లింగ మహా పురాణము
21 - హరిబ్రహ్మకృత శివ స్తోత్ర నిరూపణము
(ఈ స్తోత్రమునకు గచ్చదనువాదము వ్రాయబడినది)
శ్లో॥ నమస్తుభ్యం భగవతే = సువ్రతానంత తేజసే।
సమగ్ర ఐశ్వర్యము, యశస్సు, ప్రాణుల గమనాగమనములు, జ్ఞానమును అవిద్యను
గుర్తించుటయు, అఖండ సంపత్తు అను ఆరు - భగములనఁబడును. ఇట్టి భగములు గల పరమేశ్వరునకు మరియు పాశుపతవ్రతస్థులకు అవధిలేని ప్రతిభనొసఁగువానికి నమస్కారము.
శ్లో॥ నమః క్షేత్రాధి పతయే బీజినే శూలినే నమః । సుమేఢ్రాయార్చ్యమేఢ్రాయ - దండినే రూక్ష తేజసే
సుమేఢ్రాయ = మేఢ్రమనగా యాగ పశువు. యాగాధిపతిగా మంచి యాగ పశువు
గలవాని కొరకు; అర్చ్యమేడ్రాయ = అశ్వమేధయాగమున పూజింపబడు యాగాశ్వము గలవాని కొరకు.
శ్లో॥ నమో జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ - పూర్వాయ ప్రథమాయ చ । నమో మాన్యాయ పూజ్యాయ - సద్యోజాతాయ వై నమః । శ్లో॥ నమః క్షేత్రాధిపతయే - బీజినే శూలినే నమః । గహ్వరాయ ఘటేశాయ - వ్యోమ చీరాంబరాయ చ ॥
ఘటములనఁగా జన్మపరంపరలో ప్రవర్తించు జీవాత్మలు, లేక తన పరమపదమునందు ఆనందించు ముక్తాత్మలు అవ్వారి ప్రభువునకు; వ్యోమ = ఆకాశము, చీరం = చెట్టునారయు అంబరాయ వస్త్రముగా గలవాని కొరకు సమస్కారము.
శ్లో॥ వేదానాం ప్రభవే చైవ - స్మృతీనాం ప్రభవే నమః । ప్రభవే కర్మదానానాం - ద్రవ్యాణాం ప్రభవే నమః ॥ శ్లో॥ నమోయోగస్య ప్రభవే - సాంఖ్యస్య ప్రభవే నమః । నమో ధ్రువనిబద్ధానా - మృషీణాం ప్రభవే నమః ।
ధ్రువనిబద్ధానాం ఋషీణాం ప్రభవే = ధ్రువ మండలము చెంత స్థిరపడిన సప్తర్షుల ప్రభువునకు నమస్కారము
శ్లో॥ ఋక్షాణాం ప్రభవే తుభ్యం - గ్రహాణాం ప్రభవే నమః । వైద్యుతాశని మేఘానాం - గర్జిత ప్రభవే నమః ॥ శ్లో॥ మహోదధీనాం ప్రభవే - ద్వీపానాం ప్రభవే నమః । ఆద్రీణాం ప్రభవే చైవ - వర్షాణాం ప్రభవే నమః ॥ శ్లో॥ నమో నదీనాం ప్రభవే - నదానాం ప్రభవే నమః । మహౌషధీనాం ప్రభవే - వృక్షాణాం ప్రభవే నమః ॥ శ్లో॥ ధర్మవృక్షాయ ధర్మాయ - స్థితీనాం ప్రభవే నమః । ప్రభవే చ పరార్ధస్య - పరస్య ప్రభవే నమః ॥ శ్లో॥ నమో రసానాం ప్రభవే - రత్నానాం ప్రభవే నమః । క్షణానాం ప్రభవే చైవ - లవానాం ప్రభవే నమః ॥ శ్లో॥ అహోరాత్రార్ధమాసానాం-మాసానాం శుభవే నమః । ఋతూనాం ప్రభవే తుభ్యం - సంఖ్యాయాం ప్రభవే నమః ॥ శ్లో॥ ప్రభవే చాపరార్ధస్య - పరార్ధ ప్రభవే ను: । నమః పురాణ ప్రభవే - సర్గాణాం ప్రభవే నమః ॥ శ్లో॥ మన్వంతరాణాం ప్రభవే - యోగస్య ప్రభవే నమః । చతుర్విధస్య సర్గస్య ప్రభవేఽ నంత చక్షుషే ॥
చతుర్విధస్య సర్గస్య - ప్రభవే = మావి వలన పుట్టునవి, గ్రుడ్డు వలన జన్మించునవి, చెమట వలన ఆవిర్భవించునది, నేలఁబెకిలించు కొనిపైకి వచ్చుననియు నగు చతుర్విధ సృష్టి యొక్క అధిపతికి నమస్కారము.
