బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

42 - సతీదేహ త్యాగము

వసిష్ఠ ఉవాచ - వసిష్ఠ మహర్షి అనెను-

ఆథానగణ్యస్య కన్యా నీ షేవే భక్తితో మునిం

కర్మణా మనసా వాచో లక్ష్మీన్నారాయణం యథా

ఏకదా స్వర్ణదీం స్నాతుం గచ్ఛంతీం సస్మితాం సతీం

దదర్శ పధి ధర్మశ్చ మాయయా నృపలింగకః

చారురత్న రథస్థశ్చ రత్నాలంకార భూషితః

 నవీన యావన శ్రీమాన్ కామదేవ నమప్రభః

 దృష్ట్వా తాం నుందరీం రమ్యామువాచ మాయయా ప్రభుః

విజ్ఞాతుమంతస్తత్త్వం చ తస్యాశ్చ మునియోషితః

తరువాత అనరణ్యుని కన్య లక్ష్మీదేవి నారాయణుని సేవించినట్లు మనోవాక్కాయములతో (త్రికరణశుద్ధిగా) భక్తిలో మునిని సేవించెను. ఒకప్పుడు ఆకాశగంగకు (దేవనదికి) చిరునవ్వు ముఖముతో స్నానమునకు పోవుచున్న ఆ పతివ్రతను తన మాయతో రాజ రూపము ధరించిన ధర్మదేవత త్రోవలో చూచెను. అతడు నవయౌవనముతో సుందరుడై మన్మథునితో సమానమైన కాంతిగలవాడై రత్నాభరణములు ధరించి సుందరమైన రత్నరథము మీద ఆ సుందరినీ చేరవచ్చి చూచి - ఆ ముని పత్నియొక్క మనస్తత్త్వమును తెలిసికొనుటకు ఆ సుందరితో ఇట్లు పలికెను.

ధర్మ ఉవాచ - ధర్ముడు అనెను :

 అయి నుందరి లక్ష్మీవ రాజయోగ్యే మనోహరే

ఆతీవ యావనస్థ చ కామిని స్థిర యావనే

జరాతురస్య వృద్ధస్య సమీపే త్వం న రాజ సే

చందనాగురు సంలీప్తా రాజ సే రాజవక్షసి

విప్రం తపస్సు నిరతం సత్యజ్ఞం మరజోన్ముఖం

విహాయ పశ్య రాజేంద్రం రతిశూరం స్మరాతురం

 ప్రాప్నోతి సుందరం పుణ్యాత్సౌందర్యం పూర్వజన్మతః

 సఫలం తద్భవేత్సర్వం రసికాలింగనేవ చ

సహస్ర సుందరీకాంతం కామశాస్త్ర విశారదం

కింకరం కురు మాం కాంతే పరిత్యకామి తో ఆపి

నీర్ణలే నిర్జనే రమ్యే శూలే శైలే నదే నదే

పుష్పోద్యానే పుష్పితే చ సుగంధి పుష్పవాయునా

 మలయే చందనోరణ్యే చారు చందన వాయునా

విహరిష్యామీ కామేన కామిన్యా చ త్వయా సహా

 కామజ్యురేణ దగ్గాయాః శాంతిం కర్తుమహా క్షమః

విహరన్వ మయా సార్థం జన్మేదం సఫలం కురు

మనస్సును హరించుచున్న ఓ సుందరీ! లక్ష్మీదేవి వలే రాజపురుషునకు యోగ్యమైనదానా! మంచి యావనమందున్న కామినీ! స్థిరమౌవనము గలదానా! జర (ముసలితనము) తో పీడింపబడుచున్న ఆ వృద్ధుని వద్ద నీవు శోభించుచు లేవు. చందనము అగురు గంధమును ధరించి ఒక రాజపురుషుని వక్షఃస్థలమందు చేరినచో మిక్కిలి శోభింతువు. బ్రహ్మమే సత్యమని తపస్సులో మునిగియున్న మృత్యువుకు దగ్గరపడిన ఆ విప్రుని విడిచి పెట్టి మన్మథుని చేత పీడింపబడుచున్న రతీ కార్యమందు శూరుడనైన రాజేంద్రుడనగు నన్ను చూడుము. పూర్వజన్మ పుణ్యము వలన ఒక స్త్రీ తోను సుందరియై సుందరుడైన పురుమని పొందినచో ఆ రసికుని యొక్క ఆలింగనము చేత ఆ పూర్వ పుణ్యము ఆ సౌందర్యము సఫలమగును. కావున వేయిమంది సుందరీమణులకు ప్రియుడను కామశాస్త్రమందు పండితుడను అగు నన్ను నీ సేవకుని జేసికొనుము. అటైనచో నా ప్రియురాండ్రనందరినీ విడిచి పెట్టుదును. జలము లేని ఏకాంతముగానుండు ప్రతి సుందర పర్వతము మీదను ప్రతినదమందును (పడమటికి ప్రవహించు నది) పుష్పించి మంచి వాసన గల పూలగాడ్పులు వీచెడీ ఉద్యానములలోను, ఇంపైన చందనపు గాలులు వీచెడి మలయ పర్వతమందలీ చందనారణ్యమందును నిండుకోరికతో కామినివైన నీతో విహరింతును, మన్మథజ్వరముతో తపించుచున్న నీకు శాంతిని కల్గించుటకు నేను సమర్థుడను. నాలో విహరించుము.. ఈ నీ జన్మను నఫలము చేయుము.

