లింగ మహా పురాణము

Table of Contents

20 -  విష్ణునాభి కమలము నుండి బ్రహ్మదేవుని జననము, హరిబ్రహ్మలకు శివదర్శనమున్ను

ఋషయ ఊచుః - శౌనకాది మహర్షులు ప్రశ్నించిరి.

పూర్వము పాద్మకల్పమునందు బ్రహ్మదేవుఁడు విష్ణువు యొక్క నాభి (బొడ్డు) కమలమునుండి ఉదయించె నెట్లు ? హరి బ్రహ్మలు మహేశ్వరు నవలోకించిన గతంబెద్ది ?

సూత ఉవాచ = సూతమహాముని చెప్పఁదొడఁగెను. పాద్మకల్పమునకు ముందు ఈ ప్రపంచము భయంకరమైన జలసముద్రముగా. చీకటి నిండినదైయుండెను. ఆ సమయమున నారాయణుఁడు వేయి పడగలు గల ఆదిశేషునిపై శివధ్యానమును చేయుచు పరుండెను.

ఆతఁడు తన మహిమచే విస్తృతమైన కమలమును తన నాభియందు పుట్టించెను. అట్టితఱి బంగారు వన్నెగల రూపముతో ఏకార్ణవమున శేషశయనముపై కమలము నాడించు శ్రీహరిని గాంచి సమీపించియు సౌమ్యవచనముతో “నీవెవడవు?” అని యడుగగా - శ్రీహరి శేషపర్యంకమునుండి లేచిన వాడై ఆశ్చర్యముచే వికసించిన కనులతో ప్రతికల్పమునందును బ్రహ్మాండమునకు ఆశ్రయము నొసఁగువాడను. భూరాకాశములు స్వర్గ మర్త్య పాతాళములు పరమ పదమార్గము అనువాని నేర్పరచువాడను. నీ వెవరు? ఎందుకిట కేతెంచితివి? అని బదులు చెప్పెను.

అట్టితటి చతుర్ముఖుఁడు శివమాయామోహితుఁడై - “నీవెంతటివాడవో నేను నంతటివాడనై సృష్టికి ఆదికర్తనగువాడను.” అని వచింపగా నారాయణుడు ఉత్సాహముతో బ్రహ్మదేవుని నోటిలో చోఱిబడి లోన అష్టాదశ ద్వీపములను చతుస్సముద్రములను మహాపర్వతములను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములు గల ప్రజలను గాంచుచు పదునాలుగు లోకములయందు వేయి వత్సరములు సంచరించి ఆహా! ఈతని తపశ్శక్తి - అపారమైనదని భావించుచు బ్రహ్మముఖము నుండి బయలుపడియు “భగవానుడా! ఈ జగత్తు యొక్క ఆది మధ్యాంతములు నీ వేను; నీ ఉదరము (కడుపు) యొక్క చివరను చూడఁ జాలకుంటిని. నీవు గూడా నా ఉదరములో ప్రవేశించి నాలోని లోకముల నన్నిటిఁగాంచు” మని శ్రీహరి నుడువగా బ్రహ్మదేవుఁడు నారాయణుని గర్భములో ప్రవేశించి చతుర్దశ భువనములు మొదలగు వానిని దర్శించి నిర్గమ మార్గము నన్వేషించు (వెదకు) చుండెను. అంత శ్రీహరి శరీరరంధ్రముల నన్నిటిని బిగింపగా - బ్రహ్మదేవుఁడు తన రూపమును చిన్నదిగా చేసికొని విష్ణుమూర్తి యొక్క నాభి కమల ద్వారము నుండి వెలువడిన వాడై కమలమునందు శోభించుచుండెను. కమలమునందు బ్రహ్మదేవుఁడు ఉండుటచే కమలదళములు ఒకదానికి మరియొకటి తాకుచు రెపరెపలాడుచుండెను. ఇంతలో నా ఏకార్లవమున సర్వభూతాధిపతియగు మహేశ్వరుఁడచ్చోటునకు త్రిశూలపాణిగాను సువర్ణవస్త్రాచ్ఛాదితుఁడు గాను సాక్షాత్కరించి ఉదకమున అడుగులు వేయుచుండగా ఉదకబిందువులు ఆకాశము పైకి ఎగురు చుండెను. వాయువు - మిక్కిలి వేడిగాను, అతిశయము చల్లగాను వీచుచుండెను. అప్పుడు బ్రహ్మదేవుఁడు “ఉదక బిందువులు శీతోష్ణ వాయువులును నీ నాభికమలమును కదిలించుచున్నవి గాన నీ యుదంతము నెఱిగింపుము! లేక నీవే కోపముతో నీ విధము నొనర్చుచున్నావా? అని శ్రీహరిని ప్రశ్నించెను.

