91 - అధ్యాయము

మూ॥ శ్రీభగవానువాచ:

నిషేకేన పరిష్వంగః విభేదస్తేన, వాభవేత్ ।

క్షణేనదర్శనం తేన ని షేకః కేశవార్యతే ॥

గమనాగమనార్థంచా ప్యుద్ధవః కథయిష్యతి ।

ప్రస్తాపయామితం శీఘ్రం విజ్ఞాస్యసి తతఃపితః ॥

యశోదాంరోహిణీంచైవ గోపికాం గోపబాలకాన్ ।

ప్రాణాధికాం రాధికాంతాం గత్వాసంబోధయిష్యతి ॥

ప్రాణాధికాం రాధికాంతాం గత్వాసంబోధయష్యతి ॥

ఏతస్మిన్నంతరేతత్ర వసుదేవశ్చ దేవకీ ।

బలదేవశ్చోద్ధవశ్చ తథాక్రూరశ్చ సత్వరం ॥

వసుదేవ ఉవాచ:

నంద త్వం బలవాన్ జ్ఞానీ సద్బంధుశ్చ సఖామమ ।

త్యజమోహం గృహం గచ్ఛవత్స స్తేయం యధామమ ॥

ద్వారభూతాగోకులాచ్చ మధురానాస్తి బాంధవః ।

మహోత్సవే సదానందే నంద ద్రక్ష్యసి పుత్రకం ॥

 శ్రీదేవక్యువాచ:

యథాయమావయోఃపుత్రఃత ధైవభవతో ధ్రువం ।

సాలసఃకేన, హేనంద శుచాదేహోహిలక్ష్యతే ॥

ఏకాదశాబ్దః సబలః స్థిత్వా తేమందిరే సుఖం ।

కథం స్వల్పదినేనైవశోకగ్రస్తో భవిష్యసి ॥

తిష్ఠపుత్రేణ సార్థంచ మధురాణాంకియద్దినం ।

పూర్ణచంద్రాననం పశ్య జన్మత్వం సఫలంకురు ॥

శ్రీభగవానువాచ:

గచ్చోద్దవసుఖం భద్రం భవిష్యతి తవప్రియం ।

ప్రహర్షం గోకులం గత్వాయశోదాం రోహిణీం ప్రసూం ॥

గోపబాలసమూహంచ రాధికాం గోపికాగణం ।

ప్రభోదయోధ్యాత్మి కేనమద్దత్తేన చశుక్ ఛిదా ॥

నందస్తిష్ఠతు సానందం మన్మాతురాజ్ఞయాశుచా ।

నందస్థితిం మద్వినయం యశోదాం కథయిష్యసి ॥

ఇత్యేవముక్త్వాశ్రీకృష్ణః పిత్రామాత్రాబలేనచ ।

అక్రూరేణ సమంతూర్ణం యయావభ్యం తరంగృహం ॥

ఉద్ధవోరజనీం స్థిత్వా మధురాయాంచనారద ।

ప్రభాతే ప్రయయౌశీఘ్రం రమ్యం వృందావనం వనం ॥

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే ఉత్తరభాగే నారాయణ నారద సంవాదే ఏకనవతితమోఽధ్యాయః ॥

భగవంతుని వచనమిట్లా :

నిషేకంతో పరిష్వంగము, విభేదము దానితోనే. క్షణంలో దర్శనము. అందువల్ల ని షేకాన్ని ఎవరు తప్పిస్తారు. (1) రావటం పోవటం గురించి ఉద్దవుడు చెబుతాడు. ఆతన్ని త్వరగా బయలుదేరదీస్తాను. ఓ తండ్రి! ఆ తరువాత తెలుసుకుంటావు. యశోద , రోహిణి, గోపికలు, గోపబాలురు, ప్రాణాధికురాలైన రాధిక వీరి దగ్గరకు వెళ్ళి వారిని గూర్చి మాట్లాడుతాడు. (3) ఇంతలో అక్కడికి వసుదేవుడు, దేవకి, బలదేవుడు, ఉద్ధవుడు అక్రూరుడు త్వరగా వచ్చారు. (4) వసుదేవుని వచనమిట్లా - ఓ నంద! నీవు బలవంతుడవు,జ్ఞానివి, మంచి బంధువువు. నాకు సఖుడవు. మోహం విడువు ఇంటికి వెళ్ళు. వీడునీకెట్లా కొడుకో, అట్లాగేనాకును (5) గోకులం నుండి మధుర ద్వారమైంది. బాంధవుడు లేడు. ఓ నంద! ఎప్పుడూ ఆనందాన్నిచ్చే మహోత్సవ మందు, కొడుకును చూస్తావు. (6) దేవకి వచనమిట్లా - ఈతడు మాకొడుకైనట్టే, నీకు అట్లాగే కొడుకౌతాడు, నిశ్చయము. ఓనంద! అలసుడవెందుకైనావు. నీ దేహము శుచిగా కన్పిస్తోంది. (7) పదకొండు సంవత్సరాలు, బలరామునితో కూడి నీ ఇంట్లో సుఖంగా ఉండినాడు. కొద్ది రోజులకే శోకగ్రస్తుడవైనా వెందుకు. (8) కొడుకుతో పాటు మధురలో ఎన్నాళ్ళుంటావో ఉండు. పూర్ణచంద్రుని వంటి ముఖంగలవానిని చూస్తూ నీ జన్మను సార్థకపరచుకో. (9) భగవంతుని వచనమిట్లా - ఉద్భవ! సుఖంగా భద్రంగా వెళ్ళు. నీకు మంచి ఔతుంది. గోకులానికి వెళ్ళి యశోదను, తల్లి రోహిణిని చూచి ఆనందించు. (10) గోపబాలుర సమూహాన్ని, రాధికను, గోపికా గణాన్ని శోకాన్ని ఛేదించే నేనిచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉద్బోధించు. (11) నా తల్లి ఆజ్ఞతో శుచిగా ఆనందంతో నందుడుండని. నందుని స్థితిని, నావినయాన్ని యశోదకు చెప్పు. (12) అని పలికి శ్రీకృష్ణుడు తండ్రి, తల్లి, బలరాముడు, అక్రూరుడు వీరితో కలిసి త్వరగా అభ్యంతర గృహానికి వెళ్ళాడు. (13) ఉద్ధవుడు ఆ రాత్రి మధురలో ఉండి, ఓ నారద! తెల్లవారి రమ్యమైన వృందావన వనమునకు త్వరగా వెళ్ళాడు. (14) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరభాగమందు నారాయణ నారద సంవాద మందు తొంబది ఒకటవ అధ్యాయము.