11 - ధ్రువ చరిత్రము

శ్రీపరాశరుడు:

ప్రియవ్రతోత్తనపాదౌమనోస్స్వాయంభువస్యతు।

ద్వౌపుత్రౌసుమహావీరౌధర్మజ్ఞౌకథితౌతవ॥

తయోరుత్తానపాదస్య సురుచ్యాముత్తమస్సుతః।

అభీష్టాయామాభూద్బ్రహ్మన్ పితురత్యన్తవల్లభః॥

సునీతిర్నామయారాజ్ఞస్థాన్మహీషీద్విజ।

సనాతిప్రీతిమాం స్తస్యాంతస్యాశ్చాసీద్ధ్రువస్సుతః॥

రాజాసనస్తితస్యాఙ్కే పితుర్ భ్రాతరమాశ్రితమ్।

ద్రుష్ట్వోత్తమంద్రువశ్చక్రే తమారోఢుంమనోరథమ్॥

ప్రత్యక్షంభూపతిస్తస్యా స్సురుచ్యానాభ్యనన్దత।

ప్రణయేనాగతంపుత్రముత్సఙ్గారోహణోత్సుకమ్॥

సపత్నీతనయందృష్ట్వాతమంగారోహణోత్సుకమ్।

స్వపుత్రంచతథాఽరూఢం సురుచిర్వాక్యమబ్రవీత్॥

క్రియతేకింవృథావత్సమహానేషమనోరథః।

అన్యస్త్రీగర్భజాతేనహ్యసంభూయమమోదరే॥

ఉత్తమోత్తమమప్రాప్యామవివేకోఽభివాఞ్చసి।

సత్యంసుతస్త్వమాప్యస్యకింతునత్వంమయాధృతః॥

ఏతద్రాజాసనంసర్వభూభృత్సంశ్రయకేతనమ్।

యోగ్యంమమైవపుత్రస్య కిమాత్మాక్లిష్యతేత్వయా॥

ఉచ్చైర్మనోరథస్తేఽయం మత్పుత్రస్యేవకింవృథా।

సునీత్యామత్మనోజన్మకింత్వయా నావగమ్యతే॥

శ్రీపరాశరుడు:

స్వాయంభువ మనువు కొడుకులు ప్రియవ్రతుడు, ఉత్తనపాదుడును మహావీరులు ధర్మజ్ఞులు. ఉత్థానపాదునికి సురుచియను ప్రియ భార్య యందు ఉత్తముడను మిక్కిలి యిష్టుడగు. కొడుకు గల్గెను. సునీత యను నాతని యగ్ర మహిషి యందు ధ్రువు డుదయించెను. అతని యందు దండ్రి కంత ప్రీతి లేదయ్యె. తండ్రి తొడ మీద కూర్చున్న తమ్ముని ఉత్తమునిం గని సురుచి చూచుచుండ తాను నక్కడ గూర్చుండ గుతూహల పడు ధ్రువునిం గని యుత్తాన పాదుడందుల కిష్ట పడడయ్యె. ప్రేమతో వచ్చి తండ్రి యొడిలో గూర్చుండ నుబలాట పడు సవతి కొడుకును జూచి యుయ్యోడి నున్న తన కొడుకుంగని సురుచి యిట్లనియె. వత్స! ఏల యూరక ముచ్చట పడెదవు? నా కడుపునం బుట్టక వేఱొక స్త్రీ గర్భమున బుట్టి పరమోత్తమ స్థానమందని దాని నవివేకివై కోరుచున్నావు. నిజమే నీవీయన కొడుకువే. అయిననేమి నాచే బది మాసములు మోయబడిన వాడవు గావు. సర్వ రాజన్యుల కాశ్రయమైన ఈ రాజాసనము నా కొడుకునకు మాత్రమే తగినది. ఏల వృథా క్లేశ పడెదవు? నా కొడుకట్లు ఈ గొప్ప కోరిక వ్యర్ధముగా నీకెందులకు? నీవు సునీతికి బుట్టితి వనునది నీకు యవగాహనలో లేదా?

