124 - అధ్యాయము

మూ॥ నారాయణ ఉవాచ :

రాధా సంపూజ్య విధివాస్తుత్వాలంబోదరం సతీ ।

అమూల్యరత్న నిర్మాణం సర్వాంగ భూషణం దదౌ ॥

రాధాయాఃపూజా - శ్రీనాధ స్తవనంశ్రుత్వా పూజాం దృష్ట్వాచ వస్తుచ ।

ఉవాచ మధురం శాంతః శాంతాం త్రైలోక్య మాతరం॥

శ్రీగణేశ ఉవాచ :

తవ పూజా జగన్మాతః లోకశిక్షా కరీశుభే ।

బ్రహ్మస్వరూపా భవతీ కృష్ణవక్షః స్థలస్థితా ॥

యత్పాదపద్మమతులం ధ్యాయంతే తే సుదుర్లభం ।

సురాబ్రహ్మేశ శేషాద్యామునీంద్రాః సనకాదయః ॥

జీవన్ముక్తాశ్చ భక్తాశ్చ సిద్ధేంద్రా కపిలాదయః ।

తస్యప్రాణాధి దేవీత్వం ప్రియాప్రాణాధికాపరా ॥

వామాంగనిర్మితా రాధాదక్షిణాంగశ్చ మాధవః ।

మహాలక్ష్మీః జగన్మాతా తవ వామాంగనిర్మితా ॥

వసోః సర్వనివాసస్య ప్రసూస్త్వం పరమేశ్వరీ ।

వేదానాం జగతామేవమూలప్రకృతిరీశ్వరీ ॥

సర్వాః ప్రాకృతికా మాతః సృష్ట్యాం చతద్విభూతయః ।

విశ్వానికార్యరూపాణి త్వంచకారణరూపిణీ ॥

 ప్రళయబ్రహ్మణః పాతే తన్నిమేషోహరేరపి ।

ఆదౌరాధాం సముచ్చార్య పశ్చాత్కృష్ణం పరాత్పరం ॥

స ఏవసoడితో యోగీ గోలోకం యాతిలీలయా ।

వ్యతిక్రమే మహాపాపీ బ్రహ్మ హత్యా లభేధ్ద్రువం ॥

జగతాంభవతీమాతా పరమాత్మా పితాహరిః ।

పితురేవ గురుర్మాతా పూజ్యావంద్యా పరాత్పరా ॥

భజతే దేవమన్యంవా కృష్ణంవా సర్వకారణం ।

పుణ్యక్షేత్రే మహామూడో యదినిందతి రాధికాం ॥

వంశహానిర్భవేత్తస్య దుఃఖశోకమి హైవచ ।

పచ్యతేనిరయేఘోరే యావచ్చంద్ర దివాకరౌ ॥

గురుశ్చజ్ఞానో ధ్గి రణాత్ జ్ఞానంస్యాన్మంత్ర తంత్రయోః ।

సచ మంత్రశ్చతత్తంత్రం భక్తిః స్యాధ్ద్రువయోర్యతః ॥

నిషేవ్య మంత్రం దేవానాం జీవా జన్మని జన్మని ।

భక్తాభవంతి దుర్గాయాః పాదపద్మేసుదుర్లభే ॥

నిషేవ్యమంత్రం శంభోశ్చ జగతాం కారణస్యచ ।

తదా ప్రాప్నోతి యువయోః పాదపద్మం సుదుర్లభం ॥

యువయోఃపాదపద్మంచ దుర్లభం ప్రాప్యపుణ్యవాన్ ।

క్షణార్ధం షోడశాంశంచనహిముంచతి దైవతః ॥

నారాయణుడిట్లా - విధిప్రకారము,రాధలంబోదరుని పూజించి స్తుతించి, ఆసతి అమూల్యమైన రత్నములతో నిర్మింపబడ్డ ఆభరణములను అన్ని అవయవములందుకూర్చింది. రాధ పూజ - శ్రీనాథుని స్తుతినివిని, పూజను, వస్తువులను చూచి. శాంతురాలు, త్రిలోకముల మాతయైన ఆమెతో, శాంతుడై మధురంగా ఇట్లన్నాడు (2) శ్రీగణేశుడిట్లా – ఓజగన్మాత! నీవు చేసిన పూజ, శుభమైనది, లోకులకు తెలిపే కొరకుచేసినది. నీవు బ్రహ్మ స్వరూపురాలవు, కృష్ణుని వక్షఃస్థలమందుండే దానివి (3) చాలాదుర్లభమైన, సాటిలేని నీపాదపద్మములను ధ్యానిస్తారు, దేవతలు, బ్రహ్మ ఈశ, శేషాదులు, మునీంద్రులు,సనకాదులు (4) జీవన్ముక్తులు, భక్తులు, సిద్ధేంద్రులు, కపిలాదులు ధ్యానిస్తారు. అతనికి ప్రాణముల అధిదేవివి నీవు. ప్రాణములకన్న అధికమైన దానివి, ప్రియమైన దానివి, పరురాలవు. (5) ఎడమ భాగమందురాధ కూర్చబడింది, కుడిభాగమందు మాధవుడు. జగన్మాత, మహాలక్ష్మి నీ ఎడమ అంగములనుండి నిర్మింపబడింది. (6) అంతట నివసించే వసునకు జననివి నీవు, పరమేశ్వరివి. వేదములకు జగత్తుకు మూలప్రకృతి ఈశ్వరి (7) ఓతల్లి! సృష్టిలోని సర్వప్రాకృతికములు నీ విభూతలే. విశ్వములు కార్యరూపములు, నీవు కారణరూపిణివి. (8) ప్రళయమందు బ్రహ్మపడిపోతే హరికి అది నిమేషము. తొలుత రాధను చెప్పి తరువాత పరాత్పరుడైన కృష్ణుని చెప్పాలి. (9) ఆతడే పండితుడు, యోగి, అవలీలగా గోలోకానికి వెళ్లుతాడు. తలక్రిందుల ఉచ్చరిస్తే (రాధాకృష్ణ అనాలి. కృష్ణ రాధ అనరాదు) మహాపాపీ ఔతాడు. బ్రహ్మహత్య పాపాన్ని పొందుతాడు, నిశ్చయము. (10) జగత్తులకు నీవు తల్లివి, పరమాత్మ హరి, తండ్రి మాత తండ్రికే గురువు. పూజ్యురాలు, నమస్కరింపతగినది. పరముకన్న పరమైనది. (11) ఇతర దేవునిభజిస్తే, సర్వకారణుడైన కృష్ణుని భజిస్తే, మహామూఢుడై పుణ్యక్షేత్రమందు రాధికను నిందిస్తే (12) వానికి వంశహానిఔతుంది. ఇక్కడే దుఃఖశోకములు కల్గుతాయి. సూర్యచంద్రులున్నంత వరకు ఘోరమైన నరకమందు వండబడుతాడు. (13) గురవనగా జ్ఞానము స్పష్టంగా బోధించేవారు. మంత్రతంత్రముల జ్ఞానం కలవాడు. ఆ మంత్రము ఆతంత్రము ధ్రువులైన వారి ఇద్దరి భక్తి కావలెను. (శాశ్వతమైనవారిది). (14) దేవతల మంత్రమును సేవించి జీవులు జన్మజన్మలలో, సుదుర్లభమైన, దుర్గ పాదపద్మములందు భక్తులౌతారు. (15) జగత్తునకు కారణమైన శంభుని మంత్రాన్ని సేవించి, చాలా దుర్లభమైన మీ పాదపద్మములను చేరుతాడు. (16) దుర్లభమైన మీ పాదపద్మములను పొంది, పుణ్యవంతుడు, క్షణంలో సగభాగాన్ని, పదహారవ భాగాన్ని, దైవవశాత్తు వదలడు.

