బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

105 - అధ్యాయము

మూ శ్రీనారాయణ ఉవాచ :

అథవైదర్భ రాజేంద్రో మహాబలపరాక్రమః

విదర్భదేశే పుణ్యాత్మా సత్యశీలశ్చ భీష్మకః

రాజానారాయణాంశశ్చ దాతాచ సర్వసంపదాం

ధర్మిష్ఠశ్చ గరీయాంశ్చ వరిష్ఠశ్చాపిపూజితః

తస్యకన్యా మహాలక్ష్మీ రుక్మిణీ యోషితాం వరా

అతీవ సుందరీ రమ్యా రమారామాసు పూజితా

నవ మౌనవ సంపన్నా రత్నాభరణ భూషితా

తప్తకాంచన వర్ణాభా తేజసోజ్జ్వలితాసతీ

శుద్ధ సత్వస్వరూపాసా సత్యశీలా పతివ్రతా

శాంతాదాంతా నితాంతా చాప్యనంత గుణశాలినీ

 ఇంద్రానీ వరుణానీచ చంద్రనారీచ రోహిణీ

కుబేరపత్నీ సూర్యస్త్రీ స్వాహాశాంతా కలావతీ

అన్యాసు రమణీయాసు శ్రేషాచ సుమనోహరా

రుక్మిణ్య భీష్మకన్యాయాః కలాం నార్హంతి షోడశీం

తాందృష్ట్వా రాజరాజేంద్రో బాలక్రీడారతాంపరాం

బాలాం సుశోభాం కుర్వంతీం యధా భేషు విధోః కలాంII

శరత్పూర్ణేందు శోభాడ్యాం శరత్కమలలోచనాం

వివాహయోగాం యువతీం లజ్జ నమ్రాననాం శుభాం

హసాచింతితో ధర్మో ధర్మ శీలశ్చ సువ్రతః

సుతాం పప్రచ్ఛ పుత్రాంశ్చ బ్రాహ్మణాంశ్చ పురోహితాన్

భీష్మక ఉవాచ :

కింవృషోమిసుతార్థంచ వరార్హం ప్రవరం వరం

మునిపుత్రం దేవపుత్రం రాజేంద్రసుతమీప్సితం

వివాహ యోగ్యా కన్యా మే వర్ధమానా మనోహరా

శీఘ్రం పశ్య వరం యోగ్యం నవయౌవన సంస్థితం

శీలం సత్యసంధం నారాయణ పరాయణం

వేదవేదాంగ విజ్ఞంచ పండితం సుందరం శుభం

శాస్త్రం దాంతం క్షమాశీలం గుణినం చిరజీవినం

మహాకుల ప్రసూతంచ సర్వతైవ ప్రతిష్ఠితం

కరోషిరాజపుత్రం చేద్రణశాస్త్ర విశారదం

మహారథం ప్రతాపార్హంరణ మూర్ధ్నాచ సుస్థిరం

కరోషి దేవపుత్రం చేద్దేవం గుణయుతం తథా

కరోషిమునిపుత్రంచే చ్చతుర్వేద విశారదం

సువాచకం విచారజ్ఞం సిద్ధాంతేషునితాంతకం

నృపేంద్ర వచనం శ్రుత్వా తమువాచమునేః సుతః

అను!! శ్రీనారాయణుడిట్లన్నాడు :

