85 - అధ్యాయము

మూ॥ నంద ఉవాచ:

వర్ణనాంచ చతుర్ణాంచ భక్ష్యాభక్ష్యంచ సాంప్రతం ।

విపాకం కర్మణాం చైవ సర్వేషాం ప్రాణినామపి ॥

కథయస్వ మహాభాగ కారణానాంచ కారణం ।

త్వత్తోఽన్యం కంచ పృచ్ఛామి నితాంతం సంతమీశ్వరం ॥

శ్రీభగవానువాచ –

భక్ష్యా భక్ష్యం చతుర్ణాoచ వర్ణానాంచ యథోచితం ।

వేదోక్తం శ్రూయతాంతాత సావధానం నిశామయ ॥

అయస్పాత్రే పయఃపానం గవ్యం సిద్ధాన్నమేవచ ।

భ్రష్టాదికం మధు గుడంనాలికేరోదకం తథా ॥

ఫలం మూలంచ యత్కించిత్ అభక్ష్యం మనుర బ్రవీత్ ।

దగ్దాన్నం తప్త సౌవీరమభక్ష్యం బ్రహ్మనిర్మితం ॥

నాలికేరోదకం కాం స్యే తామ్రపాత్రేస్థితం మధు ।

గవ్యంచ తామ్రపాత్రస్థం సర్వం మద్యం ఘృతం వినా ॥

తామ్రపాత్రే పయఃపానముచ్ఛిష్టం ఘృతభోజనం ।

దుగ్ధం సలవణం చైవ సద్యోగోమాంస భక్షణం ॥

అభక్ష్యం మధుమిశ్రంచ ఘృతం తైలంగుడం తథా ।

ఆర్ధ్రకంగుణ సంయుక్త మభక్ష్యం శ్రుతి సమ్మతం ॥

పీతశేష జలం చైవ మాఘేచ మూలకం తథా ।

జపాదికంచ శయనే సదాప్రాజ్ఞః పరిత్యజేత్ ॥

ద్విర్బోజనం చ దివసే సంధ్యయోర్బోజనం తథా ।

భక్ష్యంచ రాత్రిశే షేచ ధ్రువం ప్రాజ్ఞః పరిత్యజేత్ ॥

పానీయం పాయసం చూర్ణం ఘృతం లవణమేవచ ।

స్వస్తికం గుడకం చైవ క్షీరం తక్రం తథా మధు ॥

హస్తా ద్ధస్తగృహీతంచ సద్యో గోమాంస మేవచ ।

కర్పూరం రౌప్యపాత్ర స్థమభక్ష్యం ప్రతి సంమతం ॥

పరివేషణ కారీచ భోక్తారం స్పృశతే యది ।

అభక్ష్యంచ తదన్నంచ సర్వేషా మేవసంమతం ॥

నకులానాం గండకానాం మహిషాణాంచ పక్షిణాం ।

సర్పాణాం సూకరాణాంచ గర్దభానాం విశేషతః ॥

మార్జారాణాం శృగాలానాం కుక్కుటానాం వ్రజేశ్వర ।

వ్యాఘ్రణామపి సింహానాం త్యాజ్యం మాంసం నృణాంసదా ॥

జలౌకసాం చ నక్రాణాం గోధాకానాం తథైవచ ।

మండూకానాం కర్కటీనాం చుంచుకానాంచ నిశ్చితం ॥

గవాంచ చమరీణాంచ న కలౌ మాంస భక్షణం ।

హస్తినాం ఘోటకానాంచ నృణామేవచ రక్షసాం ॥

అను ॥ నందుడిట్లన్నాడు : ఇప్పుడు నాలు- వర్ణముల వారికి తినతగినది, తినతగనిది చెప్పండి. ప్రాణులన్నింటి కర్మ విపాకాన్ని చెప్పండి (1) కారణములన్నిటికి కారణమైన దానిని చెప్పండి, ఓ మహాభాగ! నీకన్న ఇతరులను ఎవరిని అడగను. పూర్తిగా, ఈశ్వరునిగా ఉన్న నిన్నే అడుగుతాను. (2) శ్రీ భగవానుని వచన మిట్లా - నాలుగు వర్ణముల వారికి తినతగిన, తినతగని వాటిని, తగినట్లుగా, వేదంలో చెప్పిన దానిని, చెబుతాను, సావధానంగా వినండి, ఓ తండ్రి! (3) ఇనుపదానిలో ఆవు పాలు త్రాగుట, సిద్దమైన అన్నము తినుట. వెలివేయబడ్డ మొదలగు వారి తేనె, బెల్లము, కొబ్బరి నీరు (4) పండ్లు గడ్డలు, ఏదైనా తినతగనివి అని మనువు చెప్పాడు, మాడిన అన్నము, కాల్చిన పులియబెట్టిన నీళ్ళు, తినతగనివి (తాగ) అని బ్రహ్మ ఏర్పరచాడు. (5) కాంస్య పాత్రలో కొబ్బరినీళ్ళు, రాగి పాత్రలోని తేనె రాగిపాత్రలోని ఆవుపాలు ఇవన్ని మద్యంతో సమానము, నేయి మాత్రం మద్యం కాదు. (6) తామ్రపాత్రలో పాలు తాగటం, ఎంగిలిదైననేయి అన్నాన్ని తినటం, ఉప్పుకలిసిన పాలు, ఇవన్ని వెంటనే గోమాంస భక్షణ ఫలాన్నిస్తాయి. (7) తేనె కలిసిన నెయ్యి, నూనె, బెల్లము, దారము కలిసిన అల్లము (అల్లిత్రాడా!) తినరాదని శ్రుతిలో చెప్పారు. (8) తాగగా మిగిలిన నీరు, మాఘమాసంలో మూలకములు, పడకలో జపము, వీటిని తెలివి కలవాడు ఎప్పుడూ విడువాలి. (9) పగటిపూట, రెండుసార్లు భోజనము, సంధ్యాకాలములో భోజనము, తెల్లవారుఝామున తినటము వీటిని బుద్దిమంతుడు తప్పక విడువాలి. (10) నీరు, పాయసము, పొడి, నెయ్యి, ఉప్పు, మంగళవస్తువు, బెల్లము, పాలు, చల్ల,తేనె (11) ఒకరిచేతి నుండి మరొకరు తీసుకుంటే అవి వెంటనే గోమాంసమౌతాయి. వెండిపాత్రలోని కర్పూరము తినరాదని వేదాభిప్రాయము. (12) సంచారం చేసేవాడు, తినువానిని ముర్రే, ఆ అన్నము తినరాదు అని అందరన్నారు. (పరివేత్తయా) (13) ముంగిస, గండకమృగము, దున్నపోతు, పక్షులు, పాములు, పందులు, గాడిదలు, (14) పిల్లులు, నక్కలు, కోళ్ళు, ఓవ్రజేశ్వర! వ్యాఘ్రములు, సింహములు వీని మాంసాన్ని నరులు ఎప్పుడు తినరాదు (15) నీటిలో ఉండేవాని, మొసళ్ళ, ఉడుముల, కప్పల, ఆడ ఎండ్రకాయల (లేదా కక్కెర) పక్షి. చుంచుకముల (16) గోవుల, చమరీ మృగముల, ఏనుగుల, గుర్రముల, నరుల,రాక్షసుల మాంసమును కలిలో తినరాదు, నిశ్చయము.

