బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

118 - అధ్యాయము

శ్రీనారాయణ ఉవాచ :

గణేశంబోధయిత్వాతు శంభురభ్యంతరం యయౌ

తత్రసింహాసనేరమ్యే దుర్గాదుర్గతినాశినీ

భైరవీభద్రకాళీచ ఉగ్రచండాచ కోటరీ

తాః సముత్థాయ సహసాప్రణేముః జగదీశ్వరం

తత్రాయణోగణేశశ్చ కార్తికేయశ్చవీర్యవాన్

బాణశ్చవీరభద్రశ్చ స్వయంనందీసునందకః మహాకాలోమహామంత్రీహ్యథాష్ట్రాభైరవాస్తథా

సిద్ధేంద్రాశ్చాపియోగీంద్రా రుద్రాశ్చైకాదశైవతే

ఏతస్మిన్నంతరేతత్ర మణిభద్రః సమాయయా

సింహద్వారే స్వయంద్వారీత మీశ్వరమువాచసః

మణిభద్ర ఉవాచ :

అసంఖ్యానిచ సైన్యాని యాదవానాం మహేశ్వర

బలదేవశ్చ ప్రద్యుమ్నః సాంబశ్చసాత్యకిస్తథా

రాజామహోగ్ర సేనశ్చ భీమశ్చస్వయమర్జునః

అక్రూరశ్చోద్ధవశ్చైవ జయంతః శక్రనందనః

రత్నేంద్రసారనిర్మాణ రథేంద్రో సుమనోహరే !

విధేర్విధాతా భగవాన్ శ్రీకృష్ణ పరమేశ్వరః

సప్తభిః పార్శదైః గో పైః సేవితః శ్వేతచామరైః

కందర్ప కోటిలీలాభో వనమాలావిభూషితః

దధారచక్రమతులం కోటిసూర్యసమప్రభం

గదాంకౌమోదకీం శూలం అవ్యర్థం సన్నిధాయచ

రథమధ్యే మహాశంఖం విశ్వసంహారకారణం

మహారథానాం లక్షైశ్చ రథానాంచత్రికోటిభిః

త్రికోటిభిఃగజేంద్రాణాం మల్లానాంచ త్రికోటిభిః

శతకోటిభిరశ్వానాం చర్మణాం తచ్చతురుడైః

ఖడ్గనాతత్సప్త గుణైః ద్విగుణెస్తద్ధనుష్మతాం

ఏభిఃసార్థంచ త్వరితం ఆయమౌశోణితంపురం

పరితోవేష్టయామాస లంకాం దాశరథీర్యథా

సహస్రతాలమానాంచ జ్వలదగ్నిశిఖోజ్జ్వలాం

ఊర్డ్వేచపరిభాయుక్తాం దుర్లంఘ్యమసురైః సురైః

స్వర్గగంగాంబురాశీనాం సమూ హైఃవృష్టిభిస్తథా

నారాయణుడిట్లా :

