లింగ మహా పురాణము

Table of Contents

85 - శివ పంచాక్షర మహామంత్ర విధి వినియోగాది నిరూపణము

శివ వ్రతములన్నిటిలో ఉమామహేశ్వరపూజనాంగముగా పంచాక్షరీ మంత్రమును జపించినచో వ్రతములన్నియు పరిపూర్ణఫలప్రదములగును.

“పంచాక్షరీ విద్య యెట్టిది ? దాని మహిమ యేలాటిది ? అద్దానిని జపించు విధానమెట్లు? మాకు వినవలెనను కుతూహలము కలిగినది గాన వివరింపుము!” అని శౌనకాదులు ప్రశ్నింపగా సూతముని చెప్పదొడగెను.

“దేవదేవేశ్వరా! పంచాక్షరీ మహిమను వినదలచినాను. దయచేసి తద్విధానము
నుపదేశింపుము!” అని అమ్మవారు ప్రార్థింపగా అయ్యవారు దిగువ విధానము వక్కాణించెను.

శ్లో॥ పంచాక్షరస్య మాహాత్మ్యం-వర్షకోటిశతై రపి । న శక్యం కథితుం దేవి। తస్మా త్సంక్షేపతః శ్రుణు। ॥

నూర్లకోట్ల సంవత్సరములు చెప్పినను పంచాక్షరమంత్ర మహిమ పూర్తి కాదు. గాన
సంగ్రహముగా చెప్పెదను. వినుము!

పూర్వము మహాప్రళయమున స్థావరజంగమములు, దేవాసురులు, ఉరగరాక్షసాదులును ప్రకృతిలో లీనులైన తటి అట్టి ప్రకృతివైన నీవు నాలో డాగుదువు గాన నేనొకడనే యుంటిని. ఆ సమయమున నన్నాశ్రయించిన పంచాక్షరమునందు వేదములు శాస్త్రములు నిత్యములై యుండినవి. అప్పుడు నేను ప్రకలిగా నారాయణుఁడను, ఆత్మగా శివుడునై రెండు రూపములు గలవాడ నైతిని.

మొదట నానుండి ఆమిన పంచిన ఉడకములలో పరుండిన నారాయణుని నాభికమలము నుండి నా సంకల్పమున బ్రహ్మదేవుడు ఇము ముఖములు గలవాడుగా జన్మించి సృష్టిఁజేయఁడలచియు మొదలు మానస పుత్రులను పరుగురిని పుట్టించినవాడై “మహాదేవా! మహేశ్వరా! నా కుమారులకు సృష్టిసామర్థ్యమును ప్రసాదింపు” మని నన్ను ప్రార్థించెను. అప్పుడు నేను నా ఐదుముఖాలలో ఐదు అక్షరములను బ్రహ్మదేవునకు సుపదేశింపగా నాతడు ఐదు ముఖాలతో పరిగ్రహించి పంచాక్షనమంత్రము వాచకముగా నేను వాచ్యుడుగా గుర్తించియు-దీనిని జపించు విధానముతో సహ తన కుమారులకు
ప్రబోధించెను. అంత సవ్వారు పంచాక్షర మంత్రము నక్షరలక్షగా జపించిరి.

శ్లో॥ తత స్తుతోష భగవాన్ - త్రిమూర్తీనాం పరః శివః ॥ దత్తవా నఖిలం జ్ఞాన - మణిమాది గుణప్రదమ్ ॥

బ్రహ్మవిష్ణు రుద్రుల నతిక్రమించి యుండు శివుఁడు-వారి తపస్సునకు సంతోషించి- అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అను ఎనిమిది ఐశ్వర్యములను కలిగించు పంచాక్షర మంత్రమును మంత్రార్ధముతో సహ- ఉపదేశించెను.

అంత నవ్వారు పంచాక్షరమంత్రముతో పరమేశ్వరు నారాధించుటకై మేరు శిఖరమంజరి ముంజవత్ పర్వతము చెంత నా భూతగణములు రక్షించుచుండగా - సృష్టిసామర్థ్యమును కోరుచు - తీవ్రమైన తపస్సును దివ్యములైన వేయి వత్సరములు సెలుపబడినవారై- చేసిరి. అంత నేను వాలి తపస్సును మెచ్చి పంచాక్షరమంత్రము యొక్క వినియోగమును- అనఁగా-ఋషి, ఛందస్సు, దైవతము, శక్తి, బీజము,షడంగన్యాసము, ధ్యాసము అనువానిని- ప్రబోధించితిని. అట్టి మంత్ర జపవిధానము నంతయు నావలస పరిగ్రహించి వారు అనుష్ఠింపగా లోకములను బ్రాహ్మణాది వర్ణవిభాగములను తరము మను “పూర్వ కల్ప సృష్టిని పంచాక్షరమం త్రజపఫలముగా గుర్తించిన వారై” కల్పింపగలిఁగిరి.

ఐతే ఇంతటి మహిమ గల పంచాక్షర మంత్ర మెట్టెడనఁగా ?

శ్లో॥ అల్పాక్షరం మహార్థం చ- వేదసారం విముక్తిదం।
అజ్ఞాసిద్ధ మసందిగ్ధం - వాక్య మేత చ్చివాత్మకమ్॥

“కొద్ది అక్షరములు, గొప్ప అర్థంబు గలిగినదై వేచసారంబునై మోక్ష ప్రదంబునై యుండు పంచాక్షర మంత్రము గుర్పాజ్ఞాసిచము, సంశయ రహిరంబునై శివ వాక్యమగునది.”