ఇక విదర్భ రాజేంద్రుడు మహాబలపరాక్రమములు కలవాడు. విదర్భ దేశంలో పుణ్యాత్ముడు, సత్యశీలుడు, భీష్మకుడని పేరు. (1) ఆరాజు నారాయణుని అంశము. అన్ని సంపదలను ఇచ్చేవాడు. ధర్మిష్ణుడు, పెద్దవాడు, వరిష్ణుడు, పూజింపబడేవాడు. (2) ఆతని కన్య మహాలక్ష్మి, రుక్మిణి అని పేరు. స్త్రీలలో శ్రేష్ఠురాలు చాలా అందకత్తె, రమ్యమైనది. లక్ష్మీ, స్త్రీలలో పూజింపబడునది. (3) నవ యౌవ్వన వంతురాలు, రత్నాభరణములతో అలంకరింపబడినది. కాల్చిన బంగారం వంటి రంగు గలది. తేజస్సుతో వెలిగిపోతున్న స్త్రీ, సతి ఆమె. (4) ఆమె శుద్ధసత్వ స్వరూపురాలు, సత్యశీలురాలు, పతివ్రత. శాంతురాలు, మిక్కిలి బ్రహ్మచర్యాదితపః క్లేశమునోర్చునది, అత్యంతము మంచి గుణములు కలది. (5) ఇంద్రుని భార్య వరుణుని భార్య చంద్రుని భార్య రోహిణి, కుభేరుని భార్య, సూర్యుని భార్య, స్వాహా, శాంత, కలావతి (6) ఇంకా ఇతరులైన రమణీయమైన స్త్రీలలో శ్రేష్ఠురాలు, చాలా మనోహరమైనది. వీళ్ళందరూ భీష్ముని కన్యయైన రుక్మిణి యొక్క పదహారవ భాగపు కళకు గూడా పోలరు. (7) రాజరాజేంద్రుడు,బాలక్రీడలందు ఆసక్తి కలిగిన, పరురాలైన ఆమెను చూచాడు. ఆమె బాల, మంచి శోభగలది, మేఘములలో చంద్రకళలాగా ఉన్నది. (8) శరత్కాల మందలి ఆమె బాలమంచి శోభగలది, శరత్కాలమందలి కమలముల వంటి కళ్ళు గలది. వివాహ యోగ్యమైనది, యువతి, లజ్జతో తలవంచుకున్నది శుభురాలు. (9) సువ్రతుడు, ధర్మశీలుడైన ధర్ముడు (రాజు) త్వరగా ఆలోచించి కూతురును, కొడుకులను, బ్రాహ్మణులను, పురోహితులను అడిగాడు. (10) భీష్మకుడిట్లా - నాకూతురు కొరకు, వరుడుగా తగిన వానిని, శ్రేషుని, వరునిగా ఎవరిని ఎంచుకోవాలి. మునిపుత్రునా, దేవపుత్రునా, రాజేంద్ర సుతునా, కోరతగినవాడెవడు. (11) నా కూతురు వివాహ యోగ్యురాలైంది, పెరుగుతోంది, మనోహరంగా ఉంది. నవయౌవన మందున్న యోగ్యుడైన వరుని త్వరగా చూడండి.(12) ధర్మశీలుడు, సత్యసంధుడు, నారాయణ పరాయణుడు, వేదవేదాంగము లెరిగినవాడు పండితుడు, సుందరుడు, శుభుడు (13) శాంతుడు, దాంతుడు, క్షమాశీలుడు, గుణవంతుడు, చిరకాలం జీవించేవాడు. గొప్పకులంలో పుట్టినవాడు, అంతటా పేరు గలవాడు (14) రాజపుత్రుని చేస్తే వాడు రణశాస్త్ర విశారదుడు, మహారథుడు , ప్రతాపమునకు తగినవాడు, యుద్ధంలో తలమానికగా ఉండే వాడుకావాలి. (15) దేవపుత్రుని చేస్తే దేవుడు, మంచి గుణవంతుడు, కావాలి. మునిపుత్రుని చేస్తే ఆతడు నాలుగు వేదములందు విశారదుడై ఉండాలి.(16) మంచిగా మాట్లాడేవాడు, విచారం తెలిసినవాడు, సిద్ధాంతములందు ఆరితేరినవాడు, నృపేంద్రుని మాటను విని మునిసుతుడు ఆతనితో ఇట్లన్నాడు. (17)

మూ గౌతమస్య శతానందో వేదవేదాంగ పారగః

ఆప్తః ప్రవక్త విజ్ఞశ్చ ధర్మీ కులపురోహితః

పృథివ్యాంసర్వతత్వజ్ఞో నిష్ణాతః సర్వకర్మసు

శతానంద ఉవాచ :

