లింగ మహా పురాణము
21 - తంత్రోక్త శివపూజా విధానము, నియమము, ఫలంబు
సూత ఉవాచ:
గంధ వర్ణరసాదులు ప్రశస్తములుగ నుండునట్లు భూమిని పరీక్షింపవలెను. ఎట్లనఁగా? పరిమళము నలుపు మాధుర్యము గల భూమి ఈశ్వరు సహ్వానించుటకు యోగ్యమైనది. మూరకొలతతో మండలము నేర్పరచి మండలమునడుము- పంచరత్నచూర్ణములతో కూడిన ముగ్గుపిండితో ఎనిమిది దళములు గల కమలమును వ్రాసియు తామర దుద్దు (కర్ణిక) నందు జగత్పరమకారణుడైన శివుని, అష్టదళముల యందు అష్టసిద్ధులను పూజింపవలెను,
కమలనాలము (కాడ) జ్ఞాన వైరాగ్యమయము, కమలకందము (దుంప) ధర్మమయంబునని భావింపవలెను. వామ, జ్యేష్ఠ, రౌద్రి, కాళి, వికరణి, బలవికరణి, బల ప్రమధిని, సర్వభూతదమని యను అష్ట శక్తులను వామదేవాడులలో చాంపత్య రూపముగా నావాహనము జేయవలెను.
శివాసనమగు కర్ణికయండు మనోస్మనీశక్తిని, మహామాయా దేవిని భావించి మనోన్మ నీ శక్తితో కూడ మనోన్మన సుహాదేవుని మధ్యన న్యసింపవలెను.
సూర్యచంద్ర సంబంధముతో నేత్రములు గల తత్పురుష ముఖమును పూర్వ దళమునందు; దక్షిణ దళమునందు అఘోరముఖమును; ఉత్తర దళమున వామదేవ ముఖమును; పశ్చిమ దళమున సద్యోజాత ముఖమును; కర్ణికయందు ఈశానముఖము నర్చింపవలెను.
ఈశానము కిరీటముగాను, తత్పురుషము ముఖముగాను, ఆఘోరము హృదయముగాను వామదేమంత్రము గుహ్యముగాను, సద్యోజాతము, సమగ్రమూర్తిగా నొప్పారు సదా శివుఁడు- సదసవ్యక్తి కారణుడై - పంచవదనుఁడు, దశహస్తుఁడు, ముప్పది యెనిమిది (38) కళలు గలవాడుగ నుండుము,
సద్యోజాతమునకు ఎనిమిది కళలు - వామదేవునకు పదమూడు కళలు అఘోరమునకు ఎనిమిది కళలు - తత్పురుషమునకు నాలుగు కళలు - ఈ శానమునకు ఐదు కళలు నిట్లు 38 కళలతో సదాశివుఁడు విరాజిల్లుచుండును.
“హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్ “అను మంత్రముతో ఓంకారము ననుసంధించి సదాశివుని - ప్రకృతి (శక్తి) విశిష్టునిగాను, జన్మ జరా మరణములు లేనివానిగాను, అణువున కంటే నణువుగాను, మహత్తునునకంటే మహత్తుగాను. ఊర్ధ్వరేతస్కునిగాను, విరూపాక్షునిగాను, ఉమాపతిగాను, సహ ప్రతిరసునిగాను, సహస్రాక్షునిగాను, సనాతను గాను, సహ సహస్త చరణునిగాను, ఓంకారగత నాగస్వరూపునిగాను, సూర్యసమానాకారము గలవానిగాను, శిరస్సు, కనుబొమల నడుము, దౌడలు, గొంతు హృదయము నను స్థానముల యంచున్న వానిగాను, తన ఆనందమును తా ననుభవించు వానిగాను, కోటి మెరుపుల వన్నగల వానిగాను, శ్యామరక్తవర్ణములు గలవాని గాను, ఇచ్చా జ్ఞాన క్రియా శక్తి త్రయము ఆసనముగా గలవానిగాను, ధ్యానించి పూజింప వలెను.
పిదప - పూర్వాది దిక్పాలకులగు దేవేంద్రాదులను వేరుగా సర్చించి విభియుక్తమగు దరువు (అన్నము) ను శివునకు నివేదించి అందలి అర్థభాగమును అఘోరమంత్రముతో హనము నొనర్చియు తచ్చేషమును శిష్యున కొసగి తినుమనపలెను.
తరువాత ఉదకములో చేతులు కడిగికొని తత్పురుష మంత్రముతో కవనముఁజేసి ఈశానమంత్రముతో నభిమంత్రింపఁబడిన పంచగవ్యమును ప్రాశసముఁజేయించి వామదేవ మంత్రముతో భస్మనుద్ధూతనమును త్రిపుం డ్రములను ధరింపజేసియు రుద్రగాయత్రిని యథాశక్తి జపింపజేయవలెను. హోమమునకు ముందు సూత్ర పరివేష్టితములు అచ్చాదన గలవియు నగు ఐదు (బంగారం, లేక వెండి, లేక రాగి) కలశములను స్థాపించి పంచ బ్రాహ్మణులను ఋత్విజలుగా ఎన్నుకొనవలెను.