మరియు నీ మంత్రము అనేక సిద్ధుల నొసగునడే గాక గ్రహించువారి మనస్సున
రంజింపఁజేయును. దీని యర్థము మహామహులచే శివపరముగా నిర్ణయింపబడినది గాన గంభీరమై పరమేశ్వర వాక్యముగా విరాజిల్లునది. దీనిని సుఖముగా పలుకవచ్చును. సమస్త మహామంత్రార్ధము ఇందిపడియున్నది.” మంత్రములన్నిటికి నిది బీజమై ఆచ్యంబునై పలు బీజ (మఱ్ఱి విత్తన) మువలె నుండును. శివుడు సర్వవ్యాపకుడైనను పంజరములో చిలుకవలె ఓంకార ఘటిత పంచాక్షరమంత్రమునందు స్థిరపడును. మంత్రమునకు మహేశ్వరునకును వాచ్యవాచక భావము అనాడి సిద్ధమై యున్నది. వేదములయంచు శివాగమములయందునియ్యది షడక్షరముగాను లోకవ్యవహారమున
పంచాక్షరముగాను గుర్తింపఁబడుచున్నయది.

ఈ సంహామంత్రము గురూపదిష్టమై హృదయమునందు నెలకొని యుండు వారికి -ఇతరమంత్రములతో, బహు విస్తృతములగు ధర్మశాస్త్రముల తోడను ప్రయోజనముండదు. ఎవడు గురుపు వలన దీనిని పరిగ్రహించి - నిధి విధానముగ జపించునో, వాడు సమస్త వేదశాస్త్ర వాఙ్మయము నధ్యయనము (జేసినవాడగును. విజ్ఞాము నంతయు సంపాదించిన వాడగును. సమస్త సత్కర్మల నొనర్చిన వాడగును.

ఇద్దానిని ప్రతిదినము నియమనిష్ఠలతో జపించులుయే-శివజ్ఞాన ప్రదము, పరమపదప్రాపకము, బ్రహ్మవిద్యా పరిగణితంబు నగును.

శ్లో॥ పంచాక్షరైః స ప్రణవో మంత్రోఽయ హృదయం మమ ॥

“నమః శివాయ” అను ఐడక్షరములతో ఓంకారము తోడను కూడియుండు నీ
మహామంత్రము నాకు హృదయమగును. అని శివుడు పార్వతికి చెప్పెను.

ఈ మహా మంత్రమునకు వామదేవుడు ఋషి; పంక్తి ఛందస్సు; శివుడు దేవత; పంచ మహాభూతాత్మకములగు నకారాది ఐదక్షరములు బీజము; ప్రణవము ఆత్మ; శక్తి- నీవేను;

నా మంత్రమున ప్రణవమునందు అకార ఉకార ములుండును. నీమంత్రమున ప్రణవమునందు ఉకార మూర ఆకారములుండును (ఉ.మ. ఆ, = ఉమా అనునది శక్తి ప్రణవము)

ఇక - కరన్యాసము, దేహన్యాసము, అంగన్యాసంబు నని న్యాసము త్రివిధంబు నగు. చేపన్యాసము - ఉత్పత్తి ప్రతి సంహారభేదముతో ముత్తెఱగులు గండగును. ఎట్లనగా?

మొదట కరన్యాసమును, ఆ పిదప దేహాన్యాసమును, తరువాత అంగ న్యాసమును, “ఓం నమః నాయ” అను అక్షరములతో చేయవలెను. “ ఓం” అంగుష్ఠాభ్యాం నమః, “సం” తర్జనీభ్యాం నమః, “మం” మధ్యమాభ్యాం నమః, ‘శిం” అనామికాభ్యాం నమః, “వాం” కనిష్ఠికాభ్యాం నమః, “యం” కరతలకరపృష్ఠాభ్యాం నమః (ఇది కరన్యాసము)

ఓం శిఖాయాం-నంశిరసి-మంముఖే- శింహృదయే-వాం నాభా-యం పాదయో:-(ఇది ఉహన్యాసుడు).

ఓం హృదయాయ నమః - సం శిరసే స్వాహా - మం శిఖాయై పషట్ - శిం కవచాయ హుం -నాం నేత్రత్రయాయ వౌషట్-యం అస్త్రాయ ఫట్. (ఇది అంగన్యాసము)

ఇక దేహన్యాసము యొక్క తైవిధ్యమును చెప్పుచున్నాను. ఎల్లనఁగా ?

శిరస్సు మొదలుకొని పాదముల వరకు చేయుడునది- ఉత్పత్తి న్యాసము; పాదాదిశిరః పర్యంతము కృతమగునది సంహారన్యాసము; హృదయము, ముఖము, కంఠము అనువానియందు మాత్రము గావింపబడునది-ప్రతి న్యాసము వీనిలో ఉత్పత్తి న్యాసము బ్రహ్మచారులకు; స్థితి న్యాసము గృహస్థులకు; సంహారన్యాసము సన్న్యాసులకు విహితములైనవి.

అథవా “ఓం నమశ్శివాయ” అను షడక్షరమంత్రముతోడనే దేహ న్యాసము నందరు
చేయవచ్చును.

