లింగ మహా పురాణము

Table of Contents

52 - గంగాది నదుల ఉత్పత్తిని మరియు ద్వీపములను వర్షములను నిరూపించుట

సూత ఉవాచ:

ద్విజోత్తములైన శౌనకాదులారా !

మానసాది సరస్సుల నుండి యుదయించి - పూర్ణజల ప్రవాహము గలిగియు ప్రాఙ్ముఖముతో దక్షిణముఖముతోడను ఉత్తరముఖముతో పశ్చిమముఖము తోడ నేర్పడిన మహానదులు పవిత్రములుగా పరిగణింపబడినవై హేమ కూటాది నవ (9) వర్షములయందు జంబూ ద్వీపమున సాగుచుండును. ఆకాశమునందు గల సముద్రము సర్వభూతాధారమై దేవతలకు అమృత జలము నొసఁగునఁ “సోమార్ణవము“ అను పేరుతో వ్యవహరింపబడును. సోమసముద్రము నుండి ఆవిర్భవించిన ఆకాశ గంగా సుహానది పుణ్యోదకము గలదై ఏడవ వాయుమార్గమున ప్రవహించుచు నక్షత్రాది జ్యోతి స్సులఁ
దాకుచు వేలకొలది ఖేచరులచే సేవింపఁబడుచుండును.

ఎనుబది నాలుగు (84) వేల యోజనముల ఎత్తుగల మహామేరు పర్వతాగ్రముపై పరమేశ్వరుఁడు సాంబుఁడై సగణుడునై విహరించుచుండును. అందువలన నా మహానది పుణ్యజల భరిత యై మేలు పర్వతము చుట్టు ప్రవహించునదై సలిల విభాగముతో వాయు వేగముతో మేరు పర్వతము యొక్క నాలుగు శిఖరములపై ఆకసము నుండి పడినదియునై పర్వతముల నన్నిటిని లాకుచు శివాజ్ఞవలన భూలోక గత సముద్రమునండు ప్రవేశించినది.

ఈ మహానది నుండి నూర్లకొలది వేల కొలది యుపనదులు ఆవర్భవించినవై
ద్వీసములన్నిటియండు సమస్త పర్వతములయందు సకల వర్షములలోను ప్రవర్తించినవి.

కేతుమాల వర్షమునందు, మానవపురుషులు నల్లని వారుగాను, పనసఫలములను మాత్రము భక్షించువారుగాను, మానవవనితలు కలువ పువ్వు పన్నె గలవారుగా నుందురు. వీరండుకి పది వేల వత్సరములు ఆయుష్యము. ఇక భద్రాశ్వవర్షమునంచు పురుషులు స్త్రీ లును చంద్రకిరణములఁ జోలిన శ్వేతవర్ణము గలవారై సకాలమున లభించు మామిడి పండ్లను మాత్రము భుజించుము రతి ప్రియులై- శివభక్తి సంపన్నులునై పదివేలేండ్లు బ్రతుకుడురు. రమణక వర్షమునందు ప్రాణులు మట్టిపండ్లు మాత్రము ఆహారముగ గలవారై పదునొకండు వేల ఐదు వందల (11,500) ఏడాదులు మనుచు తెలుపు వన్నెగలవారై యుందురు.

హిరణ్మయవర్షమునందు హిరణ్మయ వనమునాశ్రయించి ఈశ్వరార్పిత మానసులై రావి చెట్టు పండ్లను మాత్రము భుజించుచు పన్నెండు వేల ఐదు  నూర్ల (12,500) పత్సరములు జీవింతురు. స్వర్గము నుండి ఏతెంచిన పుణ్యాత్ములు కురు వర్షమున స్త్రీ పురుష సంయోగ జన్ములై క్షీరభోజనులునై ఒకరియందు మరి యొకరు స్నేహము గలవారునై వ్యాధులు దుఃఖము లేనివారునై ఎల్లకాలము సుఖపడుచు పర స్త్రీ వాంఛ లేనివారునై లభించినతో సర్వవిధ ఆహారములను స్వీకరించుచు పదునాలుగు వేల ఐదువందల (14500) వత్సరములు జీవించుచుందురు. శ్యామా గులగు వనితలు సదా తరుణులై పురుషులను సుఖపెట్టుచుందురు.