మూ ॥ భక్త్యాచ యువయోర్మంత్రం గృహీత్వా వైష్ణవాదపి ।

స్తవంవాకవచంవాపి కర్మమూలనికృంతనం ॥

యోజయేత్పరయా, భక్త్యా పుణ్యక్షేత్రేచభారతే ।

పురుషాణాం సహస్రంచ స్వాత్మనా సార్థముద్ధరేత్ ॥

గురుమభ్యర్చ్య విధివత్ వస్త్రాలంకారచందనైః ।

కవచంధారయే ద్యోహి విష్ణుతుల్యోభవేధ్ద్రువం ॥

యద్దత్తంవస్తుమేమాతః తత్సర్వం సార్థకంకురు ।

దేహివిప్రాయమత్ప్రీత్యా తదాభోక్ష్యామి సాంప్రతం ॥

దేవేదేయాని దానానిదేవే చేయాచదక్షిణా ।

తత్సర్వంబ్రాహ్మణేదద్యాత్ తదనంత్యాయ కల్పతే ॥

 బ్రాహ్మణానాం ముఖంరాధే దేవానాం ముఖముఖ్యకం ।

విప్రభుక్తంచ యద్ద్రవ్యం ప్రాప్నువంత్యేవ దేవతాః ॥

విప్రాంశ్చభోజయామాసతత్సర్వం రాధికాసతీ ।

బభూవతత్క్షణాదేవ ప్రీతోలంబోదరోమునే ॥

ఏతస్మిన్నంతరే దేవాః బ్రహ్మేశశేష సంజ్ఞకః ।

ఆయయుఃవటమూలంచ దేవపూజార్థమేవచ ॥

తత్రగత్వాశివచరో దేవాన్ దేవీరువాచసః ।

శ్రీకృష్ణం శుష్కకంఠశ్చ భయభీతశ్చ రక్షకః ॥

రక్షక ఉవాచ :