మూ॥ దంశశ్చ మశకశ్చైవ మక్షికాచ పిపీలికా ।

అన్యేషాంచ నిషిద్ధానాం లోకే వేదే వ్రజేశ్వర ॥

వానరాణాం భల్లుకానాం శరభాణాం తథైవచ ।

నిషిద్ధం మృగనాభీనాం గర్దభానాంచ మాంసకం ॥

అభక్ష్యం మహిషీణాంచ దుగ్ధం దధి ఘృతం తథా ।

స్వస్తికంచ తథా తత్ర విప్రాణాం నవనీతకం ॥

మాంస ముచ్చై:శ్రవసకం తస్యదుఢాదికం తథా ।

వర్ణానాంచ, చతుర్ణించాప్యభక్ష్యంచ శ్రుతౌశ్రుతం ॥

అభక్ష్య మార్ద్రకం చైవ సర్వేషాంచ రవేర్దినే ।

పర్యుషితం జలంచాన్నం విప్రాణాం దుగ్ధమేవచ ॥

వర్ణానాంచ చతుర్ణించాప్య వీరాన్నస్య భక్షణం ।

తదన్నంచ సురాతుల్యం గోమాంసాధికమేవచ ॥

అవీరాన్నంచయో భుంక్తే బ్రాహ్మణోజ్ఞాన దుర్బలః ।

పితృదేవార్చనం తస్య నిష్ఫలం మనురబ్రవీత్ ॥

బ్రాహ్మణానాం వైష్ణవా నామభక్ష్యం మాత్స్యమేవచ ।

ఇతరేషామభక్ష్యంచ పంచపర్వసునిశ్చితం ॥

పితృదేవావశేషేచ భక్ష్యం మాంసం నదూషితం ।

పంచపర్వ సుత్యాజ్యంచ సర్వేషాం మనురబ్రవీత్ ॥

అసంస్కృతంచ లవణం తైలంచభక్ష్యమేవచ ।

భక్ష్యం పవిత్రం సర్వేషాం వ్యంజనం వహ్ని సంస్కృతం ॥

ఏకహస్తే ఘృతంతోయ మభక్ష్యం సర్వసంమతం ।

ఆవిలం కృమియుక్తం చాపరిశుద్ధంచ నిర్మలం ॥

అభక్ష్యం బ్రాహ్మణానాంచ వైష్ణవానాం విశేషతః ।

అనివేద్యం హరేరేవ యతీనాం బ్రాహ్మచారిణాం ॥

పిపీలికా మిశ్రితంచ మధుగవ్యం గుడంతథా ।

యత్కించిద్వస్తువా, తాత నభక్ష్యంచ శ్రుతౌ శ్రుతః ॥

పక్షిభక్ష్యం కీటభక్ష్యం శుద్ధం పక్వఫలం తథా ।

కాక భక్ష్యమభక్ష్యంచ సర్వేషాం ద్రవ్యమేవచ ॥

ఘృతపక్వం తైలపక్వం మిష్టాన్నం శూద్ర సంస్కృతం ।

అభక్ష్యం బ్రాహ్మణానాంచ శూద్రభక్ష్యంచ పీఠకం ॥

సర్వేషా మశుచీనాంచ జలమన్నం పరిత్యజేత్ ।

ఆశౌచాంతాత్పరదినే శుద్ధమేవ, నసంశయః ॥

విపాకం కర్మణామేవ దుష్కరం ప్రతి సంమతం ।

భక్ష్యాభక్ష్యంచ కధితం యథాజ్ఞానం వ్రజేశ్వర ॥

క్రమాచ్చతుర్షువేదేషుచోక్తం మతచతుష్టయం ।

సర్వేషాం సారభూతంచ కథయామి పితః శృణు ॥

నాభుక్తం క్షీయతే కర్మ కల్వకోటిశతైరపి ।

అవశ్యమేవభోక్తవ్యం కృతంకర్మశుభాశుభం ॥

తీర్ధానాంచ సురాణాంచ సహాయ్యో న నృణామపి ।

కించిద్భవతి సాహాయ్యం కాయవ్యూ హేనసర్వతః ॥

అను ॥ అడవియోగ, దోమ, ఈగ, చీమ, నిషిద్ధములైన ఇతరములైన వానిని లోకంలో, వేదంలో చెప్పబడ్డవానిని తినరాదు, ఓ ప్రజేశ్వర! (18) కోతులు, ఎలుగుబంట్లు, శరభములు, మృగనాభులు, గాడిదలు వీని మాంసం నిషిద్ధము. (19) బర్రెపాలు, పెరుగు, నెయ్యి తినకూడదు. స్వస్తికము (బొట్టు) అట్లాగే బ్రాహ్మణుల వెన్న తాకరాదు. (20) గుఱ్ఱపు మాంసము, పాలు మొదలగునవి తినరాదు. నాలుగు వర్ణముల వారికి తినతగనివి అని శ్రుతిలో తెలిపారు. (21) ఆదివారము రోజున అందరు అల్లం తినరాదు. పాచినీరు, అన్నము, బ్రాహ్మణుల పాలు (22) నాలుగు వర్ణముల వారు, సంతానములేని వారి అన్నమును తినుటకూడదు. ఆ అన్నము సురతో సమానము, గోమాంస భక్షణము కన్న ఎక్కువ. (23) బ్రాహ్మణుడు, జ్ఞానదుర్బలుడై సంతానం లేని వారి అన్నం తింటే వాడు చేసిన పితృదేవ అర్చనము నిష్ఫలము, అని మనువన్నాడు. (24) బ్రాహ్మణులు వైష్ణవులు చేపలు తినరాదు. ఇతరులు ఐదు పర్వదినములలో తినరాదు, నిశ్చయము (25) పితృదేవతల అవశేషమైన మాంసాన్ని తినవచ్చును తప్పుకాదు. ఐదు పర్వదినములలో అందరూ తినరాదు అని మనువు చెప్పాడు. (26) సంస్కరించకుండా ఉప్పును, నూనెను తినరాదు. అగ్ని సంస్కృతమైన వ్యంజనము అందరికి పవిత్రమైనది, తినతగినది. (27) ఒక చేతిలోనే నీరు, నేయి తినరాదు, అందరంగీకరించినది. కలుషితమైనది, పురుగులుకలది, అపరిశుద్దమైనదీ, నిర్మలం కానిది (28) బ్రాహ్మణులు, వైష్ణవులు విశేషించి తినరాదు. హరికి నివేదించని దానిని యతి బ్రహ్మచారి తినరాదు. (29) చీమలు గల తేనె, ఆవునేయి వగైరా, బెల్లము ఏకొంచం వస్తువైనా, ఓ తండ్రి! తినరాదు, అని శ్రుతిలో విన్పిస్తోంది. (30) పక్షులు తిన్న, పురుగులు తిన్న, శుద్ధమైన పండిన ఫలాన్నైనా కాకి తిన్నదాన్నైనా ఎవ్వరూ తినరాదు. అవి ముట్టిన వస్తువైనా (పదార్దము) తినరాదు. (31) నేయితో వండిన, నూనెతో వండిన శూద్ర సంస్కారము పొందిన మధురము బ్రాహ్మణుడు తినరాదు. శూద్రుని భక్ష్యమైన పీఠకమును తినరాదు. (32) అశుచులైన వారి అందరి నీరును, అన్నమును విడిచి పెట్టాలి. ఆశౌచం చివరి తరువాత, తరువాత రోజున అవి శుద్దము స్వీకార్యము. అనుమానంలేదు. (33) కర్మ పరిపాకము 'చాలా దుష్కరమైనది, అని శ్రుతిలో చెప్పారు. ఓ ప్రజేశ్వర! తినతగిన, తినతగని వాటిని గూర్చి నాకు తెలిసినంత చెప్పాను. (34) క్రమంగా నాలుగు వేదములలో చెప్పిన నాలుగు మతములను, అన్నిటి సారాన్ని చెప్తాను విను. ఓ తండ్రి! (35) శతకోటి కల్పముల కాలానికైనా కర్మ అనుభవించకుండా, క్షీణించదు. శుభమైనా, అశుభమైనా చేసిన కర్మను తప్పకుండా అనుభవించాలి. (36) తీర్దముల,దేవతల సహాయము నరుల సహాయము ఉండదు. అంతటా శరీర భాగాలతో కొద్ది సాహాయ్యం లభిస్తుంది.

మూ॥ ప్రాయశ్చిత్తాని చీర్ణాని నిశ్చితం మత్పరాజీముఖం ।

న నిష్పునంతి హేతాత సురాకుంభమివాపరాః ॥

ప్రాయశ్చిత్తేన పుణ్యేన నహిశుద్ధ్యంతి మానవాః ।

సర్వారంభేణ వైశ్యేంద్ర దానేన యోగతోఽపివా ॥

శుభాశుభంచ యత్కర్మ వినా భోగాన్నచ క్షయః ।

భోగేన శుద్ధి మాప్నోతి తతో ముక్తిర్భవేన్నృణాం ॥

న నష్టం దుష్కృతం కర్మ సుకృతేనచ కర్మణా ।

న నష్టం సుకృతం కర్మ కృతేన దుష్కృతేనచ ॥

యజ్ఞేన తపసా వాఽపివ్రతేనానశనేనచ ।

తీర్థస్నానేన దానేన జపేన నియమేనచ ॥

భువః ప్రదక్షిణేనైవ పురాణశ్రవణేనచ ।

ఉపదేశేన పుణ్యేన పూజయా గురు దేవయోః ॥

స్వధర్మాచరణేనైవాతిథీనాం పూజనేవచ ।

బ్రహ్మణాం పూజనేనైవ భోజనేన విశేషతః ॥

యద్దత్త మపి విప్రాయ తత్ప్రాప్తం పూర్ణరూపతః ।

జరూపంచ తద్దానం క్షేత్రరూపంచ బ్రాహ్మణః ॥

ఏకేన కర్మణా తాత స్వర్గం ప్రాప్నోతి మానవః ।

కర్మణా నహి మోక్షంచ తదేవ మమ సేవయా ॥

స్వర్గంచ సుకృతేనైవ నరకం దుష్కృతేనచ ।

వ్యాధిర్జన్మచయోనౌచ కుత్సితేన తతః శుచిః ॥

గోఘ్నో యో బ్రాహ్మణానాంచ కామతశ్చోపపాతకీ ।

దందశూకత్వమాప్నోతి గోలోక సమవర్షకం ॥

సర్పేణ భక్షిత స్తేన జ్వాలయా గరలస్యచ ।

తృషితో వ్యథితశ్చైవ నిరాహారః కృశోదరః ॥

తతఃకుండాత్సముత్థాయ గౌర్భవేల్లోమ వర్షకం ।

తతఃకుష్ఠీచ చాండాలో వర్షలక్షం తతోనరః ॥

తదాభవేద్భ్రాహ్మణశ్చ కుష్టయుక్తాహి కర్మణా ।

భోజయిత్వా విప్రలక్షం నిర్వ్యాధిశ్చ భవేచ్ఛుచిః ॥

అకామతస్తదర్ధంచ క్షత్రియస్యాపి కామతః ।

అకామతస్త దర్ధంచ చతుర్థంచ విశస్తథా ॥

తదర్ధం శూద్రగోఘ్నశ్చ భుంక్తే పాపంన సంశయః ।

ప్రాయశ్చిత్తేన శుద్ధశ్చ భుంక్తే శేషంచ కర్మణః ॥

అనుకల్పేచతుర్థంచ పాపం భుంక్తే న సంశయః ।

చతుర్గుణం చ గోఘ్నానాం బ్రాహ్మణానాంచ పాతకం ॥

భుంక్తే పాపంచ బ్రహ్మఘ్నో బ్రాహ్మణశ్చేతరోఽ పివా ।

క్రమేణానేన బోధ్యంచ కామతోఽకామతోఽపివా ॥

ప్రాశ్చిత్తం జన్మకర్మ వ్యాధిరేవ న సంశయః ।

గోఘ్నోభవతి గౌశ్చాపి యావద్వర్షంచ నిశ్చితం ॥

చతుర్గుణంచ తేషాంచ బ్రహ్మఘ్నోవిట్ కృమిర్భవేత్ ।

తతోభవతి మ్లేచ్ఛశ్చ తావద్వర్ష చతుర్గుణం ॥

ఇతిశ్చాంధోభవేద్విప్రః పూర్వేషాంచ చతుర్గుణం ।

బ్రాహ్మణానాం చతుర్లక్షం భోజయిత్వా శుచిర్భవేత్ ॥

చక్షుష్మాంశ్చ యశస్వీచ భవేత్సోఽప్యతి పాతకాత్ ।

స్త్రీఘ్నః చతుర్థాం వర్ణానాం వేదే సోఽప్యతిపాతకీ ॥

తీర్థయాత్రలు చేసినా అవి నాకు వ్యతిరేకమే, నిశ్చయము. ఓ తండ్రి! కల్లుకుండను నదులు పవిత్రం చేయనట్టే, పవిత్రం చేయవు. (38) ప్రాయశ్చిత్తం వల్ల కలిగే పుణ్యంతో మానవులు పరిశుద్ధులుకారు. ఓ వైశ్యేంద్ర! అన్ని ఆరంభములతో దానంతో కాని యోగంతో కాని (39) శుభాశుభమైన కర్మఏదైనా అనుభవించకుండా నాశమందదు. అనుభవంతో పరిశుద్దినందుతాడు. ఆపై నరులకు ముక్తి లభిస్తుంది. (40) పుణ్యకర్మతో పాపకర్మ నశించదు. చేసిన దుష్కర్మతో సుకృతకర్మ నశించదు. (41) యజ్ఞము, తపస్సు, వ్రతము, నిరాహారము, తీర్థస్నానము, దానము, జపము, నియమము (42) భూప్రదక్షిణము, పురాణశ్రవణము, ఉపదేశము, పుణ్యము, పూజ్య గురు దేవతలది (43) స్వధర్మాచరణము, అతిథి పూజ, బ్రాహ్మణ పూజ, విశేషించి వారికి భోజనము. (44) బ్రాహ్మణునకు ఏదిస్తాడో అదిపూర్ణంగా ప్రాప్తిస్తుంది. ఆ దానము బీజరూపము, బ్రాహ్మణుడు క్షేత్రరూపము (పొలము) (45) ఓతండ్రి! ఏదేని ఒక కర్మతో నరుడు స్వర్గాన్ని పొందుతాడు. కర్మతో మోక్షంరాదు. అదినా సేవతోనే వస్తుంది. (46) మంచిపనితో స్వర్గము, చెడు పసితో నరకము వస్తాయి. వ్యాధి, యోనియందు జన్మకుత్సిత కర్మతో వస్తాయి ఆ పిదప శుచిత్వము. (47) కావాలని బ్రాహ్మణుల ఆవును చంపినవాడు ఉపపాతకి ఔతాడు. ఆవు వెంట్రుకలెన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాల కాలము సర్పమౌతాడు. (48) ఆ సర్పాకారంతో, విషజ్వాలతో భక్షింపబడుతూ, దప్పిగొని, వ్యధనందుతూ ఆహారంలేక, శరీరం కృశించి (49) ఆ పైన కుండమునుండి లేచి (నిప్పుల గుండం) వెంట్రుకల సంఖ్యతో సమానమైన సంవత్సరాలు ఆవు అవుతాడు. ఆ పిదప కుష్టురోగి, చండాల నరుడుగా లక్ష సంవత్సరాలు ఔతాడు. (50) ఆ పైన కుష్టురోగి బ్రాహ్మణుడౌతాడు, కర్మతో, లక్షబ్రాహ్మణులకు భోజనం పెట్టి, వ్యాధిరహితుడై శుచియౌతాడు. (51) పొరపాటున ఐతే అందులో సగభాగము. క్షత్రియుని గోవును ఇష్టపూర్తిగా చంపితే అందులో (బ్రాహ్మణుని దానిలో) సగము. పొరపాటున చేస్తే అందులో సగభాగము వైశ్యుని గోవునైతే నాల్గవ భాగము (52) శూద్రుని గోవునైతే చంపితే అందులో సగభాగము పాపము అనుభవిస్తాడు, అనుమానము లేదు. ప్రాయశ్చిత్తంతో శుద్ధుడై మిగిలిన కర్మశేషాన్ని అనుభవిస్తాడు (53) అనుకల్పమందు పాపంలో నాల్గవ భాగాన్ని అనుభవిస్తాడు అనుమానం లేదు. గోహత్య చేసే బ్రాహ్మణులకు పాపము నాల్గురెట్లెక్కువ. (54) బ్రహ్మహత్యచేసిన వాడు, బ్రాహ్మణుడైనా ఇతరుడైనా పాపాన్ని అనుభవిస్తాడు క్రమంగా ఇట్లా తెలుసుకోవాలి ఇష్టపూర్తిగా ఐతే, ఇట్లా ఇష్టపూర్తిగా చేయకపోతే ఇట్లా అని (55) ప్రాయశ్చిత్తమంటే జన్మ, కర్మ వ్యాధియే అనుమానం లేదు. ఆవును చంపినవాడు (సవత్సరకాలము ఆవు కూడా ఔతాడు, నిశ్చయము. (56) బ్రహ్మ హత్య చేసినవాడు వారికన్న నాల్గింతలెక్కువ పాపిఔ తాడు. మలంలో పురుగౌతాడు. అదే సంవత్సరాలు నాల్గింతలుగా ఆ పై మ్లేచ్చుడౌతాడు. (57) ఆ పైన విప్రుడు, ముందు వారికన్న నాల్గింత లెక్కువ కాలము అంధుడౌతాడు. నాల్గు లక్షల బ్రాహ్మణులకు భోజనం పెట్టి శుచిమౌతాడు. (58) అతిపాతకం నుండి ముక్తుడై కళ్ళు గలిగి, కీర్తి కలవాడౌతాడు. నాలుగు వర్ణముల వారిలో స్త్రీ హత్యచేసిన వాడు అతి పొతకియే, వేదమందు ఇదే చెప్పారు.

