లింగ మహా పురాణము

Table of Contents

41 - త్రయోదశమగు సువర్ణ వృషభదాసమును వివరించుట

యథాశక్తి బంగారముతో ధర్మరూసమగు వృషభమును “నొసట అర్ధచంద్రకళఁబోలిన స్ఫటిక నిర్మిత తిలకము, వెండి డెక్కలు, పద్మరాగ మణిస్థగిత కంఠము, గోమేదకమూ పురము, కంఠమున గంటల కడియంబుండునట్లు చేయించవలెను.

 వృషభముపై చిరుగంటల పేరు గల శివమూర్తి నునిచి వేదికపై మండలమున సువర్ణ వృషభముపై శివమూర్తిని మరియు వృషభమును  తీక్ష్ణశృంగాయ విద్మహే  ధర్మపాదాయ ధీమహి తన్నో వృషః ప్రచోదయాత్”  “తత్పురుషాయ విద్మహే - మహాదేవాయ ధీమహి తన్మోరుద్రః ప్రచోదయాత్” అను మంత్రముల నుచ్ఛరించుచు భక్తితో పూజించి ఘృతాన్నాదులను అగ్నిని వ్రేల్చియు - శివ ప్రీత్యర్థము - సద్రాహ్మణునకు దానముఁజేయవలెను.

ప్రతిగ్ర హీతకు - యథాశక్తి - సువర్ణాభరణసహిత మహా దక్షిణను సమర్పించవలెను.

ఇట్లు చేసినవాడు - ప్రారబ్ధాంతమున కైలాసముఁజేరి శివానుచరుఁడై శివునితో గూడ ఆనందించును.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ

 ఆంధ్రానువాద ప్రవచనమున (41)వ యధ్యాయము.