లింగ మహా పురాణము

Table of Contents

52 - వజ్రేశ్వరీ విద్యా వినియోగము

వజ్రేశ్వరీ విద్యతో వశీకరణము, ఆకర్షణము, విద్వేషణము, ఉచ్ఛాటనము, స్తంభనము, మోహనము, తాడనము, ఉత్సాదనము, ఛేదము, మారణము,  ప్రతిబంధనము, సేనాస్తంభనము మున్నగువానిని చేయ వచ్చును.

“ఆగచ్ఛ వరదేడేవి - భూమ్యాం పర్వత మూర్ధని“ అను మంత్రము నుచ్చరించుచు వజ్రేశ్వరీ గాయత్రీ దేవి నాహ్వానించి జపించియు “బ్రాహ్మణేభ్యో హ్యనుజ్ఞాతా గచ్ఛ దేవి యథాసుఖం” అను మంత్రముతో గాయత్రిని సాగనంపిన పిదపనే యుద్ధమునకు వెళ్లవలెను.

తత్పూర్వము దేవి నాహ్వానించి అగ్నియందు హోమము నొనర్పవలెను. ఈ విద్యతో
వశీకరణాదుల నన్నిటిని సాధింపవచ్చును.

 వశీకరణమునకై - జాజి పువ్వులతో ;                       ముప్పదివేల పర్యాయములు;

ఆకర్షణమునకై - గన్నేరు పూలతో కూడిన ఘృతముతో; ముప్పదివేల పర్యాయములు; విద్వేషణార్ధము - లాంగలిక (ఒకానొక తీగె) పుష్పములతో; ముప్పదివేల పర్యాయములు; ఉచ్చాటనముకొరకు – తైలముతో” స్తంభనమునకై - తేనెతో; ముప్పదివేల పర్యాయములు; మోహనమునకై - నువ్వులతో; తాడనమునకై - రక్తముతో; ముప్పదివేల పర్యాయములు;
స్తంభనార్థము - ఆవాలతో; మోహనార్థము దర్భతో; ముప్పదివేల పర్యాయములు;
మారణోచ్చాటనములకై - ఒకానొక ఓషధి బీజములతో; ముప్పదివేల పర్యాయములు;
బంధనముకై - తమలపాకులతో; సేనాస్తంభనమునకై మణిశిలతో; హవనము నొనర్చి వజేశ్వరిని గాయత్రీ దేవిగా పూజింపవలెను.

పూర్వోక్తములు లభింపనిచో ఘృతక్షీర పరమాన్న హవనము తోడనే వశీకరణాదులను సిద్ధింపజేసికొన వచ్చును. కేవలము తిలలను వ్రేల్చిన యెడల రోగనాశము, కమలపుష్ప హవనముతో ధనసమృద్ధి, ఇప్పపూల హోమముతో శరీరకాంతి సంభవించును.

కనీసము వజ్రేశ్వరీ గాయత్రీ మంత్రమును త్రింశత్సహస్ర (30,000) పర్యాయములు
జపించి  -దశాంశక్రమముగా హవనాదులను నెరవేర్చవలసియుండును.

 హవనాదులను చేయలేనివారు - కేవలము మంత్రమును ప్రతిదినము ఉదయము స్నానాద్యనంతరము సుఖాసనోవిష్ణులై 108 చొప్పున నొక సంవత్సరము జపించి సిద్ధుల నన్నిటిని పొందవచ్చును.

ఇందెంత మాత్రము సంశయము లేదు.

ఇయ్యది

“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (52)వ యధ్యాయము.