లింగ మహా పురాణము

Table of Contents

83 - నక్తవ్రత నిరూపణము

“పవిత్రమైన వ్యపోహనస్తవమును నీవు చెప్పగా ఆసక్తితో విన్నాము. ఇక శివ ప్రతములను వివరింపుము!” అని శౌనకాది మహర్షులు ప్రశ్నింపగా సూతమహాముని దిగువవిధము వక్కాణించెను.

ముని సత్తములారా! పూర్వము నందికేశ్వరుఁడు సనలు మారునకు ఉపదేశింపగా వ్యాసమహర్షి సనత్కుమారుని వలన సంగ్రహించి నాకు చెప్పినవిధంబెట్లనఁగా ?

శుభప్రదములగు శివవ్రతములలో నక్త ప్రతము శ్రేష్ఠమైనదని గుర్తించి - ప్రతినెల శుక్ల కృష్ణ పక్షములందలి అష్టమీ చతుర్థశీ తిథుల యందు అథవా బహుళ అష్టమి మొదలుకొని బహుళ చతుర్దశి వరకు ఏడు దినములలో ఒక సంవత్సరము వరకు సక్తవ్రతము నవలంబించి పరమేశ్వరు నర్చించువాడు- సమస్తయజ్ఞఫల సంపన్నుఁడై ఉత్తమ గతిని పొందును.

నేలపై విస్తరియందు భుజించులు బ్రహ్మచర్యము శాంతచిత్తము శివధ్యానము అనునవి వక్తవ్రతము యొక్క నియమములగును. పూర్ణిమనాడు అమావాస్య యందును నక్తవ్రతాచరణము ముఖ్యమైనది.

ఇట్లు నొక సంవత్సరము కాగానే మాహేశ్వరులకు విధి విధానముగ భోజన తాంబూల దక్షిణలను సమర్పించవలెను.

పన్నెండు నెలలలో ప్రతిపడలయందు గాని, పంచముల యందు గాని, అష్టమి తిథులందు గాని చతుర్థశుల యందుగాని, పూర్ణిమలలో గాని, అమావాస్య లయందు గాని, నక్త వ్రతము నాచరింపవలెను.

ఉదయము మొదలుకొని రాత్రి ప్రారంభము వరకు పాలు మాత్రం త్రాగి ఉపవసించుట నక్తవ్రత మనబడును.

శ్లో॥ ఉపవాసాత్ పరం భైక్ష్యాత్ పర మయాచితం । అయాచితాత్ పరం భైక్ష్యం నక్తం తస్మా న్నకేన వర్తయేత్ ॥

అహోరాత్రోపవాసమున కంటె శ్రోత్రియ బ్రాహ్మణుల యిండ్లలో వండిన అన్నమును
వ్యంజనములతో సహ మధ్యాహ్నమున యాచించి భుజించుట. (భైక్ష్యము) శ్రేష్ఠము. భైక్ష్యమున కన్న లయాచితము (ఎవరైనా సత్కు, లీనులు సమయమునకు తెచ్చి యిచ్చునది) మిన్నయగును. యాచితమును మించినది-నక్తవ్రతమగును. అందువలన నక్త వ్రతము నాచరింపవలసియుండును.

ఎందుకనగా?

దేవతలు పూర్వాహ్ణామున; ఋషులు మధ్యాహ్నమున పితరులు అపరాహ్ణమున (పగలు 2 నుండి 3 వరకు) గుహ్యకాదులు సాయం సంధ్యాసమయమున భుజింతురు. గాన ప్రాణులందరు భుజించిన పిదప తాను భుజించువాడగులుజేసి నక్తవ్రతము ఉత్తమమై చిత్తశుద్ధి ప్రదంబగుచున్నయది.

ప్రాతఃస్నానము, భస్మరుద్రాక్ష ధారణము, సంధ్యావందనాది నిత్యకర్మాచరణము,
ప్రణవశివషడక్షర మహామంత్రజపము, సాయంకాలస్నానాదులచే శుచియై శివు నారాదించి హవిష్యాన్నమును మితముగా భుజించుటయు, సత్య సంభాషణము నేలపై చాపయండు పరుండటయు నక్తవ్రతముఁజేయువారు పాటింపఁగి.

ఇకనొక్కొకమాసమున చేయఁబడు నక్తవ్రతము యొక్క ఫలమును నిర్దేశించుచున్నాను.

పుష్యమాసమున నక్తవ్రత పూర్వకమగు శివారాధనము ధర్మకామార్థమోక్షములు అనెడు నాలుగు పురుషా ములను సిద్ధింపజేయును. మరియు రెండు అష్టముల నుపవసించుటయు పూర్ణిమనాడుకు రుద్రుని ఘృతామలతో నభిషేకించుటయు,

పాలతో నెయ్యితో కూడిన యవధాన్యపిష్ట పదార్థమును శివునకు నివేదించుటయు వైదిక మాహేశ్వర బ్రాహ్మణులకు భోజనము నెడులుయు “భవాయ దేవదేవాయ శివాయ పరమేష్ఠినే నమః” అనుము శాంతి పాఠమును చదువుటయు కపిలగోపును వృషభమును సద్భ్రాహ్మణునకు సమర్పించులుయు అనువానినాచరించినచో ఆగ్నేయాది పుణ్యలోకముల యందు చిరకాలము సుఖించి ముక్తుడగును.