ఇత్యేవముక్తవంతం తం స్వరథాదవరుహ్య చ

గ్రహీతుముత్సుకం హస్తే తమువాచ పతివ్రతా

ఇట్లు పలుకుచు రథము నుండి దిగి తన హస్తమును పట్టుకోనుటకు ఆసక్తి పడుచున్న అతనితో ఆ పతివ్రత ఇట్లు పలికెను.

 పద్మోవాచ - పద్మాదేవి పలికెను :

దూరం గచ్ఛ గచ్ఛ దూరం పాపిష్ఠ భూమీపాధమ

 మాం చేతృశ్యసి కామేన సద్యో భస్మ భవిష్యసి

పిప్పలాదం మునిశ్రేష్ఠం తపసా వూతవిగ్రహం

విహాయ త్వాం భజిష్యామి స్త్రీజితం రతిలంవటం

 స్త్రీజిత స్పర్శ మాత్రేణ సర్వం పుణ్యం ప్రణశ్యతి

 న భూమౌ పాతకీ పాపాత్ పాపినాం స్త్రీజితాత్పరః

మాం మాతరం చ స్త్రీభావం కృత్వా యేన బ్రవీషి చ

 భవిష్యతి క్షయ సేన కాలేన మమ శాపతః

శ్రుత్వా ధర్మః సతీశాపం నృపమూర్తిం విహాయ చ

ధృత్వా స్వమూర్తిం దేవేశః కంపమాన ఉవాచ హ

“ఓరీ పాపకర్మయందు నిలిచిన నీచరాజా! దూరముగా తొలగిపొమ్ము. దూరముగా పొమ్ము. కామబుద్ధితో నన్ను చూతువేని వెంటనే భస్మమై పోదువు. తపస్సు చేత పావనమైన శరీరము గల పిప్పలాద మహామునిని వదిలి పెట్టి స్త్రీలకోడిపోయి తుచ్ఛరతియందు ఆసక్తుడవైన నిన్ను భజించ వలెనా? స్త్రీల చేష్టలచేత ఓడింపబడిన వ్యక్తిని ముట్టుకొన్నంతలోనే సర్వపుణ్యములు నశించిపోవును. మనో నిగ్రహము లేక స్త్రీలచేత జయింపబడిన పాపికంటే మించిన పాపాత్ముడు పాపులలో లేడు. నన్ను బ్రాహ్మణుని భార్యను తల్లివంటి - దానిని ఒక తుచ్ఛ స్త్రీ భావముతో పలుకుచుంటివి. ఈ కారణము వలన కొంతకాలమునకు నా శాపము వలన నీకు నాశమేర్పడగలదు” అప్పుడా పతివ్రతాశాపము వినగనే ఆ ధర్మదేవత రాజశరీరము వదిలి తన నిజశరీరము ధరించి వణికి పోవుచు పలికెను.

ధర్మ ఉవాచ - ధర్మడు పలికెను :

మాతర్జానీహి మాం ధర్మం ధర్మజ్ఞానాం గురోర్గురుం

వరస్త్రీ మాతృబుద్ధిం చ కుర్వంతం సతతం నతి

అహం తవాంతర్విజ్ఞాతుమాగతస్తవ సన్నిధిం

యుష్మాకం చ మనో జానే తథాపి దైవ బోధితః

 కృతం మే దమనం సాధ్వి న విరుద్ధం యధోచితం

శాస్త్రిః సముత్పఠస్థానామీశ్వరేణ వినిర్మితా

ధర్మం స్వధర్మం విజ్ఞాతుం కాలం కలయితుం క్షమః

 విధాతారం సంవిధాతుం తస్మై కృష్ణాయ తే నమః

 సంహర్తుం యః క్షమః కాలే సంహర్తారం భవం విభుః

 స్రష్టారం లీలయా స్రష్టుం తస్మై కృష్ణాయ తే నమః

శత్రుం విధాతుం మిత్రం చ సుప్రీతిం కలహం క్షమః

 స్రష్టుం నష్టుం తదేవం చ తస్మై కృష్ణాయ తే నమః

 శాపం ప్రదాతుం సర్వాంశ్చ సుఖదుఃఖ వరాన్ క్షమః

 సంపదం విపదం యో హి తస్మై కృష్ణాయ తే నమః

ప్రకృతిర్నిర్మితా యేన మహావిష్ణుశ్చ నిర్మితః

 బ్రహ్మ విష్ణు మహేశాద్యాస్తస్మై కృష్ణాయ తే నమః

అమ్మా! నన్ను ధర్మజులకు పరమ గురువైన ధర్మదేవతగా తెలిసికొనుము. ఎల్లప్పుడు పరస్త్రీలను తల్లివలె భావించుచుందును, నీ మనస్సును తెలిసికొనుటకే నీ వద్దకు వచ్చితిని, నీ మన సెటువంటిదో నాకు తెలియును. ఐనను దైవప్రేరణ చేత ఇట్లు పలికితిని. ఓ సాధ్వీ! నీవు విధించిన శిక్ష (శాపము) విరుద్ధమైనది కాదు. నేను చేసినదానికి ఉచితమైనదే. మర్యాదకు విరుద్ధమైన దుష్టమార్గములో నడచు వారికి శిక్ష పరమేశ్వరుని చేత నిర్మించబడియే ఉన్నది. సర్వజీవులకు సంబంధించిన ధర్మమును జాతివర్ణములను బట్టి ఏర్పడిన వ్యక్తిగత ధర్మమును తెలిసికొనుటకును కాలమును సమకూర్చుటకును సమర్ధుడై విధాతను నియమించువాడగు ఆ శ్రీకృష్ణునకు నమస్కారము. - తగిన కాలములో లయకర్తయగు భవుని గూడ సంహరించుటకును సృష్టికర్తను లీలగా సృష్టించుటకు ఎవడు సమర్థుడో అట్టి కృష్ణునకు నమస్కారము. శత్రుమిత్రులను - వారి వలన కలుగు కలహము నంప్రీతిని సృష్టించుటకు నాశము చేయుటకు ఎవడు. సమర్థుడో అట్టి కృష్ణునకు నమస్కారము. శాపమిచ్చుటకును సర్వసుఖ దుఃఖములను కలిగించుటకును వరములిచ్చుటకును ఆపదలను సంపదలను కలిగించుటకును ఎవడు సమర్ధుడో అట్టి కృష్ణునకు నమస్కారము. ఎవని చేత ఈ ప్రకృతి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు విరాట్పురుషుడైన మహావిష్ణువు నిర్మింపబడిరో ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారము.