మంత్ర ధ్యానము :-

శ్లో॥ ఓం కారవదనా దేవీ-వాయ కార భుజద్వయీ । శికార దేహమధ్యా చన మకార పడద్వయీ ॥ శ్లో॥ పంచాక్షరీ పరా విద్యా సతారా లింగరూపిణీ । శివమంత్రాభిధా శైవీ మమాంగే సుప్రతిష్ఠితా ॥

గురుధ్యానము:-

శ్లో॥ అవాచ్యాత్మస్వరూపాయ శివభావప్రదాయినే । నమ స్సద్గురునాథాయ షట్స్థల బ్రహ్మమూర్తయే॥ శ్లో॥ సదాశివ సమారంభాం శ్రీకంఠాచార్య మధ్యమాం । అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరామ్ ॥

స్వగురుధ్యానము :-

శ్లో॥ వందే దీక్షా ప్రదం శైవం భస్మరుద్రాక్షధారిణం । లింగినం శ్రౌత మారాధ్యం మదను గ్రహతత్పరమ్ ॥

శివధ్యానము :-

శ్లో॥ పందే సాంబశివం శంభుం మంత్రవాచ్యం మహేశ్వరం । మదాచార్యస్య రూపేణ స్థితం మత్పురతో ఽ నిశమ్ ॥ శ్లో॥ చరరూపేణ తిష్ఠంతం- కైలాసనిలయం భవం । ప్రాణలింగస్య రూపేణ హృదయే స్థిత మవ్యయమ్॥

కుడిచేయి బొటనవ్రేలు నుండి ఎడమ చేయి బొటన వ్రేలువరకు చేయఁబడు కరన్యాసము ఉత్పత్తి న్యాస మనఁబడును. వామహస్తాంగుష్ఠమునుండి దక్షిణ హస్తాంగంస్థము వరకు చేయబడునది-సంహారన్యాసమగును. అంగుష్ఠము మొదలుకొని కనిష్ఠము వరకు హస్తద్వయమునందు గావింపబడు కరన్యాసము స్థితిన్యాసముగా పేర్కొనబడును. ఇయ్యది గృహస్థులకు భోగప్రదముగనుండును ఓంకారమును మంత్రము యొక్క ఆద్యంతములయందు జతపటుచి సర్వాంగములయందు రెండు హస్తములందలి వ్రేళ్ల కొనలయందును న్యసించుటయు విహితమైనది.

పాదములను కడిగికొని- భస్మధారణాదులచే శుచియై-తూర్పు లేక ఉత్తరమునకభిముఖుఁడై న్యాసముల నొనర్పవలెను. మొదట మంత్రముయొక్క ఋషి ఛందస్సు దైవతము బీజము శక్తి పరమాత్మ గురువు అనువానిని స్మరించి మంత్రముతో కరములను నీటితో తుడిచి అరచేతులలో ఓంకారమును న్యసించి- వ్రేళ్ల యొక్క మూడు రేఖలయందు నకారాదియకారాంతములగు ఐదక్షరములను బిందువులతో కూడ (నం మం శిం వాం యం) న్యసింపవలెను. తరువాత దిగ్భందమును చేయుచు విఘ్నేశ్వరునకు, సప్తమాతృకలకు, దుర్గాదేవికి, దిగ్దేవతలకును “రక్షధ్వం” అనుచు మొక్కవలెను.

ఈ చెప్పఁబడిన విధముగా చేయఁబడు సర్వవిధన్యాసము జన్మాంతర కృత పాపమును పోగొట్టుటయే గాక జీవితకాలముననే శివ సమత్వము నేర్పరచును. న్యాసానంతరము దిగ్బందమును ధ్యానము నొనర్చి గురూపదేశ లబ్ధమైన శివ షడక్షర మహామంత్రమును జపించవలెను.

అజ్ఞాహీనము క్రియాహీనము శ్రదాహ్నము మనఃపూర్వకము కానిది ప్రతిదినము జపింపబడని దియు ఎల్లకాలము జపింప బడునదియు నగు మంత్రము నిష్ఫలంబగును.

అజ్ఞాసిద్ధమైనను ఇతరుల కోసం చేయబడునది దక్షిణాహీనమైనచో మంత్రము సఫలముకాదు.

అజ్ఞాసిద్ధము, క్రియాసిడము, శ్రద్ధాసనము, మనః పూర్వము, దక్షిణాసిద్ధము, నగు మంత్రము సిదించును.

మంత్రోపదేశ విధానమెట్లనఁగా ?

మంత్రార్థమును బాగుగా గుర్తెరిగి నవాడు, శివును పాసించువాడు, సద్గుణములు గలవాడు, వధ్యానపరాయణుఁడు నగు గురువు నాశ్రయించి చిత్త శుద్ధితో, మనోవాక్కాయములతోడను, సువర్ణవస్త్రాదుల తోడను గురువును సంతోషింపఁజేయవలెను. మరియు శక్తి యున్నచో గజాశ్వములను రథములను రత్నములను భూక్షేత్రములను గృహమును భూషణములను వివిధ ధాన్యములను భక్తిశ్రద్ధలతో గురువు గారికి సమర్పించవలెను. మంత్రసిద్ధిని కోరునట్టి శిష్యుఁడు ధనలోభమును వహింపనివాడై తనకు గల కుటుంబ పరిస్థితిని, స్థిరచరాస్తిని, రాబడిని గురువుగారికి తెలుపవలెను.

ఇల్లు విధియుక్తముగా గురువుగారిని పూజించి వారి వలన మంత్రమును మంత్రార్థమును స్వీకరింపవలెను. ఇందువలన గురువు ప్రసన్నుడై శిష్యుని భక్తిని పరీక్షించి మాహేశ్వర బ్రాహ్మణులను సత్కరించియు సముద్రతీరమునందుగాని, మహానదీతీరమున గాని, గోశాలయందుగాని, దేవాలయము నండుగాని, పరిశుద్ధ ప్రదేశమునందు గాని, తన ఇంటిలో గాని, నిర్దుష్టములగు శుభ తిథి నక్షత్ర యోగాడుల ముందు అనుగ్రహముతో- ఏకాంతస్థలమున స్వరయుక్తముగా మంత్రమును కుడిచెవిలో మూడు పర్యాయములు చెప్పుచు శిష్యునితో పలికించవలెను. “శివమస్తు” “ శుభమస్తు” శోభ ఽ నోస్తు” “ప్రియో ఽ స్తు” అని గురువు శిష్యు నాశీర్వచింపవలెను.

