లింగ మహా పురాణము

Table of Contents

48 - సర్వదేవతా ప్రతిష్ఠాని నిరూపణము

హరి బ్రహ్మాది దేవతా విగ్రహములను ప్రతిష్ఠించుటకై కమలాకరము గల కుండములు ఐదు లేక పండ్రెండ్రు ఏర్పరచి - ఆ యా దేవతల గాయత్రీ మంత్రములలో సమిధాజ్య చరువులను హవనమొనర్పవలెను. పార్వతీ దేవి మొదలగు శక్తులను స్థాపించుటకు తదంగహవనమునకై యోనికుండములను నిర్మింపఁజేయవలెను.

హరి బ్రహ్మాద్యమరులు రుద్రాంశసంభపులగుటచే సవ్వారిని శివ పరివారముగా భావించి ప్రతిష్ఠించుట - సువిహితంబగునని చెప్పవచ్చును.

గాయత్రీ మంత్రములు :-

1. “తత్పురుషాయ విద్మహే - వాగ్విశుద్ధాయ ధీమహి, తన్నః శివః ప్రచోదయాత్“ ఽ. “గణాంబికాయై విద్మహే - కర్మసిద్ధ్యై చ ధీమహి, తన్నో గౌరీ ప్రచోదయాత్“ 3. “తత్పురుషాయ విద్మహే - మహాదేవాయ ధీమహి, తన్నో రుద్రః ప్రచోదయాత్“ 4. “తత్పురుషాయ విద్మహే - వక్రతుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్“ 5. “మహాసేనాయ విద్మహే - వాగ్విశుద్ధాయ ధీమహి, తన్నః స్కందః ప్రచోదయాత్” 6. “శిక్షశృంగాయ విద్మహే - వేద పాదాయ ధీమహి, తన్నో వృషః ప్రచోచయాత్“ 7. “హరివ క్తాయ విద్మహే రుద్రవక్త్రాయ ధీమహి, తన్నో నందీ ప్రచోదయాత్“ 8. “నారాయణాయ విచ్మహే వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్“ 9. “మహాంబికాయై విద్మహే - కర్మసిద్ధ్యై చ ధీమహి, తన్నో లక్ష్మీః ప్రచోదయాత్“ 10. “సముద్ధృతాయై విద్మహే - విష్ణునైకేన ధీమహి, తన్నో ధరా ప్రచోదయాత్” 11. “వైనతేయాయ విద్మహే - సువర్ణపక్షాయ ధీమహి, తన్నో గరుడః ప్రచోదయాత్“ 1ఽ. ‘‘పద్మోద్భవాయ విద్మహే - వేదవక్త్రాయ ధీమహి, తన్నః స్రష్టా ప్రచోదయాత్” 13. “శివాస్య జాయై విద్మహే - దేవీ రూపాయ ధీమహి, తన్నో వాచా ప్రచోదయాత్“ 14. “దేవరాజాయ విద్మహే - వజ్రహస్తాయ ధీమహి, తన్నః శక్రః ప్రచోదయాత్“ 15. “రుద్రనేత్రాయ విద్మహే - శక్తి హస్తాయ ధీమహి, తన్నో వహ్నిః ప్రచోదయాత్” 16, “వైవస్వతాయ విద్మహే - దండ హస్తాయ ధీమహి, తన్నో యమః ప్రచోదయాత్“ 17. “నిశాచరాయ విద్మహే - ఖడ్గహస్తాయ ధీమహి, తన్నో నిఋతిః ప్రచోదయాత్“ 18. “శుద్ధ హస్తాయ విద్మహే - పాశహస్తాయ ధీమహి, తన్నో వరుణః ప్రచోదయాత్“ 19. “సర్వప్రాణాయ విద్మహే - యష్టిహస్తాయ ధీమహి, తన్నో వాయుః ప్రచోదయాత్” ఽ0. “యజేశ్వరాయ విద్మహే - గదాహస్తాయ ధీమహి, తన్నో యక్షః ప్రచోదయాత్“ ఽ1. “సర్వేశ్వరాయ విద్మహే - శూలహస్తాయ ధీమహి, తన్నోరుద్రః ప్రచోదయాత్“ ఽఽ. “కాత్యాయన్యై విద్మహే - కన్యాకుమార్యై ధీమహి, తన్నో దుర్గా ప్రచోదయాత్“

ఈ గాయత్రీ మంత్రముల నుచ్చరించుచు ఆ యా దేవతలను ప్రతిష్ఠించి పూజింపవలెను. దేవతలందరికి ప్రణవాసనము నేర్పరుపవలెను.

 “ఓం నమో నారాయణాయ” అను అష్టాక్షర మంత్రము - విష్ణు ప్రతిష్ఠకై ప్రశస్తమగును.శివలింగమును వలె శివపరివార దేవతల నభిషేకాదులతో నర్చింపవలెను. ప్రతిష్ఠకు ముందు దేవతలందరికి నేత్ర మంత్రముతో కన్నులఁదెరిపించవలెను.

జలాధివాస ధాన్యాధివాస శయనాధివాసాదులను - బిలములలో నవరత్నసహిత సువర్ణాది నిక్షేపమును - తూర్పు మొదలగు దిశలయందు విఘ్నేశ్వరాది దేవతా ప్రతిష్ఠ నొనర్పవలెను.

ఇట్లు సర్వదేతా ప్రతిష్ఠను సంక్షేపముగా చెప్పితిని. ఆలకించితిరి గదా! యని సూతుఁడు నేవిరమించెను.

ఇయ్యది

“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ

ఆంధ్రానువాద ప్రవచనమున (48)ప యధ్యాయము.