాకు ప్రసన్నురాలవు కమ్ము.

లక్ష్మీర్నారాయణక్రోడే స్రష్టుర్వక్షసి భారత్ ।

మమ క్రోడే మహామాయే విష్ణుమాయే ప్రసీద మే॥

కలాకాషాస్వరూ పే చ దివారాత్రి స్వరూపిణి ।

పరిణామప్రదే దేవి ప్రసీద దీనవత్సలే ॥

కారణే సర్వశక్తీనాం కృష్ణస్యోరసి రాధికే ।

కృష్ణప్రాణాధికే భద్రే ప్రసీద కృష్ణపూజితే ॥

 యశః స్వరూపే యశసాం కారణే చ యశః ప్రదే ।

 నర్వదేవీ స్వరూ పే చ నారీరూప విధాయినీ॥

సమస్త కామినీ రూపే కలాంశేన ప్రసీద మే ।

సర్వసంపత్స్వరూపే చ సర్వసంపత్ర్పదే శుభే ॥

ప్రసీద పరమానందే కారణే సర్వసంపదాం ।

యశస్వినాం పూజితే చ ప్రసీద యశసాం నిధే ॥

 ఆధారే సర్వజగతాం రత్నాధారే వసుంధరే ।

 చరాచర స్వరూ పే చ ప్రసీద మమ మా చీరం ॥

యోగ స్వరూపే యోగీ యోగదే యోగకారణే ।

యోగాధిష్ఠాత్రీ దేవశే దేవీ ప్రసీద సిద్ధయోగిని ॥

సర్వసిద్ధి స్వరూపే చ సర్వసిద్ధి ప్రదాయిని ।

కారణే సర్వసిద్ధీనాం సిద్ధేశ్వరి ప్రసీద మే ॥

వ్యాఖ్యానం సర్వశాస్త్రాణాం మతభేదే మహేశ్వరి ।

జ్ఞానే యదుక్తం తత్పర్వం క్షమస్వ పరమేశ్వరి ॥

నారాయణుని ఒడిలో లక్ష్మిగా, బ్రహ్మవక్షఃస్థలమందు సరస్వతిగా, నా ఒడిలో మహామాయగా నున్న విష్ణుమాయా నా యందనుగ్రహము చూపుము. కాలము యొక్క అత్యలాంశములైన కళాకాష్ఠలు వ్యక్తాంశములైన దివారాత్రములు స్వరూపములైనధానా! ఋతువులు మొదలగు కాలపరిణామములనిచ్చుదానా! దేవీ! దీనులయందు దయగలదానా! అనుగ్రహించుము. సర్వశక్తి గుణములకు మూలమైనదానా! కృష్ణుని వక్షఃస్థలమున నున్న రాధాదేవీ! కృష్ణునికీ ప్రాణముల కంటే అధిక ప్రియమైనదానా! భద్రా! కృష్ణపూజితా! అనుగ్రహింపుము. కీర్తిరూపిణీ! కీర్తులకు మూలధారమా! కీర్తినిచ్చుదానా! సర్వ దేవీ స్వరూపములు ధరించుదానా! స్త్రీరూప నిర్మాణ దేవతా! నీ కళలలోని పదహారవ భాగమో సమస్త స్త్రీ రూపములు ధరించుదానా! నన్ననుగ్రహింపుము. సర్వసంపదలు స్వరూపమై సర్వసంపదలిచ్చు శుభమూర్తీ! సర్వసంపదలకు మూలమై పరమానందము రూపమైనదానా! అనుగ్రహింపుము. కీర్తిమంతులచేత పూజింపబడిన తల్లీ! యశస్పులకు నిధియైన దానా! అనుగ్రహింపుము. సర్వజగముల కాధారభూతురాలా! రత్నముల కాధారమైన వసుంధరా! చరాచర స్వరూపిణీ! ఆలస్యము చేయక నన్ననుగ్రహింపుము, యోగీశ్వరీ! యోగస్వరూపిణీ యోగమూలమా! యోగశక్తిదాత్రీ! యోగమునకధిష్టాన దేవతా! దేవీగణములకు నాయకురాలా సిద్ధయోగినీ సర్వసిద్ధుల రూపమైనదానా! అణిమాది సర్వసిద్ధిదాయినీ! సర్వసిద్ధులకు ! మూలమైన తల్లీ! సిద్ధేశ్వరీ! నన్ననుగ్రహించుము. ఓ మహేశ్వరీ! సర్వశాస్త్రముల వ్యాఖ్యానములో మతభేదము లేర్పడగా తత్వశాస్త్రమందే జ్ఞానము చెప్పబడినదో ఆ సర్వమును క్షమించుమా!