గణేశునకు బోధించి శంభువు అభ్యంతరానికి పోయాడు. అక్కడ అందమైన సింహాసనమందు దుర్గతిని నశింపచేసే దుర్గ ఉంది. (1) భైరవీ, భద్రకాళి, ఉగ్రచండ, కోటరి, వారు త్వరగా లేచి జగదీశ్వరునకు నమస్కరించారు. (2) అక్కడికి గణేశుడు, పరాక్రమశాలి కార్తికేయుడు వచ్చారు. బాణుడు, వీరభద్రుడు, స్వయంగా నంది, సునందకులు వచ్చారు. (3) మహాకాలుడు మహామంత్రి, ఎనిమిదిమంది భైరవులు, సిద్ధేంద్రులు, యోగీంద్రులు, పదకొండు మంది రుద్రులు (4) వచ్చారు. ఇంతలో అక్కడికి మణిభద్రుడు వచ్చాడు. సింహద్వారంలో స్వయంగా ద్వారపాలకుడు ఆ ఈశ్వరునితో చెప్పాడు. (5) మణిభద్రుడిట్లా - ఓమహేశ్వర! యాదవుల లెక్కలేనంత సైన్యం బలదేవుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, సాత్యకి (6) ఉగ్రసేన మహారాజు, భీముడు, అర్జునుడు, అక్రూరుడు, ఉద్ధవుడు, జయంతుడు ఇంద్రుని కొడుకు, (7) శ్రేష్ఠరత్నములలో సారముతో నిర్మితమైన రథశ్రేష్ఠమందు మనోహరమైనదానియందు, విధికి విధాతయైన, పరమేశ్వరుడు, భగవాన్ శ్రీకృష్ణుడు (8) ప్రక్కలందుండే ఏడుగురు గోపాలురతో సేవింపబడుతూ, వారు శ్వేతచామరములతో వీస్తుండగా, కోటి మన్మథుల లీలవంటికాంతిగల, వనమాలతో అలంకరింపబడిన, (9) కృష్ణుడు సాటిలేని, కోటిసూర్యులతో సమానమైన కాంతిగల చక్రమును ధరించాడు. గద, కౌమోదకి, వ్యర్థముకాని శూలము దగ్గరుంచుకొని (10) రథమధ్యంలో విశ్వసంహారమునకు కారణమైన మహాశంఖమును ఉంచుకొని, లక్షమంది మహారథులతో, మూడు కోట్లు రథములతో, (11) మూడుకోట్ల గజేంద్రములతో, మూడుకోట్ల మల్లురతో, నూరుకోట్ల గుర్రములతో వానికి నాల్గింతలడాలు కలవారితో(12) వానికి ఏడింతలు ఖడ్గములు కలవారితో, రెండింతలు దానికి ధనుస్సు గలవారితో వీరితో కూడా త్వరగా శోణితపురానికి వచ్చాడు. (13) లంకను దాశరథివలె చుట్టూ చుట్టుముట్టాడు. వేయి తాటిచెట్ల కొలతగల, మండుతున్న అగ్నిజ్వాలవలె ఉజ్జ్వలమైనది. (14) పైన పరిఖతో కూడినది సురలు అసురులు ఎవరితోనూ దాటరానిది, స్వర్గ గంగ నీటి సమూహముల సమూహముతో వర్షముతో కూడినది. (15)

మూII పక్షీంద్రో గరుడః సాక్షాత్ నిర్వాణంచ చకారసః

మణీంద్ర సారనిర్మాణం ప్రాకారాభ్రంలిహంపురం

బభంజలక్షం మల్లానాంబలదేవశ్చలాంగలైః

ఉద్యానానాంత్రీలక్షంచ ప్రాకారోత్పాటనం ప్రభోః I

ప్రవివేశ మహాద్వారం ద్వారపాలాన్నిహత్యచ

ఏవంశ్రుత్వా మహాదేవశ్చోవాచ సురసంపది II

పార్వతీంభద్రకాలీంచ స్కందంగణపతిం తథా

అష్టాచ భైరవాంశ్చైవ రుద్రాంశ్చ వీరభద్రకం

మహాకాలం నందినంచ సర్వాన్ సేనాపతీన్నవ

శ్రీమహాదేవ ఉవాచ :

