బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

64 - అధ్యాయము

మూ శ్రీనారాయణ ఉవాచ:

సర్వం కృత్వా పరామర్శం సత్యకశ్చ పురోహితః

బుద్ధిమాన్ శుక్రశిష్యశ్చ తమువాచ హితం మునే

సత్యక ఉవాచ:

భయం త్యజ మహాభాగ భయం కిం తే మయి స్థితే

కురుయాగం మహేశస్య సర్వారిష్ట వినాశనం

యాగో ధనుర్మఖోనామ బహ్వన్నో బహుదక్షిణః

దుఃస్వప్నానాం నాశకరః శత్రుభీతి వినాశకః

ఆధ్యాత్మికమాధిదైవమాధిభౌతికముత్కటం

ఏషాం త్రివిధోత్పాతానాం ఖండనో భూతి వర్ధనః

యాగే సమాప్తే శంభుశ్చ జరామృత్యుహరం వరం

దదాతి సాక్షాద్భవతి దాతాచ సర్వసంపదాం

చకారేమంచ యాగంచ పురాబాణోమహాబలః

నందీ పరశురామశ్చ భల్లశ్చ బలినాం వరః

పురాదదౌ ధనురిదం శివో నందీశ్వరాయచ

యాగేన భూత్వా సిద్ధః సదదౌ బాణాయ ధార్మికః

కృత్వా యాగం మహాసిద్ధో దదౌ రామాయ పుష్కరే

తుభ్యం దదౌ పరశురామః కృపయాచ కృపానిధిః

సహస్రహస్తపరిమితః దైర్ఘ్యేఽతికఠినం నృప

దశహస్త ప్రశస్తంచ శంకరేచ్ఛా వినిర్మితం

పశుపతేః పాశుపతం యుక్తయానేన దుర్వహం

సర్వే భంక్తుం నశక్తాశ్చ దేవం నారాయణం వినా

యాగేచ ధనుషః పూజాం శంకరస్యతు శంకరే

కురు శీఘ్రం శుభార్థంచ సర్వాన్కురు నిమంత్రణం

అస్మిన్ యాగే ధనుర్భంగో భవేద్యది నరాధిప

వినాశో యజమానస్య భవిష్యతి న సంశయః

భగ్నే ధనుషి యాగశ్చ భగ్నో భవతి నిశ్చితం

ఫలం దదాతి కోవాఽత్ర చానిష్టన్నేచ కర్మణి

బ్రహ్మాచధనుషో మూలే మధ్యేనారాయణః స్వయం

అగ్రేచోగ్రప్రతాపశ్చ మహాదేవోమహామతే

ధనుర్హి త్రివిక్రంచ సద్రత్నఖచితం వరం

గ్రీష్మ మధ్యాహ్నమార్తండప్రభాప్రచ్ఛన్న కారణం

అశక్తశ్చ నమయితుం అనంతశ్చ మహాబలః

సూర్యశ్చ కార్తికేయశ్చ కాకథాఽన్యస్య భూమిప

త్రిపురారిః పురానేనజఘాన త్రిపురంముదా

నిర్భయం కురుస్వచ్ఛందం మంగలార్హం మహోత్సవే

సత్యకస్య వచః శ్రుత్వా చంద్ర వంశ వివర్ధనః

ఉవాచకంసః సర్వార్థే సతతంచ హితైషిణం

కంసఉవాచ :

