లింగ మహా పురాణము

Table of Contents

6 - ఆరవ యధ్యాయము

“విష్ణుభగవానుని మాయావిలాసమును వింటిమి. గాని యా శ్రీహరి వలన జ్యేష్ఠాదేవి ఉదయించిన వృత్తాంతమును వినలేదుగాన వివరింపుము!“ అను శౌనకాదుల ప్రశ్నకు సూతుడు సమాధానమును దిగువవిధము వక్కాణించెను.

అనాదినిధనుఁడు జగద్రక్షకుఁడు నగు నారాయణుఁడు ప్రాణులను మోహింపఁజేయుటకు జగత్తును రెండు విధములుగా విభజించెను. ఎట్లనఁగా ?

వేదములు వేదధర్మములు బ్రాహ్మణులు లక్ష్మీదేవి అనువాని నొక భాగముగాను; జ్యేష్ఠాదేవి వేదబాహ్యులు అధర్మము అను వానిని రెండవ భాగముగాను కల్పించెను.

సముద్రమథన సమయమున హాలాహల విషము వెనువెంటనే అలక్ష్మి యనఁబడు- జ్యేష్ఠాదేవి యుదయించిన తరువాత పద్మశ్రీ యనఁబడు లక్ష్మీదేవి ఆవిర్భవింపగా విష్ణు భగవానుడు లక్ష్మీదేవిని పరిగ్రహించెను. “దుఃస్సహుడు” అను విప్రర్షి జ్యేష్ఠాదేవిని భార్యగా స్వీకరించెను. దు:సహుఁడు జ్యేష్ఠాదేవిని వెంట నిడుకొని లోకమున సంచరించుచుండగా వేద ధ్వని, యజ్ఞక్రతువులు, భస్మరుద్రాక్షాది ధారులు ఉన్నచో జ్యేష్ఠాదేవి భయపడుచు చెవులు మూసికొని ఇటునటు పరుగిడుచుండుటను దుఃసహుఁడు గమనించి అరణ్యమున ప్రవేశించి “ఇక నీ కన్య నెట్లు ఏలుకొనవలె” ననివిచారించుచుండగా మహాత్ముఁడగు మార్కండేయఁడు తటస్థించెను.

అంత దుఃసహుఁడు మార్కండేయునకు నమస్కరించి “ భగవానుడా! ఈమె నా భార్యయై ఎచ్చోటును స్థిరపడుట లేదుగాన నీమెతో కూడ ఎట్టి స్థలమున నివసింపవలెనో, ఎక్కడ నుండరాదో వచింపుము!“ అని ప్రార్థించెను. మార్కండేయుఁడుదుఃసహుని ఆవేదనను గుర్తించి దిగువ విధము వక్కాణించెను.

దుఃసహా! వేద మార్గాను సారులై విష్ణువు నారాధించువారు, భస్మరుద్రాక్షధారులై వేదోక్త విధానమున శివునర్చించువారు, విష్ణునామములను పఠించువారు. “శివశివశివ!  శివాయ నమోనమః, నమః శివతరాయ, నమః శంకరాయ, మహాదేవ మహాదేవ! మహాదేవ! ఉమాయాః పతయే నమః, హిరణ్యపతయే నమః, హిరణ్యబాహవే నమః, వృషాంకాయ నమః, అని శివుని తలచువారు నగు వారి యొక్క ధనగృహాదులలో; ఆరామమునందు, గోష్ఠములయందు నీ జ్యేష్ఠాదేవితో గూడ ప్రవేశింపకుము! స్వాహాకారములు, సామవేద ఘోషయు; వేదాభ్యాసము, సంధ్యా వందనాది నిత్య కర్మాచరణము; అగ్నిహోత్రము; శివలింగపూజనము; విష్ణు విగ్రహము; చండికాదేవీ మూర్తి; నిత్యనైమిత్తికయజ్ఞములను             మహేశ్వర ప్రీత్యర్థము ఆచరించుటయు; శ్రోత్రియులైన బ్రాహ్మణులను గోవులను గురువులను అతిథులను శివభక్తులను నిత్యము పూజించుటయు; గల స్థలములయందు నివసింపవలదు.

“ఇంక నీవు ఈమెతో ప్రవేశించు చోటులను తెలుపుచున్నాను.” అని మార్కండేయుడు దుఃసహునకు దిగువవిధము నిర్వచించెను.

