45 - శంకరవివాహము

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు పలికెను :

అథ వేద విధానేన సంస్థావ్య వహ్నిమీశ్వరః ।

యజ్ఞం చకార తత్రోవ వామే సంస్ధాప్య పార్వతీం॥

 నివృత్తే విధివద్యక్షే విప్రాయ దక్షిణాం దదౌ ।

శివః శత నువర్గాని బృందావన వినోదిని ॥

అథ ప్రదీప మానీయ శైలేంద్ర నగరప్రియః ।

నిర్వర్త్య మంగలం కర్మ గృహం సంప్రాప్య దంపతీ।

 కృత్వా జయధ్వనిం ప్రీత్యా శుభ నిర్మంఛనాదికం ॥

సస్మితా సకటాక్షాశ్చ పులకాంచిత విగ్రహాః ।

వానగేహం సంప్రవిశ్య దదృశుః కామినీగణాః ॥

 శంకరం రూపవేషాఢ్యం రత్నభూషణ భూషితం ॥

తరువాత శంకరుడు వేదము విధించిన ప్రకారముగా అగ్నిని స్థాపించి తన వామ పార్వమున పార్వతిని కూర్చుండబెట్టుకొని వివాహాంగ హోమము చేసెను. శాస్త్రీయముగా ఆయజ్ఞకర్మ ముగిసిన పిదప పురోహిత బ్రాహ్మణునికి శివుడు సూరు బంగారు కాసులను దక్షిణగా ఇచ్చెను. ఓ బృందావన విహారము చేత వినోదించు రాధా! పర్వతరాజు యొక్క నగర స్త్రీలు మంగళహారతులు తెచ్చి మంగళ కార్యమును చేయించి (నాకబలీ) దంపతుల నింటిలో ప్రవేశ పెట్టిరి. దృష్టిదోషము పరిహరింపజేయు కర్మతో బాటు ప్రీతిగా జయధ్వనులు చేసి - చిరునవ్వుతో ఓర చూపులతో ఆనంద పారవశ్యమున శరీరములు పులకలెత్తగా స్త్రీగణము పార్వతీపరమేశ్వరులున్న లోపలి గృహమునకేగి రత్నాలంకార భూషితుడు రూపమును బట్టి అలంకారమును బట్టి ఆడ్యుడుగా నున్న శంకరుని దర్శించిరి.

చందనాగురు కస్తూరీ కుంకుమాంచిత విగ్రహం ।

ఈషద్ధాస్య ప్రసన్నాన్యం నకటాక్షం మనోహరం॥

 అపూర్వ సూక్ష్మ వేషాఢ్యం సిందూర బిందుభూషితం ।

చారుచంపక వర్ణాభం నర్వాయవ నుందరం ॥

నవీన యౌవనస్థం చ మునీంద్ర చిత్తమోహ నం ।

ఆ శివుడు చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వుల యొక్క గంధలేపనముతో చక్కని శరీరము గలవాడుగా, చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖముతో, కటాక్ష వీక్షణములతో మనోహరుడుగా, అపూర్వము సూక్ష్మమునగు వేషము గలవాడుగా, సిందూర బిందు తిలకముచేత అలంకృతుడుగా, సుందరమైన చంపక పుష్పము వంటి శరీర వర్ణము గలవాడుగా, సర్వాయవములు సుందరముగా, క్రొత్తగా అడుగుపెట్టిన పడుచుదనము గలవాడై మునీంద్రుల మనస్సులనే మోహింపజేయువాడుగా ఉండెను.

నరస్వతీం చ లక్ష్మీం చ సావిత్రీం జాహ్నవీం రతిం ॥

 అదితిం చ శచీం చైవ లోపాముద్రామరుంధతీం ।

అహల్యాం తులసీం స్వాహాం రోహిణీం చ వసుంధరాం ॥

 శతరూపాం చ సంజ్ఞాం చ సతీ స్త్రీణాం చ షోడశ ।

దేవకన్యో నాగకన్య మునీకన్యా మనోహరాః ॥

యా యాః స్థితాస్తత్ర తాసారి సంఖ్యాం కర్తుం చ కః క్షమః ।

తాభీరత్నాననే దతే తత్రోవాన శీవో ముదా ॥

పరమేశ్వరుడు పరిచారకులు చేర్చిన రత్నాసనము మీద (పార్వతీసమేతుడై కూర్చుండి యుండగా - పదహారుగురు పతివ్రతలు సరస్వతి లక్ష్మీ సావిత్రి జాహ్నవీ (గంగ) రతి అదితి శచి లోపాముద్ర అరుంధతి అహల్య తులసి స్వాహాదేవి (అగ్నిభార్య) రోహిణీ భూదేవి శతరూప (స్వాయంభువ మనువు భార్య) సంజ్ఞాదేవి (సూర్యునీ భార్య) దేవకన్యలు నాగకన్యలు మునీకన్యలు లెక్క పెట్టసాధ్యముగానంతమంది స్త్రీలు అక్కడ చేరి ఆ దంపతులను సేవించుచుండిరి.