వసుదేవగృహేజజ్ఞే మధ్వధీకుల నాశనః

స్వచ్ఛందం నందగే హేచ వర్ధతే నందనందనః

మద్బంధువర్గాన్ శూరాంశ్చ మంత్రిణః సువిశారదాన్

భగినీం పూతనాం పూతాం జఘాన బాలకో బలీ

శ్రీ నారాయణుడిట్లన్నాడు. పురోహితుడైన సత్యకుడు పరామర్శ అంత చేసి బుద్దిమంతుడైన శుక్ర శిష్యుడు,ఆతనికి హితము చెప్పాడిట్స్, ఓ ముని! (1) సత్యకుడిట్లన్నాడు. ఓ మహాభాగుడ! భయాన్ని వదులు.నీకు,నేను (తోడు) ఉండగా భయమెందుకు అన్ని అరిష్టములను నాశనం చేసే మ హేశుని యాగాన్ని చేయి.(2) యాగం పేరు ధనుర్యాగము. అధికమైన అన్నదానము, అధిక దక్షిణలు కలది. శత్రు భీతిని నాశనం చేసేది దుఃస్వప్నములను నశింపజేసేది (3) ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఎక్కువైన ఆధి భౌతికము, ఈమూటివల్ల ఉత్పన్నమయ్యే బాధలను ఖండించేది. ఐశ్వర్యం పెంచేది (4) యాగం సమాప్తి అయ్యాక శివుడు, ముసలితనము, మృత్యువులను హరించే వరమును, సాక్షాత్కరించి ఇస్తాడు. అన్ని సంపదలనిచ్చేవాడు (5) ఈ యాగమును ఇదివరలో మహాబలుడైన బాణుడు చేశాడు. నంది, పరశురాముడు, బలవంతులలో శ్రేష్ఠుడైన భల్లుడు చేశాడు. (6) ఇదివరలో ఈ ధనువును శివుడు నందీశ్వరునికిచ్చాడు. యాగంతో సిద్ధుడై (దేవయోని) ఆధార్మికుడు బాణునికిచ్చాడు. (7) యాగంచేసి మహాసిద్ధుడై పుష్కరక్షేత్రమందు రామునకిచ్చాడు. కృపానిధియై ఆపరశురాముడు కృపతో నీకిచ్చాడు. (8) ఓ రాజా! అదిపొడుగులో వేయిచేతుల పరిమితమైది. అతికఠినమైనది. పదిహస్తముల ప్రశస్తికలది, శంకరుని ఇచ్చతో నిర్మించబడినది. (9) పశుపతి యొక్క పాశుపతము జతలబండ్లతో కూడా మోయరానిది.

నారాయణుడు తప్ప మిగిలినవారంతా విరచటానికి సమర్ధులుకారు. (10) యాగమందు శంకరుని ధనుఃపూజను చేయి. శుభము కొరకై శంకరుని పూజను త్వరగా చేయి. అందరిని నియంత్రణము చేయి. (11) ఓ రాజ! ఈ యాగంలో ధనుర్భంగమైతే, యజమానుని నాశనమేర్పడుతుంది, అనుమానం లేదు (12) ధనుస్సు, భగ్నమైతే యాగముకూడా భగ్నమౌతుంది, నిశ్చయము. కర్మపూర్తికాకపోతే ఇక్కడ ఫలితమె వరిస్తారు. (13) ధనుస్సు మూలమందు బ్రహ్మ మధ్యలో నారాయణుడు స్వయంగా ఉన్నారు. ఓ మహామతి ధనుస్సు అగ్రమందు ఉగ్రప్రతాపంగల మహాదేవుడున్నాడు. (14) ధనుస్సు, మూడు వస్తువుల వికారము (మూడు వస్తువులతో చేయబడింది. మంచిరత్నములు పొందగబడినది, ఉత్తమమైనది. గ్రీష్మకాలమందలి మధ్యాహ్న సూర్యుని కాంతిని కప్పిపుచ్చగలది. (15) మహాబలుడైన అనంతుడు వంచటానికి అశక్తుడు.సూర్యుడు కార్తికేయుడు వీరే వంచలేకపోయినారు. ఇతరుల సంగతి చెప్పేదేముంది, ఓ రాజ! (16) త్రిపురారి ఇదివరలో దీనితో త్రిపురసంహారం ఆనందంగా చేశాడు. మహోత్సవ మందు మంగళమున కరమైన వాటిని, నిర్భయంగా, స్వచ్ఛందంగా చేయి. (17) సత్యకుని మాటలను విని, చంద్రవంశాన్నివృద్ధిపరచేరాజు కంసుడు, ఎల్లప్పుడు హితాన్నికోరే సర్వార్థునితో అన్నాడు. (18) కంసుడిట్లన్నాడు - నన్ను చంపేవాడు, కులనాశనుడు వసుదేవ గృహమందు పుట్టాడు. నందనందనుడు నందుని గృహమందు స్వేచ్ఛగా పెరుగుతున్నాడు. (19) శూరులైన నా బంధువర్గాన్ని, సువిశారుదులైన మంత్రులను, పవిత్రమైన,నా చెల్లెలు పూతనను, బలవంతుడైన ఈ బాలకుడు చంపాడు.