రాజేంద్ర త్వంచ ధర్మజ్ఞో ధర్మశాస్త్ర విశారదః

పూర్వాఖ్యానంచ వేదోక్తం కథయామి నిశామయ

భువోభారావతరణే స్వయం నారాయణోభువి

వసుదేవ సుతః శ్రీమాన్ పరిపూర్ణతమః ప్రభుః

విధాతుశ్చవిధాతాచ బ్రహ్మేశశేష వందితః

జ్యోతిః స్వరూపః పరమోభక్తానుగ్రహ విగ్రహః

పరమాత్మాచ సర్వేషాం ప్రాణినాం ప్రకృతేః పరః

నిర్లిప్తశ్చ నిరీహశ్చసాక్షీచ సర్వకర్మణాం

రాజేంద్ర తస్మై కన్యాంచ పరిపూర్ణతమాయచ

దత్త్వాయాస్యసి గోలోకం పితృణాంశతకైః సహ

లభసారూప్యముక్తించ కన్యాందత్వా పరత్రచ

ఇ హైవ సర్వపూజ్యశ్చ భవ విశ్వగురోర్గురుః

సర్వస్వం దక్షిణాం దత్వా మహాలక్ష్మీంచ రుక్మిణీం

సమర్పణం కురువిభోకురుష్వ జన్మఖండనం

విధాత్రాలిఖితో రాజ్య సంబంధః సర్వసమ్మతః II

ద్వారకానగరేకృష్ణం శీఘ్రం ప్రస్థాపయద్విజం

కృత్వాశుభక్షణం తూర్ణం సర్వేషామపిసంమతం

ఆనీయ పరమాత్మానం భక్తానుగ్రహ విగ్రహం

ధ్యానానురోధ హేతుంచ నిత్య దేహ మనుత్తమం

దృష్టి మాత్రాత్కురునృప స్వజన్మ కర్మ ఖండనం

యం నజానంతి చత్వారోవేదాః సంతశ్చదేవతాః !!

సిద్ధేంద్రాశ్చమునీంద్రాశ్చ దేవాబ్రహ్మాదయస్తథా

ధ్యాయంతే ధ్యానపూతాశ్చయోగినో న విదంతియం

సరస్వతీ జడీభూతా వేదాః శాస్త్రాణియానిచ

సహస్ర వక్ర శేషశ్చ పంచవక్షః సదాశివః

చతుర్ముఖో జగద్ధాతా కుమారః కార్తికస్తథా

ఋషయోమునయశ్చైవ భక్తాః పరమవైష్ణవాః

అక్షమాః స్తవనేయస్య ధ్యానాసాధ్యశ్చయోగినాం

బాలక్నోహం మహారాజ తదుణం కథయామికిం

శతానందవచః శ్రుత్వా ప్రపుల్లవదనోనృపః

ఆలింగనం దదౌతస్మై సముత్థాయ జవేనచ

ఆమునిసుతుడు, గౌతముని కుమారుడైన శతానందుడు వేదవేదాంగ పారగుడు, ఆపుడు, మంచివక్త, విజుడు, ధర్మమెరిగినవాడు, కులపురోహితుడు. భూమి పై అన్ని తత్వముల నెరిగినవాడు, అన్ని పనులలో ఆరితేరినవాడు (18) శతానందుని వచనమిట్లా - ఓ రాజేంద్ర! నీవు ధర్మజ్ఞుడివి, ధర్మశాస్త్ర విశారదుడివి. (19) వేదములో చెప్పబడ్డ ప్రాచీనమైన ఆఖ్యానాన్ని చెబుతాను, విను. భూభారాన్ని తగ్గించే కొరకు నారాయణుడు స్వయంగా భూమి పై, (20) వసుదేవ సుతునిగా వచ్చాడు. శ్రీమంతుడు, పరిపూర్ణతముడు, ప్రభువు విధాతకు విధాత బ్రహ్మ ఈశుడు, శేషుడు వీరిచే నమస్కరింపబడేవాడు. (21) జ్యోతి స్వరూపుడు, పరముడు, భక్తులను అనుగ్రహించే కొరకు రూపమెత్తినవాడు. పరమాత్మ ప్రాణులన్నింటికన్న ప్రకృతికన్నపరుడు (22) నిర్లిప్తుడు, నిరీహుడు, అన్ని కర్మలకు సాక్షి. రాజేంద్ర! పరిపూర్ణతముడైన ఆతనికి కన్యను (23) ఇస్తే, నీ నూరుగురు పితరులతో సహా గోలోకానికి పోతావు. కన్యను ఇచ్చి, పైలోకంలో సారూప్య ముక్తిని పొందు. (24) ఇక్కడే అందరికి పూజ్యుడవై విశ్వగురువునకు గురువువుకమ్ము. నీ సర్వస్వము దక్షిణగా ఇచ్చి మహాలక్ష్మియైన రుక్మిణిని (25) సమర్పణ చేయి ఓవిభు! జన్మఖండనమును చేసుకో. ఓరాజ! ఈ సంబంధము బ్రహ్మ వ్రాశాడు. అందరికి ఇష్టమైంది. (26) ద్వారకానగరమందున్న కృష్ణునికై త్వరగా బ్రాహ్మణుని పంపు అందరికి నచ్చిన శుభ క్షణాన్ని త్వరగా నిర్ణయించు (27) భక్తులను అనుగ్రహించే కొరకు విగ్రహరూపుడైన పరమాత్మను తెచ్చి, ధ్యానమునకు అనురోధ హేతువైన (అనుసరించినడచుట), ఉత్తమమైన నిత్యదేహమును పొందు. (28) దృష్టి పడ్డంత మాత్రముననేనే జన్మ కర్మఖండనమును చేకూర్చుకో, ఓనృస! నాలుగు వేదములు, సజ్జనులు, దేవతలు ఆతనిని తెలుసుకోలేరు.సిద్ధేంద్రులు, మునీంద్రులు బ్రహ్మాదిదేవతలు అతనిని ధ్యానిస్తారు. ధ్యానముతో పవిత్రులైన యోగులు ఆపరమాత్మను గుర్తెరుగరు. (30) సరస్వతి జడురాలైంది, వేదములు శాస్త్రములు అవన్నీ, వేయితలలు గల శేషుడు, ఐదుతలలు గల సదాశివుడు (31) నాల్గుతలల బ్రహ్మ కుమారుడు కార్తికేయుడు ఋషులు, మునులు, భక్తులు, పరమవైష్ణవులు ఆ (32) పరమాత్మను స్తుతించుటకు అసమర్థులు, ఆ పరమాత్మ యోగులకు ధ్యానం వల్ల కూడా లభించడు. ఓ మహారాజ! నేను పిల్లవాణ్ణి, ఆతని గుణాలను గూర్చి ఏం చెప్పగలను అని (33) అన్న శతానందునిమాటలను విని, రాజు ముఖం వికసించింది. వేగంగా లేచి ఆతనిని కౌగిలించుకున్నాడు. (34)

