లింగ మహా పురాణము

Table of Contents

84 - ఉమామహేశ్వర వ్రతాదులను నిరూపించుట

సూత ఉవాచ –

మునిసత్తములారా!

“ఈశ్వర భాషితమగు ఉమామహేశ్వరవ్రతమును స్త్రీలకు పురుషులకును హితము
చేకూరుటకై చెప్పుచున్నాను.”  అని సూతుఁడు చెప్పఁ దొడఁగెను.

పూర్ణిమనాడు, అమావాస్యయందు, చతుర్దశియందు, అష్టమియందును సంవత్సరము వరకు నక్త వ్రతము నవలంబించి హవిష్యమును భుజింపవలెను. భోజనాత్ పూర్వము ప్రదోషకాలమున శివుని పూజింపవలెను. సంవత్సరాంతమున బంగారముతో లేక వెండితో ఉమామహేశ్వరుల యొక్క ప్రతిమలను చేయించి యథావిధి పూజించియు బ్రాహ్మణులకు భోజనమును యథాశక్తి దక్షిణలను సమర్పించి రథము మొదలగు వాహనముపై శివాలయమునకు ఊరేగింపుగా తీసికొని వెళ్లి వ్రతమును శివునకు సమర్పించవలెను. అట్టి పురుషుఁడు శివసాయుజ్యమును; స్త్రీయైనచో దేవీ సాయుజ్యము
నొందును.

అష్టమీతిథియందు చతుర్దశియందు నుపవసించుచు నొక సంవత్సరమువరకు నియమనిష్ఠలతో బ్రహ్మచర్యమును పాటించుచు ఉమామహేశ్వర ప్రతిమలను వర్షాంతమున పూజించునామె కన్యయైనను వితంతువైనను శివాలయమున సమర్పించియు బ్రాహ్మణులను భుజింపజేసినచో దేవీలో కమునందు సుఖముగ నివసించును.

ఒక కృష్ణచతుర్దశియందైనను పూర్వోక్త విధానమున ఉమామహేశ్వరుల నర్చించు సువాసిని భవానీ దేవీ సన్నిధానమున దివ్యరూపిణియై ఆనందించును.

ఇంతియే గాక

అమావాస్యలలో నొక సంవత్సరము వరకు నిరాహారిణియై త్రిశూలమును సలక్షణముగా చేయించి శివ పార్శ్వమునందు నెలకొలిపియు వేయి కమలములతో ఉమామహేశ్వరుల నర్చించి బంగారుకాడ గల వెండి తామర పుష్పమును శివునకు నివేదించి ఉమామహేశ్వర ప్రతిమలను కమలమును దానము నొనర్చియు బ్రాహ్మణ భోజన దక్షిణల నొసఁగు వనిత భ్రూణ హత్యాది పాపముల నిష్టముతో చేసిన
నవ్వాని నన్నిటిని త్రిశూలదానాదులవలన పొగొట్టు కొనునని తెలియవలెను.

ఇవ్విధము పురుషుఁడు గావించినచో శివసాయుజ్యము లభించును.

శ్లో॥ నియోగా డేవ తత్కార్యం భర్తౄణాం ద్విజసత్తమాః । జపో దానం తపః సర్వ- మస్వతంత్రా యతః స్త్రియః ॥

“బ్రాహ్మణ శ్రేష్ఠులారా!  భర్త యొక్క యానలితోడనే భార్య జపమును, దానమును, తపస్సు మొదలగు సమస్తపుణ్యమును చేయవలెను. ఎందుకనఁగా ?

స్త్రీలు ప్రతికార్యమును స్వతంత్రించి చేయఁగూడదు.

కార్తిక మాసమున ఏక భుక్తముఁజేయుచు- క్షమ అహింస బ్రహ్మచర్యము మొదలగు నియమముల నవలంబించి ఉమామేశ్వరప్రీత్యర్థము నల్లని నువ్వులను తూమెడు లేక మానెడు శక్తి యున్నచో 24 లేక 12 లేక 6 తూములు దానము చేయునామె నెయ్యి బెల్లముతో కూడిన అన్నమును శివునకు నివేదించి బ్రాహ్మణులకు మంచి ఆహారమునొసగియు అష్టమీ చతుర్దశులలో నుపవాసముఁజేయు నెడల జీవితాంతమున దేవితో సారూప్యము గలదై సంతోషించును.

క్షమా సత్య దయా దాన శౌచ ఇంద్రియ నిగ్రహ శివార్చనములు ప్రతి శివవ్రతము నందు - ఆవశ్యకములగునవి.

