లింగ మహా పురాణము
76 - శివలీలా విగ్రహములను ప్రతిష్ఠించుటఁదగు ఫలమును నిరూపించుట
సూత ఉవాచ-సూతమహాముని పలికెను.
పరమేశ్వరుని స్వేచ్ఛావిగ్రహములను ప్రతిష్ఠించుటచే కలుగు ఫలములను వివరించుచున్నాను.
శ్లో॥ స్కందోమాసహితం-దేవ మాసీనం పరమాసనే । కృత్వా భక్త్యా ప్రతిష్ఠాప్య - సర్వా కామా నవాప్నుయాత్ ॥
“కుమార స్వామితో పార్వతీ దేవితో గూడినవాడు, శ్రేష్ఠమైన రత్నసింహాసనమునందు కూర్చున్నవాడు నగు పరమేశ్వరుని విగ్రహమును శిల మొదలగువానితో చేయించి- భక్తితో ప్రతిష్ఠించువాడు ఐహిక ఆముష్మిక కామితముల నొందగలుగును.”
మరియు ఏతాదృశమూర్తిని విధియుక్తముగా నొక్కపర్యాయము పూజించినను సూర్యకోటి సమానకాంతి గలవి, సర్వకామసమృద్ధంబులు, రుద్రకన్యాసంవేష్టితములు, గీత నాట్యసంపన్నములు నగు విమానములలో మహా ప్రళయమువరకు సంచరించుచు అనేక దివ్య సుఖముల ననుభవించి బ్రహ్మ విష్ణు ఉమాలోకములయందు, ప్రజాపతి జన మహర్లోకములయందును విహరించి పదివేల దివ్యవత్సరములు ఇంద్రపదవి నధిష్ఠించియు భువర్లోకమున ననేక దివ్య సుఖముల ననుభవించియు, మేరుపర్వతముపై గల నమరుల భవనములయందు అమందానందము గలవాడై చివరన శివసాయజ్యము
నొందును.
శ్లో॥ ఏకపాదం చతుర్బాహుం- త్రినేత్రం శూలధారిణం । సృష్ట్యా స్థితం హరిం వామే దక్షిణే చతురాననమ్ ॥ శ్లో॥ ప్రతష్ఠాప్య యథాన్యాయం శివసాయుజ్య మాప్నుయాత్ ॥
ఏకపాదము, నాలుగు చేతులు, మూడు కన్నులు, త్రిశూలము, వామపార్శ్వమున శ్రీహరి, దక్షిణ భాగమున బ్రహ్మదేవుడును గల శివమూర్తిని చేయించి స్థాపించియు యథావిధి పూజించువాడు ముక్తుడగును. ఇట్టి సదాశివుడు తన సంకల్పమున ఇరువది ఎనిమిది కోట్ల రుద్రులను;హృదయమునుండి పురుషుని; ఎడమవైపునుండి ప్రకృతిని; పాదములనుండి పృధివిని; గుహ్యమునుండి జలమును; నాభినుండి అగ్నిని; మనస్సునుండి సూర్యుని; కంఠము నుండి చంద్రుని; కనుబొమల నడిమినుండి రుద్రుని; శిరస్సు నుండి ఆకాశమును ఈ విధముగానే చరాచర ప్రపంచము నంతయు ఉద్భవింపజేసెను.
శ్లో॥ త్రిపాదం సప్తహస్తంచ-చతుః శృంగం ద్విశీర్షకం । కృత్వా యజ్ఞేశ మీశానం- విష్ణులోకే మహీయతే ॥
“మూడు పాదములు, ఏడు చేతులు, నాలుగు కొమ్ములు, రెండు శిరస్సులు,
అగ్నిస్వరూపంబు గల మహేశ్వరమూర్తిని చేయించి ప్రతిష్ఠించువాడు- వైకుంఠమున లక్ష కల్పముల వరకు దివ్యసుఖముల ననుభవించియు భూలోకమునశ్రోత్రియుడై జన్మించి- సర్వవిధ క్రతువులతో శివు నారాధించియు ముక్తుడగును.