శ్లో॥ కల్పోదయ నిబంధానాం - వార్తానాం ప్రభవే నమః । నమో విశ్వస్య ప్రభవే - బ్రహ్మాధిపతయే నమః ॥
“బ్రహ్మదిన ప్రారంభమున నేర్పడు ధర్మశాస్త్రములకు బ్రాహ్మణాదుల జీవన వృత్తులకును నమస్కారము” అని యీ శ్లోకము (దగు మొదటి పాదమున కర్థము
“విశ్వాధిపతి, బ్రహ్మాధిపతియు నగువానికి నమస్కారము” అని రెండవ పాదమునకర్థము.
శ్లో॥ విద్యానాం ప్రభవే చైవ - విద్యాఽధిపతయే నమః ।
నమో వ్రతాధిపతయే - వ్రతానాం ప్రభవే నమః ।
శ్లో॥ మంత్రాణాం ప్రభవే తుభ్యం - మంత్రాధిపతయే నమః ।
పితౄణాంపతయే చైవ - పశూనాం పతయే నమః ॥
శ్లో॥ వా గ్వృషాయ నమస్తుభ్యం - పురాణవృషభాయ చ ।
నమః పశూనాంపతయే - గోవృషేంద్రధ్వజాయ చ ।
వాగ్వృషాయ = వాచి వేదే, వృషః = ధర్మః యస్య సః వాగ్వృషః, వేదమునందు ఎవని ధర్మము (కర్తవ్యము క్రియమాణము కృతంబు) గలదో వాడు వాగ్వృషుడనఁ బడును. పదునెనిమిది పురాణములలో శ్రేష్ఠుడుగా ప్రతిపాదింపఁబడువాడు పురాణ వృషభుఁడనఁబఱగును.
శ్లో॥ ప్రజాపతీనాం పతయే - సిద్ధానాం పతయే నమః । దైత్యదానవ సంఘానాం - రక్షసాం పతయే నమః ॥ శ్లో॥ గంధర్వాణాంచ పతయే - యక్షాణాం పతయే నమః । గరుడోరగసర్పాణాం - పక్షిణాం పతయే నమః ॥ శ్లో॥ సర్వగుహ్య పిశాచానాం - గుహ్యాధిపతయే నమః । గోకర్ణాయ చ గోప్త్రేమ - శంకు కర్ణాయ వై నమః ॥ శ్లో॥ వరాహాయా ప్రమేయాయ - ఋక్షాయ విరజాయ చ । నమః సురాణాంపతయే - గణానాం పతయే నమః ॥ శ్లో॥ అంభసాం పతయే చైవ - ఓజసాంపతయే నమః । నమోఽస్త లక్ష్మీపతయే - శ్రీపాయ క్షితిపాయ చ ॥
శ్రీపాయ = లక్ష్మీదేవిని రక్షించు; క్షితిపాయ = భూదేవతను కాపాడు, లక్ష్మీపతిగా
నుండు వాడని యర్ధము.
శ్లో॥ బలాబలసమూహాయ - అక్షోభ్య క్షోభణాయ చ । దీప్తశృంగైకశృంగాయ - పృషభాయ కకుద్మినే ।
బలవంతులు దుర్భలురును గల గుంపుగా నుండువాడు - బలాబల సమూహుఁడనబడును.అథవా బలవంతులైన పురుషులు అబలలైన తరుణులు కూడియుండు కుటుంబమగువాడని చెప్పవచ్చును.
