97 - అధ్యాయము

శ్రీనారాయణ ఉవాచ :

గచ్ఛంతముద్ధవందృష్ట్వా సంత్రస్తా శ్రీహరేః ప్రియా ।

సముత్థాయాసనాచ్ఛీఘ్రం హృదయేన విదూయతా ॥

 గోపీభిః సహితా శీఘ్రం సముద్విగ్నా మహాసతీ ।

దదౌశుభాశిషం తస్మై తస్యమూర్ద్ని కరం తథా ॥

స్నిగ్ధ దూర్వాక్షతం శుక్ల ధాన్యం పుష్పంచ మంగళం ।

 ప్రేరయామాస లాజాంశ్చ ఫలం పర్ణం తథాదధి ॥

దర్పణం దర్శయామాస పూర్ణకుంభం సపల్లవం ।

సఫలంగంధ సింధూర కస్తూరీ చందనాన్వితం ॥

పుష్పమాల్యం ప్రదీపంచ రక్తగంధం ద్విజోత్తమ ।

 పతీపుత్రవతీ సాధ్వీ కాంచనం రజతం తథా ॥

తమువాచ మహాసాధ్వీహితం సత్యంచ మంగలం ।

సంగోప్యసాశ్రు నేత్రంచ పతితం దుఃఖితాహృది ॥

 శుభం భవతు మార్గస్తే కల్యాణమస్తు సంతతం ।

జ్ఞానంలభ హరేః స్థానాత్ కృష్ణస్య సుప్రియోభవ ॥

కృష్ణభక్తి: కృష్ణదాస్యం వరేషుచ వరం వరం ।

శ్రేష్టా పంచవిధముక్తేః హరిభక్తి: గరీయసీ ॥

 బ్రహ్మత్వాదపి దేవత్వాత్ ఇంద్రత్వాదమరాదపి ।

అమృతాత్సిద్ధిలాభాచ్చ హరిదాస్యం సుదుర్లభం ॥

అనేక జన్మతపసా సంభూయ భారతేద్విజః ।

హరిభక్తి ర్యదిలభేత్తస్య జన్మ సుదుర్లభం ॥

సఫలం జీవనంతస్య కుర్వంతఃకర్మణః క్షయం ।

పితృణాంచ సహస్రాణి స్వస్యమాతుశ్చ నిశ్చితం ॥

మాతామహానాం పూసాంచ శతానాంసోదరస్యచ ।

బాంధవస్యాపి పత్న్యాశ్చ గురూణాంశిష్యభృత్యయోః ॥

తత్కర్మశోభనం వత్స యచ్చకృష్ణే సమర్పణం ।

తత్కర్మ శోభనం శుద్దం కృష్ణ సంతోషణం యతః ॥

సంకల్ప సాధనం కర్మ సప్రీతివిధిపూర్వకం ।

తదేవ మంగలం ధన్యం పరిణామ సుఖావహం ॥

తద్ర్వతం తత్తపః సత్యం తద్భక్తి: పూజనం తథా ।

తదుద్దేశ్య మనశనం కేవలం దాస్య కారణం ॥

సమస్త పృథివీదానం ప్రాధక్షిణ్యం భువస్తథా ।

సమస్త తీర్థస్నానంచ సమస్తంచ వ్రతం తపః ॥

అను!! శ్రీనారాయణుని వచన మిట్లా –

వెళ్ళిపోతున్న ఉద్దవుని చూచి' శ్రీహరి ప్రియురాలు భయపడింది. మనసులో బాధపడుతూ ఆసనం నుండి త్వరగా లేచింది. (1) ఉద్వేగం చెంది ఆమహాసతి గోపికలతో కూడి త్వరగా ఆతని తల పై చేతిని ఉంచి ఆతనికి శుభాశీస్సులను ఇచ్చింది, (2) నిగనిగలాడే గరికను అక్షతలను తెల్లని ధాన్యాన్ని, శుభకరమైన