లింగ మహా పురాణము
18 - విష్ణు ప్రోక్త శివస్తోత్రము
విష్ణు రువాచ -
శ్లో॥ ఏకాక్షరాయ రుద్రాయ - అకారాయాత్మరూపిణే । ఉకారాయాదిదేవాయ - విద్యాదేహాయ వై నమః ॥
“ఓమిత్యేకాక్షరం బ్రహ్మ” అన్నట్లు వేద ప్రారంభమున అథవా సృష్టి ప్రారంభమున చతుర్ముఖ బ్రహ్మ దేవుఁడు తన నోట నుచ్చరించిన ప్రణవ (ఓంకార) స్వరూపుఁడు, అకార పాచ్యుఁడు, జీవాత్మ సమష్టి రూపుఁడు నగు బ్రహ్మదేవుఁడుగాను; ఉకార వాచ్యుఁడు, మహాసృష్టిలో మొదట నావిర్భవించిన వాడు నగు విష్ణుమూర్తి గాను; అష్టాదశవిద్యాత్మకుఁడు గాను; లేక - పరా విద్యయగు శివషడక్షరీమహా మంత్రము శరీరముగా గలవానిగా నుండు రుద్రునకు.
శ్లో॥ తృతీయాయ మకారాయ - శివాయ పరమాత్మనే, సూర్యాగ్ని సోమవర్ణాయ - యజమానాయ వై నమః ॥
ఓంకారములో మూడవదగు మకారముతో చెప్ప బడు మహేశ్వరుఁడు గాను; తన్మూల స్వరూపుడగు పరమాత్మ యైన శివుఁడు గానుండునట్టి; సూర్యునకు అగ్నికి చంద్రునకును కాంతి నొసగునట్టి; అథవా సూర్యుని వలె జగత్తును ప్రకాశింపఁజేయు వాడు, అగ్నివలె తేజస్సుతో వెలుగొందువాడు, చంద్రునివలె భక్తుల నానంద పఱుచు వాడుగా నుండు నట్టి; శివోపాసకుఁడగు మాహేశ్వరుఁడుగా; అథవా శివ ప్రీత్యర్ధము జపద్రవ్యాది యజ్ఞముల నొనర్చు పుణ్యపురుషుఁడుగా నుండు పరశివునకు నమస్కారము.
శ్లో॥ అగ్నయే రుద్రరూపాయ - రుద్రాణాం పతయే నమః । శివాయ శివమంత్రాయ - సద్యోజాతాయ వేధసే ॥ శ్లో॥ వామాయ వామదేవాయ - వరదాయామృతాయ తే । అఘోరాయాతిఘోరాయ - సద్యోజాతాయ రంహసే ॥ శ్లో॥ ఈశానాయ శ్మశానాయ - అతివే గాయ వేగినే । నమోఽ స్తు శతిపాదాయ - ఊర్ధ్వలింగాయ లింగినే ॥
శ్మశానాయ = మహాశ్మశాన మనఁబడు కాశీ క్షేత్ర స్వరూపుని కొరకు;
శృతి పాదాయ = వేద వేదాంతములచే తెలియఁబడువాని కొరకు;
ఊర్ధ్వలింగాయ = పైపైన అవధి లేని లింగస్వరూపము గలవాని కొరకు;
లింగినే = విచిత్ర రూపముతో కూడిన వాని కొరకు; అని యర్థములు.
శ్లో॥ హేమలింగాయ హేమాయ - వారిలింగాయ చాంభసే । శివాయ శివలింగాయ - వ్యాపినే వ్యోమవ్యాపినే ॥ శ్లో॥ వాయవే వాయువేగాయ - నమస్తే వాయువ్యాపినే । తేజసే తేజసాంభర్త్రే – నమస్తేజోఽధివ్యాపినే॥ శ్లో॥ జలాయ జలభూతాయ - నమస్తే జలవ్యాపినే। పృథివ్యైచాంతరిక్షాయ - పృథివీ వ్యాపినే నమః ॥ శ్లో॥ శబ్ద స్పర్శస్వరూపాయ - రసగంధాయ గంధినే । గణాధిపతయే తుభ్యం - గుహ్యాత్ గుహ్యతమాయ తే ॥ శ్లో॥ అనంతాయ విరూపాయ - ఆనంతానామయాయ చ । శాశ్వతాయ వరిష్ఠాయ - వారి గర్భాయ యోగినే ॥ శ్లో॥ సంస్థితాయాంభసాం మధ్యే - హ్యావయోర్మధ్యవర్చసే । గోప్త్రే హర్ర్తే సదా కర్ర్తే - నిధనాయేశ్వరాయ చ ॥ శ్లో॥ ఆచేతనాయ చింత్యాయ - చేతనాయాసహారిణే । ఆరుపాయ సురూపాయ - ఆనంగాయాంగహారిణే ॥
ఆచేతనాయ = చిత్త జన్యప్రాకృతజ్ఞానము లేని వాని కొరకు; చేతనాయాసహారిణే = జీవాత్మల యొక్క జన్మమరణరూపమగు ఆయాస (శ)మును హరించు (పోగొట్టు) వాని కొరకు;
అనంగాయ = ప్రాకృత శరీరము లేనివాని కొరకు;
అంగ హారిణే = మన్మథుని శరీరమును కాల్చిన వాని కొరకు నని యర్థములు.