స్వయం ప్రకాశమానము, మహోన్నతంబునగు కైలాసశిఖరము గలవాడు దీప్తశృంగుఁడు కాగా ఒంటి కొమ్ము కేలదాల్చువాడు ఏక శృంగుఁడగును.
శ్లో॥ నమః స్థైర్యాయ వపుషే - తేజసాఽ సుప్రతాయ చ । అతీతాయ భవిష్యాయ - వర్తమానాయ వై నమః ॥ శ్లో॥ సువర్చసే చ వీర్యాయ - శూరాయ హ్యజితాయ చ । వరదాయ వరేణ్యాయ - పురుషాయ మహాత్మనే ॥ శ్లో॥ నమో భూతాయ భవ్యాయ - మహతే ప్రభవాయ చ । జనాయ చ నమ స్తుభ్యం - తపసే వరదాయ చ ॥ శ్లో॥ అణవే మహతే చైవ - నమ స్సర్వగతాయ చ । నమో బంధాయ మోక్షాయ - స్వర్గాయ నరకాయ చ ॥ శ్లో॥ నమో భవాయ దేవాయ - ఇజ్యాయ యాజకాయ చ । ప్రత్యుదీర్ణాయ దీప్తాయ - తత్త్వాయాతిగుణాయ చ ॥ శ్లో॥ నమః పాశాయ శస్త్రాయ – సమ స్త్వాభరణాయ చ । హుతాయ ఉపహూతాయ ప్రహుత ప్రాశితాయ చ ॥
యజ్ఞమునందు ఘృతాది ద్రవ్యమగువాడు హుతుఁడు; యజ్ఞ ప్రారంభమున వైదిక
మంత్రములతో హెచ్చుగా పిలువఁబడువాడు ఉపహూతుఁడనఁబడును. భక్తిచే హవనము చేయఁబడు హవిస్సు ఆహారముగా గలవాడు ప్రహుత ప్రాశనుఁడగును.
శ్లో॥ నమోఽస్త్విష్టాయ పూర్తాయ - అగ్నిష్టోమద్విజాయ చ । సదస్యాయ నమశ్చైవ - దక్షిణాఽవభృధాయ చ ॥ శ్లో॥ అహింసాయాప్రలోభాయ - పశు మంత్రౌషధాయ చ । నమః పుష్టి ప్రదానాయ - సుశీలాయ సుశీలినే ॥ శ్లో॥ అతీతాయ భవిష్యాయ - వర్తమానాయ తే నమః । సువర్చసే చ వీర్యాయ - శూరాయ హ్యజితాయ చ ॥ శ్లో॥ వరదాయ వరేణ్యాయ - పురుషాయ మహాత్మనే । నమో భూతాయ భవ్యాయ - మహతే చాభయాయ చ ॥ శ్లో॥ జరాఽసిద్ధ నమ స్తుభ్య - మయసే వరదాయ చ । అధరే మహితే చైవ - నమః సస్తుపతాయ చ ॥
ముసలి తనము లేని నిత్య తరుణుఁడు జరాఽసిద్ధు (డగును. సువర్ణ స్వరూపుఁడు
ఆయస్సగును నిద్రించినవారిని రక్షించు ప్రభువు సస్తుపతుఁడనఁబడును.
శ్లో॥ నమశ్చేంద్రియ పత్రాణాం - లే లిహానాయ స్రగ్విణే । విశ్వాయ విశ్వరూపాయ - విశ్వతః శిరసే నమః ॥
తనను ప్రవర్తింపజేయునవి (పత్రాణాం = వాహనములవంటి) ఇంద్రియ ములను జీవాత్మ రూపముగా ఆస్వాదించు వాడు ఇంద్రియ పత్ర లేటహానుఁడనఁబడును.
