లింగ మహా పురాణము

Table of Contents

67 - యయాతి వృత్తాంతము

యయాతి రువాచ-యయాతి దిగువవిధము ప్రత్యుత్తరించెను. “ప్రజలారా! జ్యేష్ఠునకు రాజ్యము లభింపని కారణమును వివరింతును. నా జ్యేష్ఠకుమారుఁడైన యదువు నాక్యమును  పాటింపలేదు.

శ్లో॥ మాతాపిత్రో ర్వచనకృత్ సద్భిః పుత్రః ప్రశస్యతే । సపుత్రః పుత్రపద్యస్తు - వర్తతే మాతృపితృషు ॥

“తలిదండ్రుల మాటనంగీకరించువాడు నిజమైన పుత్రుఁడనియు; ఎవఁడు తలిదం(డ్రులకు విధేయుఁడై భక్తి శ్రద్ధలతో వారికి నుపచరించువో వాడే - 1 పుత్రుఁడు” అను సార్థకనామధేయుడనియు సత్పురుషులు నిర్వచించిరి. తుర్వసుఁడు అను రెండవ కుమారుఁడు, ద్రుహ్యుడను తృతీయ పుత్రుఁడు, ఆనువు ఆను నాలుగవ కొమరుడు నాకోరికను ధిక్కరించిరి. పురువు అను పంచమ పుత్రుడే నా ముసలితనమును స్వీకరించి తన యౌవనము నొసగి నందున వాడే రాజ్యార్హుఁడగును. తన పుత్రికయగు దేవయానిని నేను పరిగ్రహించినందున శుక్రాచార్యుడు - కృష్ణుడై-ముసలి వాడ వగుదువు! అని శపించెను.

అంతనేను పలువిధముల ప్రాధేయపడినందున నాకు కలుగబోవు వార్ధక్యము ఇతరులకు సంక్రమించునట్లు, నీ నీ కుమారులలో నీ కోరికను ఫలింపజేయు వాడే రాజ్యార్హుడగునట్లును వరము నొసగెను. ఇట్లు యయాతి చెప్పగా బ్రాహ్మణాది ప్రజలు యయాతి యొక్క నిర్ణయము నామోదించుటయే గాక - శుక్రాచార్యుని వరము వ్యర్థము కాదని నుడివిరి.

ఇట్లు ప్రజానుమోదము (బడసిన యయాతి పురువును సార్వభౌమునిగా నొనర్చి
తూర్పుదిశయందు తుర్వసును, దక్షిణ దిశయందు యదువును, పడమరయందు ద్రుహ్యుని, ఉత్తరమున అనువును సామంత రాజులుగా నియమించెను. సప్త ద్వీపములను శౌర్యముచే జయించిన యయాతి- తన కుమారులకు అధికారముల నొసగినవాడై సంతృప్తి (జెంది దిగువవిధము ప్రబోధించెను.

తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనునట్లు మానవుఁడు స్త్రీ రతి మొదలగు వాంఛలను తనలో నిముడ్చుకొనవలెను.

న జాతు కామః కామానా ముపభోగేన శామ్యతి । హవిషా కృష్ణవర్మేవ- భూయ ఏవాభివర్ధతే ॥ యత్ పృథివ్యాం జొహియవం హిరణ్యం పశవః స్త్రియః । నాల మేకస్య తత్సర్వ మితి మత్వాశమం వ్రజేత్॥

“కామము అనుభవముతో శమింపదు “ఘృతాది హవిస్సుతో అగ్నివలె “మరల
మరల పెంపొందుచునే యుండును.”

భూమియందు గల వరి ధాన్యము, యవలు మున్నగునవి, సువర్ణము మొదలగు
ధనము, వృషభ గజతురగాది పశువులు, తరుణులు (ఇవి యన్నియు) ఒకనికి
చాలవని గుర్తించి వాంఛల నణచుకొనవలెను.’’

ప్రాణులందరి విషయమై ద్రోహమును మనోవాక్కాయములచే తలపెట్టనివాడు- బ్రహ్మమును పొందును. ఇతరులవలన భయపడక తాను పరులను భయపెట్టక పరులను నిందింపక ద్వేషింపకుండువాడు బ్రహ్మమును పొందును. దుర్మార్గులు విడువరానిది, తాను జీర్ణించినను జీర్ణింపనిది. ప్రాణాంతక రోగంబునగు తృష్ణ (ఆశ) ను పరిత్యజించినచో సుఖము చేకూరును.

వెంట్రుకలు, దంతములు, నేత్రములు, క్లర్ణము (చెవు) లు జీర్ణించును గాని తృష్ణ- జీర్ణింపదు. మరియు జీవితమునందు ధనమునందును ఆశ- పెంపొందుచుండును. లోకమునందు గల కామోపభోగసుఖము, స్వర్గమున గల దివ్యసుఖంబు, ఆశను విడిచినందు వలన కలుగు సుఖములో పదునారవభాగము గూడ కావు.

ఇట్లు యయాతి మహారాజు ప్రజలకు సందేశము నిడినవాడై భార్యలతో కూడ వనమునఁబ్రవేశించి- భృగుతుంగ స్థలమున ఉపవాసముతో శివ పంచాక్షర మంత్ర జపరూపముగు తపస్సునొనర్చియు, అంత్యకాలమున కైలాసముఁజేరెను.

ఇట్టి యయాతి చరితమును పఠించువాడు, వినువాడును సర్వపాపవినిర్ముక్తులై శివలోకమున శాశ్వత నివాసము గలవారగుదురు.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (67)వ అధ్యాయము.