లింగ మహా పురాణము

Table of Contents

91 - మరణచిహ్నములను శివధ్యానయోగమును ప్రణవ మహిమను శివలింగపూజనమును నిరూపించుట

సూత ఉవాచ = సూతుఁడు - శౌనకాదుల ఇంగితమును కనుగొని చెప్పనారంభించెను.

ఆకాశమున - అరుంధతి, ధ్రువుఁడు అను నక్షత్రములను తన నీడను, గంగా ప్రవాహమును చూడ లేనివాడు (అనఁగా నివి కనుపడని యెడల) సంవత్సరమున కంటె నెక్కున కాలము జీవింపడు.

సూర్య కిరనములు అగ్నిస్ఫులింగములు నగుపడనిచో 11 మాసములు, మూత్ర పురీషములను సువర్ణ రజతములను ప్రత్యక్షముగగాని, స్వప్నము నందు గాని కప్కినచో 10 నెలలు, వృక్షము బంగారు పన్నెకలడిగా కనుపడినచో, మరియు ఆకసమున గంధర్వనగరములను ప్రేతపిశాచములంగాణలనచో. 9 నెలలు; అకస్మాత్ స్థూల శరీరము గలవాడైనను హఠాత్తు కృశించినను 8 నెలలు, ముందు గాని వెనుక గాని తనకాలు తునకగా కనుపడినచో బురదలోతాను పడినయెడలను 7 నెలలు; కాకి, పావురము,
డేగ వీనిలో నేదేని తన తలఁ దాకినచో 6 నెలలు; కాకుల బారులను దుమ్ముదుమారమును తన నీడను వికారము గలదిగాను పునః పునః చూచినదో 5 లేక 4 నెలలు జీవించును.

మేఘము లేని ఆకాశమునండు దక్షిణ దిశలో మెఱుపుఁజూచినను ఉదకమున ఇంద్రధనుస్సు గాంచినను మూడు లేక రెండు నెలలు జీవించును. జలమునందుగాని అద్దమునందు గాని తాను కనుపడనిచో మరియు తన రూపము తలకాయలేనిదిగా కనపడునెడ ఒక నెలకంటె నెక్కువ కాలము జీవనముండడు.

శరీరము శువ (పీనుగ) గంధము (వాసన) గలదైనను - పసా (మాంసరస) గంధము గలదైనను 15 దినములవరకు మృత్యువు సంభవించును. స్నానము చేయగానే రొమ్ము ఎండిన దైనను - శిరస్సు నుండి పొగ వెళ్లుచున్నను పన్నెండు రోజులు మాత్రము జీవనము కొనసాగును.

శ్వాసవాయువు మర్మస్థానములను బాధించుచున్నను - ఉదకములను పలుమార్లు త్రాగినచో దాహము తీరకున్నను మృత్యువు సమీపించినదని తెలియవలెను. ఎలుగు గొడ్లతో కోతులతో నీడ్వబడు రథము పై దక్షిణ దిశకు పయనించుచు ఆడుచు పాడుచున్నట్లు స్పష్టము పడినచో అట్టివాని మరణము చేరువ నున్నడని బోధపడును. దిసముల గల జోడి తలవానిని గాంచినట్లు శిరస్సు వరకు  బురదలో పడినట్లును నల్లచీర గట్టుకొనినది, నలుపు పన్నె గలదియునగు పడతి పాడుచు తనను డక్షిణదిశఁగొంపోయినట్లును తన కంఠము కనుపడనట్లును స్పష్టము పడినయెడల త్వరలో మరణించును. బూడిదతో కూడిన బొగ్గులు, వెంట్రుకలు, ఎండిన ఏరు, విషసర్పములు ననువానిని స్పష్టమున పది దినములు చూచువాడు, మరియు వికారస్వరూపులు నీల వర్ణకులు నగు పురుషులు చేతులలో ఆయుధములను లేవనెత్తి పాషాణములతో కొట్టు చున్నట్లు స్వప్నముఁగాంచువాడు - శీఘ్రమే మృత్యువుజారింబడును. తెల్లవారునపుడు సూర్యోదయ సమయమునను నక్కలు ఎదురుపడి అరచునెడ దంతములు వణకుచున్నను రాత్రిగాని పగలుగాని మాటిమాటికి భయపడుచున్నను - దీపపు వాసన సోకకున్నను అర్ధరాత్రి నింద్రధనుస్సుఁగాంచినను పగలు చుక్కలఁజూచినను. ఇతరుల కనులలో తనను చూడమన్నను ఒకటే కన్నునుండి నిరంతరము నీరు కారుచున్నను చెవులు నోరు ముక్కు వణకుచున్నను నాలుక నల్లబడి వేడిగలదైనను ముఖము తెల్లబడినను చెక్కిళ్లు ఖర్జూర ఫలములఁబోలినను వెంట్రుకలు
విరబోసికొని నవ్వుచు గానముఁ జేయుచు నాట్యమాడుచు దక్షిణ దిశకు బోయినట్లు స్వప్నము గాంచినను అట్టివాని మరణము సమీపించినట్లేను. శరీరము తెల్లని మేఘము యొక్క వన్నెగలదై తెల్ల ఆవాలఁబోలినదై తెల్లబారినదియునై యుండునెడను ఒంటెలుగాడిదలు మోయుచున్న రథముపై దక్షిణదిశకు పోవుచున్నట్లు స్వప్నముపడునెడను చెవులులోని చప్పుడు ఏనరాకున్నను గోతిలో పడి గోతినుండి లేపకున్నను చూపు పైకిమాత్రము ప్రసరించుచున్నను నోరు ఎండినను బొడ్డులో ఛిద్రముపడినను మూత్రము మిక్కిలి వేడి గలదై తగ్గకున్నను పగలు గాని రాత్రి గాని తనను చంపువాడు ఎదురున్నప్పటికీ కనుపడకున్నను స్వప్నాంతమున అగ్ని ప్రవేశముఁజేసి తెలిపిదప్పియున్నను తాను కప్పుకొనిన తెల్లని వస్త్రము ఎర్రనిదిగా లేక సల్లనిదిగా స్వప్నములో కనుపడినను మృత్యువు సమీపించినచసి గుర్తింపవలెను.