ఇంక నీ వ్రతమును మార్గశీర్షమాసము మొదలుకొని కార్తికమాసము వరకు ప్రతి నెల చేయవచ్చును. విశేషమేమనఁగా ?

మార్గశీర్షమున- సంపూర్ణ లక్షణములు గలదియు, యథావిధిగా అలంకరింపఁ బడినదియు నగు ప్రత్యక్ష వృషభమును శివునకు నివేదించి మాహేశ్వరునకు దానమొసఁగవలెను. అథవా శివాలయ ప్రాంగణమున ఉంచవలెను.

ఇట్లు చేయునామె- డేవితో సహ నివసించి ఆనందించును,

పుష్యమాసమున త్రికాలమును పూజించి శివునకు సమర్పించుటయు; మాఘమాసమున సమస్త అంగములతో కూడిన రథమును పూజించి శివార్పితముఁ జేసియు బ్రాహ్మణులను భోజనాదులతో సత్కరించుటయు; దేవీసాయుజ్య ప్రదములగును.

ఫాల్గున మాసమున బంగారముతో గాని వెండితో గాని, రాగితో గాని, నిర్మింపబడిన ఉమామహేశ్వర విగ్రహమును పూజించి- శివాలయములో ఉత్సవమూర్తులుగా సమర్పించు తరుణి- ప్రారబ్ధాంతమున దేవీ సాయుజ్యము నొంచును. ఇక చైత్రమాసమున ఉమామహేశ్వరుల యొక్కయు కుమారస్వామియొక్కయు విగ్రహములను సువర్ణ రజత తామ్రములలో నేదే నొకదానితో చేయించి విధి విధానముగ పూజించి శివాలయములో సమర్పించుటయు; వెండితో శివమందిరమును, ఉమామహేశ్వర విగ్రూములను చేయించి పూజించియు శివాలయమున నెలకొలుపుటయు; దేవీ లోకనివాసము ద్వారా శివలోకనివాసమును కలుగజేయును.

వైశాఖమున-కైలాసపర్వతముపై ఉమామహేశ్వరులను పూజించి శివాలయమున స్థాపించినచో కైలాసము నందు అమ్మవారి చేరువన- నిశ్చింత నివాసము-సంఘటించును.

జ్యేష్ఠమాసమున- శివలింగమును, దాని ఇరుప్రక్కలయందు బ్రహ్మ విష్ణువులు దోసిలొగ్గి నిలువఁబడియున్నట్లు, హంస వరాహములను గూడ తామ్రాడులతో చేయించి ప్రాణ ప్రతిష్టాదులతో పూజించియు, బ్రాహ్మణభోజనాదులఁజేయించియు- శివప్రీత్యర్ధము- శివాలయములో స్థాపింపఁజేయు వనిత దేవీ సాయుజ్యము గలదై జన్మరాహిత్యము నొందును.

ఆషాఢ మాసమున- ఇటికెలు మున్నగువానితో దృఢముగా ఇల్లు కట్టించి- ఇంటిలో కావలసిన రోలు, రోకలి, చీపిరి, చాప, మంచము, ఎరుపు, దిండ్లు మొదలగు వస్తువులను సుమారు సంవత్సరమునకు సరిపడ తండులాదికంజు నునిది కనీసం ఒక పరిచారకునిగాని పరిచారికను గాని ఏర్పరచియు నూతన వస్త్రముల నునిచియు క్షీర చధిఘృత మధు శర్కరలతో శుద్ధోదకము లోడను ఉమామహేశ్వరుల నభిషేకించి పూజించియు సహస్ర బ్రాహ్మణ భోజనము నొనరియు వచ్చానయసంపన్నుడు వేదశాస్త్ర పారంగతుడు, కుటుంబీకుడు నగు మాహేశ్వరునకు (గ్రహ) దానము నొనర్పవలెను. ప్రతిగ్రహీత బ్రహ్మచారియైనచో గృహములో సహ ధీర్ఘాయుష్మంతురాలు లావణ్యసంపన్న, కులీనురాలు నగు కన్యను సమర్పించవలెను. గృహస్థునకు కన్య నీయవలసిన యవసరము లేదు. పంట గల భూమిని, గోమిథునముఁగూడ సమర్పించినచో గోలోక నివాసము చ్వారా దేవలోకమున శాశ్వత నివాసము, దేవీ సాయుజ్యంబు సమకూరును.

