లింగ మహా పురాణము
104 - విఘ్నేశ్వరుఁడు ఉదయించుటకై దేవతలు శంకరుని ప్రార్థించుట
“వినాయకుడు ఏనుగమోముతో జన్మించిన వృత్తాంతమును విశదీకరింపుము! “అని శౌనకాదులు ప్రశ్నింపగా సూతుఁడు చెప్పఁదొడఁగెను.
ఇంద్రోపేంద్రాది దేవతలు ఒకచో గుమిగూడినవారై “దైత్యులు బ్రహ్మదేవునారాధించి వరముల బొంది ధర్మకార్యములకు విఘ్నములను కలిగించు చున్నారు గాన వారికి తపోవిఘ్నములను మనకు విజయమును చేకూర్చుటకు నొకానొక మహాపురుషు నుదయింప జేయుటకు శంకరుని ప్రార్ధించెదము.” అని తీర్మానించుకొనిరి.
శ్లో॥ నమ స్సర్వాత్మనే తుభ్యం- సర్వజ్ఞాయ పినాకినే ॥
శ్లో॥ అనఘాయ విరించాయ- దేవ్యాః కార్యార్థదాయినే ।
అకాయాయార్ధకాయాయ-హరేః కాయాపహారిణే ॥
శ్లో॥ కాయాంతస్థామృతాధార - మండలావస్థితాయ తే ।
కృతాదిభేదకాలాయ- కాలవేగాయ తే నమః ॥
శ్లో॥ కాలాగ్నిరుద్రరూపాయ- ధర్మాద్యష్టపదాయ చ ।
కాలీ విశుద్ధదేహాయ- కాలికాకారణాయ తే ॥
శ్లో॥ కాలకంఠాయ ముఖ్యాయ-వాహనాయ వరాయ తే ।
అంభిపతయే తుభ్యం- హిరణ్యపతయే నమః ॥
శ్లో॥ హిరణ్యకేతసే చైవ - నమః శర్వాయ శూలినే ।
కపాల దండ పాశాసి - చర్మాంకుశధరాయ చ ॥
శ్లో॥ పతయే హైమవత్యా శ్చ- హేమశుక్లాయ తే నమః ।
మేతశుక్లాయు వక్షార్థం - సురాణాం కృష్ణవర్త్మనే ॥
శ్లో॥ పంచమాయ మహాపంచ - యజ్జినాం ఫలదాయ చ ।
పంచాస్యఫణిహారాయ - పంచాక్షరమయాయ తే ॥
శ్లో॥ సంసధా పంచ కైవల్య - దేవై రర్చిత మూర్తయే ।
పంచాక్షరదృశే తుభ్యం- పరాత్పరతరాయతే ॥
శ్లో॥ షోడశస్వర వజ్రాంగ-వక్త్రాయాక్షయరూపిణే ।
కాదిపంచక హస్తాయ- చాదిహస్తాయ తే నమః ॥
శ్లో॥ టాది పాదాయ రుద్రాయ- తాదిపాదాయతే నమః ఈ
పాదిమేడ్రాయ యద్యంగ-ధాతుసప్తకధారిణే ॥
శ్లో॥ సాంతాత్మ రూపిణే సాక్షాత్ - క్షదంత క్రోధినే నమః ।
లవరేఫహళాం గాయ- నిరంగాయ చ తే నమః ॥
శ్లో॥ సర్వేషా సేన భూతానాం - హృది నిఃస్పనకారిణే ।
భ్రువో రంతే సదా సద్భి- ర్దృష్టాయాత్యంతభానవే ॥ 19
శ్లో॥ భానుసోమాగ్నినేత్రాయ - పరమాత్మస్వరూపిణే ।
గుణత్రయోపరిస్థాయ- తీర్థపాదాయ తే నమః ॥
శ్లో॥ తీర్థపత్త్వాయ సారాయ -తస్మాదపి పరాయ తే ।
ఋగ్యజుః సామవేదాయ- ఓంకారాయ నమోనమః ॥
శ్లో॥ ఓంకారే త్రివిధం రూప-మాస్థాయోపరి వాసినే ।
పీతాయ కృష్ణవర్ణాయ-రక్తా యాత్యంతతేజసే ॥
శ్లో॥ స్థానపంచక సంస్థాయ - పంఛధాంఽడబహిః క్రమాత్ ।
బ్రహ్మణే విష్ణవే తుభ్యం- కుమారాయ నమోనమః ॥
శ్లో॥ అంబాయాః పరమేశాయ-సర్వోపరి చరాయ తే ।
మూలసూక్ష్మ స్వరూపాయ-స్థూలసూక్ష్మాయ తే నమః ॥
శ్లో॥ సర్వసంకల్పశూన్యాయ- సర్వస్మాద్రక్షితాయ తే ।
ఆదిమధ్యాంత శూన్యాయ-చిత్సంస్థాయ నమో నమః ॥
శ్లో॥ యమాగ్ని వాయు రుద్రాంబు-సోమశక్రనిశాచరైః ।
దిజ్ముఖోదిజ్ముఖే నిత్యం - సగణైః పూజితాయ తే ॥
శ్లో॥ సర్వేషు సర్వదా సర్వ-మార్గే సంపూజితాయ తే ।
రుద్రాయ రుద్రనీలాయ-కద్రుద్రాయ ప్రచేతసే ।
మహేశ్వరాయ ధీరాయ నమః సాక్షాచ్ఛివాయ తే ॥
శ్లో॥ అథ శృణు భగవః స్తవచ్ఛలేన - కథిత మజేంద్ర ముఖైః
సురాసురేశైః ! ముఖమదనయమాగ్ని దక్షయజ్ఞ క్షపణ! విచిత్ర
విచేష్టితం క్షమస్వ॥
“ఇట్లు 22 శ్లోకములతో దేవతలు చేసిన శివస్తుతిని పఠించువాడు, వినువాడు, వినుపించువాడు నుత్తమగతి నొందుదురు” అని సూతుడు విరమించెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” యను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (104)వ అధ్యాయము.