పుష్పాన్ని ఇచ్చింది. పండు, ఆకు, పెరుగు ఇచ్చింది. పేలాలు చల్లింది (3) అద్దాన్ని చూపింది. చిగుళ్ళతో కూడిన పూర్ణకుంభాన్ని చూపింది. పండు, గంధము, సిందూరము కస్తూరి, చందనములను ఇచ్చింది. (4) పూలమాలను, దీపాన్ని, ఎర్రని గంధాన్ని ఇచ్చింది, ఓ బ్రాహ్మణశ్రేష్ఠ. పతిపుత్రులు కల ఆ సాధ్వి బంగారము, వెండి ఇచ్చింది. (5) ఆమహాసాధ్వి హితకరమైన, సత్యమైన, శుభప్రదమైన మాటను ఆతనితో అంది. హృదయంలో బాధపడుతూ, పడుతున్న కన్నీళ్ళుగల కళ్ళు కన్పించకుండా దాచుకొని ఇట్లా అంది. (6) నీకు మేలు జరగని. నీకుదారి, అంతా ఎప్పుడూ మేలు జరగని. హరిదగ్గర జ్ఞానాన్ని పొందు. కృష్ణునకు ప్రీతిపాత్రుడవుకా. (7) కృష్ణభక్తి, కృష్ణ దాస్యము అనేవి శ్రేష్ఠమైన వాటిలో అతి శ్రేష్ఠమైనవి. శ్రేష్ఠత్వము ఐదు విధములు. ముక్తికి హరిభక్తి శ్రేష్టమైనది. (8) బ్రహ్మత్వము, దేవత్వము, ఇంద్రత్వము, అమరత్వము వీనికన్న అమృతము, సిద్ధి పొందటము వీనికన్న హరిదాస్యము చాలా దుర్లభమైనది. (9) అనేక జన్మల తపస్సుతో , భారతదేశ మందు బ్రాహ్మణుడుగా జన్మించి, హరిభక్తిని పొందితే అట్టి జన్మ (వాని జన్మ చాలా దుర్లభము. (10) వాని జన్మ సఫలమైనది. వాడు కర్మక్షయాన్ని చేసుకున్న వానిజన్మ సఫలము. జన్మ జన్మలలోని వేలకొలది పితరులకు, వాని తల్లికి, (11) మాతా మహులకు (పురుషులకు) నూరుగురు సోదరులకు, బాంధవులకు, పత్నికి, గురువులకు, శిష్యులకు భృత్యులకు (12) వాడు చేసిన, కృష్ణునకు తన్ను సమర్పించే కర్మ చాలామేలైనది శోభనమైనది. ఓవత్స! ఆకర్మశోభనమైనది, శుద్ధమైనది. ఎందుకంటే అది కృష్ణున్ని సంతోష పెడుతుంది. కనుక. (13) ప్రీతితో విధిపూర్వకంగా చేసే ఆకర్మ సంకల్పాన్ని సాధిస్తుంది. అదే మంగళమైనది. ధన్యమైనది. పరిణామంలో (చివర) సుఖాన్ని కల్గించేది. (14) అదే వ్రతము, అదే తపస్సు, అదేభక్తి, అదే పూజనము. ఇది సత్యము. ఆతని నుద్దేశించి ఉపవాసముండటము కేవలము దాస్యానికి కారణమౌతుంది. (15) భూమి నంతా దానం చేయటము, భూమికి ప్రదక్షిణ చేయటము, సమస్త తీర్థములందు స్నానము, సమస్తమైన వ్రతము తపస్సు.