శ్రీపరాశరుడు:

ఉత్సృజ్యపితరంబాల స్తచ్చ్రుత్వా మాతృభాషితమ్।

జగామకుపితో మాతుర్నిజాయా ద్విజామన్దిరమ్॥

తందృష్ట్వాకుపితం పుత్రమీషత్ప్రస్ఫురితాధరమ్।

సునీతిరఙ్కమారోప్య మైత్రేయేదమభాషత॥

వత్సకః కవహేతుస్తేకశ్చత్వాంనాభిననన్దతి।

కోఽవజానాతిపితరం తవయస్తేఽ పరాధ్యతి॥

ఇత్యుక్తస్సకాలం మాత్రేకథయామాసతద్యథా।

సురుచిః ప్రాహభూపాలప్రత్యక్షమతిగర్వితా॥

నిశ్వస్యసేతికథితేతస్మిన్ పుత్రేణదుర్మనాః।

శ్వాసక్షామేక్షణా దీనాసునీతిర్వాక్యమబ్రవీత్॥

అన నా సవతి తల్లి మాటలు విని దండ్రిని యా బాలుడు కినుకగొని తన తల్లి సౌధమునకు వెళ్ళెను. అల్లన బెదవులదర కోపము గొనియున్న యా పిల్ల వానింగని సునీతి యోడి లోనికి దిగిచి కొని నాయనా! ఎందులకు గోపము వచ్చినది? ఎవడు నిను జూచి యాదరింపడు? నీయెడ నపరాధము సేసి యెవ్వడు (నిన్నుగాదు) మీ తండ్రి నవమానించి నాడు? అన నా పాపడు సురుచి రాజు ముందు దన్నాడిన మాటలెల్ల నమ్మకు జెప్పెను. ఆ యమ్మ విని మనసు చెడి నిట్టూర్పు ఉచ్చి యూర్పులెగయ చూపుల సోంపు దఱుగు దీనురాలై సునీతి బిడ్డనితో నిట్లనియె.

సునీతి:

సురుచిస్సత్యమహేదం స్వల్పభాగ్యోసిపుత్రక।

నహిపుణ్యవతాంవత్సస్సపత్నై రేవముచ్యతే॥

నోద్యోగస్తాతకర్తవ్యఃకృతం యద్భావతాపురా।

తత్కోఽపహర్తుంశక్నోతిదాతుంకశ్చాకృతంత్వయా॥

తత్త్వయానాత్రకర్తవ్యం దుఃఖంతద్వాక్యసంభవమ్॥

రాజాసనంతథా ఛత్రవరాశ్వా వరవారణాః।

యస్యపుణ్యానితస్యైతేమత్వైతతచ్చామ్య పుత్రక॥

అన్యజన్మకృతైః పుణ్యైస్సురుచ్యాంసురుచిర్ నృపః।

భార్యేతిప్రోచ్యతేచాన్యామద్విధాపుణ్యవర్జితా॥

పుణ్యోపచయంసంపన్నస్తస్యాః పుత్రస్తథోత్తమః।

మమపుత్రస్తథాజాతస్స్వల్ప పుణ్యధృవంభవన్॥

తథాపిదుఃఖంనభవాన్ ర్తుమర్హతిపుత్రక।

యస్యయావత్సతేనైవస్యేనతుష్యతిబుద్ధిమాన్॥

యదిచేద్దుఃఖమత్యర్ధం సురుచ్యావచనాత్తవ।

తత్పుణ్యప్రచయే యత్నంకురు సర్వఫలప్రదే॥

సుశీలోభవ ధర్మాత్మామైత్రః ప్రాణిహితేరతః।

నిమ్నం యథాఽఽపః ప్రవణాఃపాత్రామాయాన్తి సంపదః॥

సునీతి:

అబ్బాయీ! సురుచి నిజము పల్కినది. నీవల్ప భాగ్యుడవే. పుణ్యవతులైన వారి బిడ్డడిట్లు సవతిచే నొవ్వ నాడబడునా? ఈ మున్ను నీ చేసిన ప్రయత్న మింకెన్నడునూ నీవు సేయవలదు. నీ మున్ను సేసినది యెవ్వడు హరింప గలడు. చేయనిది ఎవ్వడీయ గలడు? దాని మాటలం బొడమిన దుఃఖమిది నీవు లెక్క సేయ వలదు. రాజాసనము వెల్లగొడుగు పతాక గుఱ్ఱములు మేటి ఏనుగులు నను నీ యెల్ల నెవనికి పుణ్యములు గలవు, వాని కివి యుండును. బిడ్డా! నీవు శమింపుము. జన్మ జన్మాంతరమ్ముల పుణ్యములచే రాజు సురిచి యందు సురుచి యయ్యెను. పుణ్యములు లేని నా బోటి భార్యయని యనిపించు కొనుటకు మాత్రమే భార్య. పుణ్యముల పెంపున నింపుగుల్క నుత్తముడు దాని కొడుకుత్తముడే ఉత్తమ పుణ్యడు. నా కొడుకు వైయట్లే పుట్టియు నీవల్ప పుణ్యుడవు. నిక్కము. అయినను నీ వేడువం దగదు. తన కెంత గలదా పుణ్య ఫలమున సంతుష్టు డగును బుద్దిమంతుడు. సురుచి మాటచే నీకెక్కున దుఃఖము గలిగెనేని సర్వ ఫలప్రదమైన పుణ్య రాశి సంపాదనమునకు యత్నము సేయుము. మంచి శీలవంతుడవు గమ్ము. ధర్మాత్ము డవగుము. ప్రాణుల హితవు గోరుము. ఎల్లర యెడ మైత్రి పాటింపుము. నీరు పల్లమున కట్లు సంపదలు పాత్రుని దరిజేరును.

ధ్రువుడు:

అమ్భయత్త్వమిదంప్రాత్థప్రశామాయవచోమమ।

నైతద్దుర్వచసాభిన్నేహృదయేమమతిష్ఠతి॥

సోఽహంతథాయతిష్వామీయథాసర్వోత్తమోత్తమమ్।

స్థానంప్రాప్స్యామ్యశేషాణాం జగతామాభిపూజితమ్॥

సురుచిర్ధయితారాజ్ఞస్తస్యా జాతోస్మినోదరాత్।

ప్రభావంపశ్యమేఽమ్బత్వంవృద్దస్యాపివోదరే॥

ఉత్తమస్సమమభ్రాతాయోగర్భేణధృతస్తయా।

స రాజాసనమాప్నోతు పిత్రాదత్తంతథాఽస్తుతత్॥

నాన్యదత్తమభీప్సామి స్థానమమ్బస్వకర్మణా।

ఇచ్ఛామితదహంస్థానంయన్న ప్రాపితామమ॥

ధ్రువుడు:

అమ్మా! నా యుపశమనమున కీవన్న యీ పలుకు ములుకులు పగుల వడిన నాయేడంద నిలువదు. సర్వజగమ్ముల కభిపూజ్యమైన మహోన్నత స్థానమే నెట్లు పొందుదునో యందుల కేను యత్నింతును. రాజునకు సురుచి ప్రియురాలు. ఆమె కడుపునా నీను బుట్ట నైతిని. అమ్మా! నీ కడుపునం బుట్టి పెరిగిన నా ప్రభావముం జూడుము. మా తమ్ముడుత్తముడు ఆమె గర్భమున మోపబడిన వాడు. వాడే తండ్రి యిచ్చిన రాజాసనము బొందు గాక! దేవీ! ఇంకొక డిచ్చిన స్థానమేను గోరను. నా తండ్రి గూడ పడయని యాస్థానముం గోరు చున్నాను.