శ్లో॥ సర్వతః పాణిపాదాయ - రుద్రాయా ప్రతిమాయ చ । నమో హవ్యాయ కవ్యాయ - హవ్యావాహాయ వై నమః ॥ శ్లో॥ నమః సిద్ధాయ మేధ్యాయ - ఇష్టాయేజ్యా పరాయ చ । సువీరాయ సుఘోరాయ - అక్షోభ్య క్షోభణాయ చ । శ్లో॥ సుప్రజాయ సుమేధాయ - దీప్తాయ భాస్కరాయ చ । నమో బుద్ధాయ శుద్ధాయ - విస్తృతాయ మతాయ చ ॥ శ్లో॥ నమః స్థూలాయ సూక్ష్మాయ - దృశ్యాదృశ్యాయ సర్వశః । వర్షతే జ్వలతే చైవ - వాయవే శిశిరాయ చ ॥ శ్లో॥ నమస్తే వక్రకేశాయ ఉపపక్షః శిఖాయ చ । నమోనమ స్సువర్ణాయ - తపనీ యనిభాయ చ ॥ శ్లో॥ విరూపాక్షాయ లింగాయ - పింగలాయ మహౌజసే । వృష్టిఘ్నాయ నమశ్చైవ - నమః సౌమ్యేక్షణాయ చ ॥ శ్లో॥ నమో ధూమ్రాయ శ్వేతాయ - కృష్ణాయ లోహితాయ చ । పిశితాయ పిశంగాయ - పీతాయ చ నిషంగిణే । శ్లో॥ నమస్తే సవిశేషాయ - నిర్విశేషాయ వై నమః నమ ఈ జ్యాయ పూజ్యాయ - ఉపజీవ్యాయ నమః ॥
భకుఁడు తన సర్వస్వమును సమర్పించుటకు తగినవాడు ఈ జ్యుఁడనఁబడును.
శ్లో॥ నమః క్షేమ్యాయ వృద్ధాయ - వత్సలాయ నమో నమః । నమో భూతాయ సత్యాయ సత్యాసత్యాయ వై నమః ॥ శ్లో॥ నమో వై పద్మవర్ణాయ - మృత్యుఘ్నాయ చ మృత్యవే। నమో గౌరాయ శ్యామాయ - కద్రవే లోహితాయ చ ॥ శ్లో॥ మహా సంధ్యా భ్రవర్ణాయ - చారు దీప్తాయ దీక్షిణే । నమః కమలహస్తాయ - దిగ్వాసాయ కపర్దినే॥ శ్లో॥ అప్రమాణాయ సర్వాయ - అవ్యయాయామరాయ చ । నమో రూపాయ గంధాయ - శాశ్వతాయా క్షతాయ చ ॥ శ్లో॥ పురస్తాత్ బృంహతే చైవ - విభ్రాంతాయ కృతాయ చ । దుర్గమాయ మహేశాయ - క్రోధాయ కపిలాయ చ ॥ శ్లో॥ తర్క్యా తర్క్య శరీరాయ - బలినే రంహసాయ చ । సికత్యాయ ప్రవాహ్యాయ - స్థితాయ ప్రసృతాయ చ ॥ శ్లో॥ సుమేధసే కులాలాయ నమస్తే శశిఖండినే । చిత్రాయ చిత్రవేషాయ - చిత్రవర్ణాయ మేధసే ॥
మట్టి పాత్రలు నిర్మించు కుమ్మరివాడుగ నుండువాడు, లేక పృథివిని అను గ్రహించువాడు కులాలుఁడనబడును.
శ్లో॥ చేకితానాయ తుష్టాయ - నమస్తే నిహితాయ చ । నమశ్శాంతాయ దాంతాయ - వజ్ర సంహ ననాయ చ ॥
భక్తులకు మిక్కిలి మేలుఁజేయువాడు - నిహితుఁడనఁబడును.
శ్లో॥ రక్షోఘ్నాయ విషఘ్నాయ - శితికంఠోర్థ్వ మద్యవే । లేలిహాయ కృతాంతాయ - తిగ్మాయుధ వరాయ చ ॥
శుభ్రమైన కంఠము గలవాడు శితికంఠుడగును. వెలుపల క్రోధము గలిగి లోన కోపము లేనివాడు ఊర్ధ్వమన్యు వనబడును.
సర్వస్వరూపుఁడు లే లి హుఁడనఁబఱగును.
శ్లో॥ ప్రమోదాయ సమోదాయ - యతివేద్యాయ తే నమః । అనామయాయ సర్వాయ - మహాకాలాయ వై నమః ॥ శ్లో॥ ప్రణవ ప్రణవేశాయ - భగనేత్రాంతకాయ చ । మృగవ్యాధాయ దక్షాయ - దక్షయజ్ఞంతకాయ చ ॥
మృగ రూపుఁడగు బ్రహ్మదేవుని వేధించువాడు మృగవ్యాధు c డగును.