మూ॥ సమస్త యజ్ఞకరణం సర్వదాన ఫలం తథా ।

సమస్త వేదవేదాంగ పఠనం పాఠనం తథా ॥

భీతస్యరక్షణంచైవ జ్ఞానదానం సుదుర్లభం ।

అతిథీనాం పూజనంచ శరణాగత రక్షణం ॥

సర్వదేవార్చనం చైవ వందనం జపనం మనోః ।

భోజనం విప్రదేవానాం పురశ్చరణ పూర్వకం ॥

గురుశుశ్రూషణంచైవ పిత్రో: భక్తిశ్చ పోషణం ।

సర్వం శ్రీకృష్ణ దాసస్య కలాం నార్హతి షోడశీం ॥

తస్మాదుద్ధవయత్నేన భజకృష్ణం పరాత్పరం ।

నిర్గుణంచ నిరీహంచ పరమాత్మాన మీశ్వరం ॥

నిత్యం సత్యం పరం బ్రహ్మ ప్రకృతేః పరమీశ్వరం ।

పరిపూర్ణతమం శుద్ధం భక్తానుగ్రహ విగ్రహం ॥

కర్మిణాం కర్మణాం సాక్ష్య ప్రదం నిర్లిప్తమేవచ ।

జ్యోతి స్వరూపం పరమం కారణానాంచ కారణం ॥

సర్వస్వరూపం సర్వేశం సర్వసంపత్ర్పదం శుభం ।

భక్తిదం దాస్యదం స్వస్య నిజ సంపత్పదప్రదం ॥

విసృజ్యజ్ఞాతి బుద్ధించ మాత్సర్యమశుభప్రదం ।

భజ తం పరమానందం సానందం నందనందనం ॥

వేదే కౌథుమిశాఖాయం తస్యనామ్నాం సహస్రకం ।

నందనందన నామోక్తం కృత విఘ్న సుదుర్లభం ॥

ఉద్ధవః సర్వమాకర్ణ్య పరమం విస్మయం యయౌ ।

జ్ఞానం సంప్రాప్య సంపూర్ణం పరిపూర్ణోబభూవహ ॥

స్వవస్త్రంచ గలే బద్ధ్వా దండవత్ర్పణనామ తాం ।

మూర్ధ్నః కేశైశ్చ తత్పాదం నిబధ్యచ పునః పునః ॥

పులకాంచిత సర్వాంగః సాశ్రునేత్రశ్చ భక్తితః ।

తద్విచ్ఛేదశుచా ప్రేమ్ణా రురోదోచ్చైశ్చ నారద ॥

రురోద రాధాతత్ర్ప్రేమ్ణా రురోద వల్లవీగణః ।

ఉద్ధవస్యగలం ధృత్వా స్థాపయామాస లోభతః ॥

ఉద్ధవం మూర్ఛితం దృష్ట్వా జృంభితం త్యక్త చేతనం ।

శీఘ్రముత్థాపయామాస రాధికా కృష్ణమానసం ॥

చేతనం కారయామాస జలందత్వా ముఖాంబుజే ।

శుభాశిషం చ ప్రదదౌ వత్స జీవేతి నారద ॥

అన్ని యజ్ఞాలు చేయటము, అన్ని దానముల ఫలము, సమస్త వేద వేదాంగముల పఠనము, చదివించుట, (17) భయపడ్డవాణ్ణి రక్షించుట సుదుర్లభమైన జ్ఞాన దానము, అతిథుల పూజ, శరణాగత రక్షణము (18) అందరు దేవతల పూజ, నమస్కారము, మంత్ర జపము, తానే సిద్ధము చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టడము. (19) గురువుల శుశ్రూష, తలిదండ్రుల పై భక్తి, వారిని పోషించుట, ఇవన్నీ కూడా శ్రీకృష్ణునకు దాసుడైన వాని కళలో పదహారవ భాగపు కళను కూడా సరిపోలవు. (20) అందువలన ఓ ఉద్ధవ! పరాత్పరుడైన కృష్ణుని శ్రద్ధతో సేవించు. ఆతడు నిర్గుణుడు, కోరికలు లేనివాడు, ఈశ్వరుడు, పరమాత్మ (21) నిత్యమైనవాడు, సత్యమైనవాడు, పరుడైన బ్రహ్మ, ప్రకృతికి పరుడైనవాడు, ఈశ్వరుడు, పరిపూర్ణతముడు, శుద్దుడు, భక్తులను అనుగ్రహించుటకై రూపం ధరించినవాడు. (22) కర్మచే సేవాళ్ళ కర్మలకు సాక్ష్యమిచ్చువాడు నిర్లిప్తుడు. జ్యోతిఃస్వరూపుడు,పరుడు, కారణములకు కారణమైనవాడు. (23) అన్నింటి రూపమైనవాడు, సర్వేశుడు, అన్ని సంపదలను ఇచ్చువాడు, శుభుడు, తనయందు భక్తిని దాస్యాన్ని ఇచ్చువాడు, తన సంపత్తు నిచ్చే స్థానమును ఇచ్చేవాడు. (24) జ్ఞాతి బుద్దిని వదిలి, అశుభకారకమైన మాత్సర్యమును వదిలి, ఆపరమానందుడైన, సానందుడైన నందనందనుని సేవించు (25) వేదములలో కౌథుమిశాఖయందు అతని వేలకొలది పేర్లున్నాయి. విఘ్నములొనర్చిన వారికి చాలాదుర్లభమైన, నందనందననామముతో చెప్పబడ్డ పేర్లున్నాయి. (26) ఉద్ధవుడు అన్ని విని చాలా ఆశ్చర్యాన్ని పొందాడు. సంపూర్ణ జ్ఞానాన్ని పొంది పరిపూర్ణుడైనాడు. (27) తన వస్త్రమును కంఠమున కట్టుకొని దండము వలె ఆమెకు నమస్కరించాడు. తలయందలి వెంట్రుకలతో ఆమె పాదములను మాటిమాటికి బంధించి (28) శరీరమంతా పులకరించగా, కళ్ళల్లో నీళ్ళు నిండగా, భక్తితో, ఆమె నుండి విడిపోయాననే (తున్నా) దుఃఖంతో, ప్రేమతో గొంతెత్తి ఏడిచాడు, ఓ నారద! (29) ఆతని పై ప్రేమతో రాధకూడా ఏడ్చింది. గొల్ల స్త్రీలంతా దుఃఖించారు. ఉద్ధవుని కంఠమును ధరించి, లోభముతో, ఆమె నిలువరించింది. (30) ఉద్ధవుడు మూర్ఛపోగా,ఆవులిస్తూ చైతన్యాన్ని (స్పృహను) కోల్పోగా, కృష్ణుని యందే మనస్సుగల ఆతనిని రాధిక త్వరగా లేపింది. (31) ముఖం పై నీళ్ళు చిలకరించి మేల్కొలిపింది. ఓ వత్స! క్షేమంగా ఉండు, అని శుభాశీస్సులను ఇచ్చింది, రాధిక, ఓ నారద.