మూ॥ కాలసూత్రం చ ప్రాప్నోతి స్త్రీలోమ సమవర్షకం ।

భక్షితం కృమిణా తత్ర నిరాహారోవ్యధాయుతః ॥

తతో భవతి లోకే చ తావద్వర్షం చపాతకీ ।

తతః పాపీ భవేత్సోఽపి యక్ష్మగ్రస్తశ్చ కర్మణా ॥

వర్షాణాం శతకంచైవ విప్రలక్షంచ భోజయేత్ ।

తతః శుద్ధో బ్రాహ్మణశ్చ విద్వాంస్తపసి సంయతః ॥

కించిద్భుంకే పాపశేషం స్వర్ణదానా చ్ఛుచిర్భవేత్ ।

గర్భఘ్నశ్చ మహాపాపీ సంప్రాప్నోతి శునీముఖం ॥

వర్షాణాం శతకంచైవ ఘోటకశ్చభవేద్ధ్రువం ।

వర్షాణాం శతకంచైవ సూక్ష్మశస్త్రేణ పీడితః ॥

తతః పాపీ భవేద్వైశ్యో ద్రవ్యయుక్తోహి కర్మణా ।

పంచాశ ద్వర్ష పర్యంతం స్వర్ణదానాద్భవేచ్ఛుచిః ॥

తతః స్వకులజాతోఽపి నిర్వ్యాధిః బ్రాహ్మణఃశుచిః ।

బ్రాహ్మణః క్షత్త్రియఘ్నశ్చ క్షత్రియోవా వినారణాత్ ॥

తప్తశూలంచ ప్రాప్నోతి వర్షాణాంచ సహస్రకం ।

క్వథితం తప్తలో హేన చార్తనాదం కరోతిచ ॥

తతోభవేన్మత్త గజో వర్షాణాం శతకం తథా ।

తతోరక్త వికారీచ శూద్రో వర్షశతం తథా ॥

గజదానేన ముక్తశ్చ వ్యాధితశ్చ తతోద్విజః ।

వైశ్యఘ్నశ్చాపి వైశ్యశ్చ శూద్రఘ్నావైశ్య ఏవచ ॥

వైశ్యఘ్నశ్చాపి శూద్రశ్చ సమంపాపం లభేత్ ధ్రువం ।

కృమికుండంచ ప్రాప్నోతి వర్షాణాం శతకం తథా ॥

కృమిభిః భక్షితో దుఃఖీ కిరాతశ్చ భవేత్తతః ।

వర్షాణాంశతకం చైవ కృమివ్యాధి సమన్వితః ॥

తతోమందాగ్ని యుక్తశ్చ బ్రాహ్మణో దైన్యవాన్ర్వజ ।

పంచాశద్వర్ష పర్యంతం దుర్బలశ్చ కృశోదరః ॥

ముక్తి ర్భవతి యుక్తేన తీర్థేచాశ్వ ప్రదానతః ।

శూద్రఘ్నో బ్రాహ్మణశ్చైవ కామతోఽకామతోఽపివా ॥

సావిత్రీ లక్షజాప్యేన తదర్ధేన శుచిర్భవేత్ ।

చతుర్వర్ణః కుక్కుటఘ్నో హ్యవిశప్తశ్చ శంభునా ॥

వర్షాణాం శతకంచైవ ప్రాప్నోతి రౌరవం నరః।

తతో భుంక్తే కుక్కుటశ్చ వర్షాణామపిషోడశ ॥

తతఃశుద్దో భవేద్విప్రో భక్షితః కుక్కుటేనచ ।

గంగాస్నానేన దానేన స్వర్ణస్యాపి భవేచ్ఛుచిః ॥

మార్జారఘ్నశ్చతుర్వర్ణో గంగాస్నానాద్భవేచ్ఛుచిః ।

విప్రాయ లవణం దత్వా షట్ పలంచ ప్రముచ్యతే ॥

హత్వా సరాంశ్చతుర్వర్ణో యమపాదేన చిహ్నితాన్ ।

బ్రహ్మహత్యా చతుర్థంచ పాతకంచ లభేద్ధ్రువం ॥

అసిపత్రంచ నరకం వర్షాణాంశతకం తథా ।

ప్రాప్నోతియాతనా యుక్తో విచ్చిన్న స్తీక్షణధారయా ॥

తతోభవతిసర్పశ్చ డుండు భోవర్షపంచకం ।

నరేణ తాడితో దుఃఖీ మృత్యోర్భవతి పీడితః ॥

తతోభవేన్నరః పాపీ జ్వరయుక్తాహి దుర్బలః ।

వర్షాణాం పంచకేనైవ మృతోభవతి కర్మణా॥

అను ॥ హతురాలైన స్త్రీ వెంట్రుకలెన్నో అన్ని సంవత్సరాల కాలము కాలసూత్ర నరకానికి పోతాడు. ఆహారం లేక వ్యధ గలిగినవాడై పురుగులతో భక్షింపబడుతాడు. (60) ఆ పైన లోకంలో అన్ని సంవత్సరాలు పాతకి ఔతాడు. ఆ పైన ఆతడు పాపి ఔతాడు. కర్మవల్ల క్షయవ్యాధిగ్రస్తుడౌతాడు. (61) నూరు సంవత్సరాలు లక్ష బ్రాహ్మణులను భుజింపచేయాలి. ఆ పైన బ్రాహ్మణుడు శుద్దుడై, తపస్సుయందు నియతాత్ముడై (62) పాపశేషమును కొద్దిగా అనుభవిస్తాడు. స్వర్ణదానంతో శుచిఔతాడు. గర్భ పిండాన్ని చంపినవాడు మహాపాపి, ఆడ కుక్క ముఖాన్ని పొందుతాడు. (63) నూరు సంవత్సరాలు గుర్రమౌతాడు, నిశ్చయము. నూరు సంవత్సరాలు సూక్ష్మమైన శస్త్రంతో పీడింపబడి (64) ఆపై పాపి, ద్రవ్యంగల వైశ్యుడౌతాడు, కర్మవల్ల, ఏబది సంవత్సరాల వరకు బంగారు దానంచేసిన శుచి ఔతాడు (65) ఆపిదప తన కులంలో పుట్టినా, వ్యాధిలేక, బ్రాహ్మణుగా, శుచిగా ఉంటాడు. బ్రాహ్మణుడు క్షత్రియుణ్ణి చంపినా, క్షత్రియుడు యుద్ధం లేకుండా క్షత్రియుణ్ణి చంపినా (66) వేయి సంవత్సరాలు తప్తశూలాన్ని పొందుతాడు (కాల్చిన శూలం) కాలిన లోహంతో బాగా కాల్చబడి ఆర్తనాదాన్ని చేస్తాడు. (67) ఆ పిదప నూరు సంవత్సరాలు మదించిన ఏనుగౌతాడు. ఆ పైన, రక్తరోగియై నూరు సంవత్సరాలు శూద్రుడౌతాడు. (68) ఆపిదప ద్విజుడు వ్యాధితుడైన వాడు గజదానంతో ముక్తుడౌతాడు. వైశ్యుని చంపిన వైశ్యుడు శూద్రుని చంపిన వైశ్యుడు (69) వైశ్యుని చంపిన శూద్రుడు వీరంతా ఒకే రకమైన పాపాన్ని పొందుతారు, నిశ్చయము. నూరు సంవత్సరాలు, క్రిముల కుండాన్ని పొందుతాడు. (70) పురుగులతో భక్షింపబడి, దుఃఖితుడై ఆ పైన కిరాతుడౌతాడు. నూరు సంవత్సరాలు క్రిముల వ్యాధికలవాడై (71) ఆ పైన మందగించిన జఠరాగ్ని కలవాడై బ్రాహ్మణుడు దైన్యం కలవాడౌతాడు, ఓ ప్రజ! ఏబది సంవత్సరాల వరకు దుర్బలుడు, కడుపు లోపలికి పీక్కుపోయి ఉంటాడు. (72) తగిన విధంగా, తీర్థంలో గుర్రం దానం చేయటం వల్లను ముక్తి నందుతాడు. ఇచ్ఛాపూర్వకంగా లేదా పొరపాటుననైనా బ్రాహ్మణుడు శూద్రుని చంపితే (73) గాయత్రిని లక్షన్నర జపిస్తే (అరలక్ష) శుచిమౌతాడు. నాలు వర్గాల వారు కోడిని చంపితే శివునితో శపింపబడి, (74) నూరు సంవత్సరాలు రౌరవ నరకాన్ని పొందుతారు. పదహారు సంవత్సరాలు కోడి జీవితాన్ని అనుభవిస్తాడు. (75) ఆ పిదప, కుక్కుటంతో తినబడి విప్రుడౌతాడు. గంగాస్నానంతో, బంగారందానం చేయటంతో శుచి ఔతాడు. (76) పిల్లిని చంపిన నాలు వర్గాలవారు, గంగాస్నానంతో శుచులౌతారు. బ్రాహ్మణునకు ఉప్పుదానం చేస్తే ఆరుపలముల భాగం చేస్తే ముక్తులౌతారు. (77) నాల్లువర్ణాలవారు, పామును నా కాలి గుర్తు గలదాన్ని చంపితే, బ్రహ్మహత్యపాతకంలోని నాల్గవ భాగం పాపాన్ని పొందుతారు. నిశ్చయము.(78) నూరు సంవత్సరాలు అసిపత్రమనే నరకాన్ని పొందుతారు. తీక్షణమైన అంచుగల అసిపత్రంతో కోయబడి యాతనాయుక్తుడౌతాడు. (79) ఆ పైన ఐదు సంవత్సరాలు డుండుభమనే పాము ఔతాడు.(రెండు తలలది). నరులు కొడ్తుంటే దుఃఖం పొందుతాడు. పీడింపబడి మరణిస్తాడు. (80) ఆ పిదప, పాపాత్ముడు, జ్వరంగలవాడు, దుర్బలుడు ఐన నరుడౌతాడు కర్మవల్ల ఐదు సంవత్సరాలలోనే మరణిస్తాడు. (81)