ఇఁక శ్రావణమాసమునండు మేలుకట్టు, ధ్వజము, వస్త్రములు మొదలగు వానితో
తెలపర్వతము (నువ్వుల కుప్ప)ను దానముఁజేసి శైవ బ్రాహ్మణులకు భోజన తాంబూల దక్షిణలను సమర్పించు నామె-దేవీ సోయుజ్యము నొందును. భాద్రపదమాసమున వరి అన్నంరాశిని నూతన వస్త్రాదులతో సహ శివునకు నివేదించి పంచి పెట్టవలెను. బ్రాహ్మణ భోజనాదులను నెరవేర్పవలెను. ఇట్లు చేయునామె సూర్యకిరణకాంతి గల దివ్యరూపముఁదాల్చినదై అమ్మవారి దరి నానందించుచుండును.

ఆశ్వయజమాసమున సువర్ణమును నూతన వస్త్రములను వడ్లు, గోధుమలు, కందులు, పెసళ్లు, శనగలు, అను వానిలో ఏదేనొక ధాన్యము యొక్క రాశిని శివునకు సమర్పించి బ్రాహ్మణభోజనాచుల నొనర్చిన యెడల దేవీ సాయుజ్యము లభించును. మరియు నదే ఆశ్వయుజమున సర్వవిధధాన్యరాశులపై నవరత్నముల నునిది గంధాక్షతపుష్పాదులతో పూజింప వలెను. ఆ రాశులలోనో నొక్కొకరాశిపై నాలుగు శిఖరము లనేర్పరుపవలెను. రాశుల ప్రక్కలందు - శంఖము వీణ మొదలగువాని నుంచవలెను. ఒక వైపు బ్రాహ్మణులు వేదమంత్రములఁజదువుచుండగా - మరొక వైపు
మంగళవాద్యములు మ్రోగుచుండవలెను. ధ్వజము (జండా) లను చిత్రవిచిత్ర పుష్పములలో
నలంకరించి ధాన్యపర్వతముల యొక్క ఎనిమిది దిసలయందు పెట్టవలెను.

ఇట్టి ధాన్యరాశుల చేరికను త్రైలోక్యధారమగు మేరుపర్వతముగా భావింపవలెను. అట్టి మేరుపర్వతముపై మధ్యన ఉమామహేశ్వర మూర్తిని; వామభాగమున శ్రీహరిని దక్షిణభాగమున బ్రహ్మదేవుని; ముందు ఇంద్రాద్యష్టదిక్పాలురను; ఇంద్రుని వజ్రాయుధమును అగ్నియొక్క శక్త్యాయుధమును యముని దండమును నిబ్రుతి యొక్క ఖడ్గమును వరుణుని మహాపాశమును వాయువు యొక్క బెత్తమును కుబేరుని గదను ఈశానుని టంకము (గడ్డపాఱ; లేక కాసెయులి)ను నెలకొల్పి దేవతలను ఆయుధములను పూజించి ఉమామహేశ్వరుల మహాపూజ నొనర్చియు శివునకు సమర్పింపవలెను. బ్రాహ్మణభోజనాడులఁగావింపవలెను. ఇయ్యది మేరు వ్రతమనఁబడును. ఇద్దాని భక్తి శ్రద్ధలలో నాచరించు వనిత -మేరుపర్వలోపరి దేవీరోకమున శాశ్వతనివాసము గలదై ఆనందించును ఇందెంత మాత్రము సంశయము లేదు.

కార్తికమాసమున ఉమామహేశ్వర విగ్రహములను సర్వాభరణ భూషితములుగా
సలక్షణములుగాను సువర్ణముతో లేక వెండితో లేక రాతో చేయించి-ఆ ఆదిదంపతుల ముందు స్రువహస్తుడైన అగ్నిహోత్రుని - బ్రహ్మదేవుని నారాయణుని కన్యాదాతగా ప్రాణప్రతిష్టాడులలో యథావిది పూజించియు-లోకపాలురు, సిద్ధులు చుట్టు నిలుపబడియున్నట్లు ఏర్పరయు వి గ్రహము నన్నిటిని శివాలయమునకు గొంపోయి అచలు శివలింగమునకు సమర్పించు తరుణి ప్రారభాంపును దేవీ స్వరూపిణియై శివసాయుజ్యము నొండును. ఇదియుగాక-

మార్గశీర్షాది- కార్తికొంతము- ప్రతిమాసము నేయఁదగు ఏకభుక్త ప్రతము-నరనార్యాది ప్రాణులకు హితము నొనఁగూర్చును. పురుషుఁడైనచో శివ సారూప్యము స్త్రీలైనచో దేవీ సారూప్యము గలవారై ఆనందింతురు. ఇట్లు శివుఁడు చెప్పెను గాన నిద్ది తథ్యమని విశ్వసించడాను

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక ‘ అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (84)వ అధ్యాయము.