శ్లో॥ వృషారూఢం తు యః కుర్యా - త్సోమం సోమార్ధభూషణం । హయమేధాయుతం కృత్వా - యత్పుణ్యం తదవాప్య సః ॥ శ్లో॥ కాంచనేన విమానేన - కింకిణీజాలమాలినా । గత్వా శివపురం దివ్యం-తత్రైన సవిముచ్యతే ॥
చంద్రరేఖా విభూషితుడు, నంది నెక్కినవాడు నగుమహేశ్వరుని విగ్రహమును – ఒకానొక మందిరమున స్థాపించువాడు- సువర్ణ నిర్మితము, చిరుగంటల గుంపులతో కూడిన దండలు గలదియు నైన విమానములో పయనించి - పదివేల అశ్వమేధ యాగములను నెరవేర్చిన ఫలము నొందినవాడై శివలోకము జేరి శివానందరసాస్వాదలోలుండగును.
శ్లో॥ నందినా సూతం దేవం - సాంబం సర్వగణైర్వృతం । గత్సాకైలాస శిఖరం గాణపత్య మవాప్నుయాత్ ॥
ప్రమథ గణాధిపతులతో కూడి యున్నట్లు, నంది ముంచున్నట్లును సాంబమూర్తిని ప్రతిష్ఠించు శివభక్తుడు కైలాసశిఖరము జేరి గణాధిపతియై చిరకాలము ఆనందించును.
శ్లో॥ నృత్యంతం దేవదేవేశం - శైలజాసహితం ప్రభుం । సహస్రబాహుం సర్వజ్ఞం-చతుర్బాహు మథాపి వా ॥
పార్వతీ దేవి ముందు నటించువాడు, వేయి- లేక-నాలుగు చేతులు గలవాడు. సర్వజ్ఞుడు, సర్వజగన్నియామకుడు నగు మహాదేవుని విగ్రహమును భృగు మహర్ష్యాదులు, భూత సంఘములు, వృషభధ్వజము, బ్రహ్మవిష్ణు దేవేంద్రాదులు, మాతృదేవతలు ననువారిచే నమస్కరింప బడుచున్నట్లు ప్రతిష్ఠించు పుణ్యాత్ముడు యజ్ఞతపోదాన తీర్థ దేవతా సేవనాది ఫలమునకంటే కోటిరెట్లు ఫలము గలవాడై కైలాసమున మహాప్రళయము వరకు సుఖభోగముతో నివసించి-మహాసృష్టిప్రారంభమున చతుర్ధశమనువులలో నొక మనువై - ప్రారబ్ధాంతమున ముక్తుడగును.
శ్లో॥ నగ్నం చతుర్భుజం శ్వేతం - త్రినేత్రం సర్పమేఖలం । కపాలహస్తం దేవేశం కృష్ణకుంచితమూర్ధజమ్ ॥ కృత్వా భక్త్యా ప్రతిష్ఠాప్య శివసాయుజ్య మాప్నుయాత్ ॥
“దినమొల గలవాడు, నాలుగు చేతులు మూడు కన్నులు గలవాడు, సర్పము మొలత్రాడుగా గలవాడు, తలపుఱ్ఱె కరమంచు గలవాడు, నల్లని ముంగురుల కురులు గలవాడు నగు భైరవేశ్వరుని ప్రతిష్ఠించువాడు జీవతాంతమున మహాకైలాసము జేరి శివసముడగును.