భార్యాభర్తలు పరస్పర విరోధులై కలహించు గ్రహమునందు శివుని నిందించువారి యిండ్లలో విష్ణు భక్తి (లేక) శివభక్తి లేనివారై జపహోమాదికమును భస్మరు ద్రాక్షధారణమును చేయనివారి గృహములలో; చతుర్దశి, కృష్ణాష్టమి అను తిథులయందు శివునర్చింపనివారి గేహములయందు; హరినామును స్మరింపక దుర్మార్గులతో కూడి కాలముఁగడుపువారి యొక్కయు బ్రాహ్మణులై వేదము నుచ్చరింపక గురువులను పూజింపక శ్రాద్ధాదుల నాచరింపని వారి యొక్కయు ప్రతిదినము రాత్రియందు కలహించు వారియొక్కయు లింగార్చనము శివమంత్ర జపము లేనివారై శివభక్తులను నిందించువారి

యొక్కయు తమ చెంత అతిథి శ్రోత్రియుడు ఆచార్యుడు గోవులు శివభక్తుడు (లేక) విష్ణుభక్తుఁడు లేనివారి యొక్కయు రుచికరములైన భక్ష్యభోజ్యాదులను బాలబాలికలకు ఆశ్రితులకు నీయక మహాదేవుని (లేక) శ్రీహరిని పూజింపక విధియుక్తముగ హవనము జేయక భక్షించు వారి యొక్కయు పాపాత్ములు కఠిన స్వభావులు నగువారి యొక్కయు ప్రాకారాదులను పాడుచేయ గృహిణి గలవారి యొక్కయు గృహములలో సభార్యుడవై నిర్భయముగా నివసించి సంతోషించుచుండుము!

మరియు ముండ్లు గల చెట్లు, అనుమతీగె, బ్రహ్మవృక్షము, అగి సెచెట్టు, జిల్లేడు మున్నగు పాలుగల చెట్లు, గన్నేరు చెట్టు, నంది వర్ధనవృక్షము, మంకెన చెట్టు, మల్లెతీగ, పెండ్లి కాని పడుచు, అజమోద, తమను చ్వేషించువాడు, జటామాంసి, అరటిచెట్టు, ఏలకి (బాహుల) చెట్టు, కత్తి, తాటిచెట్టు, జీడిచెట్టు, కడపచెట్టు, పనస చెట్టు, చండ్ర చెట్టు, మఱ్ఱి చెట్టు, రావి చెట్టు, మామిడి చెట్టు, మెడి చెట్టు ఇంటియందు గాని తోటలోగాని వేపచెట్టుపై కాకీగూడు, కఱ్ఱతో గూడ, నరకపాలమును చేత బట్టుకొను ఆడుది, పనికత్తె యొకర్తు, మూడు ఆవులు, ఐదు గేదెలు, ఆరు అశ్వములు, ఏడు ఏనుగులు, కాళికాదేవీ విగ్రహము, భయంకరురాలైన ప్రేత సదృశురాలు నగ డాకినీదేవి, భైరవ విగ్రహము, బౌద్ధాదిమూర్తులు, శయనమునందు ఆసనోపవేశమున భోజనమునంద

నడచులులోను జీవన వృత్తిని సాగించుటయందును శివకేశవ నామోచ్చారణము లేకుండ బయు శ్రౌతస్మార్త బహిష్కృతులైన పాషండులు, విష్ణుభక్తి లేని వారు, శివనిందకులు, నాస్తికులు, కుత్సితులున గల చోట్లలో చొటుబడి నిశ్చింతగా నుండుము!

శ్లో॥ సర్వస్మాదధికత్వంయేన వదంతి పినాకినః ॥

సాధారణం స్మరంత్యేనం సభార్య స్త్వం సమావిశ ॥

శ్లో॥ బ్రహ్మా చ భగవా విష్ణుః – శక్రః సర్వసురేశ్వరః ॥

రుద్రప్రసాదజాశ్చేతి న వదంతి దురాత్మకాః ।

శ్లో॥బ్రహ్మాచ భగవాక్ విష్ణుః శక్రశ్చ సమఏవ చ ॥

వదంతి మూఢాః ఖద్యోతం భానుం వా మూఢచేతసః ।

తేషాల గృహే సథానేత్ర అవాసేవా సవారినయా॥

“పరమేశ్వరునకు ప్రపంచమమున కన్న సభికత్వమును చెప్పక శిపున సాధారణచేసిన ఆ మును గ్రహదేవుడు, విష్ణు భగవానుడు, దేవేంద్రుఁడును వాసు గ్రహమువలన  అందునా నను తలవని మురారుల యొక్కయు, బ్రహ్మదేవుడు, శ్రీహరి,సురాధిపతి, సూర్యులు, మందుగురుపురుపు (ఖద్యోతము) సమాసులు అని నిర్వచించు మూములు.అనుకున్న కారు పడియుండుగా ఎంపమున గాని భార్యతో గూడ నెల్లకాలమునముందుము!