శ్లో॥ భస్మ దిగ్ధశరీరాయ - భాను సోమాగ్ని హేత వే ।
శ్వేతాయ శ్వేతవర్ణాయ - తుహినాద్రిచరాయ చ ॥
శ్లో॥ సుశ్వేతాయ సువక్త్రాయ - నమ శ్శ్వేత శిభాయ చ ।
శ్వేతాస్యాయ మహాస్యాయ - నమస్తే శ్వేతలోహిత ॥
శ్వేతలోహిత = తెల్లని నెత్తురు గలవాడా! అని యర్థము
శ్లో॥ సుతారాయ విశిష్టాయ - నమో దుందుభినే హర । శత రూప। విరూపాయ - నమః కేతుమతే సదా ॥
సదా కేతుమతే= ఎల్లకాలము కాంతి గలవాని కొరకు, లేక = నంది ద్వజమునందు గల రధము నధిష్ఠించువాని కొరకు నని - యర్థములు.
శ్లో॥ బుద్ధి శోక విశోకాయ - పినాకాయ కపర్దినే విపాశాయ సుపాశాయ - పశుపాశ వినాశినే ॥
పశువులనబడు జీవాత్మల యొక్క సంసారపాశమును విడగొట్టు వాని కొరకు - పశుపాశవినాశినే అను దాని యర్థము.
శ్లో॥ సుహేత్రాయ హవిష్యాయ - సుబ్రహ్మణ్యాయ సూరిణే ।
సుముఖాయ సువక్త్రాయ - దుర్దమాయ దమాయ చ ॥
శ్లో॥ కంకాయ కంకరూపాయ – కంకణీకృతపన్నగ!
సనకాయ నమస్తుభ్యం - సనాతన! సనందన!
కంకాయ = కపట బ్రాహ్మణ స్వరూపము గల వాని కొరకు;
కంకరూపాయ = యమ ధర్మరాజస్వరూపుని కొరకు అని యర్థములు.
శ్లో॥ సన త్కుమార। సారంగ - మారణాయ మహాత్మనే । లో కాక్షిణే త్రిధామాయ - నమో విరజసే సదా ॥
సారంగ మారణాయ = అర్జును ననుగ్రహించుటకు కిరాత రూపము - దాల్చి మృగపక్ష్యాదులను సంహరించిన వానికొరకు అని యర్థము.
శ్లో॥ శంఖపాలాయ శంఖాయ - రజసే తమసే నమః । సారస్వతాయ మేఘాయ - మేఘ వాహన తే నమః ॥ శ్లో॥ సువాహాయ వివాహాయ - వివాద వరదాయ చ । నమశ్శివాయ రుద్రాయ - ప్రధానాయ నమో నమః ॥
వివాదవరదాయచ = వాదము లేని సరససంభాషణముఁజేయు వారికి వరముల నొసగు వానికొరకు అని యర్థము.
శ్లో॥ త్రిగుణాయ నమస్తుభ్యం - చతుర్వ్యూహాత్మనే నమః I సంసారాయ నమస్తుభ్యం - నమః స్సంసార హేతవే ॥
చతర్వ్యూహాత్మనే = రుద్రమహేశ్వర సదాశివ శివుల యొక్క నాలుగు వ్యూహ (వర్గ)ములుగా నుండువాని కొరకు అని యర్థము.
శ్లో॥ మోక్షాయ మోక్షరూపాయ - మోక్షకర్ర్తే నమో నమః । ఆత్మనే ఋషయే తుభ్యం - స్వామినే విష్ణవే నమః ॥
విష్ణవే = సర్వవ్యాపకుని కొరకు అని యర్థము.
