శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :
నూర్యః ప్రణమ్య బ్రహ్మాణం ముదాయుక్తస్తదాజ్ఞయా ।
చకార వినయం ప్రీత్యా తేజస్వీ త్రిగుణాత్మకః ॥
త్రిగుణ స్వరూపుడును తేజస్సు గలవాడు ఐన సూర్యుడు బ్రహ్మకు నమస్కరించి ప్రాణాపద తొలగిన సంతోష ప్రీతులతో వినయమును ప్రకటించెను.
ఆథ వహ్నేరుపాఖ్యానం సావధానం నిశామయ ।
గోపనీయం పురాణేషు కర్ణపీయూష ముత్తమం ॥
త్రైలోక్యం భస్మసాత్కర్తుమేకదాఽగ్నిః సముద్యతః ।
శతతాల ప్రమాణాం తాం శిఖాం కృత్వా భయానకీం ॥
క్షుభితః కుపితశ్చైవ భృగోః శాపస్య కారణాత్ ।
స్వం చ తేజస్వినం మత్వా తుచ్ఛం మత్వాఽన్యమాత్మనః ॥
ఇక అగ్నియొక్క ఉషాఖ్యానమును ఏకాగ్రతతో వినుము. ఇది పురాణములలో రహస్యముగా నుంచదగినది. కర్ణములకు అమృతము వంటిది. (వినుటకింపైనది). ఒకసారి భృగుమహర్షి తనను శపించినందువలన మిక్కిలి క్షోభనొందిన అగ్ని ముల్లోకములను భస్మముగా చేయుటకు పూనుకొనీ - తన కంటే ఇతరులు తుచ్ఛులు తానే గొప్ప తేజస్సు (పరాక్రమము) కలవాడుగా భావించి - తన జ్వాలను భయంకరముగా నూరు తాడిచెట్లంత ఎత్తుగా చేసి మండుచుండెను.
ఏతస్మిన్నంతరే విష్ణురాజగామావలీలయా ।
వహ్నేస్తాం దాహికీం శక్తిం తాం జహార పురః స్థితః ॥
ఇంతలో విష్ణువక్కడికి లీలగా వచ్చి అగ్నియొక్క ఆ దాహకశక్తిని (కాల్చివేయు శక్తిని) ముందు నిలిచి నశింపజేసెను (హరించెను).
మాయయా శిశురూపీ చ తమువాచ జనార్దనః ।
సస్మితో వినయం కృత్వా భక్తినమ్రాత్మ కంధరః ॥
ఆ జనార్దనుడు తన మాయతో చిన్న శిశువై చిరునవ్వుతో భక్తితో తన కంఠమును వంచి వినయమును ప్రకటించెను.
శిశురువాచ - శిశువిట్లనెను:
కథం రుష్టోఽసి భగవన్ భవాన్మాం కారణం వద ।
త్రైలోక్యం భస్మసాత్కర్తుముద్యతోఽసీ నిరర్ధకం ॥
త్వమేవ భృగుణా శష్తో భృగోశ్చ దమసం కురు ।
ఏకాపరాధాత్రైలోక్యం భస్మీకర్తుం న చార్హసి ॥
విశ్వం చ బ్రహ్మణా సృష్టం తస్య పాతా స్వయం పరిః ।
సంహర్తా భగవాన్ రుద్ర ఏవమేవ క్రమో భవేత్ ॥
తత్కధం భస్కసాత్కర్తుమీశ్వరే శంకరే స్థితే ।
రక్షితారం హరిం జీత్వా సంహారం కురు సత్వరం ॥
ఇత్యుక్త్వా బ్రాహ్మణ వటుః శరపత్రం పురః స్థితం ।
అతీశుష్కం కరే ధృత్వా దగ్ధం కర్తుం దదౌ ముదా ॥
ఓ అగ్ని భగవంతుడా! ఎట్లు ఇంతగా కోపించియున్నావు? కారణము చెప్పుము. ముల్లోకములను భస్మముగా చేయుటకు పూనుకుంటివి. ఈ పని వ్యర్ధమైనది. దీని వలన సాధించు ప్రయోజనమేమి లేదు). నీవు భృగువుచేత శపింపబడితివి కదా! ఆ భృగువును అణచివేయుము. ఒక్కని అపరాధమునకు ముల్లోకములను భస్మము చేయదగదు. ఈ విశ్వము బ్రహ్మచేత సృష్టింపబడినది. దీనికీ రక్షించువాడు స్వయముగా విష్ణువు. సంహరించువాడు భగవంతుడైన రుద్రుడు. ఇదియే క్రమము. అది అట్లు సాగవలెను. ప్రభువైన శంకరుడుండగా సృష్టిని నీవు భస్మము చేయుట ఎట్టి క్రమము? ఒకవేళ నీవాపనిని చేయదలచినచో మొదలు దీనిని రక్షించువాడైన హరినీ జయించి త్వరగా సంహారకర్మ చేయుము. ఇట్లు పలికి ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి తన ముందున్న మిక్కిలి ఎండిపోయిన ఒక్క గడ్డిపరకను చేతబట్టుకొని దానిని కాల్చుమని ఇచ్చెను.