తమూచుః క్రమశో దేవ్యః మధురోక్తిం సుధామివ ।

అప్పుడు వరుసగా ఆ దేవీగణము అమృతము వంటి మధురవాక్కులను పరమేశ్వరుని గురించి పలికిరి.

సరస్వత్యువాచ - సరస్వతి అనెను :

ప్రాప్తా సతీ మహాదేవాధునా ప్రాణాధికా ముదా ।

దృష్ట్యా ప్రియాస్యం చంద్రాభం సంతాపం త్యజ కాముక ॥

కాలం గమయ కాలేశ సదా సంశ్లేష పూర్వకం ।

 విశ్లేషిస్తేన భవితో సర్వకాలం మమాశిషా ॥

ఓ మహాదేవా! నీకు ప్రాణములకంటే అధికురాలైన సతీదేవిని పొందితివి. చంద్రుని వంటి కాంతిగల ప్రియురాలి ముఖమును సంతోషముతో చూచి ఇంతవరకున్న సంతాపమును త్యజించుము. ఓ కాముకుడా! కాలనాథా!. ఆమే ఆలింగనముతో కూడి సదా కాలము గడుపుము. నా ఆశీస్సు వలన సర్వకాలమీక ఆమె ఎడబాటు నీకుండదు.

లక్ష్మీరువాచ - లక్ష్మి పలికెను :

లజ్ఞాం విహాయ దేవేశ సతీం కృత్వా స్వవక్షసి।

తిష్ట సంప్రతీ కాలజ్ఞా ప్రాణా యాంతి యయా వినా॥

ఓ దేవేశా! ఏ సతి లేకుండ నీ ప్రాణములు పోవునో అట్టి ఈమెను లబ్ధ విడిచి నీ కౌగిట చేర్చుకొని ఉండుము. ఇప్పుడు సిగ్గెందుకు?

సావిత్ర్యువాచ - సావిత్రీదేవి అనెను :

భోజయిత్వా సతీం శంభో శీఘ్రం భోజయ మా భీదః ।

తదాచమ్య స కర్పూరం తాంబూలం దేహి భక్తితః॥

ఓ శంభూ! ఇక భేదము పొందకుము. సత్పదార్ధమును సతిచేత తినిపించి నీవును త్వరగా భుజింపుము. తరువాత ఆచమనము చేసి ఆదరముగా ఆమెకు కర్పూరముతో కూడిన తాంబూలమునిమ్ము.

జాహ్నవ్యువాచ - జాహ్నవి ఇట్లనెను :

స్వర్ణకంకతికాం ధృత్వా కేశాన్మార్జయ యోషితః ।

కామిన్యాః స్వామి సౌభాగ్యం సుఖం నాతః పరం భవేత్ ॥

బంగారు దువ్వెన తీసికొని నీ భార్యయొక్క తలవెండ్రుకలను దువ్వుము. భర్తను ప్రేమించు స్త్రీకి ఇంతకు మించి స్వామి సౌభాగ్య సుఖమేమియుండును?

రతిరువాచ - రతి (మన్మథుని భార్య) ఇట్లు పలికెను :

గృహీత్వా పార్వతీం దేవ సుభగోమతి దుర్లభాం ।

కథం మమ ప్రాణనాథో నిస్స్వా ర్థో భస్మసార్ కృతః ॥

జీవయసీ విభో కామం కామ వ్యాపారమాత్మని ।

 కురు దూరం చ సంతాపం మన విశ్లేష హేతుకం ॥

దంపతీ విరహాక్షేశం నర్వం జ్ఞాత్వా దయానిధే ।

తథాపి మమ కాంతశ్చ కోపేన. భస్మసాత్ కృతః ॥

ఉత్యుక్త్వా కామ భస్మాథ దదౌ సా గ్రంథి బంధీతం ।

రురోది పురతః శంభోర్నాథ నాథోత్యుదీర్య చ ॥

హరిస్తద్రోదనం శ్రుత్వా కరుణామయ. సొగరః ।

బ్రహ్మాధర్మాది దేవోశ్చ యయుర్వాస గృహం శివం ॥

దేవా! మిక్కిలి దుర్లభురాలును సుందరియునైన పార్వతిని నీవు గ్రహించి - స్వార్ధము లేని నా ప్రాణనాథుని నీవెట్లు భస్మము చేసితివి? ప్రభూ! నీ యందు మన్మథుని అతని వ్యాపారమును {కామము కల్గించుట) జీవింప జేసికొంటివి. వియోగ మూలమైన నా సంతాపమును కూడ దూరమొనర్చుము. ఓ దయానిధీ! దంపతుల యొక్క వియోగ బాధ ఎట్టిదో అదంతయు తెలిసికూడ నా ప్రియుని కోపించి భస్మము చేసితివి. ఇట్లు పలికి ఆమె ముడిలో బంధించి యుంచిన మన్మథుని భస్మమును శంకరుని ముందుంచి నాథా నాథా! అని పలుకుచు బిగ్గరగా రోదించెను. దయాసముద్రుడైన శ్రీహరి ఆ రోదన ధ్వనివిని నూతన దంపతుల నివాసగృహములోని శివుని వద్దకేగెను. బ్రహ్మయు ధర్మాది దేవతలును అక్కడికి వచ్చిరి.

