10 - భృగుసర్గాది సృష్టి వర్ణనము

శ్రీమైత్రేయుడు:

కతితంమేత్వయా సర్వం యత్పృష్టోఽసి మహామునే।

భృగుసర్గా త్ప్రభృత్యేష సర్గోమే కత్యతాంపునః॥

శ్రీ మైత్రేయుడు:

మహర్షీ! నేనడిగిన దెల్ల యానతి నిచ్చివి. భృగునుండి జరిగిన సృష్టిక్రమము సెలవిమ్మన

శ్రీపరాశరుడు:

భృగోఃఖ్యాత్యామ్సముత్పన్నా లక్ష్మీఃవిష్ణు పరిగ్రహః।

తథా ధాతృవిధాతారౌ ఖ్యాత్యాంజాతౌ సుతౌ భృగోః॥

ఆయతిర్ని యతిశ్చైవ మేరోః కన్యే మహాత్మనః।

భార్యే ధాతృవిదాత్రోస్తే తయోర్జాతౌసుతా వుభౌ॥

ప్రాణశ్చైవ మృకణ్డుశ్చ మార్కణ్డేయో మృకణ్డుతః।

తతోవేదశిరా జజ్ఞే ప్రానస్యాపి సుతంశృణు॥

ప్రాణస్య ద్యుతిమాన్ పుత్ర అజావాంశ్చతతోభవత్।

తతోవంశో మహాభాగ! విస్తరం భార్గావోగతః॥

పత్నీమరీచేస్సంభూతి పౌర్నమాస మసూయత।

విరజాః పర్వతశ్చైవ తస్యపుత్రౌ మహాత్మనః॥

వంశాసంకీర్త నేపుత్రాన్ వదిష్యేఽహంతతోద్విజ!॥

స్మృతిశ్చాఙ్గిరసః పత్నీ ప్రసూతా కన్యకాస్తథా।

సినీవాలీ కుహూ శ్చైవ రాకా చానుమతిస్తథా॥

అనసూయాతథైవా త్రేఃజగ్నేపుత్రానకల్మషాన్।

సోమం దుర్వా ససంచైవ దత్తత్రేయంచ యోగినమ్॥

ప్రీత్యాంపులస్త్యభార్యాయాం దత్తోఽత్రిస్తత్సుతోభవత్।

పూర్వజన్మని సోఽగస్త్యస్స్మృతస్స్వాయంభువేఽన్తరే॥

కర్దమ శ్చార్వరీవాంశ్చ సహిష్ణుశ్చసుతత్రయమ్।

క్షమాతుసుషువే భార్యా పులహస్య ప్రజాపతేః॥

శ్రీపరాశరుడు:

భృగువునకు ఖ్యాతి యందు లక్ష్మి యుదయించి విష్ణువునకు భార్యయయ్యె. అట్లే ధాత విధాత యను పుత్రులు ఖ్యాతి యందు భృగువున కుదయించిరి. మేరువు కూతుండ్రు, ఆయతి ధాతకు, నియతి విధాతకు భార్యలయిరి. వారికి ప్రాణుడు మృకండుడు నను కొడుకులు కల్గిరి. మృకండునికి మార్కండేయుడు గల్గెను. మరీచి భార్య సంభూతి పౌరమానుడను కొడుకుం గనెను. ఆ మహాత్మునికి విరజుడు, పర్వతుడును కల్గిరి. అంగిరసుని భార్య స్మృతి సినీవాలి, కుహువు రాక అనుమతి యను కన్యలం గనెను. అత్రి వలన ననసూయ, సోముని దుర్వాసునుని దత్తాత్రేయ యోగిని గనెను. పులస్త్యుని యిల్లాలు ప్రీతి యందు పులహ ప్రజాపతికి విక్షమ యను భార్యయందు కర్దముడు, చార్వరీ వంతుడు, సాహిష్ణువు నను ముగ్గురు కొడుకులు పుట్టిరి.

కత్రోశ్చసంసతి ర్భార్యా వాలఖిల్యా నసూయత।

షష్ఠిఃపుత్రాసహస్రాణి ఋషీణామూర్ ధ్వరేతసామ్॥

అంగుష్ఠపర్వమాత్రాణాం జ్వలద్భాస్కరతేజసామ్॥

ఉర్జాయంచ వసిష్ఠస్య సప్తాజాయన్తవైసుతాః॥

రజో గోత్రోర్ ధ్వబాహుచ సవన శ్చానఘ స్తథా।

సుతపా శ్శుక్ర ఇత్యేతే సర్వే సప్తర్షయోఽమలాః॥

యోసా వగ్న్యభిమానీ స్యాత్ బ్రాహ్మణస్తనాయోఽగ్రజః।

తస్మా త్స్యా హాసుతాన్ లేభే త్రీ నుదారౌజసో ద్విజ॥

పావకం పవమానంచ శుచించాపిజలాశినమ్॥

తేశామ్తుసంతతా వన్యేచత్వారింశ చ్చ పఞ్చచ।

కత్యన్తేవహ్నయశ్చైతీపితాపుత్రత్రయంచయత్॥

ఏవమేకోనపంచాశద్వహ్నయః పరికీర్తితాః॥

పితరోబ్రహ్మణాసృష్టా వ్యాఖ్యాతా యేమయా తవ।

అగ్నిష్వాత్తా బర్హిషదోఽనగ్నయస్సాగ్నయశ్చయే॥

తేభ్య స్స్వదాసుతేజజ్ఞేమేనాం వైతరణీంతథా॥

తేఉభేబ్రహ్మవాదిన్యౌయోగిన్యౌచాప్యుభేద్విజ।

ఉత్తమ జ్ఞానసంపన్నే సర్ వైస్సముదితైర్ గుణైః॥

ఇత్యేశాదక్షకన్యానాం కథితాఽసత్యసంతతిః।

శ్రద్దావాన్ సంస్మర న్నేతాం నానపత్యోభిజాయతే॥

క్రతువను ముని భార్య సంతతి వాలఖిల్యులను నరువదివేల మంది యూర్ద్వ రేతస్కులై కుమారులం గాంచెను. వారు బొటన వ్రేలి కణుపంత యాకారము గలవారు. మధ్యందిన సూర్య ప్రభావంతులు వసిష్ఠునికి ఊర్జ యందేడుగురు మహర్షులు. బ్రహ్మ యొక్క పెద్దకొడుకు యీ అగ్న్యభిమాని దేవత వలన స్వాహాదేవి మహౌజ స్సంపన్నులయిన ముగ్గరు సుతులం గనెను. ఆ యిర్వురు బ్రహ్మవాది యోగినులును మంచిజ్ఞాన సంపత్తి గలవారు. సర్వ శుభ లక్షణలు. ఇది దక్ష కన్యాకాల సంతతి. దీనిని శ్రద్ధతో స్మరించిన వాడు సంతానహీనుడు గాడు.