లింగ మహా పురాణము

Table of Contents

35 - మహాదానములలో ఏడవదగు సువర్ణగోదానమును నిరూపించుట

మంచి డెక్కల పై వజ్రములు, కొమ్ములపై పద్మరాగమణులు, కనుబొమల నడుమ ముత్తెము, స్తనములయందు వైడూర్యములు, తోకపై నీలమణియు, దంతములపై పుష్పరాగములు నుండునట్లు గోరూపమును సువర్ణముతో చేయించి ఆవుదూడఁగూడ బంగారముతో నిర్మించియు మండలమునందు - మగదూడతో కూడ గోవును స్థాపించి  -నూతన వస్త్రద్వయముతో చుట్టియు గాయత్రీ మంత్రముతో నారాధించి - ఘృతాదులతో  శివలింగము నభిషేకించి పూజింపవలెను.

సమిధలు ఘృతము చరువు అనువానితో గాయత్రీమంత్రము నుచ్చరించుచు హవనమును జయాదులు స్విష్టకృత్తు పూర్ణాహుతి వరకు నొనర్చియు శివునకు నివేదించి - ఆచార్యునకు లేక సద్రాహ్మణునకు సమర్పించినచో శివానుగ్రహ మవశ్యము ప్రాప్తించును.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక ‘ అను శాంకరీయ

ఆంధ్రానువాద ప్రవచనమున (35)వ యధ్యాయము.