శ్రీపరాశరుడు:

నిర్జగామగృహాన్మాతురిత్యుక్త్వామాతరంధ్రువః।

పురాచ్చనిర్గమ్యతతస్తద్భాహ్యోపవనమ్యయౌ॥

సదదర్శమునీంస్తత్రసప్త పూర్వాగాతాన్ ధ్రువః।

కృష్ణాజినోత్తరీయేషువిష్ణరేషు సమాస్థితాన్॥

సరాజపుత్రస్తాన్ సర్వాన్ ప్రణిపత్యాభ్యభాషత।

ప్రశ్రయావసతస్సమ్యగభివాదనపూర్వ కమ్॥

శ్రీపరాశరుడు:

అని పలికి జననియిలు వెడలి పురము వెడలి యా పురము వెలినున్న యుద్యానవనమున కేగెను. అక్కడ యంతమున్న వచ్చి కృష్టాజినములు పరచిన యాసనములం గూర్చున్న సప్తర్షులం దర్శించెను. ఆ రాచ బిడ్డ డయ్యందరకు బ్రణమిల్లి విన్యా వనతుడై చేతులు మొగిచి యిట్లు భాషించెను.

ధ్రువుడు:

ఉత్తనపాదతనయం మాంనిబోధత సత్తమాః।

జాతంసునీత్యాంనిర్వేదాధ్యుష్మాకం ప్రాప్తమన్తికమ్॥

చతుః పఞ్చబ్దసంభూతోబాలస్త్చంనృపనన్దన।

నిర్వేదకారణంకించిత్తవనాద్యాపివిద్యతే॥

నచిన్త్యంభవతః కించిద్ద్రియతే భూపతిఃపితా।

నచై వేష్టవియోగాది తవపశ్యామబాలక॥

శరీరేనచాతే వ్యాధిరాస్మాభిరుపలక్ష్యతే।

నిర్వేదఃకిం నిమిత్తస్తే కథ్యతాంయదివిద్యతే॥

తతస్సకథయామాస సురుష్యాయదుదాహృతమ్।

తన్నిశమ్యతతఃప్రోచుర్మనయస్తేపరస్పరమ్॥

ఆహోక్షాత్రంపరంతేజో బాలస్యాపియదక్షమా।

సపత్న్యామాతురక్తుం యాద్ధృదయాన్నాపసర్పతి॥

భోభోక్షత్రియదాయాద నిర్వేదాద్యత్త్వయాఽదునా।

కర్తుంవ్యవసితంతన్నః కథ్యతాం యదిరోచతే॥

యచ్చకార్యన్తవాస్మాభిస్సాహాయ్యమామితద్యుతే।

తత్కథ్యతాం వివక్షుస్త్వమస్మాభిరుపలక్ష్యసే॥

ధ్రువుడు:

ఓ సత్తములారా! సునీతి యందు గల్గిన ఉత్థాన పాదుని కుమారుడనని నన్దెలియుడు. నిర్వేదపడి (దుఃఖము గొని) మీ సన్నిధి కీతెంచితిని. అనవిని ఋషులు, నాలుగైదేండ్లు యిడువాడవు. రాకుమార! నీకు దుఃఖము కల్గుటకు కారణ మించుకేని యెపుడేని కాన రాదు. నీకు జింతించ వలసిన దేకొంచెము లేదు. భూపతి తండ్రి యంతయు ధరించును భరించును. నీ కిష్ఠజన వియోగాదికము (బంధ వియోగము) కానము. నీ శరీరమందే వ్యాధి కన బడదు. నీకు నిర్వేదము కల్గుట కేవి నిమిత్తములు? ఏదేని గలదేని తెల్పుము. అన వారికా బాలుడు సుచియన్న మాటలు దెలిపెను. అది విని యమ్మును లందఱు యిట్లను కొనిరి. ఆహా! ఈ బాలునిలోని క్షాత్ర తేజమేమి వింతైనది? ఈ యక్షమ సవతి పలుకులకు నాకు సైపలేని తన మేమివింత? యీతని మనసు నుండి యా పలుకులు తొలగ కున్నవి. ఓ రాచబిడ్డ! ఈ దుఃఖముచే నీ విపుడేమి సేయ దలచితివి అది మాకు దెలుపు నిష్టమగునేని తెలుపుము. మఱియు మేము నీకేమి సహాయ్యము సేయనగు నదియు దెలుపుము. నీవేదో మాకు దెలుపు నెంచినట్లు కనిపించు చున్నావు.