ఇట్లు గురుప్రదత్తమైన అపషడక్షర మహామంత్రమును ప్రతిదినము ఉదయమున స్నానానంతరము భస్మము ద్రాక్షధారియై ద్విజుఁడైనచో సంధ్యావందనము నొనర్చి లింగధారియగునెడ ఇష్టలింగమునకు పుట్టనముఁగాపించి. లింగతీర్థమును పుచ్చుకొని (శివ లింగమునకు) భస్మనలదియు సంకల్పపూర్వకముగా - జపించవలెను.

శ్లో॥ యూవజ్జీవం జపే న్నిత్య మష్టోత్తర సహస్రకం । ఆనశ్నం స్తత్పరో భూత్వా సయాతి పరమాం గతిమ్ ॥

జీవితకాలమంతయు ప్రతిదినము భోజనమునకంటె ముందు వేయి నెనిమిది పర్యాయములు మంత్రమును శివునియండు మనస్సు నిలిపినవాడై జపించువాడు- ప్రారబ్ధాంతమున ముక్తుఁడగును.

ఇఁక పురశ్చరణ విధానమును నిరూపించుచున్నాను. అక్షరానికి లక్ష సంఖ్యగా-నాలుగురెట్లు అనఁగా ఇరువదినాలుగు లక్షలు జపించినచో పురశ్చరణ మగును. పురశ్చరణము జేయువాడు ప్రతిదినము నక్తభోజనమును బ్రహ్మచర్యాది నియమముల నవలబింపవలెను. పురశ్చరణము నిత్యసహస్రజపము అనువానిలో నేదే నొక పద్ధతి గల వాడు కావలెను. పురశ్చరణము నొనర్చినను నిత్య జపము జేయు వానితో సమానుడు లోకమున నుండడు గాన నట్టివాడు మంత్రసిద్ధుఁడై నొరులకు మంత్రసిద్ధిని కలుగఁజేయజాలును.

ఇంక జపవిధానము ఎట్లనఁగా ?

మనోహరమైన ఆసనము నేర్పరచుకొని మౌనముతో ఏకాగ్రమనస్కుఁడై తూర్పు లేక ఉత్తరమునకు ముఖముగా కూర్చుండి మంత్రమును జపించవలెను. పంచాక్షరీ మంత్రముతో ఇరువదినాలుగు ప్రాణాయామములను చేయవలెను. ప్రాణాయామమువలస పాపములు త్వరలో క్షీణించును. ఇంద్రియములు స్వాధీనములగును.

జపస్థల విశేషములు - గృహమునందు ఒకరెట్టు; గోశాలలో నూరురెట్లు; మహానదీతీరమున లక్షరెట్లు; శివసన్నిధిని అనంతముగాను జపఫలము సమకూరును. సముద్రతీరమునందు, దివ్యజలాశయసమీపమున, పర్వతముపైన, దేవాలయములయందు, సమస్త పుణ్యాశ్రమములయందును చేయబడు జపము కోటిరెట్లు ఫలము నొసఁగును.

శివసన్నిధానమున సూర్యుని ముందు గురువుచెంత-దీపము ముందు- ఆవు చేరువన ఉదకసమీపమునందు- జపించుట ప్రశస్తంబగును.

జపసాధనములు: - వేళ్లపై ఒకరెట్టు; వేళ్ల గీతలపై ఎనిమిదిరెట్లు, పుత్రజీవములు అను పూసలలో పదిరెట్లు, శంఖములతో నూరురెట్లు, పగడములతో వేయిరెట్లు, స్ఫటికములతో పదివేలరెట్లు, ముత్తెములతో లక్షరెట్లు తామరపూసలతో పదిలక్షల రెట్లు బంగారుపూసలతో కోటిరెట్లు, దర్భముడులతో రుద్రాక్షముల తోడను అనంతముగాను జపఫలము లభించును.

జపసాధన సంఖ్యాఫలములు –

ఇరువదియైదు పూసలు మోక్షసాధనములగును. ఇరువదియేడు శరీర పుష్టి నొసగును. ముప్పది ధనసమృద్ధి ప్రదములు, ఏబడి (50) ఇతరులపై ప్రయోగమును సిద్ధింపజేయును. నూటనెనిమిది (108) భోగమోక్షదాయకములు.

జపదిశాఫలములు –

పూర్వాభిముఖము జనవశీకరణ ప్రదము. దక్షిణాభిముఖము-ఆభిచారిక మగును.
పశ్చిమాభిముఖము ధనావహము కాగా-ఉత్తరాభి ముఖము శాంతికరమగును.

జపమాల నoగుష్ఠముతో జరుపుచు మిగత వ్రేళ్లతో జపించుట ప్రశస్తమగును- గాన అంగుష్ఠము (బొటన వ్రేలు)ను విడిచి జపించుట కూడదని తెలియవలెను.

యజ్ఞములన్నిటిలో జపయజ్ఞము శ్రేష్ఠమైనది. ఎందుకనఁగా ? జపేతర యజ్ఞములన్నియు హింసతో కూడియుండును. జపయజ్ఞమొక్కటే అహింస గలదగుచున్నయది.

కర్మయజ్ఞములు, తపస్సులు, మహాదానములు, జపయజ్ఞము యొక్క పదునారవ ఫలము గూడ నొసగ జాలవు. ఈ మహిమయంతయు వాచికజపమును గురించియే చెప్పబడినది.