శ్లో॥ సర్వభూతాత్మ భూతాయ - సర్వేశతిశయాయ చ । పుర ఘ్నాయ సుశస్త్రాయ - ధన్వినేఽథ పరశ్వధే ॥ శ్లో॥ పూషదంతవినాశాయ - భగనేత్రాంతకాయ చ । కామదాయ వరిష్ఠాయ - కామాంగ దహనాయ చ ॥ శ్లో॥ రంగే కరాళ వక్త్రాయ - నాగేంద్ర వదనాయచ । దైత్యానా మంతకేశాయ - దైత్యా క్రందకరాయ చ ॥
యుద్ధ రంగమున భయంకరమైన ముఖము గలవాడు రంగే కరాళ వక్త్రుడగును.
గజాననరూపుఁడు నగేంద్ర వదనుఁడగును. దైత్యాంతకుఁడగు విష్ణువును శరభాదిరూపములతో శాసించువాడు దైత్యానాం అంతకేశుఁడనఁబడును.
శ్లో॥ హిమ ఘ్నాయచ తీక్ష్ణాయ - ఆర్ద్రచర్మధరాయ చ । శ్మశానరతి నిత్యాయ - నమోఽస్తూల్ముక ధారిణే ॥
ఉల్ముకమును ఆనగా - మండుచున్న కొఱవిని పట్టుకొని శ్మశానమున ఆసక్తితో తఱచుగా నుండువాడు - ఉల్ముకధారియై శ్మశాన రతి నిత్యుఁడనఁబడును.
శ్లో॥ నమస్తే ప్రాణపాలాయ - ముండమాలాధరాయ చ । ప్రహీణశోకై ర్వివిధై - ర్భూతైః పరివృతాయ చ ॥ శ్లో॥ నరనారీ శరీరాయ - దేవ్యాః ప్రియకరాయ చ । జటినే ముండినే చైవ - వ్యాళ యజ్ఞోపవీతినే ॥ శ్లో॥ నమోఽస్తు నృత్య శీలాయ - ఉపనృత్య ప్రియాయ చ । మన్యవే గీతశీలాయ - ముని భర్గాయతే నమః ॥ శ్లో॥ కటంకటాయ తిగ్మాయ - అప్రియాయ ప్రియాయ చ । విభీషణాయ భీష్మాయ - భగప్రమథనాయ చ ॥
గజ మస్తకము నాక్రమించు సింహముఁ దగు రూపము గలవాడు కటంకటుడనబడును.
శ్లో॥ సిద్ధసంఘానుగీతాయ - మహాభాగాయ వై నమః।
నమో ముక్తాట్టహాసాయ - క్ష్వేడితాస్పోటితాయ చ ॥
శ్లో॥ నర్దతే కూర్దతే చైవ - నమః ప్రముదితాత్మనే ।
నమో మృడాయ శ్వసతే - ధావతేఽధిష్ఠితే నమః ॥
శ్లో॥ ధ్యాయతే జృంభతే చైవ - రుదతే ద్రవతే నమః।
వల్గతే క్రీడతే చైవ - లంబోదర శరీరిణే ॥
శ్లో॥ నమోఽకృత్యాయ కృత్యాయ - ముండాయ కీకటాయ చ ।
నమ ఉన్మత్తదేహాయ - కింకిణీకాయ వై నమః ॥
అశ్వరూపుఁడు - కీకటుఁడనియు - చిరుగంటగా నుండువాడు కింకిణీకుఁడనియు చెప్పఁబడుదురు.
శ్లో॥ నమో వికృతవేషాయ - క్రూరాయామర్షణాయ చ । అప్రమేయాయ గోప్త్రే చ - దీప్తాయా నిర్గుణాయ చ ॥ శ్లో॥ వాము ప్రయాము వామాయ మాడామణిఢరాయ చ । నము స్తోకాయు తనవే - గుణైర ప్రమితాయ ద ॥
వామ (ఎడము) భాగమున ప్రియురాలుగు పార్వతీ దేవి గలవాడు వాసు ప్రియుడునియు - సుందరుడైన వాడు వాముండనియు, పుత్రుడు లేక పుత్రికగా శిశువై యుండువాడు లోకుడనియు పేర్కొనఁబడుదురు.