శ్లో॥ ఇభేంద్రచారకం దేవం- సాంబం సిద్ధార్థదo ప్రభుం ।
సుధూమ్రవర్ణం రక్తాక్షం - త్రినేత్రం చంద్రభూషణమ్ ॥
శ్లో॥ కొక పక్ష్ణదరం మూర్ధ్నా -నాగ టoక ధరం హరం ।
సింహాజనోత్తరీయం చ-మృగచర్మాంబరం విభుమ్ ॥
శ్లో॥ తీక్ష్ణదంకష్టం గదాహస్తం- కపాలోద్యత పాణినం ।
హుంపట్కారే మహాశబ్ద- శబ్దితాఖిల దిబ్మఖమ్ ॥
శ్లో॥ పుండరీకాజినం దోర్భ్యాం - బిభ్రతం కంబుకం తథా।
హసంతం చనదంతం చ పిబంతం కృష్ణసాగరమ్ ॥
శ్లో॥ నృత్యంతం భూతసంఘైశ్చ - గణసంఘైః సమన్వితం ।
కృత్వా భక్త్యా ప్రతిష్ఠాప్య-యథావిభవ విస్తరమ్ ॥
శ్లో॥ సర్వవిఘ్నానతిక్రమ్య- శివలోకేమహీయతే ॥
“గజాసుర సంహారము పొగవన్నె యొడలు ఎర్రని రెండు కన్నులు లేక నయనత్రయము చంద్రులుము శిరస్సున కాకి రెక్కలు సరము కత్తిగల రెండు చేతులు, సింహచర్మోత్తరీయము జింకతోలు ధోపలి వాడియైన కోఱపల్లులు గదాహస్తము లేపబడిన చేతియందు కపాలము (తలపుఱ్ఱె) హుంకార ఫబ్కారముల మహానాదముతో ఫిక్కటిల్లు దశదిశలు ఒకచేత పెద్ద పులితోలు మరియొక చేత శంఖమును పట్టుకొనుటయు. నవ్వుచు కేరింతలు కొట్టుటయు పాల సంద్రమును త్రాగులయు (సర్పఖడ్గ గడా కపాల వ్యాఘ్రచర్మ శంఖధారణముగల ఆరు చేతులు గలిగియుండుట)
ప్రమథగణములు చుట్టు కొలువై యుండ భూతసంఘములతో ఆడుకొనుటయు గల సాంబమూర్తిని ప్రతిష్ఠించు నెడ జీవితకాలమున సమస్త వస్తువుల సమృద్ధియు; ప్రారబ్ధాంతమున శివలోకనివాసంబు సమకూరును.
ఐతే ఇట్టి ప్రతిష్ఠను తన శక్తి దగు లోపము లేకుండ వైభవముతో భక్తి శ్రద్ధాసమన్వితుడై నెర వేర్పవలసియుండును.
మరియు కైలాసమున రుద్రునివలన శివ జ్ఞానము బడసిన వాడై పునరావృత్తి రహితమగు శివలోకము జెందునని సారాంశము.
శ్లో॥ అర్ధనారీశ్వరం దేవం - చతుర్భుజ మనుత్తమం ॥ వరదాభయహస్తం చ - శూలపద్మధరం ప్రభుమ్ ॥ శ్లో॥ స్త్రీపుంభావేన సంస్థానం సర్వాభరణభూషితం । కృత్వా భక్త్యా ప్రతిష్ఠాప్య - శివలోకే మహీయతే ॥
“వరదముద్రను అభయ ముద్రను ‘త్రిశూలమును కమలమును నాలుగు చేతుల బట్టుకొని స్త్రీ పురుషభావము గలవాడై ఆభరణముల నన్నిటిని ధరించయు అర్ధనారీశ్వరుడైయుండు మహాదేవుని విగ్రహమును భక్తిచే స్థాపించువాడు రుద్రలోకమునందు ఆనందముతో అష్టైశ్వర్య సంపన్నుడై ఆచంద్రతారార్కము ని సించి శివజ్ఞానము గలవాడై వసాయుజ్యము నొండును.
ఇంతియే గాక శిష్యప్రశిష్యులకు శివ లీలావిలాసమహిమలను చేయెత్తి ప్రబోధించు
లకులీశ్వరుడుగా మహేశ్వరుని విగ్రహమును ప్రతిష్ఠించువాడు కైలాసమున యుగ శతము పరకు నివసించి శివజ్ఞానము గలవాడై ముక్తుడగును.