 యేన శుక్లీకృతం క్షీరం జలం శీతం కృతం పురా

 దాహీకృతో హతాశశ్చ తస్మై కృష్ణాయ తే నమః

అతితేజః సముత్థాయ తేజోరూపాయ మూర్తయే

గుణశ్రేష్ట విరుణాయ తస్మై కృష్ణాయ తే నమః

సర్వస్మై నర్వబీజాయ నర్వేషామంతరాత్మనే

సర్వబంధు స్వరూపాయ తస్మై కృష్ణాత్మనే నమః

 ఇత్యుక్త్వా పురతస్తస్యాస్తస్థా ధర్మో జగద్గురు

సా సాధ్వీ తం చ విజ్ఞాయ సహసోవాచ పర్వత

ఎవడు పొలను తెల్లనివిగా నీటిని చల్లదనము గల దానిగా అగ్నీని కాల్పుదానినిగా పురాతన కాలమందు చేసెనో, అట్టి కృష్ణునకు నమస్కారము. అతి తీవ్రమైన తేజస్సు నుండి వెలుపలికి వచ్చి తేజోరూపమైన ఆకారమునెవడు పొందెనో - లోక కల్యాణకరమైన గుణములచే శ్రేష్ఠుడై ఉత్పత్తి క్షయాది గుణరహితుడై (సత్వ రజస్తమస్సులు లేనివాడు) ఉండునో అట్టి కృష్ణునకు నమస్కారము. సర్వము తానై - సర్వ వ్యక్త సృష్టికి బీజమై - (విత్తనము) సమస్త జీవులలో అంతరాత్మయే - సర్వప్రాణులకు హితము కూర్చు బంధువై ఎవడున్నాడో అట్టి కృష్ణునకు నమస్కారము. ఇట్లు పలికి జగద్గురువైన ఆ ధర్ముడు ఆమె ముందు నిలిచియుండెను. ఆ సాధ్వి అతని వాస్తవ స్థితిని తెలిసికొని వెంటనే ఇట్లనెను.

పద్మోవాచ - పద్మాదేవి పలికెను :

త్వమేవ ధర్మ సర్వేషాం సాక్షీ చ సర్వకర్మణాం

సర్వాంతరేవు సర్వాత్మా సర్వజ్ఞః సర్వ తత్త్వవిత్

 కథం మనో మే విజ్ఞాతుం విడంబయసి కింకరీం

 యత్కృతం త్వత్కృతే బ్రహ్మన్నవరాథో బభూవ మే

త్వం చ శక్తే మయా జ్ఞానాత్ స్త్రీ స్వభావాత్ క్రుధా విభో

 కా వ్యవస్థా భవేత్తస్య చింతయామీతి సాంప్రతం

ఆకాశమే దీశః సర్వా యది నశ్యంతి వాయువః

తధాసి సాధ్వీ వస్తు వ నశ్యతి కదాచన

 త్వం చ వష్ఠో భవసి చేత్సృష్టినాశో భవేత్తదా

 ఇతికర్తవ్యతా ఘూడా తథాపి త్వాం వదామ్యహం

ఓ విభూ! అందరికి ధర్మస్వరూపుడవు నీవు. సర్వజీవుల కర్మలకు ప్రత్యక్షసాక్షివీ నీవు. అందరి హృదయములలో అంతరాత్మవు, సర్వజ్ఞుడు సర్వతత్వములు తెలిసినవాడవు అగు నీవు మా మనస్సును తెలిసికొనుటకని ఈ నీ సేవకురాలినెట్లు మోసగించుచుంటివి? ఓ దైవమా! నీ విషయములో నేను చేసినది సో అపరాధమైనది, అజ్ఞానము వలన స్త్రీకి సహజమైన క్రోధ స్వభావము చేత నా వలన శపింపబడితివి. ఇప్పుడా శాపమునకు ఎటువంటి వ్యవస్థ (ఉనికి - కట్టుబాటు) సంభవించునో అని విచారించుచున్నాను. ఈ ఆకాశము దిక్కులు వాయువులు నశించినను కూడ ఒక సాధ్వి శాపమెన్నటికిని అనుభవమునకు రాక నశించదు. మరి నా శాపమును బట్టి నీవు (ధర్మము) నశించినచో అప్పుడు ఈ సృష్టియే నశించును కదా ఇప్పుడేమి చేయుటకును తోచని మూఢురాలనై ఉన్నాను, ఐనను నీకు కొన్ని వాక్యములు చెప్పుచున్నాను.