దృష్ట్యా నారాయణం ధర్మం బ్రహ్మాణం చ నురానవీ ।

 జవేన పీఠాదుళాయ స్వాజ్ఞాం కుర్వీత్యువాచ హ ॥

శంకరస్య వచః శ్రుత్వా తమువాచ హరిః స్వయం ।

కామం జీవయ హే రుద్రేశ్యుక్త్వా శీఘం జగామ సః॥

ఊచుర్దేవ్యో బహతరం వాక్యం వినయపూర్వకం।

(కృపా దృష్యా శూలభృతే) భస్మతో విర్గతః స్మరః॥

శంకరుడు నారాయణుని బ్రహ్మను ధర్మాది దేవతలను చూచి వేగముగా పీఠము మీది నుండి లేచి “మీ ఆజ్ఞ ఏదియో సెలవీయండి” అని పలికెను. అతని మాట విని హరి “ఓ రుద్రా! కాముని బ్రతికించుము” అని పలికి బయటికి పోయెను. అక్కడ కొలువుదీరియున్న దేవీ గణము (సరస్వతి మొదలైనవారు) వినయపూర్వకముగా అనేక విధములుగా అదే ప్రార్థన చేసిరి. అప్పుడు శంకరుని యొక్క కృపా దృష్టితో భస్మము నుండి మన్మథుడు బయటకు వచ్చెను.

దృష్వా కామం రశిస్తం చ ప్రణనాను మహేశ్వరం ।

తద్రూపం చ తదాకారం సస్మితం సధనుఃశరం॥

ప్రణమ్య శంకరం కామః స్తుతిం కృత్వా యథాగమం ।

 బహిర్గత్వా హరిం దేవాన్ ప్రణమ్య సమువాచ హ ॥

కామం సంభాష్య దేవాశ్చ యయుజుశ్చ తమాషం।

 కాలే రక్షా వినాశశ్చ ని షేధ కేన వార్యతే ॥

అదే పూర్వ సౌందర్యముతో ఆకారముతో చిరునవ్వుతో ధనుర్బాణములతో నున్న కాముని చూచి రతి మహేశ్వరునికి నమస్కరించెను. మన్మథుడు ఆగము ప్రకారము. శంకరునికి నమస్కరించి స్తుతి చేసి బయటికి వెళ్లి హరికి దేవతలకు నమస్కరించి పలుకరించెను. దేవతలు మన్మథునితో మాట్లాడి ఆశీర్వదించిరి. ఒకప్పుడు వినాశము కల్గించుట మరొక కాలములో రక్షించుట, నిషేధించుట అన్నది గొప్ప వారి వలన జరుగుచుండును. దానిని నివారించుట ఎవనికి సాధ్యము?

అథ శైలః సురాస్ నర్వాన్ నారాయణ పురోగమాస్ ।

భోజయామాస భక్త్యా చ శాయయామాస యత్నతః ॥

 అథ శంభుర్వాసగృహే వామే సంస్థాప్య పార్వతీం ।

మిషాన్నం భోజయామాస తయా సహ ముదాన్వితః॥

భుక్తవంతం శివం తత్ర దేవమాతాఖీదితిః స్వయం ।

 ఉవాచ సస్మితం రాధే సంప్రీత్యా సరసం వచ ॥

ఆ తర్వాత హిమవంతుడు నారాయణుడు మొదలగు దేవతాదులనందరిని భుజింపజేసి భక్తి ప్రయత్నములతో విశ్రమింపజేసెను. శంకరుడు తన నివాస గృహములో పార్వతిని వామపార్శ్వమున ఉంచుకొని ఆమెతో కలిసి భుజించెను. భుజించిన తరువాత దేవతల - తల్లియగు అదితి చిరునవ్వుతో సరసమైన మాట ఇట్లు పలికెను.