జంబూ ద్వీపమున కురువర్షము వర్షాంతముల కన్న మిన్నయైనది. అచ్చోటు గూడ
చంద్రశేఖరుని ఆవాసము చంద్రప్రభముగా విరాజిల్లుచుండును.

భరతవర్షమునందు మానవులు పూర్వ జన్మానుభవ శేషమగు స్వల్ప పుణ్యము గలవారై కర్మ ననుసరించి ఆయుష్యము గలవారు కాగా కొందరు శత సంవత్సరజీవనులుగాను, మరికొందరు నానావర్ణములు గల శరీరములు గలవారు గాను, ఆనేక దేవతలను పూజించువారు గాను, నానా విధ కామ్యకర్మ ఫలముల నాశించువారుగాను. అనేకములైన ప్రజ్ఞలు గల వారుగాను దుర్బలులు గాను, స్వల్పసుఖభోగులుగా నుందురు. అనఁగా కలియుగమునందు శివునిపై ఏకాగ్ర భక్తి లేనివారై కుల మత ద్వేషము గలిగియుండురని భావము.

ఇంక ఇంద్ర ద్వీపమునందు కొందరు, కశేరుక ద్వీపము నందు కొండరు, తామ్ర ద్వీసమున కొందరు, గభస్తిమద్వీపమున కొంచరు, నాగద్వీపములో కొందరు, సౌమ్య ద్వీపమునందు కొందరు, గాంధర్వ ద్వీపమున కొందరు, వారుణ ద్వీపమున కొందరు నివసింతురు. తొమ్మిదవదగు జంబూద్వీసమునందు భరతవర్షములోని భరతఖండము చుట్టు సముద్రము గలిగియుండును.

ఐతే మంఛులు (తురుష్కులు) కిరాతులు (బోయవారు) పుళిందులు (అడవిబోయవారు) యవనులు (తురుష్క.. ప్రముఖులు) భరతఖండ ప్రాంత దేశములయందు నివసింతురు. భరతఖండ మధ్యయందు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు శూద్రులు నుందురు. యజ్ఞయాగ జప డేవతార్చనాదికము బ్రాహ్మణ ధర్మము కాగా దుష్ట శిక్షణ శిష్టపరిపాలనాదికము క్షత్రియ ధర్మమగును. వర్తకము వైశ్యధర్మమనియు, త్రైవర్ణికాశ్రయము శూద్రధర్మమనియు తెలియవలెను. నాలుగు వర్ణముల వారికిని ధర్మార్థ కామముల జెందిన సంకల్పము, అభిమానంబు ననువర్తించును. భరతఖండమున మానవులు స్వర్గాదిపుణ్యలోక ప్రాప్తి  కై మరియు మోక్షము కొరకు ప్రయత్నించుచుందురు. కృతయుగాది ధర్మము లిచ్చోటనే యుండును.

కింపురుష వర్షమునందు - పురుషులు బంగారు వన్నెగలవారుగాను, స్త్రీలు అప్సరసలఁబోలిన వారుగా నుందురు. వీరికి పదివేల వత్సరములు ఆయుష్యము. మరియు వీరు నిరోగులై దు:ఖరహితులునై శివభావనగలవారై శుద్ధాంతఃకరణులునై తమ భార్యలయందనురక్తులునై జువ్విచెట్టు పండ్లు మాత్రము భుజించుచుందురు.

హరివర్షము నందు దేవలోకముల నుండి విచ్చేసిన పుణ్యాత్ములు - రజత (వెండి) కాంతి గలవారై అమరులఁ బోలినవారునై చెరుకు రసము మాత్రము త్రాగుటలో జీవించుచు శంకరు నారాధించుచు జరావ్యాధి రహితులునై పదివేల వత్సరములు ఆయుష్యము కలిగియుందురు. ఇలావృత వర్షము నందు సూర్య చంద్ర నక్షత్ర ప్రకాశము లేకయే వెలుతురుండును. కమల వదనులు పంకజనేత్రులు తామర పరిమళము గలవారునై శివునారాధించుచు - జంబూఫలరసాహారులునై ధర్మార్థ కామార్జన - పరిశ్రమ లేనివారై దేవలోకాగతులునై అజరామరులుగా పేర్కొనఁబడుచురు. పదిమూడు వేల వత్సరముల (13000) ఆయుష్యము కలిగిన వారై జంబూఫలరసపానముచే ముసలి తనము ఆకలి ఆయాసము అపమృత్యువు లేని వారుగ నుందురు. అచ్చోటు దేవతలలంకరింప (దగిన సువర్ణము ఆరుద్ర పురుగు వన్నెగలదిగా లభించును.