దృష్ట్వా శుష్కేంధనోవహ్ని ర్లేలిహానో భయానకః ।
స వవ్రే శిఖయా విప్రం మేఘేన శశినం యథా ॥
న చ దగ్ధం శుష్క పత్రం లోమైకం చ శిశోస్తథా ।
దృష్ట్వా వ్రీడాయుతో వహ్నిర్నిస్తబ్ధో హి శిశోః పురః ॥
కృత్వా వహ్నే ర్దర్పభంగమంతర్ధానం చకార నః ।
వహ్నిః స్వమూర్తిం సంహృత్య స్వస్థానం భీతవద్యయౌ ॥
కాల్చదగిన ఎండిన పదార్ధమును (ఎండిన గడ్డిపరకను) చూచి ఆగ్ని భయంకరుడైనాల్కలు చాచుచు (జ్వాలలను వ్యాపింపజేయుచు) - మేఘములో చంద్రుని కప్పినట్లు తన జ్వాలతో బ్రాహ్మణ బాలుని ఆవరించెను. (చుట్టుముండెను) కాని ఆ ఎండిన గడ్డి పరకను గాని ఆ శిశువు యొక్క శరీరమందలి ఒక్క రోమమును గాని అగ్ని కాల్చలేకపోయెను. అది చూచి అగ్ని సిగ్గుచెంది ఆ శిశువు. ముందర ఏ చేష్టలేక పొరిపోయెను. ఇట్లా బాలుడు (హరి) అగ్నియొక్క దర్పమును భంగము చేసి అంతర్ధానమయ్యెను. అగ్నీ తన ఆకారమును తగ్గించుకొని భయపడిన వానివలె తన స్థానమునకు పోయెను.
ఉక్తో వ హ్నేర్దర్పభంగః పరం వై శ్రోతుమిచ్ఛసి ।
నిత్యనూతనమాఖ్యానం దేవానాం దర్పమోచనం ॥
ఇట్లు అగ్నియొక్క దర్పభంగము చెప్పబడినది. వేరొకటి నిత్యనూతనమైన ఆఖ్యానము (ప్రత్యక్షముగా చూచి చెప్పబడు కథ)ను దేవతల దర్పమును విడిపించిన దానిని వినగోరుచున్నావు కదా!.
శ్రీరాధికోవాచ - రాధాదేవి పలికెను :
శేషాణాం దర్పభంగం చ క్రమేణ కథయ ప్రభో ।
కథా పీయూషధారాం తే శ్రుత్వా తృప్యేత కో భువి ॥
ప్రభూ! మిగిలిన దేవతల యొక్క దర్ప భంగమును కూడ క్రమముగా చెప్పుము. నీవు చెప్పెటి కథయను అమృతధారను విని (త్రావి) ఈ భూమి మీద ఎవడు చాలునని తృప్తిపడును?
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :
రాధికావచనం శ్రుత్వా సస్మితో భగవాన్ ప్రభుః ।
కథాం కథితుమారేభే శ్రుత్వా రమ్యాం పురాతనీం ॥
భగవంతుడును ప్రభువును ఐన శ్రీకృష్ణుడు రాధాదేవి వాక్కు విని మనస్సునానందపరచు పురాతన కథనొక దానిని చెప్పుటకారంభించెను.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే అగ్నిదర్పమోచనం నామ ఏకోనపంచాశత్తమోఽధ్యాయః ॥
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన అగ్నిదర్ప విమోచనమను నలుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 49 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
When the virtuous princess Rukmiṇī of Vidarbha, who was an earthly manifestation of Goddess Lakshmī, heard of Lord Kṛshṇa's infinite glory, she fell deeply in love with Him and sent a secret messenger praying for Him to rescue her from an unwanted forced marriage to the wicked king Shishupāla. On the wedding day, as Rukmiṇī visited the temple of Goddess Durgā, Lord Kṛshṇa intercepted her royal chariot, lifted her into His own chariot before the assembled armies of Jarasandha and Shishupāla, and carried her triumphantly to Dvārakā, where their grand celestial wedding was celebrated with supreme joy.