మాఘమాసమున ప్రతిదినము శివు నర్చించుచు నక్తమున పెసరపప్పు, నెయ్యితో కూడిన అన్నము (పులగము) ను భుజించుచు పక్షవ్వయము నందలి- చతుశులయందుఉపవాసముఁజేయుచు - పౌర్ణమినాడు - శివ ప్రీత్యర్థము- నెయ్యి, గొంగళి, నలుపు వన్నెగల- ఆవు ఎద్దును దానముఁ జేసి తన శక్తి కొలది సద్భ్రాహ్మణులకు భోజనాదుల నిడినచో యమలోకమున యమధర్మరాజుతో గూడ సుఖించును.

ఫాల్గునమాసమున-నక్త భోజనము, ఘృతక్షీరములతో కూడిన శ్యామాక (తృణ)
ఛాన్యాన్నసివేచనము, శాంతచిత్తత్వము, జితేంద్రియత్వము, చతుర్దశిని అష్టమి సుపవాసము, పూర్ణిమనాడు రుద్రాభిషేకంబు, మాసాంతమున గోమిధునదానము, బ్రాహ్మణభోజనంబు చేయఁబడిచో చంద్రలోకనివాసము, చంద్రసాయుజ్యంబు-లభించును.

చైత్రమున నక్తవ్రతాదుల నాచరించినచో నిఋతిలోకములో సుఖనివాసము సంభవించును. వైశాఖమున శ్వేత గోమిథునదానాదులతో అశ్వమేధఫలము చేకూరును.

జ్యేష్ఠమాసమున- జలప్రోక్షణముతో పవిత్రమగు ఘృతసహిత రక్తశాల్యన్నమును నివేదించి. అర్ధరాత్రి వరకు గోవులను సేవించియు ధూమ్రవర్ణముగల గోమిథునమును దానము నొనర్చిన యెడల. వాయులోకమున సుఖనివాసము సంఘటించును.

ఆషాఢమాసమున- చెరుకు రసముతో నెయ్యితో పేలపిండితో ఆవుపాలు త్రాగి సక్త సలాములను గావించుచాడు వరుణలోకమునండు సుఖపడును.

శ్రావణమాసమున అరువది దినములలో పండిన వరిధాన్యాన్నమును శివునకు నివేదించి. నక్తప్రతమును చిత్రవర్ణకగోమిథునదానమును, పున్నమనాడు ఘృతాడులతో శివు నభిషేకించి బ్రాహ్మణభోజనాచుల నొనర్చిన వాడు వాయుసాయుజ్యము నొందును.

భాద్రపద మాసమున పగలు బిల్వ వృక్షమూలమంచు చూ త్రము నివసించి.
సలుపువన్నెమూపుగల గోమిథునమును దానము నొనర్చియు బ్రాహ్మణులు భుజింపగా మిగిలీన వంటను భుజించి యుండువాడు యక్షలోకముజేరి యక్షరాజగను,

ఆశ్వయుజమున శివభక్తులకు భోజనాదులను సమర్పించి నీలవర్ణము గల
గోమిథునమును దానమొనర్చియు పున్నమనాడు రుద్రాభ్యాయముతో శివు నభిషేకించి పూజించియు నక్తవ్రతము నాచరించువాడ - ఈశానలోకమునవైభవముతో నివసించును.

కార్తిక మాసమున-నెయ్యితో కూడిన క్షీరాన్నమును నివేదించి నక్తవ్రతమును కపిల
గోమిధునజనమును బ్రాహ్మణభోజనాచుల నొనర్చినచో సూర్యలోకనివాసము సంప్రాప్తమగును.

మార్గశీర్షమున-నక్తభోజనము, నెయ్యిపాలతోకూడిన యవాన్నమును నివేదించుటయు, వేదపారగులు దరిద్రులు కుటుంబీకులు సదాచార పరులు నగు బ్రాహ్మణులకు పున్నమ నాడు శివు నభిషేకించి- భోజనాచులను సమర్పించు బయు, తెలుపు వన్నెగల గోమిథునమును దానమొనర్చులుయు సోమలోకము నాశ్రయించి సోమునితో సూడ సుఖముగ నివసింపజేయును.

అహింస సత్యము దొంగలనము లేకుండులు బ్రహ్మచర్యము ఓర్పు దయ ప్రాతర్మధ్యాహ్నసాయంకాలములయందు స్నానము భూశయనము శుక్లకృష్ణపక్షగత చతుర్దశ్యష్టములయందు ఉపవాసము అనునవి నక్తభోజనునకు ముఖ్యాంగములగునవి.

ఇట్లు ప్రతినెల చేయవలసిన శివవ్రతము నొక సంవత్సరము వరకు చేసినవాడు జ్ఞానయోగము గలవాడై శివసాయుజ్యమునొందును.

జ్ఞానయోగ మనఁగా పరమేశ్వరుఁడు సర్వాత్మనా తనచే ఉపాసింపఁబడుచు ఎట్లు
సాక్షార్కరించునో అట్టి శివదర్శనమే జ్ఞానయోగ మనఁబడును. అని కూర్మ మహాపురాణమున చెప్పబడినది.

ఇయ్యది

“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాచ ప్రవచనమున (83)వ అధ్యాయము.