అదితి రువాచ - ఆదితి పలికెను :

భోజనాంతే శచి శంభోః శౌచార్థం జలమర్భయ।

 దేహి శీఘ్రం మమ ప్రీత్యా దంపత్యోః ప్రీతిపూర్వకం ॥

ఓ శచీదేవీ! భోజనము తరువాత నా ప్రీతిననుసరించి శంకరునికి ముఖము హస్తము పాదముల శుద్ధి కొరకు దంపతులిద్దరికి ప్రీతిపూర్వకముగా జలము పోయుము. శచ్యువాచ - శచీదేవి ఇట్లనెను :

కృత్వా విలాపం యథేతోః శవం కృత్వా స్వవక్షసి।

యో బభ్రాము భువం మోహాత్కాలేన ప్రావ తాం సతీం ॥

ఏ కారణము వలన మోహము పొంది (అజ్ఞానము) మీక్కిలి ఏడ్చి తన వక్షఃస్థలమున శవమును పెట్టుకొని భూమియంతట తిరిగెనో అట్టి శంకరుడు కాలముననుసరించి తిరిగి ఆమెను పొందినాడు.

అరుంధత్యువాచ - అరుంధతి పలికెను :

 మయా దత్తా సతీ తుభ్యం మేనా దాతుమనీప్సితా ।

 వివిధం బోధయిత్వేమాం రతిం చ కర్తుమర్హసి॥

నీకీకన్యనిచ్చుటకు మేనాదేవి ఇష్టపడలేదు. ఆమెకనేక విషయములు బోధించి నీకీ పార్వతినిచ్చితిని. నీవీమెతో సుఖమనుభవించుట తగును.

అహల్యోవాచ - అహల్య వలికెను :

వృద్ధావస్థాం పరిత్యజ్య హ్యత్వ తరు ణో ధునా ।

తేన మేనా తు మేనే త్వాం సుతావుర్చీతుమీశ్వర॥

ఓ పరమేశ్వరా! సనాతనుడవైన నీవు నీ వృద్ధ దశను వదిలి ఇప్పుడు మిక్కిలి తరుణుడవు (పడచువాడవు) గా నుంటివి. ఆకారణము చేత మేన నీకు తన కూతురునిచ్చుటకిష్టపడినది.

తులస్యువాచ - తులసి పలికెను :

సతీ త్వయా పరిత్యక్తా కామో దగ్దః పురాకృతః ।

 కథం తదా వసిష్ఠశ్చ ప్రభో ప్రస్థాపితో ధునా॥

పూర్వము నీచే సతి త్యజింపబడెను. మన్మథుడు దహింపబడెను. ప్రభూ! ఇప్పుడు వసిష్ఠునేందుకు పర్వతుని వద్దకు పంపితివీ?

స్వాహోవాచ - స్వాహాదేవి పలికెను :

స్థిరో భవ మహాదేవి స్త్రీణాం వచసి సాంప్రతం ।

వివా హే వ్యవహారే స్త్రీ పురః స్త్రీణాం ప్రగల్భతా ॥

ఓ మహాదేవా! ఇప్పుడు స్త్రీల మాటయందు స్థిరమైన పొడవు కమ్ము. వివాహమునకు వ్యవహారమునకు ముందు స్త్రీలలో మాటకారి తనముండును. (వ్యవహార ప్రసంగములో స్త్రీలు నేర్పరులు).

రోహిణ్యువాచ - రోహిణి (చంద్రుని భార్య) పలికెను :

కామం పూరయ పార్వత్యాః కామశాస్త్ర విశారద ।

కురు పారం స్వయం కామీ కామినాం కామ సాగరం ॥

కామశాస్త్రమందు నేర్పుగలపోడా! పార్వతి యొక్క కోరికను నిండుగా నెరవేర్చుము. స్వయముగా నీవు కోరిక కలవాడవే. కాముకులను కామ సముద్రము నుండి ఒడ్డునకు చేర్చుము.

వసుంధరోవాచ - భూదేవి పలికెను :

భోగద్రవ్యం వినా భోగీ న హి తుష్టః క్షుధాతురః ।

 యేన తుష్టిర్భవేచ్ఛంభో తత్కర్తుముచితం స్త్రియాః ॥

ఓ శంభూ! అకలి గొన్నవాడు, భోగాపేక్ష కలవాడు భోగపదార్ధము లేకుండ తృప్తిపొందజాలడు. ఏ ద్రవ్యముచేత (భోగపదార్థము చేత) సంతుష్టీకలుగునో దానిని స్త్రీ ఆచరించవలెను (పురుషుడు స్త్రీకి కూడ అట్టిది సమకూర్చవలెననియు భావము).

 సంజ్ఞోవాచ - సంజ్ఞాదేవి అనెను :

జానాసి భావం సర్వజ్ఞ కామార్తానాం చ యోషితాం ।

న చ స్వస్వామినం శంభో సతీ జానాతీ నంగతం ॥

ఓ సర్వజ్ఞుడా! కామార్తలైన స్త్రీల భావము నీకు తెలియును. తన వద్దకు చేరిన తన భర్త యొక్క భావము స్త్రీ ఎరుగజాలదు.