మూ॥ తతోభవతి హస్తీచ ఘోటకోవా ప్రజేశ్వర ।

యావద్వింశతివర్షoచ తతఃశూద్రోభవేద్ధ్రువం ॥

అహంకృతీ వ్యాధియుక్తఃరౌప్య దానేనముచ్యతే ।

బ్రాహ్మణానాంచ శతకం భోజయిత్వాశుచిర్భవేత్ ॥

క్షుద్రజంతువధేనైవ క్షుద్ర జంతుర్భవేన్నరః ।

వర్షాణాం శతకంచైవ క్షుద్రవ్యాధింతరేత్తతః ॥

కృపాకార్యా సతా శశ్వత్ అహింసిషుచ జంతుషు ।

హింసాయాం నహిదోషశ్చ హింస్రాణాంచ ప్రజేశ్వర ॥

అశ్వత్థఘ్నశ్చతుర్వర్ణో బ్రహ్మ హత్యాచతుర్థకం ।

పాపంచ లభతే తాత చాసి పత్రం వ్రజేద్ధ్రువం ॥

సతీక్లేనాపిశస్త్రేణ విచ్ఛిన్నశ్చదివానిశం ।

వర్షాణాం శతకంచైవ భుంక్తే పరమయాతనాం ॥

తతోభవతి వృక్షశ్చ శాల్మలిర్వర్ష లక్షకం ।

తతోభవతి శూద్రశ్చ ఛిన్నాంగో వ్యాధి సంయుతః ॥

యావజ్జీవన పర్యంతం తతో విప్రో భవేధ్ద్రువం ।

ప్రణవ్యాధి సమాయుక్తో ముచ్యతే స్వర్ణదానతః ॥

మిథ్యాసాక్ష్య ప్రదాతాచ కృతఘ్నోఽతికృతఘ్నకః ।

విశ్వాసఘాతీ మిత్రఘ్నో విప్రాణాం ధనహారకః ॥

శూద్రశ్రాద్ధాన్న భోజీచ శూద్రాణాంశవదాహకః ।

శూద్రాణాం సూపకశ్చైవ వృషవాహకపాతకీ ॥

ధావకో దేవలశ్చాపి చైతేఽతి పాపినస్తథా ।

కుంభీపాకం ప్రయాంత్యేవ వర్షాణాంచ సహస్రకం॥

తత్రైవ తప్తతైలెన సంతప్తశ్చ దీవానిశం ।

భక్షితో వ్యాధితశ్చైవ సర్పాకారేణ జంతునా॥

గృధ్రఃకోటి సహస్రాణి శతజన్మాని సూకరః ।

శ్వాపదః శతజన్మాని శూద్రో రోగీ భవేత్తతః ॥

మందాగ్ని జ్వరసంయుక్తః పంచాశద్వర్షకం తథా ।

సువర్ణానాం శత పలం దత్వా శుద్ధో భవేధ్ద్రువం ॥

చతుర్వర్ణో వస్త్ర హారీ గవ్యహారీ చ మానవః ।

రౌప్యముక్తా పహారీచ శూద్రద్రవ్యాపహారకః ॥

వర్షాణాంచ సహస్రంచ బక జాతిర్భవేధ్ద్రువం ।

మూత్రం కుండంచ వైభుక్త్వా వర్షాణాంశతకం తథా ॥

తతోభవేచ్ఛూద్రజాతి: వర్షాణాం శతకం వ్రజ ।

కుష్ఠవ్యాధి సమాయుక్తో గలితశ్చైవ పాతకీ ॥

తతో భవేద్భ్రాహ్మణశ్చ కుష్టావశేష సంయుతః ।

స్వర్ణ షట్పల దానేన వ్యాధితో ముచ్యతే శుచిః ॥

కోశాపహారకశ్చైవ ఫలాపహారకస్తథా ।

యక్షః పృథివ్యాం సంభూతో లీలా ద్రవ్యాపహారకః ॥

వర్షాణాం శతకంచైవ చాషపక్షీభవేధ్ద్రువం ।

తతో భవేత్కృష్ణ వర్ణః శూద్రశ్చ భారతేభువి ॥

తతో భవేద్భ్రాహ్మణశ్చాప్యధికాంగోఽపీ జన్మభిః ।

పునర్జన్మ ద్విజోభూత్వా ముచ్యతే విప్రభోజనాత్ ॥

పక్వద్రవ్యాపహారీచ పశయోనిర్భవే ధ్ద్రువం ।

యస్యాండకోశో గంధాక్త: కస్తూరీయస్య నామచ ॥

సప్తజన్మ మృగోభూత్వా తతోభవతి గంధకః ।

జన్మైకంచ తతః శూద్రో గలత్కుష్ఠీచ జన్మని ॥

ఆ పిదప ఏనుగుకాని గుర్రం కాని ఔతాడు, ఓ వ్రజేశ్వర! ఇరువది సంవత్సరాల వరకు అట్లా ఉండి, ఆపై శూద్రుడౌతాడు, నిశ్చయము. (82) అహంకారము, వ్యాధి కలవాడై, వెండిదానం చేసిముక్తుడౌతాడు నూరుగురు బ్రాహ్మణులను భుజింపచేసి శుచిమౌతాడు. (83) క్షుద్రజంతువులను చంపిన నరుడు క్షుద్ర జంతుడౌతాడు,నూరు సంవత్సరాలు క్షుద్ర వ్యాధితో బాధపడి, ఆపై తరిస్తాడు. (84) హింసించని జంతువుల పై ఎప్పుడు సజ్జనుడు దయచూపాలి. ఓ వ్రజ్వేర! హింసించే జంతువులను హింసించటంలో దోషం లేదు. (85) నాలువర్ణముల వారెవరైనా అశ్వత్థవృక్షాన్ని కొట్టేస్తే బ్రహ్మ హత్యాపాపంలో నాల్గవ భాగం పాపం పొందుతారు. ఓ తండ్రి! అసిపత్ర నరకానికి పోతారు, నిశ్చయము. (86) తీక్షణమైన శస్త్రముతో, రాత్రింబగళ్ళు కోయబడుతూవాడు, నూరు సంవత్సరాలు, పరమ యాతనను అనుభవిస్తాడు. (87) ఆ పిదప బూరుగు వృక్షమౌతాడు, లక్ష సంవత్సరాలుంటాడు. ఆ పిదప ఛిన్నమైన అవయవములు కలిగి, రోగం కలిగిన శూద్రుడౌతాడు. (88) బ్రతికినంతకాలం అట్లా గడిపి ఆ పిదప బ్రాహ్మణుడౌతాడు, నిశ్చయము. వ్రణములు వ్యాధికలవాడై, బంగారం దానం చేస్తే ముక్తుడౌతాడు. (89) కూటసాక్ష్యం ఇచ్చేవాడు, కృతఘ్నుడు, అతికృతఘ్నుడు, విశ్వాసఘాతి, మిత్రఘ్నుడు, విప్రుల ధనం హరించేవాడు. (90) శూద్రునిశ్రాద్ద అన్నమును తినేవాడు, శూద్రుని శవం కాల్చేవాడు, శూద్రులకు వండి పెట్టేవాడు, ఎద్దులను నడి పేపాతకి (91) చాకలి, దేవలుడు (నంబి, తంబళి) వీరంతా అతి పాపులు. వీరు వేయి సంవత్సరాలు కుంభీపాక నరకంలో ఉంటారు. (92) అక్కడే కాగిన నూనెతో రాత్రింబగళ్ళు కాల్చబడుతూ, సర్పాకారం గలజంతువుతో తినబడుతూ, రోగగ్రస్తుడై ఉంటాడు. (93) వేయికోట్ల సంవత్సరాలు గద్దఔతాడు. పది జన్మలు పంది ఔతాడు. నూరు జన్మల వ్యాఘమౌతాడు. ఆ పిదప శూద్రుడు రోగిష్ఠిఔతాడు. (94) ఆకలి మందగించి, జ్వరం కలిగి ఏబది సంవత్సరాలుంటాడు. నూరు పలముల సువర్ణదానం చేసి శుద్ధుడౌతాడు, నిశ్చయము. (95) నాల్గు వర్ణముల వారు వస్త్రం హరించేవారు, గోవుల హరించే మానవులు, వెండి ముత్యములు హరించేవారు, శూద్ర ద్రవ్యాన్ని హరించేవారు (96) వేయి సంవత్సరాలు కొంగజాతి వారౌతారు, నిశ్చయము. నూరు సంవత్సరాలు మూత్రకుండాన్ని భుజించి (97)ఆ పిదప నూరు సంవత్సరాలు శూద్రజాతి వాడౌతాడు. ఓ ప్రజ! కుష్టువ్యాధి కలిగి, రసికారుతుండగా, పాతకియై (98) ఆ పిదప, కుష్టు అవశేషం కలిగి (మరుజన్మలో) బ్రాహ్మణుడౌతాడు ఆరుపలముల బంగారాన్ని దానం చేసి రోగం నుండి ముక్తుడై శుచిమౌతాడు.(99) కోశము (ధనం) నపహరించువాడు. పండ్లను హరించువాడు, యక్షుడు భూమి పై పుట్టి, విలాసానికై ద్రవ్యాన్ని అపహరిస్తూ (100) నూరు సంవత్సరాలు చాష పక్షిఔతాడు, నిశ్చయము (పాలపిట్ట) ఆ పిదప నల్లని వర్ణంతో శూద్రుడై భారత భూమి యందుపుర్తాడు (101) ఆ పిదప బ్రాహ్మణుడౌతాడు. అనేక జన్మలెత్తి, అధికాంగములు కలవాడౌతాడు, మళ్ళీ బ్రాహ్మణ జన్మనెత్తి విప్రభోజనం వల్ల (భుజింపచేసి) ముక్తుడౌతాడు (102) పండిన ద్రవ్యాన్ని హరించేవాడు పశుయోనియందు జన్మిస్తాడు, నిశ్చయము. అండకోశములో గంధము కలిగి, కస్తూరి అని పేరుగలిగిన (103) మృగంగా ఏడు జన్మలెత్తి ఆ పిదప గంధకుడౌతాడు, ఒక జన్మ. తరువాతి జన్మలో రసికారుతున్న కుషువు గల శూద్రుడౌతాడు.