మూ నానారత్నంసువర్ణంచ వస్త్రంచ రత్నభూషణం

దదౌతస్మై ప్రదానంచ ప్రసాద సుముఖోనృపః

గజేంద్రం తురగం శ్రేష్ఠం రథంచమణి నిర్మితం

రత్నసింహాసనం రమ్యం ధనంచ విపులం తథా

భూమించ సర్వసస్యాడ్యాం శశ్వదృష్టికరీం శుభాం

అకృష్ణసాధ్యం పూజ్యాంచ గ్రామం సర్వప్రశంసితం

ఏతస్మిన్నంతరేరుక్మించుకోప రఘునందనః

కంపితో అధర్మయుక్తశ్చరక్తాస్యో రక్తలోచనః

ఉవాచపితరం విప్రం సభాయాం అస్థిరస్తదా

ఉత్థాయతిష్ఠన్ పురతః సర్వేషాంచ సభాసదాం

రుక్మిరువాచ :

శృణురాజేంద్ర వచనం హితం తథ్యం ప్రశంసితం

త్యజవాక్యం భిక్షుకాణాం లోభినాం క్రోధినామహో

నర్తకానాంచ వైశ్యానాం భట్టానా మర్థినామపి

కాయస్థానాంచ భిక్షూ ణాం అసత్యం వచనం సదా

ఘటకానాం నాటకానాం స్త్రీలుబానాంచ కామినాం

దరిద్రాణాంచ మూర్భాణాం స్తుతిపూర్వంవచః సదా

నిహత్యకాలయవనం రాజేంద్రం దూరతోభియా

ఉపాయేన మహాబాహో లబ్దం కృష్ణన తద్ధనం

ద్వారకాయాంధనీ కృష్ణో యవనస్య ధనేనచ

జరాసంధభయేనైవ సముద్రాభ్యంతరే గృహీ

జరాసంధశతం చైవక్షణేనైవచ లీలయా

క్షమోహం హంతుమేకాకీ రాజ్ఞశ్చాన్యస్య కా కథా

దుర్వాససశ్చ శిష్యో2హం రణశాస్త్ర విశారదః

ధ్రువంభీష్మక తేనైవ విశ్వం సంహర్తు మీశ్వరః

మత్సమః పర్శురామశ్చ శిశుపాలశ్చమత్సమః

సఖాచబలవాన్ శూరః స్వర్గంజేతుంసచ క్షమః

మహేంద్రం సగణంజేతుం అహమీశః క్షణేనచ

జీత్వాయుధే జరాసంధం దుర్బలం యోగినం నృప

అహంకారయుతః కృష్ణో వీరం స్వం మన్యతే ధియా

యద్యాయాస్యతి మద్రామం వివాహం కర్తుమీప్సితం

ధ్రువం ప్రస్థాపయిష్యామిక్షణేన యమ మందిరం

అహోనందస్య వైశ్యస్య తస్మై గోరక్షకాయచ

సాక్షాజ్ఞారాయ గోపీనాం గోపాలోచ్ఛిష్టభోజినే

కరోషికన్యా స్వీకారం దేవయోగ్యాంచ రుక్మిణీం

దాతుమిచ్ఛసి వాక్యేన భిక్షుకస్యద్విజస్యచ

రాజేంద్ర బుద్దిహీనోసి వచనాద్వద్గలస్యచ

మారాజపుత్రో మాశూరో మాకులీనశ్చ మా శుచిః

మాదాతా మాధనాఢ్యశ్చ మా యోగ్యో మాజితేంద్రియః

కన్యాందేహి సుపుత్రాయ శిశుపాలాయ భూమిప

బలేన రుద్రతుష్టాయ రాజేంద్ర తనయాయచ

నియంత్రణం కురునృప నానాదేశ భవాన్ నృపాస్

బాంధవాంశ్చ మునీంద్రాంశ్చ పత్రద్వారా త్వరాన్వితః

రకరకాల రత్నాలు, బంగారము, వస్త్రములు, రత్నభూషణములు అతనికిచ్చాడు, రాజు. ప్రసాద (అనుగ్రహం) ముతో, సుముఖుడైన రాజుబాగా దానం చేశాడు. (35) శ్రేష్ఠమైన ఏనుగ, గుఱ్ఱము, శ్రేష్ఠమైన మణులతో చేసిన రథము, రమ్యమైన రత్నసింహాసనము, అట్లాగే అధికంగా ధనము, (36) భూమిని, అన్ని పంటగలుగల దానిని, ఎప్పుడు వర్షపునీరు నిచ్చే భూమిని, శుభమైన దానిని, దున్నకుండానే పండే (శ్రమపడక అని)దానిని, పూజ్యమైన భూమిని, అన్ని విధముల ప్రశంసించ తగిన గ్రామమును, (37) ఇచ్చాడు. ఇంతలో