శతరూపోవాచ - శతరూపాదేవి పలికెను :

తూర్ణం ప్రస్థావయ ప్రీత్యా పార్వత్యా సహ శంకరం ।

రత్నప్రదీపం తాంబూలం తల్పం నిర్మాయ నిర్జనే ॥

ఏకాంత ప్రదేశములో రత్నదీపము తాంబూలము శయ్యను ఏర్పాటు చేసి ప్రేమతో త్వరగా పార్వతీ శంకరులనక్కడికి పంపుడు.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు (రాధతో) పలికెను :

స్త్రీణాం తద్వచనం శ్రుత్వా తా ఉవాచ శివః స్వయం ।

నిర్వికారీ చ భగవాన్ యోగీంద్రాణాం గురోర్గురుః॥

స్త్రీల యొక్క అట్టి మాటలు విని ఎట్టి వికారము పొందనివాడును యోగీంద్రులకు పరమగురువును భగవంతుడును ఐన శివుడిట్లనెను.

శంకర ఉవాచ - శంకరుడనెను :

దేవ్యో మా వదతోక్తిం చ హ్యేవం భూతం మమాంతికే।

 జగతాం మాతరః సాధ్యః పుత్రే చపలతా కథం॥

దేవులారా! నా వద్దనిటువంటి వచనములను పలుకవద్దు. మీరు జగములకు తల్లులు. సాధ్వీమణులు. కుమారుని యందు ఇటువంటి చాపల్యమెందుకు ప్రకటింతురు.

శంకరస్య వచః శ్రుత్వా లజ్జీతాః సుర యోషితః ।

 బభూవు సంభ్రమాత్తూష్టిం చిత్రపుత్తలీకా యథా ॥

శివుని మాటవిని సిగ్గుపడిన దేవతాస్త్రీలు ఆశ్చర్యముతో వర్ణ చిత్రములోని బొమ్మల వలె మాటాడకుండ మౌనము పూరి.

భుక్త్వా మిషాని భగవానాచమ్య చ ముదా న్వితః ।

సకర్పూరం చ తాంబూలం బుభుజే భార్యయా నహ॥

రత్నసింహాసనే శంభుర్మేనాదత్తే మనోహరే ।

 సన్నిధాయ ముదా యుక్తో దదర్శ వాసమందిరం ॥

రత్నప్రదీవ శతరైర్జ్వలద్భిర్జ్వలితం శ్రీయా। రత్నపాత్ర ఘటాకీర్ణం ముక్తి మాణిక్య భూషితం ॥

రత్న దర్పణ శోభాడ్యం మండితం శ్వేత చామరై: ।

 చందనాగురు సంయుక్తం పుష్పశయ్యా సమన్వితం ॥

 నానా చిత్ర విచిత్రాడ్యం నిర్మితం విశ్వకర్మణా ।

రత్న సారేణ ఖచితం రచితం హీరకైర్వరై ॥

 కుత్రచిత్సుర నిర్మాణం వైకుంఠ సుమనోహరం ।

 బృందావనం కుంజవనం కుత్రచిద్రాసమండలం ॥

కైలాసం చ కుత్రచన కుత్రచిచీంద్రమందిరం ।

 దృష్ట్వాశ్పర్యం మహాదేవః పరితుష్టో బభూవ హ॥

రుచిగల భోజనమును భుజించిన శివుడాచమనము చేసి భార్యతో కలిసి కర్పూర తాంబూలమును స్వీకరించెను. మేనాదేవి సమకూర్చిన అందమైన రత్న సింహాసనము మీద కూర్చుండి తన విడిదిల్లును (వాస గృహము) చూచెను. వందల రత్నదీపముల కాంతితో ప్రకాశించుచు ఆ భవనము శోభావైభవము కలదై ఉండెను. రత్నపాత్రలతో రత్నకుంభములతో నిండి ముత్యాలు పగడాలతో అలంకరింపబడిన నానావిధ వర్ణచిత్రములు కలదై - శ్రేష్ఠమైన వజ్రములతో నిర్మింపబడి వాటి నడుమ రత్నములు పొదుగబడి ఆ భవనము దాని పరిసరములు ఒకచోట బృందావనము ఇంకొకచోట కుంజవనము మరియొక చోట రాసమండలము ఒకవైపున కైలాసము మరొక వైపున స్వర్గము - ఇట్లు బహా విశేషములతో ఆశ్చర్యకరమైన దానిని చూచి మహాదేవుడు మిక్కిలి సంతోషము పొందెను.