మూ గోవర్ధనం దధారైకకరేణ బలవర్ధనః

మహేంద్రస్యచ శూరస్య చకారచ పరాభవం

బ్రహ్మాణం దర్శయామాస బ్రహ్మరూపం చరాచరం

నివహం బాలవత్సానాం చకార కృత్రిమం ముదా

తమేవ బలినం హంతుం మంత్రణం కురు సత్యక

మమశత్రుర్వినాతేన నాస్తిహ ధరణీతలే

నహి స్వర్గే న పాతాలే త్రిషు లోకేషు నిశ్చితం

సన్తి సంతశ్చ రాజానః సర్వత్ర మమ బాంధవాః

మహాతపస్వీ బ్రహ్మాచ తపస్వీ శంకరః స్వయం

విష్ణుః సర్వత్ర సర్వాత్మా సమదర్శీ సనాతనః

నందపుత్రం నిహత్యాహం త్రిషులేకేషు పూజితః

సార్వభౌమో భవిష్యామి సప్తద్వీపేశ్వరో మహాన్

స్వర్గె నిహత్య శక్రంచ దుర్బలం దైత్యనిర్జితం

భవిష్యామి మహేంద్రశ్చ తత్ర నిర్జిత్య భాస్కరం

యక్షగ్రస్తంచ చంద్రంచ మమైవ పూర్వపూరుషం

వాయుం కుబేరం వరుణం యమం జేష్యామి నిశ్చితం

గచ్చ నందవ్రజం శీఘ్రం నందంచ నందనందనం

తద్ర్భాతరంచ బలినం బలమానయ సాంప్రతం

కంసస్య వచనం శ్రుత్వా తమువాచ స సత్యకః

హితం సత్యం నీతిసారం పరం సామయికం తథా

సత్యక ఉవాచ:

అక్రూరముద్ధవంవాఽపి వసుదేవ మథాపివా

ప్రస్థాపయ, మహాభాగ నందవ్రజమభీప్సితం

సత్యకస్య వచఃశ్రుత్వా వసంతం తత్ర సంసది

స్వర్ణ సింహాసనస్థంచ వసుదేవమువాచ సః

రాజేంద్ర ఉవాచ:

తత్త్వజ్ఞో నీతిశాస్త్రాణాం త్వముపాయవిశారదః

వ్రజ నందవ్రజంబంధో వసుదేవసుతాలయం

వృషభానంచ నందంచ బలంచ నందనందనం

శీఘ్రమానయ యజ్ఞేన సర్వం గోకులవాసినం

గృహీత్వా పత్రికాం దూతా గచ్ఛంతుచ చతుర్దశం

నృపాన్ముని గణాన్సర్వాన్కర్తుం విజ్ఞాపనం ముదా

నృపస్య వచనం శ్రుత్వా శుష్కకంఠోష్ఠ తాలుకః

ఉవాచ వచనం బ్రహ్మన్ హృదయేన విదూయతా

వసుదేవ ఉవాచ:

నయుక్తమత్రరాజేంద్ర గమనం మమ సాంప్రతం

విజ్ఞాపితుంనందవ్రజం వసుదేవస్య నందనం

యద్యాయాతో నందపు యాగే తేచ మహోత్సవే

అవశ్యం తద్విరోధశ్చ భవిష్యతి త్వ యాసహ

 తమహంచ సమానీయ కారయిష్యాయి సంయుగం

ఇతి మే నహి భద్రంచ విఘ్నస్తస్య తవాపిచ

పిత్రానీతో మృతః కృష్ణః ఇతి సర్వో వదిష్యతి

వసుదేవః సుతద్వారా జఘాన నృపమేవచ

ద్వయోరేకతరస్యాపి సద్యో మృత్యుర్భవిష్యతి

పతిష్యంతి చ శూరాశ్చ నాస్తి యుద్ధం నిరామిషం

బలవర్ధనుడైన బాలుడు ఒకచేతితో గోవర్ధనాన్ని ఎత్తాడు (ధరించాడు) శూరుడైన మహేంద్రుని అవమానపరిచాడు. (21) చరాచరమైన బ్రహ్మ రూపమును, బ్రహ్మను చూపించాడు. బాల,వతుల సమూహమునకు కృత్రిమంగా, ఆనందాన్ని కల్గించాడు. (22) సత్యక! బలవంతుడైన ఆతనిని చంపటానికే ఆలోచన చేయి. ఆతడు కాకుండా, మరోశత్రువు నాకు, ఈ భూమియందు లేడు. (23) స్వర్గంలో లేడు. పాతాళంలో లేడు. ముల్లోకములలో లేడు, నిశ్చయము. సజ్జనులైన రాజులు, నా బంధువులు అంతటా ఉన్నారు. (24) మహాతపస్వియైన బ్రహ్మ స్వయంగా తపస్వియైన శంకరుడు, అంతటా, అన్ని ఆత్మలను సమంగా చూచేవాడు (అన్ని ఆత్మలలో ఉన్న సమదర్శి), సనాతనుడు విష్ణువు (నా బంధువులు), (25) నందపుత్రుణ్ణి చంపి, నేను ముల్లోకములలో పూజనంది సార్వభౌముణ్ణతాను. గొప్పగా సప్తద్వీపములకు ఈశ్వరుణ్ణితాను. (26) దుర్బలుడు, దైత్యులతో జయింపబడ్డవాడైన ఇంద్రుని స్వర్గమందు చంపి, మహేంద్రుణ్ణితాను. సూర్యుని జయించి (27) నా పూర్వపురుషుడు, క్షయరోగియైన ఇరంద్రుని, వాయువును, కుబేరుని, వరుణుని, యముని తప్పకుండా జయిస్తాను. (28) నందవ్రజమునకు త్వరగా వెళ్ళు నందుని, నందనందనుని, ఆతని అన్నయైన బలవంతుడైన బలరాముని ఇప్పుడు తీసుకురా. (29) కంసుని మాటను విని ఆ సత్యకుడు ఆతనితో ఇట్లన్నాడు. మితమైనది, సత్యమైనది, నీతిసారము గలది. అట్లాగే మిక్కిలి, సమయానుగుణమైన మాటఅన్నాడు. (30) ఆసత్యకునిమాట ఇట్లా- అక్రూరునికాని, ఉద్ధవుని కాని, వసుదేవునికాని, నీకిష్టమైన నందవ్రజమునకు వారిని పంపించు, ఓ మహాభాగ! (31) సత్యకుని మాటను విని, ఆ సభలో ఉన్న, స్వర్ణసింహాసన మందు కూర్చున్న వసుదేవునితో ఆతడిట్లన్నాడు (32) రాజేంద్రుని పలుకులిట్లా - నీతిశాస్త్రముల తత్వమెరిగిన వాడివి, ఉపాయములందు విశారదుడవు నీవు (ఉపాయం=పొందు). ఓ బంధు! వసుదేవసుతుని ఆలయమునకు నందవ్రజమునకు వెళ్ళు (33) వృషభానుని నందుని, బలరాముని, నందనందనుని, గోకులంలో ఉండే అందరిని యజ్ఞంకై త్వరగా తీసుకురా. (34) నాలుదిక్కులకు పత్రికను తీసుకొని దూతలువెళ్ళని. రాజులకు, మునులకు, అందరికి విజ్ఞాపన చేయటానికి, ఆనందంగా వెళ్ళని. (35) రాజుమాటవిని, కంఠము, తాలువు, పెదవులు ఎండిపోగా, హృదయంలో తనను తాను నిదించుకుంటూ (పరితపిస్తూ) బ్రహ్మ (వసుదేవుడిక్కడ) ఇట్లా మాట్లాడాడు. (36) వసుదేవుని వచనము - ఓ రాజేంద్ర! ఇక్కడ, ఇప్పుడు నేను వెళ్ళటము తగదు. వసుదేవనందనునకు విజ్ఞాపన చేయటానికి నందవ్రజానికి నేను వెళ్ళతగదు. (37) నీ యాగమందు, మహోత్సవ మందు నందపుత్రుడు వస్తే నీతో కూడా ఆతనికి తప్పకుండా విరోధమౌతుంది. (38) నేను ఆతనిని తీసుకువచ్చి యుద్ధం చేయిస్తాను, అనేది నాకు క్షేమంకాదు. దానికి విఘ్నమౌతుంది. నీకూ విఘ్నమౌతుంది. (39) తండ్రితీసుకుపోయినాడు, కృష్ణుడు చచ్చాడు అని అందరంటారు. లేదా వసుదేవుడు, కొడుకుద్వారా రాజునే చంపించాడు అనైనా అంటారు. (40) ఇద్దరిలో ఒకరికి వెంటనే మృత్యువు కలుగుతుంది. శూరులు పడిపోతారు. మాంసం లేకుండా (చావకుండా) యుద్ధంలేదు. (41)