ధ్రువుడు:

నాహమర్ధమభీప్సామి న రాజ్యంద్విజసత్తమాః।

తత్థ్సానమేకమిచ్చామి భుక్తం నాన్యేనయత్పురా॥

ఏతన్మేక్రియతాంసంయక్కథ్యతాంప్రాప్యతేయథా।

స్థానమగ్ర్యం సమస్తేభ్యస్థ్సానేభ్యో మునిసత్తమాః॥

ధ్రువుడు:

నేనేదేని యొక యదార్ధము గోరుట లేదు. ఓ విప్రోత్తములారా! ఈ మున్నింకొక డనుభవింపని (మఱొకనిచే భుక్తము గాని) యాస్తానమే నొక్కటే గోరుచున్నాను.

మరీచుడు:

అనారాధితగోవిందైర్నరైస్థ్సానంనృపాత్మజ।

నహి సంప్రాప్యతే శ్రేష్టస్తస్మాదారాధయాచ్యుతమ్॥

మరీచుడు:

గోవిందు నారాదింపని నరులా స్థానము నందలేరు. కావున నీవయ్యచ్యుత నారాదింపుము.

అత్రి:

పరః పరాణాం పురుశోయస్యతుష్టోజనార్దనః।

సప్రాప్నోత్యక్షయం స్థానమేతత్సత్యంమయోదితమ్॥

అత్రి:

పరులకెల్ల పరుడైన జనార్ధనుడేని యెడ సంతుష్టు డగును. అతడా నాయక్షయ స్థానమందును. ఇది నిక్కము.

అంగిరుడు:

యస్యాన్తస్సర్వమేవేదమచ్యుతస్య మహాత్మనః।

తమారాధయ గోవిన్దంస్థానమగ్ర్యం యిదీచ్చసి॥

అంగిరుడు:

ఆ ఉన్నత స్థానమీవు కోరుదునేని ఏయచ్యుతుని యందీ సర్వమున్నదో యా గోవిందు నారాధింపుము.

పులహుడు:

పరంబ్రహ్మ పరంధామ యోఽసౌబ్రహ్మతథాపరమ్।

తమారాధ్యహరింయాతి ముక్తిమప్యతిదుర్లభామ్॥

పులహుడు:

పరబ్రహ్మ వస్తువు పరందామము ఆ పరబ్రహ్మ వస్తువు హరి కావున శ్రీహరి నారాధించిన వాడు దుర్లభమైన ముక్తి నందును.

క్రతువు:

యోయజ్ఞపురుషోయజ్ఞయజ్ఞశః పరమఃపుమాన్।

తస్మింస్తుష్టేయ దప్రాప్యంకింతదస్తిజనార్దనే॥

క్రతువు:

యజ్ఞము యజ్ఞ పురుషుడు పరమ పురుషుడు నగు జనార్దనుండు తుష్టుడైన నందరానిది లేదు.

పులస్త్యుడు:

ఐన్ద్రమిన్ద్రః పరంస్థానం యమారాద్య జగత్పతిమ్।

ప్రాపయజ్ఞపతిం విష్ణుస్తమారాధయసువ్రత॥

పులస్త్యుడు:

ఇంద్రుడెవ్వనిని ఆరాధించి ఇంద్ర ప్రస్తాన మందెనో యా యగ్నపతిని విష్ణువును సువ్రతివై యారాధింపుము.

