లింగ మహా పురాణము

Table of Contents

14 - పంచ బ్రహ్మ నిరూపణము

“బ్రహ్మమానస పుత్రోత్తమా! శివుని పంచబ్రహ్మరూపముల నవధిరింపు, మని శైలాది సనత్కుమారునకు దిగువవిధము ప్రశంసించెను.

శ్లో ॥ సర్వేషా మేవ లో కాసం- యదుపాదానకారణం ।

నిమిత్త కారణం దాహుః - నశివః పంచధా స్మృతః ॥

“సత్యలోకాది సప్తపాతాళాతము గల పదునాలుగు లోకులులకు (కుండకు మట్టి వలే) ఉపాదాన కారణము, (కుండకు, కుమ్మరివలె) నిమిత్త కారణం సగు శివుడు. ఆయన తెఱుగులుండునని విబుధులైన తత్త్వజ్ఞులు భావించుకున్నవారు.”

ఎట్లనగా?

సర్వలోక శరణ్యుడైన సదాశివుని మొదటి మూర్తి భోగ్యముగను ప్రకృతి వర్గము ననుభవించు జీవాత్మగాఈశానుడనబడును. ఇంక రెండవ మూర్తి తనకు ముఖ్యాధికరణనుగు ‘ప్రకృతిగా తత్పురుషుఁడనగును. మూడవ మూర్తి బుద్ధితత్త్వము నధిష్ఠించునదిగా ఆఘోరమున న్యవహరింపబడును. నాలుగు మూర్తి అహంకారాధిష్ఠాతగా జగత్తునంతయు వ్యాపించునదై, వామదేవుఁడని స్మరింపబడును. ఐడవ సూక్తి మనస్తత్వము నాక్రమించినదై సద్యోజాతుడని పేర్కొనబడును.

మరియొక విధమేమనంగా ?

ఈశానుడు వాగింద్రియముగాను; తత్పురుషుఁడు పాణి (హస్త) ఇంద్రియముగాను; అఘోరుఁడు పాదేంద్రిదియముగాను; వామదేవుడు జీహ్మెంద్రియముగాను; సద్యోజాతుఁడు ఘ్రాణే(ముక్కు) ద్రితయముగాను ప్రాణులందరి శరీరములలో నెలకొని కొసన ఉన్నవారు మరియొక విభాగము నాలకింపుము? ఎట్లనగా?

ఈశానుఁడు వాగింద్రియముగాను; తత్పురుషుఁడు పాణి (హస్త) ఇంద్రియము గాను అఘోరుఁడు పాదేం ద్రియముగాను; వామదేవుఁడు పాయ: (మల విసర్జన) ఇంద్రియముగాను,సద్యోజాతుఁడు ఉపస్థ (మూత్ర విసర్జన) ఇంద్రియముగాను మహనీయులచే పేర్కొనబడిరి.

ఇంక నొక విభాగము నాకర్ణింపుడు ! ఎట్లనగా ?

శబ్దస్పర్శ రూప రస గంధములనఁబడు పంచతన్మాత్రలలో శబ్దము ఈశానుఁడనియు; స్పర్శము తత్పురుషుఁడనియు; రూపము అఘోరుడనియు, రసము వామదేవుడనియు; గంధము సద్యోజాతుఁడనియు శబ్దము ఆకాశజనకమనియు; స్పర్శము వాయుజనకమనియు; రూపము అగ్ని జనకమనియు; రసము జలకారణమనియు; గంధము పృథివీ జనకమనియు; పంచబ్రహ్మతత్త్వవిదులు వక్కాణించిరి.

చరాచర ప్రపంచమంతయు పంచబ్రహ్మాత్మక మగుటచే పంచ బ్రహ్మాత్మకుఁడగు సదాశివుని పంచబ్రహ్మమూర్తుల నారాధించునెడ నట్టి వారికి శివానందము అనుభూయమగును.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (14)వ యధ్యాయము.