మూ॥ తతో రోగావశే షేణ సంయుతో బ్రాహ్మణః కృశః ।

స్వర్ణషట్పల దానేన ముచ్యతే నాత్ర సంశయః ॥

ధాన్యాపహారీ దుఃఖీచ కృపణః సప్తజన్మసు ।

విష్ఠాకుండం వర్షశతం సంప్రాప్య ముచ్యతేభియా ॥

స్వర్ణాపహారీ కుష్ఠీచ మానవః పతితోభవేత్ ।

స్వర్ణదాన ప్రతిగ్రాహీ విట్ కుండంచ ప్రయాతిచ ॥

తతో వర్ష శతం భుక్త్వా పురీషంచ దివానిశం ।

తతో వ్యాధో భవేచ్ఛూద్రో రక్తదోషేణ సంయుతః ॥

తజ్జన్మ పాతకంభుక్త్వా బ్రాహ్మణశ్చ పునర్భవేత్ ।

వ్యాధిశేషోపయుక్తశ్చ ముచ్యతే స్వర్ణదానతః ॥

అగమ్యానించగామీచ పూర్వోక్తం రౌరవం వ్రజేత్ ।

కుంభీపాకం మహాఘోరం వర్షాణాంచాప్యసంఖ్యకం ॥

తతో భవేత్పుంశ్చ లీనాం యోనీనాంచ కృమిస్తథా ।

వర్షాణాంచ సహస్త్రంచ విట్కృమిర్వర్షలక్షకం ॥

పశయోనిర్భవేత్త స్మాత్తస్మాచ్చ క్షుద్రజంతవః ।

తతో భవేన్మ్లేచ్ఛజాతిః తతశ్శూద్రాధమస్తదా ॥

తతోభవతివిప్రశ్చ వ్యాధియుక్తో నపుంసకః  ।

పునశ్చ బ్రాహ్మణో భూత్వా తీర్థ పర్యటనెనచ ॥

క్రమేణ శుద్ధో భవతి వంశహీనశ్చ పాతకాత్ ।

భోజయిత్వా విప్రలక్షం పుత్రంచ లభతే శుచిః॥

మానవః క్రోధయుక్తశ్చ గర్దభః సప్తజన్మసు ।

మానవః కలహావిష్టః సప్తజన్మసువాయసః ॥

శాలగ్రామ ప్రతిగ్రాహీ కాలసూత్రం వ్రజేధ్ద్రువం ।

వర్షాణాం శతకంచైవ ఖంజరీలో భవేత్తతః ॥

లోహచోరశ్చ నిర్వంశో మషీచోరశ్చ కోకిలః ।

శుకోఽప్యంజనచోరశ్చ మిష్టచోరః కృమిర్భవేత్॥

విప్రద్వేషీ గురుద్వేషీ శిరసాంచ కృమిర్భవేత్ ।

పుంశ్చలీం కామినీం తాత భుక్త్వాచ రౌరవం వ్రజేత్ ॥

తతోవృథా కృమిశ్చైవ వర్షాణాం శతకం తథా ।

తతోఽపి విధవా చైవ వంధ్యాచ సప్తజన్మసు ॥

అస్పృశ్యా జాతిహీనాచ ఛిన్ననాసా భవేత్క్రమాత్ ।

రక్తద్రవ్యాపహారీచ రక్త దోషాన్వితో భవేత్ ॥

ఆచారహీనో యవనః ఖంజోభవతి హింసకః ।

అదీక్షితో వంఖరశ్చ దుష్టదర్శీచ కానకః ॥

అహంకారీ కర్ణహీనో బధిరో వేదనిందకః ।

వాక్యహర్తాచ మూకశ్చ హింసకః కేశహీనమః ॥

మిథ్యావాదీ శ్మశ్రుహీనో దుర్వాక్యో దంత హీనకః ।

జిహ్వాహీనః సత్యహారీ దుష్టోఽప్యంగులి హీనకః ॥

గ్రంథాపహారీ మూర్ఖశ్చ వ్యాధియుక్తోభవేధ్ద్రువం ।

అశ్వగ్రాహీచ తచ్చోరో లాలా మూత్రం వ్రజేదితి ॥

వర్షాణాంచ శతంస్థిత్వా హోటకశ్చ భవేధ్ద్రువం ।

గజచోరో గజగ్రాహీ విట్ కుండేచ సహస్రకం ॥

ఆ పిదప మిగిలిన రోగంతో ఉండి, కృశించిన బ్రాహ్మణుడౌతాడు.ఆరుపలముల బంగారం దానం చేస్తే ముక్తుడౌతాడు, అనుమానం లేదు. (105) ధాన్యమునపహరించిన వాడు,దుఃఖంతో కృపణుడై ఏడు జన్మలెత్తుతాడు. నూరు సంవత్సరాలు మల కుండ మును చేరి, భయంతో విడువబడుతాడు (106) బంగారం దొంగతనం చేసినవాడు, కుషుగలనరుడై పతితుడౌతాడు. స్వర్ణ దానాన్ని తీసుకున్నవాడు మల కుండమును చేరుతాడు (107) ఆ పిదప నూరు సంవత్సరాలు, రాత్రింబగళ్ళుపురీషను తిని ఆ పిదప వ్యాధుడుగా శూద్రుడౌతాడు, రక్త సంబంధి రోగముంటుంది (108) ఆ జన్మపాతకమును అనుభవించి తిరిగి బ్రాహ్మణుడౌతాడు. వ్యాధి శేషాన్ని కలిగియుండి, బంగారము దానం చేసినట్లైతే ముక్తుడౌతాడు (109) చేరరాని వారిని చేరితే ముందు చెప్పిన రౌరవనరకానికి వెళ్తాడు లెక్కలేనన్ని సంవత్సరాలు మహాఘోరమైన కుంభీపాక నరకాన్ని పొందుతాడు (110) ఆ పిదప కులటాస్త్రీల యోనులందు పురుగుగా జన్మిస్తాడు సహస్ర వర్షాలుండి ఆపై లక్ష సంవత్సరాలు మలంలో పురుగౌతాడు. (111) ఆపై పశుయోనిలోను, ఆపై క్షుద్రజంతువుగాను, ఆపై మేచ్ఛజాతివానిగాను ఆ పై శూద్రులలో అధమునిగాను (112) ఆపై విప్రునిగాను, రోగంతో, నపుంసకుడై జన్మిస్తాడు, తిరగి బ్రాహ్మణుడై, తీర్థయాత్రచేసి, (113) క్రమంగా శుద్ధుడౌతాడు, పాతకం వల్ల వంశహీనుడౌతాడు. లక్ష బ్రాహ్మణులకు భోజనం పెట్టి శుచియై పుత్రుని పొందుతాడు (114) కోపంగల నరుడు ఏడు జన్మలు గాడిదౌతాడు. తగాదాలు పెట్టుకునేవాడు ఏడు జన్మలు కాకి ఔతాడు (115) శాలగ్రామమును దానంగా స్వీకరించినవాడు యమపాశానికి గురౌతాడు కాలసూత్ర నరకానికి పోతాడు. నిశ్చయము. ఆపై నూరు సంవత్సరాలు కాటుక పిట్టఔతాడు (116) లోహాన్ని దొంగిలించినవాడు వంశహీనుడౌతాడు, బొగ్గు (సిర) దొంగిలించినవాడు కోకిల ఔతాడు. కాటుక దొంగిలించినవాడు చిలుక ఔతాడు తీపి ఆహారాన్ని (చక్కరపొంగలి) దొంగిలించినవాడు పురుగుఔతాడు.(117) విప్రద్వేషి, గురుద్వేషి వీరలు శిరస్సులు (లో) గల కృమి( పేను) ఔతాడు. కులటయైన స్త్రీని అనుభవించి గౌరవ నరకానికి పోతాడు, ఓ తండ్రీ! (118) ఆ పై వ్యర్థంగా పురుగై నూరు సంవత్సరాలుంటాడు. ఆ పై విధవగా, గొడ్రాలిగా ఏడు జన్మలుంటాడు. (119) అస్పృశ్యస్త్రీగా జాతిహీనురాలిగా,ముక్కుకోయబడిన స్త్రీగా క్రమంగా ఔతాడు. ఎర్రని వస్తువును దొంగిలించినవాడు రక్తదోషం (రోగం) కలవాడౌతాడు (120) ఆచారహీనుడు యవనుడుగా హింసించేవాడు కాటుక పిట్టగా ఔతాడు. దీక్షితుడుగా కొనివాడు, ఎప్పుడూ తిరిగేవాడుగా (వం)దుష్టమైనది చూసేవాడు, అడవి మనిషిగా (121) అహంకారి, చెవులు లేనివాడుగా, వేదనిందకుడు చెవిటివానిగా ఔతారు. వాక్యం హరించేవాడు మూగగా, హింసకుడు వెంట్రుకలులేనివాడుగా ఔతారు. (122) అబద్దాలాడేవాడు మీసాలు, గడ్డంలేనివాడుగా, చెడుమాట్లాడేవాడు, పళ్ళులేనివానిగా, సత్యంను దాచేవాడు నాలుకలేనివానిగా, దుష్టుడు అంగుళులు లేని వారుగా జన్మిస్తారు (123) గ్రంథములు అపహరించేవాడు మూర్ఖుడుగా, రోగగ్రస్తుడుగా ఔతాడు, నిశ్చయము. అశ్వమును గ్రహించేవాడు (దానంగా) దానిని దొంగిలించేవాడు, లాల, మూత్రము ఔతాడు అని (124) నూరు సంవత్సరాలు అట్లా ఉండి, గుర్రమౌతాడు, నిశ్చయము. గజమును తీసుకున్నవాడు (దానంగా) దొంగిలించినవాడు మలకుండంలో వేయి సంవత్సరాలు.