ఉచ్చ నీచస్వరములతో స్పష్టముగా నోటఁబలుకఁబడునది- వాచిక జపమునఁబడును. మెల్లగా పెదవులఁగదల్పుచు తనచెవిలో. మాత్రము వినబడునట్లు చేయఁబడునది ఉపాంశు జపమగును. మనస్సులో నొక అక్షరము తరువాత మరియొక అక్షరమును తలచుచు మంత్రార్థమును భావించుట మానిసికజపముగా పేర్కొనఁబడును.

ఈ మూడువిధములలో వాచికమున కన్న ఉపాంశువు, ఉపాంశువున కంటె మానసికము శ్రేష్ఠములై జపఫలము నధికముగా నొనగూర్చునని యని తెలియవలెను.

జపముతో మంత్రాధిష్ఠాన ప్రసన్నమై ఐహికవాంఛలను తీర్చుచు- అవసాన కాలమున శాశ్వతముక్తిని కలుగఁజేయును. మరియు యక్షులు రాక్షసులు పిశాచములు గ్రహములు మొదలగు భయపెట్టు ప్రాణులు జాపకుని భయముతో- దరిజేఱ జాలవు.

పూర్వజన్మ పరంపరాకృతములగు పాపములన్నియు జపముతో నశించును. అపమృత్యువు తొలగును. ఐతే జాపకుడు సదాచారము గలవాడై మంత్రమును జపించినచో శుభమే కలుగు చుండును.

సదాచారము గలవానికి- దేనివలనను భయముండదు. సదాచారము లేనివానికి - సర్వత్ర భయము ఆవహించును. సదాచారముతో దేవత్వము ఋషిత్వము సంఘటించును. ఆచారహీనులు పశుపక్ష్యాది జన్మల నొందుచుందురు.

దురాచారుడు, అపరిశుభ్రుడు, పాపనిరతుఁడు, మంత్రమును మంత్రార్థమును
దూషించువాడును, లోకమున నిందింపఁబడును. తన వర్ణమునకు ఆశ్రమమునకును తగిన ధర్మము అనుష్ఠించుటయే సదాచార మగును. సదాచారుఁడు శివప్రీతికరుఁడగును.

ద్విజుఁడైనచో ప్రాతః సాయంకాలములలో సంధ్యావందనము నవశ్యము చేయవలెను. సంధ్యావందనమును చేయనిచో బ్రాహ్మణ్యము భ్రష్టమగును.

ఏమాత్రము అబద్ధములాడకూడదు. సత్యమును పలుకవలెను. సత్యమే బ్రహ్మము. అసత్యము బ్రహ్మదూషణముగా పరిణమించును. కఠినసంభాషణము, అసత్యము, మొండితనము, చాడీలు చెప్పుటయు, పాపహేతువులగును. పరస్త్రీలను పరద్రవ్యము నపేక్షింపరాదు. పరులను మనస్సుతో గాని, వాక్కుతో గాని శరీరముతో గాని హింసింప గూడదు. శూద్రాన్నమును, ఒకజాము గడచిన పంటను, దేవునకు నివేదింపబడిన ఆహారము మొత్తముసు, పెక్కుర పెత్తనము గల యన్నమును, సమూహము కొరకు చేయబడిన వంటను, రాజుగారి యన్నమును, శ్రాద్ధాన్నమును తినగూడదు.

అన్న (ఆహార) శుద్ధితోడనే అంతః కరణము పరిశుద్ధమగును కాని మట్టితో గాని జలముతో గాని చిత్తశుద్ధి కాజాలదు. గాన ఆహారశుద్ధి వలననే మనస్సు ప్రసన్నమగునని గుర్తించి. తాను తినబోవు ఆహారమును శోధింపవలసియుండును.

రాజు సమర్పించు ధనధాన్యాదులఁబరిగ్రహించుటతో వేదవేత్తలైన బ్రాహ్మణులకు గూడ చిత్తము మలినమగును. నలుపబడిన విత్తనములు అంకురింపనట్లు రాజప్రతి గ్రాహకులు అధోగతి నొందుదురు. మంత్రజాపకుడు మద్యమాంసములను విసర్జింపవలెను. స్నానమును చేయనది, ఇష్టదేవతను పూజింపనిది, జపము నొనర్పనదియు భుజింపరాదు.

ఆకు వెనుకవైపున రాత్రి యందు దీపము లేనిది పగిలిన పాత్రయందు త్రోవలోను- వర్ణ భ్రష్టుల చెంతను- శూద్రులు తినగా మిగిలిన వంటకమును పిల్లలతో సహపంక్తిగాను భోజనమును చేయరాదు.

గాయత్రీ శివ పంచాక్షరీ మంత్రములతో ఉదకముఁ జల్లి చమురు (ఘృతము) పప్పు కూరలు మొదలగు వ్యంజనములు గల అన్నమును “తినువాడు శివుడు” అను భావనతో మౌనముగా ఏకాగ్రమానసుడై భుజింపవలెను. పాత్ర లేకుండా నోటితోడను, నిలువబడి దోసిలితోడను. ఎడమచేయితోడను, పడకమీదను, ఇతరుడు చేతితో పోయుచుండగాను, నీళ్లు త్రాగకూడదు.