గోలోకనాథో భగవాన్ చక్రపాణిః సమాగతః

విశ్వాఘంభంక్తు మీశోయః క్షణేన నగరంచ కిం

సర్వోపాయైశ్చ సర్వేతే బాణం రక్షంతు యత్నతః

బాణోగచ్ఛతు సంగ్రామం స్మృత్వాలంబోదరం పరం

బాణస్య దక్షిణేస్కందః పురతశ్చ గణేశ్వరః

వామేచ భైరవారుద్రాః స్వయం నందీమహారథః

మహాకాలోవీరభద్రోయేచాన్యే సైనికాస్తథా

ఊర్డ్వేదుర్గా భద్రకాళీహ్యుగ్రచండాచకోటరీ

బాణం రక్షమహాభాగే దుర్లేదుర్గతి నాశినీ

కృష్ణస్య భవతీశక్తి స్తేన నారాయణీ స్మృతా

విష్ణుమాయే జగన్మాతః సర్వమంగల మంగలే

 అవ్యర్థాచ్చక్రసారాచ్చ రక్షబాణం సుదర్శనాత్

 బాణః ప్రియోమైసర్వేభ్యో గణేశాత్కార్తికాదపి

బాణమూర్థికరందేహి పాదాబ్జరజసాసహ

శివస్యవచనం శ్రుత్వా దుర్గాదుర్గతినాశినీ

ప్రహస్యోవాచ మధురం యాథార్థ్యం సమయోచితం

గరుడుడు పక్షీంద్రుడు సాక్షాత్తుగా నాశనము చేశాడు. మణిశ్రేష్ఠముల (వజ్రములు) సారముతో నిర్మింపబడిన ఆకాశాన్నంటే ప్రాకారములు గల పురమును (16) పగులగొట్టాడు. మల్లులు లక్షమంది, బలదేవుడు తన నాగలితో పగులగొట్టారు. మూడులక్షల ఉద్యానములను, ప్రభువు యొక్క ప్రాకారాన్ని పీకేశారు. (17) ద్వారపాలులను చంపి మహాద్వారంలో ప్రవేశించారు. ఇదంతా విని మహాదేవుడు సురల సభలో ఇట్లా చెప్పాడు. (18) పార్వతి, భద్రకాళి, స్కందుడు, గణపతి, ఎనిమిది మంది భైరవులు, రుద్రులు, వీరభద్రుడు, మహాకాలుడు, నంది, తొమ్మిదిమంది సేనాపతులందరు వీరికి చెప్పాడు. (19) శ్రీమహాదేవుడిట్లా - గోలోకనాథుడైన చక్రపాణి, భగవంతుడు వచ్చాడు. (20) ఆతడు విశ్వముల సమూహాన్ని క్షణకాలంలో నశింప, చేయుటకు సమర్థుడు. ఆతనికి ఈ నగరమెంత. అన్ని విధాలైన ఉపాయాలతో వారంతా ప్రయత్నించి బాణుని రక్షించండి (21) బాణుడు యుద్దానికి పోనీ. పరుడు ఐన లంబోదరుని స్మరించి పోనీ. బాణునికి కుడిపక్క స్కందుడు, ముందు గణేశ్వరుడు (22) ఎడమ భైరవులు రుద్రులు, స్వయంగా మహారథుడైన నంది ఉండని. మహాకాలుడు, వీరభద్రుడు, ఇతర సైనికులు కూడా ఉండని (23) పైన దుర్గ, భద్రకాళి, ఉగ్రచండ, కోటరీలు. ఓ దుర్గతిని నశింపచేసే దుర్గ! మహాభాగిని! బాణుని రక్షించు. (24) నీ శక్తి కృష్ణునిది. అందుకే నిన్ను నారాయణీ అని అన్నారు. ఓ విష్ణుమాయ! జగన్మాత! సర్వమంగళములకు మంగళమైనదాన (25) వ్యర్థముకాని చక్రసారము, సుదర్శనము. దాని నుండి బాణుని రక్షించు. అందరికన్న బాణుడు నాకు ప్రియమైనవాడు, గణేశుని కన్న, కార్తికేయుని కంటే గూడా (26) బాణుని తల పై చేయుంచు, పాదపద్మముల ధూళిని కూడా ఉంచు. శివుని మాటను విని దుర్గతిని నశింపచేసే దుర్గ నవ్వి, యథార్థమైన సమయానికి తగిన మాటను తీయగా ఇట్లా చెప్పింది. (27)

మూ పార్వత్యువాచ :

మణిరత్నాదికంయద్యత్ ముక్తామాణిక్య హీరకం

సర్వస్వంకన్యకా మూషాం రత్నభూషణ భూషితాం

రత్నభూషణ భూషాఢ్యమనిరుద్ధం పరంవరం

పురస్కృత్య దేహిబాణకృష్ణాయ పరమాత్మనే

రాజ్యం కురుష్వ నిర్విఘ్నం కింయుద్ధం ఆత్మనాసహ

యస్మిన్లతేగతాః ప్రాణాః సజీవశ్చంద్రియైస్సహ

శక్తి శ్చాహంమనోబ్రహ్మా స్వయంజ్ఞానాత్మకం శివః

సద్యఃపతతిదేహశ్చ శివంత్యక్త్యా శివోభవేత్

కోవాతిష్ఠతి సంగ్రామే చక్రస్యతేజసా శివ

నాత్మాకాశోబాణయుధేయుద్ధం కంస్వాత్మనాసహ

పరమాత్మాచ సర్వేషాం భక్తానుగ్రహ విగ్రహః

నిత్యః సత్యోహికృష్ణశ్చ పరిపూర్ణతమః ప్రభుః

గణేశఃకార్తికేయశ్చ భవానపితయోః పరః

కింకరేషుప్రియోబాణోనహికృష్ణాత్పరః ప్రియః

వైకుంఠేహం మహాలక్ష్మీః గోలోకే రాధికస్వయం II

శివాహం శివలోకేపి బ్రహ్మలోకే సరస్వతీ

అహంనిహత్య దైత్యాంశ్చ దక్షకన్యాసతీపురా

త్వన్నిందయాత్యక్షదేహాసాచాహం శైలకన్యకా

రక్తబీజస్యయుఢ్చ కాళీచమూర్తిభేదతః

సావిత్రీ వేదమాతా మొహం సీతాజనక కన్యకా !