అథ ప్రభాత కాలశ్చ బభూవ ప్రాణవల్లభే ।

నానాప్రకార వాద్యాని వాదనాం చక్రియే జనాః॥

నురాః సర్వే సముత్తను నజీభూతా సంసభ్రమాః ।

స్వవాహనాన్ సమారుహ్య కైలాసం గంతుముద్యతాః ॥

 వాసగేహం సమాసాద్య ధర్మో నారాయణాజ్ఞయా ।

 ఉవాచ శంకరం యోగీ యోగీశం సమయోచితం ॥

ఓ ప్రాణప్రియరాధికా! అంతలో తెల్లవారెను. జనులు నానావిధ వాద్యములను మ్రోగించరీ. దేవతలందరు లేచి సంభ్రమముతో అలంకరించుకొని తమ తమ వాహనము లెక్కి కైలాసమునకేగుటకు సిద్ధపడిరి. సారాయణుని ఆజ్ఞననుసరించి ధర్ముడు శివుని వాసగృహములోనికి పోయి యోగీశ్వరుడైన శివునితో సమయోచితముగా పలికెను.

ధర్మ ఉవాచ - ధర్మడిట్లనెను :

ఉత్తిష్ణోత్తిష్ఠ భద్రం తే భవతు ప్రమధాధిప ।

పార్వత్యా సహ మా హేండ్లే యాత్రాం కురు హరిం స్మరన్॥

ఇత్తం ధర్మవచః శ్రుత్వా పార్వత్యా సహ శంకరః ।

 యాత్రాం చకార మా హేంద్రో బృందావన వినోదిని ॥

 యాత్రాం కుర్వతీ దేవేశే పార్వత్యా సహ శంకరే ।

ఉచ్ఛైరుదిత్వా సా మేనా తమువాచ కృపానిధిం॥

“ఓ ప్రమథగణనాథా! మేల్కొనుము. నీకు మంగళమగుగాక. హరిని స్మరించుచు పార్వతితో కలిసి మహేంద్ర గిరికి యాత్ర చేయుము” అన్న ధర్మదేవుని వాక్యము విని శంకరుడు పార్వతితో ప్రయాణము చేయుచుండగా మేనాదేవి పెద్దగా దుఃఖించి ఆ దయానిధీతో ఇట్లు పలికెను.

మేనోవాచ - మేనాదేవి పలికెను :

కృపానిధే కృపాం కృత్వాం మద్వత్సాం పాలయిష్యసి ।

సహస్ర దోషాన్ భగవానాశుతోషః క్షమిష్యసి ॥

 త్వత్పాదాంబుజభక్తైషా మద్వతా జన్మజన్మనీ ।

 స్వప్నే జ్ఞానే స్మృతిర్నాస్తి మహాదేవ ప్రభుం వినా ॥

త్వద్భక్తి శ్రుతిమాత్రేణ హరాశ్రు వులకాన్వితా ।

త్వన్నిందయా భవేన్మౌనా మృత్యుంజయ మృతో ఇవ ॥

 ఇత్యుక్త్వా మేనకా శీఘం తత్రాగత్య హిమాలయం ।

ఉచ్చై రురోద చ తదా వత్సాం కృత్వా స్వవక్షసి॥

క్వ యాసి వత్సేత్యుచ్చార్య శూన్యం కృత్వా హిమాలయం।

స్మారం స్మారం త్వద్గుణామం విదార్య మన్మసః స్ఫుటం ॥

 ఇత్యేవముక్త్యా శైలేంద్రః సమర్స్య చ శివాం శివే ।

నశైలః సహ పుత్రశ్చ రురోడోచైర్ముహుర్ముహుః ॥

నారాయణశ్చ భగవానాధ్యాత్మ విద్యయా స్వయం ।

సర్వాన్ ప్రబోధయామాస కృపయా స కృపానిధిః॥

ఓ దయానిధీ! దయతో నాబిడ్డను పరిపాలించుము. భగవంతుడవగు నీవు శీఘ్రముగా సంతోషపడువాడవు కనుక సహస్ర దోషములను క్షమించుము, నా బిడ్డ జన్మ జన్మల నుండి నీ పాదపద్మ భక్తురాలు. ఈమెకు కలలో గాని మెలకువలో గానీ ప్రభువైన మహాదేవుని (నిన్ను) తప్ప ఇతరము పై తలంపులేదు. నీ భక్తిని గూర్చి విసగనే ఆనందాశ్రువులు పులకరింత కలుగును. ఓ మృత్యుంజయా! నీ నింద విన్నచో మరణించిన దానివలె మౌనముగా ఉండును. ఇట్లు మేనక పలికెను. వెంటనే హిమవంతుడక్కడికి వచ్చి బిడ్డను కౌగిలించుకొని పెద్దగా రోదించెను. “ఈ హిమాలయమును శూన్యముగా చేసి ఎక్కడికేగుచున్నావు బిడ్డా! నీ సద్గుణములను తలచుకొన్న నా గుండె పగిలిపోవును” ఇట్లు పలుకుచు పర్వతుడు ఆ శివను శివుని కర్చించి కొడుకులతో బాటు మాటిమాటికి రోదించెను. అప్పుడు దయాళువు, భగవంతుడును ఐన నారాయణుడు అందరికి అధ్యాత్మ విద్యను బోధించి (దుఃఖము తగ్గుటకు) దయచూపెను.

