లింగ మహా పురాణము
63 - దేవుదానవ గంధర్వ సర్పాద్యుత్తత్తి కథనము
సూతుఁడు - శౌనకాదుల ప్రశ్న ననుసరించి దిగువవిధము వక్కాణించెను.
బ్రహ్మాదులు - ఈశ్వర సంకల్పము వలన ఒకరి నొకరు చూచుటచేతను, తాకుట వలనను జన్మించిరి. దక్ష ప్రజాపతి తరువాత స్త్రీ పురుష సంయోగము వలన సృష్టి ప్రారంభమయ్యెను.
దక్ష ప్రజాపతి - తన భార్యయగు “సృతి” యను నామెయండు వేయిమంది కుమారులను కనఁగా నవ్వారు సృష్టిఁజేయఁ దలచిరి. అంత నారద మహర్షి హర్యశ్వులనబడు దక్షపుత్రులఁ గూర్చి మీరు భూమికి క్రింద పైన పార్శ్వములందును గల పరిమాణము (కాలత)ను గుర్తించి వచ్చిన తరువాత సృష్టి నొనర్పుడు!“ అని వచింపగా-వారు నారదవాక్యము నంగీకరించి భూ ప్రమాణమును కనుకొనుటకు వెళ్లి “సముద్రమునుండి నదుల వలె“ నిప్పటికిని మరలిరాలేదు. అందువలన దక్షుడు సృతియందు మరల వేయి మంది కుమారులను పుట్టింపగా నారదుడు శబలుకు’’ అను దక్ష తనయులకు “ “ మీరును భూ ప్రమాణమును మీ అన్నలను కనుగొని యేతెంచి. సృష్టి గావింపుడు!“ అని వచించెను. అందువలన వారు నట్లే బయలు దేరి మరల రాకుండిరి.
అనంతరము దక్ష ప్రజాపతి “వైరిణి అను భార్యయందు అరువది కుమార్తెల గనెను.
(సృతి-వైరిణి అను పేరులు ఒకర్తెకే కలవని, లేదా ఇరువురునని భావింపవచ్చును.) ధర్మునకు పరుగురు పుత్రికలను; కశ్యపునకు పదముగ్గురిని; చంద్రునకు ఇరువది యేడుగురిని; అరిష్టనేమికి నలుగురిని; భృగు పుత్రునకు ఇరువురిని, కృశాశ్వునకు ఇద్దరిని; ఆంగీరస్సునకు పుత్రికా ద్వయమును భార్యలుగా వివాహవిధిని సమర్పించెను.
అవ్వారిలో మరుత్వతి, వసువు, యామి, లంబ, భానువు, అరుంధతి, సంకల్ప, మహూర్త సాధ్య, విశ్వ యను పదుగురు ధర్మునిభార్యలగుదురు. వారి సంతానము ఎద్ది యనఁగా విశ్వ - విశ్వేదేవతలను; సాధ్య సాధ్యులను; మరుత్వతి - మరుత్వంతులను; వసువు వసువులను;భానువు- భానువులను; ముహూర్త-మహూర్తకులను; లంబ - ఘోషులను; యామి - నాగవీధిని; సంకల్ప - సంకల్పుని: ధర్ముని వలన పుత్రులుగా బడసిరి.
ఇంక వసువులను వివరించుచున్నాను.
దిశలన్నిటి యందు వ్యాపించువారు, జ్యోతిస్సులు నగు పసుపులు, ప్రాణంలందరి హితవు నాకాంక్షించువారై యుందురు. అపుఁడు, ధ్రువుఁడు, సోముఁడు, ధరుఁడు, అనిలుఁడు, ఆనలుఁడు ప్రత్యూషుఁడు, ప్రభాసుఁడు ననువారు అష్టవసువు లనుఁబడుదురు. అజైకపాత్, అహిర్భుద్న్యుడు, విరూపాక్షుడు, భైరవుఁడు, హరుఁడు, బహురూపుఁడు, త్ర్యంబకుఁడు, సురేశ్వరుఁడు, సావిత్రుడు, జయంతుఁడు, పినాకి యనువారు - ఏకాదశరుద్రులస బఱుఁగుదురు. ఇఁక కశ్యపుని సంతానము: నవ ధరింపుఁడు!