శ్లో॥ నమో గుణ్యాయ గుహ్యాయ - ఆగమ్య మనాయ చ । లోకధాత్రీ త్వియం భూమి -పాదౌ సజ్జన సేవితౌ ॥ శ్లో॥ సర్వేషాం సిద్ధియోగానా - మధిష్ఠానం తతోదరం । మధ్యేంఽతరిక్షం విస్తీర్ణం - తారాగణ విభూషితమ్ ॥ శ్లో॥ స్వాతేః పయ ఇవాభాతి - శ్రీమా హార స్తవోరసి। దిశో దశ భుబా స్తుభ్యం - కేయూరాంగదభూషితాః; ॥ శ్లో॥ విస్తీర్ణ ప్రరిణాహశ్చ – నీలాంజన వయెవమః । కంతస్తే శోభలే శ్రీమా- హేమ సూత్ర విభూషితః ॥ శ్లో॥ దంష్ట్రాకరాతం దుర్ధర్ష- మనౌ పమ్యం ముఖ తథా । పద్మమాలాక్పతోష్ణీషం -శిరో ద్యౌఃశోభతేఽధికమ్ ॥ శ్లో॥ దీప్తిః సూర్యే వపుశ్చంద్రే - స్ధైర్యం శైల్వేఽనిలేబలం। ఔష్ణ్య మగ్నౌ తథా శైత్య - ముప్సు శబ్దోంబరే తథా ॥ శ్లో॥ అక్షరాం తర నిష్పంచాత్ - గుణా నేతా విముర్చుధాః । జపో జప్యో మహాదోవో - మహాయోగోమహేశ్వరః ॥
ముల్లోకములను ధరించు భూమి - సజ్జన సేవితములగు నీ పాదములు గాను
సిద్ధియోగములన్నిటి యొక్క ఆధారము నీ ఉచరము గాను - సూర్యచంద్ర నక్షత్రాది ప్రకాశిరమగు ఆకాశము నీ శరీరమధ్య ప్రదేశముగాను నీ రొమ్మున ప్రకాశించు శ్రీమంతమగు హారము స్వాతి వానచుక్కలచే నేర్పుడు ముత్యాల వరుసగాను-
దశదిశలు - కేయూరాంగచభూషితములగు భుజములు గాను – స్వర్గాద్యూర్ధ్వలోకములు - కమల మాలికాశోభితమగు శిరస్సుగాను - విశాలము దీర్ఘము హేమసూత్ర విభూషితము నీలాంజనచయ సదృశంబు నగునీ కంఠము శోభించునదిగాను కమలముల కొప్పు కిరీటముగా కోఱలచే భయంకరము, ఎవరికెని నిరాకరింపరానిది, పోలిక లేనిదియు నగు శిరోపరిభాగము మిక్కిలి శోభించునది గాను - సూర్యుని యందు నీ ప్రకాశము చంద్రునియందు నీ ఒడలు వన్నెయు, కొండయందు నీ నిలుకడయు, గాలియందు నీ సత్తువ, అగ్ని యందు వేడియు, ఉదకములలో నీ చల్లదనము, ఆకాశమునందు ఈ దివ్య వాణీనాదము నెలకొలుపబడినవి గాను నాశరహితమైన అక్షర బ్రహ్మము దగులోనంశము వలన నీ పిరాట్ స్వరూప లక్షణములు బయలుపడినవని విబుధులు బావించుచున్నారు.