 సత్యే పూర్ణశ్చతుష్పాదై పౌర్ణమాప్యాం యథా శశీ

విరాజ పే దేవరాజ సర్వకాలం దీవానీశం

పాదక్షయశ్చ త్రేతాయాం భగవన్ భవితో తవ

పాదౌ పరౌ ద్వాపరే చ తృతీయశ్చ కలో విభో

కలిశేషే శేషపాద స్తవాచ్ఛన్నో భవిష్యతి

 పునః సత్యే సమాయతే పరిపూర్ణో భవిష్యసి

సత్యే పర్వ వ్యాపకక్ష్యం తదవ్యేషు చ కుత్రచిత్

 యత్ర స్థానం తదాధారో వదామీ శ్రూయతాం విభో

ఓ దేవరాజా! పున్నమీసాడు చంద్రునివలె నీవు సత్యయుగములో (కృతయుగము) నాల్గు పాదములతో ఆ యుగము మొత్తము రాత్రింబవళ్లు నిండుగా ప్రకాశింతువు. త్రేతాయుగమందు ఒక పాదము నీకు క్షయమగును. ద్వాపరయుగములో రెండు పాదము (ధర్మము)లుండును, ఇక నాల్గవదియైనే కలియుగములో ఒక పాలు నీధర్మముండును. కలియొక్క చివరి భాగమందు ఆ మాత్రపు ధర్మము కూడ (నాల్గవ పాదము) కప్పివేయబడును. (ధర్మము లోపించిపోవును) తిరిగి సత్యయుగము రాగా నీవు పరిపూర్ణుడు (లుపాదముల ధర్మము) కాగలవు. సత్యయుగములో నీవు సర్వవ్యాపకుడవు. (అందరిలో అంతట వ్యాపించి ఉందువు) ఇతర యుగములలో ఎక్కడనో ఒకచోట ఉందువు. ఎక్కడ నీకు స్థానముండునో నీకాధారముగా ఎవరుందురో చెప్పెదను వినుము.

వైష్ణవేషు చ సర్వేషు యతిషు బ్రహ్మచారిషు

పతివ్రతాను ప్రాజ్ఞేమ వానప్రస్థీమ భిక్షువు

నృపేషు ధర్మశీలేపు వత్సు సద్వైశ్య జాతీమ

ద్విజ సేవిషు శూద్రేపు సత్సంసర్గ స్థితేమ చ

ఏమ త్వం సతతం పూర్ణో ధర్మరాజు విరాజసే

 యుగే యుగే తదాధారా యత్ర పుణ్యతమా జనాః

అశ్వద్ధవట బిల్వేషు తులసీ చందనేషు చ

 దీక్షా పరీక్షా శపథ గోష్ఠ గోష్పద భూమిము

 వివాహేమ చ పుష్పేషు విద్యమానోలిసి శాఖము

దేవాలయేషు తీర్దేషు నవాం శశ్వద్గృహేషు చ

వేదవేదాంగ శ్రవణే జలేషు చ సభాసు చ

శ్రీకృష్ణ గుణ నామోక్ష శ్రుతిగీతస్థలేషు చ

ప్రతపూజా తపోన్యాయ యజ్ఞ సాక్షస్థలేషు చ

గవాం గృహేషు గో ష్వేవ విద్యమానో హి పశ్యని

 కృశతా తేన భవితా ధర్మ తేషు స్థలేషు చ

విష్ణు భక్తుల యందు యతీశ్వరుల యందు బ్రహ్మచారుల యందు పతివ్రతల యందు బుధజనుల యందు వానప్రస్థుల యందు భిక్షా భోజనము చేయు విరక్తుల యందు ధర్మ స్వభావము గల: రాజుల యందు సత్పురుషుల యందు ఉత్తమ వైశ్యులందు బ్రాహ్మణ సేవచేయు శూద్రుల యందు సత్సంగము నందుండు వారియందు వీరియందు ఎల్లప్పుడు నీవు నీండుగా ప్రకాశించి ఉందువు. యుగయుగమందు ఎక్కడెక్కడ పుణ్యతములైన జనులుందురో ఆ ప్రదేశములే నీకాధారము (ఉండుస్థానము). రాగి మర్రి పూరేడు . వృక్షముల యందు తులసీ చందన వృక్షములందు. వ్రత దీక్షలు పట్టుకొను వారియందు ధర్మ పరీక్షచేయు వారియందు ధర్మరక్షకై శపథము పూనిన వారియందు గోవులు నివసించు శాలలయందు గోవుల మేతకై తిరుగు ప్రదేశములందు వివాహోత్సవములందు పూల వృక్షములయందు నీవుందువు. దేవాలయములందు పుణ్యతీర్ధములయందు సత్పురుషుల గృహములయందు వేదములను వేదాంగములను విను వారియందు పుణ్యనదులందు సజ్జనుల గోషులందు శ్రీకృష్ణ గుణ కీర్తనము నామ సంకీర్తనము జరుగు స్థలములందు వ్రతములు దేవ పూజలు.తపస్సు న్యాయ నిర్ణయము జరుగు స్థలములందు యజ్ఞము ధర్మసాక్ష్యము చెప్పువారు గల ప్రదేశములందు గోశాలలయందు గోవులయందు ఉన్నవాడవై లోకమును చూడగలవు. ఓ ధర్మదేవా! ఆ స్థలమందు కూడ కాలమును బట్టి (నా శాపమును బట్టి కూడ) కృశత్వము (నీవు బక్కచిక్కుట) సంభవించును.

ఏతదన్యేషు కృశతా యదగమ్యం చ తచ్చ్రుణు

పైన చెప్పినవి కాక ఇతర స్థలములలో నీకు కృశించుట సంభవించును కనుక నీవు పోగూడని స్థలములేవియో చెప్పెదను  వినుము.