ఇట్లు తనకు మరణ సూచనలు కనుపడినచో బుద్ధిమంతుడు దీనుఁడుగాక శీఘ్రముగా సంసారమునందు విరక్తి గలవాడై తూర్పునకు లేక ఉత్తరమునకు బయలుదేరి చెట్లనీడ గల జంతువర్జితంబు నగు ఏకాంతస్థలమున - ఉదఙ్మఖుడు లేక ప్రాఙ్మఖుడునై స్వస్తికానసనోపవిష్ణుఁడునై మహేశ్వరునకు “ఓం నమో భగవతే రుద్రాయ” అనుచు నమస్కరించి గాలిలేనిచోటు దీపము వలె కదలనివాడై శిరసు కంఠము శరీరంబు సమానములుగా నుండునట్లు కూర్చుండి తూర్పునుండి ఉత్తరము వరకు సమానముగా నుండు ప్రదేశమున శివధ్యానముఁ జేయవలెను.

శివుని ధ్యానించుతఱి - కోరికలు, ఆలోచనలు, కుటుంబానురాగము, లోగడ తాననుభవించిన సుఖదుఃఖములును మనస్సులోనికి రాకుండునట్లు ప్రయత్నించవలెను.

శ్వాసోచ్ఛ్వాసములను నియమించి ఓంకార స్మరణముతో లోనికి గాలి పీల్చుచు లోన నోంకారమును నింపవలెను. ఓంకారము అకార ఉకార మకారములు గలిగి త్రిమాత్రమనబడును. ఓంకారము ధనుస్సు గాను హృదయము బాణముగా ననుసంధించి జాగ్రతగా వేధించినచో ఆత్మ ఓంకారమయమగును. “ఓమ్” అను ఏకాక్షరవాచ్యమగు బ్రహ్మము హృదయ గుహలో దాగియున్నది.

ఓమ్ లో గల అకార ఉకార మకారములు స్వర్గ మర్త్య పాతాళలోక ములనియు, ఋక్ యజః సామవేడములనియు, భావించి ఓంకారముతో అథవా శివోహముతో ధ్యానించినయెడల సాలోక్యముక్తి నొందును. ఓంకార ధ్యానమువలన ద్వాదశ అశ్వమేధయాగఫలము సంప్రాప్తమగును. మరియు ఉగ్రమైన తపస్సు చేత భూరి దక్షిణాలుగల యజ్ఞముల వలన కలుగు ఫలము చేకూరును.

శివధ్యానపరుఁడు మొదలు శుచియై భస్మరు ద్రాక్షధారణాత్మకమగు పాశుపత వ్రతము నవలంబింప వలసియుండును.

పక్యఫలము చెట్టునుండి ఊడిపడునట్లు శివనమస్కారముతో శివధ్యానము తోడను జన్మాంతరార్జితపాపమంతయు పటాపంచలగును.

యత్ర రుద్ర నమస్కారః సర్వకర్మఫలో ధ్రువః । అన్యదేవనమస్కారా - న్న తత్ఫల మవాప్నుయాత్ ॥

“శివుని నమస్కరించువాడు సమస్త పుణ్య కర్మఫలము నొందును కాని శివేతర దేవతలను నమస్కరించినచో అట్టి ఫలము లభింపదు.”

శివ ప్రణామము సర్వ శ్రేష్ఠమగుబుచే మనోవాక్కాయములయందు నమ్రత గలవాడై శివునినే “నమస్తే రుద్ర’’ ఇల్యాది వాక్యములను అథవా “నమఃశివాయ’ మంత్రము నుచ్చరించుచు నమస్కరించుచుండవలెను.

ఇదంతయు సాధ్యపడనిచో మరణ సూచనలు సంభవించినతఱి ఆవిముక్త మనఁబడు వారాణసీ (కాశీ) క్షేత్రమునకు వడిగా చేరి యచ్చోట ప్రాణములను విడిచి ముక్తుఁడు కావలెను. శ్రీశైలక్షేత్రమున మరణించినను మోక్షము లభించును గాని కాశీ క్షేత్రము ప్రత్యేకముగ మోక్ష ప్రదముగా కీర్తింపు బడుచున్నందున - బలవంతముగా గాక - సహజముగా నచ్చోట శరీరమును త్యజించు వాడు తత్కాలముననే శివానుగ్రహపాత్రుఁడై ముక్తుడు కాజాలును.

ఇయ్యది
“శివవిజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (91)వ అధ్యాయము.