వసిష్ఠుడు:

ప్రాప్నోష్యారాధితేవిష్ణౌ మనసాయద్యదిచ్చసి।

త్రైలోక్యాన్తర్గతం స్థానం కిము వత్సోత్తమోత్తమమ్॥

వశిష్ఠుడు:

వత్సా! విష్ణువు నారాధింతువేని ముల్లోకములలో మనసు నందే దేదికోరుదు వాయుత్త మోత్తమ స్థానమును బొందగలవు అనిరి.

ధ్రువుడు:

ఆరాధ్యఃకథితోదేవోభావాద్భిః ప్రణతస్యమే।

మయాతత్పరితోసహాయయజ్ఞప్తవింతదచ్యుతామ్॥

యథాచారాధననతస్యమయాకార్యంమహాత్మనః।

ప్రసాదసుముఖాస్తన్మేకథయన్తుమహర్షయః॥

ధ్రువుడు:

వినతుడైన నాకు దాము విష్ణువు నారాధింపుమని సెలవిచ్చితిరి. అయన సంతుష్టు డగుట కేనేమి జరుప వలయునో యాయన యారాధన మెట్లు సేయ వలెను. ప్రసాద సుముఖులై ఓ మహర్షులారా! నా కానతిండన

ఋషులు:

రాజపుత్రయథావిష్ణోరారాధనపరైర్నరైః।

కార్యమారాధనంతన్నోయథావచ్రోతుమర్హసి॥

బాహ్యార్దాదఖిలాచ్చిత్తంత్యాజయేత్ప్రథమంనరః।

తస్మిన్నేవజగద్దాంనితతఃకుర్వీతనిశ్చలమ్॥

ఏవమేకాగ్రచిత్తేనతన్మయేనధృతాత్మనా।

జప్తవ్యంయన్నిబోదైతత్ తన్నఃపార్ధివనన్దన॥

హిరణ్యగర్భపురుష ప్రధానావ్యక్తరూపిణే।

ఓంనమోవాసుదేవాయ శుద్ధ జ్ఞాన స్వభావినే॥

ఏతజ్జజాపభగవాన్ జప్యన్ స్వాయంభువోమనుః।

పితామహస్తవపురాతస్యతుష్టోజనార్దనః॥

దదౌయథాభిలషితామృద్దింత్రైలోక్యదుర్లభామ్।

తథాత్వమపిగోవిన్దంతోష యైతత్సదాజపన్॥

ఋషులు:

రాజకుమారా! విష్ణు నారాధన మెట్లు సేయవలేనో వినుము. మనసును వెలి వస్తువు లన్నింటిని మరలించి యా జగన్నివాసుని యందు కదలకుండ నిలుప వలెను. ఇట్లేకాగ్ర మనస్కుడై విష్ణు మాయమైన మనస్సుతో “హిరణ్య గర్భ పురుష ప్రధానావ్యక్త రూపిణే, ఓం నమో వాసుదేవాయ శుద్ధ జ్ఞాన స్వభావినే” అని జపింప వలయును. హరిణ్య గర్భుడు పురుషుడు ప్రధాన అవ్యక్తము ననబడు స్వరూపము గలవానికి శుద్ధ జ్ఞానము స్వభావమైన వానికి వాసుదేవునికి నమస్కారము. అని యీ మంత్రము యొక్క భావము స్వాయంభువ మనువు మీ పితామహుడు భగవంతుడు (షడైశ్వర్య సంపన్ను డన్నమాట) మున్నిదే జపించేను. దానికి జనార్దనుండు సంతుష్టుడయ్యె. త్రిలోక దుర్లభమైన యాయన కోరిన సమృద్ది నాతనికా పరమేశ్వరు డొసంగెను. అట్లే నీవును దీనినేవేళ జపించి గోవిందుని సంతోష పరుపుము.