కేచిద్వదంతి ప్రకృతేః ప్రాధాన్యం పురుషస్య చ।

కేచిత్తత్ర మతద్వైధే వ్యాఖ్యాభేదం విదుర్భుధాః ॥

మహావిష్ణోర్నాభిదేశే స్థితం తం కమలోద్భవం ।

 మధుకైటభౌ మహాదైత్యా లీలయా హంతు ముద్యతే ॥

దృష్వా స్తుతిం ప్రకుర్వంతం బ్రహ్మాణం రక్షితుం పురా ।

బోధయామాస గోవిందం వినాశ హేతవే తయోః ॥

 నారాయణస్త్వద్భక్త్యా చ జఘాన తా మహాసురౌ ।

సర్వేశ్వర స్త్వయా సార్థమనీశో యం త్వయా వినా ॥

వురా త్రిపుర సంగ్రామే గగనాతృతితే మయి ।

 త్వయా చ విష్ణునా సార్థం రక్షితో హం సురేశ్వరి ॥

 ఆధునా రక్ష మామీశే ప్రదగ్ధం విరహాగ్నినా ।

స్వాత్మ దర్శన పుణ్యేన క్రీణీహి పరమేశ్వరి ॥

కొందరు ప్రకృతికి ప్రాధాన్యమును మరికొందరు పురుషునకు (ఈశ్వరునకు) ప్రాధాన్యము చెప్పుదురు. ఈ రెండు మతములేర్పడగా పండితులాస్థితినీ - వ్యాఖ్యానించుటలోని భేదముగా తెలిసికొనిరి. పూర్వము మహావిష్ణువు యొక్క నాభియందున్న కమలోద్భవుని (బ్రహ్మను) మధుకౌటభులనెడి మహాదైత్యులు చంపుటకు సిద్ధపడగా - అది చూచి బ్రహ్మ రక్షింపుమని స్తుతిచేయుచుండగా – ఆ యిద్దరు దౌత్యులను వినాశము చేయుటకు గోవిందునికి (జగన్మాత) బోధ చేసెను. అప్పుడు నారాయణుడు నీ భక్తి కారణముగా ఆ మహాసురులను సంహరించెను. నీతో కూడీ అతడు సర్వేశ్వరుడైనాడు. నీతో కూడిలేనప్పుడతడు అనీశుడు (కార్యనిర్వహణకు అసమర్థుడు). పూర్వము త్రిపురాసురులతో యుద్ధము చేయుచు నేను ఆకాశము నుండి క్రిందపడగా - ఓ సురేశ్వరీ!విష్ణువుతో కూడి యున్న నీ చేత రక్షింపబడితిని, ఓ ఈశురాలా! విరహాగ్నిలో మిక్కిలీ కాల్పబడిన, నన్ను ఇప్పుడు రక్షించుము. నీ స్వరూప దర్శనమను పుణ్యము చేత - ఓ పరమేశ్వరీ! నన్ను కొనవలసినది.