గణేశం పూజయామాస సర్వాదౌచ శుభక్షణే ।

వృషభానుసుతారాధా ప్రకృత్య స్వస్తివాచనం ॥

సహితాసాబలవతీ గోపీత్రిశతకోటిభిః ।

వారితోఽహం బలిష్ఠాభిః యుష్మాంశ్చ కథయామితత్ ॥

సర్వాదౌపూజయేద్యోహి సోఽనంతం ఫలమాలభేత్ ।

మధ్యే మధ్యవిధంపుణ్యం శేషే స్వల్పమితిస్మృతం ॥

దేవేంద్రేషు మునీంద్రేషు దేవస్త్రీషు స్థితాసుచ ।

గోపీభిశ్చ సహతయా రాధయాపూజితః పరః ॥

దూతవాక్యం సమాకర్ణ్య జహాసుః సర్వదేవతాః ।

మునయోమనవశ్చైవ రాజానోదేవయోషితః ॥

రుక్మిణ్యాద్యారమణ్యశ్చ యా దేవ్యోవిస్మయం యయుః ।

 సరస్వతీచ సావిత్రీ పార్వతీ పరమేశ్వరీ ॥

భక్తితో మీమంత్రాన్ని వైష్ణవుని నుండి స్వీకరించి, పఠిస్తే అదిస్తవమైనా కవచమైనా కర్మల మూలాన్ని నశింపచేస్తుంది. (18) పుణ్యక్షేత్రమైన భారతమందు మిక్కిలి భక్తితో పఠిస్తే, వేయిమంది పురుషులను తననుగూడా ఉద్దరించుకుంటాడు. (19) శాస్త్ర ప్రకారము వస్త్ర అలంకార చందనములతో గురువును పూజించి కవచమును మదిలో ధరిస్తేవాడు విష్ణుతుల్యుడౌతాడు, నిశ్చయము. (20) ఓతల్లి! నాకిచ్చిన వస్తువులనన్నీ సార్థకము, చేయి. నా ప్రీతికొరకు బ్రాహ్మణులకివ్వు. అప్పుడు నేను తింటాను. (21) దేవునకిచ్చిన దానములు (ఇవ్వవలసిన) దేవునకిచ్చే దక్షిణ, అదంతా బ్రాహ్మణునకివ్వాలి. అది అనంతఫలాన్ని ఇస్తుంది. (22) ఓరాధ! బ్రాహ్మణుల ముఖమనేది దేవతల ముఖ్యముఖము. బ్రాహ్మణుడు తిన్న పదార్థమును దేవతలు పొందుతారు. (23) ఆ రాధిక సతి, దానినంతా బ్రాహ్మణులతో భుజింపచేసింది. ఆక్షణంలోనే లంబోదరుడు సంతుష్టుడైనాడు, ఓముని! (24) ఇంతలో దేవతలు బ్రహ్మ, ఈశ, శేష అను పేర్లు గలవారు, దేవపూజ కొరకు, వటమూలమునకు వచ్చారు. (25) అక్కడికివెళ్ళి శివుని అనుచరుడు దేవతలకు, దేవతల స్త్రీలకు ఇట్లా చెప్పాడు. ఆ భటుడు, కంఠం ఎండిపోగా, భయముతో వణికిపోతూ కృష్ణునితో ఇట్లన్నాడు. (26) రక్షకుడిట్లా - ఒక శుభక్షణమందు అందరికన్న ముందుగా గణేశుని, వృషభానుసుతయైన రాధ, స్వస్తివాచనాన్ని మొదలు పెట్టి పూజించసాగింది. (27) మూడువందల కోట్ల గోపికలతో ఆమెకూడి ఉంది. బలవంతురాలు. బలిష్ఠులైన, వారితోనేను వారింపబడ్డాను. ఆవిషయం మీకు చెబుతున్నాను. (28) అందరికంటే మొదలు ఎవరు పూజిస్తే వారికి అనంతఫలం లభిస్తుంది. మధ్యలో పూజిస్తే మధ్యరకమైన ఫలము, చివరపూజిస్తే స్వల్పమైన ఫుణ్యము అని విన్నాను. (29) దేవేంద్రులు, మునీంద్రులు, దేవస్త్రీలు ఉండగా, గోపికలతో కూడా ఆరాధ పరుని పూజించింది. (30) దూతవాక్యమును విని దేవతలంతా నవ్వారు. మునులు, మనువులు, రాజులు, దేవతా స్త్రీలు నవ్వారు. (31) రుక్మిణి మొదలగు స్త్రీలు ఉన్న దేవేరులు అంతా ఆశ్చర్యపోయారు, సరస్వతి, సావిత్రి, పరమేశ్వరి పార్వతి ఆనందించారు.

మూ॥ రోహిణీచ సతీసంజ్ఞా స్వాహాద్యా దేవయోషితః ।

ముదితాః ప్రయయుస్సర్వామునిపత్న్యః పతివ్రతాః ॥

మునయోమనవస్సర్వేదేవాశ్చాపినరా స్తథా ।

శ్రీకృష్ణః సగణైః సార్థంయేచాన్యే ప్రయయుర్ముదా ॥

తేసర్వేవివిధైర్ద్రవ్యైః పూజాంచక్రుః శుభక్షణే ।

బలిష్ఠాదుర్బలాశ్చైవం క్రమేణచ పృథక్ పృథక్ ॥

లడ్డుకానాంచ రాశీనాంశతకోటిర్బభూ వహ ।

శర్కరాణాంతదర్ధంచ స్వస్తికానాంతథైవచ ॥

అన్నానాంభవ్యవస్తూనాం శతకోటిర్బభూవహ ।

అసంఖ్యాని ఫలాన్యేవస్వాదూని మధురాణిచ । మధుకుల్యాదుగ్ధకుల్యాదధికుల్యాఘృతస్యచ ॥

 బభూవుః శతసంఖ్యాశ్చ త్రైలోక్యానాంచ పూజనే ॥

పూజాంకృత్వాతుతేసర్వేసమూషుశ్చ సుఖాసనే ।

పార్వతీపరమప్రీత్యారాధాస్థానం సమాయయౌ ॥

సారాధాపార్వతీం దృష్ట్వా సముత్థాయజవేనచ ।

యథాయోగ్యాంచ సంభాషాం చకారసాదరంముదా ॥

ఆశ్లేషణం చుంబనంచ బభూవచ పరస్పరం ।

ఉవాచ మధురం దుర్గా రాధాం కృత్వాస్వవక్షసి ॥

పార్వత్యువాచ :