శ్లో॥ నమో భగవతే తుభ్యం - నాగా నాంపతయే నమః । ఓంకారాయ నమస్తుభ్యం - సర్వజ్ఞాయ నమో నమః ॥ శ్లో॥ సర్వాయ చ నమస్తుభ్యం - నమో నారాయణాయ చ ॥ నమో హిరణ్యగర్భాయ - ఆది దేవాయ తే నమః ॥
నారాయణాయ = నరుల సమూహము నార మనఁబడును. నర సమూహము యొక్క హృదయము స్థానముగా గల వాని కొరకు అని యర్థము.
శ్లో॥ నమోఽస్త్వజాయ పతయే - ప్రజానాం వ్యూహ హేతవే । మహాదేవాయ దేవానా - మీశ్వరాయ నమో నమః ॥
ప్రజానాం ప్యూహహేతవే = ప్రజలు గుంపులుగా చేరుటకు కారణమగు వాని కొరకు అని యర్థము.
శ్లో॥ శర్వాయ చ నమస్తుభ్యం - సత్యాయ శమనాయ చ । బ్రహ్మణే చైవ భూతానాం - సర్వజ్ఞాయ నమో నమః ॥ శ్లో॥ మహాత్మనే నమస్తుభ్యం - ప్రజ్ఞారూపాయ వై నమః । చితయే చితిరూపాయ - స్మృతిరూపాయ వై నమః ॥ శ్లో॥ జ్ఞానాయ జ్ఞానగమ్యాయ - నమస్తే సంవిదే సదా । శిఖరాయ నమస్తుభ్యం - నీలకంఠాయ వై నమః ॥ శ్లో॥ అర్ధనారీశరీరాయ - అవ్యక్తాయ నమో నమః । ఏకాదశ విభేదాయ - స్థాణవే తే నమ స్సదా । శ్లో॥ నమస్సోమాయ సూర్యాయ - భవాయ భవహారిణే । యశస్కరాయ దేవాయ - శంకరాయేశ్వరాయ చ ॥ శ్లో॥ నమోఽ౦బికాధిపతయే - ఉమాయాః పతయే నమః । హిరణ్యబాహవే తుభ్యం - నమస్తే హేమ రేతసే ॥ నీలకేశాయ విత్తాయ - శితికంఠాయ వై నమః I కపర్దినే నమస్తుభ్యం - నాగాంగాభరణాయ చ ॥ వృషారూఢాయ సర్వస్య - హర్ర్తే కర్త్రే నమో నమః । వీరశైవాతి రామాయ - రామనాథాయ తే నమః ।
వీరశైవాతి రామాయ = వీరశైవులనఁబడు లింగ ధారి ద్విజులయందు మిక్కిలి ఆసక్తి గలవాని. కొరకు అని యర్థము.
శ్లో॥ నమో రాజాధిరాజాయ - రాజ్ఞా మధిగతాయ తే । నమః పాలాధిపతయే - పాలాశాంకృత తే నమః ॥
పాలాధిపతయే = ప్రజలను రక్షించు ప్రభువులకు అధిపతియగు వానికొరకు
పాలాశాంకృత = మోదుగ కఱ్ఱల హవనముచే గుర్తింప బడువాని కొరకు అని యర్థము.
శ్లో॥ నమః కేయూరభూషాయ - గోపతే తే నమో నమః । నమః శ్రీ కంఠనాథాయ - నమో లికుచపాణయే ॥
లికుచపాణయే = హాలాహల విషము నిమ్మపండుగా హస్తము నందు గలవాని కోరకు ఆని యర్థము.
శ్లో॥ భువనేశాయ దేవాయ - వేదశాస్త్ర। నమోఽస్తుతే । సారంగాయ నమస్తుభ్యం రాజహంసాయ తే నమః ॥ శ్లో॥ కనకాంగదహారాయ - నమస్సర్పోపవీతినే । సర్పకుండల మాలాయ - కటిసూత్రీకృతాహి నే ॥ శ్లో॥ వేదగర్భాయ గర్భాయ విశ్వగర్భాయ తే నమః ।
బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుఁడు పలికెను.
ఇట్లు శ్రీహరి బ్రహ్మదేవుని (నా) తో కూడ శివునిఁ బ్రార్థించి విరమించెను.
ఈ స్తోత్రమును ప్రతిదినము పఠించినచో బ్రాహ్మణులకు వినుపించిన యెడలను
పాపములన్నియు పటాపంచలగును. మరియు పాపాత్ముడైనను దీనిని పఠించినచో పరిశుద్ధుడై బ్రహ్మలోకముఁ జెందును.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద
ప్రవచనమున (18) పదునెనిమిదవ అధ్యాయము.