పుంశ్చలీషు చ సర్వాను గృహేషు నరఘాతినాం

నరఘోశిమ వీచేషు మూర్ఖేషు చ ఖలేషుచ

 దేవతాగురు విప్రేష్ఠపాల్యానాం ధనహారీమ

ఆసన్నరేషు ధూర్తేషు చారేమ రశీభూమిషు

దురోదర సురాపాన కలహానాం స్థలేషు చ

సాలగ్రామ సాధుతీర్థ పురాణ రహితేషు చ

దన్యు స్నే హేపు వాదేషు తాలచ్ఛాయాను గర్విషు

 అనీజీవి మమీజీవి దేవల గ్రామ యాజీషు

వృషవాహ స్వర్ణకార జీవహింసోనజీవిషు

భర్తనిండితనారీషు స్త్రీ జితేషు చ పుంసు చ

దీక్షా సంధ్యా విష్ణుభక్తి విహేనేపు ద్విజేషు చ

 స్వాంగకన్యా విక్రయిసు స్వయోషిది క్రియేషకథ

సాలగ్రామ నురగ్రంథ భూమి విక్రయిసు ప్రభో

మిత్రద్రోహి కృత ఘ్నేషు సత్యవిశ్వాస ఘాతీషు

జారిణులైన స్త్రీలయందు నరహంతకుల గృహములందు, సరహత్యలు చేయు నీచుల యందు, మూర్శల యందు, దుర్జనుల యందు, దేవతలయొక్క, గురువుల యొక్క బ్రాహ్మణుల యొక్క ఇష్ట బంధువుల యొక్క ఇతరుల చేత పోషింపదగీన స్థితిలో నున్న చిన్న పిల్లల యొక్క ధనములనపహరించు వారి యందు, సద్బుద్ధి లేని నరులయందు, వంచకులయందు, చోరులయందు, స్త్రీపురుషులు రమించు ప్రదేశములందు, జూదము మద్యపానము కలహము గల ప్రదేశములందు, సాలగ్రామములు సాధుజనులు పుణ్యనదులు పురాణ కథనము లేని ప్రదేశములందు, దొంగల స్నేహము గలవారియందు, అనవసరవాదము సాగుచున్న స్థలమందు, తాటిచెట్టు నీడ యందు, గరిష్టులున్నచోట, కత్తులమ్మీ కల్మష పదార్థములమ్మి జీవించు వారి యందు భక్తిభావన లేకుండా డబ్బు సంపాదనకై దేవతాపూజ చేయు పోరియందు గ్రామ పౌరోహిత్యము చేయు వారియందు, ఎద్దునెక్కి తిరిగాడు వారియందు, స్వర్ణాభరణములను చేయు కంసాలుల యందు జీవహింసతో జీవించు వారియందు, భర్తచేత తిరస్కరింపబడిన దుష్ట స్త్రీలయందు, స్త్రీల విలాసములకు వశులై మోహముతో ప్రవర్తించు పురుషుల యందు, ఒక వ్రత దీక్ష గాని సంధ్యావందనము గాని విష్ణు భక్తి గాని లేని బ్రాహ్మణుల యందు తమ కూతుళ్లను విక్రయించు వారి యందును తమ భార్యల నమ్ముకొను వారియందును, సాలగ్రామములను దేవ భూములను సర్థంథములను అమ్ముకోను వారియందును, మీత్రద్రోహిచేసిన మేలు మరచు కృతఘ్నుల యందును సత్యమైన మైత్రీ విశ్వాసములను భంగము చేయు వారియందును నీవు చేరగూడదదు.

శరణాగత దీనేషు చాశ్రిత ఘ్నేమ నృష్వపి

శశ్వన్మిథ్యొక్తి శీలేషు తథా సీమాపహారీషు

కామాత్క్రోధాత్తథా లోఖాన్మీథ్యాసాక్షి ప్రవాదిషు

పుణ్యకర్మ విహినేషు పుణ్యకర్మ విరోధమ

 స్థాతుమేతేసు నింద్యేషు సాధికారస్తవ ప్రభో

మమాపి వచనం సత్యం బభూవ తత్క్షణం తవ

యాస్యామీ పతి సేవాయై గచ్ఛ తాత న్వమందిరం

 ఇత్యేవం వాదినీం సాధ్వీమువాచ వీధినందనః

 ప్రసన్నవదనః శ్రీమానతీవ విసయం వచః

తనను శరణుపొందిన దీనులను ఆశ్రయించి ఉన్న వారిని ఎవరు హింసింతురో (చంపుదురో) అట్టి నరుల యందు, ఎల్లప్పుడు అసత్యములు పలుకుటయే స్వభావముగా గల వారియందు, గ్రామపు పొలిమేరలను పంటభూముల పొలిమేరలను అపహరించి ఆక్రమించు వారియందు, కామక్రోధలోభములకు వశులై అసత్యసాక్ష్యము చెప్పు వారి యందు దానిని నిలుపుటకై గట్టిగా వాదించు వారియందు, పుణ్యకార్యములు చేయని వారియందు వాటి మీద పగబూను వారియందును - ఈ సంద్యస్థానములలో నీవుండరాదు. అక్కడి నీకధికారము లేదు. ఒకవేళ నీవక్కడ నీలిచినచో వెంటనే నా శాపవచనము సత్యమైనదని భావించుము. (అనగా నీవక్కడ కృశించిపోదువు). “తండ్రీ! నేను భర్త సేవకొరకు పోవుచున్నాను నీవును నీమందిరమునకు పొమ్ము” అని యిట్లు పలుకుచున్న సాధ్విలో బ్రహ్మపుత్రుడైన ధర్ముడు ప్రసన్నవదనుడై మిక్కిలి వినయ వాక్యములను పలికెను.