మూII వసుదేవవచః శ్రుత్వా రక్తపంకజలోచనః

ఖడ్గం గృహీత్వా తం హంతుం ప్రయయౌ నృపతీశ్వరః

హా హేతి కృత్వా పుత్రంచ వారయామాస తత్ క్షణం

ఉగ్రసేనో మహారాజమతీవ బలవన్మునే

స్వపీఠాద్వసుదేవశ్చ కోపావిష్టో గృహం యయౌ

అక్రూరం ప్రేరయామాస గంతుం నందవ్రజం నృపః

దూతాన్ప్రస్థాపయామాస శీఘ్రం ప్రతిదిశంతథా

ఆయయుః మునయః సర్వే నృపాశ్చ సపరిచ్ఛదాః

దిక్పాలాశ్చ సురాస్సర్వే బ్రాహ్మణాశ్చ తపస్వినః

సనకశ్చ, సనందశ్చ వోడుఃపంచశిఖస్తథా

సనత్కుమారో భగవాన్ ప్రజ్వలన్ బ్రహ్మతేజసా

కపిలఃశ్చాసురి: పైలః సుమంతుశ్చ సనాతనః

పులహశ్చ పులస్త్యశ్చ భృగుశ్చ క్రతురంగిరాః

మరీచిఃకశ్యపశ్చైవ దక్షోఽత్రిశ్చ్యవనస్తథా

భరద్వాజశ్చ వ్యాసశ్చ గౌతమశ్చ పరాశరః

ప్రచేతాశ్చ వసిష్ఠశ్చ సంవర్తశ్చ బృహస్పతిః

కాత్యాయనో యాజ్ఞవల్క్యోఽప్యుత్తంకః సౌభరిస్తథా

పర్వతో దేవలశ్చైవ జైగీషవ్యశ్చ జైమినిః

విశ్వామిత్రశ్చ సుతపాః పిప్పిలః శాకటాయనః

జాబాలి: జాంగలిశ్చైవాపిశలిశ్చ శిలాలికః

ఆస్తికశ్చ జరత్కారుః తథా కల్యాణమిత్రకః

దుర్వాసా వామదేవశ్చ ఋష్యశృంగో విభాండకః

పథి: కవిః కణాదశ్చ కౌశికః పాణినిస్తథా

కౌత్సోఽ ఘమర్షణశ్చైవ వాల్మీకిర్లోమహర్షణః

మార్కండేయో మృకండుశ్చ పర్షురామశ్చ సాంకృతిః

అగస్త్యశ్చ తథావాంతః తథాఽన్యే మునయోమునే

సశిష్యాశ్చస పుత్రాశ్చ బ్రాహ్మణాశ్చ తపస్వినః

జరాసంధో దంతవక్త్రో దాంభికో ద్రవిడాధిపః

శిశుపాలో భీష్మకశ్చ భగదత్తశ్చ ముద్గలః

ధార్తరాష్ట్రో ధూమకేశోధూమ్రకేతుశ్చ శంబరః

శల్యః సత్రాజితః శంకు: నృపాశ్చాన్యే మహాబలాః

భీష్మో ద్రోణః కృపాచార్యో, హ్యశ్వత్థామా మహాబలః

భూరిశ్రవాశ్చ శాల్వశ్చ కైకేయః కౌశలస్తథా

సర్వాన్ సంభాషయామాస మహారాజో యథోచితం సత్యకో యజ్ఞ దివసం చకార శుభక్షణం

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ నారాయణ నారద సంవాదే కంసయజ్ఞ కథనం నామ చతుః షష్టితమోఽధ్యాయః