ఇట్టి బ్రహ్మవాక్యమును విని శ్రీహరి కొంత తడవు ఆలోచించి - “నీవు నా ఉదరమునఁ బ్రవేశించి - వెళ్లుదారిఁగానక ఆందోళనఁజెంది నా నాభికవులముదగు నాళము ద్వారా బయలుపడనున్నందుకు సంతోషించితిని” అని వచింపగా బ్రహ్మదేవుఁడు “దేవా! ప్రస్తుతము నేనేమి చేయవలెను? అని పంకజాసనుఁడు యడుగగా పంకజాక్షుఁడిట్లనియెను.

 “నీవు నాలోన ప్రవేశించిన తఱి శరీర ద్వారములను బంధించి నందుకు అన్యథా భావింపవలచు. ఒక విధముగా ఆలోచించినచో నీవు నాకు మాన్యుఁడవు పూజ్యుఁడవు నని తెలిసికొంటిని. తేజోమయుఁడవై శ్రేష్ఠుఁడవగు నిన్ను సహింపలేను. నా నాభికమలమునందు నివసింపక త్వరలో బయలుపడి నాకు కుమారుఁడవు కమ్ము! నీవు ప్రణవాత్మకుఁడవై ప్రజలందరిచే నుతింపఁబడుదువు! ఇప్పటి నుండి నీకు  “పద్మయోని” అను పేరు ప్రసిద్ధమగు గాక!

 “మరియు నా కుమారుఁడవై భూలోకము మొదలుకొని సత్యలోకము వరకు సప్త (7) లోకములకు అధిపతివి కాలగవు” అని వరము నొసఁగెను.

ఇట్లు హరిబ్రహ్మలు ఒండొరులను సంప్రదించుకొని యుండగా - బాలసూర్యుని కాంతి గలవాడై అత్యద్భుతముగా గానంబడు మహా పురుషుని బ్రహ్మదేవుఁడు చూచి  “పెద్దనోరు, కోఱలు గలిగి కురులను విరబోసుకొని భయంకరముగా నాట్యము (జేయుచు సమీపించుచున్న నీ మహాయోగి ఎవరు?” అని ప్రశ్నింపగా నారాయణుఁడు “ఈతఁడు అరికాళ్లతో చఱచగా సముద్రజలము ఆకాశము నంటుచున్నది. ఈతని నిట్టూర్పుతో నా నాభికమలము వణకుచున్నది. ఈతడు గొప్ప మహిమ గలవాడు. ఆద్యంత రహితుఁడు ప్రళయము నొనర్చు మహా ప్రభువునై యున్నవాడు. నీవు నేను (ఇరువురము) ఈతనిని ప్రార్థించెదము.

అంత బ్రహ్మదేవుఁడు కృష్ణుఁడై “కేశవా! నన్ను గుర్తింపకున్నావు! నేను సనాతనుఁడనై లోకకర్త నగు చున్నానని నీకు తెలియదా? ఈ శంకరుఁడెట్టివాడు? అని వచింపగా శ్రీహరి ఇల్లు మాటలాడకుము! ఈ మహాత్ముని తిరస్కరింప పలదు. మహాయోగ సిద్ధుఁడైన నీతఁడు ఎవరికిని లొంగని వాడై ధర్మస్వరూపుఁడగునని తెలియుము!

మరియు నీ జగత్తునకు కర్తయే గాక జగద్బీజము గలవాడై సూర్యచంద్రాది తేజస్సులను ప్రకాశింపజేయు మహా జ్యోతిస్సునై బ్రహ్మాండములను బంతులతో బాలుని వలె ఆడుకొనుచుండును. ప్రధానము - అవ్యయుఁడు - యోని - అవ్యక్తము - ప్రకృతి - తమస్సు అను నామములు నాకు సంబంధించినవి.

“ఎవఁడు పరమాత్మ? ఎట్లు ధ్యానింపవలెను? ఇత్యాది ఆవేదనతో గురూపదిష్ట మార్గమున యతులు ధ్యానించి ఈ శివుని తమ హృదయాకాశములో గాంచుచుందురు.

శ్లో॥ ఏష బీజీ భవా? బీజ మహం యోనిః సనాతనః ।

“ఈతఁడు బీజి కాగా నీవు జీజము, నేను యోనినైతిని.