ఆ పిమ్మట పంచ బ్రహ్మ మంత్రముల నుచ్చరించుచు దరువు నగ్నిజ్వాలయందు వ్రేల్చవలెను. మండలము యొక్క దక్షిణభాగమున శిష్యు నా రాత్రి నిద్రింపఁజేయవలెను. నిద్రించుతఱి శిష్యుఁడు దర్భ శయ్యపై శివధ్యాసము నొనర్చి నిద్రింపవలెను. మరునాడు ఉదయము స్నాన సంధ్యాద్యనంతరము అఘోర మంత్రముతో గోఘృతము నష్టోత్తర శత (108) పర్యాయములు హవనము నొనర్చి శిష్యుని పాపము పరిహరించుటకై అఘోర మంత్రితంబగు భస్మ నొసగవలెను.
ఇట్లు నుదయమునుండి యపవసించియున్నట్టి శిష్యుఁడు జలస్నాతుఁడై నవవస్త్రధారియునై భస్మ నలం(దికొని భూషణములను ధరించియుండగా శిష్యుని నేత్రములను పట్టుబట్టతో నాచ్ఛాదించి మండల స్థలమున బ్రవేశింపజేసియు ఈశానమంత్రముతో పరమేశ్వరునకు సువర్ణ మంత్రపుష్పాంజలిని సమర్పింపజేసి ముమ్మారు ప్రదక్షిణములను మండల స్థలమునకు శిష్యునితో చేయించి - రుద్రాధ్యాయమును ప్రణవముతో పఠించుచు శివుని ధ్యానించి దేనడేవు నీ శానకలశముపై నుంచవలెను.
మండలస్థల మంటపము యొక్క పశ్చిమద్వారము-ద్విజుల ప్రవేశమునకు శ్రేష్ఠమైనది. అఘోర మంత్రిత భస్మతో శిష్యుని శిరస్సునండు గురువు - తన కుడిచేయి నునిచి శ్రీ గంధాదులలో శిష్యు నలంకరింపవలెను.
ఆ తరువాత శిష్యుని నేత్రాచ్ఛాదనమును విడిచి ముండలమును చూపెట్టి దర్భాసనమునందు కూర్చుండఁజేసియు సద్యోజాతాది పంచ బ్రహ్మమంత్రములతో ప్రత్యేకము 108 సార్లు, సమిధలు - ఘృతము - చరువు. లాజలు - ఆవాలు - యవలు - తిలలు నను సప్త ద్రవ్యములను వ్రేల్చవలెను. ఈశానమంత్రముతో పూర్ణాహుతిని, హంసగాయత్రితో కూడిన ప్రణవాద్యమగు అఘోరమంత్రముతో ప్రాయశ్చిత్త హవనమును;
జయాది స్వీష్టకృదంతమగు హోమము నాచరింపవలెను. తదనంతరము శిష్యునకు శాంభవదీక్ష నొసగవలెను. శాంభవదీక్షలో శివలింగధారణము, శివషడక్షర మహామంత్రోపదేశంబు ముఖ్యములగును.
శాంభవదీక్షితుడు--సుబడు: నాచుల నోర్చుకొనవలెనని. శివశాసనము కలదు. మరియు
శ్లో॥ వరం ప్రాణపరిత్యాగ - శ్ఛేదనం శిరసోఽపి వా । నర్వసభ్యర్బ్య భుంజీయాత్ - భగవంతం సదాశివమ్ ॥
“ప్రాణపరిత్యాగము శిరశ్చే దనమునైన నొనర్పవలెను గాని శివునర్చింపక – ఆహారమును భుజింపరాదు.”
ఇట్లు గురువు శిష్యునకు దీక్ష నొసఁగి శివపూజావిధానము నంతయు బోధింపవలెను.
ఇంక శివార్చనమును ప్రతిదినము కాలత్రయమున లేక ఏకకాలము నందు భక్తి శ్రద్ధలతో గావింపవలెను.
నిత్యాన్నిహోత్రము వేదాధ్యయనము బహుడక్షణలుగల యజ్ఞములును శివలింగార్చనము నందలి పదహారవ భాగము గూడా పుణ్యప్రదములు కావు. ప్రతిదినము శివుని పూజించువారు శివ స్వరూపులగుదురనుటలో ఏ మాత్రము సంశయము లేదు. “రుద్రఁడు కానిది రుద్రుని పూజింపగూడదు“గాన సుస్నాతుఁడై భస్మరుద్రాక్షలను ధరించినచో రుద్రుఁడగును. అందువలన రుద్రుఁడై రుద్రు నర్చింపవలసియుండును.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (21)వ యధ్యాంయము.