అదితి, దితి, అరిష్ట, సురస, ముని, సురభి, వినత, తామ్ర, క్రోధవశ, ఇల, క ద్రుపు, త్వష, దనువు నను పదముగ్గురు -- కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు.
చాక్షుషమన్వంతరమున తుషితులనఁబడిన దేవతలు వైవస్వత మన్వంతరమునందు ద్వాదశాదిత్యులుగా - ఇంద్రుఁడు, ధాత, భగుఁడు, త్వష్ట, మిత్రుఁడు, వరుణుఁడు, ఆర్యముడు, వివస్వంతుడు, సవిత, పూషుఁడు, అంశుమంతుఁడు, విష్ణువు నను పేరులలో జన్మించిరి. అనగా వీరందరు అదితీదేవి యొక్క కుమారులు అని తెలియవలెను. ఇక దితీదేవి హిరణ్యకశపుఁడు, హిరణ్యాక్షుఁడు నను ఇరువురిని కశ్యపుని వలన కనెను. దనువు - బలవంతులైన నూర్గురు కుమారులను కనినది. ఆ పుత్రశతమున విప్రచిత్తి యనువాడు శ్రేష్ఠుఁడైయుండెను. తామ్రయను కశ్యపపత్ని - శుకి, శ్యేని, భాసి, సుగ్రీవి, గృద్రిక, శుచి యను ఆరుగురు కుమార్తెలఁగనినది. వీరిలో శుక్రియను నామె
చిలుకలను, ఉలూకము ( పెద్దపిట్ట)లను; శ్యేని యనునామె. డేగలను; భాసియను నామె - కురంగము (జింక) లను; గ్రంధియనునా - (గద) లను, గువ్వలను, పావురములను, పక్షులనున్ను, శుచి యను నామె-హంసలను, బెగ్గురుపక్షులను, కన్నెలేడి (కారండ) పక్షులను, కప్పలను; సుగ్రీవియను నామె మేకలను. అశ్వములను, ఒంటెలను, గాడిదెలను కనగా - వినత యను కశ్యపపత్ని గరుడుని అరుణుని, సర్వలోకభయంకరురాలగు సౌదామిని యను పుత్రికను; సురసయను నామె సహస్ర (1000) సర్పములను, కద్రువు యను నామె. వేయితలలు గల వేయి పాములను కనినవారు.
కద్రూపుత్రులలో - ఆదిశేషుఁడు, వాసుకి, కర్కోటకుఁడు, శంఖుఁడు, ఐరావతుఁడు,
కంబలుఁడు, ధనుంజయుఁడు, మహానీలుఁడు, పద్ముఁడు, అశ్వతరుఁడు, తక్షకుఁడు, ఏలాపుత్రుఁడు, మహాపద్ముఁడు, ధృతరాష్ట్రుఁడు, బలాహకుఁడు, శంఖపాలుఁడు, మహాశంఖుఁడు, పుష్పదంష్ట్రుఁడు, శుభాననుఁడు, శంఖలోముఁడు, నహుషుఁడు, వామనుఁడు, ఫణితుఁడు, కపిలుఁడు, దుర్ముఖుఁడు, పతంజలి యను ఇరువదియారు (26) గురు శ్రేష్ఠులుగా పరిగణింపబడిరి.
క్రోధవశయను నామె మహామాయావియగు రక్షోగణమును; సురభియను నామె
రుద్రగణములను ఆవులను గేదెలను కశ్యపునివలన ఁబడసిరి.
మునియను నామె ముని గణమును, అప్సరసలను; అరిష్టయనునామె కిన్నరులను గంధర్వులను; ఇల యనునామె. తృణవృక్ష గుల్మలతాదులను; త్విషయను నామె కోట్లకొలది యక్షాదులను కనిరి.(గుల్మమనఁగా-బోదెలేని చెట్టు)
ఇట్లు కశ్యపనంతానమును సంక్షేపించి చెప్పనైనది.
కశ్యప సంతానము యొక్క పుత్రపౌత్రాదులు గల వంశములు పెక్కు కలవు, ఇట్లు కశ్యపుడు తన సంతానములోని ముఖ్యులకు ఒక్కొక పడవి నొక్కొకరికి నొసఁగెను.
