లింగ మహా పురాణము

Table of Contents

1 – ఉత్తరార్థము - ప్రథమాధ్యాయము

“పరశివ తాదాత్మ్యము గల శ్రీమహావిష్ణువు సంగీతకీర్తనలతో సంతోషించును.

అంబరీషుఁడు ప్రశ్నింపగా మార్కండేయుఁడు ఇవ్విషయమును నిర్వచించెను.

నారాయణుని స్మరించులు, పూజించుట, భక్తితో నమస్కరించుటయు అశ్వమేధయాగఫలము నొసఁగును.

త్రేతాయుగమున కౌశికుఁడు అను బ్రాహ్మణుఁడు వాసుదేవ పరుఁడై విష్ణు క్షేత్రములయందు హరిమందిరముల యందును సామవేదగానముఁజేయుచు ఆసనమునందు, భోజనమున, నకయందును నారాయణునే తలచుకొనుచు భిక్షాశనుఁడై యుండగా పద్మాకుఁడనువాడు కౌశికునకు ద్యః పాకాన్నమును సవ్యంజనముగ నిడుచున్నందున కౌశికుఁడు సంతుష్టాంతరంగుడై శ్రీహరిని సంగీతములతో నత్యంతము ప్రార్ధించుచుండెను. ‘పద్మాక్షుడును కౌశికుని హరిగానమున వినుచుండెను. కౌశికుని గానము దినదిన ప్రవర్ధమానమగుచుండగా - శిష్యులనేకులు ఏర్పడినవారు

కౌశికగానమును వినుచుండిరి. పద్మాక్షుడు వారందరికిని ఆహారము నొసఁగచుండెను. మాలవుఁద అను వైశ్యుఁడు- విష్ణుభక్తితో హరిమందిరములలో దీపములను వెలిగించుచుండెను.

పతివ్రత మాలవుని భార్యయు నగు మాలవి- విష్ణుమందిర ప్రాంగణమునంతయు

గోమయోదకముతో శుభ్రపరచుచు కౌశికుని సంగీతము నాసక్తితో వినుచుండెను.

ఇట్లు కౌశికుని సంగీతస్తుతి ప్రసిద్ధమైనంచున కలింగ రాజు ఏతెంచి తనను పొగడు మనం కౌశికుడు “ విష్ణుభగవానుని దక్క నితరులను ప్రార్థింప “  నని ప్రత్యుత్తరించెను. కౌశిక శిష్యులును నుడివిరి,

అందువలన రాజు కోపించి యాదేదుంప రాజానుచరులు కుంగు పొగడకుండగా నా పొగడ్తను వినకూడదని కౌశికుఁడు, తవసుయాయులును చెవులు మూసికొని నాలుకలు ముడుచుకొనిరి.

అందువలన రాజు కోపాతిశయమున వారి విత్తాదులను బలాత్కారముగ గైకొని స్వదేశమునుండి వెడలగెట్టెను. ఆ పిదప వారందరు మరణించి యమలోకముఁజేరగా యమధర్మరాజు వీరందరికి ఎట్టి ఫలమును చేకూర్చవలెనని చింతించి పుచుండగా “ వీరు శ్రీహరిని గానములతో కొలిచిరి గాన వీరందరిని బ్రహ్మలోకమునకు పంపుముని“ ఆకాశవాణి చెప్పగానే యముడు వారందరి బ్రహ్మలోకమునకు విమానములలో పంపెను. బ్రహ్మదేవుడు వారందరిని తోడ్కొని వైకుంఠమనకు వెళ్లగా శ్రీహరి వారందరిని కరుణతో గాంచి కాశికాదులారా!“ అని అనుగారగముతో ఆహ్వానించినందున వైకుంఠములో జయశబ్దము చెలరేగెను.

అట్టితఱి - సహస్రకోటి దివ్య స్త్రీ సహితయై లక్ష్మీదేవి విష్ణు ప్రియమైన గానముఁజేయుచూ శ్రీహరి ముందు నిలువఁబడగా తుంబురపు వీణను వాయించుము మృధుమధురముగ పొడినందున శ్రీహహి సంతోషించి నానావిధ వర్ణా భరణములతో తుంబురువును సత్కరించెను. ఆందువలన నారదుఁడీ వృత్తాంతమును విని బాధపడుచు దివ్య సహస్రత్సరములు శ్రీహరి నుద్దేశించి తపస్సు చేయగా నారాయణుఁడు ప్రసన్నుడాయెను.