రాకుమారుడైన రుక్మికోపగించాడు. కోపంతో వణుకుతూ, అధర్మంతో కూడి, ముఖం ఎర్రబడగా, కళ్ళు ఎర్రబడగా (38) తండ్రితో, బ్రాహ్మణునితో ఇట్లన్నాడు. అప్పుడు ఆతడు సభలో ఒక చోట స్థిరంగా లేడు, లేచి అందరు సభాసదుల ఎదుటనిలిచి (39) ఇట్లన్నాడు. రుక్మివచనమిట్లా - ఓ రాజేంద్ర! హితమైన, యధార్థమైన, ప్రశంసించతగిన, నామాటవిను. లోభులు, క్రోధులు, భిక్షుకుల మాటను విడిచి పెట్టు. (40) నర్తకుల, వైశ్యుల,భట్టుల, యాచకుల, కాయస్తుల (కరణము) మాట వినవద్దు. భిక్షుల మాట ఎప్పుడూ అసత్యమే (41) కూర్చేవాళ్ళ (తార్పుడు) నాటకుల, స్త్రీలుబుల కాముకుల, దరిద్రుల, మూర్ఖులమాటలు వినవద్దు. వారిమాట లెప్పుడూ పొగడ పూర్వకముగా ఉంటాయి. (42) రాజేంద్రుడైన కాలయవనుని, భయంతో దూరంగా చంపి, ఓ మహాబాహు! కృష్ణుడు, ఉపాయంగా వాని ధనాన్ని హరించాడు. (43) యవనుని ధనముతో కృష్ణుడు ద్వారకలో ధనవంతుడైనాడు. జరాసంధుని భయం వల్లనే సముద్రంతో గృహం నిర్మించుకున్నాడు. (44) జరాసంధుని వంటివారిని నూరుగురిని, క్షణకాంలో అవలీలగా, నేను ఒక్కణ్ణి చంపసమర్థుడిని. ఇతర రాజుల గురించి చెప్పేదేమున్నది. (45) దుర్వాసుని శిష్యుణ్ణనేను. రణశాస్త్రమందు విశారదుడను. ఓభీష్మక! అందువల్లనే విశ్వాన్నంతా సంహరించడానికి నేను సమర్థుడను, నిశ్చయము. (46) నాతో సమానమైనవాడు పరశురాముడు, శిశుపాలుడు. నాకు స్నేహితుడు, బలవంతుడు శూరుడు ఆతడు స్వర్గాన్ని జయించటానికైనా సమర్థుడు. (47) మహేంద్రుని, ఆతని గణములతో సహ క్షణంలో జయించడానికి నేను సమర్ధుణ్ణి. నృప! యుద్ధంలో జరాసంధుని జయించి అట్లాగే దుర్బలుడైన యోగిని జయించి (48) కృష్ణుడు అహంకారముతో ఉన్నాడు. బుద్ధిలో తనను వీరునిగా భావిస్తున్నాడు. ఒకవేళ మావూరికి వస్తే, వివాహం చేసుకోవాలని కోరిక ఉండి వస్తే, (49) క్షణంలో యమమందిరానికి పంపిస్తాను. నందుడు, వైశ్యుడు, ఆ గోరక్షకుడు (కృష్ణుడు) వానికి (50) ఆజారునకు సాక్షాత్తు గోపికల గోపాలుర ఎంగిలితినే వాడికి, దేవతలకు యోగ్యమైన రుక్మిణిని, కన్యను ఇచ్చే కొరకు ప్రయత్నిస్తున్నావు. (51) భిక్షుకుడైన బ్రాహ్మణుని మాట ప్రకారము ఇవ్వదలిచావు. ఓ రాజేంద్ర! గొంతెత్తి చెప్పినవాని మాట ప్రకారం ఇవ్వదలిచావు. నీవు బుద్ధిహీనుడవు. (52) కృష్ణుడు రాజపుత్రుడుకాడు, శూరుడుకాడు, కులీనుడుకాడు, శుచిగలవాడు కాదు. దాతకాడు, ధనవంతుడుకాడు, యోగ్యుడుకాడు. జితేంద్రియుడు కాడు. (53) ఓభూమిప! మంచికొడుకైన శిశుపాలునకు నీకూతురును ఇవ్వు. బలంతో రుద్రుని సంతోషపరచిన గజేంద్ర తనయునకివ్వు. (54) ఓనృప! అనేకదేశములందున్న రాజులకు నియంత్రణమివ్వు. (ఆహ్వానం). బంధువులను, మునీంద్రులను పత్రిక ద్వారా, వేగంగా ఆహ్వానించు. (55)

