106 - అధ్యాయము

మూII శ్రీనారాయణ ఉవాచ :

ఏతస్మిన్నంతరే రాజాకకుర్మీచ మహాబలః ।

వరార్థం కన్యకాయాశ్చ బ్రహ్మలోకా త్సమాగతః ॥

ప్రదదౌ రేవతీం కన్యాంశశ్వత్ సుస్థిరమౌవనాం ।

అమూల్యరత్నభూషాఢ్యం త్రిషులోకేషు దుర్లభాం ॥

బలాయ బలదేవాయ సంప్రదానేన కౌతుకాత్ ।

వయో యస్యాగతం సత్యే యుగానాం సప్తవింశతిః ॥

దత్త్వాకన్యాం విధానేన మునిదేవేంద్రసంసది ।

గజేంద్రాణాం త్రిలక్షంచ జామాత్రే యాతుకందదౌ ॥

దశలక్షం తురంగాణాం రథానాం లక్షమేవచ ।

రత్నాలంకార యుక్తానాందాసీనాంచాపి లక్షకం ॥

మణిలక్షం రత్న లక్షం స్వర్ణకోటించ సాదరం ।

వహ్నిశుద్ధాంశుకం రమ్యం ముక్తామాణిక్య హీరకం II

 దత్త్వాకన్యాంచ రాజేంద్రో బలాయ బలశాలినే ।

రత్నేంద్రసారయానేన తైః సార్థం కుండినం యణా ॥

అథాంతరేచ నిర్బంధే సాంగేమంగలకర్మణి ।

రేవతీం వేషయామాస యోషితాం కమలాంకలాం II

 దేవకీ రోహిణీచైవ యశోదా నందగేహినీ!

అదితిశ్చ దితిశ్శాంతిర్ణయం కృత్వాచ మందిరం ॥

బ్రాహ్మణాన్ భోజయామాస దదౌ తేభ్యో ధనంముదా ।

మంగలం కారయామాసవసుదేవస్య వల్లభః ॥

అథదేవాశ్చమునయో రాజేంద్రాః కటకైస్సహ ।

సంప్రాపుల్లేలా మాత్రేణ కుండినం నగరం ముదా !!

దదృశుర్నగరం సర్వే హ్యతీవ సుమనోహరం ।

సప్తభిః పరిఖాభిశ్చ గభీరాభిశ్చ వేష్టితం ॥

ప్రాకారైః సప్తభిర్యుక్తం ద్వారాణాంశతకైస్తథా ।

నానా రత్నైశ్చమణిభిః నిర్మితం విశ్వకర్మణా ॥

నగరస్య బహిర్ద్వారం దదృశుః వరయాత్రిణః ।

రక్షితం రక్షకై స్సార్థం చతుర్భిశ్చ మహారథైః II

అను ॥ శ్రీనారాయణుడిట్లా :

