లింగ మహా పురాణము

Table of Contents

5 - పంచమాధ్యాయము

విష్ణుమాయా ప్రభావము అంబరీష చరితము నిండు నిరూపించ బడుచున్నయది. ఎట్లనగా?

“ఇక్ష్యాకువంశోద్భవుఁడు వాసుదేవ పరాయణుఁడు నగు అంబరీషుఁడు విష్ణు భగవానుని ఆదేశము ననుసరించి భూమిని పాలించెననియు, శ్రీహరి యొక్క సుదర్శన చక్రము ధార్మికుఁడైన అంబరీషుని శత్రురోగ భయాదికమును నివారించుచుండె ననియు వినినాము. అట్టి అంబరీష చరితమును వివరింపుము! ఆని శౌనకాది మహర్షులు సూతమహాముని దిగువవిధము వాక్రుచెను.

మున పుంగవులారా ! సర్వపాప హరంబులగు అంబరీషుని చరితమును వినుడు!

త్రిశంకు మహారాజు యొక్క భార్య పద్మావతి యను నమె నిత్యము పరిశుభ్రతతో మనోవాక్కాయ శుద్ధిని నారాయణుని ప్రీథ్యర్ధము భూశిద్ధిని –

శ్రీగంధము నూరుటను, పనులను స్వయముగ చేయులు ధ్యాన ఆవాహన ఆసన పాద్య ఆర్ఘ్య ములపంచామృతాభిషేకము సమర్పించుచు వాక్కుతో “నారాయణా! అనంతా! ఇత్యాది నామములు ఉచ్చరించుచు పదివేల వత్సరములు తద్గతమానమై ఆరాధించి ఒకానొక ద్వాదశి నాడు తన వంతు ప్రకారం మన భగవానుని ముందు నిద్రించెను.

అట్టితఱి - శ్రీహరి స్వప్నమున సాక్షాత్కరించి “సాధ్వీ! వలయునది కోరుకొనుము! ఇచ్చెద” ననఁగా “వైష్ణవుఁడు సార్వభౌముఁడు నగు కుమారుఁడు కావలె” నని యాచించెను. అంత పరాత్పరుడు అట్లే నని యొక ఫలము నొసఁగగా పద్మావతి మేలుకొని భర్తకు చూపి విష్ణువునందు మనసు నిలిపి ఫలమును భక్షించినదై కొంతకాలమునకు గర్భవతియై ప్రసవించి  స్వతులవర్ధనుఁడు, వాసుదేవ పరాయణుడు శుభలక్ష్ణములు గల సుపుతుని గనెను. త్రిశంఖువు

కుమారునకు జాతకర్మాది సంస్కారమును చేయించి “అంబరీషుడు” అను పేరిడి ముక్త వయస్కు నొనర్చిన తరువాత.కాలధర్మము జెందగా. అంబరీషుడు - పట్టభిషిక్తుడై - రాజ్యభారమును మంత్రులపైన నుంచి  - ఉగ్రమైన తపస్సు నారంభించెను.

నారాయణని హృదయ కమల  మధ్యవర్తిగాను , సూర్యముండలా భిష్టాతగాను, శంచ చక్ర గదా సమరాంగాను, చనువులు, సువర్ణం సర్వాభరణ భూషితునిగాను, ఉదాలు సమంగా తీసుకుని  మనుచు - నల మహాముని ప్రమును చేయు పులు జనం నందున శ్రీ ములుకులు - ఇరానమును సెల యేతెంచి నేను సునాభితిన, మలయునది అడుగులు ముందు మన నాకు నారాయణుడే పరమ దైవము నిన్ను గురించి నేను తపించలేదు. స్వసగునదిలము నాకవసరము లేదు. వచ్చిన దానిని వెళ్ళుము! “ అని

అంబరీషుడు వచించెను.

అంత భగవానుఁడు నిజరూపముతో ప్రత్యక్షము కాగా “ప్రసీద లోక నాథేశ”  మొదలుకొని “నాన్యాగతి స్త్వసన్యామే త్వమేవ శరణం మమ“ వరకు పురుషోత్తముని నుతించెను. అంత పరాత్పరుఁడు “అంబరీషా! నీవు కోరిన దంతయు నిచ్చెద” ననపుడు-

శ్లో॥ యథాత్వం దేవ దేవస్య - భవస్య పరమాత్మనః ।

తథా భజామ్యహం విష్ణో - తప దేవ జనార్దన ॥

 “జనార్ధనా! దేవదేవుఁడైన శంకరుని అనుగ్రహమునకు నీవు పాత్రుడవైనట్లు

నేను నీ కృపాకటాక్షమునకు అర్హుడను కావలెను.” అని అంబరీషుడు పార్థించెను.