మూII స్థిత్వా వర్షం భవేద్ధస్తీ తత్పశ్చాత్ వృషలో భవేత్ ।

అయజ్ఞే ఛాగహంతాచ ఛాగచోరప్రతిగ్రహీ ॥

పూయకుండే వర్షశతం స్థిత్వా చాండాలతాం వ్రజేత్ ।

ఛాగశ్చ వర్షపర్యంతం తథాభవతి మానవః ॥

శత్రుశస్త్రేణ ఛిన్నశ్చ తదాముక్తో భవేద్ద్విజః ।

దత్తాపహారీ వాగ్దానం కృత్వాఽపహరతేపునః ॥

సభవేన్మ్లేచ్ఛయోనౌచ భుక్త్వాచ నరకం వ్రజేత్ ।

ఏకాకిమిష్టమశ్నాతి కాలసూత్రం వ్రజేధ్ద్రువం ॥

తత్ర వర్షశతం స్థిత్వా ప్రేతోవర్ష సహస్రకం ।

తదా భవతి జన్మైకం మక్షికాచ పిపీలికా ॥

జన్మైకం భ్రమరశ్చైవ జన్మైకం మధుమక్షికా ।

జన్మైకం వరలశ్చైవ జన్మైకందంశ ఏవచ ॥

జన్మైకం మశకశ్చైవ జన్మైకం పూతికం స్మృతం ।

జన్మైకం తల్పకీటశ్చ తదాశూద్రోభవేధ్ద్రువం ॥

అసద్బుద్ధిర్వ్యాధియుక్తః తదాముక్తోభవేద్ద్విజః ।

తైలచోర స్తైలకారో మూర్థ్ని కీటస్త్రీజన్మకం ॥

తదాభవేత్స్వర్ణకారోజన్మైకం దుష్టమానసః ।

విశ్వైకలిపికర్తాచ భక్ష్య దాతుర్ధనం హరేత్॥

తమఃకుండే వర్షశతం స్థిత్వా స్వర్ణవణిగ్భవేత్ ।

జన్మైకంచ దురాచారో జన్మైకం కరణోభవేత్ ॥

కాయ స్థేనోదర స్థేన మాతుర్మాంసం నఖాదితం ।

తత్రనాస్తి కృపా తస్య దంతాభావేన కేవలం ॥

స్వర్ణకారః స్వర్ణవణిక్ కాయస్థశ్చ వ్రజేశ్వర ।

నరేషుమధ్యే తే ధూర్తాః కృపాహీనా మహీతలే ॥

హృదయం క్షురధారాభం తేషాం నాస్తిచ సాదరం ।

శతేషు సజ్జనః కోఽపి కాయస్థో నేతరౌచ తౌ ॥

సుబుద్ధిఃశివయుక్తశ్చ శాస్త్రజ్ఞోధర్మమానసః ।

నవిశ్వ సేత్తేషు తాతస్వాత్మ కళ్యాణ హేతవే ॥

సీమాపహారీ దుష్టశ్చ భూమిచోరశ్చ హింసకః ।

భూమిదానాపహరీచ కాలసూత్రం వ్రజేధ్ద్రువం ॥

షష్టి వర్ష సహస్రాణిక్షుత్పిపాసార్దితః స్థితః ।

తతోఽపి తాని నామాని విష్టాయాం జాయతే కృమిః ॥

తతో భవేదసచ్ఛూద్రో జన్మైకంచ తతఃశుచిః ।

తస్మాత్ జ్ఞానైః సావధానంభవేత్ర్పాజ్ఞశ్చయత్నతః ॥

రక్తవస్త్రాపహారీచ జన్మైకం రక్తకీటకః ।

తతః శూద్రశ్చజన్మైకం తతో విప్రోభవేచ్ఛుచిః ॥

త్రిసంధ్యహీనో విప్రశ్చ ప్రాతః శాయీచయోనరః ।

సంధ్యాశాఖాదివాశాయీ యజ్ఞసూత్రాపహారకః ॥

అశుద్ధః సంధ్యా కారీచ వేదవేదాంగ నిందకః ।

తద్విరుద్ధః స్వర్గమార్గస్త్రీ జన్మపతితోద్విజః ॥

యఃశూద్రో బ్రాహ్మణీగామీ కుంభీపాకే ప్రజేధ్ద్రువం ।

వర్షాణాంచ త్రిలక్షంచ పచ్యతే తత్ర పీడితః ॥

దివానిశం ప్రదగ్ధశ్చ తప్తతైలేచ దారుణే ।

తతో భవేద్యోనికీటః పుంశ్చలీనాంచ పాతకీ ॥

ఉండి ఏనుగు రూపంగా ఒక సంవత్సరముండి ఆ పిదప వృషలుడౌతాడు. యజ్ఞం లేకుండానే మేకను చంపేవాడు ఛాగమును దొంగిలించినట్లు, దానం తీసుకున్నట్లు (126) మలకుండమందు నూరు సంవత్సరాలుండి చండాలుడౌతాడు. ఛాగముగా సంవత్సర పర్యంతము ఉండి ఆ పైమానవుడౌతాడు (127) శత్రువు ఆయుధంతో కోయబడి ఆ పైముక్తుడై ద్విజుడౌతాడు. ఇచ్చిన దానిని అపహరించేవాడు, వాగ్దానం చేసి తిరిగి అపహరించేవాడు (128) వాడు మేచ్చయోనియందుండి అనుభవించి, నరకానికి వెళ్తాడు. ఒంటరిగా తీపితినేవాడు, త్వరగా మరణిస్తాడు (కాలసూత్ర నరకానికి పోతాడు) (129) అక్కడ నూరు సంవత్సరాలుండి ప్రేతగా వేయి సంవత్సరాలు ఉంటాడు. ఆపై ఒక జన్మ ఈగగా, ఒక జన్మ చీమగా ఉంటాడు. (130) ఒకజన్మ తుమ్మెద, ఒక జన్మతేనె టీగగా, ఒక జన్మ కందిరీగగా (వరల) ఒక జన్మ అడవి ఈగగా, (131) ఒక జన్మ దోమగా, ఒక జన్మ దుర్గంధంలో పురుగుగా, ఒక జన్మపడకలో పురుగుగా (నల్లా?) ఆ పైశూద్రుడుగా జన్మిస్తాడు (132) సద్బుద్ధిలేనివాడుగా, రోగగ్రస్తుడుగా ఆపై ముక్తుడైద్విజుడౌతాడు. నూనె దొంగిలించినవాడు నూనె చేసేవాడు మూడు జన్మలు తలలో పురుగౌతాడు (పేను, ఈడు) (133) ఆ పై స్వర్ణకారుడుగా, దుష్టమైనమనస్సుగలవాడుగా ఒక జన్మ ఎత్తుతాడు. ప్రపంచలో ఒక లేఖకుడుగా మారి తినతగినవానిని, దాతధనమును హరిస్తాడు (134) తమఃకుండ మందు నూరు సంవత్సరాలుండి బంగారు వ్యాపారి ఔతాడు. ఒక జన్మదురాచారుడుగా, ఒక జన్మకరణంగా ఔతాడు. (135) కాయస్థుడై (లేఖకుడు, క్షత్రియ, శూద్ర సంకరం వల్ల పుట్టినవాడు) పొట్టగలవాడై (అత్యాశ) తల్లి మాంసం మాత్రం తినడు, ఆమెకడుపులో ఉండి, వాడికి తల్లిమీదకూడా దయలేదు, పండ్లులేవు కాబట్టి తల్లి మాంసం తినడు. (136) అవుసలివాడు, బంగారు వ్యాపారి, కాయస్థుడు, వీరు ఓ ప్రజేశ్వర! మనషుల మధ్యలో వీళ్ళు ధూర్తులు, భూమి పై, దయలేని మనుషులు వీళ్ళు (137) వాళ్ళ హృదయము కత్తి అంచులాంటిది. వారికి ఆదరం లేదు. కాయస్థులలో, నూటికి ఎవడో ఒక్కడు మంచివాడు, కాని స్వర్ణకార, స్వర్ణవణిక్కులలో ఆమాత్రం కూడా లేరు (138) మంచి బుద్ధి, వేదం చదివిన వాడు, శాస్త్రజ్ఞుడు, ధర్మము యందు మనస్సుకలవాడు, ఇట్టివారిని, ఓ తండ్రి తన కళ్యాణాన్ని కోరుకునేవాడు నమ్మరాదు. (139) సీమను (సరిహద్దు) అపహరించేవాడు, దుష్టుడు, భూమిచోరుడు, హిసకుడు, దానం చేసిన భూమిని అపహరించేవాడు, వీరుకాలసూత్ర నరకానికి వెళ్తారు,ధ్రువము (140) అరవైవేల సంవత్సరాలు, ఆకలి దప్పులతో బాధపడుతూ ఉంటాడు. ఆపై అన్ని పేర్లతో (సార్లు) మలమందు పురుగైపుత్తాడు (141) ఆ పైన చెడు శూద్రుడౌతాడు. అట్లా ఒక జన్మఉండి ఆ పైన శుచిమౌతాడు. ఆ పైన జ్ఞానుల వద్ద అవధానంతో ఉండి, ప్రయత్నపూర్వకంగా ప్రాజ్ఞుడౌతాడు (142) ఎర్రని వస్త్రాన్ని దొంగిలించినవాడు ఒక జన్మ ఎర్రని పురుగుగౌతాడు. ఒక జన్మశూద్రుడౌతాడు ఆ పై శుచియై విప్రుడౌతాడు. (143) మూడు సంధ్యలను వార్వని విప్రుడు, ప్రొద్దున నిద్రించే నరుడు పగలు, సంధ్యలందు నిద్రించే నరుడు, యజ్ఞసూత్రం అపహరించినవాడు (ఉపవీతం) (144) అశుద్ధిగా సంధ్యచేసినవాడు, వేద వేదాంగముల నిందించినవాడు, అందుకు విరుద్దమైనవాడు, స్వర్గమార్గంలో ఉంటూ, మూడు జన్మలలో పతితుడై బ్రాహ్మణుడు ఔతాడు (145) శూద్రుడై బ్రాహ్మణస్త్రీని పొందినవాడు కుంభీపాక నరకానికి పోతారు, నిశ్చయము. మూడు లక్షల సంవత్సరాలు అక్కడ పీడింపబడుతూ, వండబడుతాడు (146) రాత్రింబగళ్ళుకాల్చబడుతూ కాగిన నూనెలో, భయంకరమైన దానిలో కాలుతూ, ఆ పై ఆ పాతకి, కులటల యోనిలో కీటకమౌతాడు.

మూ॥ షష్టి వర్షసహస్రాణి చాహారం తస్య తన్మలం ।

తతో భవతి చాండాలో జన్మల లక్షం క్రమేణచ ॥

తతః శూద్రో గలత్కుఢీ జన్మైకంచ తతః శుచిః ।

సోఽపి విప్రో వ్యాధిశేషస్తీర్థ పర్యటనాచ్ఛుచిః ॥

అసచ్ఛూద్రశ్చ భవతి సోఽస్థానేఽసురపూజితే ।

దత్వాదేవాయ నైవేద్యం అపవిత్రంచ మానవః ॥

సకేశం పార్థివం లింగం సంపూజ్యయవనోభవేత్ ।

దుర్బలేన భవేదంధః కుత్సితేన, చకుత్సితః ॥

అంగహీనో దరిద్రశ్చ వ్యాధియుక్తశ్చమానవః ।

అశ్రద్ధయాచ నిర్మాణే నిర్మాణ సదృశం ఫలం ॥ మృద్భస్మగోశకృత్పిండైస్తథావాలుకయాఽపివా ।

కృత్వాలింగం సకృత్పూజ్య వసేత్కల్పాయుషం దివి ॥

తతో భవతి విప్రశ్చ మహాప్రాజ్ఞశ్చ భూమి మాన్ ।

రాజాభవేద్భారతేచ లింగానాం శతపూజనాత్ ॥

సహస్రపూజనాత్సోఽపి లభతే నిశ్చితం ఫలం ।

స్థిత్వాచ సుచిరం స్వర్గే రాజేంద్రో భారతే భవేత్ ॥

అయుతేచ తదీశశ్చ లక్షేచ పృథివీశ్వరః ।

పూజనేచాతి భక్త్యాచాప్యతిరిక్తం ఫలంలభేత్ ॥

తీర్థస్నానేన దానేన విప్రాణాం భోజనేనచ ।

నారాయణార్చయాచైవ విప్రజాతిశ్చ కర్మణా॥

అతిరిక్తేన తపసా పండితో బ్రాహ్మణేభవేత్ ।

పండితో బ్రాహ్మణశ్చైవ వైష్ణవశ్చ జితేంద్రియః ॥

అనేక జన్మపుణ్యేన జాయతే భారతే భువి ।

తస్యాంఘ్రిస్పర్శనేనైవ సద్యః పూతావసుంధరా ॥

తీర్థాఃకుర్వంతి తీర్థాని జీవన్ముక్తాశ్చవైష్ణవాః ।

స్వపుంసాంచ సహస్రంచ పునంతీతి శ్రుతౌ శ్రుతం ॥

పాపేన వైద్యజన్మైవ దుశ్చికిత్సోఽపి బ్రాహ్మణః ।

దుశ్చికిత్సస్తథావైద్యో వ్యాలగ్రాహీ త్రి జన్మసు ॥

అతిక్రూరో దురాచారో ద్వేషాచ సురవిప్రయోః ।

సభవేత్కుటిలవ్యాలో వర్షాణాంచ సహస్రకం ॥

పుంశ్చలీలంపటానాంచ దూతీయాకామినీ ప్రజ ।

కాలసూత్రే వర్షశతం స్థిత్వా చగోథికాభవేత్ ॥

జన్మైకం గోధికా భూత్వా హరిణశ్చత్రి జన్మసు ।

జన్మైకం మహిషశ్చైవ జన్మైకం భల్లుకోభవేత్ ॥

జన్మైకం గండకశ్చైవ శృగాలశ్చత్రిజన్మసు ।

పరకీయతడాగంచ సుప్రసస్యం దదాతిచ ॥

 స భవేన్నక్రజాతిశ్చ కచ్ఛపశ్చ త్రిజన్మసు ।

వృథా మాంసంచ యో భుంక్తే మత్స్యలుబ్ధశ్చ బ్రాహ్మణః ॥

భుంక్తే మాంసమదత్తంచ స మీనశ్చ మృగోభవేత్ ।

వర్షాణాంచ సహస్రంచ తాతభుక్త్వాచ కిల్బిషం॥

కర్మభోగా చ్ఛుచిర్భూత్వాస పునర్భ్రహ్మణేభవేత్ ।

ఏకాదశీ విహీనశ్చ బ్రాహ్మణః పతితో భవేత్॥

అను ॥ అరువదివేల సంవత్సరాలు వానికి ఆ మలమే ఆహారము. ఆపై క్రమంగా లక్ష జన్మలు చండాలుడౌతాడు (148) ఆ పై ఒక జన్మ రక్తం స్రవిస్తున్న కుష్టువ్యాధి కలవాడై శూద్రుడుగా జన్మించి ఆ పైశుచిఔతాడు. ఆతడు, బ్రాహ్మణుడుగా మిగిలిన వ్యాధితో బాధపడుతూ తీర్థ పర్యటనము చేసి శుచిమౌతాడు (149) నరుడు దేవునకు అపవిత్రమైన నైవేద్యాన్ని ఇచ్చి, స్థానంకానీ చోట, అసుర పూజితమైన చోట ఇచ్చి అసచ్ఛూద్రుడౌతాడు (150) వెంట్రుకలు గల పార్థివలింగాన్ని పూజించి యవనుడౌతాడు. దుర్బలుడైతే అంధుడౌతాడు, కుత్సితుడైతే తరువాత కుత్సితుడౌతాడు (151) నరుడు, అంగహీనుడు, దరిద్రుడు వ్యాధియుక్తుడౌతాడు. అశ్రద్దగా నిర్మిస్తే, నిర్మాణానికి తగ్గ ఫలాన్ని అనుభవిస్తాడు (152) మట్టి, భస్మము, ఆవు పేడ ముద్దలు, ఇసుక వీటితో దేనితోనైనా లింగాన్ని చేసి ఒకసారి పూజిస్తే కల్పసంవత్సరాల ఆయుస్సుకలవాడై దేవలోకమందుంటాడు. (153) ఆ పైన విప్రుడు , మహాప్రజ్ఞావంతుడు, భూమికలవాడౌతాడు. భారతదేశమందు నూరు లింగాలను పూజిస్తే రాజౌతాడు (154) వేయి లింగాలను పూజిస్తే ఆతడు కూడా నిశ్చితమైన ఫలాన్ని పొందుతాడు. చాలా కాలం స్వర్గంలో ఉండి భారతం(దేశ)లో రాజేంద్రుడౌతాడు (155) పది వేల లింగాల పూజిస్తే వానికి ఈశుడౌతాడు, లక్ష పూజిస్తే పృథివికి ఈశ్వరుడౌతాడు. అతిభక్తితో పూజిస్తే, ఎక్కువ ఫలం లభిస్తుంది (156) తీర్ఘస్నానంతో, దానంతో, విప్రులకు భోజనం పెడే నారాయణుని అర్చిస్తే కర్మవల్ల విప్రజాతివాడౌతాడు, (157) అధికమైన తపస్సుతో పండితుడు, బ్రాహ్మణుడౌతాడు. పండితుడు బ్రాహ్మణుడు, వైష్ణవుడు, జితేంద్రియుడుఐ (158) అనేక జన్మల పుణ్యంతో భారత భూమియందు జన్మిస్తాడు. ఆతని పాదస్పర్శతోనే, భూమి వెంటనే పవిత్రమౌతుంది (159) తీర్థములు పుణ్యతీర్ధములౌతాయి. వైష్ణవులు జీవన్ముక్తులు. వేయిమంది తమ పురుషులను పవిత్రులను చేస్తారు, వీరు అని వేదం (శ్రుతి) ద్వారా వింటున్నాం (160) పాపంతో వైద్య జన్మ చెడ్డవైద్యుడైన బ్రాహ్మణుడౌతాడు. చెడు చికిత్స చేసే, వైద్యుడు మూడు జన్మలలో సర్పంతో గ్రహింపబడతాడు (161) అతిక్రూరుడు, దురాచారుడు, సురవిప్రులను ద్వేషించేవాడు ఆతడు వేయి సంవత్సరాలు కుటిల సర్పమౌతాడు. (162) ఓప్రజ! కులటాలంపటులకు దూతియైన స్త్రీ కాలసూత్రనరకంలో నూరు సంవత్సరాలుండి, ఉడుముఔతుంది (163) ఒకజన్మ ఉడుమై మూడు జన్మలు జింక ఔతుంది. ఒక జన్మ బర్తెగా జన్మించి, ఒక జన్మ భల్లూకమౌతుంది (164) ఒక జన్మగండక మృగమై మూడు జన్మలు నక్కఔతుంది. ఇతరుల చెరువు నీటితో, చచ్చు ధాన్యం ఇచ్చేవాడు (165) మొసలి జాతివాడౌతాడు. మూడు జన్మలు తాబేలు ఔతాడు. అనవసరంగా మాంసం తినేవాడు, చేపలమీది ఆశగల బ్రాహ్మణుడు (166) ఇవ్వకుండా తీసుకుని) మాంసం తినేవాడు చేప, మృగము ఔతాడు. ఓ తండ్రి! వేయి సంవత్సరాలు పాపాన్ని భుజిస్తూ (167) కర్మభోగం అయ్యాక శుచియైవాడు తిరిగి బ్రాహ్మణుడౌతాడు. ఏకాదశి ఆచరించనివాడు, బ్రాహ్మణుడు పతితుడౌతాడు.

మూ॥ భక్ష్యస్య ద్విగుణం దత్వా తేనపా పేన ముచ్యతే ।

మమ జన్మదినేచైవ యోభుంక్తే మానవోఽధమః ॥

త్రైలోక్య జనితం పాపం సోఽపిభుంక్తే నసంశయః ।

భుక్త్వాచ నరకం సర్వం పశ్చాత్ చాండాలతాం వ్రజేత్ ॥

ఏవంచ శివరాత్రౌచ శ్రీరామనవమీదినే ।

ఉపవాసాసమర్థశ్చ హవిష్యాన్నం సమాచరేత్ ॥

తతోఽశక్తోదుర్బలశ్చ భోజయేబ్రాహ్మణానపి ।

కృత్వామహోత్సవం పుణ్యం మదీయం పాతకాచ్ఛుచిః ॥

తస్మాద్యత్నేన కర్తవ్యం నామ సంకీర్తనం మమ ।

గృధ్ర: కోటిసహస్రాణి శతజన్మాని సూకారః ॥

శ్వాపదః శతజన్మాని భవేచ్చ నిశిభోజనాత్ ।

అదీక్షితో ద్విజశ్చైవ శంఖశ్చిల: శుకోభవేత్ ॥

అనుద్వాహీ ద్విజశ్చైవ రాజహంసో భవేధ్ద్రువం ।

చిత్రవస్త్రాపహారీచ మయూరశ్చ త్రిజన్మసు ॥

తేజః పాత్రా పహారీచ భవేత్కారండవ శ్చిరం ।

సురాణాం ప్రతిమాచోరోఽప్యంధశ్చ సప్తజన్మసు ॥

దరిద్రో వ్యాధియుక్తశ్చ బధిరశ్చాపికుబ్జకః ।

స్త్రీ తైలమధుమాంసాని రవౌ వా పంచ వర్షసు ॥

సేవతేయో మహామూడో వజ్రదంష్ట్రం వ్రజేధ్ద్రువం ।

పాతకీ దుఃఖితస్తత్ర వర్షాణాంచ సహస్రకం ॥

తతో భవతి మ్లేచ్ఛశ్చ చాండాలః సప్తజన్మసు ।

వ్యాధియుక్తస్తతః శూద్రో బ్రాహ్మణశ్చతతః శుచిః ॥

తస్మాద్యశ్నా న్నభోక్తవ్యం భారతే ధర్మభీరుణా ।

బ్రాహ్మణంచ సురం దృష్ట్వా న నమేద్యో నరాధమః ॥

యావజ్జీవన పర్యంత మశుచి ర్యవనోభవేత్ ।

అభ్యుత్థానం నకురుతే దృష్ట్వా చాగత బ్రాహ్మణం ॥

సభవేద్ర్బహ్మ ఘాతీచ సప్త జన్మసు నిశ్చితం ।

శివద్వేషీకుక్కుటశ్చ దేవల: సప్త జన్మసు ॥

 పితృదేవార్చనం హంతి వేదోక్తం జ్ఞానదుర్బలః ।

సయాతి నరకం పాపీ వర్షాణాంచ సహస్రకం ॥

తతశ్చ రౌరవం భుక్త్వా తీర్థకాకస్త్రీ జన్మసు ।

తిజన్మసు శృగాలశ్చ తీర్థ భుంక్తే శవం ప్రజ ॥

త్రిజన్మసు భవేత్సోఽపి తీర్దేషు శవరక్షకః ।

శవానాం కరమాదత్తే కర్మణాకృతపాతకీ ॥

నిత్యం సురార్చనం కృత్వా దాంభికో జ్ఞాన దుర్బలః ।

గురుంచ నార్చయేద్భక్త్యా తస్మై నాన్నం దదాతి యః ॥

సభవేద్దేవలో దు:ఖీ దేవ శాపేన పాతకీ ।

నిత్యం సురార్చనం కృత్వా దాంభికో జ్ఞాన దుర్బలః ॥

పూజాఫలం నలభతే దేవద్రోహీస దారుణః ।

దీపనిర్వాణ కర్తాచ, ఖద్యోతః సప్త జన్మసు ॥

అతీవమత్స్యలుబ్దశ్చాష్య నైవేద్యంచ ఖాదతి ।

సభవేన్మత్స్యరంగశ్చ మార్జారః సప్తజన్మసు ॥

గోణీహర్తా కపోతశ్చ మాలాహర్తా విహంగమః ।

చటకా ధాన్యచోరశ్చ మాంసచోరశ్చ కుంజరః ॥

అను II తిన్నదానికి రెట్టింపు దానం చేస్తే ఆపాపం నుండి ముక్తుడౌతాడు. నాజన్మదినం రోజున భుజించే మానవాధముడు (169) ముల్లోకములలో పుట్టిన పాపాన్ని వాడు భుజిస్తాడు, అనుమానం లేదు. తిని, నరకమంతా అనుభవించి ఆపై చండాలుడౌతాడు (170) ఇట్లా శివరాత్రి యందు, శ్రీరామనవమి దినమందును ఉపవాసం చేయాలి. ఉపవాసం చేతకాకపోతే హవిష్యాన్నాన్ని తినాలి (171) దానికి అశుక్తుడైతే దుర్భలుడైతే బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. నా పుణ్యమైన మహోత్సవాన్ని చేసి పాతకముక్తుడై శుచియౌతాడు (172) అందువల్ల ప్రయత్నపూర్వకముగా నా నామసంకీర్తన చేయాలి. వేయి కోట్ల సంవత్సరాలు గద్ద ఔతాడు, నూరు జన్మలు పంది ఔతాడు (173) నూరు జన్మలు వ్యాఘ్రమౌతాడు, రాత్రికనుక భుజిస్తే (ఏకాదశిన). దీక్షితుడు కాని బ్రాహ్మణుడు శంఖము, (సర్పము), చిల్లము, (పిట్ట) చిలుక ఔతాడు (174) వివాహంకాని బ్రాహ్మణుడు రాజహంస ఔతాడు నిశ్చయము. చిత్ర వస్త్రముల హరించే (అమ్మే వాడు మూడు జన్మలు నెమిలి ఔతాడు (175) తేజః పాత్రను అపహరించేవాడు (స్పిరిట్, రేతస్సు) చాలా కాలము కన్నె లేడి ఔతాడు. దేవతల ప్రతిమ దొంగిలించువాడు, ఏడు జన్మలలో అంధుడౌతాడు (176) దరిద్రుడు, రోగగ్రస్తుడు, చెవిటి, గూనివాడౌతాడు. స్త్రీ, తైలము,మధువు, మాంసము వీనిని ఆదివారం నాడు, అయిదు పర్వములందు భక్షించేవాడు (177) మహామూఢుడు వజ్రదంష్ట్రమును (పురుగు) పొందుతాడు, (నరకము) నిశ్చయము. పాతకి, దుఃఖితుడై, అక్కడ వేల సంవత్సరాలు ఉంటాడు (178) ఆపై మ్లేచ్ఛుడౌతాడు, ఏడు జన్మలు చాండాలుడౌతాడు. ఆపై రోగగ్రస్తుడైన శూద్రుడౌతాడు, ఆపై శుచియైన బ్రాహ్మణుడౌతాడు (179) అందువల్ల భారత దేశ) మందు, ధర్మభీరుడై ప్రయత్నించియైనా తినరాదు. బ్రాహ్మణుని దేవుని చూచి నమస్కరించని నరాధముడు (180) జీవితాంతము అశుచిమౌతాడు, యవనుడౌతాడు. వచ్చిన బ్రాహ్మణుని చూచి, లేచి నిలువనివాడు (181) వాడు ఏడు జన్మలలో బ్రహ్మఘాతి ఔతాడు నిశ్చయము. శివునిద్వేషించేవాడు కోడి ఔతాడు. ఏడు జన్మలలో నంబి లేదా తంబళి ఔతాడు. (182) వేదోక్తమైన జ్ఞానం లేని వాని పితృ దేవతల అర్చనము వ్యర్థము. వాడు ఆపాపి వేయి సంవత్సరాలు నరకానికి పోతాడు. (183) ఆపైన రౌరవ నరకాన్ని అనుభవించి మూడు జన్మలు తీర్థ ప్రదేశములలో కాకి ఔతాడు. మూడు జన్మలు నక్కఐ తీరమందు శవాన్ని తింటాడు. ఓ ప్రజ! (184) వాడూ కూడా మూడు జన్మలు తీర్ధములలో శవరక్షకుడౌతాడు. పాపంచేసినవాడు, ఆకర్మతో శవముల చేతిని (పైపన్ను) గ్రహిస్తాడు. (185) జ్ఞానం లేకుండా దంభంగా సురార్చన చేసినవాడు, భక్తితో గురువును పూజించకుండా, ఆతనికి అన్నం పెట్టనివాడు. (186) వాడు దేవలుడౌతాడు, (తంబళి) దేవశాపంతో పాతకి, దుఁ :ఖి ఔతాడు. జ్ఞానంతో బలహీనుడు, దాంభికుడై రోజు దేవార్చన చేసేవాడు (187) పూజా ఫలాన్ని పొందడువాడు దేవద్రోహి, దారుణమైనవాడు. దీపం ఆర్పినవాడు ఏడు జన్మలు మిణుగురుపురుగు ఔతాడు (188) ఎక్కువగా చేపలమీద ఆశకలవాడు, నివేదన చేయకుండా తినేవాడు వాడు, బెస్తల రాజౌతాడు. ఏడు జన్మలు పిల్లి ఔతాడు (189) ఎద్దును హరించినవాడు పావురమౌతాడు, మాలను హరించినవాడు పక్షిఔతాడు, ధాన్యం హరించినవాడు పిచ్చుకఔతాడు, మాంసము దొంగిలించినవాడు ఏనుగఔతాడు.