ఇంతలో మహాబలుడైన కకుద్మి అనురాజు కన్యకకు వరుని కొరకై బ్రహ్మలోకమునుండి వచ్చాడు. (1) ఎప్పుడూ సుస్థిరంగా ఉండే వనంగల కన్యను, రేవతిని, అమూల్యమైన రత్నభూషణములు కలదానిని, ముల్లోకములలో దుర్లభమైన దానిని (2) ఆనందంగా బలవంతుడైన బలదేవునకు దానపూర్వకముగా ఇచ్చాడు. సత్యయుగంలో ఆమె వయస్సు ఇరవై ఏడు యుగములు గడించింది. (3) మునులు దేవేంద్రులు ఉన్న సభలో కన్యను విధానపూర్వకముగా ఇచ్చాడు. మూడు లక్షల ఏనుగులను అల్లునకు అరణంగా ఇచ్చాడు. (మౌతుకం) (4) పది లక్షల గుజ్జాలు, లక్ష రథములు, రత్నముల అలంకారములతో కూడిన దాసి జనాన్ని లక్ష, (5) లక్ష మణులు, లక్ష రత్నాలు, కోటి బంగారము ఆదరంగా ఇచ్చాడు. రమ్యమైన వహ్నిశుద్ధమైన వస్త్రములు, ముత్యములు, మాణిక్యములు, వజ్రములు (6) ఇచ్చి, రాజేంద్రుడు బలశాలియైన బలరామునకు కన్యను ఇచ్చాడు. శ్రేష్ఠరత్నముల సారముతో నిర్మించిన పల్లకి పై వారితో కూడి కుండినకు వచ్చాడు. (7) ఇంతలో ప్రార్థించి సాంగమైన మంగళకర్మయందు, కలమ, కలయైన రేవతి వనితను అలంకరించారు. (8) దేవకి, రోహిణి, యశోద, (నందుని భార్య), అదితి, దితి శాంతి వీరంతా మందిరాన్ని అలంకరించి (9) బ్రాహ్మణులకు భోజనం పెట్టించారు. వారికి ఆనందంగా ధనమిచ్చారు. వల్లభుడు (రాజు) వసుదేవునకు మంగలకార్యం చేయించాడు. (10) ఇంతలో దేవతలు, మునులు, రాజేంద్రులు, తమతమ సైన్యంతో అనుకున్నంతలో, ఆనందంతో కుండిన నగరానికి వచ్చారు. (11) చాలా సుమనోహరమైన నగరాన్ని అందరు చూచారు. లోతైన ఏడు కందకములతో చుట్టబడినది. (12) ఏడుప్రాకారములు గలది, నూరు ద్వారాలు గలది. విశ్వకర్మ రకరకాల రత్నాలతో, మణులతో నిర్మించాడు. (13) కోరతగిన యాత్రికులంతా నగర బహిర్ ద్వారాన్ని చూచారు. మహారథులైనవారు నలుగురు, అట్లాగే రక్షకులతో రక్షించబడినదది. (14)

మూII రుక్మిశ్చశిశుపాలశ్చ దంతవక్రోమహాబలీ ।

శాల్వో మాయావినాం శ్రేష్టో యుద్దశాస్త్ర విశారదః ॥

నానాశస్త్రైస్తథాస్త్రై శ్చరథస్థ శ్చరణోన్ముఖః ॥

విలోక్య కృష్ణ సైన్యంచ చుకోప నృపనందనః ॥

ఉవాచనిష్ఠురం వాక్యం శ్రుతితీక్షం సుదుష్కరం ।

ఉపహాస్యం మునీంద్రాంశ్చ దేవాంశ్చ మునిపుంగవాన్ ॥

రుక్మిరువాచ :

అహోకాలకృతం కర్మదైవంచ కేనవార్యతే ।

కింవాహం కథయిష్యామి దేవేంద్రాణాంచ సంసది ॥

 గ్రహీతుంరుక్మిణీం కన్యాం దేవయోగ్యం మనోహరాం ।

ఆయాతిదేవైః మునిభిః నందస్యపశురక్షకః ॥

సాక్షాక్షౌరశ్చగోపీనాం గోపోచ్ఛిష్టాన్న భోజనః ।

 జాతేశ్చనిర్ణయోనాస్తిభక్ష్య మైథునయోస్తథా ॥

కిన్నురాజేంద్ర పుత్రశ్చ కన్నుపామునిపుత్రకః ।

వసుదేవః క్షత్రియశ్చ భక్షణం వైశ్యమందిరే ॥

శిశుకాలేచ స్త్రీ హత్యాకృతానేన దురాత్మనా ।

కుబ్ధామృతాచ సంభోగాత్ వాససారజకోమృతః ॥

రాజేంద్రస్యవధోదుష్టః బ్రహ్మహత్యాంలభేద్రువం ।

మధురాయంచ ధర్మిష్ఠః సద్యః కంసోనిపాతితః ॥

శాల్వ ఉవాచ :

యదుక్తం రుక్మిణా దేవ కిమసత్యంచ తత్రవై !