మరియు జగత్తు నంతయు విష్ణు భక్తి భరితముగా నొనర్చి పృథివిని పాలించునట్లు యజ్ఞపూజాదులతో సురోత్తముల నారాధించునట్లు విష్ణు భక్తులను రక్షించుచు పగవారిని దును మాడునట్లు ప్రజల బాధలఁదీర్చు సామర్థ్యము కలిగియుండునట్లు నను గ్రహింపుము!“ అని వేడెను.

అంత శ్రీహరి ప్రసన్నుఁడై “పూర్వము శివానుగ్రహము వలన లభించినట్టు ఈ సుదర్శనచక్రము నీ చెంత నుండి - మునిశాపాదికము, శత్రుపీడారోగాదికము నగు దుఃఖమును తొలగించుచుండును” అని నిర్వచించి యంతర్ధానము జెంచెను.

ఇంక అంబరీషుఁడు అయోధ్యానగరముఁజేరి తన రాజ్యములో గల వైష్ణవులను కాపాడుచు శత అశ్వమేధయాగములను శతవాజపేయ క్రతువులఁ గావించి చతుస్సముద్ర పరివేష్టితయగు భూమికి అధిపతి యయ్యెను.

అంబరీషుని రాజ్యమునందు ఇంటింట విష్ణుభగవానుఁడు ఆరాధింపఁబడుచుండెను. ప్రతిగృహమున వేదము ఘోషింపబడుచుండెను. హరినామము వినబడుచుండెను. యజ్ఞసమారంభములు దృగ్గోచరముల గుచుండెను. నేలపై ధాన్యము జలంబు సమృద్ధమైనందున దుర్భిక్షము రాకుండెను. ప్రజలు ఉపద్రవములు రోగములును లేనివారై సుఖసంతోషములతో మనుచుండిరి.

ఇట్లుండ సంబరీషుని పుత్రిక యగు శ్రీమతి సర్వాంగ లావణ్యముతో వివాహయోగ్య కాగా నారద మహర్షి, పర్వతుడను మహావ్యక్తియు నేతెంచిరి. వారిరువురిని యథాన్యాయము పూజింపగా నారదపర్వతులు శ్రీమతి నవలోకించి అంబరీషునకు నొక్కొకరు రహస్యముగా “నాకీకన్య నిచ్చి వివాహముఁజేయుము!” అని యపేక్షించిరి.

అంత నంబరీషుఁడు మునిపుంగవులకు వెఱగంది “మీ యిరువురిలో ఎవనిని నా కన్య వరించునో వానికిచ్చెదనని యభయము నొసఁగగా వారిరువురు “రేపు నీ కన్యా స్వయంవరమునకై వచ్చెద “ మని వచించి వైకుంఠము (జేరి ప్రణమిల్లియు “నారాయణా! ఒక రహస్యమును నివేదింపవలసి యున్నదని విన్నవించిరి.

అందువలస శ్రీహరి మందహాసముఁజేసి సభ్యులందరిని బయటబంపిన వాడై చెప్పు మనగా నారడుఁడు “నీ భక్తుడైన అంబరీషుని తనయయగు శ్రీమతి గాంచి పరిణయమాడవలె” నని తలచితిని గాన నాకు ప్రియము జేకూచ్చుటకు పర్వతునకు వానరముఖము నొసగు” మని ప్రార్థించెను. అందువలన శ్రీహరి చిరునగువుతో అట్లే చేయగలనని” యంగీకరించెను. పర్వతుడును మాధవునకు నమస్కరించి - తన కోర్కెఁదెలిపియు “నారదునకు కొండెంగమోము నీయు” మని యాచించెను. “తథాఽస్తు” అని కేశవుఁడు ప్రత్యుత్తరించెను. మరునాడు నారదపర్వతులు అయోధ్యఁజేరగా అంబరీషుఁడు తన రాజధాని నలంకరింపఁ జేసి స్సయంవర సభలోనికి సర్వాభరణ సంపన్న, విశాలనేత్రయు నగు శ్రీమతిని ప్రవేశింపఁజేసిముని వర్యులను దివ్య పీఠములపై

కూర్చుండఁజేసి పూజించెను.

వీరిద్దరిలో ఎవరినో ఒకరిని నీయిష్టముతో వరింపుము” అని అంబరీషుఁడనగా శ్రీమతి వారిరువురింగాంచి ఎటుగా చాలు నాకు నా ముందుకు  మునులుకారు గాని భయపడు తున్నాను. వీరిరువురి నడుము నాకము వసు -

అని వచింప వారిరువురు బాగుగా ఆలోచించుకొని అంబరీషుంజేరి, “నీవు కపటముతో మాలో నొకరికి నీ కన్య నీయక మరియొకరికి సమర్పించితిని గాన నీకు మాయా ప్రభావమున తమస్సు ఆవరించు గాక ! అని శపించిరి.

ఈ యధ్యాయముఁజదివినను, వినినను, వినుపించినను, మాయనతిక్రమించుటయు, వలోకనివాసంబు ప్రాప్తించును.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” యను శాంకరీయ
ఆంధ్రానువాచ ప్రవచనమున (5) వయధ్యాయము.