మూ॥ కవిః ప్రహర్తా విదుషాం మండూకః సప్త జన్మసు ।

అసత్కవిర్గ్రామ విప్రో నకులః సప్తజన్మసు ॥

కుష్ఠీభవేచ్చ జన్మైకం కృకలాసస్త్రి జన్మసు ।

జన్మైకం వరలశ్చైవ తతోవృక్ష పిపీలికా ॥

తతఃశూద్రశ్చ వైశ్యశ్చ క్షత్రియో బ్రాహ్మణస్తథా ।

కన్యా విక్రయ కారీచ చతుర్వర్ణోహి మానవః ॥

సద్యః ప్రయాతి తామిస్రం యావచ్చంద్ర దివాకరౌ ।

తతోభవతి వ్యాధశ్చ మాంసవిక్రయ కారకః ॥

తతోవ్యాదిర్భవేత్పశ్చాద్యోయథా పూర్వజన్మని ।

మన్నామ విక్రయీవిప్రో న హి ముక్తో భవేద్ ధ్రువం ॥

మృత్యులోకేచ మన్నామ స్మృతిమాత్రం నవిద్యతే ।

పశ్చాద్భవేత్సగోమోనౌ జన్మైకం జ్ఞానదుర్బలః ॥

తతశ్చాగః తతోమేషో మహిషః సప్తజన్మసు ।

మహీచక్రీ చకుటిలో ధర్మహీనస్తు మానవః ॥

జన్మైకం తైలకారశ్చ కుంభకారస్తథైవచ ।

మిథ్యాకలంకవక్తాచ దేవబ్రాహ్మణ నిందకః ॥

సభవేత్స్వర్ణకారశ్చ రజకః సప్తజన్మసు ।

బ్రాహ్మణ క్షత్ర విట్ శూద్రాః కుత్సితాః శౌచవర్జితాః ॥

జన్మతేషాం మ్లేచ్ఛయోనౌ వర్షాణామయుతం తథా ।

కామతో యోషితాం శ్రోణీస్త నా స్యేయశ్చపశ్యతి ॥

స భవే ద్దృష్టి హీనశ్చ పరత్రాపి నపుంసకః।

విప్రోఽభిచార కర్తాచ హింసకోజ్ఞాన దుర్బలః ॥

యాత్యేవ మంధతామిస్రం వర్షాణామయుతం తథా ।

తదాభవతి దైవజ్ఞోఽప్య గ్రదానీచ దుర్మతిః ॥

తతః శూద్రోభవే ద్విప్రో భోగేన కర్మణస్తథా ।

శాస్త్ర జ్ఞాతాచ దైవజ్ఞోమిధ్యా వదతి లోభతః ॥

సభవేచ్చ ధ్రువంజ్యేష్ఠీ వానరః సప్త జన్మసు ।

అనేక జన్మతపసా భారతే బ్రాహ్మణో భవేత్ ॥

బుద్ధిరతి ధర్మిష్టో ధర్మహీనశ్చ పాతకీ ।

స్వధర్మనిరతో విప్రః పరమాచ్చ హుతాశనాత్ ॥

పవిత్రశ్చాతి తేజస్వీ తస్మాద్భీతాః సురాః సదా ।

నదీషు చయథాగంగా తీర్ధేషు పుష్కరం యథా ॥

పురీషు చ యథా కాశీ యథా జ్ఞానిషు శంకరః ।

శాస్తేషు చయథావేదా యథాఽశ్వత్థశ్చ పాద పే ॥

మమపూజా తపస్యాసు ప్రతేష్వ నశనం యథా ।

తథా జాతీషు సర్వాసు బ్రాహ్మణః శ్రేష్ఠ ఏవచ ॥

ప్రపాదేషు తీర్థాని పుణ్యానిచ వ్రతానిచ ।

విప్రపాదరజః శుద్ధం పాపవ్యాధి విమర్దనం ॥

శుభాశీర్వచనంతేషాం సర్వకల్యాణ కారకం ।

ఏతత్తే కథితంతాత విపాకః కర్మణా మహో ॥

యథాశ్రుతం యథాజ్ఞాతం తదశేషం నిశాయయ ।

శ్రుత్వా ధర్మవిపాకంచ వాచకాయ సువర్ణకం ॥

దద్యాత్త స్మైచరౌప్యంచ వస్త్రం తాంబూలమేవచ ।

సువర్ణ శతకం దద్యాత్సద్యోదేహీచ గోకులం రౌప్యం వస్త్రంచ తాంబూలం మత్ప్రీత్యా బ్రాహ్మణాయచ ॥

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే ఉత్తరార్దే నారాయణ నారదసంవాదే భగవన్నంద సంవాదే పంచాతితమోఽధ్యాయః ॥

అను!! కవి, పండితుల నిందించేవాడు (కొట్టటం) ఏడు జన్మలు కప్పఔతాడు. దుష్టకవి, గ్రామమందలి విప్రుడు ఏడు జన్మలు ముంగిస ఔతాడు, (191) ఒక జన్మకుష్టురోగి, మూడు జన్మలు తొండ ఔతాడు. ఒక జన్మ ఈగ (అడవిది) ఆ పైన చెట్టు పై చీమ ఔతాడు, (192) ఆ పై శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడౌతాడు, నాలుగు వర్ణములలోను కన్యను అమ్మే నరుడు, (193) చంద్ర సూర్యులున్నంతకాలం, వెంటనే తామిస్ర నరకమునకు వెళ్లాడు. ఆపై వ్యాధుడౌతాడు మాంస మమ్మేవాడు, (194) ఔతాడు ఆపై ముందు జన్మలో ఎట్లున్నాడో అట్లా వ్యాధుడౌతాడు. నా నామాన్ని అమ్మే బ్రాహ్మణుడు (దేవుని పేరు చెప్పి బతకటం)ముక్తుడుకాడు నిశ్చయము, (195) మృత్యులోకమందు నానామము (పేరు) స్మృతిలో కూడా ఉండదు. ఆ పైవాడు గోవుయోని యందు ఒక జన్మ నంది జ్ఞాన దుర్బలుడౌతాడు, (196) ఆపై మేకపోతుగా, మేకగా, దున్నపోతుగా ఏడు జన్మలుంటాడు. గొప్పగాండ్లవాడు, (నూనె తీసేవాడు) కుటిలుడు ధర్మహీనుడైన మానవుడు (197) ఒక జన్మ నూనె తీసేవాడుగా, ఆపై కుమ్మరి వానిగా జన్మిస్తాడు. (చక్రి=గాండ్ల, కుమ్మరి). అబద్దంగా ఇతరుల పై నిందమో పేవాడు దేవ, బ్రాహ్మణుల నిందించేవాడు (198) వాడు అముసలివాడౌతాడు. ఏడు జన్మలు చాకలిఔతాడు. బ్రాహ్మణ క్షత్రియవైశ్య శూద్రులు, కుత్సితులు, శుచిత్వం లేనివారు (199) పదివేల సంవత్సరాలు మేచ్చయోనులందు జన్మిస్తారు. ఇచ్ఛాపూర్వకంగా, స్త్రీల పిరుదులు, రొమ్ములు, ముఖము చూచేవాడు (200) దృష్టిహీనుడౌతాడు, నపుంసకుడౌతాడు. అభిచార హోమం చేసే (శత్రునాశంకై యజ్ఞం) విప్రుడు, హింస చేసేవాడు, జ్ఞాన దుర్బలుడు (201) పదివేల సంవత్సరాలు అంధతామిస్ర నరకానికి పోతాడు. ఆ పైన దైవజ్ఞుడౌతాడు (జోస్యుడు), చచ్చిన వాళ్ళకై ఇచ్చేదానం పట్టే వాడు, దుర్మతి ఔతాడు (202) ఆ పై శూద్రుడు ఔతాడు. అట్లాగే కర్మ అనుభవం పొంది విప్రుడౌతాడు. శాస్త్ర మెరిగినవాడు జోస్యుడై లోభంతో అబద్ధం చెబితే (203) వాడు తప్పకుండా బల్లి ఔతాడు, ఆపై ఏడు జన్మలు కోతి ఔతాడు. అనేక జన్మలలో తపస్సు చేసి భారతదేశ) మందు బ్రాహ్మణుడౌతాడు. (204) మంచి బుద్ధిగలవాడు అతి ధర్మమాచరిస్తాడు. ధర్మహీనుడు మహాపాతకి. స్వధర్మ మందున్న విప్రుడు అగ్నికన్న పరముడు, (205) పవిత్రుడు, అతితేజస్వి అతని చూచి దేవతలెప్పుడూ భయపడుతారు. నదులలో గంగవలె తీర్థములలో పుష్కరము వలె (206) నగరములలో కాశివలె, జ్ఞానులలో శంకరునివలె, శాస్త్రములలో వేదముల వలె, వృక్షములలో అశ్వత్థము వలె (రావి) (207) తపస్సులలో నాపూజవలె వ్రతములలో ఉపవాసం వలె, అట్లా జాతులన్నిటిలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడే. (208) బ్రాహ్మణుని పాదములు తీర్థము వంటివి, పుణ్యప్రదమైనవి. వ్రతముచేసినంత పుణ్యప్రదమైనవి. విప్రుని పాదధూళి శుద్ధమైనది పాపమును, వ్యాధిని నశింపచేసేది. (209) శుభమైన ఆశీర్వచనము. (సోకినవారికి) అన్ని కళ్యాణములనిచ్చేది. ఓ తండ్రి! దీనిని నీకు చెప్పాను. కర్మల పరిపాకమిట్లా ఉంటుంది. (210) విన్నది విన్నట్లు, తెలిసింది తెలిసినట్లు చెప్పాను. దానినంతా విన్పించాను. విన్నావు. ధర్మ విపాకమును విన్నాక చెప్పిన వానికి బంగారం (211) ఇవ్వాలి, ఆతనికి వెండి, వస్త్రము, తాంబూలము, నూరు రూపాయలు (బంగారువి) ఇవ్వాలి. ఇస్తే, ప్రాణి గోకులానికి వెళ్తాడు. వెండి, వస్త్రము, తాంబూలము నాకు సంతోషం కలిగే కొరకు బ్రాహ్మణునకివ్వాలి (212) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాద మందు భగవంతుడు, నందుడు వారిద్దరి సంవాదమందు ఎనుబది ఐదవ అధ్యాయము.