మూ॥ ఉద్ధవః చేతనాంప్రాప్య తామువాచ సుసంసది ।

రుదతీనాంచ గోపీనాం పురతః పరమార్థదం ॥

ఉద్దవ ఉవాచ :

ధన్యోయశస్యోద్వీపానాం జంబూద్వీపః సుదుర్లభః ।

యత్రభారత వర్షంతు సర్వేషామీప్సితం వరం ॥

అహోభారత వర్షేతు పుణ్యం బృందావనం వనం ।

రాధాపాదాబ్జ సంస్పర్శరజః పూతం సురేప్సితం ॥

ధన్యామాన్యాచ పృథివీ త్రిషులోకేషు పూజితా ।

రాధాయాః తీర్థపూతాయాః పాదాబ్జరజసావరా ॥

షష్టి వర్షసహస్రాణి దివ్యాని పుష్కరేపురా ।

బ్రహ్మణాచ తపస్తప్తం వేదోక్తం భక్తి పూర్వకం ॥

గోలోకే రాధికా కృష్ణ దర్శనార్థం మనోరథాత్ ।

గోలోకే రాధికా కృష్ణో న దృష్టః స్వప్నత స్తథా ॥

శ్రుతా తేనాకాశవాణీ సత్యరూపాచ లీలయా ।

వారాహే భారతే వర్షే పుణ్యే వృందావనే వనే ॥

రాసోత్సవే మహారమ్యే తత్రైవ రాసమండలే ।

ద్రక్ష్యసీతి చ దేవానాం మధ్యే సుస్థోన సంశయః ॥

శ్రుత్వాచ విరతో బ్రహ్మా తపసః స్వగృహం గతః ।

కృష్ణోదృష్టశ్చ హృష్టశ్చ పరిపూర్ణ మనోరథః ॥

 గోపానాం గోపికానాంచ సఫలం జన్మజీవనం ।

నిత్యం పశ్యంతి తే పాదపద్మం బ్రహ్మాది దుర్లభం ॥

మానినీం రాధికాం సంతః సదా సేవంతి నిత్యశః ।

యోగీంద్రాశ్చ మునీంద్రాశ్చ సిద్ధేంద్రా వైష్ణవాస్తథా ॥

 సతీంపుణ్యాం తీర్థపూతాం స్వతః శుద్ధాం సుదుర్లభాం ।

సులభం యత్పదాంభోజం బ్రహ్మాదీనాం సుదుర్లభం ॥

యత్పాదపద్మ నఖరం కృతం యావక చిహ్నితం ।

సర్వేశ్వరేశ్వరేణైవ కృష్ణేన పరమాత్మనా ॥

చకార యస్యాః పూజాంచ స్తోత్రరాజం సుదుర్లభం ।

శతశృంగే స్వయం కృష్ణో గోలోకే రాసమండలే ॥

పారిజాత ప్రసూనానా మంజలిం గంధచందనం ।

దదౌ దూర్వాక్షతం స్నిగ్ధం యస్యాః పాదారవిందయోః ॥

 త్రింశత్సహస్రకోటీనాం గోపీనామీశ్వరీచ, యా ।

తత్ షట్త్రింశత్సఖీనాంచ ఈశ్వరీ రాధికాభిధా ॥

యేవా ద్విషంతినిందంతి పాపినశ్చ హసంతిచ ।

కృష్ణ ప్రాణాధికాం దేవదేవీంచ రాధికాం వరాం ॥

బ్రహ్మహత్యాశతంతేచ లభంతే నాత్రసంశయః ।

తత్పా పేనచ పచ్యంతే కుంభీపాకేచ రౌరవే ॥

ఉద్దవుడు మేల్కొని చక్కని సభయందు ఆమెతో ఇట్లన్నాడు : ఏడుస్తున్న గోపికల ఎదుట పరమార్థమైన మాట ఇట్లన్నాడు. (33) ఉద్ధవుని వచనమిట్లా: ద్వీపములలో జంబూ ద్వీపము ధన్యమైనది, కీర్తికరమైనది, మిక్కిలి దుర్లభమైనది. భారత వర్షము అందరికి కోరతగినది శ్రేష్ఠమైనది. (34) భారత వర్షంలో బృందావనమనెడి వనము పుణ్యమైనది. రాధపాదాబ్జసం