కింవా ప్రశ్నంకరిష్యామిత్వాం రాధాం మంగలాలయాం ।

గతాతే విరహజ్వాలాశ్రీదామ్నః శాపమోక్షణే ॥

 సతతంమన్మనః ప్రాణాః త్వయ్యేవమయితే తథా ।

న హ్యేవ మావయోర్భేదః శక్తిపురుషయోస్తథా ॥

యేత్వాంనిందంతి మద్భక్తః త్వద్భక్తాశ్చాపిమామపి ।

 కుంభీపాకేచ పచ్యంతే యావచ్చంద్రదివాకరే ॥

రాధామాధవయోర్భేదం యేకుర్వంతి నరాధమా ।

వంశహానిర్భవేత్తేషాం పచ్యంతే నరకేచిరం ॥

యాంతిసూకరయోనించ పితృభిఃశతకై స్సహ ।

షష్టివర్షసహస్రాణి విష్టాయాంకృమయస్తథా ॥

త్వయైవపూజితః పుత్రోనమయాచగణేశ్వరః ।

సర్వాదౌసర్వపూజ్యోఽయం యథాతవతథామమ ॥

యావజ్జీవన పర్యంతంన విచ్ఛేదో భవిష్యతి ।

రాధామాధవయోర్దేవిముగ్ధధావల్యయోర్యథా ॥

సిద్ధాశ్రమేమహాతీర్థే పుణ్యక్షేత్రేచ భారతే ।

నిర్విఘ్నంలభగోవిందం సంపూజ్య విఘ్నఖండనం ॥

రాసేశ్వరీత్వంరసికా శ్రీకృష్ణోరసికేశ్వరః ।

విదగ్ధయావిదగ్ధేన సంగమో గుణవాన్భవేత్ ॥

శ్రీదామ్నః శాపనిర్ముక్తా శతవర్షాంతరే సతి ।

కురుష్వమద్వరేణాద్య కృష్ణేన సహసంగమం ॥

మమాజ్ఞయాదుర్లభయా సువేషం కురుసుందరి ।

సుదుర్లభః కామినీనాం సత్పుంసాసహ సంగమః ॥

చక్రుఃసువేషం రాధాయాః ప్రియాల్యశ్చ శివాజ్ఞయా ॥

రత్నసింహాసనేరమ్యే వాసయామాసు రీశ్వరీం ।

పురతోరత్నమాలాసా రత్నమాలాంగలేదదౌ ॥

రాధాయాదక్షిణే హస్తేక్రీడాపద్మం మనోహరం ।

దదౌపద్మముఖీ పాదపద్మయుగే ప్యలక్తకం ॥

ప్రదదౌ సుందరీగోపీ సిందూరం సుందరం వరం ।

చందనేన సమాయుక్తంసీమంతాధస్థలోజ్జ్వలం ॥

సుచారుకబరీం రమ్యాం చకార మాలతీసతీ ।

మనోహరాం మునీనాంచ మాలతీ మాల్యభూషితాం ॥

రోహిణి, సతి (సంజ్ఞ) స్వాహ మొదలగు దేవతాస్త్రీలు, పతివ్రతలు, మునిపత్నులంతా ఆనందంతో వచ్చారు. (33) మునులు, అందరు మనువులు దేవతలు, నరులు వచ్చారు. తనగణములతో కూడా శ్రీకృష్ణుడు ఇతరులైన వారంతా కూడా తమ తమ వారితో ఆనందంగా వచ్చారు. (34) శుభక్షణమందు వారంతా శుభమైన రకరకాల వస్తువులతో పూజచేశారు. బలవంతులు, బలహీనులు ఇట్లా క్రమంగా, విడివిడిగా అంతా పూజించారు. (35) లడ్డుల రాశులు శతకోట్లు ఐనాయి. శర్కరరాసులు అందులో సగము, స్వస్తికముల రాసులు అంతే ఐనాయి. (36) అన్నము, భవ్యమైన వస్తువులు నూరుకోట్లైనాయి. లెక్కింపరాని పండ్లు, రుచికరమైనవి మధురమైనవి ఉన్నాయి. (37) తేనే కాలువలు,పాలకాలువలు, పెరుగు కాలువలు, అట్లాగే నేయి కాలువలు, నూర్లకొలది ఐనాయి. ముల్లోకముల వారు పూజించుటచే ఐనాయి. (38) పూజచేసివారంతా, సుఖమైన ఆసనములందు కూర్చున్నారు. చాలా ప్రీతితో పార్వతి రాధ ఉన్నచోటికి వచ్చింది. (39) ఆ రాధ పార్వతిని చూచి వేగంగా లేచి, తగిన విధంగా సంబాషణను, ఆదరంతో ఆనందంగా చేసింది. (40) ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ముద్దాడినారు. రాధను తనవక్షమందు చేర్చుకొని దుర్గమధురంగా మాట్లాడింది. (41) పార్వతి ఇట్లా - మంగళమునకు నిలయమైన నిన్ను రాధను ఏమి అడగాలి. శ్రీదాముని శాపం తొలగిపోగానే నీ విరహజ్వాల పోయింది. (42) నా ప్రాణములు, మనస్సు ఎప్పుడు నీయందే, నా పై కూడా నీవు అట్లాగే ఈవిధంగా మనిద్దరికి భేదము లేదు. శక్తి పురుషులకు అట్లాగే (43) నాభక్తులు నిన్ను నిందిస్తే నీ భక్తులు నన్ను నిందిస్తే, వారు సూర్యచంద్రులున్నంత వరకు కుంభీపాకనరకంలో వండబడుతారు. (44) రాధ మాధవులకు భేదం పాటించే నరాధముల వంశం నాశనమౌతుంది. చాలా కాలము నరకంలో వారు వండబడుతారు. (45) నూరుమంది పితరులతో గూడ సూకరయోనులలో జన్మిస్తారు. అరవైవేల సంవత్సరాలు మలము యందు క్రిములౌతారు. (46) గణేశ్వరుని నీవే పూజించావు, నేను పూజించలేదు. అన్నింటికి మొదట ఈతడు అందరికి పూజ్యుడు నీకెట్లాగో, నాకు అట్లాగే పూజ్యుడు. (47) బ్రతికున్నంతకాలము విచ్ఛేదముకలగరాదు. ఓదేవి! ముగ్ధతకు, ధావల్యమునకు ఈరెంటికి భేదం లేనట్లే రాధా మాధవులకు కూడా, భేదం లేదు. (48) సిద్ధాశ్రమమందు, మహాపుణ్యక్షేత్రమందు, మహాతీర్థమందు, భారతదేశంలో, విఘ్నములను నశింపచేసే వానిని పూజించి, అడ్డులేకుండా గోవిందుని పొందుము. (49) నీవు రాసేశ్వరివి, రసికురాలవు, శ్రీకృష్ణుడు రసికేశ్వరుడు. పండితురాలికి, పండితునితో సమాగమము గుణవంతంగా ఉంటుంది. (50) ఓసతి! నూరు వత్సరముల తర్వాత శ్రీరాముని శాపం నుండి విడువబడ్డావు. నా వరంతో ఈవేళ కృష్ణునితో కూడా సంగమమును పొందు. (51) ఓ సుందరి! నా ఆజ్ఞతో, దుర్లభమైన ఆజ్ఞతో మంచివేషం ధరించు. స్త్రీలకు సత్పురుషునితో సంగమము చాలా దుర్లభముకదా. (52) పార్వతి ఆజ్ఞతో రాధకు, ఆమె ప్రియమైన చెలికత్తెలు మంచివేషం వేశారు. (53) ఈశ్వరిని, రమ్యమైన రత్నసింహాసనంలో కూర్చోబెట్టారు. ఎదురుగా రత్నమాల అను ఆమె, రత్నమాలను కంఠంలో వేసింది.(54) రాధయొక్క కుడిచేతి యందు మనోహరమైన క్రీడాపద్మముంచారు. ఒక పద్మముఖి, రాధ పాదపద్మముల యందు లత్తుకను పూసింది. (55) ఒక గోపిక, సుందరురాలు, ఉత్తమమైన సుందరమైన సిందూరాన్ని పెట్టింది. చందనముతో కూడిన సిందూరాన్ని పాపట క్రింది భాగంలో ప్రకాశవంతంగా పెట్టింది. (56) మాలతి అనుస్త్రీ రమ్యమైన చాలా అందమైన కేశపాశాన్ని తీర్చిదిద్దింది. అది మునులకు గూడా మనోహరంగా ఉంది. మాలతి మాలను కొప్పులో అలంకరించింది.