మరల నొకసారి సంతానేచ్ఛతో కశ్యపుఁడు తపస్సు చేయగా బ్రహ్మదేవుఁడు ప్రసన్నుఁడైవరమును ప్రసాదించినందున వత్సరుఁడు అసితుఁడు నను ఇరువురు మహాజ్ఞానులు ప్రాదుర్భవించిరి. వత్సరుని వలన నైధ్రువుఁడు రైభ్యుఁడు నను వారు ఉదయించిరి. రైభ్యునకు రైభ్య యను కన్యక జన్మించెను. నైధ్రువుఁడు చ్యవన పుత్రిక యందు- సుమేధస్కుఁడు అనువానిని పుట్టించెను. నైధ్రువుని భార్య యగు చ్యవన పుత్రిక - కుండ పాయులు అనువారికి తల్లియయ్యెను. అసితుఁడు - ఏకపర్ల యను భార్యయందు డేవలుంఁడను మహాతపస్వి నుదయింపఁజేసెను.
కృత త్రేతా ద్వాపర యుగములలో ద్వాపర యుగము ప్రవర్తించినతఱి. చముఁడసువాడు మనువునకు కుమారుఁడు కాగా-దమునకు తృణబిందువు కుమారుఁడుగా జన్మించెను. తృణబిందుని కుమార్తె - అతిరూప సుందరిగా నుండెను. అట్టి త్విలబిలయను తన పుత్రికను తృణబిందువు పులస్త్యునకు సమర్పింపగా. ఐరవిలుఁడు అను ఋషి త్విలబిలయందు జన్మించెను. ఐరవిలుఁడను విశ్రవసునకు - బృహస్పతి పుత్రికయుగు దేవవర్ణిని, మాల్యవంతుని తనయలగు పుప్పోత్కట, బలాకయను నిరువురు, మాలి పుత్రికయగు కైకస్యను నలుగురు భార్యలుండిరి. దేవ వర్ణిని పెద్దవాడైన వైశ్రవణుని కనఁగా -- కైకసి యసునామె రాక్షసాధిపతి యగు నిరువురు, మాలిపుత్రికయగు కైకసియను నలుగురు భార్యలుండిరి. దేవ వర్ణిని పెద్దవాడైన వైశ్రవణుని కనగా కైకసియనునామె రాక్షసాధిపతి యగు రావణుని మరియు కుంభకర్ణుని, శూర్పణఖ యనుకుమార్తెను, బుద్ధిమంతుఁడైన విభీషణుని కనినవారైరి. పుప్పోత్కట మహోదరుఁడు, ప్రహస్తుడు, మహాపార్శ్వఁడు, ఖరుడు నను నలుగురు కుమారులను; కుంభీనసి యను పుత్రికను కనినది. త్రిశిరస్కుఁడు దూషణుఁడు, విద్యుజ్జిహ్వుండు నను పుత్రత్రయమును; మాలికయను పుత్రికను బలాకయను విశ్రవః పత్ని బడసెను. వీరిలో విభీషణుఁడు మాత్రము ధర్మ ప్రవర్తునుడై అతి శుద్ధాంతః కరుణుఁడునై యుండెను.
పులస్త్యునకు - మృగములు, వ్యాఘ్రములు, భూత ప్రేత పిశాచములు, సర్పములు, సూకరము (పందు) లు, ఏనుగలు, వానరాదులును ప్రసవించిరి.
అత్రికి - సుందరాంగులు పతివ్రతలు నగు పదుగురు భార్యలుండిరి. భగ్రాశ్వునకు
ఘృతాచియను అప్సరసయందు - భద్ర, అభద్ర, జలద, మంద, నంద, బల, అబల,గోపాబల, తామరస, వరక్రీడ యను పదుగురు పుత్రికలు జన్మించిరి. ఈ పదుగురు జవరాండ్రకు ప్రభాకరుఁడు భర్తగానుండెను.