స్పర్శగల ధూళితో పవిత్రమైనది. దేవతలు కోరేది. (35) పృథివి ధన్యమైనది, గౌరవించతగినది. ముల్లోకములలో పూజించబడినది. తీర్దమువలె పవిత్రమైన రాధపాదాబ్జరజస్సుతో శ్రేష్ఠమైనదది (36) అరువది వేలేండ్లు దేవవత్సరాలు పుష్కర క్షేత్రంలో ఇదివరలో బ్రహ్మ, వేదోక్తమైన భక్తి పూర్వకమైన తపమాచరించాడు. (37) గోలోకంలో రాధికాసహిత కృష్ణుని దర్శనం కొరకు ఆ కోరికతో తపస్సు చేశాడు. అప్పుడు కలలో కూడా గోలోకంలో రాధికాకృష్ణుని చూడలేదు. (38) అప్పుడు బ్రహ్మ లీలగా సత్యరూపమైన ఆకాశవాణిని విన్నాడు. వరాహకల్పమందు పుణ్యమైన భారతవర్షమందు బృందావన మందు (39) మహారమ్యమైన రాసోత్సవమందు అక్కడే రాసమండలమందు దేవతల మధ్య యందు చక్కగా వసించిన రాధాకృష్ణుని చూస్తావు అనుమానము లేదు, అని (40) ఆ మాట విని బ్రహ్మతపస్సు నుండి విరమించి తన ఇంటికి వెళ్ళాడు.కృష్ణుని చూచాడు, ఆనందించాడు. అతని కోరిక నెరవేరింది. (41) గోపాలుర, గోపికల జన్మ బ్రతుకు సఫలమైనది. బ్రహ్మాదులకు దుర్లభమైన కృష్ణుని పాదపద్మములను గొల్లలు, ప్రతినిత్యం చూస్తారు. (42) మానినియైన రాధికను ప్రతినిత్యము ఎల్లప్పుడు సజ్జనులు సేవిస్తారు. యోగీంద్రులు, మునీంద్రులు, సిద్ధేంద్రులు, వైష్ణవులు అట్లాగే చూస్తారు. (43) సతి, పుణ్యురాలు, తీర్థమువలె పవిత్రమైనది. సహజంగా శుద్ధురాలు, చాలా దుర్లభమైనది. ఆమె పాదపద్మములు బృందావనులకు సులభము. బ్రహ్మాదులకు చాలా దుర్లభము. (44) ఆమె పాదపద్మముల మీది గోళ్ళను ఎర్రరంగుతో అలంకరించాడు. పరమాత్మయైన కృష్ణుడే, సర్వేశ్వరేశ్వరుడే ఈ పని చేశాడు. (45) ఆమె పూజను కృష్ణుడు, చేశాడు. చాలా దుర్లభమైన స్తోత్రరాజముతో చేశాడు. స్వయంగా కృష్ణుడు శతశృంగమందు గోలోకమందు రాసమండల మందు (46) పారిజాతపు పూలదోసిలిని, వాసనగల చందనమును, నిగనిగలాడుతున్న దూర్వ అక్షతాలను ఆమె పాదారవిందముల యందు ఉంచాడు. (47) ఆమె ముప్పదివేల కోట్ల గోపికలకు ఆమె ఈశ్వరి. ముప్పది ఆరుమంది సఖులకు ఆమె ఈశ్వరి. ఆమె పేరు రాధిక. (48) ఆమెను ద్వేషించేవారు, తిట్టేవారు, నవ్వేపాపులు, కృష్ణునకు తన ప్రాణములకన్న మిన్నయైన, దేవతలకు దేవియైన శ్రేష్ఠమైన రాధికను తిట్టే పాపులు. (49) నూరు బ్రహ్మహత్యల పాపాన్ని వారు పొందుతారు. ఇందులో అనుమానం లేదు. ఆ పాపంతో వారు, రెరవకుంభీపాక నరకమందు బాధింపబడుతారు.