మూ॥ కస్తూరీ కుంకుమార్తంచ చారుచందన పత్రకం ।

స్తనయుగ్మే సుకఠినేచకార చందనాసతీ॥

చారుచంపక పుష్పాణాం మాలాంగంధ మనోహరాం ।

మాలావతీదదౌతస్యై ప్రఫుల్లాం నవమల్లికాం ॥

రతీషురసికాగోపీ రత్నభూషణ భూషితాం ।

తాం చకారాతిరసికాం వరాం రతిరసోత్సుకాం ॥

శరత్పద్మదళాభంచ లోచనం కజ్జలోజ్జ్వలం ।

కృత్వాదదౌ సులలితం వస్త్రంచ లలితాసతీ ॥

మహేంద్రేణ ప్రదత్తంచ పారిజాత ప్రసూనకం ।

సుగంధి యుక్తం తస్యాశ్చ పారిజాతం కరేదదౌ ॥

సుశీలం మధురోక్తంచ భర్తుః పార్షైయథోచితం ।

శిక్షాం చకారనీతించ సుశీలా గోపికాసతీ ॥

స్త్రీణాంచ షోడశకలాం విపత్తౌ విస్మృతాం తయోః ।

స్మరణంకారయామాస రాధామాతాం కళావతీ ॥

శృంగార విషయోక్తంచ వచనంచ సుధోపమం ।

స్మరణం కారయామాసభగినీచ సుధాముఖీ ॥

కమలానాం చంపకానాం దలే చందన చర్చితే ।

చకార రతి తల్పంచ కమలా చాశుకోమలం ॥

చారుచంపకపుష్పంచ కృష్ణార్థం పుటకస్థితం ।

చకారచందనాక్తంచ స్వయంచ పార్వతీసతీ ॥

పుష్పంకేళికదంబానాం స్తబకంచ మనోహరం ।

కదంబమాలాం కృష్ణార్థం విద్యమానాం చకారసా ॥

తాంబూలంచ వరం రమ్యం కర్పూరాది సువాసితం ।

కృష్ణప్రియాచ కృష్ణార్థం చకారవాసితం జలం ॥

ఏతస్మిన్నంతరే సర్వమాశ్రమం సజలస్థలం ।

సాక్షాద్గోరోచనాభంచ దదృశుఃమునయః సురాః ॥

 తేసర్వే విస్మయంగత్వా పప్రచ్ఛుః కృష్ణమీశ్వరం ।

 ఉవాచ భగవాంస్తాంశ్చ సర్వజ్ఞః సర్వకారణః ॥

శ్రీభగవానువాచ:

అభిశప్తాచ శ్రీదామ్నాభ్రష్టశోభాచరాధికా ।

సర్వంజ్ఞానం విసస్మారమద్విచ్ఛేద జ్వరాతురా ॥

విముక్తే వర్షశతకే జ్ఞానం సస్మారసాసతీ ।

 సిద్ధాశ్రమంచ పీతాభం రాసేశ్వర్యాశ్చ తేజసా ॥

పరమాహ్లాదకం తేజః చంద్రకోటిసమప్రభం ।

సుఖదృశ్యంచ సుఖదం చక్షుషాప్రాణినామపి ॥

తచ్చ్రుత్వా పరమాశ్చర్యం మునయో మనవస్తథా ।

దేవ్యశ్చసర్వదేవాస్తే బ్రహ్మేశానాదయస్తథా ॥

కస్తూరి, కుంకుమతో కూడిన సుందరమైన చందనపు ఆకును, చాలా కఠినమైన ఆమె స్తన యుగ్మమందు, చందన అను స్త్రీ ఏర్పరచింది. (58) వాసనతో మనోహరమైన అందమైన చంపక పుష్పముల మాలను బాగా వికసించిన నవమల్లికలను ఆమెకు మాలావతి ఇచ్చింది. (59) రతులయందు రసికురాలైన ఒక గోపి ఆమెనురత్నభూషణములతో అలంకరించింది. రతి రసముయందు ఉత్సుకురాలైన ఆ రాధను, శ్రేష్ఠురాలను, ఇంకా రసికురాలనుగా చేసింది. (60) శరత్కాల మందలి పద్మదళము వంటి కాంతిగల ఆమెకన్నును కాటుకతో ప్రకాశవంతంగా చేసి, లలిత అనుగ్రీ చాలా లలితమైన వస్త్రము నిచ్చింది. (61) మ హేంద్రుడిచ్చిన పారిజాతపు పూవును, మంచివాసనగల దానిని పారిజాతాన్ని రాధ చేతికి ఇచ్చింది. (62) సుశీల అను గోపిక మంచి శీలమును, తీయగా మాట్లాడటను, భర్త ప్రక్కన ప్రవర్తించవలసిన విధానాన్ని, నీతిని గూర్చి బోధించింది. (63) ఆపదలందు మరిచిపోయిన వాటిని స్త్రీలకు చెందిన పదహారు కళలను వాటిని కళావతి రాధ (మాతకు) గుర్తుచేసింది. (64) శృంగార విషయమందు చెప్పబడ్డ, అమృతం వంటి మాటలను, సుధాముఖి అను భగిని (చెల్లెలు) గుర్తుచేసింది. (65) కమలములు, చంపకములు వీని దళములందు చందనము పూసి వానితో రతి కొరకు తల్పమును త్వరగా కోమలంగా కమల సిద్దంచేసింది. (66) దొప్పయందున్న అందమైన చంపక పుష్పాన్ని, చందనంతో తడిపి పార్వతి సతి స్వయంగా కృష్ణుని కొరకు సిద్ధంచేసింది. (67) కేళికొరకు కదంబముల పుష్పాన్ని గుత్తిని, మనోహరంగా కదంబమాలను కృష్ణుని కొరకు ఉండేట్టుగా ఆమె చేసింది. (68) కర్పూరాదివాసనగల, కోరతగిన రమ్యమైన తాంబూలమును, వాసనగల నీటిని కృష్ణుని కొరకు, కృష్ణుని ప్రియ సిద్ధంచేసింది. (69) ఇంతలో నీరున్న ప్రదేశము, స్థలప్రదేశము ఆశ్రమమంతా గోరోచన కాంతిగలదిగా ఐనట్లు మునులు, దేవతలు సాక్షాత్తుగా చూచారు. (70) వారంతా ఆశ్చర్యపోయి, ఈశ్వరుడైన కృష్ణుని అడిగారు. సర్వజ్ఞుడు, అన్నిటికి కారణమైనవాడు, భగవంతుడు వారితో ఇట్లన్నాడు. (71) భగవంతుడిట్లా - శ్రీరామునితో శపింపబడి రాధిక తన శోభను కోల్పోయింది. నావిచ్ఛేదం వల్ల కలిగిన (విరహ) జ్వరంతో ఆతురురాలై తన జ్ఞానాన్నంతా మరిచిపోయింది. (72) నూరు సంవత్సరాలు గడిచాక ఆమె తన జ్ఞానాన్ని స్మరించుకొన్నది. రాసేశ్వరి యొక్క తేజస్సుతో ఈసిద్ధాశ్రమము పీతవర్ణంగా మారింది. (73) ఆతేజస్సు చాలా ఆనందాన్ని కలిగించేది, కోటి చంద్రులతో సమానమైన కాంతి గలది. సుఖంగా చూడతగినది, కళ్ళకు సుఖాన్నిచ్చేది, ప్రాణులకు కూడా. (74) దానిని విని, మునులు, మనువులు, దేవతాస్త్రీలు,దేవతలు, బ్రహ్మ ఈశానాదులు అట్లాగే అందరు మిక్కిలి ఆశ్చర్యపడ్డారు.