తాండ్ర- జిల్లేడు మొదలగు చెట్లు పాలుగలవి గాన-వాని నీడలో కూర్చుండ రాదు. మరియు స్తంభ (మొగుర)ము, దీపము, మానవులు మొదలగు ప్రాణులయొక్క. నీడ పనికిరాదు. ఒకఁడే త్రోవ నడువకూడదు. చేతులతో నదిని దాటరాదు. భావిమొదలగు వానిలోనికి దిగరాడు. ఎత్తైన చెట్ల నెక్కవలదు. సూర్యునకు అగ్నికి ఉదకమునకు డేవతలకు గురువులకు వెన్ను చూపుచు జపాది శుభకార్యములను చేయఁగూడదు. అన్నయందు అరికాళ్లను కాపరాదు. హస్తములను పాదములతో తాకరాదు. అగ్నికంటె దేవతలకంటె నెత్తైన చోట కూర్చుండఁగూడదు. అగ్నియందు మైల విడువకూడదు. పాదములతో జలమును కొట్టుట, ఉదకమునందు అశుద్దమును విడచుట- నిషిద్ధములు. పాత్రతో ఉదకము గైకొని తీరమునందు మలమును విసర్జించి మలవిసర్జన స్థానమును కడిగికొని నదియందుగాని తటాకాడులయందు గాని స్నానము జేయవలెను.

గోళ్లకొనలనీరు, వెంట్రుకలు తడిపిన జలము, స్నానవస్తోదకము; స్నానము జేయగా మిగిలిన నీరు, మేకలు కుక్కలు గాడిదలు ఒంటెలు అను వానిపై పడిన ఉదకము; ఉసుక (ఉముక - తుష) ధూళి; అశుద్ధంబు నను వానిని స్పృశించుటచే శ్రీహరికిని సంపత్తు నశించును. ఒకవేళ పొరపాటున వీనిఁదాకినచో - పరిశుభ్రుడై భస్మోదకము జల్లుకొనవలెను.

ఇంటిలో పిల్లిని పెంచువాడు చండాలునితో సమానుడగును. బ్రాహ్మణులకు
మార్జారములకును సమానముగా భోజనము నిడుట చండాలసమారాధనమగును. పిఱుదులగాలి, చేటల గాలి, ఊపిరిగాలి, నోటిగాలి, సోకినచో దరిద్రత్వము తారసిల్లును.

తలపాగ, కవచము, (చొక్కా) దిసమొల, (నగ్నత్వము) వెంట్రుకలు విరబోసికొనుటయు, మైల కలిగియుండుటయు, చేతుల అపరిశుభ్రత, స్నానాదులు లేకుండుటయు, అఱచుటయు, కోపము, గర్వము, ఆకలి, కునికిపాటు, ఉమ్మివేయుటయు, ఆవలింతలు, కుక్కలను నీచులను చూచుటయు, మధ్య మధ్యన నిద్రించుటయు, అమితనసం భాషణంబు ననుసవి జపవిఘ్నములగును. ఒకవేళ నివి హఠాత్తు సంభవించినయెడల సూర్యు నగ్నిని చంద్రుని గ్రహ నక్షత్రాదులను దర్శింపవలెను.
తరువాత ఆచమనమును ప్రాణాయామము నొనర్చి జపశేషమును పూర్తి జేయవలెను.

కాళ్లు చాచుట, దొంతి కూర్చుండుటయు, ఆసనము లేకుండుటయు, పరుండుటయు, త్రోవలో నుండుటయు, శూద్రుల చెంతను, ఎర్రని నేల, మంచంబు ననునవి- జపమునకు పనికిరానివి.

ఆసనముపై పద్మాసనముగా స్థిరముగా కూర్చుండి-మంత్రార్థమునందు మనస్సు నిలిపియు మంత్రమును జపించపవలెను.

పట్టుబట్ట, పులితోలు, దూదిగల మామూలు కొత్త వస్త్రము, మెత్తని కఱ్ఱతో చేయఁబడిన పీట యనునవి ఆసనయోగ్యములనగును. అనఁగా కఱ్ఱపీట, దానిపై పులితోలు, దానిపై దూదిగల మామూలు వస్త్రము, దానిపై పట్టుబట్ట వేసికొని జపము కొరకు కూర్చుండవలెనని భావము.

గురువు సన్నిధినున్నచో ప్రతిదినము మూడు వేళలయందు శిష్యుఁడు తన మేలుకొరకై పూజించవలెను.

గురువే శివుఁడనియు, శివుడే గురువనియు, శివుఁడెట్టివాడో మంత్రము అట్టిదే ననియు, మంత్రము ఎంతటి మహిమ గలదో, గురువు అంతటి ప్రభావము గలవాడనియు, శివ మంత్ర గురువులు సమానములనియు తెలియవలెను.

గురువు - సర్వదేవతాస్వరూపుడనియు, సమస్త శక్తులు గలవాడనియు భావింపవలెను. ఒకవేళ గురువు గుణవంతుడు కాకున్నను అట్టి గురువు యొక్క ఆజ్ఞను శిరసావహింపవలెను. గుర్వాజ్ఞను పాలించు శిష్యుడు శివజ్ఞానము శీఘ్రము గలవాడగును.

గురువుగారి ముందు గానీ, దేవుని ముందు గాని, తన ఇష్ట ప్రకారము కూర్చుండరాదు. అణకువతో నుండవలెను. ఎందుకనఁగా ? గురువు దేవుడు గాను, గురుగృహము దేవమందిరముగాను శాస్త్రమునందు పేర్కొనబడినది.

పాపాత్ముల సహవాసముతో పతన మగునట్లు- గురువుగారి పరిచర్యతో శిష్యుఁడు తన దుర్గుణములను- కాలక్రమమున - పోగొట్టుకొనఁజాలును “అగ్నిసంపర్కముచే సువర్ణము” నిర్మలమగునట్లు” గురుసేవచే శిష్యుఁడు పాపరహితడగును.