ఇత్యుక్త్వా విరతః శంభుర్ధదర్శ గగనస్థితాం ।

రత్నసార రథస్థాం తాం దేవీం శతభుజాం ముదా॥

 తప్తకాంచన వర్షాభాం రత్నాభరణ భూషితాం ।

ఈషధాస్య ప్రసన్నాస్యాం జగతాం మాతరం సతీం ॥

దృష్వా తాం ఏరహాసక్తః పునస్త్యువ సత్వరం ।

దుఃఖం నివేదయామాస ప్రరుదన్విరహోద్భవం॥

 దర్శయామాసాస్థిమాలాం స్వాంగస్థం భస్మ భూషణం ।

 కృత్వా బహు పరిహారం తోషయామాస సుందరీం॥

నారాయణశ్చ బ్రహ్మా చ ధర్మః శేషః సురర్షయః।

శివం రక్షేశ్వరీత్యుక్త్వా తుష్టువు స్తే సనాతనం ॥

బభూవ వరీతుషా సా తేషాం స్తోత్రేణ తత్ క్షణం ।

ఉవాచ కృపయా శంభుం ప్రాణేశం ప్రాణ వల్లభా ॥

ఇట్లు పలికి ఆగిపోయిన శివుడు రత్నసార రథము మీద శతభుజములతో ఆకాశమందున్న ఆ దేవిని సంతోషముతో దర్శించేను. కరిగించిన బంగారము వంటి కాంతితో రత్నాభరణ భూషితురాలై- చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖము గలదై ఉన్న ఆ జగన్మాతను - సతీదేవిని చూచి శివుడు విరహాసక్తితో త్వరగా మరల స్తుతించెను. ఏడ్చుచు ఎడబాటు వలన కలిగిన దుఃఖమును నివేదించెను. తన శరీరమందలి అస్థిమాలను (ఎముకల దండ) అలంకారముగా పులుముకొన్న భస్మమును చూపించెను. అనేకముగా తన దోష పరిహార వాక్యములు చెప్పి ఆ సుందరిని సంతోష పరచెను. నారాయణుడు బ్రహ్మ ధర్మదేవత శేషుడు దేవఋషులు ఈశ్వరీ! శివుని రక్షింపుమని పలికి ఆ సనాతనిని స్తుతించిరి. వారి స్తోత్రముతో సంతుష్టిపొంది ఆమె వెంటనే తన ప్రాణేశుడైన శంకరుని గూర్చి ఆ ప్రాణవల్లభ కృపతో ఇట్లు పలికెను.

ప్రకృతిరువాచ - ప్రకృతిదేవి పలికెను :

స్థిరో భవ మహాదేవ ప్రాణాధిక మమ ప్రభో ।

 భవానాత్మా చ యోగీశః స్వామీ జన్మని జన్మనీ ॥

 ఆహర శైలేంద్ర కామిన్యాం ల్వ జన్మ మహేశ్వర ।

తవ పత్నీ భవిష్యామి ముంచ త్వం విరహజ్వరం॥

ఇత్యుక్త్యా శివమాశ్వాస్య చోంతర్థానం చకార సా ।

నురా జగ్ముస్తమాశ్వాన్య లజ్జ నమ్రాత్మ కంధరం॥

హర్వాంతరాత్మా గిరీశః కైలాసం తు జగామ హ ।

 ననర్త సగణనూర్ణం సంత్యజ్య విరహజ్వరం ॥

ఇదం శివకృతం స్తోత్రం ప్రకృత్యా యః పఠేన్నరః ।

న భవేళ్కామినీ భేదస్తన్య జన్మని జన్మని ॥

 ఇహలోకే సుఖం భుక్త్వా స యాతి శివ మందిరం ।

ధర్మార్థకామ మోక్షాంశ్చ లభతే నాత్ర సంశయః॥

ఓ మహాదేవా! నాకు ప్రాణముల కంటే అధిక ప్రియమైన వాడా! స్థిరుడవు కమ్ము, యోగీశుడవగు నీవు నాకు జన్మజన్మలకు ఆత్మవు నా భర్తవు. పర్వతరాజు యొక్క పత్నియందు నేను జన్మించి నీకు భార్యనగుదును. నీవిక విరహాజరము వదలుము. ఇట్లు శివునోదార్చి ఆమె అంతర్ధానమయ్యెను. సిగ్గుతో తన మెడను వంచుకొన్న శివుని దేవతలోదార్చి వెడలిపోయిరి. శివుడు విరహజ్వరము విడిచి పెట్టి వెంటనే తన గణములతో బాటు నర్తనము చేసి హర్షము పొందిన మనస్సుతో కైలాసమున కేగెను. శివకృతమైన ఈ ప్రకృతి స్తోత్రమును పఠించిన నరుడు జన్మజన్మలకు భార్యా వియోగము పొందకుండ నుండును. ఇహలోకములో ధర్మార్థకామ పురుషార్ధ సుఖములను అనుభవించి మోక్షము పొంది శివలోకమును చేరును. ఇందు సంశయము లేదు.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే శంకర శోకావనోదనం నామ త్రీచత్వారింశోధ్యాయః॥

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన శంకరుని శోకము తొలగింపబడుట అను కథాంశము గల నలుబది మూడవ అధ్యాయము సమాప్తము.