మూ॥ జవేనగత్వాతత్ స్థానం భక్తినమ్రాత్మ కంధరాః ।

సర్వేజనాస్తే దదృశుః త్రైలోక్యస్థాశ్చ రాధికాం ॥

శ్వేతచంపకవర్ణాభామతులాం సుమనోహరాం ।

మోహినీం మానసానాంచ మునీనామూర్ధ్వరేతసాం ॥

సుకేశీం సుందరీంశ్యామాం న్యగ్రోధపరిమండలాం ।

నితంబకఠిన శ్రోణింస్తనయుగ్మోన్నతాననాం ॥

కోటిందునిందితాస్యాంతాం సస్మితాం సుదతీంసతీం ।

కజ్జలోజ్జ్వల రూపాంచ శరత్కమలలోచనాం ॥

మహాలక్ష్మీం బీజరూపాం పరామద్యాం సనాతనీం ।

పరమాత్మ స్వరూపస్య ప్రాణాధిష్ఠాతృదేవతాం ॥

స్తుతాంచ పూజితాంచైవ పరాంచ పరమాత్మనే ।

బ్రహ్మస్వరూప నిర్లిప్తాం నిత్యరూపాంచ నిర్గుణాం ॥

విశ్వానురోధాత్ప్రకృతిం భక్తానుగ్రహ విగ్రహాం ।

సత్యస్వరూపాంశుద్ధాంచ పూతాం పతితపావనీం ॥

సుతీర్థపూతాం సత్కీర్తిం విధాత్రీం వేధసామపి ।

మహత్ప్రియాంచ మహతీం మహావిష్ణోశ్చమాతరం ॥

రాసేశ్వరేశ్వరీం రమ్యాంరసికాం రసికేశ్వరీం ।

వహ్ని శుద్ధాంశుకాధానాం స్వేచ్చారూపాం శుభాలయాం ॥

గోపీభిః సప్తభిః శశ్వత్ సేవితాం శ్వేతచామరైః ।

చతసృభిః ప్రియాలీభిః పాదపద్మోప సేవితాం ॥

 అమూల్యరత్న నిర్మాణ భూషణోచ్చైర్విభూషితాం ।

చారుకుండలయుగ్మేన శ్రుతిగండ స్థలోజ్జ్వలాం ॥

సునాసాంగజముక్తార్హాం ఖగేంద్ర చంచునిందితాం ।

కుంకుమలక్తకస్తూరీ స్నిగ్ధచందన చర్చితాం ॥

దధానాంసుకపోలాంచ కోమలాంగీం సుకాముకీం ।

గజేంద్ర గామినీం రామాం కమనీయాం సుకామినీం ॥

కామాస్త్రజయరూపాంచ కామకామ్యాలయాం వరాం ।

 క్రీడాకమల మమ్మ్లానం పారిజాతప్రసూనకం ॥

అమూల్యరత్న నిర్మాణం దధానం దర్పణోజ్జ్వలం ।

నానారత్నవిచిత్రాఢ్యరత్న సింహాసనస్థితాం ॥

పద్మైఃపద్మార్చితం పాదపద్మంచ మంగలాలయం ।

 హృత్పద్మేధ్యాయమానాంచ కృష్ణస్య పరమాత్మనః ॥

కర్మణా మనసావాచా స్వప్నే జాగరణేఽపిచ ।

తత్ప్రీతిం ప్రేమసౌభాగ్యం స్మరంతీం నిత్యనూతనం ॥

 భావానురక్త సంసిక్తాం శుద్ధభక్తాం పతివ్రతాం ।

ధన్యాం మాన్యాంగౌరవర్ణాం శశ్వద్వక్షః స్థలస్థితాం ॥

ప్రియాసు ప్రియభక్తేషు సుప్రియాo ప్రియవాదినీం ।

కృష్ణవామాంగ సంభూతా మభేదాం గుణరూపయోః ॥

గోలోకవాసినీం దేవదేవీం సర్వోపరిస్థితాం ।

వృషభానుసుతాఖ్యాం తాం పుణ్యేక్షేత్రేచ భారతే ॥

వేగంగా ఆమె ఉన్నచోటికి వెళ్ళి భక్తితో తమతలలను వంచి, వారంతా చూచారు. త్రైలోక్య మందున్నవారు కూడా రాధికను చూచారు. (76) తెల్లని చంపకపూవురంగు వంటి రంగుగలది, సాటిలేనిది, చాలా మనోహరమైనది, ఊర్ధ్వరేతస్కులైన మునుల మనస్సును కూడా మోహింపచేసేది. (77) మంచికేశసంపద గలది, సుందరి, శ్యామలవర్ణురాలు, మర్రాకువలె అంతట వర్తులముగా గల, కఠినమైన నితంబములతో కూడిన శ్రోణిభాగముగలది (పిరుదులు, మొలభాగము) స్తనముల జంటతోను, ఉన్నతమైన ఆననము గలది. (78) కోటిచంద్రులనిందించే ముఖముగలది, చిరునవ్వు నవ్వుతున్నది. మంచి పలువరుస గలది, ఆసతి. కాటుకతో ఉజ్జ్వలమైన రూపముగలది, శరత్కాల మందలి కమలము వంటి కళ్ళుగలది. (79) మహాలక్ష్మి బీజరూపురాలు, చాలా మొదటిది, సనాతని, పరమాత్మ స్వరూపానికి ప్రాణ అధిష్ఠాతృదేవత (80) స్తుతించ తగినది, పూజింపబడినది. పరమాత్మ కన్నపరురాలు. బ్రహ్మస్వరూపురాలు, నిర్లిప్తురాలు, నిత్యస్వరూపురాలు, నిర్గుణురాలు (81) విశ్వమును అనుసరించుట వలన ప్రకృతి రూపురాలు, భక్తులను అనుగ్రహించే కొరకు రూ పెత్తినట్టిది. సత్యస్వరూపురాలు, శుద్ధురాలు, పవిత్రమైనది, పతితులను పవిత్రం చేసేది. (82) మంచీ తీర్థమువలె పవిత్రురాలు, మంచికీర్తిని బ్రహ్మలకు గూడా కూర్చేది, గొప్పప్రియురాలు గొప్పది, మహావిష్ణువునకు తల్లియైనది. (83) రాసేశ్వరునకు ఈశ్వరి, రమ్యమైనది, రసికురాలు, రసికులకు ఈశ్వరి, వహ్నితో శుద్ధమైన వస్త్రమును ధరించినది, స్వేచ్ఛా (తన ఇష్టమైన) రూపురాలు శుభమునకు ఆలయము. (84) తెల్లవింజామరలు గల ఏడుగురు గోపికలతో ఎప్పుడూ సేవింపబడేది. నలుగురు ప్రియమైన చెలికత్తెలతో, పద్మముల వంటి పాదములందు సేవింపబడేది (85) అమూల్యమైన రత్నములతో నిర్మింపబడ్డ భూషణములతో బాగా అలంకరింపబడినది, అందమైన కుండలముల జంటతో చెవి ప్రక్కని చెక్కిళ్ళ ప్రాంతమందు ప్రకాశించేది. (86) మంచి నాసిక గలది, గజములతలలోని ముత్యములు ధరించుటకు తగిన నాసికగలది. గరుత్మంతుని ముక్కును తీసివే సేది (నిందిత). అంతకన్న బాగైనది. కుంకుమ, లత్తుక, కస్తూరి, మృధువైన చందనము వీనితో పూయబడినది. (87) మంచి చెక్కిళ్లుగలది, కోమలమైన అవయవములు గలది, మంచికాముకి, గజేంద్రమువంటి నడకగలది, రామ, మనోహరమైనది, మంచికామిని (88) మన్మథుని అస్త్రమునకు జయము కల్గించే రూపముకలది, కామునకు కోరతగిన ఇల్లువంటిది, వరురాలు, వాడని క్రీడాకమలాన్ని, పారిజాత పూవును ధరించింది. (89) అమూల్యరత్నములతో నిర్మించిన, ఉజ్జ్వలమైన దర్పణమును ధరించింది, రకరకాల రత్నాలతో విచిత్రంగా ఉన్న రత్నసింహాసనమందు కూర్చున్నది. (90) పద్మములతో, పద్మతో పూజింపబడిన పాదపద్మము గలది. మంగళములకు నిలయము. పరమాత్మయైన కృష్ణుని హృదయ పద్మమందు ధ్యానింపబడేది. (91) పనిలో, మనస్సులో, మాటలో, కలలో, మెలకువలో ఆతని ప్రీతిని, ప్రేమను, సౌభాగ్యమును, నిత్యనూతనంగా స్మరించేది. (92) భావముయందు అనురక్తురాలై తడిసిపోయినది, శుద్ధభక్తురాలు, పతివ్రత. ధన్యురాలు, మాన్యురాలు, తెల్లని వర్ణము గలది, ఎప్పుడూ వక్షఃస్థలమందుండేది. (93) ప్రియమైన స్త్రీలందు, ప్రియమైన భక్తులందు (పురుషులు) చాలా ప్రీతికలది, ప్రియంగా మాట్లాడేది. కృష్ణుని ఎడమ అంగము నుండి పుట్టినది. గుణరూపములందు ఆతనితో భేదములేనిది. (94) గోలోకమందుండేది, దేవదేవి, అందరికి పైన ఉండేది. పుణ్యక్షేత్రమైన భారతమందు ఆమె వృషభాను సుత అని పేరుగలది, ఆమెను చూచారు.

మూ॥ గోపీశ్వరీం గుప్తిరూపాం సిద్ధిదాం సిద్ధిరూపిణీం ।

ధ్యానాసాధ్యం దురారాధ్యాం వందే సద్భక్త వందితాం ॥

ధ్యానేధ్యానేన రాధాయాధ్యాయంతే ధ్యానతత్పరాః ।

ఇ హైవ జీవన్ముక్తా స్తే పర త్రకృష్ణ పార్శదాః ॥

దృష్ట్వా బ్రహ్మచ సర్వాదౌతుష్టావ పరమేశ్వరీం ।

స్వయం విధాతా జగతాం మాతరం వేధసామపి ॥

బ్రహ్మోవాచ :

షష్టి వరసహస్రాణి దివ్యాని పరమేశ్వరి ।

పుష్కరేచ తపస్తప్తం పుణ్యేక్షేత్రేచ భారతే ॥

త్వత్పాదపద్మ మధురమధులుబ్ధేన చేతసా ।

మధువ్రతేనలోభేన ప్రేరితేన మయాసతి ॥

తథాఽపినమయాలబ్ధం త్వత్పాదపదమీప్సితం ।

నదృష్టమపి స్వప్నేఽపి జాతావాగశరీరిణీ ॥

వారా హే భారతేవర్షే పుణ్యంబృందావనే వనే ।

సిద్ధాశ్రమేగణేశస్య పాదపద్మంచ ద్రక్ష్యసి ॥

రాధామాధవయోర్దాస్యం కుతోవిషయణస్తవ ।

నివర్తస్వమహాభాగ పరమేతత్సుదుర్లభం ॥

ఇతిశ్రుత్వానివృత్తోఽహం తపసే భగ్నమానసః ।

పరిపూర్ణంతదధునా వాంఛితం తపసః ఫలం ॥

శ్రీమహాదేవ ఉవాచ :