ధ్యానముద్ర చితాభస్మానులేపనము భస్మత్రిపుండ్ర ధారణము శిరోమాలాధారణము
బ్రహ్మదేవుని యొక వెంట్రుకను జందెముగా ధరించుటయు వామహస్తముతో బ్రహ్మ
కపాలమును పట్టుకొనుటయు నృసింహస్వామి యొక్క చర్మను కప్పుకొనుటయు గల
మహేశ్వరుని మూర్తిని స్థాపించువాడు సంసార సముద్రము నుండి విడిబడినవాడగును.
“ఓం నమో నీలకంకాయ“ అను అష్టాక్షర మహామంత్రమునొక్కసారియైన సుచ్చరించువాడు పాపములను పోగొట్టుకొనును. మరియు నీ మంత్రముతో ధ్యాన ఆవాహన ఆసన పాద్యాఅర్ఘ్య ఆచమనీయ అభిషేక భస్మ గంధ అక్షత పుష్ప బిల్వ ధూప దీప నైవేద్య మహానీరాజన మంత్రపుష్పములను తన శక్తికొలది సమర్పించి పూజించువాడు శివాను గ్రహపాత్రుడగును.
జలంధర సంహారము సుదర్శన చక్రధారణము గల శివవి గ్రహమును స్థాపించువాడు సంచిత ఆగామి దురిత నిర్ముక్తుడై దేహాంతమునకైలాస నివాసియగును.
సహస్రకమలముల (వేయి కమలముల) లోనొక్కటి తక్కువపడి నందున తన
నేత్రకమలముతోడ శ్రీహరిచే పూజింపబడు శివ మూర్తిని భక్తిని ప్రతిష్ఠించువాడు
కైలాసమున శాశ్వతకాలము సుఖపడుచుండును.
నిలువబడి నికుంభువి వెన్నుపై కుడి కాలు నిడియు ఎడమవైపున అమ్మవారిని
కౌగలించుకొనియు చిరుగంటలు సర్పంబు గల త్రిశూలముపైమోచేయినుంచియు
కృతాంజలియై ప్రార్థించు అంధకాసురునొకకంట జూచుచునుండు శివస్వరూపమును
ప్రతిష్ఠించువాడు. శివసాయుజ్యము నొందును.
ధనుర్బాణ ధరత్వము చతుర్ముఖ సారథ్యము. రథస్థితియు గల త్రిపురాంతక శివ మూర్తిని స్థాపించినచో కైలాసమున రెండవ శంకరుడై తన యిష్టమున్నంతకాలము విహరించి ముక్తుడగును.
గంగను ధరించి చంద్రుని శిరోభూషణముగా స్వీకరించియు ఎడమతొడపైపార్వతీ దేవిని కూర్చుండ బెట్టుకొని సుఖాసీనుడై యుండుమహేశ్వరుని విగ్రహమును ప్రతిష్ఠించుటయు, మరియు
వినాయకుని, కుమారస్వామిని, దుర్గాదేవిని, సూర్యుని, చంద్రుని, సరస్వతీ దేవిని,
కౌమారిని, వైష్ణవిని, వారాహిని, ఇంద్రాణిని, చాముండును, వీరభద్రస్వామిని
ప్రతిష్ఠించుటయు శివానుగ్రహనిదానములగును.
మంటలు వరుసలు నిండియుండు జ్యోతిర్లింగమును, అద్దాని నడుమ చంద్రశేఖరవిగ్రహమును, ఆకాశమున బ్రహ్మదేవుడు హంసరూపముతో నుండనట్లు పాతాళమునందు విష్ణువు వరాహరూపముతో నుండునట్లను నిర్మింపజేసి ప్రతిష్ఠించువాడు క్షేత్ర పాలకుడైన భైరవునితో కూడిన పశుపతిని స్థాపించువాడును ముక్తులగుదురు.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (76)వ అధ్యాయము.