ధర్మ ఉవాచ - ధర్ముడు పలికేను :

ధన్యాఽసి పతిభక్తాఽసి స్వస్తితేమిఽస్తు చ సంతతం

వరం గృహాణ దాస్యామి మత్పరిత్రాణకారిణి

యువ భవతు భర్తా తే రతికూరశ్న కన్యకే

రూపవాన్ గుణవాన్ సాధ్వి సంతతం స్థిరయావనః

పరమైశ్వర్య నంయుక్తా త్వం భవ స్థిరయావనా

 స్థిరజీవీ భవతు స మార్కండేయాత్పరః నుతే

కుబేరార్ధనవాంశ్చైవ శక్రాదైశ్వర్యవాసపి

విష్ణుభక్తః శివనమః సిద్ధస్తు కపిలాత్పరః

 స్వామి సౌభాగ్య సంయుక్తా భవ త్వం జీవనావధి

గృహా భవంతు తే సాధ్వి కుబేర భవనాధికాః

మాతా త్వం దశపుత్రాణాం గుణినాం చిరజీనాం

స్వభర్తురధీకానాం చ భవిష్యసి న సంశయః

ఇత్యేవముక్త్యా సంతస్థా ధర్మరాజశ్చ పర్వత

సా తం ప్రదక్షిణీ కృత్య ప్రణమ్య స్వగృహం యయా

 ధర్మస్తామాశిషం యుక్త్యా జగామ నిజమందిరం

పతివ్రతాం ప్రశశంన ప్రతీ సంసది సంనది

 సా రేమే స్వామీనా సార్థం యూనా రహసి సంతతం

 పశ్చాద్బభూవ సత్పుత్రా తద్భక్తురధికా గుణై

శైలేంద్ర కథితం సర్వమితిహాసం పురాతనం

అమ్మా! పతిభక్తిగల నీవు ధన్యురాలవు. నీకెల్లప్పుడు మంగళమగుగాక. నా రక్షణకు మూలమైనదోనా! నీకు వరమిచ్చుచున్నాను. గ్రహింపుము. నీ భర్త నీకు సాంసారిక సుఖము కూర్చగల సమర్థుడు యువకుడగుగాక. ఓ సాధ్వీ! అతడు మంచి రూపవంతుడు - గుణవంతుడు ఎల్లప్పుడు స్థిరమైన యావనము గలవాడగు గాక. నీవు కూడ విశేషమైన ఐశ్వర్యము గలదానవు స్థిరమౌవనవతివి కమ్ము - బిడ్డా! నీ భర్త మార్కండేయుని కంటే అధికముగా చిరంజీవి అగుగాక. కుబేరుని మించిన ధనవంతుడు ఇంద్రుని మించి అధికార సంపద గలవాడగు గాక, శివుని యంతటి విష్ణు భక్తుడు కపిలుని కంటే అధికమైన సిద్ధపురుషుడగు గాక. నీవు జీవిత మున్నంతకాలము స్వామి సౌభాగ్యము (ముత్తైదువతనము) కలదానవు కమ్ము. ఓ సాధ్వీ! నీ గృహములు- కుబేరుని భవనము కంటే అధిక సుఖైశ్వర్యములు కలవి అగుగాక. నీవు సద్గుణవంతులు చిరంజీవులైన పదిమందీ పుత్రులు కల తల్లివగుదువు గాక, వారు నీ భర్తను మించి యోగ్యులగుదురు". ఓ హిమవంతుడా! ధర్మరాజిట్లు పలికి నిలచియుండెను. ఆమె అతనికి ప్రదక్షిణ నమస్కారములు చేసి తన గృహమునకు పోయెను. ధర్మదేవత ఆమెకాశీస్సులిచ్చి తన మందిరమునకు పోయెను. అతడు జనులు నిండియున్న ప్రతి సభలో ఆ పతీవ్రతను గూర్చి చెప్పుచు ప్రశంసించెను. ఆ పద్మాదేవి యువకుడుగా మారినే తన భర్తతో ఏకాంతమున సుఖించెను. తరువాత ఆమెకు భర్తను మించిన గుణవంతులగు పుత్రులు పదిమంది కళిరి. ఓ పర్వతరాజా! నీకిట్లు పురాతనమైన ఇతిహాసము మొత్తము చెప్పితిని.