ననామ పార్వతీ భక్త్యామాతరం పితరం గురుం ।

మాయయా మహామాయా రురోడోచైర్ముహుర్ముహః ॥

పార్వతీ రోదనేనైవ రురుదు సర్వ యోషితః ।

మునయశ్చ సురా సర్వే సస్త్రీకాః సగణం ధ్రువం ॥

శీఘ్రం యయుస్తే కైలాసం దేవా మానన శాయినః ।

ముహూర్తార్ధేన ముదితాః నంప్రావుః శంకరాలయం॥

పార్వతీదేవి భక్తితో తల్లిదండ్రులకు గురువునకు నమస్కరించి - ఆ మహామాయ మాయాశక్తి వలన మరల మరల పెద్దగా రోదించెను. ఆమె రోదనము వలన అక్కడి స్త్రీలందరు రోదించిరి. మునులు దేవతలు తమ భార్యలతో గణములతో పాటు మానససర స్తీరమున విశ్రమించెడి పరమేశ్వరుని యొక్క కైలాసమునకు ప్రయాణమై ఒక ముహర్తార్తము యొక్క అర్థకాలములోనే శంకరాలయమును సంతసముతో చేరిరి.

దృష్ట్వాగతం దేవపత్యో మునిపత్యశ్చ సత్వరం।

ఆయయుర్దీపననీయ ముదా మంగల కర్మణి॥

వాయుపత్నీ కుటేరస్య కామీనీ శక్రకామినీ ।

తారా సురగురోః పత్నీ పత్నీ దుర్వాసనస్తథా ॥

అత్రిభార్యానసూయా చ చంద్ర పత్యస్తథైవ చ ।

 దేవకన్యా నాగకన్యా మునికస్యాః సహస్రశః ॥

ఆనంఖ్యకామినీ సంఘః సంఖ్యాం కర్తుం చ కః క్షమః ।

తాశ్చ ప్రవేశయామాసుర్దంపతి వాసమందిరం ॥

వచ్చిన వారిని చూచి దేవపత్నులు మునిపత్నులు వేగముగా దీపహారతిని ఆ వధూప్రవేశ శుభకార్యమందు వేడుకగా వధూవరులకిచ్చిరి. వాయుదేవుని భార్య కుబేరుని భార్య ఇంద్రుని భార్య బృహస్పతి భార్యయగు తారాదేవి దుర్వాసముని భార్య అత్రిమునిభార్యయైన అనసూయాదేవి చంద్రుని భార్యలు దేవనాగమునికన్యలు వేనకువేలు లెక్కకు మించిన స్త్రీలు - వారినీ లెక్కింపనెవరు చాలుదురు అట్టి స్త్రీలందరాకల్యాణ, దంపతులైన పార్వతీ పరమేశ్వరులను నివాస గృహములో ప్రవేశ పెట్టిరి.

రత్నసింహాసనే రమ్యే వాసయామాసురీశ్వరీం ।

సతీం తాం దర్శయామాస శివః పూర్వాలయం ముదా ॥

నతి స్మరన్యతో గేహాద్యఛతా తాత మందిరం।

అధునా శైలకన్యా త్వం తత్ర దక్షసుతో పురా ॥

జాతిస్మరాం స్మారయామి నిత్యం స్మరసి చేద్వద।

శంకరస్య వచః శ్రుత్వా సర్మీతోవాచ సా సతీ ॥

సర్వం స్మరామి ప్రాణేశ మౌనిభూతో భవేతి తం ।

వారందరు ఆ యీశ్వరిని సుందరమైన రత్న సింహాసనము ఫై కూర్చుండబెట్టిరి, శివుడుల్లాసముతో పూర్వము తాము నివసించిన భవనము చూపించి “సతీ! జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నావా! నీవు పూర్వమే గృహమునుండి తండ్రి యింటికి పోయి యుంటివో. - ఇది అదే. ఇప్పుడు నీవు శైలకన్యవు కాని పూర్వము దక్షుని కూతురవు. పూర్వజన్మ జ్ఞానము. కలదానవగు నీకు జ్ఞప్తికి తెచ్చుచుంటిని. అది స్మరింతువో చెప్పుము” అన్న శంకరుని వాక్కు విని ఆ సతి చిరునవ్వుతో “ప్రాణేశా! అన్ని విషయములను స్మరించుచున్నాను. నీవు మౌనముగా నుండుము” అనెను.