గురువు- సంతోషించినచో- బ్రహ్మవిష్ణురుద్రేద్రాద్యమరులు, నారదాది దేవర్షులును
శిష్యుననుగ్రహించెదురు. కర్మచేత గాని, వాక్కువలన గాని, మనస్సుచే గాని గురువునకు క్రోధమును కలిగించినయెడల - ఆయుష్యము, సంపత్తు, తెలివి, పుణ్యంబు క్షీణించును. గురువునకు విరుద్ధముగ ప్రవర్తించువారి యజ్ఞములు. జపములు, నియమములును వ్యర్థములగును. గురువుగారితో చిత్త విత్త సంభాషణములయందు క్రియయందును కపటమును చూపరాదు.

గురువునందు గల దుర్గుణములను వెల్లడింపఁగూడదు. సద్గుణములను చెప్పవలెను. గురువు ఆజ్ఞాపించినను ఆజ్ఞాపింపకున్నను గురువునకు హితము ప్రియంబు నగు కార్యమును చేయుచుండవలెను. గురువుగారి సమక్షమున మాటలాడవలసియున్నచో ఎదురు నుండక ప్రక్కన నిలువబడి వినయముతో సంభాషింపవలెను.

ఇట్లు సదాచారము గలవాడై గురుప్రియకరుఁడుడునై యుండు శిష్యుఁడు గురూపదిష్టమైన మహామంత్రమును జపింప నర్హత గలవాడగును. నిత్యము మంత్రమును జపించు విధానమును చెప్పుచున్నాను. జపవిధానము గల వినియోగమును గుర్తింపనిచో మంత్రము బలహీన మగును. వినియోగమును తెలిసికొనినవానికి ఆయుష్యము ఆరోగ్యము శరీర పాటవంబు సమకూరును. మరియు గొప్ప అధికారము సంప్రాప్తమగుటే గాకమంత్రార్థ విజ్ఞానము, స్వర్గ సుఖము, చివర మోక్షంబు లభించును.

స్నానముఁజేయుతఱి ప్రణవ షడక్షర మహామంత్రమును పదునొకఁడు పర్యాయములు చదువుచు ఉదకమును పైన చల్లుకొని అఘమర్షణ స్నానము నొనర్చి శుద్ధస్నానముఁ గావింపవలెను. ఇట్లు స్నానాదులచే శుచియై పర్వతముపై కూర్చుండి యొక లక్ష జపించవలెను. మహానదీతీరమున రెండు లక్షలు జపించినచో దీర్ఘాయుష్యము సంప్రాప్తమగును.

దూర్వాంకురము. (గణికమొలక)లు ఘృతము అనువానిని కూర్చి పదివేలు హవనము నొనర్చినయెడల ఆయుష్యము పెంపొందును. రావిచెట్టు (అశ్వత్థవృక్షము) క్రింద శనివారమున చెట్టునానుకొని కొన్నిదినములు రెండు లక్షలు జపించినచో దీర్ఘాయుష్యము చేకూరును.

రావిచెట్టును చేతులతో స్పృశించి 11 శనివారములు ప్రతి శనివారము 108 జపించుట వలన అపమృత్యువులు తొలగును.

సూర్యునకెదురుగా సుఖాసీనుఁడై లక్ష వరకు జపించుచు- నిత్యము జిల్లేడు తునకలతో ఎనిమిది వందల సారులు హవనము నొనర్చినచో ఏ వ్యాధి యున్న నద్ది దూరమగును. పలాశ (మోదుగు) సమిధలతో పదివేల పర్యాయములు హోమము జేసినచో సమస్త వ్యాధులు అంతరించును. ప్రతిదినము ఎనిమిది వందలు జపించి - ఉదకమును ఒకనెల రవిసమక్షమున త్రాగినయెడల కడుపులోని వ్యాధులు శమించును.

శివపంచాక్షరీ మంత్రముతో ఏకాదశ (11) వారము అభిమంత్రింపఁబడిన అన్నమును గాని, భక్ష్యమును గాని పానీయమును గాని స్వీకరించినచో అయ్యది విషమైన సమృతంబగును.

ప్రతిదినము పూర్వాహ్ణమున లక్ష సంఖ్య నిండువరకు జపించి, ఎనిమిదివందు సార్లు ఘృతముతో హవనము నొనర్చి సూర్యునకు నమస్కరించినచో సంపూర్ణారోగ్యము గలవాడగును.

నదీజలముతో నిండిన ప్రశస్తమైన పెద్ద కలశమును తాకుచు పదివేలు జపించి. అట్టి కలశోదకములో స్నానమును చేయునెడ- వ్యాధులన్నియు శమించును. అథవా నిత్యము ఇరువది ఎనిమిది పర్యాయములు మంత్రముతో అన్నము నభిమంత్రించి 28 లడవలు పలాశసమిధలు వ్రేల్చునెడ ఆరోగ్యము కలుగును. సూర్యచంద్ర గ్రహణ దినములలో నుపవాసముతో గ్రహణ సమయమున సముద్రగామినియగు మహానదిలో నిలువఁ బడి గ్రహణము విడుచువరకు- నీ మంత్రమును జపించినచో సంపూర్ణ ఆరోగ్యము చేకూరును. అష్టోత్తర సహస్రము (1008) జపించి బ్రాహ్మీ (పొనుగంటి
ఆకు) రసమును పుచ్చుకొనినచో దివ్యమైన వాక్కు ధారాళముగా ఏర్పడును. పదివేలు జపించి ఎనిమిది వేలు హవనము జేయునెడ గ్రహనక్షత్రపీడలు అంతరించును.

దుఃస్వప్నము సంభవించిన తఱి మేలుకొనగానే స్నాతుడై పదివేలు జపించి నెయ్యితో ఎనిమిది నూర్ల తడవలు వ్రేల్చునెడ దుఃస్వప్న దోషము దూర మగును. చంద్రసూర్య గ్రహణసమయమున శివలింగము నభిషేకించి పూజించియు పదవేలు జపించునెడ కామితముల నన్నిటిఁబడయవచ్చును.