దత్త్వాఽ నరణ్యః స్వసుతాం రరక్ష సర్వసంపదం

త్వమేవం కన్యకాం దత్తా సర్వేషామీశ్వరాయ చ

రక్ష సర్వబంధువర్గానాత్మనః సర్వసంపదం

సప్తా హే సమశీతే చ దుర్లభేఽ తిశుభే క్షణే

 లగ్నాధిపే చ లగ్న చంద్రే స్వతనయాన్వితే

మోదతే రోహిణీ యుక్తే విశుధ్ధ చంద్రతారకే

మార్గశీరే చంద్రవారే సర్పదోష వివర్జితే

సర్వసభ్రహ సందృష్ట హ్యసధ్రహ వివర్జితే

సదసత్య ప్రదేఽ తీవ వతసౌభాగ్యదాయిని

అవైధవ్య ప్రదే సౌఖ్యప్రదే జన్మని జన్మని

 అత్యంత ప్రేమావిచ్ఛేద ప్రదాయిని పరాత్పరే

 కన్యాం ప్రదాయ దేవాయ త్వం కృతీ భవ పర్వత

జగదంబాం జగత్పితే మూలప్రకృతిమీశ్వరీం

అనరణ్యుడు తన బిడ్డను కన్యాదానము చేసి సర్వసంపదలను రక్షించుకొనెను. నీవును అట్లే సర్వేశ్వరునకు నీ సుతనిచ్చి నీ బంధువర్గములను నీ సంపదలను కాపాడుకొనుము. నేటినుండి ఏడు దినములు గడిచిపోగా మిక్కిలి దుర్లభమైన శుభముహరాన్తమున్నది. మార్గశిర మాసము సోమవారమున లగ్నాధిపతి చంద్ర బుధులతో కూడి లగ్నముందుండగా - ఆ చంద్రుడును రోహిణీ నక్షత్రయుక్తుడై ఉండగా వధూవరులకు చంద్రతారాబలములు పరిశుద్ధముగా నుండగా ఆ లగ్నము దుష్టగ్రహములు గాని వారి దృష్టి గాని లేకుండ నుండి సర్వపుణ్య గ్రహములు దానిని చూచుచుండగా పతికి సౌభాగ్యము భార్యకు ముత్తైదువుతనము సత్సంతానమును సుఖమును జన్మజన్మల కీయగల, అత్యంతము భార్యాభర్తల ప్రేమ విచ్ఛేదము కాకుండనుండునట్టి మిక్కిలి శ్రేష్ఠమైన ముహూర్తములో ఆ దేవునకు నీకన్యను దానమొనర్చి ధన్యుడవు కమ్ము, శివుడు జగములకు తండ్రి. పార్వతి మూల ప్రకృతి జగములకు తల్లి. కనుక ఈ వివాహమును నిర్వహింపుము (అని పసిష్ఠ మహర్షి బోధించెను).

తేజః స్వరూపాం సర్వేషాం దేవానాం దేవపూజితాం

సర్వదేవతల యొక్క తేజస్సుస్వరూపముగా గల ఈమెను దేవతలందరు పూజింతురు

ఆవిర్భూతా పురాకల్నే దేవానాం రక్షణాయ చ

తేజోరాశిః సురౌఘాణాం ప్రజ్వలంతీ దిశో దశ

అస్యాః స్వతేజసా దైత్యా: కోచిద్దగ్దాః వలాయితాః

 కేచిదృభూవు: శైలేంద్ర భస్మీభూతాశ్చ భూతలే

 బిలం ప్రవివిశః కేచిన్మూరాం ప్రాపుశ్చ కేచన

కేశిధంతే తృణం కృత్వా జగ్ముః శరణమీశ్వరీం

 కేచిచ్ఛిక్షిపురస్రాణి స్తంభీతా ఆపి కేచన

 కేచిచ్చరం రణం కృత్వా యయుః స్వర్గమనామయం

 నిశ్శత్రవో బభూవస్తే నురా అస్యాం ప్రసాదతః

 కృష్ణాజ్ఞయా సా కల్పాంతే దక్షకన్యా బభూవ హి

దక్షశ్చ విధివద్దేవీం ప్రదదౌ శూలపాణయే

దేవేన మత్సితుర్యళ్లే సహసా సురసంపది

 బభూవ కలహః శైల తేన శూలభృతా మహాన్

 బ్రహ్మాణం చ నమస్కృత్య యయా రుష్ఠ స్త్రీలోచనః

దక్షశ్చ సగణో రుష్టః ప్రయయౌ స్వాలయం తదా

పూర్వ కల్పములో దేవగణముల యొక్క తేజోరాశి పదిదిక్కులను వెలిగించుచు దేవతల రక్షణార్ధము జగదంబగా ఆవిర్భవించెను (స్వయముగా పుట్టెను). ఆమె తేజస్పుచేత దైత్యులు కాల్చబడి పారిపోయిరి. మరికొందరు భూమిమీద బూడిద కుప్పలై పోయిరి (కాల్చబడిరి). కొందరు ఆ తేజస్సునుండి తమను కాపాడుకొనుటకు గుహలలో చొచ్చిరి. కొందరు రాక్షసులు మూర్చిల్లిరి. కొందరు ఓడిపోతీమని నోటిలో గడ్డి పెట్టుకొని ఆ ఈశ్వరినే శరణు పొందిరి. కొందరు ఆమె పైకి అస్త్రములను విసరిరి. కొందరు ఆమె తేజస్సు ముందు కదలలేక స్తంభించిపోయిరి. కొందరు చాలకాలమాతో యుద్ధము చేసి క్షేమకరమైన స్వర్గమునకేగిరి (చనిపోయిరి), ఆమె అనుగ్రహము వలన దేవతలు శత్రువుల లేనివారైరి. ఆ కల్పాంతములో కృష్ణ పరమాత్మయొక్క ఆజ్ఞచేత ఆ దేవి. దక్షుని పుత్రికగా జన్మించెను. ఆ దక్షుడు శూలపాణికి (శివునకు) ఆ దేవిని. ఇచ్చి శాస్త్రానుసారము వివాహము చేసెను. ఒకసారి మా తండ్రియైన బ్రహ్మయజ్ఞము చేయుచుండగా నిండైన దేవతల సభలో ఆ పరమేశ్వరునితో దక్షుడు పెద్దగా కలహించెను. ఆ సంఘటనకు కోపించిన త్రిలోచనుడు (మూడు కన్నులు గల దేవుడు) మాట్లాడక బ్రహ్మకు నమస్కరించి వెళ్లిపోయెను. దక్షుడు తన బలగముతో పాటు కోపముగా తన గృహమునకు పోయెను.