పద్మైః పద్మార్చితం పాదపద్మంయస్య సుదుర్లభం ।

ధ్యాయంతే ధ్యాననిష్టాశ్చ శశ్వత్ బ్రహ్మాదయః సురాః ॥

మునయో మనవశ్చైవ సిద్ధాః సంతశ్చయోగినః ।

ద్రష్టుం నైవక్షమాః స్వప్నేభవతీతస్య వక్షసి ॥

అనంత ఉవాచ :

వేదాశ్చ వేదమాతాచ పురాణానిచసువ్రతే ।

అహంసరస్వతీ సంతః స్తోతుంనాలంచ సంతతం ॥

అస్మాకం స్తవనేయస్య భూభంగంచ సుదుర్లభం ।

తవైవ భర్త్సనే భీతాఃశ్చావయోరంతరం హరేః ॥

ఏవందేవాశ్చదేవ్యశ్చాప్యన్యే యేచసమాగతాః ।

ప్రణతాః తుష్టువుస్సర్వేమునిమన్వాదయస్తథా ॥

లజ్జయానమవక్త్రాశ్చ రుక్మిణ్యాద్యాశ్చయోషితః ।

మలీమసంచచక్రుస్తా: శ్వాసేనరత్నదర్పణం ॥

మృతతుల్యాసత్యభామా నిరాహారా కృశోదరీ ।

మనసోఽప్యభిమానంచ సర్వంతత్యాజ నారద ॥

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధే నారాయణ నారద సంవాదే సిద్ధాశ్రమతీర్థయాత్రా ప్రసంగే గణేశ పూజనం బ్రహ్మేశశేషాదికృత రాధికాస్తోత్రం నామచతుర్వింశత్యధిక శతతమోఽధ్యాయః ॥

గోపికలకు ఈశ్వరి, రహస్యరూపమైనది, సిద్ధినిచ్చేది, సిద్ధియే ఆమె స్వరూపము. ధ్యానమునకు సాధ్యురాలుకాదు. ఆరాధించుటకు కఠినమైనది. సద్భక్తులతో నమస్కరింపబడేది, ఆ దేవిని నమస్కరిస్తున్నాను. (96) ప్రతిధ్యానమందు రాధను ధ్యానించే జ్ఞానతత్పరులు, ఇక్కడే జీవన్ముక్తులై వారు పైన కృష్ణుని ప్రక్కనుండే వారౌతారు. (97) బ్రహ్మచూచి, అందరికన్న ముందుగా పరమేశ్వరిని స్తుతించాడు. స్వయంగా బ్రహ్మ జగత్తులకు, బ్రహ్మలకు తల్లిఐన ఆమెను స్తుతించాడు. (98) బ్రహ్మఇట్లా - ఓ పరమేశ్వరి। దేవతల అరవైవేల సంవత్సరాల కాలము, భారతంలో పుణ్యక్షేత్రమైన పుష్కర క్షేత్రమందు తపస్సు చేశాను. (99) నీపాదపద్మముల యందలి తీయని తేనెయందు లుబ్ధమైన మనస్సుతో, లోభంతో ప్రేరితమైన తుమ్మెదవలె మధువ్రతంతో నేను తపస్సుచేశాను, ఓసతి। (100) కోరిన నీపాదపద్మము అటైనా నాకు లభించలేదు. కలలో కూడా చూడలేదు. ఆశరీరవాణి విన్పించింది (101) వరాహకల్పమందు, భారతదేశమందు పుణ్యమైన బృందావన వనమందు సిద్దాశ్రమమందు గణేశుని పాదపద్మాలను చూస్తావు. (102) విషయివైన నీకు రాధామాధవుల దాస్యమెందుకు, ఓమహాభాగ! మరలిపో, ఇది చాలాదుర్లభమైనది, పరమైనది (103) అని విని భగ్నమానసుడనై నేను తపస్సు నుండి విరమించాను. ఆతపః ఫలము, ఆ కోరిక ఇప్పుడు తీరింది (104) శ్రీమహాదేవుడిట్లా - పద్మములతో పద్మపూజించిన పాదపద్మము చాలా దుర్లభమైనది. ధ్యాననిష్టులు, బ్రహ్మాది దేవతలు ఎప్పుడూ ధ్యానిస్తుంటారు. మునులు, మనువులు, సిద్ధులు, సంతులు (సజ్జనులు) యోగులు వీరంతా నిన్ను చూచుటకు అసమర్థులు కలలో కూడా చూడలేరు. నిన్ను ఆతని వక్షఃస్థలమందు చూడలేరు. (106) అనంతుడిట్లా - వేదములు, వేదమాత, పురాణములు ఓ సువ్రతురాల! నేను, సరస్వతి, సజ్జనులు, మేమంతా ఎల్లప్పుడు స్తుతించుటకు సరిపోము (107) మాస్తోత్రం వల్ల ఆమెకనుబొమల కదలిక కూడా చాలా దుర్లభము. నీబెదిరింపు మాటకై భయపడ్డాము. హరికి మాకు భేదము (108) ఈరకంగా దేవతలు, దేవేరులు, వచ్చిన ఇతరులు, నమస్కరించి, మునులు మన్వాదులు కూడా అంతా స్తుతించారు. (109) రుక్మిణి మొదలగు స్త్రీలు సిగ్గుతో తలలు వంచుకున్నారు వారు తమ ఉచ్ఛ్వాసనిశ్వాసములతో రత్నముల అద్దాన్ని మలినంగా చేశారు (110) సత్యభామ, ఆహారం లేక, ఉదరం కృశించి చచ్చినదానివలె ఐంది. ఓ నారద! మనస్సులోని అభిమానాన్ని కూడా అంతటిని వదిలింది. (111) అనిబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణజన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు సిద్దాశ్రమతీర్థయాత్రా ప్రసంగమందు గణేశపూజనము, బ్రహ్మ ఈశ, శేషాదులు చేసిన రాధిక స్తోత్రమనునది నూట ఇరువది నాల్గవ అధ్యాయము.