మూ అంగం కలింగం మగధం సౌరాష్ట్రం వల్కలం వరం

రాటం వరేంద్రం వంగంచ గుర్జురాటించ పేఠరం

మహారాష్ట్రం విరాటంచ ముద్గలంచ మురంగకం

భల్లకం గల్లకం ఖర్వం దుర్గం ప్రస్థాపయద్విజం

ఘృతకుల్యాసహస్రంచ మధుకుల్యాసహస్రకం

దధికుల్యాసహస్రంచ దుగ్ధతుల్యాసహస్రకం

తైలకుల్యాపంచశతం గుడకుల్యాద్విలక్షకం

శర్కరాణాం రాశిశతం మిష్టాన్నానాం చతుర్గుణం

యవగోధూమ చూర్ణానాం పిష్టరాశి శతం శతం

పృథుకానాంరాశి లక్షం అన్నానాంచ, చతుర్గుణం

గవాంలక్షంఛదనంచ హరిణానాం ద్విలక్షకం

చతుర్లక్షం శశానాంచ కూర్మాణాంచ తథాకురు

దశలక్షం ఛాగలానాం భేటానాంతచ్చతుర్గుణం

పర్వణిగ్రామదేవ్యైచ బలిందేహిమభక్తితః

ఏతేషాం పక్వమాంసంచ భోజనార్థంచ కారయ !

పరిపూర్ణం వ్యంజనానాం సామగ్రీంకురుభూమిప

అధశ్రుత్వాచతద్వాక్యం రాజేంద్రఃస పురోహితః !

చకారామంత్రణం తూర్ణం నిజేన మంత్రిణా సహ

ద్విజంప్రస్థాపయామాస ద్వారకాం యోగ్యమీప్సితం

కృత్వాచ శుభలగ్నంచ సర్వేషా, మభివాంఛితం II

రాజాసంభృత సంభారోబభూవ సత్వరంముదా !