కోపాత్సంభృత సంఖారో దక్ష యజ్ఞం చకార హ

న దదౌ యజ్ఞభాగం చ మాత్సర్యాచ్ఫూలపాణయే

 దృష్టా సతీ ప్రకుపీతా జనకం రక్తలోచనా

నిర్భర్భ్త్య చ బహుతరం హృదయేన విదూయతా

యజ్ఞస్థానాతముత్థాయ జగామ మాతురంతికం

 భవిష్యం కథయామాన త్రికాలజ్ఞా పరాత్పరా

 యజ్ఞ భంగాదికం వాపి న్వంతుశ్చ వరాభవం

పలాయనం చ దేవానాం యజ్ఞస్థానాధిరీశ్వరం

మనీనామృత్వజాం చైవ పర్వతానాం తథైవ చ

జయం శంకర సైన్యానాం స్వాత్మనో మృత్యు మేవ చ

శోకాత్ పర్యటనం భరుర్విరహాతుర చేతసా

నిర్మాణం నేత్రరసః ప్రబోధం చ జనార్ధనాత్

మూర్తిభేదాత్సునః ప్రాప్తిం విహారం తస్య తత్సమం

 అవరం భవితవ్యం చ సర్వముక్త్యా జగామ సా

శంకరుని మీది కోపముతో దక్షుడు యజ్ఞసామగ్రిని సమకూర్చుకొని యజ్ఞమారంభించెను. ఆ యజ్ఞములో సర్వదేవతల కీయవలసిన యజ్ఞభాగమును (హోమ సమయములో ఆ దేవతా మంత్రము చెప్పి అగ్నిలో ఇచ్చేడు ఆహుతిని) దక్షుడు కేవలమసూయతో శివునికీయలేదు. అది చూచిన సతీదేవి ఎర్రని కన్నులతో తండ్రిని కోపించి అనేక విధములుగా బెదిరించి మనస్సు బాధపడుచుండగా ఆ యజ్ఞస్థానమునుంచి లేచి తల్లి వద్దకు పోయెను. త్రికాలజ్ఞురాలైన ఆ పరమేశ్వరి భవిష్యత్తులో జరుగనున్న సంఘటనలను తల్లికి చెప్పెను, యజ్ఞము భంగమగుననియు తన తండ్రికవమానము జరుగుననియు యజ్ఞస్థానము నుండి దేవతలందరు పారిపోదురనియు మునులు ఋత్విజులు (యజ్ఞము చేయువారు) పర్వతములు పర్వతరాజు అందరు చెల్లాచెదరయ్యెదరని శంకరుని సేనలకు జయము కల్గుననియు తాను మరణించుట, తన భర్త తన విరహబాధతో మనస్సు చెదరి లోకమంతట సంచరించుట కన్నీరు పెట్టి దుఃఖించుట, విష్ణువతనికి బోధచేయుట, తాను మరియొక్క రూపముతో శివుని పొందుట తామిద్దరు కలిసి విహరించుట మొదలగు నన్ని విషయములను చెప్పు సతీదేవి అక్కడి నుండి వెళ్లిపోయెను.

స్వమాత్రా భగినీభిశ్చ ప్రతిషిద్ధా చ దుఃఖితా

బభూవాదర్శనా యోగాత్సర్వాసాం సిద్ధయోగినీ

 గత్వా సా జాహ్నవీ తీరం స్మృతికి సంపూజ్య శంకరం

 స్మృత్వా తచ్చరణాంభోజం దేహం తత్యాజ సుందరీ

గంధమాదన ద్రోణిస్థం శరీరం ప్రవివేశ హ

సంజహార వురో యేన దైత్యానామఖిలం కులం

 హాహా కారం ప్రచక్రుశ్చ సురాన్సర్వేఽతవిస్మితాః

జగ్ముః శంకర సేనాశ్చ దక్షయజ్ఞం వినాశ్య చ

పరాభవం చ సర్వేషాం కృత్వా శోకాతురాః వరా

సత్వరం నర్వవృత్తాంతం కథయామాసురీశ్వరం

శ్రుత్వా ప్రవృత్తిం వంహర్తా సర్వరుద్రగణైర్వృతః

 జగమ స్వర్ణదీతీరం యత్ర దేవీ కలేవరం

తన తల్లియును తోబుట్టువులును పోపలదని వారించినను దుఃఖించుచు యోగసిద్ధిపొందిన సతీదేవి యోగముతో వారందరికి కన్పించకుండ అదృశ్యరాలై గంగాతీరమునకు పోయి శంకరుని ధ్యానించి మనసా పూజించి అతని పాదపద్మములను స్మరించుచు ఆ దేహమును త్యజించి గంధమాదన పర్వతముయొక్క లోయలో నున్న తన శరీరమున ప్రవేశించెను. పూర్వము సర్వదైత్యుల సమూహమును సంహరించిన మూర్తియే ఆది. అప్పుడా సంఘటన చూచి దేవతలందరు అత్యాశ్చర్యముతో హా హా అని పలికిరి.. ఇక శంకర సైన్యములు పోయి దక్షయజ్ఞమును నాశము చేసి సతీదేవి మరణమునకు మిక్కిలి దుఃఖితులై యజ్ఞభూమిలో నున్న అందరికీ పరాభవము (అవమానము) కల్గించిరి. వెంటనే సర్వవృత్తాంతము శివునికి విన్నవించిరి. ఆ వార్త విన్న సంహారకుడైన శంకరుడు తన గణములతో గూడి దేవీ శరీరము పడి ఉన్న గంగానదీ తీరమునకు పోయెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే సతీదేహ త్యాగో నామ ద్విచత్వారింశోఽధ్యాయః

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదములోని సతీదేవి యొక్క దేహత్యాగమనెడి నలుబది రెండవ అధ్యాయము సమాప్తము.