శ్లో॥ పురేశయో గుహావాసీ - ఖేచరో రజనీచరః । తపోనిధి ర్గుహగురు - ర్నందనో సందవర్ధనః ॥ శ్లో॥ హయశీర్షా పయోఛాతా - విధాతా భూతభావనః । బోద్ధవ్యో భోధితా నేతా - దుర్ధర్షో దుష్ప్రకంపనః । శ్లో॥ బృహద్రధోభీముకర్మా - బృహత్కీర్తి ర్ధనంజయః । ఘంటాప్రియో ఛ్వజీ ఛత్రీ - పినాకీ ధ్వజనీపతిః । శ్లో॥ కవచీ పట్టిశీ ఖడ్గీ - దనుర్హస్తః పరశ్వధీ । అపస్మారోఽనఘ శ్శూరో - దేవరాజోఽమర్దన్దః శ్లో॥ త్వాం ప్రసాద్య పురాస్మాభి - ర్ద్విషంతో నిహతా యుధి । అగ్నిః సదార్ణవాంభస్త్వం - పిబన్నపి సత్సవ్యసే ॥ శ్లో॥ క్రోధాకారః ప్రసన్నాత్మా - కామదః కామగః ప్రియః । బ్రహ్మచారీ చా గాధశ్చ - బ్రహ్మణ్యః శిష్టపూజితః ॥ శ్లో॥ దేవాన మక్షయః కోశ - స్త్వయా యజ్ఞః ప్రకల్పితః । హవ్యం ఆవేదం విహతి - వేదోక్తం హవ్యవాహనః ॥ ప్రీతే త్వయి మహాడేవ - వయం ప్రీతా భవామహే ॥ శ్లో॥ భవానీశో నాది మాంస్త్వంచ సర్వ - లోకానాం త్వం బ్రహ్మకర్తా । దిసర్గః। సాంఖ్యాః ‘ప్రకృతేః పరమం త్వాం విదిత్వా క్షీణధ్యానా । స్వామమృత్యుం విశంతి ॥
ఇంట ధ్యానమస - చింత - అట్టిచింత లేనివారు క్షీణ ధ్యానులనఁబడుదురని యక్షము.
శ్లో॥ యోగాశ్చ త్వాం ధ్యాయినో నిత్యసిద్ధం - జ్ఞాత్వా యోగాః సంత్యజంతే పున స్వామ్ - యేచాప్య న్యే త్వాం ప్రసన్నా విశుద్ధాః. స్వకర్మభి స్తే దివ్యభోగా భవంతి ॥ శ్లో॥ అప్రసంఖ్యేయ తత్త్వస్య - యథా విద్మః స్వశక్తి తః । కీర్తితం తవ మహాత్మ్య - మపారస్య మహాత్మనః ॥ శివోనో భవ సర్వత్ర - యోఽసి సోఽసి నమోఽస్తు తే ।
సూత ఉవాచ - సూతుఁడు పలికెను.
య ఇదం కీర్తయే ద్భక్త్యా - బ్రహ్మనారాయణ స్తవం ॥ శ్లో॥ శ్రావయేద్వా ద్విజా విద్వాన్ - శృణుయాద్వా సమాహితః ॥ అశ్వమేధాయుతం కృత్వా - యత్ఫలం తడవాప్నుయాత్ ॥ శ్లో॥ పాపాచారోఽపియో మర్త్యః - శృణుయా చ్ఛివసన్నిధౌ । జపే ద్వాపి వినిర్ముక్తో - బ్రహ్మలోకం స గచ్ఛతి ॥ శ్లో॥ శ్రాద్ధే వా దైవికే కార్యే - యజ్ఞేవాఽవభృధాంతికే । కీర్తయేడ్వా సతాం మధ్యే - సయాతి బ్రహ్మణోఽ౦తికమ్ ॥
ఎవఁడు హరిబ్రహ్మకృతమగు నీ స్తోత్రమును భక్తిచే పఠించునో, అర్ధమును గ్రహించుచు ద్విజులకు వినుపించునో లేక తానే వినునో వాడు పదివేలు అశ్వమేధయాగముల నొనర్చిన ఫలము నొందును. పాపాత్ముఁడైనను శివ సన్నిధి నీ స్తోత్రమును వినునెడ లేక తానే పఠించినను పాప నిర్ముక్తుఁడై బ్రహ్మలోకమును చెండును. శ్రాద్ధమునందు దైవిక కార్యములయందు యజ్ఞవాటికలో అవభృత స్నానానంతరము ఈ స్తోత్రమును కీర్తించినను సత్పురుషుల సమావేశమున ఉచ్చైః స్వరముతో పఠించినను
శివసన్నిధానమున నివసించును.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (21) ఏకవింశాధ్యాయము.