అని వచింపగా బ్రహ్మదేవుఁడు నేను బీజము, నీవు యోని, ఎట్లు? అని ప్రశ్నించెను. అంత శ్రీహరి ఇట్లు ప్రవచించెను. ఈతనికంటె గొప్పవాడు లేడు. ఈతని పరమధామము శివలోకమని చెప్పబడును. ఈతడు నిరాకారము సాకారము నను రెండు విధములుగా తన స్వరూపమును విభజించెను. నిరాకారము శివలింగము గాను, సాకారము మహేశ్వరుఁడుగాను పేర్కొనబడును. పూర్వము మహాలింగమునుండి యుద్భవించిన సృష్టికారణంబు నగు బీజమును యోనిస్వరూపుఁడనగు నాయండు మహేశ్వరుఁడు నెలకొలుపగా - ఆయ్యది కాల క్రమమున హిరణ్యయమగు అండముగా సముద్రజలమునందు పరిణమించెను. వేయి సంవత్సరముల తరువారు - వాయువు అండమును రెండుగా విభజించెను. అండము యొక్క పైభాగము అంతరిక్షము కాగా. కింది భాగము భూలోకమయ్యెను. అండద్వయ మధ్య గతమైన గర్భావరణము మేరు పర్వతముగా పరిణమించెను. ఆ పిదప కపాలద్వయ మధ్య నుండి నీవు ( బ్రహ్మదేవుఁడు) ఉదయించి సూర్యచంద్ర నక్షత్రములు లేనట్టి శూన్య ప్రదేశమును తిలకించి - ఇదేమిటి ?” అని చింతించుచుండగా వేయేండ్ల తరువాత నలుగురు ముమారులు ఉద్భవించిరి - వారు చూడగానే ప్రియము గొలుపువారై అగ్నిసమానులై కమలడములఁబోలిన కన్నులు
గల వారునై యుండిరి.

మరియు “సనత్కుమారుఁడు ఋభువు - సనకుడు - సనాతనుడు -  సనందుడు” ను పేరులు గలవారై ఏకకాలమునందే ఆవిర్భవించి - జితేంద్రియులై లోక స్థితి కారకులునై యుండిరి.

మరియు వీరు ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధీ డైవికములనఁ బడు తాపత్రయము లేనివారై కర్మలను ప్రారంభింపని వారు స్వల్పసుఖము అధిక కష్టములు, ముసలీతనము, దుఃఖము, జీవసము మరణము, పునఃపునః జన్మించుటయు, స్వర్గాది లోకముల యందు గల సుఖ లేశము, నరములలో గల ఇడుములు, అనుదానిని కనుగొని విరక్తులై యుండిరి. మరియు నో బ్రహ్మదేవా! ఋభువు, సనత్కుమారుఁడు నీ వశవర్తులు కాగా - సనకాదులు ముగ్గురు మిశ్రములైన సత్త్వరజస్తమోగుణములుయుగు మాయయొక్క మోహము లేనివారై యుండిరి. ఇట్లు వారు ప్రవర్తించుచుండగా నీవు శివమాయా మోహితుడవై ఒక కల్పము అనఁబడు రాత్రి కాలమున తెలివి దప్పి యుంటివి. ప్రాణులందరినీ మాయ ఆవహించును. అట్టితఱి ఈశ్వరుడు మాత్రము స్వయం ప్రకాశమనుడునుగా నున్నాడని గుర్తించి నేను (విష్ణుమూర్తిని) ఉన్నాననియు, జీవాత్మల నందరి నను గ్రహించునట్టి మహాదేవుఁడు సమస్తజగత్ ప్రభువనియు తెలియపలెను.

 పరమేశ్వరుఁడు రాణించుటకు ఆధారమగు ప్రణవ ( ఓంకార ) ముతో సామంతులుతోడను శివునకు ప్రణమిల్లి జాగరూకుఁడవు కమ్ము! లేనిచో నీ సదాశిపుడు కోపోద్రిక్తుఁడై తన వేడి మా చేతనే నిన్ను నన్ను కాల్చివేయును.

ఇట్లు ఈ పరాత్పరుని మహిమను మహా శక్తిని గ్రహించి పధేయుడవు కము, లెమ్ము! నిన్ను ముందిడుకొని నేనీ మహానుభావుని ప్రార్థించెదను “ అని (శ్రీహరి) ప్రవచించెనని సూరుఁడు శౌనకాదులకు వివరించి విరమించెను.

ఇయ్యది

“శివవిజ్ఞాన వీచిక “అను శాంకరీయ ఆంధ్రానువాడ

ప్రవచనమున (20) వింశాధ్యాయము.