వసుదేవుని మాటలు విని కళ్ళు ఎర్రతామరల వలె కాగా, నృపతులకు ఈశ్వరుడు (రాజు) ఖడ్గము తీసుకొని ఆతనిని చంపటానికి వెళ్ళాడు (42) మిక్కిలి బలవంతుడైన ఉగ్రసేనుడు హా! హా! అని అంటూ పుత్రుడైన మహారాజును ఆ క్షణంలోనే వారించాడు, ఓ ముని! (43) కోపావిష్టుడై వసుదేవుడు, తన పీఠం నుండి లేచి ఇంటికి వెళ్ళాడు. రాజు, నంద ప్రజానికి వెళ్ళటానికి అక్రూరుని ప్రేరేపించాడు. (44) అట్లాగే అన్ని దిక్కులకు త్వరగా దూతలను బయల్దేరదీశాడు. మునులంతా వచ్చారు తమ పరివారంతో సహ రాజులొచ్చారు. (45) దిక్పాలురు, అందరు దేవతలు, బ్రాహ్మణులు, తపస్వులు, సనక సనందులు నిర్వహణకై, అట్లాగే పంచశిఖులు వచ్చారు. (46) బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతూ, భగవానుడైన సనత్కుమారుడు కపిలుడు, ఆసురి పైలుడు, సుమంతుడు, సనాతనుడు వచ్చారు. (47) పులహుడు, పులస్త్యుడు, భృగువు, క్రతువు, అంగిరుడు, మరీచి, కశ్యపుడు, దక్షుడు, అత్రి, చ్యవనుడు (48) భరద్వాజుడు, వ్యాసుడు, గౌతముడు, పరాశరుడు, ప్రచేతుడు, వసిష్ఠుడు, సంవర్తుడు, బృహస్పతి (4) కాత్యాయనుడు, యాజ్ఞవల్క్యుడు, ఉత్తంకుడు, సౌభరి, పర్వతుడు, దేవలుడు, జయించాలనే కోరికగల (జైగీషవ్య) జైమిని (50) విశ్వామిత్రుడు, సుతపుడు, పిప్పలుడు, శాకటాయనుడు, జాబాలి, జాంగలి, ఆపిశలి, శిలాలికుడు , (51) ఆస్తికుడు, జరత్కారువు, కల్యాణమిత్రకుడు, దుర్వాసుడు, వామదేవుడు, ఋష్యశృంగుడు,విభాండకుడు (52) పథి, కవి, కణాదుడు, కౌశికుడు, పాణిని, కౌత్సుడు, అఘమర్షణుడు, వాల్మీకి, లోమహర్షణుడు (53) మార్కండేయుడు, మృకండుడు, పరురాముడు, సాంకృతి, అగస్త్యుడు, వాంతుడు అట్లాగే ఇతర మునులు వచ్చారు. ఓముని! (54) శిష్యులు, పుత్రులతో కూడి బ్రాహ్మణులు, తపస్యులు వచ్చారు. జరాసంధుడు, దంవక్తృడు, దాంభికుడు, ద్రవిడాధిపుడు (55) శిశుపాలుడు, భీష్మకుడు, భగదత్తుడు, ముద్గలుడు, ధార్తరాష్ట్రుడు, ధూమకేశుడు, ధూమ కేతువు, శంబరుడు, (56) శల్యుడు, సత్రాజిత్తు, శంకుడు, ఇతరులు మహాబలవంతులైన నృపులు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, మహాబలుడు అశ్వత్థామ, (57) భూరిశ్రవుడు, శాల్వుడు, కైకేయుడు, కౌశలుడు (రాజు) వచ్చారు. వీరందరిని మహారాజు తగిన రీతిగా పలుకరించాడు. శుభక్షణము చూచి సత్యకుడు యజ్ఞదినాన్ని ఏర్పరచాడు అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు కంస యజ్ఞమును గూర్చి చెప్పటమనునది అరువది నాల్గవ అధ్యాయము సమాప్తము II