నిమంత్రణంచ సర్వత్ర చకారచ సుతాజ్ఞయా

విప్రః సుధర్మాం సంప్రాప్య నృపైఃదేవైశ్చవేష్టితాం

ప్రదదౌపత్రికాంభద్రాం ఉగ్ర సేనాయ భూభృతే

ప్రపుల్లవదనోరాజా, శ్రుత్వాపత్రం సుమంగలం

సువర్ణానాం సహస్రంచ బ్రాహ్మణేభ్యో దదౌముదా

దుందుభిం వాదయామాస ద్వారకాయాంచ సర్వతః

దేవానునీన్ నృపాంశ్చైవ జ్ఞాతివర్గాంశ్చ బాంధవాన్

భట్టాంశ్చబిక్షుకాంశ్చైవ భోజయామాససాదరం

శ్రీకృష్ణస్య సువేషంచ కారయామాస భూపతిః

అంగము కళింగము, మగధ సౌరాష్ట్రము, శ్రేష్ఠమైన వల్కలము, రాటము, ఉత్తమశ్రేష్ఠమైన వంగము, గుర్జరము, పేఠరము, (56) మహారాష్ట్రము, విరాటము, ముద్గలము, మురంగకము, భల్లకము, గల్లకము, ఖర్వము, దుర్గము, ఆయా దేశములకు బ్రాహ్మణుని పంపించు (57) వేయి నేతికాలువలు, తేనె కాలువలు వేయి, వేయి పెరుగు కాలువలు, వేయి పాలకాలువలు (58) ఐదు వందలనూనె కాలువలు,రెండు లక్షల బెల్లం కాలువలు, నూరు రాసుల శర్కర, దీనికి నాల్గింత లెక్కువ మధురాన్నరాసులు (59) యవలు, గోధుమలు వీటి పొడిపిండి రాశులు నూరు, నూరు అటుకుల రాసులు లక్ష దీనికి నాల్గింత లెక్కువ అన్నరాశి (60) లక్ష గోవులు, రెండు లక్షల హరిణములు వీనిని చంపాలి. కుందేళ్ళు నాలు లక్షలు, తాబేళ్ళు కూడా అన్నే చంపాలి. (61) పది లక్షలు మేకపోతులు, గొఱ్ఱలు వానికి నాల్గింతలు చంపాలి. పర్వమందు గ్రామదేవతకు భక్తితో బలి ఇవ్వాలి. (62) వీటి మాంసాన్ని వండి భోజనమునకు ఏర్పాటు చేయి. ఓరాజ! వ్యంజనముల సామాగ్రిని పరిపూర్ణము చేయి. (63) ఆమాటను విని రాజేంద్రుడు,పురోహితునితో కూడి, తన మంత్రితో కూడి త్వరగా ఆమంత్రణ పంపించాడు. (64) యోగ్యుడైన, కోరతగిన బ్రాహ్మణుని ద్వారకకు పంపాడు. అందరికిష్టమైన శుభలగ్నమును ఏర్పరచాడు. (65) రాజు త్వరగా ఆనందంతో సంభారములు కూర్చుకొనినాడు. కొడుకు ఆజ్ఞతో నియంత్రణము అందరికి పంపాడు. (66) సుధర్ముడు అను విప్రుడు ఉగ్రసేనరాజు వద్దకు వచ్చి, రాజులు, దేవతల మధ్యకూర్చున్న రాజునకు మంగళకరమైన పత్రికనిచ్చాడు. (67) సుమంగళమైన పత్రమును గూర్చి విని రాజుముఖం వికసించింది. ఆనందంతో రాజు బ్రాహ్మణులకు వేయి సువర్ణములిచ్చాడు. (68) ద్వారకలో అంతట దుందుభిని (వాద్యం) మ్రోగింపచేశాడు. దేవతలను మునులను,రాజులను, జ్ఞాతులను బంధువులను, (69) భట్టులు, భిక్షులు అందరికిని ఆదరంగా భోజనం పెట్టించాడు. రాజు శ్రీకృష్ణునకు మంచి వేషధారణ చేయించాడు. (70)