సూర్యుఁడు రాహుగ్రస్తుఁడై కాంతిని గోలిపోయినపుడు ప్రభాకరుఁడు వెలుతురు
నొసఁగుచుండను. మరియు ప్రభాకరుడు భద్రయందు సోము (చంద్రు)ని జన్మింపఁజేసెను. అత్రీ వంశ జన్ములలో దత్తుడు, దూర్వాసుడు నను పోరు బ్రహ్మ వర్చస్సు గలవారై ప్రాణులందించే పూజింపఁబడుచున్నవారు. వీరికే అమల యను బ్రహ్మవాదిని సోదరిగా జన్మించెను. శ్యావుఁడు, సత్వసుడు,వవలువు, గహ్వరుఁడు నను వారును ఆత్రేయులేను;
కాశ్యపుఁడు, నారదుఁడు, పర్వతుఁడు, ఆనంద్ధతుఁడు ననువారు. అరుంధతీ దేవికి
మానసపుత్రులుగా నావిర్భవించిరి. ఊర్ధ్యరేతస్కుడగు నారదుఁడుడక, శాపగ్రస్తుఁడయ్యెను. (తన కుమారులను భూప్రదక్షిణమునకై పంపినందున క్రోధోద్రిక్తుడైన దక్ష ప్రజాపతి -- 1 త్రిలోకసంచారివై ఎచ్చోటను నిలుకడ లేనివాడవు కలహభోజనుడవు కమ్మని, నారదుని శపించెను.
(అట్టి దక్ష శాపము లోక కల్యాణ ప్రదమగుటకు నారదుఁడు నారాయణ నామమును నిరంతరము స్మరించుచుండును.)
పూర్వము ఘోరమైన దేవ దానవ యుద్ధము జరుగగా లోకేశ్వరులు క్షోభించినందున వర్షాభావముచే నేర్పడిన కరువులో ప్రజలను రక్షించులుకై వసిష్ఠమహర్షి తపించినవాడై అన్నోదకములను కందమూల ఫలములను ఓషధులను కల్పించెను. అట్టి వసిష్ఠకరుణ వలన మానవ పశు పక్ష్యాదులు సుఖముగా జీవింపఁ గలిగిరి.
వసిష్ఠుఁడు అరుంధతియందు - తన శరీర సంయోగముచే నూర్గురు (100) కుమారులం గనఁగా వారిలో పెద్దవాడైన శక్తి వలన - అదృశ్యంతి యనునాన్ - పరాశరునిఁగనెను. ఆ పిదప శక్తి నొకానొక రాక్షసుఁడు భక్షింపగా శక్తి పుత్రుడైన పరాశరుని వలన కృష్ణ ద్వైపాయనుడు అను వేదవ్యాసుఁడు జన్మించెను.
శ్లో॥ ద్వైపాయనో హ్యరణ్యాంతు- శుక ముత్పాదయ త్సుతం । ఉపమన్యుంచ పీవర్యామ్”,
వ్యాసుడు అరణి యందు శుకమహర్షిని, పీవరియను సొమెయందు ఉపమన్యువు అనువానిని జన్మింప జేసెను.
భూరిశ్రవస్సు, ప్రభువు, శంభుఁడు, కృష్ణుఁడు, గౌరుఁడు, నను ఐదుగురు. శుకమహర్షియొక్క కుమారులు కాగా కీర్తిమతి యను కన్యక శుకుని పుత్రికగా జన్మించి. అనుహునకు భార్యయై బ్రహ్మదత్తునకు జనని (తల్లి) యైనది.
శ్వేతుడు, కృష్ణుఁడు, గౌరుఁడు, శ్యాముఁడు, ధూమ్రుఁడు, అరుణుఁడు, నీలుఁడు,
బాదరికుఁడు నను ఎనమండుగురు- పరాశరుని తనయులైరి. వసిష్ఠుని వలన ఘృతాచియను అప్సరసయందు కపింజల్యుడు ఉదయించెను.
పృథువు యొక్క కుమార్తెయందు సంభవించిన భద్రునకు వసువు కుమారుఁడయ్యెను. వసువు యొక్క కుమారుఁడైన ఉపమన్యుని కుమారులు పెక్కు కలరు. వీరందరును లోకత్రయమును రక్షించుటలో పాలుగొనుచు సూర్యకిరణముల వలె ముల్లోకములలో వ్యాపించి యుండువారు.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక’ అను శాంకరీయ
ఆంధ్రానువాడ ప్రవచనమున 63వ అధ్యాయము.