 పక్వమైన ఆహారమును దేవతలకు అథిదులకు నిడక భుజండు బుద్ధిహీసులు స్నాన భస్మముం దుకు భార్య ని ప్రారంభ కార్యములు చేయువారు ఆచము నుపకేం సంస్కారము లేనిదై సక్యాపక నన నను. చను గు, సంసచనము వలన వస్త్రధారణను మలినడంతంబులును గల మాములు పాప ప్రక్షాళన రాహిత్యము, సంధ్యాకాలు ఆయన భోజనములు,అత్యాహారము అపానమని డ్యూతము వాక్క లహము బ్రహ్మస్వహరణము అయోగ్యులను పూజించు బయు శూద్రాన్నభోజనము ముచ్యపానము మాంసభక్షణము పరస్త్రీ గమనము పర్వకాలములయందైనను ఇష్టదైవము నారాధింపకుండుటయు దివా మైథునము సంధ్యాకాలసంభోగము శునకాచుల వలె షష్టభాగమున మైధునము నాచరించుటయు ఉదకమునందు మై మనము రజస్వలను

చండాల స్త్రీని కసును పొంచు బయు ఆవుల కొట్టములో సురతము నిత్యకర్మరాహిత్యము శివ భక్తి శూన్యత ఓషధీన లేపనములో “నేసి డ్రమును స్తంభింపజేసి ఎకకాలము సంభోగించుచు స్త్రీ భగ డ్రామము నొనకి ఎవఁ జేయుముయు గలవారి జేయుండుము! “

ఇట్లు మార్కండేయ మహాముని మసహంనకు వక్కాణించి యంతర్ధానముఁ జెంచెను.

అంత విపులు ఆశ్రమములు అనుకాని నడుమ గల రావిచెట్లలో నివసింపుము! నేను పాతామున బ్రవేసించి మన సహనము న స్థలము నన్వేషించి వచ్చిన “ నని దుఃసహుఁడనగా నీవు వచ్చు. వరుకు నాకు సహాయము నెవడా సగును? “ అని జ్యేష్ఠాదేవి ప్రశ్నించెను. నన్ను అనేక ఎడ భువ్య భోజ్యాది సమర్పణములో అరాధించు గ్రహణుల యొక్క ఇండ్లలో ప్రవేశింపకుము! అనఁగా వారు సమర్పించు పచారములు నీకు ఆహారమగునని భావము) అని దుఃసహుడు చెప్పి పాతాళబిలము గల ఉదరమున ము మూలము రాకుండాను,

ఆపివప జ్యేష్ఠాదేవి - గ్రామపర్వత బాహ్యస్థలములయందు తిరుగాడుచు దైవ వశాత్తు గోచరించిన విష్ణుభగవానునకు నమస్కరించి నొభర్తయిలు నన్ను విసర్జించి వెళ్లినంచున అనాధురాలనైతిని గాన నాకు జీవనోపాధి నను గ్రహింపు “ మని ప్రార్థింపగా శ్రీహరి-మందస్మితముతో నిట్లు ప్రవచించెను.

“శంకరుని పార్వతీ దేవిని నా భక్తులను నిందించువారి సొత్తంతయు నిన్ను చెందును. శివుని నిందించుచు నన్ను పూజించువారి యొక్కయు శివు నాజ్ఞతో శ్రీహరి, బ్రహ్మదేవుడును కర్తవ్యములను నిర్వహించుచున్నారని గుర్తింపక, నన్ను చ్వేషించువారి యొక్కయు గృహధన క్షేత్రాదికమంతయు నీవేను.” అని నిర్వచించి అలక్ష్మీ చర్శన దోషపరిహారార్థము రుద్రాధ్యాయమును శ్రీహరి జపించెను.

అందువలన విదితమైన దేమనఁగా? విష్ణుభక్తులు సువాసినీ స్త్రీలును అనేక విధ భోజ్యములను జ్యేష్ఠాదేవికి సమర్పించుచుండినచో దారిద్ర్యము తొలగి - ధన కనక వస్తు వాహనాదులు సమృద్ధములుగా లభించుచుండును.

జ్యేష్టాదేవీ వృత్తాంతము గల ఈ అధ్యాయమ నాసక్తితో పఠించువాడు. ఓపికతో వినువాడు, ద్విజోత్తమ స్త్రీ పురుషులకు నెమ్మదిగా వినుపించువాడును. ఇహలోకమున శ్రీమంతుఁడై ప్రారబ్బాంతమున మోక్షమునొందును.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక “ యను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున
శ్రీమల్లింగ మహాపురాణగత ద్వితీయ భాగమందరి (6) వ యధ్యాయము.