మూ॥ తప్తతైలేమహాఘోరే ధ్వాన్తే కీటేచయంత్రకే ।

చతుర్దశేంద్రావచ్చిన్నం పితృభిః సప్తభిః సహ ॥

తతః పరంచజాయేత జన్మైకం లోకజన్మతః ।

దివ్యం వర్షసహస్రంచ విష్ఠాకీటాశ్చ పాపతః ॥

పుంశ్చలీనాం యోనికీటాత్ తద్రక్త మలభక్షకాః ।

మలకీటాశ్చ తన్మానవర్షంచ పూయభక్షకాః ॥

వేదేచ కాణ్వశాఖాయం ఇత్యాహ కమలోద్భవః ।

ఇత్యుక్తవంతం తంయాన్త మువాచ రాధికాపునః రుదంతంచ రుదంతీ సా కృష్ణవిచ్ఛేదకాతరా ॥

రాధికోవాచ :

గచ్ఛవత్స మధుపురీం సర్వం బోధయ మాధవం ॥

యథాపశ్యామి గోవిందం ప్రయత్నేన తథాకురు ।

నిష్ఫలంచ గతంజన్మ గచ్ఛమిథ్యా దురాశయా ॥

ఆశాహి పరమందుఃఖం నైరాశ్యం పరమం సుఖం ।

పశ్చాద్విచింత్య గోవిందం జీవన్ముక్తా బభూవసా ॥

ఇత్యుక్త్యా రాధికా తత్ర రురోదచ భృశంపునః ।

ప్రణమ్యతాం రుదంతీంచ యశోదా భవనంయయౌ॥

అథోద్ధవేగతే రాధా మూర్ఛాం సంప్రాప నారద ।

తత్యాజ చేతనాం శశ్వద్భభూవధ్యాన తత్పరా ॥

 పంక స్థేపంకజదలే సజలే శయనేమునే ।

గోప్యస్తాం స్థాపయామాసుః సామ్రనేత్రోత్పలావరాః ॥

తత్స్పర్శమాత్రాచ్ఛయనం భస్మీభూతం బభూవ హ ।

పునఃస్నిగ్ధస్థలేస్నిగ్ధనిచో లేచందనాంకితే ॥

పునస్తాంస్థాపయామాసుః విరహ జ్వరకాతరాం ।

సహసా శుష్కతాంప్రాప సుగంధి చందనోదకం ॥

నిమే షేణ శతయుగం తద్భభూవోద్ధవంవినా ।

హాహోద్ధనోద్ధవ హరిం శీఘ్రంగత్వావదేతిచ ॥

 సమానయహరింశీఘ్రం మత్ర్పణేశ్వరమిత్యపి ।

ఇత్యుక్త వచనాం దీనాం సంతాపహృతచేతనాం ॥

రురుదు: గోపికాః సర్వా రాధాంకృత్వాస్వవక్షసి ।

చేతనాంకారయామాసు: బోధయా మాసు రీప్సితం ॥

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే రాధోద్ధవ సంవాదే సప్త నవతితమోఽధ్యాయః ॥