రుక్మిణీ ద్వారవత్యాంచ భారతేభీష్మ కన్యకా !!

సుదామ్నః శాపతోదైవాత్ వృషభానుసునాధునా

ధర్మపత్నీచ కృష్ణస్య పుణ్యే బృందావనే వనే

భగవంతంచ సర్వజ్ఞంత్వాం శివంచ సనాతనం

కింవాహం కథయామీతి కర్తవ్యం సమయోచితం

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండ ఉత్తరార్ధే నారాయణ నారద సంవాదే బాణయుధేష్టా దశాధికశతతమోధ్యాయః

పార్వతివచన మిట్లా - మణులు, రత్నాదులు, ముత్యములు, మాణిక్యములు, వజ్రములు, ఉన్నదంతా (28) అమ్మాయి యొక్క వస్తువులంతా, కన్యకను ఉషను, రత్నభూషణములతో అలంకరించి, రత్నభూషణముల అలంకారంతో కలదాన్నిగా చేసి పరుడైన అనిరుద్ధుడను వరుని, (29) ముందుంచుకొని, ఓబాణ! పరమాత్మయైన కృష్ణునకు ఇవ్వు. ఏ ఇబ్బందులు లేకుండా రాజ్యం చేయి. ఆత్మతో సహ (నీతో నీవు) యుద్దమేమిటి. (30) ఆతడుపోతే ప్రాణాలు పోతాయి. ఆతడు బ్రతికితే ఇంద్రియములతో సహా జీవిస్తాడు. నేను శక్తిని, బ్రహ్మమనస్సు. శివుడు జ్ఞానాత్మకుడు. (31) శివుని వదిలితే దేహము వెంటనే పడిపోతుంది. వాడుశవమౌతాడు (శివుడౌతాడు). ఓ శివ! చక్రము తేజస్సుముందు యుద్ధంలో ఎవడు నిలబడుతాడు. (32) ఆత్మనిలవదు, ఆకాశము నిలవదు బాణుని యుద్ధంలో యుద్ధము తన ఆత్మతోనా. అందరికి ఆతడు పరమాత్మ. భక్తులను అనుగ్రహించే కొరకు రూపమెత్తినాడు. (33) ఆతడు నిత్యుడు, సత్యము, పరిపూర్ణతముడు, ప్రభువు, కృష్ణుడు. గణేశుడు, కార్తికేయుడు, నీవుకూడా వారికి పరుడవే. (34) కింకరులందరిలో ప్రియమైనవాడు బాణుడు. కృష్ణుని కన్నపరుడైన ప్రియమైన వాడులేడు. నేను వైకుంఠంలో మహాలక్ష్మిని, గోలోకంలో స్వయంగా రాధికను. (35) శివలోకంలో శివను, బ్రహ్మలోకంలో సరస్వతిని నేను దైత్యులను ఇదివరలో చంపాను. ఇదివరలో సతిని, దక్షకన్యను (36) నీనిందతో శరీరం వదిలాను, ఆశైల కన్యకను నేనే. రక్తబీజునితో యుద్ధంలో మూర్తిభేదముతో కాళిని (37) నేను సావిత్రిని, వేదమాతను, సీతను జనకుని కన్యకను. భారతదేశంలో భీష్ముని కూతురును, ద్వారవతిలో రుక్మిణిని (38) దైవం వల్ల సుదాముని శాపంతో ఇప్పుడు వృషభానుని కూతురును, కృష్ణుని ధర్మపత్నిని, పుణ్యమైన బృందావనంలో, (39) భగవంతుడవు, సర్వజ్ఞుడవు, సనాతనుడవు శివుడవైన నీకు నేనేమి చెప్పాలి, అని. సమయోచితంగా చేయాలి (40) అని అన్నది.

అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు బాణయుద్ధమందు నూట పద్దెనిమిదవ అధ్యాయము.