శివః సంభృత సంభారో నానావస్తు మనోహరం॥

భోజయామాన దేవాంశ్చ నారాయణ పురోగమాన్ ।

భుక్త్యా దేవాః ప్రజగ్ముస్తే నానారత్న విభూషితాః॥

సస్త్రీకా సగణాః సర్వే ప్రణమ్య చంద్రశేఖరం ।

నారాయణం చ బ్రహ్మాణం ననావు శంకరః స్వయం ॥

తౌ చ తం చ సమాగ్లిష్యాశేషంకృత్వా ప్రజగ్మతుః।

శివుడు మనోహరమైన నానావిధ పదార్ధములను సమకూర్చి నారాయణుడు మొదలగు సర్వదేవతలను భుజింపజేసెను. దేవతలందరు తమ తమ భార్యలతో గణములతో బాటు భుజించి నానావిధ రత్నముల చేత అలంకరింపబడినవారై చంద్రశేఖరునకు నమస్కరించి వెళ్లిపోయిరి. శంకరుడు నారాయణునకు బ్రహ్మకు నమస్కరించెను. వారతనిని కౌగిలించుకొని ఆశీర్వదించి వెళ్లిపోయిరి.

అథ శైలశ్చ మే వా చ మైనాకమాజుహావ హ॥

శీఘ్రమానయ భద్రం తే పార్వతీం శంకరం సుత।

తయోః సవచనం శ్రుత్వో శీఘ్రం గత్వా శివాలయం ॥

ఆజగామ సమానీయ పార్వతీ పరమేశ్వరా ।

పార్వత్యాగమనం శ్రుత్వా బాలాశ్చ బాలికా స్తథా ॥

వృద్దా యువత్యో యాయాశ్చ శైలాశ దుద్రుపుర్ముదా ।

 మేనా సుభ్యాం వధ్వా చ సహదుద్రావ సస్మితో ॥

హిమాలయశ్చ ముదితో దుద్రోపోనుప్రజన్ సుతాం ।

అవరుహ్య రథాద్దేవీ మాతరం పీతరం గురుం ॥

ప్రణనామ ప్రముదితా నిమగ్నానంద సాగరే ।

పిదప మేనాహిమవంతులు మైనాకుని పిలిచి “కుమారా! పార్వతీ శంకరులను త్వరగా వెంటబెట్టుకొని రమ్ము. నీకు మంగళమగుగాక” అనిరి. ఆ దంపతుల మాట విని అతడు త్వరగా కైలాసమునకు పోయి పార్వతీ పరమేశ్వరులను తోడ్కొని వచ్చెను. పార్వతి భర్త గృహము నుండి వచ్చినదన్న వార్త విని బాలురు బాలికలు యు చేతులు వృద్ధ స్త్రీలు ఆయా పర్వత రూపిణులు వేడుకతో పరుగెత్తి వచ్చిరి. మేనాదేవి కూడ ఇద్దరు కొడుకులతో కోడలితో బాటు నవ్వుచు పరుగెత్తి వచ్చాను. హిమవంతుడు కూడ సంతోషించి బిడ్డ వద్దకు వారిననుసరించి పరిగెత్తాను. రథము నుండి పార్వతీదేవి దిగి తలిదండ్రులకు గురువుకు మిక్కిలి సంతసముతో నమస్కరించి ఆనంద సముద్రములో మునిగెను.

పార్వతీం చ సమశ్లిష్య మేనకా హర్ష విహ్వలా॥

 హిమాలయశ్చ ముదితో గతాః ప్రాణా ఇవాగతాః ।

 సుతాం విధాయ గేహే స్వే రత్న సింహాసనం దదౌ॥

శూలకృతే గణేభ్యశ్చ మధుపర్కాదీకం ముదా ।

తస్ధా శ్వశుర గే హే చ సగణశ్చంద్రశేఖరః॥

నిత్యం షోడశోప చారై పూజితః సహ భార్యయా ।

ఇత్యేవం కథితం రాధే శంకరోద్వాహ మంగలం ॥

 శోకఘ్నం హర్ష జనకం కిం భూయః శ్రోతుమిచ్ఛసి ॥

సంతోషముతో మనస్సు పట్టజాలక మేనాదేవి కూతురును కౌగిలించుకొనెను. హిమవంతుడు పోయిన ప్రాణములు తిరిగి వచ్చినట్లు సంతోషించెను. బిడ్డనింటీలో చేర్చుకొనీ గణములతో కూడియున్న శూలపాణికి రత్నపీఠము మధుపర్కాదులు సమర్పించెను. ప్రతిదినము షోడశోపచారముల చేత పూజింపబడుచు భార్యతో గణములతో గూడి చంద్రశేఖరుడు మామగారింట నివసించెను. రాధా! ఈ విధముగా శంకరుని యొక్క వివాహ మంగళ వృత్తాంతము నీకు చెప్పితిని. ఇది వినువారికి శోకములను హరింపజేసి హర్షమును కలిగించును. ఇంక ఏమి వినగోరుచున్నావు? అనెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవ ర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే నారాయణ నారదసంవాదే. శంకర విషాహో. నామ పంచచత్వారింశోధ్యాయః॥

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన శంకర వివాహమను పేరు గల నలుబది ఐదవ అధ్యాయము సమాప్తము.