కోవాయంరుక్మిణీభర్తా నందస్యపశురక్షకః ॥

శిశుపాల ఉవాచ :

అహోభువి కిమాశ్చర్యం దేవబ్రహ్మాదయ స్తథా ।

మునీంద్రా బ్రహ్మణః పుత్రాశ్చాయయుః మానవాజ్ఞయా ॥

దంతవక్త్ర ఉవాచ :

సంతతం బ్రాహ్మణాలుబా దేవాశ్చ భక్తవత్సలాః ।

ఆయుయుః బ్రహ్మపుత్రాశ్చ నందపుత్రాజ్ఞయాకథం ॥

తేషాంచ వచనం శ్రుత్వా చుకోప దేవ సంఘకః ।

మునిరాజేంద్ర సంఘశ్చ లాంగరీత్యాదికం తథా ॥

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధే నారాయణ నారాద సంవాదే రుక్మిణ్యు ద్వాహేషడధిక శతతమోధ్యాయః ॥

రుక్మి శిశుపాలుడు, మహాబలవంతుడైన దంతవక్రుడు, శాల్వుడు మాయావులలో శ్రేష్ఠుడైనవాడు, యుద్ధశాస్త్ర విశారదుడు (వాడు) వీరంతా (15) రకరకాల శస్త్రాస్త్రములతో, రథం మీద కూర్చొని, యుద్దోన్ముఖమైన కృష్ణ సైన్యాన్ని చూచి, రాకుమారుడు కోపించాడు. (16) వినకఠినమైన, అనరాని మాటలను, నిష్టురంగా పలికాడు. మునీంద్రులను, దేవతలను, మునిపుంగవులను వెక్కిరించే మాటలన్నాడు. (17) రుక్మివనచమిట్లా - ఆహా! కాలం చేసిన పని, దైవాన్ని ఎవడు తప్పించగలడు దేవేంద్రుల సభలో నేనేం మాట్లాడాలి. (18) దేవతలకు యోగ్యమైన, మనోహరమైన, రుక్మిణి అను కన్యను స్వీకరించడానికి దేవతలతో మునులతో కలసి నందుని పశురక్షకుడు వస్తున్నాడు. (19) సాక్షాత్తు గోపికలజారుడు, గోపకుల ఎంగిలిని తినేవాడు. జాతిని నిర్ణయించలేము. తినేవి, సంగమమును, (స్త్రీ సంగమానికి హద్దులేదు) నిర్ణయించలేము. (20) ఈతడు రాజేంద్రపుత్రుడా? మునిపుత్రుడా? వసుదేవుడు క్షత్రియుడు. తిండి వైశ్యుని ఇంట్లో (21) చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు స్త్రీని చంపాడు ఈ దురాత్ముడు. వీడి సంభోగంతో కుబ చనిపోయింది. వస్త్రముతో చాకలివాడు చచ్చాడు. (22) రాజేంద్రుని చంపటం చాలా చెడ్డది. అందుకు బ్రహ్మహత్యపాపాన్ని పొందుతాడు. మథురలో ధర్మిష్ఠుడైన కంసుని అప్పుడే చంపేశాడు. (23) శాల్వుడిట్లా - ఓ దేవ! రుక్మి చెప్పిన దానిలో ఏమైనా అబద్ధముందా? రుక్మిణి భర్త ఎవరు? అనగానే నందుని పశురక్షకుడు అని గదా సమాధానం . (24) శిశుపాలుడిట్లా - ఓ ఈభూమి పై ఎంత ఆశ్చర్యము. దేవతలు బ్రహ్మాదులు మునీంద్రులు, బ్రహ్మపుత్రులు, వీరంతా ఒకమనిషి ఆజ్ఞతో వచ్చారు. (25) దంత వక్రుడిట్లా - ఎల్లప్పుడూ బ్రాహ్మణులు లుబ్ధులు, దేవతలు భక్తవత్సలులు. బ్రహ్మపుత్రులు, నందపుత్రుని ఆజ్ఞతో ఎట్లా వచ్చారు. (26) వారి మాటలు విని దేవతల సమూహమంతా కోపించింది. మునుల రాజేంద్రుల సంఘములు, బలరాముడు మొదలగు వారంతాను కోపగించారు. (27)

అని బ్రహ్మవైవర్త మహాపురాణ శ్రీకృష్ణజన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు రుక్మిణి వివాహమందు నూట ఆరవ అధ్యాయము.