ఏనుగలు గుఱ్ఱములు వృషభములు గోవులును వ్యాధి గ్రస్తములైనచో పలాశసమిధలతో పదివేలు హవనము నొనర్చినయెడల గజాదులన్నియు ఆరోగ్యముఁజెందును.

భూకంపము మొదలగు ఉత్పాతములు శమించుటకు శతృబాదలు తగ్గుటకును పలాశ సమిధలతో పదివేల పర్యాయములు హవనముఁ జేయవలెను. ఇతరులు తనపై మంత్ర ప్రయోగముఁ జేసినచో అట్టి మంత్రశక్తి శత్రువులఁ జేరి బాధించుటకు పలాశ సమిద్దశ సహస్రహవనమే కర్తవ్యమగును. పరులయందు ద్వేషము ఉపయోగించుటకై “య,వా, శి,మః, న, ఓమ్”  మంత్రములోని ఆక్షరములను వ్యతిక్రమముగా నుచ్చరించుచు మోదుగు కఱ్ఱలను నెయ్యితో కూడ పదివేల ఆహుతులను సమర్పించవలెను.

ఇంక ప్రాయశ్చిత్తముల నాలకింపుడు!

పాపములు పోవుటకు ప్రాయశ్చిత్త మవసరము. పాపపరిహారము కానిచో చిత్తశుద్ధి కలుగదు. చిత్తశుద్ధి లేనియెడల పుణ్యకర్మలన్నియు ఫలింపవు. తనకు గల తెలివియు తగ్గును.

దోసిలొగ్గినవాడై - తనకు గల జ్ఞానము సంపత్తు వృద్ధి బొందుటకై నన్ను ప్రార్ధించి
ఏకాదశరుద్రాభిషేకము నొనర్చి-అట్టి యుదకమును మంత్రము బలుకుచు (108) పర్యాయములు శిరస్సుపై పోసికొనవలెను. ఇట్లు చేసినచో సమస్తపుణ్య తీర్థ స్నానఫలము లభించును. పాపపరిహారంబు నగును.

సంధ్యా వందన భంగమైనచో- వరాహము (పందు) లచేతను, కుక్కుటముల (కోళ్ల) చేతను, చండాలురచేతను, దుర్జనుల చేతను తాకబడిన అన్నమును భుజించిన యెడలను మంత్రము నెనిమిదివందల తడవలు జపించవలెను. బ్రహ్మహత్యా నివృత్తికై కోటిసంఖ్యం జపించవలేను. తత్సమాన పాపపరిహారమునకై ఏబది (50) లక్షలు, ఉపపాతక శమసార్థము 25 లక్షలు, స్వల్పదురీతశాంతికై ఐదువేలు జపించవలెను.

ఇట్లు ప్రాయశ్చిత్త జపముల నాచరించి పురశ్చరణమును ప్రారంభించవలెను.

ఐదు లక్షల జపము - ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అను పంచవాయువులను జయింపఁజేయును, మరియొక పంచక్ష జపమువలన ఇంద్రియములు స్వాధీనములగును. మూడవసారి పంచలక్ష జపమును చేసినచో శబ్ద స్పర్శ రూప రస గంధములు అను విషయములు వశపడును. నాలుగవతూరి ఐదు లక్షల జపము మహాభూతములను స్వాధీనపఱచును. ఐదవ పురశ్చరణమువలన మనోబుద్ధ్యహంకార చిత్తములు అను అంతఃకరణ చతుష్టయము – అదుపులోనికి వచ్చును.

ఇట్లు ఇరువది యైదు లక్షలు జపించిన యెడల పృథివ్యప్ తేజో వాయ్యాకాశములు పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, శబ్ద స్పర్శ రూప రసగంధములు,
మనోబుద్ధ్యహంకారచిత్తములు, అవ్యక్తంబు నను ఇరువదియైదు తత్త్వములు స్వాధీనములగును.

మధ్యరాత్రియందు గాలి, చప్పుడు లేని చోట కునికి పాటు ఆవలింతలు లేనివాడై
ఏకా మానసుఁడై ఆసనముపై కూర్చుండి-లక్షయగువరకు ప్రతిదినము ప్రణవ పంచాక్షరిని జపించినచో హృదయములో గాని బాహ్యమునగాని పార్వతీ పరమేశ్వరులు జ్యోతిరూపమున కనబడుదురు.

ఇక ఈ జన్మయందు సర్వవిధములైన సంపదలు సమకూరుటకై ప్రతిదినము పదివేలు జపించవలసియుండును.

ఇదిగాక ప్రతిదినము నియమిత సమయమున శుచియై భోజనాత్ పూర్వము పన్నెండువేలు జపించినచో-మూడు సంవత్సరముల వరకు కోటి సంఖ్య పూర్తి యగును. ఇట్లు కోటి జపించు వాడు నా (శివ) సాయుజ్యము నీ జన్మాంతమునందే పొందును గాన శివసాయుజ్యమునకంటె మించిన ఫలము మరొండు లేదని భావింపవలెను. శివ ప్రణవ పంచాక్షర మంత్రస్వరూపమును జపవిధానాదికము సంతయు చెప్పితిని. దీనిని చదువువాడు వినువాడు నుత్తమగతి ప్రాప్తికి యోగ్యుడగును. మరియు నీ యధ్యాయమును ద్విజులకు వైకార్యములయందు, పితృకార్యములయందును యథాతథముగా వినుపించు విద్వాంసుఁడు - శివలోకమున సుఖముగ నివసించును.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (85)వ అధ్యాయము.