ఇవ్విధము తొమ్మిది వర్షముల లక్షణములను ఆందు నివసించు వారి వన్నెలను ఆయుష్యమును ఆహారాడులను సంగ్రహించి చెప్పితిని. ఇక హేమకూటాది పర్వత నివాసులఁ గూర్చి చెప్పెదనని సూళుఁడు ప్రారంభించెను.

ప్లక్షద్వీపమునందు గోమేదికము, చాంద్రము, నారదము, దుంధుభి, సోమకము, సుమనస్కము, వై’భ్రాజము నను ఏడు పర్వతములు; శాల్మలి ద్వీపమున కుముదము, ఉత్తమము, వలాహకము, ద్రోణము, కంకము, మహిషము, కకుద్యంతము నను సప్తాచలములు; కుశద్వీపము నందు విద్రుమము, హేమము, ద్యుతిమంతము, పుష్పితము, కుశేశయము, హరిగిరి, మందరము నను ఏడు కొండలు నెలకొనియుండును.

మందములసగా ఉదకములు, అవ్పానిని ధరించుటచే మందర మనబడును.

తత్ర సాక్షాత్ వృషాంకస్తు- విశ్వేశో విమలః శివః । సోమస్సనందీ భగవా-నాస్తే హేమగృహోత్తమే ॥

విశ్వనాథుఁడు, ఆణవ మాయిక కార్మికమలములు బొత్తుగా లేనివాడు, ఉమనెడఁ
బాయనివాడు, నందికేశ్వరుని తనముందు ఉండుమని అనుగ్రహించినవాడు, వృషభవాహనుఁడు నగు సదాశివుఁడు మందరపర్వతమున సువర్ణనిర్మితము, సర్వోత్త మంబు నగు దివ్యభఁనములో నివసించు చుండును.

మందర పర్వతాధిష్ఠాత తపస్సుతో కాశీ క్షేత్రమున ప్రసన్నుఁ జేసికొని నందున మహేశ్వరుఁడు సంతోషించి మందర పర్వతనివాసము నంగీకరించియుండెను.

హేనుకూల పర్వతముపై గంధర్వులు, అప్సరసలున్ను; నిషధపర్వతము నందు శేష వాసుకి తక్షకాది నాగేండ్రులు మరియు ముప్పది తెలుఁగులు గల దేవతలున్ను వైడూర్యమయఘుగు నీలపర్వతము నండు సిద్ధులు మరియు బ్రహ్మర్షులున్ను శ్వేత పర్వతముపై దైత్యులు దానవులున్ను, శృంగవత్ గిరిపై పితరులు, హిమాచలముపై యక్షులు, భూతములు, మహేశ్వరుఁడున్ను నివసింతురు.

శ్లో॥ సర్వాద్రిషు మహాదేవో- హరిణా బ్రహ్మణా బయా । నందినా చ గణైశ్చైవ-వర్షేషు చ వనేషు చ ॥ నీల శ్వేత త్రిశృంగే చ- భగవా న్నీలలో హితః । సిద్దైర్దేవై శ్చ పితృభి-ర్దృష్ఠో నిత్యం విశేషతః ॥

పర్వతములన్నిటియందు సమస్త వర్షముల యందు వనములన్నిటి యందును మహాదేవుడు పార్వతీ దేవితో, శ్రీహరితో, బ్రహ్మదేవునితో, నందితో, ప్రమధగణముల తోడను, నివసించుచుండును.

నీల శ్వేత త్రిశృంగ పర్వతములపై నీలలోహితరుద్రుని సిద్ధులు, దేవతలు, పితరులు
నవలోకింతురు నీలపర్వతము వైడూర్యమయముగాను, శ్వేత పర్వతము తెల్లనిదై హిరణ్మయముగాను, త్రిశృంగాద్రి నెమలి పింఛ వర్ణము గలదై సువర్ణభరితముగా నుండును.

ఈ పర్వత రాజములు జంబూద్వీపమునందు నెలకొనియున్నవి.

ఇయ్యది
“ శివ విజ్ఞాన వీచిక’ అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (52) ఏబది రెండ అధ్యాయము.