నూనె కాగిన, మహాఘోరమైన చీకటిగల, పురుగులు గల యంత్రమందు పదునలుగురు ఇంద్రుల పాలనా కాలపరిమితి ఏడుగురు పితరులతో సహా ఉంటాడు. (51) ఆ పిదప ఒక జన్మ, లోకజన్మననుసరించి పుడ్డాడు. పాపం వల్ల దేవతల వేయి సంవత్సరాల కాలము మలమందు క్రిమిగా ఉంటాడు. (52) వ్యభిచారిణుల యోనిలోని పురుగు నుండి దాని రక్త మలముల భక్షకులౌతారు. అంతేమానము గల సంవత్సరాలు మలమందు కీటకములై మల భక్షకులౌతారు. (53) వేదంలో కాణ్వశాఖయందు బ్రహ్మ ఇట్లా చెప్పాడు. అని చెప్పి, పిదపవెళ్ళుచున్న ఉద్ధవునితో రాధ మళ్ళీ ఇట్లా అన్నది. ఏడుస్తున్న ఆతనితో ఏడుస్తున్న ఈమె, కృష్ణుని, వియోగం వల్ల భయపడి ఇట్లా అంది. (54) రాధవచనమిట్లా - వత్స! మధురాపురికి వెళ్ళు. మాధవునకు అంతా చెప్పు. (55) గోవిందుణ్ణి నేనెట్లా చూడగలుగుతానో అట్లా నీవు ప్రయత్నం చేయి. గత జన్మ అంతా నిష్ఫలము వెళ్ళు. మిథ్యా దురాశతో గడిచింది. (56) ఆశ మిక్కిలి దుఃఖకారి, నిరాశ మిక్కిలి సుఖకారి. ఆ పిదప గోవిందుణ్ణి గురించి ఆలోచించి ఆమె జీవన్ముక్తురాలైంది. (57) అని పలికి అక్కడ రాధ తిరిగి మిక్కిలి ఏడ్చింది. ఏడుస్తున్న ఆమెకు నమస్కరించి యశోద భవనమునకు వెళ్ళాడు. (58) ఉద్ధవుడు వెళ్ళాక రాధ మూర్ఛపోయింది ఓ నారద! చైతన్యాన్ని కోల్పోయింది. ఎప్పుడూ ధ్యానపరురాలైంది. (59) బురదయందున్న పద్మదళమందు, నీరుగల పడకయందు, ఓముని! గోపికలు, శ్రేష్ఠులైనవారు కన్నీళ్ళు కలిగిన నేత్రోత్పలములు గల, వారు ఆమెను ఉంచారు. (60) ఆమె శరీర స్పర్శ మాత్రం చేతనే ఆపడక భస్మమైంది. తిరిగి మృదువైనస్థలమందు మృదువైన దుప్పటి పరచినచోట, చందనం పూసిన చోట (61) విరహ జ్వరంతో బాధపడుతున్న ఆమెను తిరిగి ఉంచారు. మంచివాసనగల చందనపు నీరుతోందరగా ఎండిపోయింది. (62) ఉద్దవుడు లేనందువల్ల ఒక నిమిషము (రెప్పపాటు) నూరు యుగాలైందది. హా! హా! ఉద్దవ, ఉద్ధవ! హరి దగ్గరకు తొందరగా వెళ్ళి చెప్పు. (63) నా ప్రాణేశ్వరుడైన హరిని త్వరగా తీసుకురా అని పలికిన దీనురాలైన సంతాపంతో చైతన్యం కోల్పోయిన రాధను చూచి (64) గోపికలందరు రాధను తమ తమ వక్షములందుంచుకొని దుఃఖించారు. ఆమెను మేల్కొలిపారు. ఆమె కోరికను తెలిపారు. (65) అని బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాద మందు రాధోద్ధవ సంవాద మందు తొంబది ఏడవ అధ్యాయము.