మూ అతీవరమ్యమతులం త్రిషులోకేషు దుర్లభం

యాత్రాంచ కారయామాస జగతాం ప్రవరం వరం

వేదమంత్రేణ రమ్యేణ మా హేంద్రో సుమనోహరే

ఆదౌ బ్రహ్మారథస్థశ్చ సావిత్ర్య సహితోయయా

రథస్థశ్చ మహాహృష్ణో భవాన్యాచ భవః స్వయం

శేషశ్చాపి దినేశశ్చ గణేశశ్చాపి కీర్తితః

మహేంద్రశ్చతథా చంద్రోవరుణః పర్వతస్తథా

కుబేరశ్చయమో వహ్నిః ఈశానోపియమౌముదా

దేవానాంచ త్రికోట్యశ్చమునీనాం షష్టి కోటయః

గజేంద్రాణాం త్రిలక్షంచ శ్వేతచ్ఛత్రం త్రిలక్షకం

ఉగ్రసేనోబభౌరాజా నక్షత్రేషు యథాశశీ

యఙాప్రసన్న వదనః కుండినాభిముఖో బలీ

రత్న నిర్మాణ యానేన బలదేవో మహాబలః

వసుదేవశోద్ధవశ్చ నందోక్రూరశ్చ సాత్యకిః

గోపాలయాదవేంద్రాశ్చ చంద్రవంశాశ్చ తే యయుః

ధృతరాష్ట్ర సుతాస్సర్వే దుర్యోధన పురోగమాః

యుధిష్టిరస్తథా భీమః ఫాల్గునోనకులస్తథా

సహదేవశ్చయానైశ్చ ప్రయయుః పంచపాండవాః

భీష్మోద్రోణశ్చ కర్ణశాప్య శ్వత్థామా మహాబలః

కృపాచార్యశ్చ శకుని శల్యశ్చ ప్రయయాముదా

భటానాంచ త్రికోట్యశ్చ విప్రాణాంశతకోటయః

 సంన్యాసినాం సహస్రంచ యతీనాం బ్రహ్మచారిణాం

ద్విసహస్రం జితక్రోథాశ్చావధూతాస్తథైవచ

ఉత్పలానాం సహస్రంచ సహస్రం పుష్పకారిణాం

నానాశిల్పకరాశ్చైవ విచిత్రం చిత్రమేవచ

లక్షంచ వాద్యభాండానాం నర్తకానాంచ లక్షకం

గంధర్వాణాం గాయకానాం లక్షమేకంతు నారద

తత్రకల్పే భవత్యేవ గంధర్వశ్చోప బర్హణః

పంచాశత్కామినీభిశ్చ త్వమేవ తేషుమధ్యగః

విద్యాధరీణాం లక్షంచ లక్షమప్సరసాం తథా

కిన్నరాణాం త్రిలక్షంచ గందర్వాణాం త్రిలక్షణం

ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధే రుక్మిణ్యుద్వాహే పంచాధిక శతతమోధ్యాయః

చాలా అందమైన, సాటిలేని, ముల్లోకములలో దుర్లభమైన యాత్రను, జగత్తునకు శ్రేష్ఠమైన, కోరతగిన యాత్రను చేయించాడు. (71) రమ్యమైన వేదమంత్రముతో, మనోహరమైన మ హేంద్రమందు తోలుత బ్రహ్మ సావిత్రి సహితుడై రథంలో వెళ్ళాడు. (72) మహా ఆనందంతో భవానితో కలిసి భవుడు స్వయంగా రథస్థుడై వెళ్ళాడు, శేషుడు, సూర్యుడు, ప్రసిద్ధుడైన గణేశుడు (73) మహేంద్రుడు, చంద్రుడు, వరుణుడు, పర్వతుడు, కుబేరుడు, యముడు, వహ్ని, ఈశానుడు వీరంతా ఆనందంతో వెళ్ళారు. (74) మూడుకోట్ల దేవతలు, ఆరు కోట్ల మునులు మూడు లక్షల ఏనుగలు, మూడు లక్షల తెల్లగొడుగులు వెళ్ళాయి. (75) నక్షత్రములలో చంద్రునివలె ఉగ్రసేన రాజున్నాడు. బలవంతుడైన ఆరాజు ప్రసన్నమైన వదనంతో కుండిన నగరానికి అభిముఖుడై వెళ్ళాడు. (76) రత్నములతో నిర్మించిన పల్లకిలో మహాబలుడైన బలరాముడు వెళ్ళాడు. వసుదేవుడు, ఉద్ధవుడు, నందుడు, అక్రూరుడు, సాత్యకి (77) గోపాలురు, యాదవేంద్రులు, చంద్రవంశము వారు వారంతా వెళ్ళారు. ధృతరాష్ట్రుని కొడుకులంతా దుర్యోధనుడు మొదలగు వారంతా వెళ్ళారు. (78) యుధిష్ఠిరుడు, భీముడు, ఫల్గునుడు, నకులుడు, సహదేవుడు వీరంతా ఈ ఐదురుగు యానముల పై వెళ్ళారు. (79) భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మహాబలుడు అశ్వత్థామ, కృపాచార్యుడు, శకుని, శల్యుడు వీరంతా ఆనందంగా వెళ్ళారు. (80) మూడుకోట్ల భటులు, నూరుకోట్ల బ్రాహ్మణులు వేయిమంది సన్యాసులు, రెండువేల యతులు, బ్రహ్మచారులు (81) క్రోధమును జయించిన అవధూతలు అట్లాగే రెండువేలు, వేయి కలువపూలు, వేయిమంది మాలాకారులు (82) చిత్రవిచిత్రములు, రకరకాల శిల్పకారులు, వాయిద్యములు లక్ష, లక్ష నర్తకులు, (83) గంధర్వులు, గాయకులు లక్ష వెళ్ళారు, నారద! ఆ కల్పమందు గంధర్వుల వృద్ధి ఉంది కదా (84) ఏబది మంది స్త్రీలతో నీవు,వారి మధ్యనే ఉన్నావు. లక్ష విద్యాధరులు, లక్ష అప్సరసలు, (85) మూడు లక్షల కిన్నరులు, మూడు లక్షల గంధర్వులు, (86) ఉన్నారు.

అని బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు రుక్మిణి వివాహమందు నూట ఐదవ అధ్యాయము.